LATEST NEWS
తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన స్వల్ప వ్యవధిలోనే..  పలు కీలక నిర్ణయాలతో రాజకీయాలకు అతీతంగా మంచి మార్కులు కొట్టేస్తున్నారు.   ఈ తరుణంలో  ఎన్నికలలో తన సొంత నియోజకవర్గమైన  కోలత్తూరులో  ఊహించని రీతిలో ఓటమి పాలైన స్టాలిన్ కు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన కుమారుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిథి స్టాలిన్ అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా ఉన్నారు.  అదలా ఉంటే.. అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు   తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో రంగంలోకి దిగాలని స్టాలిన్ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈస్ట్ తిరుచ్చి నుంచి టీవీకే అధినేత విజయ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.  నిబంధనల ప్రకారం ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంది. దీంతో విజయ్  తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ కారణంగా త్వరలోనే తిరుచ్చి ఈస్ట్ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది.  ఈ ఉప ఎన్నికలో స్టాలిన్ పోటీకి దిగి.. విజయ్‌తో  నేరుగా తలపడేందుకు సిద్ధంగా ఉన్నానని నిరూపించుకోవాలని భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మరోవైపు..  డీఎంకే శ్రేణులు కూడా ఈ స్థానంపై తీవ్రంగా దృష్టి సారించాయి. తిరుచ్చి సౌత్ జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఈ మేరకు కీలక తీర్మానాన్ని కూడా ఆమోదించింది.  తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ స్వయంగా పోటీ చేయాలని పార్టీ స్థానిక నాయకత్వం, శ్రేణులు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. తద్వారా పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావచ్చని వారు అంటున్నారు. అయితే, ఈ స్థానంలో పోటీ చేయడం స్టాలిన్‌కు అంత తేలికైన విషయం కాదు. ఇది ఒక రకంగా అతిపెద్ద జూదమనే చెప్పాలి. ఎందుకంటే..  విజయ్ నేతృత్వంలోని టీవీకే కి ఈ నియోజకవర్గంలో గట్టి పట్టు ఉంది. ఒకవేళ ఇక్కడ కూడా స్టాలిన్ ఓటమి పాలైతే, అది ఆయన రాజకీయ జీవితంలో   కోలుకోలేని దెబ్బగా మారే అవకాశం ఉంది. కాగా ఈస్ట్ తిరుచ్చి ఉప ఎన్నికలో స్టాలిన్ పోటీ చేస్తారన్న అధికారిక ప్రకటన అయితే ఇంత వరకూ రాలేదు. ఈ స్థానం నుంచి స్టాలిన్ నిజంగానే బరిలోకి దిగుతారా అన్న విషయంలో స్పష్టత రావాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.  
తమిళనాడు మాజీ ఉపముఖ్యమంత్రి, ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో యూటర్న్ తీసుకున్నారా?  అన్న విషయంపై రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.  గతంలో సనాతన ధర్మాన్ని పూర్తిగా నిర్మూలించాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన..  తాజాగా  తాను సమాజంలో కుల వివక్షకు మాత్రమే వ్యతిరేకమని, దేవాలయాలలో పూజా విధానాలు, ప్రజల మత స్వేచ్ఛకు తాను వ్యతిరేకంగా కాదనీ పేర్కొనడం ఈ చర్చకు దారి తీసింది.  ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి ఓటమి పాలైనప్పటికీ.. ఉదయనిధి స్టాలిన్  తన పాత పంథాను వీడలేదు.   తమిళనాడు అసెంబ్లీలో మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని రాష్ట్రం నుండి పూర్తిగా తుడిచిపెట్టాలనే డిమాండ్‌ను ఆయన మళ్లీ గట్టిగా వినిపించారు. అయితే..  ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై   తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.  అలాగే తమిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) కూడా ఉదయనిథి స్టాలిన్ కు గట్టి రిటార్డ్ ఇచ్చింది. సనాతన ధర్మ నిర్మూలన అంటే   అర్థం ఏమిటో, దానిపై ఉదయనిథి స్టాలిన్ కు ఉన్న ఖచ్చితమైన అభిప్రాయం ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. అధికార పక్షం నుండి ఊహించని విధంగా ఒత్తిడి రావడంతో ఉదయనిధి స్టాలిన్ డిఫెన్స్ లో పడ్డారు. టీవీకే డిమాండ్ పై స్పందించిన ఆయన తన స్వరం మార్చి..  తాను సమాజంలో ఉన్న అసమానతలకు, కుల వివక్షకు మాత్రమే వ్యతిరేకమన్నారు.  దేవాలయాల పూజా విధానాలపై కానీ, ప్రజల మత స్వేచ్ఛపై కానీ ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పారు.  ఉదయనిధి స్టాలిన్ హఠాత్తుగా ఇలా యూటర్న్ తీసుకోవడంపై కూడా నెటిజనులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.  సనాతన ధర్మం పట్ల నిజంగానే ఆయనకు అంత మృదువైన అభిప్రాయం ఉంటే..  దానిని పూర్తిగా నిర్మూలించాలంటూ ఎందుకు  రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని నిలదీస్తున్నారు.   రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన అప్పట్లో మాట్లాడారని దుమ్మెత్తి పోస్తున్నారు.  
తిరుమల తిరుపతి దేవస్థానం  మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి సైకిలెక్కారు. తిరుపతి నగరంలో ఆయన సైకిల్ పై తిరుగుతూ అందరి దృష్టినీ ఆకర్షించారు.  పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశంలో ఇంధనాన్ని పొదుపు చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునకు స్పందించి  భూమన  తిరుపతి నగర వీధుల్లో దాదాపు 10 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కుతూ ప్రజల్లో ఇంధన పొదుపుపై అవగాహన కల్పించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు  సామాజిక మాధ్యమాల్లో  వైరల్ అయ్యాయి.  వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత విశ్వాసపాత్రుడిగా, తెలుగుదేశం పార్టీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే నాయకుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారు. సాధారణంగా  అవకాశం ఉన్నా లేకున్నా టీడీపీపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకునే భూమన.. ఆ పార్టీ ఎన్నికల గుర్తు అయిన సైకిల్‌ను ఎక్కి ప్రయాణించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రధాని పిలుపునిచ్చిన వెంటనే కాకుండా..   రాష్ట్రంలో అధికార కూటమి నేతలు ఇంధన పొదుపు కార్యక్రమాలను ప్రారంభించిన తర్వాత భూమన  సైకిల్ ప్రయాణం చేయడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  ఈ పరిణామంపై రాజకీయ విశ్లేషకులతో పాటు సామాన్య ప్రజలు సైతం  స్పందిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ గుర్తుపై ప్రయాణించినప్పటికీ, ఇంధన పొదుపు అనే మంచి ఆశయం కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భూమన అనుచరులు సమర్ధించుకుంటున్నారు. అదలా ఉంటే భూమన  సైకిల్ ప్రయాణానికి సంబంధించిన వార్తా కథనాలను వైసీపీ అనుకూల మీడియా సంస్థలు కూడా ప్రముఖంగా ప్రసారం చేయడం విశేషం. పర్యావరణ పరిరక్షణ, దేశ ఆర్థిక భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ వారంలో కనీసం ఒకరోజు ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని భూమన ఈ సందర్భంగా సూచించారు. ప్రధాని మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు రకరకాలుగా తమ మద్దతును ప్రకటిస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇంధన పొదుపు కోసం బైక్ ఉపయోగించగా, బిహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ప్రతి శుక్రవారం కాలినడకన సచివాలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  స్కూటీపై ప్రయాణించారు.  
పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన మధ్యంతర బెయిలు కోసం దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు నిరాకరించింది.  భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో దనలు సుదీర్ఘంగా సాగాయి.  భగీరథ్ తరఫున సీనియర్ న్యాయవాది, వైసీపీ ఎంపి  నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.   ఆయనను అరెస్ట్ చేయకుండా ముందస్తు రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు  తెలిపింది.  ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో తదుపరి విచారణలో ఈ పిటిషన్‌పై తుది తీర్పును వెల్లడిస్తామని పేర్కొన్న హైకోర్టు విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.   అదలా ఉంటే.. తన కుమారుడిపై పోస్కో కేసుకు సంబంధించి  తన పేరును ముడిపెడుతూ సోషల్ మీడియా, మీడియాలో వస్తున్న కథనాలు, పోస్టులను వెంటనే తొలగించాలని కోరుతూ బండి సంజయ్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను విచారించిన కోర్టు బండి సంజయ్ పేరును ముడిపెడుతూ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, పోస్టులను తక్షణమే తొలగించాలని   మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బండి బగీరథ కేసు విషయంలో బండి సంజయ్ పేరును  ఎక్కడా ప్రస్తావించరాదని స్పష్టం చేసింది.  భవిష్యత్తులో కూడా ఈ కేసుకు సంబంధించి బండి సంజయ్ పేరుతో ఎలాంటి వార్తలు ప్రసారం చేయరాదని, ప్రచురించరాదని కోర్టు  ఆదేశించింది.   కాగా బండి సంజయ్ తన కుమారుడు బండి బగీరథ్ ను విచారణకు పంపాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.   కేంద్రమంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్  హుందాగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. తనకు తానుగా ముందుకొచ్చి స్వచ్ఛందంగా తన కొడుకును విచారణకు అప్పగించి, చట్టపరమైన ప్రక్రియను ఎదుర్కొనేలా చేయాలని సీఎం అన్నారు. బండి సంజయ్ కింది స్థాయి నుంచి స్వయం కృషితో ఈ స్థాయికి ఎదిగారనీ, ఇప్పుడు కుమారుడి కారణంగా తలవంపులు ఎదుర్కొంటున్నారనీ సీఎం అన్నారు.  ఏది ఏమైనా విచారణను ఎదుర్కోకుండా బండి  భగీరథ్ పారిపోవడంసరికాదన్నారు. బండి సంజయ్ బాధ్యత తీసుకుని తన కుమారుడిని పోలీసులకు అప్పగించాలనీ, అలా చేస్తే..  అలా చేస్తే బండి సంజయ్ గౌరవం మరింత పెరుగుతుందన్న రేవంత్ రెడ్డి.. ఎలాంటి కేసులనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని, పారిపోతే సమస్యలకు పరిష్కారం దొరకదన్నారు.  
  తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఈసారి రెండు రోజుల పాటు వర్చువల్ విధానంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. పొదుపు చర్యల్లో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర కమిటీ సభ్యులంతా టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. మహానాడును పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సూచించిన చంద్రబాబు, ఎన్టీఆర్ భవన్‌లో ప్రత్యేక స్టేజీ ఏర్పాటు చేసి అక్కడి నుంచే కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 1,845 క్లస్టర్లలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులు మహానాడు కార్యక్రమాన్ని వీక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ భవన్ నుంచి పొలిట్‌బ్యూరో సభ్యులు పాల్గొనేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో పార్టీ పండుగగా భావించే మహానాడు కార్యక్రమం జరగనుంది.
ALSO ON TELUGUONE N E W S
    మాళవిక మోహన్(Malavika Mohanan)జనవరిలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)తో రాజాసాబ్ లో చేసి మెప్పించింది. అందం, పెర్ ఫార్మెన్స్ ఒకదానితో ఒకటి పోటీపడేలా నటించడం మాళవిక స్పెషల్. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ ఇళయ దళపతి విజయ్(VIjay)పై కీలక వ్యాఖ్యలు చేసింది. తాజాగా  ఇచ్చిన ఇంటర్వ్యూలో మాళవిక మాట్లాడుతు 'మాస్టర్'(Master)సినిమా షూటింగ్ సమయంలోనే  విజయ్‌ ని మొదటిసారిగా కలిసాను. మొదటి రోజే విజయ్‌తో  ఒక క్లిష్టమైన సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. దాంతో డైలాగ్స్ సరిగ్గా కుదురుతాయో లేదో అని  టెన్షన్ పడ్డాను. కానీ విజయ్ సర్  మాత్రం  ఎంతో ప్రశాంతంగా, కూల్‌గా కనిపించడం చూసి ఆశ్చర్యపోయాను. ఎంతటి కష్టమైన సీన్ అయినా సరే.. విజయ్ ఏమాత్రం ఒత్తిడి లేకుండా ప్రతి విషయాన్ని చాలా నిశితంగా గమనిస్తూ పూర్తిగా పనిపైనే ఫోకస్ చేస్తారు .  తోటి నటీనటులకి  పూర్తి కంఫర్ట్ ఇస్తారు. షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనకు ఫోన్ చేసే స్వేచ్ఛని  విజయ్ ఇచ్చారు.అంతటి పెద్ద పొజిషన్‌లో ఉండి కూడా ఎప్పుడూ అందుబాటులో ఉండటం ఆయనలోని గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. Also read: Ram charan: ముంబైలో చేతి బ్యాండేజ్‌తో కనిపించిన రామ్ చరణ్.. ఫ్యాన్స్‌లో టెన్షన్ ఉదయం 7 గంటలకి కాల్‌షీట్ ఉంటే, విజయ్ సరిగ్గా 6:55 నిమిషాలకే సెట్స్‌లో ప్రత్యక్షమవుతారు. అలాంటి అంకితభావం ఉన్న హీరోల వల్లే నిర్మాతలకు ఒక్క రూపాయి కూడా వృథా కాకుండా సమయం కలిసి వస్తుంది.   విజయ్ లాంటి అద్భుతమైన డాన్సర్‌తో కలిసి 'మాస్టర్' సినిమాలో ఒక్క పాటలో కూడా డాన్స్ చేసే అవకాశం రాలేదనే రాలేదనే వెలితి మాత్రం అలాగే ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మాళవిక మోహనన్  చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన మాస్టర్ 2021 లో రాగా చారులత అనే క్యారక్టర్ లో  మాళవిక మోహన్ అద్భుతమైన పెర్ఫార్మ్ తో మెప్పించింది.  
తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా సినీ వర్గాల్లోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) శైలి ఎప్పుడూ అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. పబ్లిక్ మీటింగ్‌లలో అయినా, మీడియా ఇంటర్వ్యూలలో అయినా ఆయన చేసే వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఒక ఈవెంట్ లో టాలీవుడ్ స్టార్ హీరోలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన కొన్ని హాట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్స్‌గా చలామణి అవుతున్న పలువురు నటుల బాల్యం, వారి కాలేజీ రోజుల గురించి ముఖ్యమంత్రి ఓపెన్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లు సాధిస్తూ, స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తున్న టాలీవుడ్ హీరోలందరూ తనకు వారు చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచే తెలుసని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. "ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ అని చెప్పుకునే వాళ్లందరూ నాకు వారు కిడ్స్ ఉన్నప్పటి నుంచే బాగా తెలుసు. నేను ఇప్పుడు ఎవరి పేర్లు ప్రత్యేకంగా చెప్పదలుచుకోలేదు కానీ, ఒకప్పుడు వాళ్ళు కాలేజీలకు వెళ్లే రోజుల్లో నా కళ్ల ముందే తిరిగారు. కాలేజీ చదువులు పూర్తి చేసుకుని బయటకు వచ్చిన కొత్తలో వారి అల్లరి పనులు, సరదాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి" అంటూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ స్టార్స్ వ్యక్తిగత విషయాలపై మరింత ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. "ఆ హీరోలు కాలేజీల నుండి బయటకు వచ్చిన తరుణంలో.. కనీసం ఒక సింగిల్ బీరు తాగాలనుకున్నా కూడా నా దగ్గరికే వచ్చేటోళ్లు. అన్న.. నువ్వు ఒక్క సంతకం పెడితే చాలు, మేము వెళ్లి బీరు తాగుతాము అంటూ నా చుట్టూ తిరిగేవాళ్లు" అని నవ్వుతూ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ సరదా వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అసలు రేవంత్ రెడ్డి ఏ హీరోను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే దానిపై నెటిజన్లు, సినీ అభిమానులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.   
ఎండలు తగ్గుముఖం పడుతున్నాయని అందరు అనుకుంటున్నారు. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)పెద్ది(Peddi)హీట్ ఇప్పుడిప్పుడే  రెండు తెలుగు రాష్ట్రాలని తాకుతుంది. ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ చెప్తున్న మాటలకైతే ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఉక్కపోతకి గురవుతున్నారు. పెద్ది ఎలా ఉండబోతున్నాడనేదే టెన్షన్ నే ఆ ఉక్కపోతకి కారణం. రీసెంట్ గా ఇప్పడు వాళ్ళందర్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్ టెన్షన్ కి గురి చేస్తుంది.   చరణ్ రీసెంట్ గా ముంబైలోని ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ హాకీమ్ ఆలిం సెలూన్‌కి వెళ్ళాడు. కొందరు అభిమానులు, ఫోటోగ్రాఫర్లు చరణ్ కుడి చేతికి ఉన్న బ్యాండేజ్‌ ని గమనించి ఫోటోలు తీశారు. ఈ విజువల్స్ నెట్టింట వైరల్ కావడంతో చరణ్ చేతికి ఏమైంది, షూటింగ్ సమయంలో ఏమైనా  ప్రమాదం జరిగిందా అని అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కూడా 'పెద్ది' సినిమా షూటింగ్ సమయంలో  ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు రామ్ చరణ్ కంటి పైభాగంలో గాయమై నాలుగు కుట్లు పడ్డాయి.ఇప్పుడు మళ్లీ చేతికి బ్యాండేజ్‌తో కనిపించేసరికి ఫ్యాన్స్ కంగారుపడ్డారు. అయితే, ఈ తాజా చేతి గాయంపై చిత్ర యూనిట్ మరియు చరణ్ సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చరణ్‌ కుడి చేతి మణికట్టు వద్ద ఒక చిన్న మైల్డ్ స్ప్రెయిన్ స్వల్ప నలిగుడు లాంటి మితమైన నొప్పి మాత్రమే అయింది. ఇది పెద్ద ప్రమాదం ఏమీ కాదు. కేవలం ముందుజాగ్రత్త చర్యగా, ఆ నొప్పి మరింత ఎక్కువ కాకుండా ఉండటానికి మరియు వేగంగా కోలుకోవడానికి  మాత్రమే డాక్టర్ల సలహా మేరకు ఈ సపోర్ట్ బ్యాండేజ్ ధరించినట్లు క్లారిటీ వచ్చింది.  ఇక ఆ పిక్ లో  టార్జాన్ లుక్ తో ఉన్న  చరణ్  పిక్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ తెస్తుంది. Also read: పర్శంటేజ్ సిస్టం నుంచి మినహాయింపు కోరిన 17 సినిమాలు  'పెద్ది' సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 18న ముంబై వేదికగా ట్రైలర్ ఈవెంట్ జరగనుంది. జూన్ 3న ప్రీమియర్ షోలతో పాటు జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కానుంది.  
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ 'పెద్ది' (Peddi). 'ఉప్పెన' ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వృద్ధి సినిమాస్ దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో, ప్రేక్షకుల్లో ఆకాశాన్నంటే అంచనాలు ఉన్నాయి. జూన్ 4న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు సినిమా క్లైమాక్స్, కథాంశంపై చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ చిత్రం 1980ల నాటి రూరల్ ఆంధ్రప్రదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక పవర్‌ఫుల్ విలేజ్ స్పోర్ట్స్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. తాజా ఇంటర్వ్యూలో బుచ్చిబాబు మాట్లాడుతూ, 'పెద్ది' చిత్రంలో రామ్ చరణ్ వన్ మ్యాన్ షో థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని నమ్మకంగా చెప్పారు. ముఖ్యంగా ఈ సినిమా చివరి 50 నిమిషాలు హై వోల్టేజ్ ఎమోషన్స్‌తో సాగుతుందని, ఆ ఎపిసోడ్స్ ప్రేక్షకులను తీవ్రంగా కదిలించడమే కాకుండా మైండ్ బ్లాక్ అయ్యేలా షాకింగ్‌గా ఉంటాయని రివీల్ చేశారు. సినిమాలో ఉండే రా యాక్షన్ ఎపిసోడ్స్, మూడు అద్భుతమైన డాన్స్ నంబర్స్, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో పెద్ది పహిల్వాన్ పాత్ర కోసం రామ్ చరణ్ చేసిన మేకోవర్, బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ అంతా ఇంతా కాదు. కుస్తీ వీరుడిగా కనిపించడం కోసం ఆయన విపరీతంగా బరువు పెరిగి, కఠినమైన వర్కవుట్స్ చేశారు. ఆ సమయంలో ఆయన ఎంతగా అలసిపోయారంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత కనీసం తన కుమార్తె క్లిన్ కారాను కూడా చేతుల్లోకి ఎత్తుకోలేనంతగా కండరాల నొప్పితో బాధపడ్డారని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. చరణ్ పడిన ఈ కష్టం విజువల్స్‌లో స్పష్టంగా కనిపిస్తుందని, ఆయన కెరీర్‌లోనే ఇదొక మైలురాయి లాంటి పాత్ర అవుతుందని ఫ్యాన్స్ ఖచ్చితంగా నమ్ముతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండటంతో నార్త్ బెల్ట్‌లో కూడా ఈ ప్రాజెక్ట్‌పై విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. దానికి తగ్గట్టే ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా 'పెద్ది' చిత్రం అఫీషియల్ రిలీజ్‌కు ముందే సరికొత్త రికార్డుల వేటను ప్రారంభించింది. కేవలం నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఇప్పటికే 300K డాలర్ల మార్కును దాటేసి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బుచ్చిబాబు మార్క్ విలేజ్ డ్రామాకు రామ్ చరణ్ మాస్ ఇమేజ్ తోడవ్వడంతో జూన్ 4న థియేటర్ల వద్ద మెగా పండగ వాతావరణం కనిపించనుంది.  
