LATEST NEWS
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు నడ్డా స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ సోమవారం (జనవరి 19) ముగిసింది.  ఈ నామినేషన్ల ప్రక్రియ ముగిసే సరికి ఆ పదవి కోసం నితిన్ నబిన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.   బీజేపీ జాతీయ అధ్యక్ష  ఎన్నికకు ప్రధాన ఎన్నికల అధికారిగా   కె.లక్ష్మణ్‌ వ్యవహరించారు. ఇక పోతే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఎన్నికను మంగళవారం (జనవరి 20) ఉదయం ప్రధాని మోడీ  సమక్షంలో అధికారికంగా ప్రకటిస్తారు.  ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్ర పార్టీల అధ్యక్షులు,   ప్రధాన కార్యదర్శులు,  ఇన్‌చార్జ్‌లు, జాతీయ ఆఫీస్ బేరర్లు,  సీనియర్ నాయకులు హాజరవుతారు.  
తెలంగాణలో బీఆర్ఎస్  ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీం కోర్టులో సకీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సుప్రీం ధర్మాసనం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం (జనవరి 19) విచారణ చేపట్టింది. గతంలో పెండింగ్‌లో ఉన్న కేసుతో బీజేపీ పిటిషన్‌ను కూడా జత చేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. మూడు నెలల్లోపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించినప్పటికీ.. ఆ ఆదేశాలను అమలు చేయలేదని బీజేపీ   తన పిటిషన్ లో పేర్కొంది.   ఈ మేరకు స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని కోరుతూ తెలంగాణ బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇంకా కాంగ్రెస్‌లోనే ఉన్నానని చెప్పిన కామెంట్లనూ  పిటిషన్‌లో పొందుపరిచారు. గత నవంబర్‌లోనే స్పీకర్‌కు సుప్రీం కోర్టు కంటెంప్ట్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ పిటిషన్‌ను జతచేసి మరోసారి నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 తెలంగాణ  మునిసిపోల్స్ నిర్వహణకు  రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.  ములుగు జిల్లా మేడారంలోని హరిత హోటల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం (జనవరి 18)  జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మేడారంలో జరిగిన కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సచివాలయంలో కాకుండా మేడారంలో కేబినెట్ సమావేశం ఏర్పాటైందన్నారు.  ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్క ఇందుకు చొరవ తీసుకున్నారని, మేడారంలో కేబినెట్ భేటీ విషయంలో  అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారని వివరించారు. అందరి ఏకాభిప్రాయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మేడారంలో మంత్రివర్గ సమావేశం జరిగిందన్నారు. ఈ సమావేశంలోనే రాష్ట్రంలో గడువు పూర్తైన  116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లలోని 2,996 వార్డులు, డివిజన్లకు సాధ్యమైనంత  త్వరగా ఎన్నికలు జరపాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్  నివేదిక ప్రకారం  రిజర్వేషన్లు ఖరారయ్యయన్నారు.
ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. సంకల్ప యాత్రు పేరిట తాను చేపట్టిన ఈ యాత్ర ఎంత మాత్రం రాజకీయ యాత్ర కాదని స్పష్టం చేసిన బండ్ల గణేష్ కేవలం తన మొక్కు చెల్లించుకోవడం కోసం మాత్రమే ఈ పాదయాత్ర చేస్తున్నానన్నారు.  రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని తన సినిమా థియేటర్ నుంచి సోమవారం (జనవరి 19)   ఉదయం ఆయనీ యాత్రను ప్రారంభించారు. దాదాపు  500 కిలోమీటర్ల ఈ పాదయాత్ర సాగనుంది. తాను తిరుమ లకు పాదయాత్ర చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభిమానంతో నేనన్నారు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆశీస్సులతోనే ముందడుగు వేస్తున్నానని చెప్పారు.  జగన్ హయాంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును స్కిల్ కేసు పేరుతో అక్రమంగా అరెస్టు చేయడం తనను ఎంతో బాధించిందన్న బండ్ల గణేష్ అప్పట్లో ఆయనకు బెయిలు వస్తుందని కోర్టు విచారణ ఉన్న ప్రతిసారీ సుప్రీంకోర్టులో ఉండేవాడినని గుర్తు చేసుకున్నారు. అప్పుడే ఈ కేసు నుంచి ఆయన  ఎలాంటి మచ్చలేకుండా విడుదల కావాలని ఏడుకొండల వాడికి మొక్కుకున్నానన్నారు. ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకోవడానికే షాద్ నగర్ లోని తన సినిమా థియేటర్ నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించానని బండ్ల గణేష్ చెప్పారు. 
ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ రెడ్డికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది.  ఇప్పటికే  ఈ కేసులోపలువురు కీలక వ్యక్తులను విచారించిన ఈడి, రెండు రోజుల కిందట వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు తాజాగా  వైసీపీకి చెందిన మరో ఎంపీకి నోటీసులు జారీ చేయడం రాజకీయంగా కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.   మిధున్ రెడ్డిని ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో  పేర్కొంది.   ఇప్పటికే ఇదే కేసులో ఎంపీ మిధున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది.  ప్రస్తుతం ఆయన బెయిలుపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.  ఏపీ లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఈడి అనుమానిస్తోంది. లిక్కర్ వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల్లో హవాలా మార్గంలో భారీ ఎత్తున జరిగిన నగదు చలామణి లో మిథున్ రెడ్డి పాత్ర ఉందని   ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణం ద్వారా అక్రమంగా సంపాదించిన సొమ్మును వివిధ మార్గాల్లో  మనీ ల్యాండరింగ్ చేశారనీ, ఆ సొమ్ము  కీలక వ్యక్తుల వరకూ చేరిందని ఈడీ అనుమానిస్తోంది.   జగన్ హయాంలో అమలు చేసిన మద్యం విధానంలో  లైసెన్సుల కేటాయింపు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై ఇప్పటికే  దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కీలకంగా భావి స్తున్న ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మిథున్ రెడ్డి పాత్రపై స్పష్టత కోసం ఆయనను విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్కామ్‌కు సంబంధించి పలువురు అధికారులు, వ్యాపారులు, మధ్యవర్తులను విచారించిన ఈడి, తాజాగా ఎంపీ స్థాయి నేతకు నోటీసులు ఇవ్వడంతో కేసు దర్యాప్తు తుదిదశకు చేరుకున్నదని భావించవచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మిథున్ రెడ్డి విచారణ లో కొత్త ఆధారాలు వెలుగు లోకి వచ్చే అవకాశ ముందం టున్నారు.   మనీ ట్రయిల్‌పై ఈడి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు  ఈ పరిణా మాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతు న్నాయి.  మిథున్ రెడ్డి ఈడి విచారణకు ఎలా స్పందిస్తారన్నది, విచార ణలో ఏమి బయటపడ నున్నదని, ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ALSO ON TELUGUONE N E W S
