LATEST NEWS
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. జిల్లా పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండాలను ఎగురవేశారు. కాగా.. తెలంగాణ భవన్‌లో పార్టీ  ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ  నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు  పోరాటం చేసి  కేసీఆర్  తెలంగాణ సాధించారన్నారు.  ఢిల్లీ మెడలు వంచిన పార్టీ బీఆర్ఎస్ అన్న ఆయన.. గత రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో   దుర్మార్గ, అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. భారతదేశ చరిత్రలోనే పాతిక వసంతాల ప్రస్థానం పూర్తి చేసుకున్న పార్టీలు కొన్ని మాత్రమే ఉన్నాయనీ, వాటిలో ఒకటి బీఆర్ఎస్ అన్నారు.  పోరాడి సాధించుకున్న తెలంగాణను  కాపాడుకునేందుకు బీఆర్ఎస్  పునరంకితం అవుతుందనీ, అరాచక కాంగ్రెస్ , బీజేపీ పాలన నుండి తెలంగాణను మళ్లీ పట్టాలు ఎక్కించడం కోసం పోరాడుదామనీ పిలుపునిచ్చారు.  కేసీఆర్ సైనికులుగా బలగంగా కలిసికట్టుగా కదం తొక్కుతాదామన్నారు.  తెలంగాణ భవన్ కు కేసీఆర్ వస్తారని, నేతలకు దిశనిర్దేశం చేస్తారని కేటీఆర్ తెలిపారు. కవిత పార్టీ, ఆమె చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు మాత్రం కేటీఆర్ ఇష్టపడలేదు. 
గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన మంత్రి అజారుద్దీన్,  టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం సోమవారం (ఏప్రిల్ 27) ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.   శాసనమండలి  కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.   కాగా ప్రస్తుతం రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మొహమ్మద్ అజారుద్దీన్‌కు ఈ ప్రమాణ స్వీకారం భారీ ఊరటనిచ్చింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలలలోగా  ఏదో ఒక చట్టసభకు ప్రాతినిథ్యం వహించాలి.   అంటే.. శాసనసభ,  మండలి సభ్యుడిగా ఎన్నిక కావాలి. మంత్రి అజారుద్దీన్ కు ఈ ఆరునెలల గడువు ఈ నెల 30తో ముగియనుంది. ఆ గడువు ముగియడానికి మూడు రోజుల ముందే ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడంతో మంత్రిపదవికి ఉన్న చిక్కులు తొలగిపోయాయి.  ఇక తెలంగాణ ఉద్యమ కాలంలో జేఏసీ చైర్మన్‌గా కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం తొలిసారిగా శాసనమండలిలో అడుగుపెట్టబోతున్నారు. ఉద్యమ నేతగా పేరున్న ఆయన ఇకపై ప్రజా సమస్యలపై, ప్రభుత్వ నిర్ణయాలపై మండలి వేదికగా తన గళాన్ని వినిపించనున్నారు. ఈ నియామకంతో శాసనమండలిలో అధికార పక్షం బలం   పెరిగింది. 
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరిట కొత్త పార్టీ ప్రారంభించడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనంగా మారింది. ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది.  పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పార్టీలోని అహంకారపూరిత ధోరణులు, ముఖ్యంగా కేటీఆర్ మరియు హరీష్ రావుల పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్న కల్వకుంట్ల నేరుగా తండ్రి కేసీఆర్ పైనే యుద్ధం ప్రకటించారు. బీఆర్ఎస్  ఉద్యమకారులను, మేధావులను పక్కనపెట్టి కేవలం కొందరికే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆ పార్టీ పార్టీ పునాదులు బలహీనపడ్డాయి.  ఇప్పుడు కవిత సొంత పార్టీతో బీఆర్ఎస్ కోలుకోలేని విధంగా దెబ్బతీసిందని అంటున్నారు.   కవిత వ్యూహం కేవలం కొత్త పార్టీ పెట్టడం మాత్రమే కాదు, బీఆర్ఎస్ పట్ల అసంతృప్తిగా ఉన్న కేడర్‌ను తనవైపు తిప్పుకోవడం.  తెలంగాణ రాష్ట్ర సమితి  అనే పాత పేరుపై ప్రజలకు ఉన్న సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు ఆమె  తన పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన  (టీఆర్ఎస్) అనే పేరును ఎంచుకోవడం ద్వారా..  పాత టీఆర్ఎస్ వారసత్వాన్ని సొంతం చేసుకోవడమనే వ్యూహం కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. కవిత కొత్త పార్టీ వల్ల ప్రధానంగా నష్టపోయేది బీఆర్ఎస్ అని అంటున్నారు. కవిత కొత్త పార్టీ ప్రధానంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకునే చీలుస్తుందని చెబుతున్నారు.   అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు ఈ అంతర్గత కలహాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాయనడంలో సందేహం లేదు. కవితకు బీజేపీ పరోక్ష మద్దతు ఉండవచ్చని, తద్వారా బీఆర్ఎస్ బార్గేనింగ్ శక్తిని తగ్గించడమే ఆమె అసలు లక్ష్యమని విశ్లేషకులు అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ వంటి ఆరోపణలు, కుటుంబ సభ్యుల మధ్య ఈగో క్లాష్‌లు కూడా ఈ చీలికకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.ఇదే విషయాన్ని తెలుగువన్ చర్చా వేదికలో సువేరా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.   కవిత నిర్ణయం తెలంగాణలో ఒక కొత్త రాజకీయ శక్తిని సృష్టించవచ్చున్న ఆయన..  ఆమె కేవలం కేసీఆర్ బిడ్డగానే కాకుండా, తనకంటూ ఒక సొంత ఇమేజ్‌ను నిర్మించుకోవాలని చూస్తున్నాన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ బలహీనపడి, క్రమంగా బీజేపీలో విలీనమయ్యే అవకాశాలు  కొట్టిపారేయలేన్న సువేరా.. కవిత పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది ఆమె ఎంచుకునే నాయకులు, యూత్ మేనిఫెస్టోపై ఆధారపడి ఉంటుందన్నారు. ఒకవేళ ఆమె బలమైన శక్తిగా ఎదిగితే, తెలంగాణలో త్రిముఖ పోటీ మరింత తీవ్రమై రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. మహిళా బిల్లు వంటి అంశాలపై ఆమె చేస్తున్న పోరాటం మహిళా ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉందని సువేరా అభిప్రాయపడ్డారు.   
   ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన, బీజేపీలో చేరడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఇప్పుడు తన తదుపరి రాజకీయ అడుగుల కోసం తీవ్రంగా మథనపడుతున్నారు. ఎన్డీయే కూటమిలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు  అభ్యంతరం తెలపడం వల్లే, విజయసాయిరెడ్డికి కాషాయ పార్టీ తలుపులు మూసుకున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు, ఇటీవల జరిగిన ఈడి సోదాలు ఆయన్ను మరింత ఒత్తిడికి గురి చేస్తున్నాయి. వ్యూహాలు మరియు పరిణామాలు: విజయసాయిరెడ్డి రాజకీయంగా ఒంటరవుతున్న తరుణంలో, ఆయన కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. లిక్కర్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నవారిని వదిలేసి, తనను విచారణల పేరుతో వేధిస్తున్నారని ఆయన ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు నాయుడుపై ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఆయనలోని రాజకీయ ఫ్రస్ట్రేషన్‌కు అద్దం పడుతున్నాయి.  ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని, తనదైన మార్గంలో ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆయనకు క్షేత్రస్థాయిలో ఆదరణ లభించడం ప్రశ్నార్థకమే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెలుపల తనకంటూ ఒక రాజకీయ ఉనికిని చాటుకోవాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలు, ప్రధానంగా జగన్‌కు పరోక్షంగా ఉపయోగపడతాయా లేదా అన్నది కూడా గమనార్హం. భవిష్యత్తు రాజకీయ ప్రభావం: రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయసాయిరెడ్డి నిర్ణయం కీలక మలుపు కావచ్చు. ఆయన సొంతంగా పార్టీ పెట్టినా, లేదా మరొక కూటమితో పొత్తు పెట్టుకున్నా, ప్రస్తుత రాజకీయ వాతావరణంలో అది ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది చూడాలి. ముఖ్యమంత్రి పట్ల ఆయన చూపుతున్న తీవ్ర వ్యతిరేకత, టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. వ్యవస్థలపైన, దర్యాప్తు సంస్థల పైన ఆయనకు ఉన్న నమ్మకం సడలిపోవడం, తన ఉనికిని కాపాడుకోవడానికి ఆయన చేసే రాజకీయం రాష్ట్రంలో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది.  రాజకీయంగా ఆయన ఏ అడుగు వేసినా, అది ఆయన భవిష్యత్తును నిర్ణయించడమే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టించేలా కనిపిస్తోంది. అయితే, ప్రజల్లోకి వెళ్లడం మరియు ప్రజల సమస్యలపై పోరాడటం అనే అంశాల్లో ఆయన వెనుకబడి ఉన్నారన్నది వాస్తవం. కేవలం మీడియా సమావేశాలు, సోషల్ మీడియా ట్వీట్లకే పరిమితం కాకుండా, ప్రజల్లోకి వెళ్తేనే ఆయన రాజకీయ మనుగడ సాధ్యమవుతుంది. తెలుగు వన్ యూట్యూబ్ ఛానల్‌లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యూహాలపై కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమిల్లి శ్రీనివాస్‌రావు, జర్నలిస్ట్ గోపి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.. తప్పక వీక్షించండి  
కేంద్ర ఎన్నికల సంఘం  ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ణానేష్ కుమార్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ   ప్రతిపక్ష పార్టీలు తమ గళాన్ని పెంచాయి.  ఈ మేరకు వివిధ పార్టీలకు చెందిన సుమారు 73 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేసిన  నోటీసును రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు అందజేశారు. భారత ఎన్నికల సంఘం పనితీరుపై గత కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలు, ఇప్పుడు నేరుగా సీఈసీని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగడం రాజకీయ వర్గాల్లో   సంచలనంగా మారింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని తొలగించాలనే ప్రతిపాదనతో కూడిన ఈ పరిణామం హాట్ టాపిక్ గా మారింది.  ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి.   ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియకు వెన్నెముకగా నిలిచే ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని విపక్ష నేతలు పేర్కొన్నారు. గతంలో కూడా కొన్ని అంశాలపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, ఈసారి ఏకంగా 73 మంది సభ్యులు ఒకే తాటిపైకి వచ్చి అధికారికంగా నోటీసు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వానికి,  ఎన్నికల కమిషన్‌కు ఒక సవాలుగా మారిందనడంలో సందేహం లేదు. నోటీసులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఎన్నికల సమయంలో నిబంధనల అమలులో వివక్ష, అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు వంటి ఆరోపణలు ఉన్నాయి.  కీలకమైన అంశాలపై ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం, ఓటర్ల జాబితాలో మార్పులు-చేర్పులు వంటి సున్నితమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి అంశాలను సభ్యులు తమ నోటీసులు సభ్యులు పేర్కొన్నారు.   రాజ్యసభ నిబంధనల ప్రకారం..  రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటే తగిన సంఖ్యలో సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుత నోటీసుపై 73 మంది సభ్యులు సంతకాలు చేయడంతో..  దీనిపై సభలో చర్చ జరగాలనే డిమాండ్ మరింత గట్టిగా వినిపించే అవకాశం ఉంది. చైర్మన్ ఈ నోటీసును పరిశీలించి, అది నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో  నిర్ధారించుకునన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటారు. సపోజ్ ఫర్ సపోజ్ ఈ నోటీసు ఆమోదం పొందితే, సభలో దీనిపై  చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. గత కొద్ది కాలంగా ఎన్నికల ప్రక్రియలో వినియోగిస్తున్న సాంకేతికత మరియు ఎన్నికల కోడ్ అమలు తీరుపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో రాజ్యాంగ సంస్థలు విఫలమవుతున్నాయని విపక్షాలు పదేపదే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఈసీని లక్ష్యంగా చేసుకుని విపక్ష సభ్యులు ఇచ్చిన నోటీసు ప్రాధాన్యత సంతరించుకుంది.  
ALSO ON TELUGUONE N E W S
  స్టిల్ ఈ నిమిషం సినిమాలకి గుడ్ బై చెప్పినా సరే సౌత్ సినీ పరిశ్రమ తన మనుగడ సాగిస్తున్నంత కాలం శ్రియా(Shriya Saran)పేరుని మరవడం అనేది జరగని పని. అంత చరిష్మా శ్రీయ సొంతం. సెకండ్ ఇన్నింగ్స్ అనేది ఉండదు డ్యూడ్ అంటూ మిరాయ్ లో అంబికా ప్రజాపతిగా తన నటన తాలూకు విశ్వరూపాన్ని ప్రదర్శించింది. రీసెంట్ గా తన ఏజ్ కి సంబంధించిన విషయంపై కొన్ని వ్యాఖ్యలు చేసింది. సదరు వ్యాఖ్యలు ఘాటైనవి కావడంతో సోషల్ మీడియాలో శ్రేయ తాలూకు సువాసనలు ఒక రేంజ్ లోనే చక్కర్లు కొడుతున్నాయి. మరి ఆ మ్యాటర్ పై ఒక లుక్ వేద్దాం.  ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న శ్రీయ తో యాంకర్ మాట్లాడుతూ 43 ఏళ్ళ వయసులో గ్లామర్ ని ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారనే ప్రశ్న అడగడం జరిగింది. అందుకు శ్రీయ మాట్లాడుతూ మీరు ఈ ప్రశ్న వేయడమే తప్పు, వయసుతో పని ఏముంది. ఒకప్పుడు హీరోయిన్లకు 30 ఏళ్లు దాటినా లేదా పెళ్లైనా వారి కెరీర్ ముగిసినట్లే అని భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఇండస్ట్రీలో ఏజ్ అనేది ఇప్పుడు ఒక అడ్డంకి కాదు. నటీనటుల ప్రతిభకి, వారు ఎంచుకునే పాత్రలకు ప్రాధాన్యత పెరుగుతోంది. 40 ఏళ్లలో కూడా అద్భుతమైన పాత్రలు చేసే అవకాశం మాకు దక్కుతోంది. ప్రేక్షకులు కూడా నటి వయస్సు కంటే ఆమె పర్ఫార్మెన్స్‌ను చూసి ఆదరిస్తున్నారు" అని శ్రియా ఆనందం వ్యక్తం చేశారు. also read: Peddi: పెద్దికి శృతి హాసన్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇంతేనా! నటిగా ఎప్పుడూ సిద్ధంగా ఉండటం నా బాధ్యత. క్రమం తప్పకుండా యోగా, డాన్స్ మరియు సరైన ఆహారపు అలవాట్లు పాటించడం వల్లే ఇప్పటికీ యాక్టివ్‌గా ఉండగలుగుతున్నాను. వయస్సు పెరుగుతున్న కొద్దీ మనం మరింత పరిణితి చెందుతాం. అది మన నటనలో కూడా కనిపిస్తుంది. అందుకే ఈ దశలో మరింత వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేయాలని ఉందని చెప్పుకొచ్చింది. పలు అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.    
