LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒంగోలు నియోజకవర్గం ఎప్పుడూ కీలకంగానే ఉంటుంది. 2024 ఎన్నికల అనంతరం వైసీపీని వీడి  జనసేన  గూటికి చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది.  ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.  ఇటీవల  టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ను లక్ష్యంగా చేసుకుని బాలినేని శ్రీనివాసరెడ్డి  మీడియా సమావేశంలో చేసిన విమర్శలు, ఆరోపణలు తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య దాదాపు చిచ్చు పెట్టినంత పని చేశాయి.  అయితే సకాలంలో తెలుగుదేశం, జనసేన అధినాయకత్వాలు జోక్యం చేసుకుని దామచర్ల, బాలినేనిలను గట్టిగా హెచ్చరించడంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే బాలినేని వ్యాఖ్యలు, విమర్శల పట్ల మాత్రం ఇరు పార్టీలలోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. వ్యక్తిగత విభేదాలు,  పాత తగాదాల లేక్క తేల్చచుకునేందుకు బాలినేని  జనసేనను   వాడుకుంటున్నారన్న విమర్శలు ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ కూడా వెల్లువెత్తాయి.  పరిస్థితిని అర్ధం చేసుకున్న జనసేనాని పవన్ కల్యాణ్.. దిద్దుబాటు చర్యలు చేపట్టారు.  ఇటీవల జనసేన పార్టీ ప్రకటించిన స్థానిక సంస్థల ఎన్నికల కమిటీలో బాలినేనికి స్థానం దక్కలేదు. బాలినేని వంటి సీనియర్ నాయకుడికి   స్థానిక ఎన్నికల బాధ్యతల్లో ప్రాతినిధ్యం ఇవ్వకపోవడాన్ని బట్టి జనసేనాని బాలినేనిని దూరం పెట్టారని అవగతమౌతోందంటున్నారు పరిశీలకులు.  అలాగే  ఒంగోలులో ఎంతో ఘనంగా నిర్వహించిన జనసేన  ఆత్మీయ సమావేశానికి బాలినేని గైర్హాజరు కూడా బాలినేనికి జనసేనలో ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోందంటున్నారు.  అంతే కాదు.. ఒంగొలులో జరిగిన జనసేన ఆత్మీయ సమావేశానికి బాలినేని గైర్హాజర్ కాలేదనీ, ఆయనను ఆ సమావేశానికి పార్టీ అధిష్ఠానం ఆహ్వానించలేదనీ, అందుకే ఆయన దూరంగా ఉన్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతున్నది. మొత్తం మీద ప్రకాశం జిల్లాలో, ఒంగోలులో బాలినేనికి జనసేనలో ప్రాధాన్యత తగ్గిందనీ, పార్టీ కార్యక్రమాలకు ఆయనను దూరం పెడుతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  బాలినేని తీరును, పార్టీ కార్యకర్తల, స్థానిక నేతల అభిప్రాయాలనూ, అలాగే మిత్రపక్షమైన తెలుగుదేశం అభిప్రాయాలనూ పరిగణనలోనికి తీసుకున్న జనసేనాని పవన్ కల్యాణ్.. పార్టీలో బాలినేని ప్రభావాన్ని,  జోక్యాన్ని తగ్గించారని అంటున్నారు.  పొత్తు ధర్మానికి విఘాతం కలగకుండా ఉండాలన్నా, పార్టీ అంతర్గత క్రమశిక్షణ దెబ్బతినకుండా ఉండాలన్నాబాలినేనిని పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టడమే మేలని, జనసేనాని అదే చేస్తున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  పవన్ కళ్యాణ్  కూటమి ఐక్యత దెబ్బతినకుండా ఉండటానికీ, అలాగే ప్రకాశం జిల్లాలో జనసైనికులలో కొత్త జోష్ నింపడానికి బాలినేనికి పార్టీలో ప్రాధాన్యత లేకుండా చర్యలు తీసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   [Balineni Srinivasa Reddy Imoprtance Diminished, Pawan Kalyan, Janasena Party, Ongole Politics, TDP Janasena Alliance, Telugu One]
  భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ప్రొరోగ్ చేయకుండా కొనసాగించడం, రాబోయే రోజుల్లో ఏ విధమైన బిల్లులను ప్రవేశపెడుతుందనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానికి లేఖ రాస్తూ, మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ మద్దతు ఉంటుందని, కానీ డీలిమిటేషన్‌ను రాబోయే 25 ఏళ్ల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఈ రెండు అంశాలను ముడిపెట్టడం వెనుక ఉన్న రాజకీయ వ్యూహాలు దక్షిణాది రాష్ట్రాలపై దీని ప్రభావం చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశంపై టోన్ న్యూస్ ప్రత్యేక చర్చ నిర్వహించారు. రాజ్యాంగ రీత్యా వ్యూహం రాజకీయ పరిణామాలు ప్రస్తుతం పార్లమెంట్ స్థానాల పెంపునకు సంబంధించి జనాభా ప్రాతిపదికన నిర్ణయం తీసుకుంటే, అది ఉత్తరాది రాష్ట్రాలకు తీవ్రమైన ప్రయోజనం చేకూరుస్తుందనే అభిప్రాయం బలపడుతోంది. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సమీకరణాల మార్పు.. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుల ద్వారా ఉభయ సభల్లోనూ మెజారిటీ నిరూపించుకునే వ్యూహంతో అడుగులు వేస్తోంది.  అయితే, ప్రాంతీయ పార్టీల వైఖరి, ముఖ్యంగా డిఎంకే  తృణమూల్ కాంగ్రెస్ మూడ్ మారడం వంటి పరిణామాలు అధికార పక్షానికి సవాలుగా మారాయి. ప్రతిపక్షాల ప్రతివ్యూహం.. మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం ఒక విభాజక వ్యూహమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మహిళా బిల్లును తక్షణమే అమల్లోకి తెచ్చి, సీట్ల పెంపు ప్రక్రియను సగానికి సగం విభజించేలా (ఉత్తరాది మరియు దక్షిణాదికి సమంగా) మార్పులు చేయాలని కోరుతోంది. రాజకీయ భయాలు & సంకోచాలు.. రాబోయే ఉత్తర ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై చూపించే ప్రభావం దృష్ట్యా, మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా అచితూచి అడుగులు వేస్తోంది.  ప్రధాని మోదీపై వ్యతిరేక స్వారాలు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు కూడా కేంద్రంలో కొత్త భయాలను సృష్టిస్తున్నాయి. భవిష్యత్ రాజకీయ ప్రభావంరాబోయే రోజుల్లో డీలిమిటేషన్ ప్రక్రియ రాజకీయంగా అత్యంత సున్నితమైన అంశంగా మారనుంది. జనాభా ఆధారిత విభజన అమలైతే, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం పెరిగి, దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కబడుతుందనే భావన మరింత బలపడుతుంది. ఇది సమఖ్య వ్యవస్థకే పెద్ద సవాలుగా మారే ప్రమాదం ఉంది.ఈ రాజకీయ సందిగ్ధత మరింత తీవ్రమైతే, జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతకు డీలిమిటేషన్ ప్రధాన అస్త్రంగా మారుతుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని కాపాడుకోవడానికి ఏకతాటిపైకి వస్తే, కేంద్ర ప్రభుత్వానికి చట్టసభల్లో నిర్ణయాలు తీసుకోవడం సంక్లిష్టంగా మారనుంది.       Delimitation Commission, South India Lok Sabha Seats, Women Reservation Bill, Mallikarjun Kharge Letter, Narendra Modi, North vs South Politics, Parliament Seats Expansion, Indian Political Analysis, Delimitation Impact Telugu, Indian Federation Issues, Telugu One, Telugu news