In a recent media interaction during the success celebrations of Bhartha Mahasayulaku Wignyapthy, producer Sudhakar Cherukuri addressed the ongoing speculations regarding a box office showdown between Nani’s The Paradise and Ram Charan’s Peddi. The producer firmly stated that a clash between the two high-profile projects is not on the cards, prioritizing a healthy release window for both films. Both have announced their release dates already and clash has been long been in discussion among Industry insiders and fans. The Paradise is scheduled for 26th March 2026 and Peddi for 27th March 2026 release, respectively. Sudhakar explained that the industry has already witnessed a heavily cluttered release schedule during the recent Sankranti season, and the team is keen to avoid a similar situation during the upcoming summer period.  He emphasized that while the production of The Paradise is progressing smoothly and according to the planned schedule, the makers are conscious of the distribution landscape. "We have already seen a heavy rush for Sankranti, and we don't intend to repeat that in the summer," the producer remarked. He further noted that discussions are currently ongoing to ensure a smooth release for both films.  Highlighting the camaraderie within the industry, Sudhakar Cherukuri mentioned that since there is ample gap during the summer season and many of the stakeholders are friends, they will coordinate to ensure each film gets its due space. By opting for a strategic release rather than a direct confrontation, the makers of The Paradise are looking to maximise box office returns for both Pan-India summer releases with huge anticipation.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  -ట్విట్టర్ ఏం చెప్తుంది -బంగ్లాదేశ్ రచయిత్రి ఆంతర్యం ఏంటి -అసలు మ్యాటర్ ఇదేనా!   భారతీయ చిత్ర పరిశ్రమకి గర్వకారణంగా నిలిచిన మ్యూజిక్ మెషిన్ 'ఏ ఆర్ రెహ్మాన్'(Ar Rehman)ఇటీవల మాట్లాడుతు అవకాశాల విషయాల్లో బాలీవుడ్ లో మతపరమైన వివక్ష ఉందేమో అనే అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తన వ్యాఖ్యలపై రెహ్మాన్ వివరణ కూడా ఇచ్చాడు. ఇక ఈ ఎంటైర్ విషయం మొత్తంపై రచయిత్రి తస్లిమా నస్రీన్(Taslima nasreen) సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలో స్పందించింది.  ఎక్స్ వేదికగా రెహ్మాన్ విషయంపై నస్రిన్ స్పందిస్తు 'రెహ్మాన్ భారత్ లో చాలా పేరు పొందిన వ్యక్తి. నాకు తెలిసి రెమ్యునరేషన్ పరంగా అందరి మ్యూజిక్ డైరెక్టర్స్ కంటే ఎక్కువ. మతపరమైన కారణాలతో పని దొరకడం లేదని ఆయన చెప్పారు. కానీ తెలియాల్సిన విషయం ఏంటంటే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, జావేద్ ఖాన్ లాగానే రెహ్మాన్ సూపర్ స్టార్. పని విషయంలో వీళ్ళకి మతం అనేది దరిదాపుల్లోకి కూడా రాదు. నాలాంటి పేదలకే కష్టాలు ఉంటాయి. కాబట్టి రెహ్మాన్ ని చూసి ఎవరు జాలిపడవద్దు అని ట్వీట్ చేసింది.    Also read:   లెజండ్రీ హీరోయిన్ చావుకి బ్లాక్ మ్యాజిక్ కారణమా! ఆమె భర్త ఏం చెప్పాడు   బంగ్లాదేశ్ కి  చెందిన నస్రీన్  రచయిత్రి గా తన పుస్తకాలతో ఎంతో మందిని ఉత్తేజపరుస్తూ వస్తుంది. ప్రపంచ మహిళా హక్కుల కోసం పోరాడుతూ ఉండటంతో పాటు  పక్కా సెక్యులర్ వాది. ఈ విషయంలో ఆమెపై ఎన్నోసార్లు దాడి జరిగినా కూడా తన ఆలోచనల్ని, భావాలని చెప్పే విషయంలో ఎలాంటి బెరుకు లేకుండా ముందుకెళ్తుంది.       
The multilingual actor and ever-versatile star Dulquer Salmaan is ready to impress audiences once again with another content-driven film that promises to make a strong impact. The first-look teaser has impressed everyone and raised expectations for this film, which is directed by Pavan Sadineni, known for his innovative storytelling and unique cinematic approach. The  film is being presented by Esteemed production houses Geetha Arts and Swapna Cinema and produced by Sandeep Gunnam and Ramya Gunnam under the Lightbox Media banner. The film stars a new face, Satvika Veeravalli, in the lead role.  Her character teaser, unveiled today, showcases a girl from a remote village where there are no proper roads, who dreams of reaching the stars. Set to a soothing background score by GV Prakash Kumar, the teaser offers beautiful glimpses of the elegant Satvika, who appears ready to impress audiences with a captivating and impactful performance. The film's shoot has completed almost 80% and makers are planning to release the film this summer. Talented Sujith Sarang is handling the cinematography while Shwetha Sabu Cyril is taking care of Production Design. With such a strong team and exciting cast, Aakasam Lo Oka Tara is poised to make a significant impact in Telugu, Tamil, Hindi and Malayalam. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Naveen Polishetty has officially entered the big league, and Anaganaga Oka Raju stands as the biggest blockbuster of his career. In just five days, the film has stormed past a massive ₹100.2 CRORES GROSS worldwide, turning the Sankranthi box office into a celebration of records, momentum, and pure audience frenzy. From the very first show, Anaganaga Oka Raju has enjoyed unstoppable word of mouth, packed houses, and repeat family audiences. The result is historic. All distributors crossed breakeven within just four days, a rare feat in today’s highly competitive release environment, clearly establishing the film as a clean blockbuster across territories. With this sensational run, Naveen Polishetty delivers his FOURTH CONSECUTIVE BLOCKBUSTER, reinforcing his status as one of the most reliable and bankable stars of Telugu cinema. Each release has only pushed his market higher, and Anaganaga Oka Raju now crowns that journey as his career-high grosser. Overseas, the film has created another landmark. Naveen Polishetty completes a HATTRICK OF $1 MILLION+ FILMS IN THE USA, a feat achieved by only a select few. Even more