Director Buchi Babu Sana is currently gearing up for the release of his highly anticipated film, Peddi, starring Ram Charan. Recently, the filmmaker shared some interesting behind-the-scenes insights regarding the project's inception, casting, and its emotional core. Buchi Babu revealed that the script for Peddi was actually penned long before his debut film, Uppena, and was written with only Ram Charan in mind. Following Uppena's release, director Sukumar facilitated a meeting between him and Ram Charan. According to Buchi Babu, the actor approved the story in a single sitting without suggesting a single correction, making him the sole reason the film exists today. The director also took the opportunity to clear the air regarding ongoing industry rumors, firmly clarifying that he never narrated the story of Peddi to Jr NTR. Speaking about the narrative structure, the director promised that the final act of the movie will leave a lasting impact on the audience. Much like the bold and talked-about ending of his debut, Buchi Babu stated that the last 40 minutes of Peddi will be highly emotional and highly unconventional. With this unique approach to its climax, the film is shaping up to be an intriguing cinematic experience. AR Rahman is scoring music and he completed majority of BGM works.  The movie is said to be locked at 183 minutes run-time with Shruthi Haasan in a special song. Janhvi Kapoor is playing the leading lady role while Shiva Rajkumar as Goura Naidu and Divyenndu as Rambujji. Venkata Satish Kilaru is producing the film and the 350 crores Pan-India film is releasing on 4th June. The movie trailer is releasing on 18th May and Pan-India promotions are starting with it.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  అందరం పుట్టింది.. బతుకుతుంది.. ఎదుగుతుంది తెలుగు సినిమా వలనే  అనే విషయం తెలిసి కూడా కొన్ని రోజులుగా నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ మధ్య పర్శంటేజ్ విషయంలో ఇష్యూ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఎవరి వర్షన్ వాళ్ళది. విచిత్రం ఏంటంటే ఎవరు మాట్లాడుతున్నా కూడా కరెక్టే కదా వాళ్ళు మాట్లాడేది అనిపిస్తుంటుంది.   ఈ క్రమంలోనే వివాదం మరింత ముదరడంతో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ రంగంలోకి దిగింది. ఇరు వర్గాల మధ్య సమన్వయం కుదర్చడానికి, సమస్యకి ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడానికి పదిహేను మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక సమన్వయ కమిటీని  ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రెండు నెలల్లో పూర్తి నివేదిక ఇవ్వనుంది. ఈ మొత్తం వివాదంలో మరో ఆసక్తికరమైన కీలకమైన మలుపు చోటుచేసుకుంది. పర్సంటేజ్ సిస్టమ్ వివాదం ఎలా ఉన్నప్పటికీ, ఇప్పటికే భారీ అంచనాలతో, వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సుమారు పదిహేడు క్రేజీ ప్రాజెక్టులకి  ఈ వివాదం నుండి ఊరట లభించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ 17 సినిమాల జాబితాలో పెద్ది, డ్రాగన్ , విశ్వంభర, హనుమన్ 2 ,  కల్కి 2', స్పిరిట్', వారణాసి, ది ప్యారడైజ్, రాకా, ఎన్ బి కె 111 , మెగా 158 ,రామ్ చరణ్, సుకుమార్ కాంబో మూవీ, ఏ కె 47 ,నాని, సుజిత్ కాంబో, వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో, అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ మూవీ ఇలా సుమారు 17 చిత్రాలకి   పర్శంటేజ్ విధానం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నట్టుగా తెలుస్తుంది. Also read: Mahesh Babu: మహేష్ బాబు రెస్టారెంట్ బిల్లు వైరల్.. వాటర్ బాటిల్ రేటు చూస్తే షాకవుతారు ఈ పెద్ద సినిమాల థియేట్రికల్ బిజినెస్ మరియు అడ్వాన్స్‌లు ఇప్పటికే పాత పద్ధతిలోనే జరిగాయని, కాబట్టి వీటిని ప్రస్తుత వివాదం నుండి పక్కన పెట్టాలని ఇరు వర్గాలు ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ఈ మినహాయింపు జాబితా వల్ల టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రాబోయే రోజుల్లో పెద్ద సినిమాల విడుదలకి ఎలాంటి ఆటంకం కలగదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఏదేమైనా థియేటర్ల మనుగడ ముఖ్యం, అలాగే నిర్మాతల పెట్టుబడి సేఫ్ అవ్వడం కూడా అంతే ముఖ్యం. ఈ ఫ్యామిలీ సమస్యని  టాలీవుడ్ పెద్దలు త్వరలోనే సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తారని ప్రేక్షకులు మరియు సినిమా ప్రేమికులు ఆశిస్తున్నారు.   