  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీకి కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు ముమ్మరం చేస్తున్న తరుణంలో, రాష్ట్ర రాజకీయాలకు కేంద్రబిందువుగా హస్తిన మారింది. ప్రధానంగా రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హుటాహుటిన ఢిల్లీకి చేరుకోవడం తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ఊహించని ఉత్కంఠను రేకెత్తిస్తోంది. 2026 సెప్టెంబర్ 1 మంగళవారం నాడు తెలంగాణకు చెందిన కీలక నేతలంతా వరుసపెట్టి ఢిల్లీ బాట పట్టడం వెనుక పలు ఆసక్తికర రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి. మంత్రి కొండా సురేఖతో పాటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు హస్తిన పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనల క్రమంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు రాష్ట్రంలో మంత్రుల మార్పులు, చేర్పులపై జరుగుతున్న ప్రచారానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ హఠాత్ పర్యటనకు ప్రధాన కారణాల్లో ఒకటి మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఇటీవల ఒక బహిరంగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా చేసిన సంచలన వ్యాఖ్యలేనని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఆ వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి వెళ్లడం, పార్టీ అగ్రనాయకత్వం ఈ పరిణామాన్ని తీవ్రంగా పరిగణించడంతో సురేఖను ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది.  సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకోవడంతో ఆమె అధిష్ఠానంతో మాట్లాడి పరిస్థితిని వివరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అపాయింట్‌మెంట్‌ను కొండా సురేఖ కోరగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో కీలక భేటీ ఖరారైనట్లు సమాచారం. ఈ భేటీలో కొండా సురేఖ భవిష్యత్తు మరియు కేబినెట్‌లో ఆమె కొనసాగింపుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. మరోవైపు తెలంగాణ కేబినెట్ విస్తరణ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో మంత్రి పదవుల ఆశావాహులు కూడా ఢిల్లీకి చేరుకుని లాబీయింగ్ తీవ్రతరం చేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఢిల్లీ చేరుకుని, గతంలో తనకు కేబినెట్ పదవి ఇస్తామని ఇచ్చిన హామీని అధిష్ఠానానికి గుర్తుచేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అలాగే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మల్లికార్జున ఖర్గేను కలసి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.  స్పీకర్ లాబీయింగ్ ప్రారంభించడంతో అలర్ట్ అయిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలో మంత్రి పదవిని ఆశిస్తూ హస్తినకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఢిల్లీలోనే ఉండి హైకమాండ్ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. సెప్టెంబర్ 1 సాయంత్రం జరగనున్న ఈ వరుస భేటీలు కొండా సురేఖ రాజకీయంపైనే కాకుండా తెలంగాణ మంత్రివర్గంలో రాబోయే కీలక మార్పులపై కూడా పూర్తి స్పష్టత ఇవ్వనున్నాయి.   Konda Surekha Delhi Visit, Telangana Cabinet Expansion, Revanth Reddy Congress, Telangana Political News, KC Venugopal Meeting, Telangana Congress Politics
వైసీపీ అంతర్గత వ్యవహారాలు, అగ్రనేతల మధ్య విభేదాలను  తెలుగుదేశం నాయకుడు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే  కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కన్ ఫర్మ్ చేశారు.   గతంలో వైసిపి ప్లీనరీ సమావేశాల వేదికగా వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే విజయసాయిరెడ్డి మధ్య జరిగిన గొడవలు వాస్తవమేనంటూ సంచలన విషయాలను వెల్లడించారు. అప్పట్లో వైసీపీలో ఉన్న కోటం రెడ్డి నాడు మంగళగిరిలో జరిగిన ప్లీనరీ సందర్భంగా వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు. తాజాగా మీడియా సమావేశంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి 2022 లో మంగళగిరి వేదికగా జరిగిన వైసీపీ ప్లీనరీలో జరిగిన విషయాలను పూసగుచ్చినట్లు చెప్పారు.    ప్లీనరీ సమావేశాల విశ్రాంతి గదిలో  సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి చొక్కా పట్టుకుని కొట్టారని చెప్పిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. తనకు విజయసాయిరెడ్డిపై ఎలాంటి ప్రేమా లేదంటూ.. అక్కడ  నిజంగా ఏంజరిగిందో  ప్రజలకు తెలియాలనే ఈ విషయాన్ని రివీల్ చేస్తున్నానని  పేర్కొన్నారు.  సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసిన విషయం పార్టీలోని ఎమ్మెల్యేలందరికీ తెలుసన్న ఆయన..  వైసీపీ అధినేత జగన్ కు కూడా  ఈ విషయానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసన్నారు.   అప్పట్లో విజయసాయి, సజ్జల మధ్య నడిచిన  ఆధిపత్య పోరుకు సంబంధించి రానున్న రోజులలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,  ఇక వైసిపి నాయకులు రాష్ట్రంలో అభివృద్ధి పనులపై చేస్తున్న ఆరోపణలను ఎద్దేవా చేస్తూ..  దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది కూడా జగన్ మోహన్ రెడ్డే  అంటూ ఆ క్రెడిట్ ను కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నించినా ఆశ్చర్యం లేదని సెటైర్లు వేశారు.   నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలపై మాట్లాడుతూ..  అక్టోబర్ 30 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తవు తాయన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి నిధులు తీసుకురావాలన్నసంకల్పంతో ఉన్నారనీ, వైసీపీయులే..   ఆటంకాలు సృష్టిస్తూ అడ్డుపడు తున్నారని విమర్శించారు. విశాఖపట్నం తరహాలోనే నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల కేసులోనూ కోర్టు నుంచి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.  [Kotamreddy Sridhar Reddy confirms vijaya sai allegation, Sajjala Ramakrishna Reddy Beat vijayasai, YCP Plenary Clashes, AP Politics, Telugu One]
తమిళనాట మిత్రపక్షాలుగా ఉన్న టీవీకే, కాంగ్రెస్ మధ్య విభేదాలకు, సంక్షోభానికీ కారణమైన ప్రధాని అభ్యర్థి వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. ఈ వివాదానికి స్వయంగా టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ ముగింపు పలికారు.  ఇటీవల ఇండియా టుడే,  సీఓటర్ సంయుక్తంగా  నిర్వహించిన  మూడ్ ఆఫ్ ద నేషన్  సర్వే దేశవ్యాప్తంగా  సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దేశంలో ఒకవేళ ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ప్రధానమంత్రిగా ఎవరిని ఎంచుకుంటారనే విషయంలో సర్వే ప్రకారం  ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తర్వాతి స్థానంలో   విజయ్ నిలిచారు. జాతీయ స్థాయి అగ్రనేతలను దాటుకుని విజయ్ కు దేశవ్యాప్తంగా జనం భారీగా మద్దతు ప్రకటించడం పొలిటికల్ సర్కిల్స్ ను విస్మయ పరిచింది.  అయితే..  ఈ సర్వే ఫలితాలు వెలువడిన వెంటనే తమిళనాడులో పొత్తులో ఉన్న కాంగ్రెస్,  టీవీకే మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రధాని రేసులో  విజయ్ ఉన్నారని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఆయన పరోక్షంగా సవాల్ చేస్తున్నారన్న ప్రచారం మొలైంది. టీవీకే కార్యకర్తలు కూడా సోషల్ మీడియా వేదికగా విజయ్ ను జాతీయ నేతగా ప్రాజెక్ట్ చేస్తూ, భావి  ప్రధాని అంటూ  డిజిటల్ క్యాంపెయిన్ ఆరంభించారు. దీంతో కాంగ్రెస్, టీవీకేల పొత్తుపై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. అయితే ఈ వివాదానికి తెర దించుతూ విజయ్ ఇండియా కూటమి ప్రదాని అభ్యర్థి రాహుల్ గాంధీయే అన్న స్పష్టత ఇచ్చారు.     ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.  కాంగ్రెస్ - టీవీకే మధ్య ఎలాంటి విభేదాలు లేవని, కూటమి పొత్తులు  దృఢంగా ఉన్నాయని స్పష్టం చేశారు.   [Vijay Clarity on PM Candidate, Tamilnadu Cm Vijay, Rahul Gandhi, TVK Congress Rift, Mood of the Nation Survey, PM Face INDIA Bloc, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
