LATEST NEWS
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  దక్షిణాది ప్రజల సాంస్కృతిక, మత గుర్తింపునకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారాయి.  దేశ రాజధాని హస్తినలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఉత్తర, దక్షిణ భారతదేశ ప్రజల సాంస్కృతిక, మతపరమైన గుర్తింపుల గురించి చేసిన విశ్లేషణ రాజకీయదుమారాన్ని రేపింది. రాజకీయ ప్రయోజనాల కోసం సమాజంలో విభజన తెచ్చేలా సీఎం రేవంత్ మాట్లాడారంటూ బీజేపీ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తోంది.   దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల ఆరాధనా విధానాలు, దేవుళ్ల ప్రాధాన్యతను వివరిస్తూ.. రేవంత్ రెడ్డి ఆ మీడియా సమావేశంలో దక్షిణాది  వారు ద్రావిడులని, ఉత్తరాది వారులు  ఆర్యులని అన్నారు.   దక్షిణాది వారు శివభక్తులు, ఉత్తరాది వారు శ్రీరామ భక్తులుగా అభివర్ణించారు.  అక్కడితో ఆగకుండా  బీజేపీ నాయకులు ఎప్పుడూ  జై శ్రీరామ్ నినాదాలకే పరిమితమవుతారని,  హర హర మహాదేవ్'అని ఎందుకు అనరని నిలదీశారు. శివుడిని పేదల దేవుడిగా, రాముడిని ధనవంతుల దేవుడిగా అభివర్ణిస్తూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. పెను వివాదానికి హేతువయ్యాయి.   రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై  నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.  ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే హిందువులను ప్రాంతాల వారీగా, దేవుళ్ల పేరుతో విడగొట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శిస్తున్నారు. సోమనాథ్ ఆలయ నిర్మాణం మొదలుకొని అనేక ధార్మిక ప్రాజెక్టులను గతంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందని, ఇప్పుడు మళ్లీ అదే వైఖరిని ప్రదర్శిస్తోందని గుర్తు చేస్తున్నారు.  అంతేకాకుండా..  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  జై శ్రీరామ్'తో పాటు 'హర హర మహాదేవ్ అని కూడా నినదించే   అంటున్నారు. రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.  హిందువుల మధ్య ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడమే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోందని దుయ్యబట్టారు.   [Revanth Reddy Comments, Lord Rama, Lord Shiva controversy, BJP,  Congress, North South India Identity, National politics, Telugu One]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్య సంచలనంగా మిగిలిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఉదంతం మరోసారి రాజకీయ దుమారం  ఈ హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నాటి ఘటనకు సంబంధించి పలువురు ప్రముఖుల ప్రమేయం,   ఈ కేసులో కొందరికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ రాజకీయ లబ్ది చేకూరిందనే ఆరోపణలు సంచలనంగా మారాయి. . ఘటన జరిగిన నాటి నుంచి దర్యాప్తు సరళి, కేసు దారి మళ్లిన వైనంపై వివిధ రాజకీయ పక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురైన సమయంలో స్థానిక పరిస్థితులు, తదనంతరం తెరపైకి వచ్చిన అంశాలు పలు అనుమానాలకు తావునిచ్చాయి. ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు. ఈ కేసు విషయంలో ఆమె అలుపెరుగని న్యాయపోరాటం చేశారు. చేస్తున్నారు.  ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ విచారణలో  హత్య జరిగిన రోజు ఉదయం నుంచి జరిగిన పరిణామాలు, టెలిఫోన్ సంభాషణలు, గూగుల్ టేకౌట్ వివరాలు నేరస్థలంలో లభించిన భౌతిక సాక్ష్యాలు, అనుమానితుల కదలికలతో పకడ్బందీగా ముందుకు సాగింది.   ఈ వ్యవహారంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి రెడ్డి అలాగే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిల పేర్లు ప్రముఖంగా ప్రస్తావనకు వస్తున్నాయి. హత్యకు గురైన తర్వాత  సమాచారం బయటకు పొక్కకుండా వారు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. వివేకా కుమార్తె వైఎస్ సునీత తన తండ్రి మృతిపై న్యాయం కోరుతూ సాగిస్తున్న సుదీర్ఘ పోరాటానికి పలు రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది.    ఇక తాజాగా ఈ కేసులో ఏ2గా ఉన్న యాదటి సునీల్ యాదవ్  సంచలన విషయాలను వెల్లడించారు. వివేకా హత్య ద్వారా లబ్ధి పొందిన వారు మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి అని కుండబద్దలు కొట్టారు. వైఎస్ వివేకా హత్యకు గురి కాకుండా ఉంటే ఆయన నిస్సందేహంగా కడప ఎంపీ అయి ఉండేవారన్న సునీల్ యాదవ్.. దీనిని బట్టే ఈ హత్య వల్ల లబ్ధి పొందినది ఎవరన్నది సులభంగా అవగతమౌతుందన్నారు. సోమవారం (సెప్టెంబర్ 28)  ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సునీల్ యాదవ్.. వైఎస్ వివేకా హత్య విషయంలో తెరముందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఉన్నా తెర వెనుక ఉన్నది కచ్చితంగా వైఎస్ జగన్, వైఎస్ భారతి అని విస్పష్టంగా చెప్పారు. వివేకాను హత్య చేయాల్సిన అవసరం తనకు ఇసుమంతైనా లేదన్న ఆయన.. వివేకా హత్యకు గురికాకుండా ఉండి ఉంటే.. ఆయన తనను యాదవ కార్పొరేషన్ చైర్మన్ ను చేసేవారని సునీల్ యాదవ్ చెప్పారు.  ఈ సందర్భంగా ఆయన తన ప్రాణానికి ముప్పు ఉందన్న ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ జగన్  నుంచి తనకు ముప్పు ఉందనీ, తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఇప్పటికే తనపై మూడు సార్లు హత్య ప్రయత్నం జరిగిందని చెప్పిన సునీల్ యాదవ్.. ఈ కేసులో కీలక సాక్షులు అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతిని గుర్తు చేస్తూ తనకు రక్షణ కల్పించాలని ఏపీ, తెలంగాణ సీఎంలకు విజ్ణప్తి చేశారు.  [YS Vivekananda Reddy Murder Case, YS Jagan Mohan Reddy, YS Bharathi, YS Avinash Reddy, AP Politics, A2 Sunil Ydaev, Sensational, Reveal, Telugu One]