remarkably, Anaganaga Oka Raju is now racing rapidly towards the prestigious $2 MILLION mark, with collections holding strong every single day. The overseas distributor Moksha Movies ensured fantastic screen holding and strategic placement despite a tight festive schedule, playing a crucial role in the film’s massive overseas success. Back home, the AP and TS box office has shown extraordinary strength. Despite heavy Sankranthi competition, all distributors of Sithara Entertainments stood solidly behind the film, giving it the best possible release, strong screen counts, and prime placements. Their belief in the content translated directly into sustained footfalls and record-breaking numbers. Built entirely on content, comedy, emotion, and audience connect, Anaganaga Oka Raju has emerged as the definitive Sankranthi entertainer, appealing across age groups and regions. Trade circles are calling it a biggest ever blockbuster driven by strong writing, repeat value, and long-run potential. With ₹100.2 crores in just five days, breakeven in four days, a hattrick of Million Dollar USA films, four consecutive blockbusters, and a run that is still accelerating, Naveen Polishetty is clearly in a league of his own. Anagananga Okka Raju is not slowing down anytime soon and is firmly marching towards even bigger milestones. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
    -బాలీవుడ్ ని కుదిపేస్తున్న బ్లాక్ మ్యాజిక్ మాటలు  -పరాగ్ త్యాగి ఏం చెప్తున్నాడు -అసూయ అనేది ఉందా! -ఆ మాటల వెనక ఆంతర్యం ఏంటి!   సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా కలయికలో వచ్చిన మూవీ 'ముజ్సే షాదీ కరోగి'. పైగా ఎంటర్ టైన్ మెంట్ లో కింగ్ మేకర్ గా గుర్తింపు పొందిన డేవిడ్ ధావన్ దర్శకుడు. దీన్ని బట్టి ఆ చిత్రానికి ఉన్న క్రేజ్ ని అర్ధం చేసుకోవచ్చు. అలాంటి ఆ చిత్రంలో బిజ్జి అనే క్యారక్టర్ లో  క్యామియో ఎప్పిరియెన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న నటి షెఫాలీ జరీవాలా(Shefali Jariwala).2002 వ సంవత్సరం నుంచే మోడల్ గా కెరీర్ ని ఆరంభించి, పలు హిందీ మ్యూజిక్ వీడియోలు, రియాలిటీ షోలతో పాటు కన్నడ చిత్రంలో కూడా మెరిసింది. ముఖ్యంగా 'కాంటా లగా' అనే మ్యూజిక్ ఆల్బమ్ తో ఎనలేని ఖ్యాతితో పాటు ఫ్యాన్ బేస్ ని, సిల్వర్ స్క్రీన్ పై మెరిసే  హీరోయిన్స్ కి ధీటుగా లెజండ్రీ స్టేటస్ ని సొంతం చేసుకుంది.  ఈ విధంగా కెరీర్ లో దూసుకుపోతున్న షెఫాలీ గత ఏడాది జనవరి 27 న చనిపోయింది. బ్యూటీ ట్రీట్ మెంట్ లో భాగంగా ఉపవాసం ఉన్న రోజు ఇంజక్షన్ తీసుకోవడం వల్ల ఆమె చనిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ రీసెంట్ గా ఒక పాడ్ కాస్ట్ లో పాల్గొన్న షెఫాలీ భర్త పరాగ్ త్యాగి మాట్లాడుతు దేవుడు ఉన్నప్పుడు దెయ్యం కూడా ఉంటుంది. చాలా మంది ఇలాంటివి నమ్మరు కానీ నేను నమ్ముతాను. చేతబడులు అనేవి జరుగుతున్నాయి. మోస్ట్ ఆఫ్ పీపుల్ వారు పడే కష్టాలు కన్నా అవతలి వారి సంతోషాన్ని చూసి ఎక్కువ బాధపడతారు. ఆ విధంగా నా భార్య పై చేతబడి చేసారు. ఎవరు చేశారనేది మాత్రం తెలియదు. మొత్తం రెండు సార్లు చేసారు. మొదటి సారి పరిస్థితులు వాటంతట అవే సరిదిద్దుకున్నాయి. కానీ రెండవ సారి వ్యతిరేఖంగా మారిపోయాయి. నాకు దైవ భక్తి ఎక్కువ. దేవుడి స్మరణలో మునిగినపుడు ఏదైనా చెడు జరుగుతున్నప్పుడు ఎంతో కొంత పసిగట్టగలను. అలా నా భార్యని తాకినప్పుడు ఏదో జరుగుతుందని అర్థమైంది. ఆమెని కాపాడమని ఎంతో వేడుకున్నాను.   also read:   ఎవరు ఆ ముగ్గురు.. ఆసక్తి రేపుతున్న రష్మిక కీలక వ్యాఖ్యలు  కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయిందని తన ఆవేదనని వ్యక్తం చేసాడు. షెఫాలీ కి పరాగ్ త్యాగి(Parag Thyagi)రెండవ భర్త.. 2014 లో ఆ ఇద్దరి వివాహం జరగగా 2008 నుంచి పరాగ్ త్యాగి నటనా వృత్తిలో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు ఏడు సినిమాలతో పాటు పన్నెండు సీరియల్స్ లో చేసాడు. అలాంటి పరాన్ త్యాగి  షెఫాలీ మరణంపై చెప్పిన బ్లాక్ మ్యాజిక్ మాటలు బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. షెఫాలీ స్వస్థలం గుజరాత్ కాగా 2019లో రియాలిటీ షో బిగ్ బాస్ 13లో కంటెస్టెంట్‌ గా కూడా చేసింది. చనిపోయే నాటికీ ఆమె వయసు 42 సంవత్సరాలు.      
    -ఆసక్తికరంగా రష్మిక వ్యాఖ్యలు  -తన వ్యాఖ్యల్లో మర్మమేంటి  -వాళ్ళు కూడా బతకాలిగా -ఇంతకీ ఏమని చెప్పింది   వరుస పాన్ ఇండియా హిట్స్ తో దూసుకుపోతు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక మందన్న(Rashmika Mandanna). పైగా అతి తక్కువ వ్యవధిలోనే ఆ స్థాయి ఇమేజ్ ని పొందిందంటే  రష్మిక కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీ ని అర్ధం చేసుకోవచ్చు. భారీ అభిమాన ఘనం కూడా ఆమె  సొంతం. రీసెంట్ గా తన కెరీర్ కి సంబంధించి రష్మిక  చెప్పిన కొన్ని విషయాలు అభిమానులు, మూవీ లవర్స్ తో పాటు ఫిలిం సర్కిల్స్ లో సరికొత్త చర్చకి దారితీశాయి. అంతలా చర్చకి దారి తీసిన అంశాలేంటో చూద్దాం. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మాట్లాడుతు 'కొంత మంది వ్యూస్ తో డబ్బు సంపాదించడం కోసం ఏదేదో ఊహించుకుంటూ తప్పుడు కథనాలు ప్రచురిస్తారు. మొదట్లో బాధగా అనిపించినా, ఇప్పుడు మాత్రం వాళ్ళు కూడా బతకాలి కదా అనిపిస్తుంది. ఇండస్ట్రీ లో ఉన్న వారికి నెగిటివిటి కామన్.  ఆ విషయంలో ఎవరు మారడం లేదు. నేను ఎక్కువ పారితోషకం తీసుకుంటాననే రూమర్ ఎక్కువగా వినిపిస్తుంటుంది. కానీ ఆ న్యూస్ లో ఎలాంటి   నిజం లేదు. కానీ సదరు న్యూస్ నిజమైతే బాగుండని ఎన్నో సార్లు అనుకుంటాను. స్పెషల్ సాంగ్స్ లో చెయ్యడానికి నేను ఓకే. కాకపోతే ఆ చిత్రంలో నేనే హీరోయిన్ అయ్యి ఉండాలి.    Also read:   ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవే.. తొలి తెలుగు చిత్రమని మేకర్స్ ప్రకటన    కానీ ఇండస్ట్రీలో ముగ్గురు దర్శకులు ఉన్నారు. వాళ్ళు అడిగితే మాత్రం వాళ్ల సినిమాల్లో  స్పెషల్ సాంగ్స్ చేస్తాను. ప్రస్తుతం  నేను హీరోయిన్ ని కాబట్టి ప్రేక్షకులకి వినోదాన్ని పంచడమే నా పని. అందుకే ప్రేక్షకుల్లో అన్ని రకాల జోనర్స్ వాళ్ళు  ఉంటారని  మాగ్జిమమ్ అన్ని రకాల జోనర్స్ లో చేస్తూ వస్తున్నానంటూ రష్మిక చెప్పుకొచ్చింది. ఇక స్పెషల్ సాంగ్  వ్యాఖ్యలపై  అభిమానులు సోషల్ మీడియా వేదికగా  పలు రీతుల్లో స్పందిస్తున్నారు. ప్రీవియస్ మూవీ గర్ల్ ఫ్రెండ్ తో రష్మిక మరో మారు తన పెర్ ఫార్మెన్స్ తో అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాక్ టైల్ 2 , మైసా వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ రష్మిక ఖాతాలో ఉన్నాయి.  