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi). గ్లోబల్ వైడ్‌గా అత్యంత భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమా సృష్టిస్తున్న హంగామా ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. నార్త్ అమెరికాలో ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్‌గా మారాయి. ప్రీమియర్ షోల టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతుండటంతో రామ్ చరణ్ గ్లోబల్ రేంజ్ మార్కెట్ స్టామినా ఏంటో మరోసారి స్పష్టమైంది. ప్రముఖ ఓవర్సీస్ పంపిణీ సంస్థ 'ప్రత్యంగిరా సినిమాస్' ఈ భారీ చిత్రాన్ని నార్త్ అమెరికా వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి జూన్ 3న యూఎస్‌లో గ్రాండ్ ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. అయితే ఇంకా థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదల కాకముందే, కేవలం రామ్ చరణ్ క్రేజ్ ఆధారంగానే నార్త్ అమెరికా ప్రీమియర్స్ కోసం ఇప్పటికే 10,000కు పైగా టిక్కెట్లు అమ్ముడవడం విశేషం. ఈ వేగం చూస్తుంటే రాబోయే రోజుల్లో ప్రీ-సేల్స్ వసూళ్లు సరికొత్త మైలురాళ్లను అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది. విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక పవర్‌ఫుల్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న 'పెద్ది' చిత్రంలో రామ్ చరణ్ రగ్గడ్ లుక్, బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ భారీ తారాగణం, సాంకేతిక నిపుణుల కలయిక ఓవర్సీస్ ప్రేక్షకులలో సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచేసింది. యూఎస్‌ఏ, కెనడా మార్కెట్లలో ఇప్పటివరకు ఉన్న పాత రికార్డులను తిరగరాయడమే లక్ష్యంగా 'పెద్ది' బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించనుంది. నార్త్ అమెరికా వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు డిస్ట్రిబ్యూటర్స్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 3న పడబోయే ఓవర్సీస్ ప్రీమియర్ షోల నుంచే 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను లిఖించడం ఖాయంగా కనిపిస్తోంది.   https://x.com/Theteluguone/status/2055512199511314764
చిన్న సినిమాగా విడుదలై, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించిన విజువల్ వండర్ 'హనుమాన్' (HanuMan). టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) మేకింగ్ స్టైల్, యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) అద్భుతమైన నటన కలబోసి వచ్చిన ఈ మైథికల్ సూపర్ హీరో చిత్రం ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంది. తక్కువ బడ్జెట్‌తోనే హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అందించి, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఇదొక అద్భుత ప్రయోగంగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు 350 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడమే కాకుండా, నేషనల్ లెవెల్‌లో ప్రతిష్టాత్మక అవార్డులను కూడా కైవసం చేసుకుని తెలుగు సినిమా సత్తాను చాటింది. అయితే ఈ చారిత్రాత్మక ఘనవిజయం సాధించిన చిత్రం ఇప్పుడు మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు, సరికొత్త అవతారంలో బిగ్ స్క్రీన్‌పైకి వచ్చేందుకు సిద్ధమైంది. అంజనాద్రి అనే ఒక కాల్పనిక గ్రామం బ్యాక్‌డ్రాప్‌లో, భగవంతుడైన హనుమంతుని శక్తులు పొందిన ఒక సాధారణ యువకుడి కథతో సాగే ఈ చిత్రాన్ని ఇప్పుడు మరింత గ్రాండ్‌గా, 3D ఫార్మాట్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను 3D విజువల్స్‌తో థియేటర్లలో రీ-రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా 'హనుమాన్ 3D' గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతున్నట్లు స్పష్టం చేశారు. సాధారణ స్క్రీన్‌పైనే గూస్‌బంప్స్ తెప్పించిన అంజనాద్రి లోకం, క్లైమాక్స్‌లో వచ్చే హనుమంతుడి విశ్వరూపం సన్నివేశాలు ఇప్పుడు 3D ఎఫెక్ట్స్‌తో చూస్తుంటే ప్రేక్షకులకు థియేటర్లలో ఎలాంటి అనుభూతిని ఇస్తాయోనని అటు ట్రేడ్ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ క్రియేట్ చేసిన ఈ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) లో మొదటి భాగమైన 'హనుమాన్', కేవలం పిల్లలనే కాకుండా పెద్దలను కూడా మెప్పించి ఒక క్లాసిక్‌గా నిలిచింది. హరి గౌర అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అమృతా అయ్యర్ హీరోయిన్ నటన, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర, వినయ్ రాయ్ విలనిజం ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన సీక్వెల్ 'జై హనుమాన్' ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న తరుణంలో, మొదటి భాగాన్ని మళ్లీ 3D లో రిలీజ్ చేయడం అనేది ఈ సినిమాటిక్ లవర్స్‌కు ఒక బిగ్ సర్ప్రైజ్ అని చెప్పాలి. జూన్ 25న మళ్లీ థియేటర్లలో 'జై హనుమాన్' అనే నినాదాలు మార్మోగడం ఖాయంగా కనిపిస్తోంది.    https://x.com/Theteluguone/status/2055520666028515511
Naga Chaitanya is currently working on his upcoming film, Vrushakarma, an action-mythological thriller directed by Karthik Dandu. Following his recent project Thandel, the actor has shifted his focus to this new film, which also stars Meenakshi Chaudhary in the lead role and Sparsh Shrivastava as the antagonist. The project is being jointly produced by SVCC and Sukumar Writings.   The production team recently completed a significant shooting schedule in Rajasthan, capturing key sequences against the backdrop of the state's historical palaces and architecture. With the main filming process nearing its final stages, the focus has now shifted toward post-production work. The film is expected to feature a considerable amount of visual effects and computer-generated imagery to support its core mythological elements and world-building.   The glimpse released earlier by the makers has garnered a strong response from the audience. As the technical work continues at a steady pace, the production team is preparing the movie for a wide theatrical release. The official release date for Vrushakarma has not been finalized yet, but an announcement is anticipated in the near future. The film aims to present a fresh narrative within the supernatural thriller genre.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu)ప్రస్తుతం తన కలల ప్రాజెక్ట్ వారణాసి(Varanasi)తో బిజీగా ఉన్నాడు. రాజమౌళి(Ss Rajamouli)గత చిత్రాల కంటే బిగ్గెస్ట్ హిట్ అవుతుందనే నమ్మకం అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ ఉంది. రీసెంట్ గా మహేష్ బాబు హోటల్ కి  సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో సమర్ధించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు పోటాపోటీ కామెంట్స్ చేస్తున్నారు. పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం.  ఏషియన్ గ్రూప్, మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ భాగస్వామ్యంలో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో 'ఏఎన్‌ ప్యాలెస్ హైట్స్'(As palace Hights) అనే లగ్జరీ రెస్టారెంట్‌ని నడుపుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఒక హైదరాబాద్ బేస్డ్ ఫుడ్ బ్లాగర్ ఈ రెస్టారెంట్‌ ని  సందర్శించి  షేర్ చేసిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. ఆ వీడియోలో సదరు బ్లాగర్ రెస్టారెంట్ యొక్క అంబియెన్స్, రాయల్ లుక్‌ ఎంతో అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. వారు ఆర్డర్ చేసిన మటన్ బిర్యానీ టేస్ట్  నెక్ట్స్ లెవల్‌లో ఉందని, హైదరాబాద్‌లోనే అత్యుత్తమ మటన్ బిర్యానీలలో ఇది ఒకటి అని రేటింగ్ ఇచ్చారు. కానీ, చివర్లో అతను చూపించిన మెనూ కార్డు ధరలు, బిల్లు మొత్తం చూసి సామాన్య జనం నోరెళ్లబెడుతున్నారు. సదరు వీడియోలో  కేవలం ఒక చికెన్ టిక్కా స్టార్టర్ ధర  700 ,ఒక మటన్ బిర్యానీ ధర  600 గా ఉంది. కేవలం ఒక స్టార్టర్, ఒక బిర్యానీ మాత్రమే ఆర్డర్ చేసినప్పటికీ, టాక్సులు మరియు ఇతర బెవరేజెస్ అన్ని కలుపుకుని ఫైనల్ బిల్లు ఏకంగా 1,853 కి చేరింది. అయితే ఈ బిల్లులో బిర్యానీ ధర కంటే కూడా అక్కడ లభించే సాధారణ డ్రింక్స్ ధరలు  ఎక్కువగా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఎందుకంటే బయట కేవలం 20 రూపాయలకి  దొరికే వాటర్ బాటిల్ ధర 299 రూపాయలుగా ఉంది. అంతేకాదు, సాధారణంగా మార్కెట్లో 30 నుండి 40 రూపాయల లోపు లభించే ఒక డైట్ కోక్ కాన్ ధరని 180 గా మెన్షన్ చేశారు. ఒక వాటర్ బాటిల్ కోసం దాదాపు 300 రూపాయలు వసూలు చేయడంపై సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. Also read: Karuppu: వీరభద్రుడు మొదటి రోజు కలెక్షన్స్ ఇవే.. రుద్ర తాండవం తప్పదా! ఈ బిల్లు వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నమైన రీతిలో స్పందిస్తూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, "ఒక వాటర్ బాటిల్‌కు  299 రూపాయలు వసూలు చేయడం ఏంటి. ఆ మొత్తం డబ్బులతో బయట రెండు కేజీల మటన్ కొనుక్కుని ఇంట్లోనే ప్రశాంతంగా వండుకుని తినొచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే మరికొందరు మాత్రం అది  ఒక సెలబ్రిటీ బ్రాండ్, బంజారాహిల్స్ లాంటి పోష్ ఏరియాలో అద్భుతమైన ఫైన్ డైనింగ్ ఎక్స్‌పీరియన్స్, రాయల్ అంబియెన్స్ అందించినప్పుడు ఆ మాత్రం ప్రీమియం ధరలు ఉండటం సహజమే అంటు సమర్థిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, హైదరాబాద్ లగ్జరీ హోటళ్లలో సామాన్యులకి  ఫుడ్ తినడం అంత సులువు కాదనే విషయాన్ని ఈ వైరల్ బిల్లు మరోసారి నిరూపించింది.      