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. వేర్వేరు హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులుగా సేవలు అందిస్తున్న ముగ్గురు ప్రముఖ సీనియర్ న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుల ప్రకారం, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సునీతా అగర్వాల్, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, అలాగే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌లను అత్యున్నత న్యాయస్థానానికి పదోన్నతి కల్పించాలని కొలీజియం నిర్ణయించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న ఖాళీలను భర్తీ చేయడంలో భాగంగా ఈ పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో వీరు తమ సుదీర్ఘ కాలపు న్యాయ సేవల ద్వారా విశేష అనుభవాన్ని గడించారు. విధి నిర్వహణలో వారు కనబరిచిన ప్రతిభ, సమర్థతను పరిగణనలోకి తీసుకునే కొలీజియం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. న్యాయ వ్యవస్థలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పదవులకు ఎంపికైన ఈ ముగ్గురు న్యాయమూర్తుల నేపథ్యం ఎంతో ఘనమైనది. వివిధ వివాదాలపై విచారణ జరుపుతూ రాజ్యాంగబద్ధమైన తీర్పులు వెలువరించడంలో వీరు ముందున్నారు. ముఖ్యంగా న్యాయవాద వృత్తి నుంచి మొదలుపెట్టి వివిధ స్థాయిల్లో జ్యుడీషియల్ బాధ్యతలు నిర్వర్తించిన వీరి అనుభవం సర్వోన్నత న్యాయస్థానానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై న్యాయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి, అలాగే బెంచ్ సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేయడానికి ఈ కొత్త నియామకాలు ఎంతో దోహదపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక తదుపరి ప్రక్రియలో భాగంగా, కొలీజియం సిఫార్సు చేసిన ఈ ముగ్గురు న్యాయమూర్తుల పేర్లను కేంద్ర ప్రభుత్వం పరిశీలించనుంది. కేంద్రం ఆమోద ముద్ర వేసిన అనంతరం రాష్ట్రపతి కార్యాలయం నుంచి వీరికి సంబంధించిన అధికారిక నియామక ఉత్తర్వులు వెలువడనున్నాయి. త్వరలోనే వీరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.     [ Supreme Court Collegium, High Court Chief Justices, Apex Court Judges, Supreme Court News, Judicial Appointments India, Justice Sunita Agarwal, Justice Devendra Kumar, Telugu One, Telugu News ]
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రి వద్ద ఉన్న రేకుల షెడ్‌పైకి ఎక్కిన అతడు.. చేతిలో పదునైన రాళ్లు పట్టుకుని కింద ఉన్న వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. తన దగ్గరకు ఎవరైనా వస్తే రాళ్లు విసిరేస్తానంటూ బెదిరించ డంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.షెడ్‌పై నుంచి కిందకు చూస్తూ రాళ్లు చేతిలో పట్టుకుని హల్‌ చల్‌ చేయడంతో ఆసుపత్రి కి వచ్చిన రోగులు, వారి సహాయకులు, సెక్యూరిటీ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అతడు ఎప్పుడు ఏం చేస్తాడోనన్న భయంతో సిబ్బంది అప్రమ త్తంగా వ్యవహరించారు. దాదాపు అరగంట పాటు షెడ్‌పైనే ఉంటూ కింద ఉన్నవారిపైకి రాళ్లు విసిరేస్తానంటూ బెదిరించ డంతో అక్కడ టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో గాంధీ ఆసుపత్రి వద్ద కొంతసేపు రాకపోకలు, సాధారణ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. అతడిని కిందకు దింపేందుకు సెక్యూరిటీ సిబ్బంది ప్రయత్నించినప్పటికీ.. రాళ్లు విసిరేస్తానంటూ హెచ్చరించడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. పరిస్థితి మరింత తీవ్రం కాకుండా సిబ్బంది దూరంగా ఉండి అతడిని గమనిస్తూ ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మానసిక రోగిని కిందకు దింపేందుకు పోలీసులు కూడా జాగ్రత్తగా వ్యవహరిం చారు. కొద్దిసేపటి పాటు కొనసాగిన ఈ హైడ్రామా అనంతరం ఎట్టకేలకు అతడిని పోలీసులకు అదుపులోకి తీసుకు న్నారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది, రోగులు, వారి బంధువులు ఊపిరి పీల్చు కున్నారు.దాదాపు గంటపాటు కొనసాగిన ఈ ఘటన గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో కలకలం రేపింది. రాళ్లతో హల్‌చల్‌ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం తో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది.       [ Gandhi Hospital, Secunderabad, Mental Health Patient, Hospital Incident, Stone Attack, Hospital Tension, Police Intervention, High Drama, Hospital Security, Telangana News, Hyderabad News, Patient Commotion, Gandhi Hospital Incident, Police Action, Security Alert ]  
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు. ఇటీవల ఈశాన్య రాష్ట్రమైన అసోంలో జరిగిన ప్రముఖ పత్రికల జాతీయ సదస్సులో ఆయన పాల్గొని, దేశంలో నెలకొన్న కేంద్ర-రాష్ట్రాల సంబంధాలు, ఆర్థిక వివక్షపై నిర్భయంగా తన అభిప్రాయాలను వెల్లడించారు.ఈ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఉత్తరాది ఆధిపత్య ధోరణులు పెరుగుతున్నాయని పరోక్షంగా విమర్శించారు. దేశ రాజధానిలో కీలక పదవులన్నీ ఒకే ప్రాంతం వారి చేతుల్లో కేంద్రీకృతం కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రా నుంచి భారీగా పన్నులు వసూలు చేసుకుంటూ, కేవలం దిల్లీకి నమస్కరించే స్థాయిలోనే ప్రాంతాలు ఉండకూడదన్న ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. దేశాభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కూడా సీఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాలకే పరిమితమైన అభివృద్ధితో దేశం మొత్తాన్ని సమగ్రంగా ముందుకు తీసుకెళ్లలేమని ఆయన స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా బలపడి దేశానికి వెన్నెముకగా నిలుస్తున్నప్పటికీ, వాటి హక్కులను మరియు వనరులను సరిగ్గా గౌరవించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆయన గుర్తుచేశారు. చిన్న గ్రామాలు, ఆదివాసీ గూడేల్లోనూ పాఠశాలలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికీ విద్య అందించేందుకు ప్రయత్నించారని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 27 వేల పాఠశాలలు, 1.25 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. ఆ తర్వాత ఆరోగ్య రంగంపైనా దృష్టి సారించారని, స్వాతంత్య్రం వచ్చిన సమయంలో దేశంలో సగటు ఆయుర్దాయం 33 ఏళ్లు ఉండగా.. ప్రస్తుతం 73 ఏళ్లకు చేరిందని చెప్పారు. తెలంగాణలో విద్యాశాఖను తాను ఎంచుకున్నానని చెప్పారు. రెవెన్యూ, ఆర్థిక శాఖలపై చర్చ జరిగినా వాటిని తీసుకోకుండా విద్యాశాఖను తీసుకున్నానని తెలిపారు. భూ గరిష్ట పరిమితి చట్టం వచ్చిన తర్వాత తెలంగాణలో 25 లక్షల ఎకరాలను దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన, పేద కుటుంబాలకు పంచారని, ప్రస్తుతం పంచేందుకు రాష్ట్రంలో భూములు లేవని అన్నారు.గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్న సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ గుజరాత్ అభివృద్ధికి సహకరించారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణకు అంత స్థాయిలో కేంద్రం నుంచి సహకారం లభించడం లేదని అన్నారు. తెలంగాణకు మెట్రో రైలు, రీజినల్ రింగ్ రోడ్, జాతీయ రహదారుల విస్తరణ వంటి అంశాల్లో కేంద్రం నుంచి సహకారం అందడం లేదని ఆరోపించారు. 360 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డుకు టెండర్లు పిలిచి రెండేళ్లు అవుతున్నా ఫైల్ ప్రధానమంత్రి కార్యాలయంలోనే ఉందని చెప్పారు.కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని అడిగినప్పుడల్లా ఫైల్ ప్రధానమంత్రి వద్ద ఉందని చెబుతున్నారని పేర్కొన్నారు.సత్య నాదెళ్ల, శంతను నారాయణ్, అజయ్ బంగా తదితరులు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నారని ప్రస్తావించారు. తెలంగాణలో ఐఎస్‌బీ, ఐఐటీ, నల్సార్ వంటి విద్యాసంస్థలు ఉన్నాయని, నిపుణులు ఉన్న చోటే కంపెనీలు వస్తాయని అన్నారు. ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల్లోని అవకాశాలను ప్రోత్సహించాలని అన్నారు. గుజరాత్‌కు పోర్టు వంటి అవకాశాలు ఉంటే, తెలంగాణకు విమానాశ్రయం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉన్నాయని చెప్పారు.అంబేడ్కర్, మన్మోహన్‌సింగ్, అబ్దుల్ కలాం వంటి వారు చదువుకోవడం వల్లే గొప్ప స్థాయికి ఎదిగారని చెప్పారు. యువతకు నాణ్యమైన విద్య, నైపుణ్యాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ విద్యా విధానంలోని లోపాలను గుర్తించామని సీఎం తెలిపారు.  2006లో జ‌డ్పీటీసీ స‌భ్యునిగా,  2007లో ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్‌గా గెలిచా. ఆ రెండు సార్లు నేను  కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించా.. అక్క‌డ రెండు పార్టీలే ఉన్నాయి.. కాంగ్రెస్, తెలుగుదేశం. నాకు జిల్లాలో కాంగ్రెస్  నాయకులతో పెద్ద‌గా సంబంధాలు పెద్దగా లేవు.. ప్ర‌భుత్వంపై పోరాడాలంటే ప్ర‌తిప‌క్ష‌మే మేల‌ని భావించా.. అందుకే నేను తెలుగుదేశంలో చేరా..  ఆ పార్టీ నుంచి 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలిచా. 2017లో కాంగ్రెస్‌లో చేరాను.  2019లో ఎంపీగా గెలిచాని రేవంత్ తెలిపారు.తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన దాని కంటే తాను ఎక్కువగా జైలుకే వెళ్లానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తనను అనేకసార్లు జైలుకు పంపారని పేర్కొన్నారు దేశ సగటున 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉంటే, తెలంగాణలో 17 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నారని చెప్పారు. అయినప్పటికీ ప్రతి ఏడాది ప్రభుత్వ పాఠశాలల నుంచి 50 నుంచి 60 వేల మంది విద్యార్థులు ప్రైవేట్‌ వైపు వెళ్తున్నారని తెలిపారు. ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు.కమిషన్ సభ్యులు గ్రామాలకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారని, ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను ఎందుకు పంపడం లేదని అడిగితే.. ఇంగ్లీష్ మీడియం కావాలని తల్లిదండ్రులు కోరారని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ నుంచే ఇంగ్లీష్ మీడియం ఉండగా.. ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి తరగతి నుంచే విద్య ప్రారంభమవుతోందని చెప్పారు. పదో తరగతి తర్వాత విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ఏటా రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అయితే కొన్ని ప్రైవేట్ కాలేజీల్లో నాణ్యత లోపిస్తోందని, తగిన సంఖ్యలో లెక్చరర్లు, ప్రొఫెసర్లు ఉండటం లేదని పేర్కొన్నారు.కేంద్రంలో కీలకమైన పదవులు, విధాన నిర్ణయాల్లో అన్ని ప్రాంతాలకు సరైన ప్రాతినిధ్యం దక్కాలని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశ సమగ్రతను కాపాడుకోవాలంటే సమాఖ్య స్ఫూర్తిని అక్షరాలా పాటించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు. లేనిపక్షంలో ప్రాంతీయ అసంతృష్యాలు పెరిగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజాస్వామ్య  సామాజిక న్యాయ సూత్రాలను ఈ వేదికగా ఆయన మరోసారి సమర్థించారు. దేశంలో ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు, సమాన హక్కులు దక్కాలని, ఏ ఒక్క రాష్ట్రమూ వివక్షకు గురికాకూడదన్నదే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.ఈ సదస్సులో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పలు ప్రాంతీయ పార్టీల నేతలు, విశ్లేషకులు ఈ అంశంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర-రాష్ట్రాల ఆర్థిక సంబంధాలు  సమాఖ్య విధానాలపై ఈ చర్చ మరింత జోరందుకునే అవకాశం కనిపిస్తోంది.       [ CM Revanth Reddy, Assam News Paper Conclave, Northern Dominance, Telangana Model, Regional Disparities India, Indian Politics 2026,Telugu One, Telugu News ]   
ALSO ON TELUGUONE N E W S