Megastar Chiranjeevi has once again demonstrated his unparalleled box office dominance this Sankranti season. His latest mega family entertainer, Mana Shankara Vara Prasad Garu, helmed by blockbuster director Anil Ravipudi, has officially emerged as a regional powerhouse. In just 7 days, the film has amassed a staggering 292 crores+ gross worldwide. The film created history by recording the highest-ever Day 7 share in the Telugu states. In a remarkable feat of endurance, MSG surpassed the collections of previous industry titans like RRR to claim this top spot. The steady grip at the box office proves that the Megastar’s pull remains as potent as ever. The "Mega" wave is not just restricted to the domestic market. In a mere week, MSG has become the highest-grossing film in Megastar Chiranjeevi’s career in North America, crossing the US$2.62 Million mark. It is fast approaching the US$3 Million club, a first for the veteran actor.  Already, the movie has become the third 200-crore grosser for Chiru, and the movie has officially achieved Breakeven status by entering the profit zone across all territories. Trade analysts are buzzing with optimism, predicting that Mana Shankara Vara Prasad Garu is on track to become the Regional All-Time Industry Hit for Telugu cinema. The film's success is bolstered by a stellar ensemble, featuring a high-octane extended cameo by Victory Venkatesh and a graceful performance by leading lady Nayanthara. Produced on a massive scale by Sahu Garapati and Sushmita Konidela, the film continues to run with phenomenal momentum. With the holiday advantage still in play, MSG is poised to rewrite several more record books in the coming days. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
    -ఆగని మెగా, విక్టరీ జోరు  -రికార్డు కలెక్షన్స్  -మేకర్స్  ఎంత ప్రకటించారు -ఎండింగ్ ఫిగర్ ఎంత!    వరల్డ్ సిల్వర్ స్క్రీన్ వద్ద శంకర వరప్రసాద్, వెంకీ గౌడ, శశిరేఖ, అనిల్ రావిపూడి(Anilravipudi)చేస్తున్న హంగామాకి ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు. రిలీజ్ రోజున ఏ స్థాయిలో అయితే అభిమానులు, ప్రేక్షకులతో థియేటర్స్ కళకళలాడుతు ఉన్నాయో ఇప్పుడు అదే పరిస్థితి. ఈ విషయంలో   అంతకు మించి అని కూడా చెప్పుకోవచ్చు. దీంతో కలెక్షన్స్ పరంగా కనివిని ఎరుగని రికార్డులు శంకర వర ప్రసాద్ ఖాతాలోకి చేరుతున్నాయి. మరి ఆరు రోజులకే 261 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన శంకర వరప్రసాద్ నిన్నటితో మొదటి వారం కంప్లీట్ చేసుకొని రెండవ వారంలోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో టోటల్  ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతో చూద్దాం.    మన శంకర వరప్రసాద్ నిన్న ఏడవ రోజున 31 కోట్ల గ్రాస్ ని రాబట్టాడు. దీంతో మొత్తం ఏడు రోజులకి 292 కోట్ల గ్రాస్ ని వసూలు చేసినట్లయింది. మేకర్స్ కూడా అధికారంగా ధ్రువీకరిస్తు పోస్టర్ రిలీజ్ చేసారు. ఇక్కడ ఇంకో అరుదైన రికార్డు ఏంటంటే ఏడవ రోజు తెలుగు లాంగ్వేజ్ కి సంబంధించి  31 కోట్ల గ్రాస్ ని రాబట్టిన తొలి తెలుగు చిత్రంగా కూడా శంకర వర ప్రసాద్ నిలిచింది. దీన్ని బట్టి శంకర వర ప్రసాద్ మానియా ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం థియేటర్స్ లో శంకర వరప్రసాద్ తో పాటు సంక్రాంతికి వచ్చిన మరికొన్ని సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇతర భారీ చిత్రాల రాక కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నెల రోజుల పాటు లేదు. ఈ నేపథ్యంలో ఫస్ట్ వీక్ కే  292 కోట్ల గ్రాస్ ని శంకర వర ప్రసాద్ రాబట్టడంతో  టోటల్ రన్ లో సాధించే కలెక్షన్స్ పై  అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.    Also read:   రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు.. అతనికి బుద్ధి అనేది ఉందా    ఓవర్ సీస్ పరంగా చూసుకున్నా కూడా ఇప్పటికే 2 .96 మిలియన్ల క్లబ్ లో చేరి మూడు మిలియన్ల క్లబ్ లోకి చేరువ కానుంది. దీంతో చిరంజీవి(Chiranjeevi)కెరీర్ లోనే  ఆ ఘనత అందుకోబోతున్న తొలి చిత్రంగా శంకర వరప్రసాద్ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలవబోతుంది.     