-సోషల్ మీడియాని షేక్ చేస్తున్న పెద్ది స్పెషల్ సాంగ్  -శృతి హాసన్ తో ఆల్రెడీ షూట్  -కళ్ళు తిరిగే రెమ్యునరేషన్! -ఆ డిటైల్స్ చూద్దాం చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్టుగా ఏం చేస్తాం.. శృతి హాసన్(Shruthi Haasan)తో పెట్టుకుంటే అట్లనే ఉంటుంది మరి. తన  నుంచి ఇంకా కొత్త సినిమా ప్రకటన రాకపోయే సరికి శృతి పని అయిపోయిందని కొంత మంది భావిస్తు వస్తున్నారు. తన అప్ కమింగ్ సినిమాల  లిస్ట్ చూసుకున్నా ఆ  కొంత మంది బావనకే మెజారిటీ  ఓట్లు  వచ్చే పరిస్థితి. సలార్ పార్ట్ 2 ఉన్నా చాలా టైం ఉంది. కానీ వాటన్నిటిని పక్కన పెడుతూ ఇక్కడ ఉంది ఎవరు శృతి హాసన్ అని చెప్తుంది. ఈ న్యూస్ ఏంటో చూద్దాం.  'పెద్ది'(Peddi)లో శృతి స్పెషల్ సాంగ్ చేస్తుంది. మేకర్స్ ఈ విషయాన్నీ అధికారకంగా ప్రటించకపోయినా, ఆల్రెడీ స్పెషల్ సాంగ్ షూట్ లో ఉందనేది ఫిలిం సర్కిల్స్ టాక్. ఈ సాంగ్  కోసం శ్రుతి మూడున్నర  కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒక హీరోయిన్ ఒక పూర్తి సినిమాకు తీసుకునే మొత్తాన్ని కేవలం ఒక్క సాంగ్ కే  శ్రుతి అందుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమెకున్న క్రేజ్, డ్యాన్స్ స్కిల్స్ దృష్ట్యా నిర్మాతలు  ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు వెనుకాడలేదని సమాచారం. Also read: Chiranjeevi: ఇంటర్వెల్ ప్లాన్ చేస్తున్న చిరంజీవి.. బాబీతో మూవీ ఉందా! ఇక సదరు సాంగ్ కి ఏ ఆర్ రెహ్మాన్(Ar Rehman)అదిరిపోయే ట్యూన్ ఇచ్చాడని, సదరు సాంగ్  రేపు థియేటర్స్ లో  ఫ్యాన్స్ ఎవరో ప్రేక్షకులెవరో తెలియని విధంగా చరణ్(Ram Charan),శృతి ల స్టెప్స్ అండ్ మూమెంట్స్ ఉండబోతున్నాయని కూడా తెలుస్తుంది. జూన్ 25 న పెద్ది వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే.  
Samyuktha is stepping into an action-heavy role for the upcoming film The Black Gold. Moving away from regular commercial roles, she plays an honest and uncompromising police officer. The recently released promotional material showcases her in a grounded, authentic cop avatar. The making video released emphasizes on the realistic setting further.  The film's core plot revolves around the notorious coal syndicate operations along the Telangana-Maharashtra border, drawing inspiration from true events. The project is particularly significant for director Yogesh KMC, who is looking to make a strong directorial comeback with this high-octane action drama following his earlier venture, Chintakala Ravi.  Bankrolled by Hasya Movies and Maganti Pictures, the production team recently wrapped up a rigorous 60-day shooting schedule. To maintain visual authenticity, filming took place in actual coal mine regions like Bellampalli and Kagaznagar, supplemented by ten specially designed sets in Hyderabad. The makers have emphasized the film's technical scale, noting that complex action sequences were shot using up to five cameras simultaneously to elevate the cinematic experience within the female-led action space. The project is further anchored by a strong supporting cast, including veteran actors Nassar, Murali Sharma, Rao Ramesh, and Ramki. The Black Gold is currently in its post-production phase, with dubbing and re-recording underway. An official theatrical release date announcement is expected to arrive soon.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) ప్రస్తుతం తన తనయుడు జునైద్ ఖాన్ (Junaid Khan) తెరంగేట్రం విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నారు. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్‌లో జునైద్ ఖాన్, సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన తాజా చిత్రం 'ఏక్ దిన్' (Ek Din). తెలుగులో ఈ సినిమా 'ఒక రోజు' అనే టైటిల్‌తో విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆమిర్ ఖాన్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆమిర్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'ఏక్ దిన్' సినిమా పట్ల చిత్రబృందం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. "ఇది నేను నమ్మిన కథ. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో తెలియదు కానీ, మేము చెప్పాలనుకున్న కథను ప్రాణం పోసి తెరపై చూపించగలిగామా లేదా అనేదే నాకు ముఖ్యం. నా దృష్టిలో విజయానికి అదే మొదటి కొలమానం" అని ఆమిర్ పేర్కొన్నారు. సాధారణంగా భారీ వసూళ్లు సాధిస్తేనే సినిమా సక్సెస్ అనుకుంటారు, కానీ నచ్చని సినిమా బాగా ఆడితే వచ్చే విజయం తనకు సంతోషాన్ని ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. ఈ చిత్రం ద్వారా జునైద్ ఖాన్ హీరోగా పరిచయం అవుతుండగా, సాయి పల్లవికి ఇది హిందీలో తొలి చిత్రం కావడం విశేషం. ఇది చాలా చిన్న సినిమా అని, కొత్త నటీనటులు ఉండటం వల్ల ప్రేక్షకుల వరకు చేరడానికి కొంత సమయం పడుతుందని భావించే ప్రచారాన్ని ముందుగానే ప్రారంభించామని ఆమిర్ చెప్పారు. సునీల్ పాండే దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కథను తాను బలంగా నమ్మానని, భావోద్వేగాలతో కూడిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక తండ్రిగా తన కుమారుడు జునైద్‌ను వెండితెరపై చూడాలని ఆమిర్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కేవలం స్టార్ హోదా కోసం కాకుండా, కంటెంట్‌ను నమ్మి తీసిన 'ఏక్ దిన్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతం హిందీలో 'రామాయణ' వంటి భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సాయి పల్లవికి కూడా ఏక్ దిన్' అక్కడ శుభారంభాన్ని ఇస్తుందేమో చూడాలి.   