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ కొన్నిసార్లు, అనుకోకుండా అనేసిన కొన్ని మాటలు ఆ సంబంధాన్ని పాడుచేసే అవకాశం ఉంటుంది. పెళ్లైన కొత్తలో భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో వచ్చే ఏ చిన్న అపార్థమైనా.. ఏ చిన్న తప్పు మాట అయినా.. ఇద్దరి మధ్య దూరం పెంచి  బంధాన్ని నాశనం చేసి  అవకాశం ఉంటుంది.  బంధం చాలా కాలం పాటు ప్రేమ, నమ్మకంతో నిండి ఉండాలంటే చేయకూడని తప్పులేంటో తెలుసుకుంటే.. పాత బంధాల ప్రస్తావన.. కొత్తగా పెళ్లైన  తర్వాత గత సంబంధాల గురించి ప్రస్తావించడం తరచుగా భాగస్వామికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. పదేపదే  పాత రిలేషన్ లో ఉన్న వ్యక్తితో  పోల్చడం లేదా పాత జ్ఞాపకాలను పంచుకోవడం సంబంధంలో అభద్రతను పెంచుతుంది. వైవాహిక బందంలో ఎప్పుజూ ప్రస్తుత కాలంపై దృష్టి పెట్టాలి. అప్పుడే బంధం బాగుంటుంది. కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడటం.. పెళ్లి తర్వాత రెండు  కుటుంబాలను గౌరవించడం చాలా ముఖ్యం. లైఫ్ పార్ట్నర్  కుటుంబం గురించి చెడుగా మాట్లాడటం లేదా వారిని ఎగతాళి చేయడం సంబంధంలో ఉద్రిక్తతను సృష్టిస్తుంది. ఒకవేళ ఏదైనా విషయం నచ్చకపోతే దాన్ని ప్రశాంతంగా వివరించడానికి ప్రయత్నించాలి. ఫిర్యాదులు.. చిన్న చిన్న విషయాల గురించి ఎప్పుడూ ఫిర్యాదు చేస్తుంటే అది  సంబంధంలో ప్రతికూలతను పెంచుతుంది. కొత్త పెళ్లిలో ఒకరి అలవాట్లను ఒకరు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. అందువల్ల, ఓర్పు , అవగాహన కలిగి ఉండటం ముఖ్యం. పోలిక.. లైఫ్ పార్ట్నర్ ను  స్నేహితుడు, బంధువు లేదా సోషల్ మీడియా జంటతో పోల్చడం  బంధానికి  హాని కలిగిస్తుంది. ప్రతి వ్యక్తి, ప్రతి సంబంధం భిన్నంగా ఉంటాయి. పోలికలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, విభేదాలను పెంచుతాయి. స్వేచ్ఛ.. పెళ్లి తర్వాత అన్ని విషయాల గురించి క్వశ్చన్లు వేయడం  లేదా మితిమీరిన జోక్యం చేసుకోవడం చేస్తే అది  భాగస్వామికి బాధ కలిగించే అవకాశం ఉంటుంది. ప్రేమతో పాటు వైవాహిక జీవితంలో కూడా  వ్యక్తిగత స్వేచ్ఛ కూడా చాలా అవసరం. ఒకరినొకరు నమ్మితేనే  బంధం  బలంగా ఉంటుంది.                               *రూపశ్రీ.
వివాహం అన్ని సంబంధాల కంటే విభిన్నమైన కోణం. వివాహం ప్రారంభ రోజుల్లో భార్యాభర్తల  మధ్య ప్రేమ, ఉత్సాహం,  ఆకర్షణ చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ క్రమంగా భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది.  చాలామంది వివాహం అయిన కొద్ది కాలానికే మనుషులు మారిపోయారు అని అంటూ ఉంటారు. అయితే ఇది చాలా వరకు భార్యాభర్తల మధ్య జరిగేదే. కానీ ఇద్దరి మధ్య ప్రేమ తగ్గకుండా తిరిగి ప్రేమను పెంచుకోవడం భార్యాభర్తల ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది. పెళ్లైన కొన్ని సంవత్సరాల తర్వాత భార్యాభర్తల బంధం కొందరికి  బోరింగ్‌గా మారుతుంది.ఒకరిపై ఒకరు ప్రేమను చూపించడం,  బంధంలో ఉత్సాహం వంటివి అస్సలు కనిపించవు.  దీనికి బదులు వారి బంధంలో విసుగు చెందడం,  గొడవ పడటం చాలా సహజం అయిపోతుంది. కానీ వివాహం అయిన కొన్ని రోజులకే   భార్యాభర్తల మధ్య ప్రేమ ముగిసిపోవడం అనేది ఉండదు.  పెళ్లైన కొత్త రోజుల్లో ఉండే ప్రేమ ఎన్నైళ్లైనా భార్యాభర్తల మధ్య అలాగే ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.  అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గడానికి కారణమయ్యేవి ఏంటో కూడా తెలుసుకోవాలి. బాధ్యతలు, ఒత్తిడి వివాహం తర్వాత, ఉద్యోగం, ఇంటిని చూసుకోవడం, కుటుంబ అంచనాలు,  పిల్లలను పెంచడం వంటి బాధ్యతలు భార్యాభర్తలపై భారంగా మారతాయి.  ఒకరికొకరు సమయం ఇచ్చుకోవడం కష్టం అవుతుంది. క్రమంగా ప్రేమ కాస్తా బాధ్యతల్లోకి జారిపోతుంది. ఒకే దినచర్య.. ఒకే  దినచర్య సంబంధంలో విసుగును కూడా తెస్తుంది. ప్రతిరోజూ ఆఫీసు, ఇల్లు,  ఇతర పనుల మధ్య,  ప్రేమ ఎక్కడో వెనుకబడిపోతుంది. కొత్త శక్తి,  ఉత్సాహం లేకపోవడం సంబంధాన్ని మందకొడిగా చేస్తుంది. కమ్యూనికేషన్.. భార్యాభర్తల  మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం కూడా ప్రేమ తగ్గిపోవడానికి  ఒక పెద్ద కారణం. భార్యాభర్తలు తమ భావాలను, అంచనాలను,  సమస్యలను ఒకరితో ఒకరు పంచుకోనప్పుడు దూరం పెరుగుతుంది.  ఈ దూరం క్రమంగా సంబంధాన్ని బలహీనపరుస్తుంది. ప్రేమ పెరగాలంటే.. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య  మునుపటిలా  ప్రేమను తిరిగి పుంజుకోవడానికి కొన్ని పద్ధతులను అనుసరించవచ్చు.  ఉదాహరణకు కొన్ని.. ఒకరికొకరు సమయం ఇవ్వడం... రోజంతా బిజీగా ఉన్నప్పటికీ కనీసం అరగంటైనా  ఇద్దరూ సంతోషంగా ఉండటానికి  మాత్రమే కేటాయించాలి. డేటింగ్ నైట్ ప్లాన్ చేసుకోవడం...   డేటింగ్ కి వెళ్లడం వల్ల పెళ్లైన సంవత్సరాల తర్వాత కూడా సంబంధానికి కొత్త జీవం పోస్తుంది. ఆశ్చర్యకరమైన బహుమతులు ఇవ్వడం.. చిన్న బహుమతులు కూడా పెద్ద ప్రేమ బయటకు వ్యక్తం  చేస్తాయి. సంభాషణకు ప్రాముఖ్యత ఇవ్వడం.. ప్రతిరోజూ కొంత సమయం ఒకరితో ఒకరు ఓపెన్ మాట్లాడుకోండి. శారీరక సాన్నిహిత్యంపై.. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం,  దగ్గరగా కూర్చోవడం కూడా ప్రేమను తిరిగి రేకెత్తించడానికి ఒక మార్గం కావచ్చు. నిజానికి వివాహం అయిన తరువాత పిల్లలు పుట్టగానే శారీరకంగా బంధం బలహీనమవుతుంది.  అందుకే చాలా వరకు ప్రేమ తగ్గినట్టు అనిపిస్తుంది.  సురక్షిత మార్గంలో భార్యాభర్తలు శారీరక బంధాన్ని సాగిస్తే వారి మధ్య ప్రేమ ఎప్పుడూ తాజాగా ఉంటుంది.                                  *రూపశ్రీ.