      -వైరల్ అవుతున్న రేణు దేశాయ్ స్పీచ్  -ఎవర్ని టార్గెట్ చేసింది  -తన ఆవేదన ఎందుకు  -ఏం చెప్పదలచుకుంటుంది   పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)మాజీ వైఫ్ గా, హీరోయిన్ గా,కాస్ట్యూమ్ డిజైనర్ గా నటిగా రేణుదేశాయ్(Renu Desai)యొక్క ప్రాభవం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. పలు నూతన ప్రాజెక్ట్స్ కూడా వింటూ ఇంపార్టెంట్ అండ్ రెస్పెక్ట్ ఉన్న క్యారెక్టర్స్ లో కనిపించేందుకు సిద్ధమవుతుంది. జంతు ప్రేమికురాలు కూడా అయిన రేణు దేశాయ్  రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా నిలుస్తున్నాయి.   ఆమె మాట్లాడుతు వంద కుక్కల్లో ఐదు చెడ్డవి ఉంటాయి.ఆ ఐదు కుక్కలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయని, ఆ మనిషి ప్రాణాలకి విలువ కట్టి వంద కుక్కల్ని చంపడం ఎంత వరకు న్యాయం.  రోజుకి లక్షల మంది దోమ కాటు వల్ల వచ్చే డెంగీ జ్వరంతో, రోడ్  యాక్సిడెంట్ లో చనిపోతున్నారు. ఆ మనుషుల  ప్రాణాలకి విలువ లేదా. హెల్మెట్స్ లేకుండా ఎంతో మంది బైక్ పై వచ్చి మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. ఆ ప్రాణాలకి విలువ లేదు కానీ కుక్క కురిసి చనిపోతే విలువ. రోజు నా వెంట 15 మంది కుక్కలు వస్తాయి. నన్ను ఏమి అనవు.  కుక్క ఆయుక్షు 10 సంవత్సరాలు.   కొంత మంది  మగాళ్లు మర్దార్లు చేస్తారు. రేపులు చేస్తారు. అందుకని  అందరు మగాళ్లని చంపుతారా! మైండ్ ఇచ్చారు కదా కొంచం వాడండి. సింబాస్ లా కాలేజీ వాళ్ళు, కర్నల్ సెంథిల్ చదువుకున్న వ్యక్తే కదా. ఏ ఏరియాలో కుక్కలు తప్పు చేస్తే  ఆ కుక్కల్ని వరకే ఏదైనా చేద్దాం. కుక్కల్ని ఆ శివుడు, అమ్మవారే సృష్టించారు. నిజంగా ఈ మనుషులకి మంచి  చెయ్యాలంటే చాలా ఉన్నాయి.  మనుషుల లైఫ్ కి ఎంత వాల్యూ ఉందో జంతువుల లైఫ్ కి అంతే  వాల్యూ ఉంది. ఫస్ట్  ఫైట్ ఫర్ రోడ్ సేఫ్టీ, ఆల్కహాల్, రేపిస్టిస్ అని చెప్పుకొచ్చింది. గవర్నమెంట్ ఫెయిల్ అయ్యిందని రేణు దేశాయ్ తన ఆవేదనని వ్యక్తం చేసారు.  
Renuu Desai along with Rashmi Gautam interacted with press at the Hyderabad Press Club. She got emotional, angry and highly melodramatic talking about animal cruelty. Recently, a video of villagers killing a dog from rural India became viral as it bite a youngster going into the house.  The stray dog has been killed in such a violent manner that many pet lovers started discussing about it. Now, Renuu Desai and Rashmi Gautham have reacted emotionally to this issue and stated that why can't the same brutality be shown on criminals. Rashmi stated that the video had upset her dearly.  Rashmi Gautam said, "We give stray dogs waste old food items after we eat. They do not come to us and ask for good food daily or they do not even ask for any sort of extra things from us. When you can show such cruelty towards animals why don't you showcase similar amount of harshness on criminals."  Renuu Desai said, "I'm here to talk about humans and lack of humanity they have and not about cats or dogs. When you can brutally hurt an animal why can't you extend the same towards criminals who abuse women, girls and harass their wives. You always promise big things but deliver less. You should be ashamed to be even called humans."  She showcased her frustration at high pitch and got highly emotional in anger further speaking about the issues. Animal cruelty has been the biggest topic of discussion for a long time but taking one video and making such big controversy seems a bit too much. But the issues raised by them needs to be thought about dearly.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  పిల్లలను పెంచడం అనేది బాధ్యతాయుతమైన,  కష్టమైన పని. తల్లిదండ్రుల ప్రతి మాట పిల్లల జీవితంపై గాఢమైన ప్రభావాన్ని చూపుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును  మెరుగ్గా ఉంచడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు. తల్లిదండ్రులుగా మారడం ఖచ్చితంగా ఒక ఆహ్లాదకరమైన అనుభూతి, కానీ తల్లిదండ్రులుగా సమర్థవంతమైన బాధ్యత కత్తిమీద సాము వంటిదనే చెప్పవచ్చు.  ప్రస్తుత కాలంలో పెంపకం కూడా చాలా మారిపోయింది. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. దీనివల్ల సమయం లేకపోవడంతో పాటు అనేక ఇతర సమస్యలు తల్లిదండ్రులకు  ఇబ్బందిగా మారుతున్నాయి. తమ పిల్లలకు మంచి పెంపకాన్ని అందించాలంటే డబ్బు బాగా సంపాదించాలని  తల్లిదండ్రులు  పగలు రాత్రి కష్టపడి పనిచేస్తారు.    విద్య, మంచి బట్టలు,  ఖరీదైన వస్తువులు ఇస్తారు.  అయితే, ఇవన్నీ ఉన్నప్పటికీ చాలా సార్లు పిల్లలు తమ తల్లిదండ్రుల నుండి దూరం అవుతుంటారు. పిల్లలను వారి తల్లిదండ్రుల నుండి దూరం చేసే తల్లిదండ్రుల 3 తప్పులు ఉన్నాయి.  అవేంటంటే..   రిజెక్ట్ చేయడం.. ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు తమ మాట ఏ విధంగానూ వినడం లేదని ఆందోళన చెందుతుంటారు.   ఈ కారణంగా తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య గొడవలు అవుతుంటాయి. దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రులు,  పిల్లల మధ్య సరైన వాతావరణం  లేకపోవడం. తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లలు చెప్పే ప్రతిదాన్ని పట్టించుకోకపోవడం లేదా పిల్లలు చెప్పిన దాన్ని వ్యతిరేకించడం, రిజెక్ట్ చేయడం చేస్తారు.దీని కారణంగా  పిల్లలు కూడా తల్లిదండ్రులతో అదే విధంగా ప్రవర్తిస్తారు.ఈ సమస్య పోవాలంటే పిల్లలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. కూర్చుని పిల్లలతో మాట్లాడాలి. సమయం.. నేటికాలం  తల్లిదండ్రులు ఇద్దరూ తమ పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలని  డబ్బు సంపాదనలో మునిగిపోతున్నారు.  దీని కారణంగా వారికి పని ఒత్తిడి పెరుగుతుంది.   పగలు మరియు రాత్రి పనిపై దృష్టి పెట్టడం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్నారు. దీని కారణంగా పిల్లలు ఒంటరితనం ఫీలవుతారు.  తల్లిదండ్రులు  పిల్లల మధ్య దూరం పెరగడానికి ఇదే కారణం. పోలిక..  తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చుతారు. చదువు అయినా, ఆటలు అయినా, ప్రతి చిన్న విషయానికి  పిల్లలను ఇతరులతో పోల్చడం వల్ల వారి మనస్సులలో న్యూనతా భావన ఏర్పడుతుంది. దీని కారణంగా, పిల్లలు తల్లిదండ్రులపై కోపంగా ఉండి, వారికి దూరంగా ఉండటం మొదలుపెడతారు. తమ తల్లిదండ్రులను శత్రువులుగా భావిస్తారు.                                     *రూపశ్రీ.
ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త.. ఆయన 2వేల సంవత్సరాల కిందట చెప్పిన మాటలు నేటికీ అనుసరణీయంగా ఉన్నాయి. ఆయన గొప్ప తత్వవేత్త, జీవితం గురించి ఎన్నో సత్యాలు చెప్పాడు. ముఖ్యంగా మనిషి వ్యక్తిత్వం గురించి, మనిషి ఎలా  ఉండాలనే విషయాల గురించి ఆయన చెప్పిన విధానాలు ఎన్ని తరాలు మారినా ప్రతి ఒక్కరూ అనుసరించేలా ఉన్నాయి. ఎవరైనా సరే.. సక్సెస్ ఫుల్ లైఫ్ ను గడపాలని అనుకున్నా,  జీవితంలో గొప్పగా ఎదగాలన్నా చాణక్యుడు చెప్పిన సూత్రాలు పాటిస్తే చాలు.. వారు విజేతలు కావడాన్ని ఎవరూ అడ్డుకోలేరు. అలాగే వ్యక్తి జీవితంలో శాంతి లేకపోవడానికి కొన్ని కారణాలను కూడా పంచుకున్నాడు చాణక్యుడు. వ్యక్తి చేసే కొన్ని తప్పులే వారి జీవితంలో శాంతి కోల్పోయేలా చేస్తాయట.  వాటి గురించి తెలుసుకుంటే.. ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం.. ఇంట్లో పూజలు చేయకపోవడం, దేవుని నామాన్ని స్మరించకపోవడం జరిగే ఇళ్లలో ప్రజలు ఎప్పుడూ ఇబ్బందుల్లో ఉంటారట. అలాంటి ఇళ్లలో నివసించే ప్రజలు  సంతోషంగా ఉండరట.  పైగా  ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటారట.ఇలాంటి ఇళ్లలో నివసించే వారి జీవితాలు రోజు రోజుకూ దిగజారి పోతుంటాయట. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే లేదా అగౌరవపరిచే వ్యక్తి ఎప్పటికీ సంతోషంగా జీవించలేడట. అలా చేసిన ప్రతిసారీ జీవితంలో ఎదుగుదలకు ఆటంకం కలుగుతుందట. మహిళలను గౌరవించని కుటుంబాలు ఎప్పటికీ అభివృద్ధి చెందవని చాణక్యుడు స్పష్టంగా  చెప్పాడు. ఎందుకంటే లక్ష్మీ దేవి అలాంటి ఇళ్లలో ఎప్పుడూ నివసించదని కూడా స్పష్టంగా చెప్పాడు. పెద్దలు,  పిల్లలతో దుర్భాషలాడే ఇళ్లలో ఎల్లప్పుడూ అశాంతి నెలకొనే ఉంటుంది. అలాంటి ఇళ్లలో ధనం నిలవదు,  తరచుగా ఆర్థిక సంక్షోభాలు ఎదురవుతూ ఉంటాయట. పైగా ఇలాంటి ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందట. ఇతరుల సంపదపై  దృష్టి పెట్టేవారి జీవితంలో ఎప్పటికీ శాంతి ఉండదట.  ఇతరుల సంపదను ముట్టుకోవడం అనేది పాముతో సమానం. అందుకే పరుల సొమ్ము పాము వంటిది అన్నారు అని చాణక్యుడు చెబుతాడు. పైన చెప్పుకున్నవన్నీ వ్యక్తి జీవితంలో శాంతి లేకపోవడానికి కారణం అవుతుంది.  అందుకే శాంతి కోరుకునే వారు వాటికి దూరంగా ఉండటం మంచిది.                                *రూపశ్రీ.  
వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కీలకం. వివాహ వయస్సు కాలక్రమేణా పెరుగుతోంది. చదువు పూర్తయిన తర్వాత అబ్బాయి అయినా  అమ్మాయి అయినా  కెరీర్‌లో స్థిరపడిన సెటిల్ అయిన తర్వాత  మాత్రమే వివాహం చేసుకోవాలనుకుంటారు. అబ్బాయిలు ఆలస్యంగా వివాహం చేసుకోవడం పెద్దగా సమస్య కాదు, కానీ పెద్ద వయసులో అమ్మాయిలకు మంచి సంబందాలు రావడం లేదన్నది ఒప్పుకోవాల్సిన నిజం.  అమ్మాయిలకు వివాహానికి సరైన వయస్సు ఏమిటి అనే  విషయంపై సరైన స్పష్టత ఎక్కడా లేదు. అబ్బాయిల మాదిరిగానే అమ్మాయిలు కూడా మొదట తమ కెరీర్‌ను నిర్మించుకోవాలని, ఆ తర్వాత వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నారు. కానీ 30ఏళ్ల  తర్వాత ఆడపిల్లల తల్లిదండ్రులకు పెద్ద సవాల్ ఎదురవుతోంది. దీనిగురించి రెలేషన్షపి నిపుణులు చెబుతున్న విషయాలు ఏంటో తెలుసుకుంటే.. కెరీర్ అడ్డంకి.. గతంలో ఆడపిల్లల చదువు, కెరీర్ కు ఇంత ప్రాముఖ్యత లేదు.  టెంత్,  ఇంటర్,  డిగ్ర లాంటివి పూర్తవ్వగానే ఆడపిల్లలకు పెళ్ళి చేసేవారు. పెళ్లి తర్వాత మహిళలు కూడా ఇంటిని,  భర్త,  పిల్లలు, అత్తమామలను చూసుకుంటూ ఉండే వారు. కానీ నేటికాలంలో అలా లేదు.. తల్లిదండ్రులు ఆడపిల్లలను కూడా కొడుకులతో సమానంగా చదివిస్తున్నారు. ఆడపిల్లలు తమ కెరీర్ ను అద్బుతంగా మలుచుకోవడంలో సపోర్ట్ చేస్తున్నారు. దీని వల్ల ఆడపిల్లలు కూడా తమ కెరీర్ ను బిల్డ్ చేసుకుని సెటిల్ కావడానికి సమయం పడుతోంది.  అది కాస్తా 30 ఏళ్ల వరకు వివాహానికి దూరం ఉండేలా చేస్తోంది. ఇదే తల్లిదండ్రులకు పెద్ద సవాల్ గా మారుతోంది.  ఆర్థిక స్వాతంత్ర్యం సంపాదించిన కూతురికి పెళ్లి చేయడం చాలా కష్టతరంగా మారింది. అబ్బాయిలకు కాస్త బెటర్.. అమ్మాయిల మాదిరిగానే పెద్ద వయసు అబ్బాయిలకు  కూడా వివాహం చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే అబ్బాయి బాగా సంపాదిస్తే చిన్న వయసు అమ్మాయిల నుండి సంబంధాలు వస్తుంటాయి.  