The controversy surrounding actress and social media influencer Ashu Reddy has taken a dramatic turn following new statements from her father, Koyya Venkata Krishna Reddy. A cheating case was recently filed against Ashu by an NRI software engineer, Y.V. Dharmendra, who alleged that she defrauded him of over Rs 9 crore under the pretext of marriage.  The police complaint stated that these funds were used to purchase luxury cars, gold, and properties in her name before she eventually refused the marriage proposal. While Ashu Reddy vehemently denied these allegations on social media and threatened legal action against those spreading false information, her father has now publicly addressed the issue.  In a surprising television interview, he confirmed that his daughter did indeed receive financial support from the NRI. However, he introduced a fresh twist by blaming his estranged wife, claiming she encouraged Ashu's association with Dharmendra despite knowing he was already married. Furthermore, Venkata Krishna Reddy made severe counter-allegations against Dharmendra's family, accusing them of having connections to a call money mafia. The Hyderabad Central Crime Station police have registered an FIR and are currently investigating the complex financial transactions. This unexpected statement from her own family member adds a complicated new layer to the ongoing legal battle.     Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
    -చిరు, బాబీ మూవీ ఉందా! -కొన్ని రోజులుగా నెగిటివ్ స్ప్రెడ్  -ఇంటర్వెల్ తో వస్తున్నారు  ఒక అభిమాని తన అభిమాన హీరోని డైరెక్ట్ చేస్తే వచ్చే ఆ కిక్కే వేరు. సెల్యులాయిడ్ కూడా సదరు కిక్ ని ఒంటి నిండా పులుముకొని ఘనవిజయాన్ని అందిస్తుంది. చిరంజీవి(Chiranjeevi),బాబీ(Bobby)కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్యనే అందుకు ఉదాహరణ. దీంతో ఈ కాంబోలో తెరకెక్కబోతున్న కొత్త మూవీపై అంచనాలు పీక్ లో ఉన్నాయి. రీసెంట్ గా ఈ కాంబోకి సంబంధించిన తాజా న్యూస్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ లో క్రేజీ న్యూస్ గా మారింది. మరి ఆ మెగా న్యూస్ ఏంటో చూసేద్దాం తాజాగా  అందుతున్న సమాచారం ప్రకారం బాబీ ఒక పవర్‌ఫుల్ ఇంటర్వెల్ బ్లాక్‌ని సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. హై వోల్టేజ్ యాక్షన్ తరహాలో ఉండే ఈ సీక్వెన్స్ పూర్తిగా చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా, వింటేజ్ చిరుని గుర్తుకు తెచ్చేలా భారీ స్థాయిలో ఉండబోతోందని సమాచారం.  మరి బాస్ సినిమాల్లో ఇంటర్వెల్ బ్లాక్ అనేది ఎప్పుడూ ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ,ముఖ్యంగా 'ఇంద్ర', 'ఠాగూర్' లో ని ఇంటర్వెల్ సీన్లు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఇప్పుడు బాబీ కూడా అదే రేంజ్‌లో ఒక మాస్ ఎలివేషన్‌ను ప్లాన్ చేస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో థియేటర్లలో ఇంటర్ వెల్ సీన్స్ కి  మెగా ఫ్యాన్స్ సీట్ల నుంచి లేచి గోల చేయడం ఖాయమని ఇండస్ట్రీ టాక్. Also read: Mehreen Pirzada: మెహ్రీన్ పెళ్లి చేసుకుంది ఇతన్నే.. ఫస్ట్ ఎంగేజ్ మెంట్ కి, ఇప్పటి పెళ్లికి  తేడా ఇదే  ఇక ఈ చిత్రం ఆగిపోయిందనే రూమర్స్ కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. సదరు న్యూస్ స్ప్రెడ్ చేసే బ్యాచ్ కి మెగా టీం ఒక షాకింగ్ న్యూస్ ని చెప్పింది. త్వరలోనే మూవీ షూట్ కి వెళ్లబోతుందని అధికార ప్రకటన చేసింది. ప్రాజెక్ట్‌ కి సంబంధించిన మిగతా నటీనటులు మరియు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలని  చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.   
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'పెద్ది' (Peddi). ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా జరిగిన ధనుష్ 'కర' (KARA) మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో పాల్గొన్న బుచ్చిబాబు, 'పెద్ది' సినిమా విడుదల తేదీపై ఒక కీలక ప్రకటన చేసి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. 'కర' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు బుచ్చిబాబు అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా స్టేజ్ మీద ఉన్న ఆయనను అభిమానులు రామ్ చరణ్ 'పెద్ది' సినిమా అప్‌డేట్ కావాలంటూ గట్టిగా అరిచారు. ఫ్యాన్స్ ఉత్సాహాన్ని చూసిన బుచ్చిబాబు నవ్వుతూ, "జూన్ 25 పెద్ది వస్తుంది" అంటూ కొత్త విడుదల తేదీని రివీల్ చేశారు. 'పెద్ది' మూవీ జూన్ లో వస్తుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు కానీ, డేట్ మాత్రం చెప్పలేదు. ఇటీవల జూన్ 25 రావొచ్చు అంటూ వార్తలొచ్చాయి. అయితే అధికారిక ప్రకటన రాకముందే.. ఫ్యాన్స్ ఉత్సాహం చూసి బుచ్చిబాబు డేట్ లీక్ చేయడం విశేషం. 'పెద్ది' సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఒక రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా. ఈ సినిమాలో రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని విధంగా ఒక పవర్ ఫుల్ మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. . బుచ్చిబాబు చేసిన ఈ అనౌన్స్‌మెంట్‌తో మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. జూన్ 25న 'పెద్ది' థియేటర్లలోకి వచ్చి ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. మరిన్ని ఆసక్తికర సినిమా అప్డేట్స్ కోసం తెలుగువన్ సినిమా (TeluguOne Cinema) యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.  