ప్రకృతి సౌందర్యానికి నిలయమైన జమ్మూకశ్మీర్ ఇప్పుడు ప్రపంచ సినిమా వేదికగా మారబోతోంది. సినీ నిర్మాణ రంగానికి, సాంస్కృతిక వైవిధ్యానికి వేదికగా నిలిచిన కశ్మీర్ లోయలో తొలిసారిగా అత్యంత భారీ స్థాయిలో 'అంతర్జాతీయ చలనచిత్రోత్సవం' (International Film Festival of Jammu and Kashmir) నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. జమ్మూకశ్మీర్ ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7 నుంచి 10 వరకు ఈ ప్రతిష్ఠాత్మక చలనచిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ చలనచిత్రోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం కశ్మీర్‌తో వెండితెరకు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని పునర్నిర్మించడమేనని నిర్వాహకులు తెలిపారు. స్థానిక ప్రతిభావంతులకు అవకాశాలు కల్పిస్తూనే, గ్లోబల్ సినిమా మ్యాప్‌లో కశ్మీర్‌కు తగిన గుర్తింపు తీసుకురావడం, పర్యాటకరంగాన్ని మరింత బలోపేతం చేయడం మరియు సృజనాత్మక సహకారానికి వేదికను కల్పించడమే ఈ ఉత్సవాల ముఖ్య లక్ష్యం. ఈ చిత్రోత్సవం కోసం ప్రత్యేకంగా ఐదుగురు సభ్యులతో కూడిన ఒక జ్యూరీ ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు సంతోష్ శివన్ ఈ జ్యూరీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఉత్సవంలో ప్రపంచవ్యాప్తంగా 41 దేశాల నుంచి ఎంపిక చేసిన 135 చిత్రాలను ప్రదర్శించనుండగా, అందులో 64 ఎంట్రీలు భారతదేశానికి చెందిన చిత్రాలు కావడం విశేషం. విజేతలకు ప్రోత్సాహకంగా నిర్మాతలు భారీ నగదు బహుమతులను ప్రకటించారు. మొత్తం తొమ్మిది విభాగాల్లో చిత్రాలను ఎంపిక చేసి రూ. 96 లక్షల నగదు పురస్కారాలను అందించనున్నారు. ఉత్తమ చలనచిత్రానికి రూ. 25 లక్షలు, ఉత్తమ దర్శకుడికి మరియు ఉత్తమ తొలి చిత్ర దర్శకుడికి తలా రూ. 15 లక్షలు బహుమతిగా ఇస్తారు. అంతేకాకుండా 'ఉత్తమ చిత్రం - జమ్మూకశ్మీర్ సెలెక్ట్' కేటగిరీ విజేతకు రూ. 10 లక్షలు లభించనున్నాయి. ఇక ఉత్తమ నటీనటులకు తలా రూ. 8 లక్షలు చొప్పున, ఉత్తమ ఛాయాగ్రాహకుడు, సౌండ్ డిజైనర్ మరియు ఎడిటర్‌లకు తలా రూ. 5 లక్షలు చొప్పున అందజేయనున్నారు. ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా ప్రసిద్ధ దాల్ లేక్ (Dal Lake) పైన ఫ్లోటింగ్ స్క్రీన్ ఏర్పాటు చేసి చిత్రాలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో కశ్మీర్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉందన్న సంగతి తెలిసిందే. దశాబ్దాలుగా అనేక ఐకానిక్ చిత్రాల చిత్రీకరణకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది ఈ అందాల లోయ. ఈ చిత్రోత్సవాల నిర్వహణతో గ్లోబల్ ఫిలిం మేకర్స్ చూపు మళ్లీ కశ్మీర్ వైపు మరలడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ చలనచిత్రోత్సవంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు, దర్శకులు మరియు నటీనటులు కశ్మీర్‌లో కొలువుదీరనుండటంతో టూరిజంతో పాటు స్థానిక సినీ రంగానికి సరికొత్త ఊపు రానుందని భావిస్తున్నారు.       [Jammu and Kashmir International Film Festival, Srinagar Dal Lake Floating Screen, Indian Cinema Updates, Santosh Sivan Jury, Film Festival J&K 2026]
నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస పాన్-ఇండియా ప్రాజెక్టులతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు. గ్లామరస్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ఎంతో ప్రాధాన్యమున్న వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'మైసా' రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ భారీ యాక్షన్ డ్రామాను 2026 నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఆఫీషియల్‌గా ప్రకటించారు. రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ పోస్టర్‌లో రష్మిక రక్తమోడుతున్న ముఖంతో, చేతిలో ఈటె పట్టుకుని అత్యంత రౌద్రంగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. తన కెరీర్‌లో నవంబర్ నెలకు ఒక ప్రత్యేక సెంటిమెంట్ ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతంలో ఆమె నటించిన భారీ ప్రాజెక్టులు, ముఖ్యంగా బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచిన కొన్ని చిత్రాలు ఇదే సమయంలో వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు 'మైసా' చిత్రాన్ని కూడా నవంబర్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషం. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే హిప్ గాయం నుంచి కోలుకున్న రష్మిక మందన్న, ఈ సినిమా కోసం ఎంతో శ్రమించినట్లు తెలిపారు. తన కెరీర్‌లోనే అత్యంత అగ్రెసివ్ మరియు ఎమోషనల్ యాక్షన్ రోల్ ఇది అని ఆమె పేర్కొన్నారు. గిరిజన నేపథ్యంలో సాగే కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రష్మిక ఒక వీరనారి తరహా పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'మైసా' రిలీజ్ పోస్టర్ తీవ్రంగా ట్రెండ్ అవుతోంది. రష్మిక మేకోవర్ చూసి నెటిజన్లు, అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక లేడీ ఓరియెంటెడ్ పాన్-ఇండియా మూవీకి ఈ స్థాయిలో వైలెంట్ మరియు ఇంటెన్స్ పోస్టర్ రావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. విజువల్ ఎఫెక్ట్స్ మరియు పోస్ట్-ప్రొడక్షన్ పనులను వేగవంతం చేస్తున్న మేకర్స్, త్వరలోనే టీజర్ మరియు సింగిల్స్ అప్‌డేట్స్‌తో అలరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ 27న థియేటర్లలోకి రాబోతున్న 'మైసా' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి.       [Rashmika Mandanna, Mysaa Release Date, Mysaa Movie Poster, Rashmika Mandanna Action Movie, Telugu Cinema Updates]
రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన దృశ్య కావ్యం 'కల్కి 2898 AD' బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైథలాజికల్ సోషియో ఫాంటసీ కథాంశంతో వచ్చి విమర్శకుల ప్రశంసలతో పాటు వేల కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు సీక్వెల్‌గా 'కల్కి 2' రాబోతోంది. అయితే, ఈ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ షూటింగ్ అప్‌డేట్‌పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లోనూ, నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫాంటసీ థ్రిల్లర్ 'ఐయామ్ గేమ్' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు నాగ్ అశ్విన్‌కు 'కల్కి 2' షూటింగ్ గురించి యాంకర్ సుమ నుండి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన ఎంతో చమత్కారంగా, నిజాయితీగా స్పందిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. 'కల్కి 2' సినిమాకు సంబంధించి ఇప్పటివరకు కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే పూర్తయిందని నాగ్ అశ్విన్ తెలిపారు. మళ్లీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనేది ప్రస్తుతం తనకు కూడా ఒక 'బర్నింగ్ క్వశ్చన్' అని నవ్వుతూ చెప్పారు. "గ్రహాలన్నీ ఒక వరుసలోకి వచ్చి ఓ రౌండ్ కూడా తిరిగేశాయి.. మళ్లీ అవన్నీ సరైన స్థానానికి వచ్చినప్పుడు షూటింగ్ ప్రారంభమవుతుంది" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టుల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారని, ఆయన డేట్స్ ఖాళీ అయ్యి ఫ్రీ అయిన వెంటనే 'కల్కి 2' చిత్రీకరణను సుదీర్ఘమైన షెడ్యూల్‌తో లాంగ్ స్ట్రెచ్‌లో పూర్తి చేస్తామని నాగ్ అశ్విన్ స్పష్టం చేశారు. అలాగే సెప్టెంబర్ 3న విడుదల కానున్న దుల్కర్ సల్మాన్ 'ఐయామ్ గేమ్' మూవీ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుందని, ప్రేక్షకులను ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుందని చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. గతంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్విని దత్ నిర్మాణంలో రూపొందిన 'కల్కి 2898 AD' పార్ట్ 1లో అబితాభ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె వంటి దిగ్గజ తారలు నటించి ప్రపంచస్థాయిలో తెలుగు సినిమా స్థాయిని పెంచారు. పార్ట్ 1 చివర్లో యాస్కిన్ వర్సెస్ కర్ణుడి పోరాటానికి దారితీసే లింక్ సీన్స్ ఉండటంతో, సీక్వెల్‌లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ మధ్య వచ్చే సన్నివేశాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇచ్చిన ఈ తాజా అప్‌డేట్‌తో ప్రభాస్ అభిమానులు కాస్త నిరాశ చెందినప్పటికీ, సీక్వెల్‌ను మరింత క్వాలిటీగా, పర్‌ఫెక్ట్‌గా తీర్చిదిద్దేందుకే సమయం తీసుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభాస్ తన ఇతర కమిట్‌మెంట్స్ పూర్తి చేసిన తర్వాతే 'కల్కి 2' సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు.       [Kalki 2, Nag Ashwin, Prabhas, Dulquer Salmaan, I am Game Pre Release Event]
  సుమలత అంబరీష్.. కన్నడ రాష్ట్ర కోడలుగా ఉన్నా కూడా తెలుగు ప్రేక్షకులు  మర్చిపోలేని విధంగా అద్భుతమైన సినిమాలు చేసిన అచ్చ తెలుగు నటి.  తాజాగా ఆమె  సోషల్ మీడియా వేదికగా టాక్సిక్ ని ఉద్దేశిస్తూ యశ్ కి మద్దతుగా నిలిచారు.  ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో  ‘టాక్సిక్’ చిత్రంలో యశ్ నటన అత్యంత అద్భుతంగా, మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఎప్పుడూ రొటీన్ మార్గాన్ని ఎంచుకోకుండా, కొత్త దారులని  వెతుక్కునే ధైర్యశాలి యశ్.  "ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి సాధించిన అపారమైన విజయం, ఆయన సాధిస్తున్న ఉన్నత ఎదుగుదల కొందరిలో తీవ్రమైన అసూయని  పెంచుతుంది" సమాజంలో యశ్ కు ఉన్న స్థాయిని చూసి ఓర్వలేక కొందరు కావాలనే టాక్సిక్ పై  దుష్ప్రచారానికి తెగబడుతున్నా రు. అయితే యశ్ ఇలాంటి చవకబారు కామెంట్లను ఏమాత్రం పట్టించుకోడు. ‘టాక్సిక్’ లాంటి విజువల్ వండర్ బహుశా తన కాలం కంటే చాలా ముందుకొచ్చిన చిత్రం కావచ్చని, లేదా కొందరు ఈ కథను, ఇందులో చూపించిన విధానాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక తప్పుగా అంచనా వేసి ఉండవచ్చు. ఇది కేవలం ఒక తాత్కాలిక అలజడి మాత్రమే. ప్రయోగం చేయడానికి వెనకాడని అసలైన నటుడు  యశ్ ఖచ్చితంగా  విమర్శలన్నింటినీ అధిగమించి మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడు.అని చెప్పడమే కాకుండా యష్ ని ఉద్దేశిస్తూ 'నువ్వు మళ్లీ బంతిని మైదానం బయటకు కొడతావు.. రాబోయే రోజుల్లో మరింత బలంగా, మహోన్నత శక్తిగా తిరిగి వస్తావు" అని చెప్పడం సౌత్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. Also read: సంచలనం నమోదు కాబోతుందా: పూణేలో పవన్ ఫ్యాన్స్  పరిస్థితి ఇదే!     [Toxic, Sumalatha, Trolls, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]      
  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ బేస్ తెలిసిందే.  సదరు ఫ్యాన్ బేస్ యొక్క ప్రకంపనలు వరల్డ్ వైడ్ గా 'వైఫె' లా తిరుగుతూనే ఉంటాయి. రేపు  పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రేపు పవన్ స్టైలిస్ట్ మూవీలో ఒకటైన 'పంజా'  4K వెర్షన్‌లో భారీ స్థాయిలో రీ రిలీజ్ కాబోతుంది. ఎప్పడు లేని విధంగా ఈ రోజు నైట్ ప్రీమియర్స్ కూడా పడబోతున్నాయి.  ఇంతవరకు బాగానే ఉంది.   కానీ మహారాష్ట్రలోని పూణే నగరంలో కూడా ఈ రోజు ప్రీమియర్ ప్రదర్శిస్తుండటం, టికెట్స్ అన్ని అయిపోవడం ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరుస్తుంది. పూణేలోని ప్రధాన థియేటర్ల వద్ద భారీ కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేసి, బాణాసంచా కాల్చుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఐటీ నిపుణులు, విద్యార్థులు పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుని థియేటర్లను హౌస్‌ఫుల్ చేస్తుండటంతో మహారాష్ట్ర బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో మరోసారి రుజువవుతోంది. దాదాపు 15 ఏళ్ల క్రితం నాటి సినిమా కూడా రీ-రిలీజ్ వేళ కొత్త సినిమాను తలపించేలా పూణే నగర వీధుల్లో మారుమోగిపోతుండటం పవర్ స్టార్‌కి ఉన్న తిరుగులేని మాస్ ఫాలోయింగ్‌కి  సజీవ నిదర్శనం  తెలుగు స్టేట్స్ లాగానే  రీ రిలీజ్ ఈ స్థాయిలో వేడుకలా మారడం కూడా నిజంగానే ఒక అరుదైన విషయం. Also Read: హీరో సూరికి ఘోర అవమానం: చొక్కా విప్పించి... ఏం చేసారంటే! మరి ఈ నేపథ్యంలో తొలి రోజు ఏ మేర కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి. 2011 డిసెంబర్ 9న కోలీవుడ్ దర్శకుడు విష్ణువర్ధన్ మేకింగ్‌లో 33 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా అప్పట్లోనే సరికొత్త స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ లుక్‌తో అభిమానులను అలరించింది. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ, దాదాపు 40 కోట్లకి  పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆంధ్ర, నైజాం ప్రాంతాల్లోనే  15.86 కోట్ల షేర్ రాబట్టగా, కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో  1.50 కోట్లు, ఓవర్సీస్‌లో  1.75 కోట్ల షేర్ నమోదు చేసింది. .    [Panjaa, Pune Fans, Pawan Kalyan,TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]    
యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి 'బేబీ' చిత్రంతో ఓవర్‌నైట్ స్టార్ హీరోయిన్‌గా మారిన వైష్ణవి చైతన్య టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన సహజసిద్ధమైన నటనతో యంగ్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు. ఆనంద్ దేవరకొండ సరసన ఆమె నటించిన కొత్త సినిమా 'ఎపిక్' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ప్రమోషన్లలో వైష్ణవి చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా జరిగిన ఒక ప్రత్యేక రాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన సరదా ప్రశ్నలకు వైష్ణవి ఏమాత్రం తడబడకుండా సమాధానాలు చెప్పారు. సిద్ధు జొన్నలగడ్డ, విరాజ్ అశ్విన్, ఆనంద్ దేవరకొండలలో ఎవరితో లవ్, ఎవరితో పెళ్లి, ఎవరికి బ్రేకప్ చెబుతారని అడగ్గా.. విరాజ్‌కు బ్రేకప్ చెప్తానని, సిద్ధు జొన్నలగడ్డతో లవ్ అని, ఆనంద్ దేవరకొండను మాత్రం పెళ్లి చేసుకుంటానని చమత్కారంగా జవాబిచ్చారు. దీంతో దేవరకొండ ఫ్యామిలీలోకి వైష్ణవి కోడలిగా వెళ్తుందా అంటూ నెటిజన్లు సరదా కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ఇక ఈ ఇంటర్వ్యూలో మరికొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు చాలా ఓపెన్‌గా, బోల్డ్‌గా సమాధానాలు ఇచ్చారు ఈ యంగ్ హీరోయిన్. లవ్ మ్యారేజ్ లేదా అరేంజ్డ్ మ్యారేజ్ అంటే పక్కాగా లవ్ మ్యారేజ్‌కే తన ప్రాధాన్యమని మనసులోని మాటను బయటపెట్టారు. మేకప్ కంటే వితౌట్ మేకప్‌తోనే ఉండటానికి ఇష్టపడతానని, డెలిషియస్ ఫుడ్ విషయంలో వెజ్ మరియు నాన్-వెజ్ రెండూ ఇష్టమేనని చెప్పారు. అలాగే ఐకానిక్ సినిమాలు 'బేబీ' లేదా 'అర్జున్ రెడ్డి'లలో ఏది క్రేజీ ఆప్షన్ అంటే.. తన కెరీర్‌ను మలుపు తిప్పి నటిగా నిలబెట్టిన 'బేబీ' చిత్రానికే తన ఓటు అని వైష్ణవి స్పష్టం చేశారు. ఫన్నీగా అడిగిన 'బెడ్‌రూమ్ లేదా బాల్కనీ' అనే ప్రశ్నకు ఏమాత్రం వెనకాడకుండా 'బాల్కనీ' అని నవ్వుతూ సమాధానమిచ్చి ఇంటర్వ్యూలో సందడి చేశారు. యూట్యూబ్ సిరీస్‌ల నుంచి వెండితెరకు పరిచయమై తొలి సినిమా 'బేబీ'తోనే బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టిన వైష్ణవి, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంటున్నారు. 'బేబీ' మూవీలో వైష్ణవి-ఆనంద్ దేవరకొండ కెమిస్ట్రీకి మంచి మార్కులు పడటంతో, వీరిద్దరి హిట్ కాంబోలో రాబోతున్న 'ఎపిక్' మూవీపై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ మంచి బజ్ నెలకొంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపుదిద్దుకున్న 'ఎపిక్' చిత్రం సెప్టెంబర్ 11న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకానుంది. ప్రమోషనల్ కంటెంట్, ఈ తరహా సరదా ఇంటర్వ్యూలతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. ప్రమోషన్లలో తనదైన చమత్కారంతో ఆకట్టుకున్న వైష్ణవి చైతన్య, రాబోయే 'ఎపిక్' సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరో మైలురాయిని అందుకుంటారో లేదో వేచి చూడాలి.     [Vaishnavi Chaitanya, Anand Deverakonda, Epic Movie Promotions, Siddu Jonnalagadda, Baby Movie Pair]
Yash's Toxic is ending up as a generational disaster in terms of Return on Investment for all parties involved. While Kannada Film Industry seems to be rallying in support of Yash and the film, box office returns have been growing disastrous with each passing day even in Karnataka.  Renowned producer - distributor Dil Raju released the film in Telugu States and he said to have committed to pay Rs.125 crores for the rights. Movie collections have been indescribably bad from second day and he is staring at huge losses. Dil Raju being the ace businessman, he asked for compensation from both Yash and KVN.  Venkata K. Narayana and Yash have produced the film and hence, the producer asked for Telugu distribution rights of Ramayana Part-1 from Yash. At the same time, he asked KVN to give him rights for Chiranjeevi's Kaaka, releasing for Sankranti. Yash is co-producing Ramayana with Namit Malhotra and he took South distribution rights for his investment or remuneration.  So, the industry buzz is that Dil Raju is looking to lock these two deals at the earliest as compensation for his losses from Toxic. On the other hand, Yash is in a sort of depression looking at such unprecedented negative reception as he expected at least minimum recovery if not blockbuster result but not outright rejection.  In fact, buzz is that Kannada celebrities are rallying in support so that Yash doesn't feel left out and completely singled out with such a result. Well, as he is looking at Ramayana releasing for this Diwali, he might just take a break and recover to run campaign for it.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా అడుగుపెట్టి, కమెడియన్‌గా తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేసి హీరో స్థాయికి ఎదిగాడు  సూరి. ఆయన రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో చెప్పిన మాటలు ఇప్పుడు తమిళ ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  సూరి మాట్లాడుతూ  'ఒక పెద్ద హీరో చిత్రంలో నటించేందుకు  అవకాశం లభించింది.  అప్పటికే పరిశ్రమలో తిరుగులేని స్థానంలో ఉన్న ఒక స్టార్ కమెడియన్‌తో కలిసి నటించే కీలకమైన కాంబినేషన్. ఎంతో ఉత్సాహంతో, నటిస్తూ సీన్‌ని  విజయవంతంగా పూర్తి చేశాను. కానీ  సన్నివేశంపూర్తయిన వెంటనే హీరో, దర్శకుడు కలిసి మానిటర్‌లో అవుట్‌పుట్‌ పరిశీలించారు. ఆ తర్వాత కారణం చెప్పకుండా నేను ధరించిన చొక్కాని   విప్పేయమని ఆదేశించారు. బలవంతంగా నా ఒంటిపై నుంచి విప్పించిన ఆ చొక్కాని  రికమండేషన్‌ ద్వారా షూటింగ్‌కి వచ్చిన మరో వ్యక్తికి తొడిగారు. చిత్రమైన విషయం ఏంటంటే  ఆ రోజు ధరించింది సినిమా కాస్ట్యూమ్‌ విభాగానికి చెందినది కాదు. నా  సొంత డబ్బులతో కొనుక్కున్న వ్యక్తిగత దుస్తులు. కనీసం నా  సొంత చొక్కా అనే విషయాన్ని కూడా లెక్క చేయకుండా లాక్కొని కాస్ట్యూమ్స్ వాహనం పైకి విసిరేశారు. షూటింగ్ ప్రాంతంలో అందరి ముందూ ఒంటిపై కేవలం ఒక చిన్న టవల్ మాత్రమే చుట్టుకుని, తీవ్రమైన మానసిక వేదనతో, అవమాన భారంతో నా  చొక్కా కోసం  పడిన తపన వర్ణనాతీతం అని భావోద్వేగంతో చెప్పకొచ్చాడు. Also read: ట్విస్ట్ ఇచ్చిన మాధురి రాథోడ్: పరారీలో ఆ ప్రముఖుడు  ఇటీవల 'మామన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చి,న సూరి  త్వరలోనే సెప్టెంబర్ 10న 'మండాడి' చిత్రంతో అలరించేందుకు సిద్దమవుతున్నాడు.       [ Soori, Shirt, Mandaadi, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]     