తల్లిదండ్రులు  తమ కూతురికి  ఆర్థిక భద్రత కల్పించే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటారు. అయితే అమ్మాయిల విషయంలో అలా కాదు. ఒక అమ్మాయి ఎంత సంపాదించినా, ఆమె పెద్దది అయితే మంచి జత దొరకడం కష్టంగా ఉంటుంది. అబ్బాయిలు ఆశించడమే పెద్ద సమస్య.. కాలం ఎంత మారినా అది మగవారి ఆలోచనలు మార్చలేకపోతోంది.  మగవాళ్లకు తమ భార్యల పట్ల ఉన్న అవగాహన పెద్దగా మారలేదు. చాలా మంది మగవాళ్లు ఎక్కువగా ఆశిస్తున్నారనే మాట చాలా నిజం.  భార్య అటు ఉద్యోగం చేసి సంపాదించాలి,  అలాగే ఇటు ఇంటికి రాగానే ఇంటి పనులు అన్నీ ఆమె చేసి భర్తకు సేవలు చేస్తూ పిల్లలను కూడా చూసుకోవాలని కోరుకుంటారు.  చాలా సార్లు తమ తల్లితో భార్యను పోలుస్తారు,  వస్త్రధారణ నుండి అమ్మాయి పరిచయాల వరకు, స్నేహితులు, వ్యక్తిగత స్పేస్ వంటి విషయాలలో కూడా ఆబ్బాయిలు అమ్మాయిలను చికాకు పెడతారు. ఇలాంటివి అమ్మాయిలకు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఇవి కాస్తా వైవాహిక జీవితంలో అడ్డంకులకు కారణం అవుతున్నాయి. అమ్మాయిల వయసు పెరిగితే ఇదే సమస్య.. 30ఏళ్ళ తర్వాత అమ్మాయిలకు వివాహం విషయంలో ఎదురయ్యే అతి పెద్ద సమస్య అమ్మాయి సంతానోత్పత్తి ఆమె వయస్సుతో ముడి పడి  ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ అమ్మాయి సంతానోత్పత్తి తగ్గుతుంది. అమ్మాయి పెద్దదైతే ఆ జంట పిల్లల కోసం ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి. ఇది వైవాహిక జీవితాన్ని సరిగ్గా ఆస్వాదించకుండా చేస్తుంది. నేటి కాలంలో అమ్మాయిలు ఆర్థిక విషయం నుండి చాలా వరకు స్వతంత్రత కలిగి ఉన్నారు.  తన సొంత ఆలోచన ఉంటుంది. ఆమె తన భర్త లేదా కుటుంబం చెప్పే ప్రతిదానితో ఏకీభవించలేదు. ఆమె తన సొంత ఆలోచనకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఇదే భార్యభర్తల మధ్య సమస్యలు సృష్టిస్తోంది. సరైన వయసు.. మేజర్ అయితే చాలు అమ్మాయిలు, అబ్బాయిలు వివాహానికి అర్హత పొందుతారు. కానీ వివాహానికి  సరైన వయసు అనేది వ్యక్తిగతంగా ఉంటుంది.  అమ్మాయిలు కెరీర్ ను సీరియస్ గా తీసుకోవడం వివాహానికి ఇబ్బంది కలిగించే విషయమే అయినప్పటికీ చాలా మంది మహిళలు తమ కెరీర్ ను తొందరగా సెటిల్ చేసుకుని సరైన జోడి వెతుక్కుని హాయిగా సెటిల్ అవుతున్నారు.  అంటే.. వివాహం విషయంలో అబ్బాయిల  ఆలోచన కూడా ముఖ్యం.  వారు కూడా మారితేనే భార్యాభర్తల వైవాహిక జీవితం బాగుంటుంది.                           *రూపశ్రీ.  
సీజన్ ను బట్టి లభించే పండ్లు చాలా ఉంటాయి.  అలాంటి వాటిలో రేగు పళ్లు చాలా ముఖ్యమైనవి.  అయితే రేగు పళ్లను  ఎవరు తిన్నా ఏం పర్వాలేదు అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. కొందరు వ్యక్తులు  రేగు పళ్లను తినకూడదట.  అసలు రేగు పళ్లను ఎవరు తినకూడదు? దీనికి గల కారణాలు ఏంటి? రేగు పళ్లను తినడం వల్ల ఎవరికి సమస్యలు ఉంటాయి? వివరంగా తెలుసుకుంటే.. సీజన్ ను బట్టి వివిధ రకాల పండ్లు అందుబాటులోకి వస్తుంటాయి.  ఆరోగ్యం బాగుండాటంటే సీజన్ లో దొరికే పండ్లు తీసుకోవడం మంచిదని అంటుంటారు వైద్యులు, పెద్దలు. శీతాకాలంలో లభించేవి రేగు పళ్లు. చాలామంది రేగుపళ్లను చాలా ఉత్సాహంగా తింటారు.  ఇవన్నీ చిన్నతనంతో ముడిపడిన ఆనందాలు. కొంతమందికి మాత్రం రేగు పళ్లు తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంది. ఎవరు తినకూడదంటే.. మధుమేహం ఉన్నవారు రేగు పండ్లకు దూరంగా ఉండాలి. బాగా పండిన రేగు పండ్లలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర శాతాన్ని పెంచుతాయి. కేవలం చక్కెర స్థాయులు ఎక్కువగా ఉండటమే కాకుండా వాటిలో కార్బోహేడ్రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి.  ఈ కారణంగా రేగు పండ్లు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. రేగు పండ్లలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.  అప్పటికే గ్యాస్,  ఎసిడిటీ,  అజీర్తి మొదలైన సమస్యలు ఉన్నవారు రేగు పండ్లను తింటే సమస్య మరింత పెరుగుతుంది. గర్బిణీ స్త్రీలు రేగు పండ్లకు దూరంగా ఉండాలి.   రేగు పండ్లు తినడం వల్ల వారికి కడుపులో సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.  అలాగే మలబద్దకం లాంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. కొంతమందికి రేగు పండ్లు తింటే అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది.  దద్దుర్లు,  దురద వంటి సమస్యలు వస్తాయి.  అలర్జీ సమస్యలు ఉన్నవారు రేగు పండ్లకు దూరంగా ఉండటం మంచిది.                                   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...    