The title glimpse of Golden Bhagyam introduces an interesting combination of Tamil comedian Yogi Babu and Telugu comedian Satya as the lead actors. Directed by Pawan Basamsetti, the film appears to be a full-fledged comedy entertainer with the title announcement itself presented in a humorous manner. The glimpse plays around with the iconic image of Rajinikanth and Kamal Haasan, setting up the unusual pairing of Yogi Babu and Satya. Their comic timing and contrasting personalities make the combination instantly interesting, with the glimpse giving a clear indication that the film is built around their chemistry. Golden Bhagyam brings together talent from both the Tamil and Telugu industries, with Vennela Kishore, Sudharshan, Rohini, Sunil Reddy and Tanikella Bharani playing prominent roles. The film is being produced by Pawan Basamsetti and Dr. Nagarjuna Reddy Paluvai, while Pawan Ch is composing the music. The makers have already commenced shooting for the film, which is said to blend comedy with romance and action. Pawan Basamsetti, who previously directed Rangabali, is returning with another comedy-driven film, and the title glimpse sets up Golden Bhagyam as a light-hearted entertainer built around the unusual lead combination of Yogi Babu and Satya. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘జైలర్ 2’ విడుదలకు సిద్ధమవుతుండగా.. మరోవైపు ‘ధర్మన్’ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మైసూరులో జరుగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు రూమర్‌గా ఉన్న ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. రజినీకాంత్‌తో కలిసి ఉన్న ఓ ఫొటోను హీరోయిన్ రాశీఖన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. మైసూరులో షూటింగ్ సందర్భంగా అక్కడి దోశతో పాటు షూటింగ్‌కు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను రాశీఖన్నా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అదే సమయంలో రజినీకాంత్, రామ్ పోతినేనితో కలిసి దిగిన ఫొటోను కూడా పోస్ట్ చేసింది. దీంతో ‘ధర్మన్’ సినిమాలో రామ్ నటిస్తున్నాడంటూ గతంలో వచ్చిన వార్తలకు దాదాపుగా క్లారిటీ వచ్చినట్లయింది. కొద్దిసేపటికే ఆ ఫొటోను రాశీఖన్నా డిలీట్ చేసినప్పటికీ.. అప్పటికే అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో రాశీఖన్నా కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆమె రజినీకాంత్ కూతురి పాత్రలో నటిస్తుండగా.. రామ్ పోతినేని ఆమె ప్రియుడిగా కనిపించనున్నాడని సమాచారం. అయితే రామ్ పాత్రకు నెగిటివ్ షేడ్స్ ఉంటాయని టాక్. దీంతో ఈ సినిమాలో రామ్ ఇంతకుముందు చేసిన పాత్రలకు భిన్నమైన లుక్, క్యారెక్టరైజేషన్‌లో కనిపించే అవకాశం ఉందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇక ‘ధర్మన్’ చిత్రానికి ‘డ్రాగన్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. రజినీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా రామ్ పోతినేని కూడా సినిమాలో భాగమయ్యాడనే విషయం బయటకు రావడంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ సినిమాపై ఆసక్తి పెరిగింది. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.     [Rajinikanth Dharman Movie, Ram Pothineni Dharman, Raashii Khanna, Rajinikanth Ram Pothineni, Ashwath Marimuthi, Dharman Movie Update, Ram Pothineni New Movie]
Teja Sajja is venturing into the reality space with The Traitors Telugu, the Telugu adaptation of the popular international format that has already completed two seasons in Hindi. Prime Video has unveiled the first promo of the show, which will premiere on October 15, 2026. The series, produced by SOL Productions, will feature 20 contestants competing in a game built around trust, strategy and deception. While the Innocents must identify the hidden Traitors among them, the Traitors will have to manipulate the contestants and remain undetected until the end. The 10-episode series will stream over four weeks, with new episodes arriving every Thursday. The promo puts Teja Sajja at the centre of the action, presenting the actor in a stylish and energetic avatar as he takes on hosting duties for the first time in the Telugu reality space. His presence is expected to be one of the key attractions of the adaptation, particularly as the show attempts to bring the psychological gameplay of the global format to Telugu audiences. With a different format from the usual celebrity-driven reality shows, The Traitors Telugu is already generating curiosity around its contestants, gameplay and Teja’s approach as host. The show is set to stream exclusively on Prime Video.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  వల్గారిటీ లేని కామెడీని చూస్తే వచ్చే సహజమైన నవ్వు ఎన్నో రోగాలని దరి చేరకుండా చేరుస్తుందనేది సినీ సూక్తి.  నవ్వుకి అంతటి శక్తీ ఉంది. దేవుడు వరం ఇస్తానని చెప్పినా కాసేపాగి రమ్మని నవ్వుతూనే ఉంటాం. ఇప్పుడు ఆ లక్ష్యం దిశగానే తెలుగు, తమిళ మేకర్స్ అడుగులేస్తున్నారు  తెలుగు చిత్రసీమలో తనదైన యూత్ ఫుల్ కామెడీ టైమింగ్, విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రతి ఇంట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటుడు సత్య, తమిళ చిత్రసీమలో టాప్ కమెడియన్‌గా రాజ్యమేలుతున్న యోగి బాబు కలిసి పూర్తిస్థాయి హీరోలుగా, ప్రధాన పాత్రల్లో ఒక వినోదాత్మక చిత్రంలో నటిస్తున్నారు. 