  ప్రతి వ్యక్తి తన జీవితాన్ని ఆనందంగా, ప్రశాంతంగా, సంతృప్తిగా గడపాలని కోరుకుంటాడు.  మానసిక సమస్యలకు దూరంగా ఉండాలని కోరుకుంటాడు.  నేటి కాలంలో కొందరు  అనారోగ్యంతో బాధపడుతుంటే  మరికొందరు  కుటుంబ సమస్యల గురించి ఆందోళన చెందుతుంటారు. కొంతమంది ఉద్యోగం రాలేదని,   మరికొందరు తమకు జీతం తక్కువ అని, ఇంకొందరు జీతం సరిగా రావడం లేదని.. ఇలా  సగం ప్రపంచం ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతోంది. కానీ ఈ ప్రపంచంలో కొంతమంది ఎటువంటి ఆందోళన లేకుండా  సంతోషంగా ఉంటుంటారు. వాళ్లు అసలు అంత సంతోషంగా ఎలా ఉన్నారు? అనే విషయం కూడా కొందరికి అర్థమే కాదు.. అసలు  జీవితాన్ని సంతోషంగా,  ప్రశాంతంగా ఉంచగల మార్గాలు ఏమిటి? దుఃఖాలకు, సమస్యలకు దూరంగా ఉండటం ఎలా తెలుసుకుంటే.. తల్లిదండ్రుల సూచనలు..  పిల్లలు తల్లిదండ్రుల  మాట విని సరైన మార్గాన్ని అనుసరిస్తే, అది తల్లిదండ్రులకు  చాలా సంతోషకరమైన విషయం. అలాంటి పిల్లలు కుటుంబానికి కీర్తిని తెస్తారు.  వారి తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తారు. కాబట్టి జీవితంలో ఆనందం,  శాంతి కోరుకుంటే, ఎల్లప్పుడూ  తల్లిదండ్రుల సూచనలను పాటించాలి.  సరైన మార్గాన్ని అనుసరించాలి.  నేటి జెనరేషన్ అప్డేట్ అయి ఉండవచ్చు. కానీ తల్లిదండ్రుల దగ్గర అనుభవం ఉంటుంది.  కాబట్టి వారి అనుభవ పూరిత సలహాలు ఎప్పుడూ నష్టం మాత్రం కలిగించవు.  జీవిత భాగస్వామి మద్దతు.. జీవితంలో లైఫ్ పార్ట్నర్ చాలా ముఖ్యమైవారు.   జీవిత భాగస్వామి  సుఖదుఃఖాలన్నిటిలోనూ సపోర్ట్ ఇస్తూ అవగాహనతో మసలుకుంటే  జీవితం సులభంగా, సంతోషంగా మారుతుంది. జీవిత భాగస్వామి  అంటే పంచుకునేవారు. ఎలాంటి పరిస్థితిని అయినా అర్థవంతంగా చెప్పగలిగితే బాగస్వామి తప్పకుండా అర్థం చేసుకుంటారు.  ఎవరు అర్థం చేసుకోకపోయినా,  ఎవరు కష్టాలలో తోడు ఉండకపోయినా లైఫ్ పార్ట్నర్ తోడు ఉంటే బాధ, సమస్య ప్రభావం తెలియకుండా ఉంటుంది. తృప్తి.. ఈ కాలంలో మనిషికి లోపించినది తృప్తి.   ఎక్కువ కోసం ఆరాటపడకపోతే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, తద్వారా సంతోషంగా ఉంటాము. ముఖ్యంగా డబ్బు గురించి గొడవ చేసేవారు ఎప్పుడూ ఉన్నదాంతో  సంతృప్తి చెందరు. అందుకే మొదట డబ్బు దగ్గర ఉన్నదాంతో సంతృప్తి చెందడం నేర్చుకుంటే  అన్ని విషయాలలోనూ సంతృప్తిగా ఉండవచ్చు. ఆశించడం..  ఇతరుల సంపద,  ఆస్తి,  ఇతర వస్తువులు వంటివి కోరుకోవడం, తప్పని,  అది చాలా చీప్ మెంటాలిటీ అని  ఎప్పుడైతే తెలుసుకుంటారో.. అప్పుడు జీవితంలో దురాశను వదిలిపెడతారు. ఎవరినుండి అయినాఏదైనా ఆశించడం దురాశ చెందడమే. ఇట్లా దురాశను వదిలిన రోజు మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది.  ఎటువంటి కోరిక లేకుండా జీవితాన్ని గడుపుతాము. భూత దయ.. నా వాళ్లు, మనవాళ్లు అని మాత్రమే కాదు.. అందరినీ, అన్ని జీవులను ప్రేమించాలి.అందరి పట్ల,  మూగ ప్రాణుల  పట్ల కూడా  దయ,  కరుణ కలిగి ఉంటే,   ప్రేమ,  శాంతిని నింపుకోగలుగుతారు. ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనలు,  మంచి ఆలోచనలు,  ఇతరులను ఇబ్బంది పెట్టని,  అన్ని జీవులను సమానంగా చూసే సమభావం అలవడుతుందో.. అప్పుడు మనిషి జీవితం ఎన్ని దుఃఖాలు, సమస్యలు వచ్చినా బాధకు లోనుకాకుండా ఉంటుంది.                               *రూపశ్రీ.