భారతీయుల ఆహారంలో నువ్వులు,  పల్లీలు, బెల్లం చాలా ప్రముఖమైనవి.  ఇవి లేని బారతీయ ఆహారాన్ని అస్సలు ఊహించలేరు కూడా.  అయితే నువ్వులు, పల్లీలు,బెల్లాన్ని సూపర్ ఫుడ్స్ అని కూడా అంటారు.  పోషకాహార నిపుణులు ఈ ఆహారాలను తప్పనిసరిగా తీసుకోమని తమ పేషెంట్లకు సిఫారసు చేస్తారు కూడా. ప్రాంతాలను బట్టి వీటిని విభిన్న రకాలుగా ఆహారం తయారీలో వాడుతుంటారు. సాంప్రదాయ వంటకాలు ఇవి లేకుండా అసంపూర్ణంగా ఉంటాయి.  అయితే వీటిని సూపర్ ఫుడ్స్ అని ఎందుకు పిలుస్తారు? ఇలా పిలవడం వెనుక ఉన్న కారణం ఏంటి? తెలుసుకుంటే.. నువ్వులు,  వేరుశెనగల్లో ప్రోటీన్, విటమిన్లు,  ఒమేగా 6 వంటి పోషకాలు ఉంటాయి.ఇక బెల్లం ఐరన్, మెగ్నీషియం,  కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలను కలిగి ఉంటుంది. ఈ మూడు సూపర్‌ఫుడ్‌లు వేడెక్కించే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అందుకే వీటిని శీతాకాలపు సూపర్‌ఫుడ్‌లు అని కూడా పిలుస్తారు. వాటి పోషక విలువలు వాటిని మరింత ప్రత్యేకంగా చేస్తాయి. బెల్లంలో పోషక విలువలు.. బెల్లంలో సుక్రోజ్,  ఫ్రక్టోజ్ రూపంలో చక్కెరలు ఉంటాయి. అందువల్ల ఇది తీపి రుచిని కలిగి ఉంటుంది, తక్షణ శక్తిని అందిస్తుంది. బెల్లంలో ముఖ్యమైన విటమిన్లు A, C,  E ఉంటాయి. ఇందులో ఐరన్ తో  సహా అనేక ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉన్నాయి. బెల్లం తింటే కలిగే ప్రయోజనాలు.. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది, కాలేయం,  రక్తం శుద్ది జరుగుతుంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయి. మలబద్ధకం సమస్య తగ్గుతుంది.  మానసిక, శారీరక ఒత్తిడి తగ్గుతుంది. ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. రక్తహీనత ప్రమాదం తగ్గుతుంది.  చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.  శరీరానికి మంచి ఎనర్జీ లభిస్తుంది. నువ్వుల పోషక విలువలు.. నువ్వులలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్,  పొటాషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. వాటిలో విటమిన్ B6 కూడా ఉంటుంది. నువ్వులు తింటే కలిగే ప్రయోజనాలు.. ఎముకలు దృఢంగా మారుతాయి, వాపు తగ్గుతుంది.  ఆర్థరైటిస్ నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణ ఆరోగ్యం బాగుంటుంది.  మెనోపాజ్ సమయంలో హార్మోన్లను బాలెన్స్డ్ గా ఉంచడంలో సహాయపడుతుంది. థైరాయిడ్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రక్తహీనత ప్రమాదం తగ్గుతుంది,  రక్తపోటు అదుపులో ఉంటుంది.  రక్తంలో చక్కెర స్థాయిలు  నియంత్రణలో ఉంటాయి.  కొలెస్ట్రాల్,  ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి. వేరుశనగ పోషక విలువలు.. వేరుశెనగల్లో ప్రోటీన్,  కొవ్వుతో సహా అనేక ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. వాటిలో అనేక ముఖ్యమైన విటమిన్లు,  ఖనిజాలు కూడా ఉంటాయి. వేరుశనగ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వాపు తగ్గుతుంది. డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.  క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది,  కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది,  పిత్తాశయంలో రాళ్ల ప్రమాదం తగ్గుతుంది. వేరుశనగ రెగ్యులర్ గా తింటే  జీవితకాలం పెరుగుతుంది.  మెదడు పనితీరు మెరుగుపడుతుంది.  కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ కారణాల వల్లనే ఈ మూడు ఆహారాలను సూపర్ ఫుడ్స్ అని అంటారు. మరీ ముఖ్యంగా శీతాకాలం సూపర్ ఫుడ్స్ అని అంటారు.      *రూపశ్రీ.     గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...                          
ఏ జబ్బు వచ్చినా దాన్ని నయం చేయడానికి మందులు చాలా అవసరం. మందులను సరైన సమయంలో తీసుకోవాలి.  అలాగే వైద్యుల సలహా లేకుండా మందులు వాడటం అస్సలు మంచిది కాదు.  అయితే  కొన్ని మందులను డాక్టర్ల సలహా లేకుండా ఎలాంటి సంకోచం లేకుండా ఎక్కువ కాలం పాటు సమస్య అనిపించినప్పుడల్లా వాడుతూనే ఉంటారు. మరీ ముఖ్యంగా ఎక్కువకాలం పాటు మధుమేహం,  గ్యాస్ సమస్యలకు మందులు వాడుతూనే ఉంటారు. ఈ మందుల వాడకం వల్ల విటమిన్ లోపాలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అందులోనూ విటమిన్-బి12 చాలా అరుదుగా లభించే విటమిన్.  ఈ విటమిన్-12 విటమిన్ డయాబెటిస్,  అసిడిటి మందుల వాడకం వల్ల తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. డాక్టర్ దగ్గరకు వెళ్లి వైద్యుల వద్ద రెగ్యులర్ గా చెకప్ చేయించుకునే అలవాటు భారతదేశంలో చాలా తక్కువ. మరీ ముఖ్యంగా గ్యాస్ సంబంధిత సమస్యలు,  డయాబెటిస్ వంటి   సమస్యలకు ఎక్కువ సార్లు వైద్యులను కలవాల్సిన అవసరం లేదని అనుకుంటారు.  ఈ సమస్యలు ఉన్నప్పుడు ఒకసారి వైద్యులను కలిస్తే వారు రాసిచ్చిన మందులను అలా జీవితాంతం అయినా మింగుతూ సమస్యను నిద్రపుచ్చే ఆలోచనలో ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ఈ మందులను డాక్టర్ ను కలిసిన ప్రతి సారి డోస్ తగ్గించడం, ఎక్కించడం జరుగుతుంది.  ఇది తెలియకుండా ఒకే డోస్ ను దీర్ఘకాలం వాడటం విటమిన్ స్థాయిల మీద ప్రమాదం చూపిస్తుంది.  గ్యాస్, డయాబెటిస్ కు సంబంధించిన మందులను సంవత్సరాల తరబడి డాక్టర్ సలహా లేకుండా రెగ్యులర్ గా వాడుతూ ఉంటే అది శరీరంలో విటమిన్-బి12 లోపానికి కారణం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు ఇవే.. అలసట,  తలతిరుగుడు,  తిమ్మిరి, చేతులు కాళ్లలో జలదరింపు వంటి సమస్యలు విటమిన్-బి12 లోపిస్తే వస్తాయి. మెట్లు ఎక్కడం కష్టంగా అనిపించడం,  మతిమరుపు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. విటమిన్-బి12 ఎంత ఉండాలి.. నేషనవ్ ఇన్స్టిట్యూట్ ఆప్ హెల్త్ ప్రకారం సీరం,  ప్లాస్మా లో విటమిన్-బి12 స్థాయిలు 200 లేదా 250pg/ml కంటే తక్కువగా ఉంటే ల్యాబ్ రిపోర్ట్ లలో అది చాలా తక్కువగా ఉన్నట్టు.  ఇది విటమిన్-బి12 లోపాన్ని సూచిస్తుంది. గ్యాస్, డయాబెటిస్ మందులను ఎక్కవ కాలం వాడటం వల్ల పేగులలో  విటమిన్-12 శోషణ దెబ్బతింటుంది. అలాగే కడుపు ఆమ్లాన్ని కూడా తగ్గిస్తుంది. దీని వల్ల   ఆహారం నుండి ప్రోటీన్ విడుదల జరగదు.  అందుకే గ్యాస్, డయాబెటిస్ మందులను ఎక్కువ కాలం డాక్టర్ సలహా లేకుండా వాడటం మంచిది కాదని అంటున్నారు.                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...