'రంగబలి' చిత్రంతో దర్శకుడిగా తన మార్క్ చూపించిన పవన్ బాసంశెట్టి ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ తాజాగా విడుదల చేయడంతో సోషల్ మీడియాలో ఈ గ్లింప్స్ క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ చిత్రానికి ‘గోల్డెన్ భాగ్యం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్రబృందం విడుదల చేసిన ప్రమోషనల్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దర్శకుడు పవన్ బాసంశెట్టి ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌ను చాలా డిఫరెంట్‌గా, సరదాగా డిజైన్ చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ వంటి బిగ్ స్టార్ల సినిమాల అనౌన్స్‌మెంట్లను గుర్తుచేసేలా, ఒక రకమైన పారడీ శైలిలో ఈ వీడియోను రూపొందించడం ఈ గ్లింప్స్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతటా వైట్ డ్రెస్‌లలో దర్శనమిచ్చిన సత్య, యోగి బాబుల ఎంట్రీ ప్రేక్షకుల్లో ఒక్కసారిగా నవ్వులు పూయించింది. ఇందులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇద్దరూ తమ భాషా సరిహద్దులను దాటి సరికొత్తగా అలరించబోతున్నారు. సాధారణంగా తెలుగు మాట్లాడే సత్య ఇందులో తమిళం మాట్లాడగా, తమిళనాడు స్టార్ యోగి బాబు పక్కా తెలుగు డైలాగ్స్ తో సందడి చేశారు. ఈ లాంగ్వేజ్ స్వ్యాపింగ్ కామెడీ థీమ్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఇది కూడా చదవండి: ప్రముఖ హీరో సంచలన వ్యాఖ్యలు: థియేటర్లు ఇవ్వకపోతే ఏం చేస్తామంటే!     ‘గోల్డెన్ భాగ్యం’ కేవలం ఒక సాధారణ కామెడీ డ్రామా మాత్రమే కాకుండా, అందులో క్రైమ్, రొమాన్స్, యాక్షన్ వంటి కమర్షియల్ హంగులను కూడా సమానంగా మేళవించినట్లు స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో కథానాయికలుగా జయశ్రీ, అతిరాజ్ నటిస్తున్నారు. అలాగే వెన్నెల కిషోర్, సుదర్శన్, రోహిణి, సునీల్ రెడ్డి, తనికిళ్ల భరణి వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తూ వినోదాన్ని రెట్టింపు చేయనున్నారు. సాంకేతిక విభాగంలో పవన్ సిహెచ్ స్వరపరిచిన సంగీతం, బబ్లూ అజు ఛాయాగ్రహణం సినిమాకి ప్రధాన బలంగా నిలవనున్నాయి. ఈ ఏడాది చివర్లోనే  రిలీజ్ కానుంది.     [Golden Bhagyam Title Glimpse,  Golden Bhagyam, Satya Yogi Babu movie, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
Nani and director Srikanth Odela came together for their recent release, The Paradise. The movie is said to have crossed Rs.50 crores gross in Nizam, a first for Nani and it recovered 80% of the pre-release business theatrical rights amounts till date. Now, they both have visited the Medaram Sammakka-Sarakka shrine and fulfilled their vows by offering niluvethu bangaram, Thulabharam to the tribal goddesses. Both Nani and Srikanth Odela offered the traditional bangaram equivalent to their respective body weights as part of the ritual. Producer Sudhakar Cherukuri also joined them to visit Medaram Jathara. The offering is a significant tradition at Medaram, where bangaram refers to jaggery and not actual gold.  Devotees traditionally offer jaggery equivalent to their body weight as an expression of devotion and gratitude. The practice is also known as Tulabharam. The actor and director did use Sammakka and Sarakka names in the movie. They visited the temple to fulfill their vows.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులకు అక్కడి ప్రకటనలు, ట్రైలర్లు కొంత ఇబ్బంది కలిగిస్తుంటాయి. సినిమా ప్రారంభ సమయం దాటిపోయినా యాడ్స్ కొనసాగుతుండటంతో చాలామంది అసహనం వ్యక్తం చేస్తుంటారు. అయితే హైదరాబాద్‌కు చెందిన ఓ న్యాయవాది మాత్రం ఈ విషయంలో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదుపై విచారణ జరిపిన కమిషన్.. PVR మల్టీప్లెక్స్‌కు రూ.75 వేల చెల్లించాలని ఆదేశించింది.  వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన ఓ న్యాయవాది 2025 జూన్ 20న రాత్రి 10.35 గంటలకు ‘కుబేర’ సినిమా చూసేందుకు PVRలో రెండు టికెట్లు బుక్ చేసుకున్నారు. నిర్ణీత సమయానికి ముందే థియేటర్‌కు చేరుకుని సీట్లో కూర్చున్నప్పటికీ సినిమా వెంటనే ప్రారంభం కాలేదు. దాదాపు 22 నిమిషాల పాటు వాణిజ్య ప్రకటనలు, ఇతర ప్రచార కంటెంట్‌ ప్రదర్శించిన తర్వాత రాత్రి 10.52 గంటలకు సినిమా మొదలైంది. దీంతో సినిమా పూర్తయ్యే సమయం కూడా ఆలస్యమై, ఇంటికి చేరేసరికి మరింత సమయం పట్టిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.  అయితే థియేటర్‌లో ప్రకటనలు ప్రదర్శించడం తమ వ్యాపార హక్కులో భాగమేనని PVR తరఫున వాదన వచ్చింది. మరోవైపు.. ప్రజా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం సామాజిక అవగాహన ప్రకటనలకు నిర్దిష్ట పరిమితి ఉందని ఫిర్యాదుదారు వాదించారు. వాణిజ్య ప్రకటనలను ఆ పరిమితికి మించి ప్రదర్శించడం వల్ల సినిమా ప్రారంభంలో జాప్యం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ వాదనలను పరిశీలించిన వినియోగదారుల కమిషన్‌.. ప్రేక్షకుడికి కలిగిన అసౌకర్యాన్ని పరిగణనలోకి తీసుకుంది.  ఈ కేసులో కమిషన్ మొత్తం రూ.75 వేల చెల్లించాలని ఆదేశించింది. ఇందులో ఫిర్యాదుదారుడికి కలిగిన అసౌకర్యం, మానసిక ఇబ్బందులకు రూ.20 వేలు పరిహారంగా, న్యాయపరమైన ఖర్చుల కింద రూ.5 వేలు, నిబంధనల ఉల్లంఘనకు రూ.50 వేలను జిల్లా వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేయాలని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి అనుచిత వ్యాపార పద్ధతులను నిలిపివేయాలని కూడా ఆదేశించింది.  మొత్తంగా.. థియేటర్‌లో సినిమా ప్రారంభ సమయం, ప్రకటనల వ్యవహారంపై జరిగిన ఈ కేసు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టికెట్‌పై పేర్కొన్న షో సమయాన్ని పాటించడం, ప్రేక్షకుల సమయాన్ని పరిగణనలోకి తీసుకోవడం వంటి అంశాలపై ఈ తీర్పు మరోసారి దృష్టిని ఆకర్షించింది.     [PVR Fine, PVR Consumer Court, Hyderabad PVR, Movie Delay Fine, PVR Cinema Ads, Kubera Movie, Consumer Court Hyderabad, PVR Multiplex News, Movie Theatre Rules, Consumer Rights India]