Nani’s monthly tradition has once again given fans something personal to hold on to. The actor shared a set of pictures with his son Junnu, whom he fondly called “Little Paradise,” offering a completely different side of the actor amid the growing hype around his next film The Paradise. The pictures show Nani spending time with Junnu at the gym, with the two playfully taking on an arm-wrestling challenge. Despite his muscular transformation, Nani appears to deliberately let his son have the upper hand, making the moment more about their bond than his fitness regime. Junnu also added a sweet personal touch by drawing Nani’s Jadal character from The Paradise. The child’s sketch has become the standout detail from the post, especially as Jadal has become one of the most recognisable elements of the film’s promotions. It also creates a nice contrast with the intense and rugged image Nani is building for the character. Nani is set to arrive as Jadal in The Paradise, directed by Srikanth Odela. With Anirudh Ravichander’s music and songs such as Aaya Sher and Yasha Nagula already creating strong buzz, the film is gearing up for a worldwide release on September 24. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్లోబల్ స్థాయిలో సృష్టించిన సంచలనం 'పుష్ప'. ఈ పాన్-ఇండియా వండర్‌లో బన్నీ చూపించిన నటన, ప్రత్యేకమైన మేనరిజమ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లేదా కాన్సెప్ట్ సీక్వెన్స్‌లలో వచ్చే తిరుపతి గంగమ్మ జాతర జాతర సీన్, అందులో ఆయన వేసిన స్త్రీ వేషధారణ పాన్-ఇండియా రేంజ్‌లో ట్రెండ్ అయ్యాయి. తాజాగా ప్రతిష్ఠాత్మక 'ఫోర్బ్స్ ఇండియా' మ్యాగజైన్ కవర్‌పై మెరిసిన అల్లు అర్జున్, ఈ ఐకానిక్ లుక్ వెనుక ఉన్న అసలు రహస్యాలను పంచుకున్నారు. సాధారణంగా ఏ స్టార్ హీరో అయినా తమ మాస్ ఇమేజ్‌ని, పవర్ ఫుల్ లుక్‌ని కాపాడుకోవాలని చూస్తారు. కానీ, కథ కోసం ఎంతటి రిస్క్ అయినా చేయడానికి సిద్ధమని బన్నీ మరోసారి నిరూపించారు. సాధారణంగా కమర్షియల్ మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు ఇలాంటి డీ-గ్లామరైజ్డ్, మహిళా తరహా గెటప్‌లు చేయడానికి పెద్దగా సుముఖత చూపరని, కానీ తాను మాత్రం తన కంఫర్ట్ జోన్ దాటి సరికొత్తగా ప్రయత్నించాలనుకున్నానని తెలిపారు. తన మొత్తం సినీ ప్రయాణంలోనే అత్యంత 'ఆల్ఫా' (ధైర్యంతో కూడిన) నిర్ణయం ఏదైనా ఉందంటే అది 'పుష్ప'లో చీరకట్టి, గంగమ్మ జాతర గెటప్ వేయడమేనని బన్నీ వ్యాఖ్యానించారు. ఈ విలక్షణమైన గెటప్ వెనుక శ్రమను వివరిస్తూ.. మొదట పుష్పరాజ్ పాత్ర కోసం రొటీన్ మాస్, స్టైలిష్ లుక్స్‌లోనే ఫొటోషూట్స్ చేశామని బన్నీ తెలిపారు. అయితే, అలాంటి రెగ్యులర్ లుక్స్ ప్రేక్షకులకు పెద్దగా కిక్ ఇవ్వవని, వారందరినీ ఊహించని షాక్‌కు గురిచేసేలా ఒక గూస్‌బంప్స్ మూమెంట్ ఉండాలని క్రియాశీల దర్శకుడు సుకుమార్ పట్టుబట్టారని చెప్పారు. సుకుమార్ విజన్ నుంచే ఈ అద్భుతమైన గెటప్ జన్మించిందని పేర్కొన్నారు. ఈ లుక్ వెనుక శారీరకంగా తాను ఎంతో కష్టపడాల్సి వచ్చిందని ఐకాన్ స్టార్ గుర్తుచేసుకున్నారు. ప్రతిరోజు షూటింగ్ కోసం దాదాపు రెండున్నర గంటలకు పైగా ప్రత్యేక మేకప్ వేసుకోవాల్సి వచ్చేదని, భారీ సంప్రదాయ ఆభరణాలు మరియు చీర ధరించి యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం వల్ల తీవ్రమైన నడుము నొప్పితో ఇబ్బంది పడ్డానని చెప్పారు. కానీ, స్క్రీన్ పై ఆ దృశ్యాలు తెచ్చిన ప్రభావం చూశాక ఆ శ్రమ అంతా మర్చిపోయానని వివరించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫోర్బ్స్ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రత్యేక వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఎలాంటి ఇమేజ్ ఈగోస్ లేకుండా, కంటెంట్ కోసం ప్రాణం పెట్టే అల్లు అర్జున్ డెడికేషన్‌పై సినీ ప్రముఖులు, అభిమానులు నెట్టింట ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పుష్పరాజ్ క్యారెక్టర్ ఎప్పటికీ ఇండియన్ సినిమాలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అభిప్రాయపడుతున్నారు. ఇక అల్లు అర్జున్ రాబోయే భారీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి సిద్ధమవుతున్నారు. విభిన్న కథాంశాలతో గ్లోబల్ ఆడియన్స్‌ను అలరించేందుకు సరికొత్త కాన్సెప్టులను ప్లాన్ చేస్తూ ఇండియన్ సినిమా రంగాన్ని ఏలేందుకు దూసుకుపోతున్నారు.       [Allu Arjun, Pushpa Saree Look, Forbes India Allu Arjun, Sukumar, Allu Arjun Interview]
పెళ్లిళ్లు, పండుగలు లేదా ఏదైనా ప్రత్యేక శుభకార్యం వచ్చిందంటే చాలు ప్రతీ ఒక్కరి ఇళ్లలో అమ్మాయిలు, మహిళలు ఎంతో ముచ్చటగా చేతులకు మెహందీ పెట్టుకోవడం మన భారతీయుల సాంప్రదాయం. చేతులకు అందమైన ఆకృతుల్లో మెహందీ డిజైన్లు వేసుకుని, అది ఎర్రగా పండితే ఎంతో సంతోషిస్తారు. అయితే శుభకార్యాల హడావుడిలో మెహందీ ఆరకముందే లేదా మెహందీ రంగు చేతులకు ఉన్నప్పుడే చాలామంది చేతులతోనే ఆహారం తింటూ ఉంటారు. అలా మెహందీ పెట్టుకున్న చేతులతో నేరుగా ఆహారం తినడం వల్ల అనేక రకాల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, పొట్ట రుగ్మతలు ఎదురవుతాయని వైద్య నిపుణులు మరియు ఇటీవలి పరిశోధనలు స్పష్టంగా హెచ్చరిస్తున్నాయి. పూర్వ కాలంలో సహజ సిద్ధమైన గోరింటాకులను రుబ్బి చేతులకు పెట్టుకునేవారు. కానీ నేటి ఆధునిక కాలంలో మార్కెట్‌లో లభించే మెహందీ కోన్లలో రంగు త్వరగా పండటానికి మరియు ఎక్కువ రోజులు నిలిచి ఉండటానికి పారా ఫినైలిన్డైఅమైన్ (PPD) వంటి అత్యంత హానికరమైన రసాయనాలు, సింథటిక్ డైలు మరియు నాఫ్తలీన్ కాంపౌండ్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. 100 శాతం కెమికల్ ఫ్రీ అని ప్రచారం చేసే కొన్ని కోన్లలో కూడా నకిలీ కెమికల్స్ ఉంటాయి. మెహందీ పెట్టుకున్న చేతులతో మనం వేడి వేడి ఆహారాన్ని పట్టుకుని తిన్నప్పుడు, ఆ వేడికి మరియు అన్నంలో ఉండే నూనె పదార్థాలకు చేతిలోని రసాయనాలు కరిగి ఆహారంతో పాటు పొట్టలోకి సులభంగా చేరుతాయి. ఈ రసాయనాలు జీర్ణవ్యవస్థలోకి ప్రవేశించిన వెంటనే పొట్టలోని పేగుల గోడలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీనివల్ల కడుపులో తీవ్రమైన మంట, అజీర్తి, కడుపు నొప్పి, వాంతులు మరియు వికారంగా అనిపించడం వంటి సమస్యలు తక్షణమే ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా 80 శాతం కంటే ఎక్కువ మంది ఎదుర్కొనే పొట్ట ఉబ్బరం, గ్యాస్ట్రిటిస్ మరియు విరేచనాలకు ఈ రసాయనాల సేవనమే ప్రధాన కారణమవుతుంది. సున్నితమైన జీర్ణ వ్యవస్థ కలిగిన చిన్నపిల్లలు మరియు మహిళల్లో ఈ రసాయన సంకేతాలు విషపూరితంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ డీహైడ్రోజినేస్ (G6PD) ఎంజైమ్ లోపం ఉన్న వ్యక్తులకు మెహందీలోని  లాసోన్  (Lawsone) అనే కెమికల్ వల్ల తీవ్రమైన అలెర్జీలు మరియు రక్తహీనత వంటి ప్రమాదకర కాంప్లికేషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.       Henna hands food safety tips, side effects of eating with henna hands.