The release date shuffle in Tollywood has created a major headache for the makers of Akhil Akkineni’s upcoming film, Lenin. Director Buchi Babu Sana recently confirmed that Ram Charan’s highly anticipated period sports drama, Peddi, is officially locked for a theatrical release on June 25, 2026. While this is an exciting update for the audience, it leaves the Lenin team in a difficult situation. Originally, Lenin was scheduled to hit theaters on May 1. However, when the makers of Peddi previously announced an April 30 release, the Lenin team stepped back to avoid a clash. Out of goodwill, they voluntarily postponed Lenin to June 26. Unfortunately, production delays for Peddi resulted in Buchi Babu locking June 25 as the new date. Lenin now finds itself back in the line of fire.  Adding to the complications, reports indicate that Nagarjuna Akkineni recently watched the rushes of Lenin and has asked for critical re-shoots. Nagarjuna is personally overseeing the output to ensure the film is absolutely perfect.  He is determined to make this project a definitive box office winner for Akhil, who desperately needs a massive comeback following the disaster of his previous outing, Agent. With unexpected reshoots required and a massive theatrical clash looming, the Lenin makers are truly caught in the doldrums.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
South Indian cinema actress Mehreen Pirzada has officially entered a beautiful new phase in her life. Taking many by surprise over the weekend, the talented actress, well-known for her memorable performances in Telugu hits like F2: Fun and Frustration and Krishna Gaadi Veera Prema Gaadha, announced her marriage.   The private Anand Karaj ceremony took place on April 26, 2026, nestled in the picturesque hills of Chail, Himachal Pradesh. Surrounded by close relatives and friends, she tied the knot with Arsh Aulakh. The couple chose an elegant blush-pink theme for their special day. Mehreen looked stunning in a pastel pink ensemble designed by Sawan Gandhi, complemented by traditional polki jewelry, while Arsh coordinated perfectly in a matching blush-pink sherwani and turban.   Sharing her joy on social media, she posted candid pictures with a caption noting the date "26.04.26" alongside the hashtag #ArshDiMehr. The film community and colleagues quickly showered the couple with warm wishes. Arsh reportedly maintains a very private profile outside the entertainment industry.   Following this personal milestone, Mehreen is moving forward with her acting journey. She is currently preparing for her Kannada debut in Nee Sigoovaregu, balancing this fresh start in life with her continuing career.     Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  హనీ ఈజ్ ది బెస్ట్ అంటూ తెలుగు ప్రేక్షకులని తన ట్రాప్ లో పడేలా చేసిన భామ మెహ్రీన్(Mehreen Pirzada).. గోల్డెన్ లెగ్ అనే పేరు కూడా తెచ్చుకున్న మెహ్రిన్ రీసెంట్ గా సోషల్ మీడియాలో తన పెళ్లి పిక్స్ షేర్ చేసి సోషల్ మీడియాని తన ఆదీనంలో ఉంచుకుంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఏప్రిల్ 26 న అంటే నిన్న అర్ష్ ఔలక్ తో   మెహ్రిన్  వివాహం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా జరిగింది. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకల్లో మెహ్రీన్ మెరిసిపోయారు. పెళ్లికి ముందు జరిగిన మెహందీ, హల్దీ వేడుకల నుండి మొదలుకొని ప్రధాన కళ్యాణం వరకు ప్రతి ఘట్టం ఎంతో వేడుకగా సాగింది. తన పెళ్లి రోజున మెహ్రీన్ ధరించిన డిజైనర్ లెహంగా ,ప్రత్యేకమైన ఆభరణాలు ఆమెకి రాజసం తెచ్చిపెట్టాయి. ముఖంలో నవ వధువు కళ ఉట్టిపడుతుండగా, ఆమె చిరునవ్వు అభిమానులను కట్టిపడేస్తోంది. జంట చూడముచ్చటగా ఉందని, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యంగా మెహ్రీన్‌తో కలిసి పనిచేసిన టాలీవుడ్ స్టార్స్ మరియు స్నేహితులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. Also read: Archana Puran singh: ప్రముఖ నటి ఇంట క్రెడిట్ కార్డు స్కామ్.. మీరు కూడా ఉంటారేమో జాగ్రత్త   ఆమె వెడ్డింగ్ ఆల్బమ్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ కొత్త ప్రయాణంలో మెహ్రీన్ మరిన్ని విజయాలు అందుకోవాలని, ఆమె వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని మనమూ కోరుకుందాం. మెహ్రీన్ పెళ్లి వేడుకలకు సంబంధించిన మరిన్ని అద్భుతమైన దృశ్యాలను మీరు ఈ ఫోటో గ్యాలరీలో వీక్షించవచ్చు.. మెహ్రీన్ కి గతంలో అంటే 2021 లో  హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనవడు  భవ్య బిష్ణోయ్ తో ఎంగేజ్ మెంట్ జరిగి క్యాన్సిల్ అయ్యింది. నాచురల్ స్టార్ నాని నుంచి వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమ గాథ' తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. మరి పెళ్లి తర్వాత సినిమాల్లో కొనసాగుతారా లేదా అనేది చూడాలి.   