ఇండస్ట్రీకి కొత్త హీరో వచ్చాడు. ఆ వస్తే ఏంటి, చాలా మంది వస్తుంటారులే, అందులో ఈ బాబు ఒక కౌంట్ అంతే కదా  అనుకుంటున్నారా! అసలు అలా అనుకోకండి.  ఈ బాబు అలాంటి ఇలాంటి హీరో కాదు. లైట్స్ ఆన్, కెమెరా, రోలింగ్, యాక్షన్ అనగానే సినిమానే కదా అని హీరోకి  వార్నింగ్ ఇవ్వడమే  కాదు. రియల్ గా స్టేజ్ పైనే అందరకి వార్నింగ్ ఇచ్చిపడేయగల కెపాసిటీ ఆ హీరో సొంతం. 'ఓ అందాల రాక్షసి' ..  త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ. హీరో,  దర్శకుడు షిరాజ్ మెహదీ. రీసెంట్ గా  హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు 'రాత్రింబవళ్ళు కష్టపడి నిర్మించిన చిన్న సినిమాలను థియేటర్లు ఇవ్వకుండా తొక్కిపెట్టాలని చూస్తే ఏమాత్రం ఊరుకునేది లేదు. ప్రాణం పోయినా సరే ఈ పోరాటాన్ని ఆపేది లేదు. మంచి సాంకేతిక నిపుణులతో, బలమైన కంటెంట్‌తో రూపొందించిన తమ 'ఓ అందాల రాక్షసి' చిత్రానికి సరైన స్క్రీన్లు ఇస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించే సత్తా ఉందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. చిన్న సినిమాల మనుగడ కోసం, థియేటర్ల కేటాయింపులో జరుగుతున్న అన్యాయాలపై ఇప్పటికే 40కి పైగా ప్రెస్ మీట్లు నిర్వహించానని, 50కి పైగా ఇంటర్వ్యూలలో తన నిరసన గళాన్ని వినిపించానని షిరాజ్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: స్నేహారెడ్డి బర్త్ డే: ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్!      ఈ సందర్భంగా డిజిటల్ ప్రొవైడర్ల దోపిడీ విధానాలపై ఆయన సంచలన గణాంకాలతో విరుచుకుపడ్డారు. క్యూబ్ (Qube), యూఎఫ్‌ఓ (UFO) వంటి డిజిటల్ నెట్‌వర్క్ కంపెనీలు డిజిటల్ కంటెంట్ ప్రొసెసింగ్ మరియు ప్రదర్శన పేరుతో చిన్న నిర్మాతలను తీవ్రంగా నష్టపరుస్తున్నాయని ఆరోపించారు. వారానికి కేవలం రూ.2,000 మాత్రమే ఖర్చయ్యే డిజిటల్ ప్రాసెస్ సేవలకు గాను, ప్రతీ ఒక్క థియేటర్ నుంచి రూ.10,000 నుండి రూ.12,000 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని ఆయన సంఖ్యలతో సహా బయటపెట్టారు. సెన్సార్ నిబంధనలు, ఏడీసీసీ (ADCC) ప్రాసెస్ పేరిట అదనపు మొత్తాలను గుంజుతూ చిన్న సినిమాల బడ్జెట్‌లను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నారని వాపోయారు. చిన్న నిర్మాతలకు అండగా నిలవాల్సిన ఫిల్మ్ ఛాంబర్ (Film Chamber) వ్యవస్థ ఈ విషయంలో పూర్తిగా మౌనం వహిస్తూ, చిన్న చిత్రాలను నల్లిలా నలిపేసేందుకు సహకరిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. మరి ఈ విషయం ఎంత వరకు వెళ్తుందో చూడాలి.    [ O Andala Rakshasi Hero Shiraz Mehdi Slams Theatre Allocation, O Andala Rakshasi,  Shiraz Mehdi, Small Movies Issue, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం ‘సిగ్మా’. తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండటంతో మొదటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. యాక్షన్, అడ్వెంచర్, హీస్ట్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సీబీఎఫ్‌సీ ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేసింది. దీంతో అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సినిమా సిద్ధమైంది.  ఇక ‘సిగ్మా’ కథ విషయానికి వస్తే.. రూ.500 కోట్ల విలువైన డ్రగ్స్, గ్యాంబ్లింగ్ రాకెట్ చుట్టూ కథ సాగుతుందని ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో తెలుస్తోంది. ట్రెజర్ హంటర్‌గా కనిపించే సందీప్ కిషన్ తన తల్లి కోసం ఓ నిధి వేటలో ఉంటాడు. మరోవైపు సంపత్ రాజ్ పోషించిన వీర శంకర్ రెడ్డి అక్రమ వ్యాపారాలతో మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు. ఈ రెండు కథలు కలిసినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది సినిమాలో చూడాల్సి ఉంటుంది.  ఈ సినిమాలో సందీప్ కిషన్‌కు జోడీగా ఫరియా అబ్దుల్లా నటించారు. సంపత్ రాజ్, రాజు సుందరం, శివ పండిట్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎల్‌కే ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్‌.థమన్ సంగీతం అందించగా.. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.  మరోవైపు.. దర్శకుడిగా జేసన్ సంజయ్ ఎలాంటి కథను ఎంచుకున్నారు? సందీప్ కిషన్ పాత్ర ఎలా ఉంటుంది? రూ.500 కోట్ల డీల్ వెనుక అసలు కథ ఏంటి? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. సెన్సార్ పూర్తి కావడంతో ఇక సినిమా విడుదలకు సంబంధించిన పనులు వేగం పుంజుకోనున్నాయి. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘సిగ్మా’తో జేసన్ సంజయ్ దర్శకుడిగా ఎలాంటి ముద్ర వేస్తారో చూడాలి.     [Sundeep Kishan Sigma, Sigma Movie, Sigma Movie Release Date, Jason Sanjay Sigma, Vijay Son Jason Sanjay, Sundeep Kishan New Movie, Faria Abdullah Sigma, Sigma Censor Certificate, Sigma Movie U/A Certificate, Thaman Sigma, Lyca Productions]
Harsh Roshan and Nakshatra starrer Thella Kaagitham has landed in the spotlight ahead of its release after an intimate scene from the film was reportedly leaked online. The video has surfaced on Reddit and is now making the rounds across social media, creating buzz around the upcoming Telugu film. It showcases Harsh Roshan and Nakshatra sharing a kiss and then getting intimate. Hence, it is being shared widely on social media. While some are condemning such trend of minors and college students intimate scenes, several are talking about how the footage might have been leaked online and questioning if makers leaked it for promotions. While such leaks often generate additional curiosity around a film, they also raise concerns over unreleased movie content being circulated without the makers' consent. With Thella Kaagitham nearing its theatrical release, the leak has brought unexpected attention to the film just days before it reaches cinemas. Thella Kaagitham is directed by Ramesh Bandreddi and the cast also includes Ajay, Deepak, Shravya and Rajkumar Kasireddy. The film is produced by Krishna Kommalapati under Arunachala Creations. Kona Venkat is presenting it.  Nandu Savarigana has handled the story, screenplay and dialogues, while K.V. Guhan is the cinematographer. Vijay Bulganin has composed the music and Karthika Srinivas R is the editor. The film is scheduled for a theatrical release on October 2. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  స్టైల్ లో, స్టైల్ విషెస్ చెప్పడంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తర్వాతే ఎవరైనా అని ఫ్యాన్స్ చెప్తుంటారు.మరి ఈ రోజు సతీమణి స్నేహరెడ్డి పుట్టిన రోజు. మరి అల్లు అర్జున్ విషెస్ ఏ స్టైల్ లో ఉన్నాయో చూద్దాం.    ఈ ప్రత్యేకరమైన రోజున, అల్లు అర్జున్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వేదికగా భార్యతో కలిసి ఉన్న ఒక రొమాంటిక్ సెల్ఫీని పంచుకున్నారు. సూర్యాస్తమయం వెలుగుల్లో సముద్రతీరాన ప్రశాంతంగా దిగిన ఈ పిక్చర్‌లో ఇద్దరూ తెల్లటి దుస్తుల్లో ఎంతో ముచ్చటగా కనిపించారు. ఈ పిక్‌కు "హ్యాపీ బర్త్‌డే క్యూటీ" (Happy Birthday Cutie) అని ఒక ప్రేమపూర్వక రెడ్ హార్ట్ ఎమోజీని జోడించి స్పెషల్ విషెస్ అందించారు. సాధారణంగా భారీ ఎమోషనల్ క్యాప్షన్స్ కంటే, కేవలం మూడు  మాటలతోనే తన ప్రేమనంతటినీ ఎంతో ఆర్గానిక్‌గా వ్యక్తం చేయడం బన్నీ శైలి. ఇది కూడా చదవండి: ఇండస్ట్రీలో స్విమ్‌సూట్ వేసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఈమెనే: ఆ ఒక్క హీరోతోనే ఏకంగా 40 సినిమాలు     అల్లు అర్జున్ ప్రెజెంట్ 'రాకా' తో బిజీగా ఉన్నాడు.  భారతీయ సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకునేలా తెరకెక్కతుంది. జవాన్ ఫేమ్ 'అట్లీ' దర్శకుడు.   [Allu Arjun Special Birthday Wishes To Wife Sneha Reddy, Allu Arjun,  Allu Sneha Reddy Birthday, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
మన భారతీయుల నిత్య జీవితంలో అన్నం లేని ఆహారాన్ని ఊహించుకోవడం కూడా కష్టమే. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి అని తేడా లేకుండా ప్రతిరోజూ ప్లేట్ నిండా తెల్లటి పాలిష్ చేసిన బియ్యాన్ని తినడానికి అలవాటుపడిపోయాం. అయితే, రుచికి ఎంతో బాగుండే ఈ పాలిష్డ్ తెల్ల బియ్యం మన ఆరోగ్యానికి ఎంతటి చేటు చేస్తుందో అని తెలిస్తే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే. ధాన్యం నుంచి లభించే పోషకాలను, పీచు పదార్థాన్ని పాలిషింగ్ ప్రక్రియ ద్వారా పూర్తిగా తొలగించి కేవలం పిండి పదార్థాన్ని మాత్రమే మిగిల్చే తెల్ల బియ్యం కంటే, తృణధాన్యాల వర్గానికి చెందిన  బ్రౌన్ రైస్  (తవుడు తీయని బియ్యం) రోజూ తీసుకోవడం వల్ల అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలనుకునే వారికి, ముఖ్యంగా ఆధునిక జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్న వారికి బ్రౌన్ రైస్ ఒక దివ్యౌషధంగా పనిచేస్తుంది. తెల్ల బియ్యంతో పోలిస్తే బ్రౌన్ రైస్‌లో విటమిన్ బి1, విటమిన్ బి3, విటమిన్ బి6 వంటి అత్యవసర విటమిన్లు, అలాగే మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరం, ఇనుము మరియు జింక్ వంటి ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. వీటన్నింటికీ మించి బ్రౌన్ రైస్‌లో లభించే అధిక పీచు పదార్థం (ఫైబర్) జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కడుపులో ఉండి నెమ్మదిగా అరుగుతుంది. కాబట్టి కొద్దిగా తిన్నా సరే కడుపు త్వరగా నిండిన భావన కలుగుతుంది. ఫలితంగా అతిగా తినే అలవాటు తగ్గి, బరువు తగ్గాలనుకునే వారికి మరియు ఊబకాయంతో బాధపడేవారికి బ్రౌన్ రైస్ ఒక అద్భుతమైన ఆహార ఎంపికగా మారుతుంది. ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మధుమేహం లేదా టైప్ 2 డయాబెటిస్. తెల్లటి బియ్యం తిన్నప్పుడు అందులోని పిండి పదార్థం వేగంగా రక్తంలో గ్లూకోజ్‌గా మారి షుగర్ లెవెల్స్‌ను ఒక్కసారిగా పెంచేస్తుంది. కానీ బ్రౌన్ రైస్ యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ (GI) చాలా తక్కువగా ఉంటుంది. దీనిని ఆహారంగా తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ఒకేసారి పెరగకుండా చాలా నెమ్మదిగా విడుదలవుతాయి. అందువల్ల డయాబెటిస్ బాధితులు బ్రౌన్ రైస్‌ను తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా రక్తంలో షుగర్ స్థాయిలను చాలా సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. అంతేకాకుండా, హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి మరియు గుండె ఆరోగ్యాన్ని పటిష్టం చేసుకోవాలనుకునే వారికి బ్రౌన్ రైస్ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో లభించే పీచు పదార్థం, మాంగనీస్ మరియు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో దోహదపడతాయి. ఇది రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా కాపాడి, రక్తపోటును (బిపి) అదుపులో ఉంచుతుంది. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్రమైన ముప్పుల నుంచి రక్షణ లభిస్తుంది. శరీరానికి అవసరమైన తక్షణ శక్తిని అందిస్తూ, మెదడు నాడీ వ్యవస్థను వేగవంతం చేయడంలో బ్రౌన్ రైస్ సహాయపడుతుంది. ప్రతిరోజూ ఒక పూట తెల్ల బియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్‌ను అలవాటు చేసుకోవడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యవంతమైన జీవనాన్ని సొంతం చేసుకోవచ్చు.     [ Brown Rice, White Rice, Whole Grains, Dietary Fiber, Diabetes, Blood Sugar, Low Glycemic Index, Weight Management, Heart Health, Cholesterol ]
నేటి ఆధునిక జీవనశైలిలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని తీవ్రంగా వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు మరియు వాపులు అగ్రస్థానంలో ఉన్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం లేదా పెరిగిన బరువు వల్ల నడవడమే కష్టంగా మారిన రోజుల్లో తక్షణ ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్ మాత్రలను మింగడం సర్వసాధారణమైపోయింది. అయితే, మన పూర్వీకులు మరియు ఆయుర్వేద మూలికా వైద్యులు ఎన్నో ఏళ్ల క్రితమే మోకాళ్ల నొప్పులు, వాపులు, కండరాల నొప్పులు మరియు దెబ్బలకు అద్భుతమైన సహజ నివారణగా ఆమెడ ఆకులను  (ఆముదపు ఆకులు) ఉపయోగించేవారు. ఆయుర్వేదంలో ఎంతో ప్రాశస్త్యం పొందిన ఈ ఆముదపు ఆకులలో వాపును తగ్గించే ఆంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, నొప్పులను నయం చేసే అనాల్జెసిక్ లక్షణాలు సమృద్ధిగా