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన అలవాట్ల కారణంగా మూత్రపిండాలు క్రమంగా దెబ్బతింటాయి. నేటికాలంలో ఆహారపు అలవాట్లు,  తీసుకునే పానీయాలు,  జీవనశైలి కారణంగా మూత్రపిండాల ఆరోగ్యం చాలా దెబ్బతింటోంది. గతంతో పోలిస్తే.. నేటికాలంలో మూత్రపిండాల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఎక్కువ అయ్యారు. మూత్రపిండాల పనితీరు బలంగా ఉండాన్నా,  మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలన్నా కొన్ని అలవాట్లు చాలా బాగా సహాయపడతాయి.   రోజువారీ జీవితంలో పాటించదగిన ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. నీరు.. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తగినంత నీరు త్రాగడం చాలా సులభమైన,  ప్రభావవంతమైన మార్గం. నీరు మూత్రం ద్వారా శరీరం నుండి విషపదార్థాలను , అదనపు ఉప్పును బయటకు పంపడానికి సహాయపడుతుంది. చాలా తక్కువ నీరు త్రాగడం వల్ల డీహైడ్రేషన్, మూత్రపిండాల్లో రాళ్లు , మూత్రపిండాలపై ఒత్తిడి పెరగడానికి దారితీస్తుంది. సగటు వ్యక్తికి రోజుకు 2–3 లీటర్ల నీరు త్రాగడం చాలా అవసరం.  ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తాగడం చాలా మంచి ప్రయోజనం కలిగిస్తుంది. ఉప్పు.. అధికంగా ఉప్పు తినడం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది మూత్రపిండాలు దెబ్బతినడానికి ఒక ప్రధాన కారణం అవుతుంది. ప్యాక్ చేసిన స్నాక్స్, చిప్స్, ఊరగాయలు , ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఉప్పు అధికంగా ఉంటుంది.   ఉప్పు తక్కువగా తీసుకునేందుకు  ప్రయత్నించాలి. అలాగే  తాజాగా, ఇంట్లో వండిన భోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తక్కువ ఉప్పు ఉన్న ఆహారం మూత్రపిండాలపై భారాన్ని తగ్గించి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జంక్ ఫుడ్.. జంక్ ఫుడ్‌లో అధికంగా నూనె, ఉప్పు, చక్కెర  ఉంటాయి, ఇవి క్రమంగా శరీరానికి , మూత్రపిండాలకు హాని కలిగిస్తాయి. బర్గర్లు, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, శీతల పానీయాలు , ప్రాసెస్ చేసిన ఆహారాలను అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయం, అధిక రక్తపోటు , మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి, తాజా పండ్లు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు ,  ఇంట్లో వండిన పోషకాలతో కూడిన  భోజనం తినడం ఉత్తమం. ధూమపానం.. ధూమపానం శరీరంలోని రక్తనాళాలను దెబ్బతీసి, మూత్రపిండాలకు తగినంత రక్త సరఫరాను అడ్డుకుంటుంది. సిగరెట్లలోని విష పదార్థాలు క్రమంగా మూత్రపిండాల పనితీరును బలహీనపరుస్తాయి. ధూమపానం మానేయడం వల్ల రక్త ప్రసరణ, శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు మెరుగుపడి, మూత్రపిండాల వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. ధూమపానం ఆపేయడం వల్ల  గుండె , ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వాకింగ్.. ప్రతిరోజూ 30 నిమిషాల నడక శరీరాన్ని చురుకుగా , ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. నడక రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, బరువును అదుపులో ఉంచుతుంది , రక్తపోటును నియంత్రిస్తుంది. క్రమం తప్పకుండా నడవడం మధుమేహం , ఊబకాయం ప్రమాదాన్ని తగ్గిస్తుంది, తద్వారా ఎక్కువ కాలం  మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఉదయం లేదా సాయంత్రం తేలికపాటి నడక మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.                            *రూపశ్రీ.
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో తల తిరగడం సమస్యకు మన ఇంట్లో ఉండే ధనియాలతో (Coriander Seeds) సులభమైన మరియు ప్రభావవంతమైన ఆయుర్వేద చిట్కాలను వివరించారు. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే అంశాలు: తల తిరగడానికి కారణాలు: అసలు వెర్టిగో లేదా తల తిరగడం ఎందుకు వస్తుంది? ధనియాల ప్రాముఖ్యత: ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ధనియాలు శరీరంలోని వేడిని తగ్గించి, నాడీ వ్యవస్థను ఎలా శాంతపరుస్తాయి? రెమెడీ తయారీ విధానం: ధనియాలను ఏ విధంగా ఉపయోగిస్తే తల తిరగడం తక్షణమే తగ్గుతుంది? ముందు జాగ్రత్తలు: ఈ సమస్య ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహార నియమాలు మరియు జాగ్రత్తలు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ సహజ సిద్ధమైన చిట్కాను పాటించి, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. మరిన్ని వివరాల కోసం మా TeluguOne Health యూట్యూబ్ ఛానల్ చూడండి: సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
చాలా మందికి రాత్రిపూట వేడివేడి అన్నం తింటే గాని నిద్ర పట్టదు. కానీ, బరువు తగ్గాలని లేదా ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే వారికి ఇది ఒక పెద్ద అడ్డంకి అని అంటున్నారు ప్రముఖ ఫ్యాట్ లాస్ కోచ్ విజయ్ మంగం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రాత్రిపూట అన్నం తినడం వల్ల కలిగే నష్టాలు మరియు ఆరోగ్యకరమైన మార్పుల గురించి ఈ VIDEO లో వివరించారు. రాత్రిపూట అన్నం ఎందుకు వద్దు? మనం పగటిపూట రకరకాల పనులు చేస్తూ ఉంటాం కాబట్టి శరీరానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. కానీ రాత్రిపూట శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్తుంది. అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట అన్నం తిని వెంటనే పడుకోవడం వల్ల ఆ శక్తి ఖర్చు కాక, అది కొవ్వుగా (Fat) మారి శరీరంలో పేరుకుపోతుంది. దీనివల్ల ముఖ్యంగా పొట్ట రావడం, బరువు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రత్యామ్నాయాలు ఏమిటి? విజయ్ మంగం సూచనల ప్రకారం, రాత్రిపూట అన్నానికి బదులుగా కూరగాయలు (Vegetables), ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ఉత్తమం. సలాడ్లు, సూప్స్ లేదా తక్కువ పరిమాణంలో ఇతర చిరుధాన్యాలను ఎంచుకోవచ్చు. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, శరీరానికి అనవసరమైన కొవ్వు చేరదు. ముఖ్య గమనిక: మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఫిట్‌గా కనిపించాలన్నా కేవలం వ్యాయామం మాత్రమే సరిపోదు, సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. బరువు తగ్గాలనుకునే వారు విజయ్ మంగం గారి ఈ టిప్స్ పాటించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం మా TeluguOne Health ను సందర్శించండి.  సబ్‌స్క్రైబ్ చేసుకోండి!