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది,  ఇష్టంగా అనిపిస్తుంది,  తమ చుట్టూ ఒక కొత్త ప్రపంచం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ కాలంతో పాటు ప్రేమ కూడా మారుతూ ఉంటుంది.  ముఖ్యంగా పరీక్షలు పెడుతూ ఉంటుంది.  ఇద్దరు వ్యక్తులు సిన్సియర్ గా ఉన్నారా లేదా అనేది కూడా కాలమే డిసైడ్ చేస్తుంది. అయితే ప్రేమించిన చాలా మంది సంతోషం కంటే ఎక్కువ బాధపడిన సందర్బాలే ఉంటాయి.  పదే పదే మనోవేదనకు గురవుతూ ఉంటారు.  ప్రేమ అనేది కేవలం ఒక్కరితో అగేది కూడా కాదు.. చాలామంది ప్రేమలో ఫెయిల్యూర్ వచ్చాక లేదా బ్రేకప్ అయ్యాక.. మళ్లీ ఇంకొకరితో ప్రేమలో పడతారు. కానీ అక్కడ కూడా మళ్లీ బాధ.. పదే పదే మానసిక వేధన బహుమానంలా లభిస్తాయి.  అసలు ప్రేమించేవారికి పదే పదే మానసిక వేధన ఎందుకు ఎదురవుతోంది? ఇందులో తప్పు ఎవరిది? తెలుసుకుంటే.. బాధ కలిగినా అదే మార్గంలో ప్రయాణం.. చాలామంది ప్రేమలో ఉన్నప్పుడు అయినా జీవితంలో వేరే బంధంలో అయినా.. తమకు బాధ కలిగినా సరే.. అదే జోన్ లోనే ఉండటానికి ఇష్టపడతారు. చిన్నతనంలోని అనుభవాలు,  పెరిగిన వాతావరణం,  గతంలో ఏర్పడిన బందాల వల్ల కలిగిన బాధ.. బందంలో గౌరవం లేకపోవడం వంటివి మనిషిని మారేలా చేయాలి. కానీ చాలామంది కొత్తగా ఏర్పడే ప్రతి బందంలోనూ అవే తప్పులు పదే పదే చేస్తుంటారు. అందుకే పదే పదే మనోవేధన కూడా ఎదురవుతూ ఉంటుంది. ఎమోషన్స్ నుండి బయట పడలేకపోవడం.. చాలా మంది తమకు తెలియకుండానే తమలాంటి భాగస్వాములనే ఎంచుకుంటారు. ఇది వారి సబ్ కాన్షియస్ మైండ్  చేసే ఒక ప్రయోగం.  గతంలో విషపూరితమైన సంబంధాలను అనుభవించి ఉంటే  మనస్సు వాటిని సాధారణమైనవిగా అంగీకరిస్తుంది. అందుకే పదే పదే అలాంటి రిలేషన్స్ వైపుకే  ఆకర్షితులు అవుతుంటారు. తమను తాము తక్కువగా  అంచనా వేసుకోవడం.. ఒక వ్యక్తి తమను తాము తక్కువగా అంచనా వేసుకున్నప్పుడు, వారు తరచుగా సంబంధాలలో తాము తక్కువ అన్నట్టు ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎదుటి మనిషి వ్యక్తిత్వం గురించి పెద్దగా పట్టించుకోకుండా  పదే పదే తప్పుడు భాగస్వామిని ఎంచుకుంటారు. మార్పు పట్ల భయం.. చాలా మంది తాము తప్పులు చేస్తున్నామని తెలిసినా, మారడం వల్ల ఎదురయ్యే నష్టాలు,  ప్రమాదాలను చూసుకుని మారడానికి భయపడతారు.  అందుకే వారు అవే పాత పద్ధతులలో చిక్కుకుపోయి ఉంటారు. గత గాయాల ప్రబావం.. గత సంబంధాల వల్ల కలిగిన గాయం, పూర్తిగా మానకపోవడం వంటివి చాలామంది పదే పదే అవే తప్పులు చేసేలా చేస్తాయి.  ఇలాంటి వారు  భావోద్వేగపరంగా కోలుకునేంత వరకు, సరైన నిర్ణయాలు తీసుకోలేరు. గందరగోళం.. చాలా మంది ప్రేమకు , భావోద్వేగ అనుబంధానికి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోరు. వారు తప్పుడు వ్యక్తికి దగ్గరై, దానినే ప్రేమగా పొరబడతారు, తద్వారా అవే తప్పులను రిపీట్ చేస్తూ ఉంటారు.   ప్రేమలో లేదా రిలేషన్ లో  అవే తప్పులను పదే పదే చేయడం అనేది విధి రాసే రాత కాదు.. అది మనిషి  అలవాట్లు,  ఆలోచనా విధానం ఇచ్చే  ఫలితం. ప్రతి వ్యక్తి తన  పద్ధతులను గుర్తించి, తమను తాము  సరిదిద్దుకున్నప్పుడు మాత్రమే ఇలా పదే పదే బాధపడే బంధంలో చిక్కుకోవడాన్ని నివారించగలుగుతారు. సింపుల్ గా చెప్పాలంటే.. ప్రతి మనిషి ప్రేమలో లేదా రెలేషన్ లో.. పదే పదే మానసిక వేదనకు అనుభవించడానికి అక్షరాలా ఆ మనిషి చేతులారా చేసుకునే తప్పులు,  పరిస్థితులకు అనుగుణంగా మారకపోవడం,  పాత ఆలోచనలు, సిద్దాంతాలలో  చిక్కుకుని ఉండటం వంటివి కారణం అవుతాయి.                                    *రూపశ్రీ.
వేసవి కాలం వచ్చిందంటే చాలు..  ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం  పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు  తప్పనిసరి అవుతాయి.  రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి. అయితే కూలర్లు వాడేవారు దాని శుభ్రత గురించి మాత్రం అంత శ్రద్ద తీసుకోరు. దీని వల్ల నీరు మురికిగా మారి దోమలు పెరగడానికి ఆవాసంగా మారడమే కాకుండా.. . కూలర్‌లోని నీటిని శుభ్రంగా ఉంచకపోతే కూలింగ్ కూడా పెద్దగా రాదు.   అయితే కూలర్ లో నీటిని ప్రతిరోజూ శుభ్రం చేయడం అంత ఈజీ ఏమీ కాదు.. కొన్ని కంపెనీల కూలర్లలో నీటిని నింపడం సులువే.. కానీ వాటిలో నీటిని తొలగించడం, శుభ్రం చేయడం కాస్త శ్రమతో కూడుకున్నదే.. అయితే.. కూలర్లలో నీరు ప్రతిరోజూ శుభ్రం చేయకపోయినా కొన్నిరోజుల పాటు నీరు శుభ్రంగా ఉండాలన్నా, తాజాగా అనిపించాలన్నా కేవలం ఒకే ఒక్క చిట్కా అద్బుతంగా పనిచేస్తుంది. అదేంటో తెలుసుకుంటే.. పటిక.. కూలర్‌లోని నీటిని శుభ్రంగా ఉంచడానికి పటిక చాలా సులభమైన,  ఇంటి చిట్కా. దీనిని నీటిలో వేయడం  వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కూలర్ ట్యాంక్‌లో నీరు తరచుగా ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది, ఇది తొందరగా మురికిగా మారే అవకాశం ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ నీటిలో దోమలు  ఆవాసం ఏర్పాటు చేసుకుని  గుడ్లు పెడతాయి. అయితే కూలర్ ఎక్కువ కాలం పనిచేయాలంటే   దానిని శుభ్రపరచడం చాలా ముఖ్యం. నీటిలో ఒక చిన్న పటిక ముక్కను వేయడం వల్ల నీటిని శుభ్రపరచవచ్చు.  పైగా దోమల సమస్య కూడా తగ్గుతుంది. కూలర్ ట్యాంక్ లో పటిక వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు.. నీటి స్వచ్చత.. పటిక నీటిలోని దుమ్ము, ధూళి , చిన్న కణాలను బంధిస్తుంది. ఈ కణాలు బరువెక్కి అడుగుకు చేరుకుంటాయి, దీనివల్ల పైన ఉన్న నీరు స్వచ్ఛంగా ఉంటుంది. దోమలకు చెక్.. పటిక నీటిని శుద్ధి చేయడం వల్ల దోమల గుడ్లు, లార్వాలు సులభంగా వృద్ధి చెందలేవు. దీనివల్ల దోమల సమస్య గణనీయంగా తగ్గుతుంది. దుర్వాసన.. కూలర్ నీటి నుండి ఏదైనా వింత లేదా దుర్వాసన వస్తుంటే, దానిని చాలా వరకు తగ్గించడంలో పటిక సహాయపడుతుంది. బ్యాక్టీరియా..  పటికకు తేలికపాటి యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నాయి, ఇవి నీటిలో ఉండే  హానికరమైన బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడతాయి. నీటి నాణ్యత.. పటిక నీటిని ఎక్కువ సేపు శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది, దీనివల్ల కూలర్ ప్యాడ్‌లు త్వరగా పాడవకుండా ఉంటాయి , గాలి చల్లగా ఉంటుంది. పటికను ఉపయోగించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు.. పటికను ఎక్కువ పరిమాణంలో వాడకూడదు. ఒక చిన్న ముక్క సరిపోతుంది. ఎక్కువ పటిక కలపడం వల్ల నీటి నాణ్యత దెబ్బతింటుంది. అంతేకాకుండా కూలర్‌లోని నీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచకుండా అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి.                                 *రూపశ్రీ.
  వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి. ఈ కారణంగానే ఇప్పట్లో ప్రతి ఇంట్లో కూలర్లు వాడుతున్నారు.  కాస్త అర్థిక స్థితి ఉన్నవారేతై ఏసీ లు కూడా పెట్టించుకుంటారు. కానీ రానురాను పెరుగుతున్న ఎండలు,  వాటి తాలుకూ వేడి కారణంగా కూలర్లు కూడా సరిపోవడం లేదని అనుకుంటూ ఉంటారు. కానీ.. సాధారణ కూలర్ ను కూడా చక్కగా ఏసీ లాంటి చల్లదనం ఇచ్చేలా చేయవచ్చు.  ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. సాధారణ కూలర్ తో ఏసీ లాంటి చల్లదనం కావాలంటే.. ఏ చిట్కాలు పాటించాలో తెలుసుకుంటే.. సాల్ట్ , ఐస్.. కూలర్  చల్లటి గాలిని అందించాలని  అనుకుంటే, ఐస్ లేదా ఉప్పు నీటిని కలపడం చాలా ప్రభావవంతమైన పద్ధతి. ఇది చాలా ఫేమస్ చిట్కా కూడా.  కూలర్ ట్యాంకులో రాళ్ల ఉప్పు,   ఐస్ క్యూబ్స్ వేస్తారు.  రాళ్ల ఉప్పు ఐస్ క్యూబ్స్ కరగకుండా ఎక్కువ సేపు ఉండేలా చేస్తాయి. దీని వల్ల కూలింగ్ బాగా వస్తుంది. అయితే.. ఇది రెగ్యులర్ గా చేయడం మంచిది కాదు.. ఉప్పు తొందరగా చిలుము పట్టేలా చేస్తుంది. దీని వల్ల కూలర్ లోని మెటల్ భాగాలు తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని ఎప్పుడైనా వేడి భరించలేని సమయాల్లో ట్రై చేయడం మంచిది. వెంటిలేషన్.. చాలా మంది ఏసీ లాంటి చల్లదనం వస్తుందని ఆశించి,  కూలర్లను మూసి ఉన్న గదులలో వాడుతుంటారు, కానీ ఇది  పెద్ద పొరపాటు. సరైన వెంటిలేషన్ ఉన్నప్పుడే ఎయిర్ కూలర్ సరిగ్గా పనిచేస్తుంది. గదిలో  వేడి గాలి బయటకు పోవడానికి , చల్లని గాలి లోపల ప్రసరించడానికి వీలుగా ఒక కిటికీని లేదా తలుపును తెరిచి ఉంచడం ముఖ్యం. సరైన వెంటిలేషన్ కూలర్ పనితీరును  మెరుగుపరుస్తుంది. శుభ్రత.. కాలక్రమేణా కూలర్ ప్యాడ్‌లపై దుమ్ము, ధూళి పేరుకుపోయి, వాటి కూలింగ్ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అందువల్ల వాటిని క్రమం తప్పకుండా శుభ్రపరచడం లేదా మార్చడం ముఖ్యం. కూలర్ చాలా చల్లని గాలిని ఇవ్వాలి అంటే.. కూలర్ లోపల వట్టివేర్లతో తయారు చేసిన మ్యాట్లను  ఉపయోగించాలి. ఇది కూలింగ్ ను మెరుగుపరుస్తుంది. వట్టివేర్ల  గుండా నీరు ప్రవహించినప్పుడు, గాలి చల్లగా, తాజాగా మారుతుంది, మంచి  తేలికపాటి సువాసనను కూడా అందిస్తుంది. పైన పేర్కొన్న చిట్కాలను పాటించడం వల్ల వేసవి కాలంలో కూలర్ ఏసీ లాంటి చల్లదనాన్నిఇస్తుంది.                                     *రూపశ్రీ.
  కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి.  చాలా పరిశుభ్రతలో బాగంగా మౌత్ వాష్ లు వాడుతుంటారు.  కొందరు పళ్లు తోమే పని లేకుండా మౌత్ వాష్ వాడితే.. మరికొందరు పళ్లు తోమిన తర్వాత కూడా ఇంకా పళ్లు ఎక్కువగా శుభ్రం అవుతాయని అతి శుభ్రతతో మౌత్ వాష్ కూడా వాడతారు. అయితే.. మౌత్ వాష్ వాడే వారికి డాక్టర్లు ఓ చల్లని చావు కబురు చెబుతున్నారు.  మౌత్ వాష్ వాడితే రక్తపోటు సమస్య వస్తుందని అంటున్నారు.  దీని గురించి వైద్యులు చెప్పిన విషయాలు వివరంగా తెలుసుకుంటే.. మౌత్ వాష్.. నోటి ఆరోగ్యం.. నోటిలోని మంచి బ్యాక్టీరియా మానవ శరీరానికి చాలా అవసరం. ఈ బ్యాక్టీరియా ఆహారంలోని నైట్రేట్‌లను నైట్రైట్‌లుగా మార్చడానికి సహాయపడతాయి, ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. నైట్రిక్ ఆక్సైడ్ అనేది రక్తనాళాలను సడలించడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి , రక్తపోటును నియంత్రించడానికి సహాయపడే ఒక ముఖ్యమైన అంశం. మౌత్ వాష్ వల్ల కలిగే నష్టం.. బలమైన యాంటీసెప్టిక్ మౌత్‌వాష్‌లు నోటిలోని  మంచి బ్యాక్టీరియాను కూడా చంపగలవని నిపుణులు అంటున్నారు. ఇది నైట్రేట్, నైట్రైట్‌గా మారే ప్రక్రియను ప్రభావితం చేస్తుంది , శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను తగ్గించగలదు. ఇది నేరుగా రక్తనాళాల పనితీరుపై ప్రభావం చూపుతుంది, తద్వారా రక్తపోటును ప్రభావితం చేసే అవకాశం ఉంది. యాంటీ బాక్టీరియల్ మౌత్‌వాష్ వాడకం వల్ల నోటిలోని అవసరమైన బ్యాక్టీరియా 90 శాతం వరకు తగ్గుతుందని కొన్ని అధ్యయనాలలో తేలిందని వైద్యులు కూడా చెబుతున్నారు. కేవలం కొన్ని రోజుల వాడకం కూడా లాలాజలంలో నైట్రేట్ స్థాయిలను తగ్గించగలదని, దీనివల్ల సిస్టోలిక్ రక్తపోటులో స్వల్ప పెరుగుదల ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. మౌత్ వాష్ ఎక్కువ కాలం ఉపయోగిస్తే.. రోజు ఎక్కువగా మౌత్‌వాష్ ఉపయోగించడం వల్ల దీర్ఘకాలంలో అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మంచి బ్యాక్టీరియాను తగ్గించడం, నైట్రిక్ ఆక్సైడ్‌ను తగ్గించడం, , రక్తనాళాల సరైన పనితీరును దెబ్బతీసే ప్రక్రియ వలనే ఇది జరుగుతుందని అంటున్నారు. దీని ప్రభావాలు అందరిపై తీవ్రంగా ఉండనప్పటికీ, రెగ్యులర్ గా అందులోనూ ఎక్కువగా వాడటం వల్ల ప్రమాదం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. చిగుళ్ల వ్యాధి, దంత చికిత్స తర్వాత, లేదా దంతాలపై అధికంగా పాచి పేరుకుపోయిన వంటి కొన్ని పరిస్థితులలో మౌత్‌వాష్ వాడకం  అవసరం అవుతుంది. అందువల్ల, మౌత్‌వాష్‌ను అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలని, దానిని రోజువారీ అలవాటుగా చేసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. నోటి శుభ్రతకు బ్రష్ చేయడమే మంచిదని, దీనికే ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు. కాబట్టి మౌత్ వాష్ ఎక్కువగా వాడకూడదు.                                      *రూపశ్రీ.