భారతీయ సాంప్రదాయ ఆయుర్వేదంలో అత్యంత ప్రాముఖ్యత మరియు విశిష్టత కలిగిన దివ్య మూలికా మొక్కలలో సర్పగంధ ఒకటి. దీనిని ఆయుర్వేద గ్రంథాలలో చంద్రభాగ లేదా పాతాళగంధ అనే పేర్లతో కూడా పిలుస్తారు. ప్రాచీన కాలం నుండి మన పెద్దలు ఈ మొక్కను అనేక ఆరోగ్య సమస్యలకు సహజ ఔషధంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ మొక్క వేళ్లు వంకరగా పాము ఆకారంలో ఉండటం, ప్రాచీన కాలంలో పాము కాటుకు ప్రధాన ఔషధంగా వాడటం వల్ల దీనికి సర్పగంధ అనే పేరు స్థిరపడింది. కేవలం ఆరోగ్య ప్రయోజనాలకే కాకుండా, ఇంటి చుట్టూ ఈ మొక్కను పెంచడం ద్వారా విషసర్పాలు, ఇతర విషకీటకాల భయం ఉండదని విశ్వసిస్తారు. సర్పగంధ వేళ్లకు ఉండే ప్రత్యేకమైన ఘాటైన వాసన మరియు తీవ్రమైన చేదు గుణం వల్ల పాములు ఇంటి పరిసరాల్లోకి కూడా రావడానికి వెనకాడుతాయి. సాంప్రదాయ నమ్మకాల ప్రకారం పాములు తమ నాలుక సహాయంతో పరిసరాల్లోని వాసనలను పసిగడతాయి, ఈ క్రమంలో సర్పగంధ నుండి వెలువడే ఘాటైన సువాసన వాటికి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అయితే శాస్త్రీయంగా ఇది 100 శాతం నిరోధిస్తుందని స్పష్టమైన ఆధారాలు లేకపోయినా, ప్రాచీన వైద్యంలో పాము కాటు మరియు తేలు కాటుకు విష నివారిణిగా దీని వేళ్లను ఎంతో సమర్థవంతంగా ఉపయోగించేవారు. ఇంట ఒక చిన్న అలంకరణ మొక్కగా మాత్రమే కాకుండా, అనేక ఆయుర్వేద మూలికా సంపదగా సర్పగంధను సులభంగా పెంచుకోవచ్చు. శాస్త్రీయ దృక్పథంలో సర్పగంధ వేళ్లలో 'రిసర్పైన్' (Reserpine) అనే శక్తివంతమైన ఆల్కలాయిడ్ లభిస్తుంది. ఈ విశిష్టమైన పదార్థం రక్తనాళాలపై ప్రభావం చూపి, అధిక రక్తపోటు (High Blood Pressure)ను సహజ సిద్ధంగా నియంత్రించడంలో అద్భుతంగా తోడ్పడుతుంది. నేటి ఆధునిక జీవనశైలిలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న మానసిక ఆందోళన, తీవ్రమైన ఒత్తిడి, మానసిక అలసట మరియు నిద్రలేమి (Insomnia) వంటి సమస్యలకు ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. నాడీ వ్యవస్థను ప్రశాంతపరిచి, సరైన నిద్ర పట్టేలా చేయడంలో సర్పగంధ వేళ్ల పొడి లేదా ఔషధ కషాయాలు కీలక పాత్ర పోషిస్తాయి.       sarpagandha remedy for stress and sleep,sarpagandha roots health benefits Ayurveda.
  మన ఇంట్లో లేదా పెరట్లో ఎంతో తేలిగ్గా లభించే జామ చెట్టు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. సాధారణంగా మనం జామ పండ్లను ఎంతో ఇష్టంగా తింటాం, కానీ ఆ పండ్ల కంటే కూడా జామ ఆకులలో అద్భుతమైన ఆయుర్వేదిక మూలికా గుణాలు దాగి ఉన్నాయనే విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా నేటి ఆధునిక జీవనశైలిలో మిలియన్ల మంది ప్రజలను వేధిస్తున్న ప్రధాన సమస్య డయాబెటీస్. రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం, ఇన్సులిన్ నిరోధకత ఏర్పడటం వంటి సమస్యలతో బాధపడేవారికి జామ ఆకులు ఒక దివ్యౌషధంగా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు మరియు ఇటీవలి వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. జామ ఆకులలో సహజ సిద్ధమైన ఫ్లేవనాయిడ్లు (Flavonoids), టానిన్లు (Tannins), పాలీఫెనాల్స్ (Polyphenols) మరియు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరంలో కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియలో పాల్గొనే ప్రత్యేక ఎంజైమ్‌లను నిరోధించి, చిన్నపేగుల నుంచి రక్తంలోకి గ్లూకోజ్ శోషణను నెమ్మదింపజేస్తాయి. దీనివల్ల భోజనం చేసిన వెంటనే రక్తంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరిగిపోకుండా స్పష్టమైన నియంత్రణ లభిస్తుంది. పరిశోధనల ప్రకారం, జామ ఆకు కషాయం లేదా టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ గణనీయంగా పెరుగుతుంది. డయాబెటీస్ నియంత్రణతో పాటు జామ ఆకులు జీర్ణవ్యవస్థను సైతం అద్భుతంగా శుద్ధి చేస్తాయి. వీటిలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు కడుపులో ఉన్న有害 బ్యాక్టీరియాను నశింపజేసి, మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు తోడ్పడతాయి. అజీర్తి, కడుపు ఉబ్బరం మరియు డయేరియా వంటి జీర్ణకోశ సమస్యలను క్షణాల్లో తగ్గించడంలో జామ ఆకు కషాయం ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో జామ ఆకుల రసం లేదా కషాయం తీసుకోవడం ద్వారా శరీరంలోని టాక్సిన్లు తొలగిపోయి మెటబాలిజం మెరుగుపడుతుంది.       Ayurvedic benefits of guava leaves, natural remedy for blood sugar control.
ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ అంటారు, కానీ నేటి వేగవంతమైన జీవనశైలిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. చాలామంది ఆరోగ్యం అంటే కేవలం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లేదా కఠినమైన ఆహార నియమాలు పాటించడమే అని అనుకుంటారు. కానీ నిజమైన ఆరోగ్యం మన రోజువారీ అలవాట్లలోనే దాగి ఉంటుంది. చిన్న చిన్న మార్పులు మన జీవితంలో ఊహించని పెద్ద సానుకూల ఫలితాలను తీసుకోస్తాయి. మన జీవితాన్ని సంపూర్ణంగా, ఆరోగ్యకరంగా మార్చే కొన్ని ముఖ్యమైన అలవాట్లు , ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నిజాల గురించి  వివరంగా తెలుసుకుంటే... ఉదయాన్నే నీరు..  ఉదయాన్నే పరగడుపున నీరు తాగడం చాలా ప్రభావవంతమైన అలవాటు. రాత్రంతా మన శరీరం విశ్రాంతిలో ఉన్నప్పుడు అనేక జీవక్రియలు జరుగుతాయి. ఉదయం లేవగానే ఒక లీటరు వరకు గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్ళిపోతాయి. ఇది జీర్ణవ్యవస్థను ఉత్తేజపరచడమే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. రోజంతా కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల నీరు తాగడం వల్ల డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉండవచ్చు.  పోషకాహారం.. మన శరీరం మనం తినే ఆహారాన్ని బట్టే పనిచేస్తుంది. జంక్ ఫుడ్, వేపుళ్లు, అధిక పంచదార ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, నట్స్ , మొలకెత్తిన విత్తనాలు భాగం చేసుకోవాలి. మనం తినే ఆహారంలో పీచు పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్లు సరిపడా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఆహారం తినేటప్పుడు ప్రశాంతంగా, నమిలి తినడం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది.  క్రమం తప్పకుండా శారీరక శ్రమ, వ్యాయామం.. గంటల తరబడి జిమ్ లో కష్టపడాల్సిన అవసరం లేదు. రోజువారీ జీవితంలో కనీసం 30 నుండి 45 నిమిషాల పాటు వేగంగా నడవడం, యోగా చేయడం, ఈత కొట్టడం లేదా సైక్లింగ్ చేయడం వంటివి సరిపోతాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది, రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది, ఎముకలు , కండరాలు బలంగా మారతాయి. వ్యాయామం వల్ల శరీరంలో ఎండోర్ఫిన్లు అనే హార్మోన్లు విడుదలవుతాయి, ఇవి మన మానసిక ఒత్తిడిని తగ్గించి రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. నిద్ర.. మంచి నిద్ర చాలా ముఖ్యమైన అలవాటు. నేటి డిజిటల్ యుగంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సరిగ్గా నిద్రపోకపోవడం. రాత్రి వేళల్లో కనీసం 7 నుండి 8 గంటల ప్రశాంతమైన నిద్ర శరీరానికి చాలా అవసరం. నిద్రపోయే సమయంలోనే మన శరీరం తనను తాను రీఛార్జ్ చేసుకుంటుంది, కణాల మరమ్మత్తు జరుగుతుంది. రాత్రి పడుకోవడానికి ఒక గంట ముందు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు పక్కన పెట్టడం మంచిది. సరిపడా నిద్ర లేకపోతే ఉబకాయం, మధుమేహం, గుండె జబ్బులు , మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మానసిక ఆరోగ్యం..  శరీరం ఎంత ఆరోగ్యంగా ఉన్నా, మనస్సు ప్రశాంతంగా లేకపోతే పూర్తి ఆరోగ్యం లభించదు. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం 10 నుండి 15 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి నచ్చిన పనులు చేయడం, సంగీతం వినడం, పుస్తకాలు చదవడం లేదా ప్రకృతితో సమయం గడపడం వంటివి చేయాలి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటూ, సానుకూల ధోరణిని పెంపొందించుకోవడం వల్ల జీవన నాణ్యత పెరుగుతుంది. చివరగా.. ధూమపానం, మధ్యపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఇవి శరీరంలోని అవయవాలను లోపలి నుండి బలహీనపరుస్తాయి. అలాగే ఏటా లేదా ఆరు నెలలకోసారి సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యాధులను ప్రారంభంలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఈ ఆరోగ్యకరమైన అలవాట్లను ఒకే రోజులో సాధించడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రతిరోజూ ఒక్కో చిన్న మార్పు చేసుకుంటూ పోతే, కొద్ది రోజుల్లోనే ఇవి మన జీవనశైలిలో భాగమైపోతాయి. ఆరోగ్యకరమైన జీవితం అనేది ఒక రోజులో వచ్చేది కాదు, అది మనం ప్రతిరోజూ చేసుకునే ఎంపికలపై ఆధారపడి ఉంటుంది.                        *రూపశ్రీ.  
పిల్లలకు అంజీర్ ఇస్తున్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! అంజీర్ పండు (Fig Fruit) ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందించే పండు. తాజా అంజీర్ అయినా, ఎండిన అంజీర్ అయినా సరైన పద్ధతిలో తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. రక్త ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, జీర్ణవ్యవస్థతో పాటు పిల్లల ఎదుగుదలకు కూడా అంజీర్ ఉపయోగకరంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే Fresh Figs, Dried Figsలో ఏది మంచిది? అంజీర్‌ను ప్రతిరోజూ ఎలా తినాలి? ఎండిన అంజీర్‌ను నేరుగా తినవచ్చా? డ్రై రోస్ట్ చేస్తే ఏమవుతుంది? వంటి విషయాలు చాలామందికి తెలియవు. ఈ వీడియోలో సీనియర్ ఆయుర్వేద వైద్య నిపుణురాలు డాక్టర్ శిరీష అంజీర్ పండును తీసుకునే సరైన విధానం, తాజా అంజీర్ మరియు ఎండిన అంజీర్ మధ్య తేడాలు, ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు, పిల్లల ఎదుగుదలలో దాని ప్రాధాన్యత వంటి విషయాలను సులభంగా వివరిస్తున్నారు. అంజీర్‌ను ఆహారంలో ఎలా చేర్చుకోవాలి? ఎవరు ఎలా తీసుకోవాలి? ఎందుకు డ్రై రోస్ట్ చేయకూడదు? అనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి పూర్తి వీడియోను చూడండి. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా ఆహారం తీసుకునే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
భారతీయ సాంప్రదాయ వైద్య విధానమైన ఆయుర్వేదంలో పిప్పళ్లకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. నల్లగా, చిన్న పొడుగు ఆకారంలో ఉండే ఈ పిప్పళ్లు కేవలం వంటగదిలోని దినుసు మాత్రమే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న దివ్యౌషధం. శతాబ్దాల నుంచి మన పెద్దలు, ఆయుర్వేద నిపుణులు రకరకాల ఆరోగ్య సమస్యల నివారణకు పిప్పళ్లను ప్రధానంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. పిప్పళ్లు చేసే మేలు.. పిప్పళ్లలో ఉండే కెమికల్ కాంపౌండ్ పైపరీన్ శరీరంలో జీవక్రియలను వేగవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి పిప్పళ్లు చేసే మేలు అపారం. జలుబు, దగ్గు, ఉబ్బసం, గొంతు నొప్పి, ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి పిప్పళ్లు తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి. పిప్పళ్ల పొడిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం సులభంగా బయటకు వచ్చేస్తుంది. పిప్పళ్ల గురించి ఆయుర్వేదం ఏం చెబుతుంది? ఆయుర్వేదంలో పిప్పళ్లను రసాయన మూలికగా వర్గీకరించారు. అంటే ఇవి శరీరానికి పునరుజ్జీవనాన్ని అందిస్తాయి. ఆయుర్వేదంలో దీనిని త్రిదోషాలలో ప్రధానమైన కఫ, వాత దోషాలను సమతుల్యం చేయడానికి ఉపయోగిస్తారు. శరీరంలో జఠరాగ్నిని అంటే జీర్ణశక్తిని రగిల్చే గుణం పిప్పళ్లకు ఉంది. తిన్న ఆహారం సరిగ్గా అరగకపోయే సమస్యను, ఆకలి మందగించడాన్ని ఇది నివారిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ లేదా విష పదార్థాలను బయటకు పంపడంలో ఆయుర్వేద వైద్యంలో పిప్పళ్లను క్రియాశీలకంగా ఉపయోగిస్తారు. పిప్పళ్ల వల్ల కలిగే మరికొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే.. జీర్ణ వ్యవస్థ మెరుగుపడటం..  గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను పిప్పళ్లు త్వరితగతిన నివారిస్తాయి. జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి ఆహారం వేగంగా అరిగేలా చేస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుదల..  యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబియల్ గుణాలు సమృద్ధిగా ఉండటం వల్ల ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. తరచూ వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. బరువు నియంత్రణ..  శరీరంలో జీవక్రియల వేగాన్ని పెంచి, చెడు కొవ్వును కరిగించడంలో పిప్పళ్లు ఎంతో సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి సహజ నివారణి. నొప్పులు , వాపుల నివారణ..  పిప్పళ్లలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, వాతపు నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాలేయ ఆరోగ్యం.. కాలేయంలోని వ్యర్థాలను తొలగించి, కాలేయం సరిగ్గా పనిచేయడానికి పిప్పళ్లు తోడ్పడతాయి. పిప్పళ్లను నిత్య జీవితంలో తగిన మోతాదులో వాడటం వల్ల అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అయితే ఇవి శరీరంలో వేడిని పెంచే గుణం కలిగి ఉంటాయి కాబట్టి, పిత్త ప్రకృతి ఉన్నవారు లేదా గర్భిణులు ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవడం మంచిది.                        *రూపశ్రీ.