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం,  జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి జింక్ చాలా కీలకం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు అవసరం అవుతాయి. అలాంటి వాటిలో జింక్ కూడా ఒకటి. అయితే చాలామందికి జింక్ లోపం గురించి పెద్దగా అవగాహన ఉండదు.  జింక్ లోపం వల్ల ఇన్ఫెక్షన్లు సోకుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇది నిజమేనా? జింక్ లోపం గురించి.  జింక్ లోపం వల్ల వచ్చే సమస్యల గురించి వైద్యులు ఏం చెబుతున్నారు తెలుసుకుంటే.. శరీరానికి జింక్ ఎందుకు అవసరం..  జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి , చర్మానికి జింక్ చాలా అవసరం. జింక్ చర్మాన్ని మృదువుగా ఉంచడానికి , కణజాలాలను బాగు చేయడానికి సహాయపడుతుంది. జింక్ లోపం తరచుగా ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చని, చర్మ, కడుపు సమస్యలను కూడా కలిగించవచ్చని వైద్యులు చెబుతున్నారు. జింక్ లోపం వల్ల వచ్చే సమస్యలు.. జింక్ లోపం శరీరంలో అనేక రకాల సమస్యలను కలిగిస్తుంది. జింక్ లోపం పిల్లలలో పెరుగుదలను నిరోధించగలదు , మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇన్ఫెక్షన్లు.. జింక్ లోపం తరచుగా ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. జింక్ లోపం ఇన్ఫెక్షన్లతో పోరాడే శరీర సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. దీనివల్ల ఫంగస్ , చర్మం ఎర్రబడటం వంటి సమస్యలు తలెత్తవచ్చు. విరేచనాలు.. వైద్యుల ప్రకారం, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి జింక్ చాలా అవసరం. జింక్ లోపం జీర్ణవ్యవస్థపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. శరీరంలో జింక్ లోపించినప్పుడు, విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. గాయాలు.. జింక్ లోపం చర్మం, కడుపునే కాకుండా గాయాలను కూడా ప్రభావితం చేస్తుంది. జింక్ లోపం ఉన్నవారిలో గాయాలు నెమ్మదిగా నయమవుతాయి. జింక్ లోపిస్తే కనిపించే లక్షణాలు.. జింక్ లోపం వేగంగా బరువు తగ్గడం, నీరసం , జుట్టు రాలడం వంటి లక్షణాలు కలిగి ఉంటుంది. జింక్ పుష్కలంగా లభించే ఆహారాలు.. ఆహారంలో జింక్‌ను చేర్చుకోవడానికి,  గుమ్మడి గింజలు, నువ్వులు, ఆవాలు, పొద్దుతిరుగుడు గింజలు , రాగులను చేర్చుకోవచ్చు. ఈ ఆహారాలలో జింక్ ఉంటుంది. అదనంగా,  ఆవాల ఆకుకూర, మాంసం, పప్పుధాన్యాలు, గుమ్మడికాయ, పుట్టగొడుగులు, పెరుగు, వేరుశెనగలు , గుడ్లను కూడా తినవచ్చు. ఈ ఆహారాలలో కూడా జింక్ సమృద్దిగా ఉంటుంది.                                 *రూపశ్రీ.
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ అవసరం లేకుండా కొద్దిమోతాదులో అందుతుంది.  అయితే  అన్ని రకాల కూరగాయలను ఇనుప పాత్రలో వండకూడదు.  . కొన్ని కూరగాయలు ఐరన్ పాత్రలో వండినప్పుడు రియాక్షన్ జరిగి వాటి రుచి, రంగు లేదా పోషక విలువల్లో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.  ఆహారం  నాణ్యత , రుచిని కోల్పోకుండా ఉండేందుకు, ఐరన్ పాత్రలు వాడే ప్తి ఒక్కరూ వాటిలో వండకూడని కూరగాయలు ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. టమోటా.. టమోటాలు వంటల్లో ఎక్కువగా ఉపయోగించే  కూరగాయ. టమోటాలలో ఆమ్లం అధిక మొత్తంలో ఉంటుంది, ఇది ఐరన్ తో చర్య జరుపుతుంది. దీనివల్ల కూరగాయ రంగు ముదురుగా మారవచ్చు , కొద్దిగా వగరు రుచిని కలిగి ఉండవచ్చు. ఎక్కువసేపు వండటం ఈ ప్రభావాన్ని మరింత ఎక్కువ చేస్తుంది. అందువల్ల, టమోటా వంటి  కూరగాయలను స్టీల్ లేదా నాన్-స్టిక్ పాన్ లేదా బౌల్స్ లో వండాలి. పాలకూర.. పాలకూర వంటి ఆకుకూరలు ఐరన్ ప్రభావానికి గురైనప్పుడు వాటి  ఆకుపచ్చ రంగును కోల్పోయి, ముదురు రంగులోకి లేదా నల్లగా మారవచ్చు, దీనివల్ల అవి తినడానికి పనికిరావు. రుచిలో కూడా కొద్దిగా మార్పు ఉంటుంది. ఆకుకూరలను అల్యూమినియం లేదా స్టీల్ పాత్రలలో వండటం ఉత్తమం. చింతపండు.. చింతపండు ఉపయోగించి వండే  కూరను ఇనుప పెనంలో వండకూడదు. వీటిలో ఉండే ఆమ్లాలు ఇనుముతో చర్య జరిపి ఆహారం రుచిని మార్చి, దానికి లోహపు రుచిని ఇస్తాయి. ఇది అనారోగ్యకరమైనదిగా కూడా పరిగణించబడుతుంది. అందువల్ల, స్టీల్ లేదా నాన్-స్టిక్ పెనాన్ని ఉపయోగించాలి.  కేవలం చింతపండు మాత్రమే కాకుండా నిమ్మకాయ,  మామిడికాయ వంటివి కూడా ఐరన్ పాత్రలలో వండకూడదు. పెరుగు వంటలు.. పెరుగుతో చేసిన కూర లేదా పెరుగు గ్రేవీ వంటి కూరగాయల వంటకాలను ఇనుప పెనంలో వండినప్పుడు వాటి రుచి భిన్నంగా ఉంటుంది. పెరుగులోని పులుపు ఇనుముతో కలిసి కొద్దిగా చేదును కలిగిస్తుంది. అంతేకాకుండా రంగు ముదురుగా మారవచ్చు , కూరలో కొద్దిగా నలుపు కనిపించవచ్చు. నిమ్మకాయ.. కూరగాయలకు నిమ్మరసం కలపడం వల్ల వాటికి కొద్దిగా పులుపు, రుచి వస్తుంది, కానీ అది ఐరన్ తో  చర్య జరిపి రుచిని పాడుచేసే అవకాశం ఉంది.  దీనివల్ల ఆహారానికి లోహపు, వగరు రుచి వస్తుంది, కాబట్టి నిమ్మరసాన్ని ఎల్లప్పుడూ వంట చేసిన తర్వాత, తినడానికి ముందు మాత్రమే కలపాలి. ఎక్కువ నీటి శాతం కలిగిన కూరలు.. అధిక నీటి శాతం ఉన్న కూరగాయలను ఐరన్ పెనంలో వండినప్పుడు వాటి రంగు, ఆకృతి మారవచ్చు. ఈ కూరగాయలను ఎక్కువ సేపు వండితే నల్లగా మారిపోతాయి. అందువల్ల వాటిని రసాయనాలతో చర్య జరపని పాత్రలలో వండటం మంచిది.                               *రూపశ్రీ.