లభిస్తాయి. దీర్ఘకాలిక కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి ఆమెడ ఆకులు అందించే 5 సాంప్రదాయ మరియు ప్రయోజనకరమైన ఉపయోగాల గురించి సమగ్రంగా తెలుసుకుందాం. మొదటిది, మోకాళ్ల నొప్పులు మరియు కీళ్ల వాపులను తక్షణమే తగ్గించడంలో ఆమెడ ఆకుల కాపడం అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. తాజా ఆమెడ ఆకులను శుభ్రంగా కడిగి, వాటికి కొద్దిగా నువ్వుల నూనె లేదా ఆముదం నూనె పూసి పెనంపై లైట్‌గా వేడి చేయాలి. అలా గోరువెచ్చగా ఉన్న ఆకులను మోకాళ్లు లేదా తీవ్రమైన నొప్పి ఉన్న కీళ్ల భాగంలో ఉంచి, సున్నితంగా గుడ్డతో కట్టు కట్టాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా చేయడం వల్ల ఆకుల్లోని మూలికా మూలకాలు చర్మంలోకి ఇంకి కీళ్లలో చేరిన ద్రవాలను, వాపులను తగ్గించి తీవ్రమైన నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి. రెండవది, ఆర్థరైటిస్ మరియు కండరాల పట్టేతకు ఆమెడ ఆకులతో నూనె మసాజ్ అద్భుతమైన నివారణ. ఆముదం నూనెను గోరువెచ్చగా వేడి చేసి, దానికి ఆముదపు ఆకుల పసరును కలిపి కీళ్లపై మృదువుగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత వేడి చేసిన ఆకుని కట్టుగా కట్టడం వల్ల కీళ్ల మధ్య ఉండే దృఢత్వం తగ్గి, రక్తప్రసరణ మెరుగవుతుంది. మూడవది, చర్మంపై ఏర్పడే దెబ్బలు, వాపులు మరియు గాయాలను త్వరగా నయం చేయడంలో కూడా ఇవి సహాయపడతాయి. ఆమెడ ఆకులను మెత్తటి పేస్ట్‌లా నూరి, దానికి కొద్దిగా పసుపు కలిపి వాపులు లేదా చిన్న చిన్న గాయాలపై లేపనంగా రాయడం వల్ల ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా గాయాలు త్వరగా మానడానికి తోడ్పడుతుంది. నాల్గవది, ఆమెడ ఆకుల కషాయం ద్వారా పొందే ఆవిరి పట్టుట (వేదనా శమనం). ఆమెడ ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి, ఆ నీటి ఆవిరిని నొప్పులు ఉన్న కీళ్లకు పట్టించడం వల్ల నరాలు ఉద్దీపన చెంది కండరాల ఒత్తిడి తక్షణమే తొలగిపోతుంది. ఇక ఐదవది, పాదాల నొప్పులు మరియు మడమల వాపు నివారణ. రోజంతా నిలబడి పనిచేయడం వల్ల పాదాల కింద వచ్చే నొప్పులకు, వేడి చేసిన ఆమెడ ఆకులపై పాదాలను కొద్దిసేపు ఉంచి తొక్కితే అరికాళ్ల మంటలు మరియు వాపులు నయమవుతాయి. ఈ విధంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, కేవలం మన ఇంటి పరిసరాల్లో లభించే ఆమెడ ఆకులతో మోకాళ్ల నొప్పులను సులభంగా అదుపులో ఉంచుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు స్పష్టం చేస్తున్నారు.     [ Castor Leaves, Knee Pain, Joint Pain, Arthritis, Joint Swelling, Ayurvedic Remedies, Anti Inflammatory, Muscle Pain, Castor Oil, Natural Pain Relief ]  
నేటి డిజిటల్ యుగంలో ఉదయం నిద్రలేచిన క్షణం నుండి రాత్రి పడుకునే వరకు స్మార్ట్‌ఫోన్ చేతిలో లేకపోతే క్షణం గడవని పరిస్థితి నెలకొంది. అందులోనూ ఇన్స్టాగ్రామ్ రీల్స్, షార్ట్ వీడియోల మోజులో పడి గంటల తరబడి సమయాన్ని స్క్రీన్‌కే అంకితం చేస్తున్నవారి సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతోంది. కేవలం ఒకే ఒక్క నిమిషం రీల్ చూద్దామని యాప్ ఓపెన్ చేసిన నెటిజన్లు, తమకు తెలియకుండానే గంటల తరబడి బొటనవేలితో రీల్స్ స్క్రోల్ చేస్తూ అంతులేని ఆన్‌లైన్ ప్రపంచంలో మునిగిపోతున్నారు. ఈ అలవాటునే వైద్య పరిభాషలో  డూమ్‌స్క్రోలింగ్ (Doomscrolling) అని పిలుస్తారు. అయితే, కేవలం కాలక్షేపం అనుకునే ఈ చిన్న అలవాటు మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఏ స్థాయిలో దెబ్బతీస్తోందో తెలిస్తే ఎవరైనా సరే తీవ్ర దిగ్భ్రాంతికి గురికావాల్సిందే. ఇన్స్టాగ్రామ్ రీల్స్ వంటి స్వల్ప వ్యవధి వీడియోలను నిరంతరం చూడటం వల్ల మెదడులో  డోపమైన్  అనే హార్మోన్ వేగంగా విడుదలవుతుంది. ప్రతి కొత్త రీల్ వచ్చినప్పుడల్లా మెదడు ఒక క్షణికానందాన్ని, వినోదాన్ని పొందుతుంది. ఈ ప్రక్రియ పదే పదే జరగడం వల్ల మెదడు ఈ వేగవంతమైన డోపమైన్ విడుదలకు అలవాటుపడిపోయి క్రమంగా దానికి బానిసగా మారుతుంది. దీనివల్ల మనుషుల్లో ఏకాగ్రత మరియు శ్రద్ధ వహించే సమయం (Attention Span) దారుణంగా పడిపోతుంది. పుస్తకాలు చదవడం, కుటుంబ సభ్యులతో మాట్లాడటం లేదా సుదీర్ఘమైన పనిపై దృష్టి పెట్టడం వంటి సాధారణ విషయాలు మెదడుకు తీవ్రమైన విసుగును కలిగిస్తాయి. ఫలితంగా ఏ పనిపైనా సరిగ్గా దృష్టి సారించలేక జ్ఞాపకశక్తి మందగించే ప్రమాదం ఏర్పడుతుంది. అంతేకాకుండా, గంటల తరబడి స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ వైపే చూస్తూ ఉండటం వల్ల దాని నుంచి వెలువడే తీవ్రమైన బ్లూ లైట్ కంటి రెటీనాపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీనివల్ల కళ్ళు పొడిబారిపోవడం, మంటలు పుట్టడం, దృష్టి లోపాలు కలగడం వంటి డిజిటల్ ఐ స్ట్రెయిన్ సమస్యలు తలెత్తుతాయి. రాత్రి వేళల్లో బెడ్‌పై పడుకుని రీల్స్ స్క్రోల్ చేయడం వల్ల నిద్రను ప్రేరేపించే  మెలటోనిన్  హార్మోన్ ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోతుంది. దీనివల్ల తీవ్రమైన నిద్రలేమి (Insomnia) ఆవహించి, ఉదయానికి శరీరం తీవ్ర అలసటకు గురవుతుంది. శారీరక శ్రమ లేకుండా గంటల తరబడి ఒకే చోట కూర్చుని లేదా పడుకుని ఫోన్ చూడటం వల్ల మెడ నొప్పులు, వీపు నొప్పులు రావడమే కాకుండా, శరీర జీవక్రియ మందగించి ఊబకాయం మరియు గుండె సంబంధిత సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది. ఈ డిజిటల్ అడిక్షన్ మానసిక ఆరోగ్యానికి కలిగిస్తున్న నష్టం మరింత తీవ్రమైనది. రీల్స్‌లో కనిపించే ఇతరుల గ్లామరస్ జీవితాలు, లగ్జరీ ప్రయాణాలు, అందమైన రూపాలను చూసి సామాన్యులు తమ నిజ జీవితంతో పోల్చుకోవడం ప్రారంభిస్తారు. ఈ అవాస్తవిక పోలికల వల్ల తమలో అభద్రతా భావం పెరిగిపోయి, తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన (Anxiety) మరియు డిప్రెషన్‌కు దారితీస్తోంది. కాబట్టి ఈ డిజిటల్ వల నుంచి బయటపడటానికి ప్రతిఒక్కరూ స్క్రీన్ టైమ్‌ను పరిమితం చేసుకోవడం అత్యంత అవసరం. రోజుకు ఎంత సమయం సోషల్ మీడియా వాడాలనే దానిపై కచ్చితమైన సమయ పరిమితిని ఏర్పాటు చేసుకోవాలి. రాత్రి పడుకునే కనీసం ఒక గంట ముందు ఫోన్‌ను పక్కన పెట్టడం, డిజిటల్ డిటాక్స్ పాటించడం ద్వారా ఈ వ్యసనం నుండి బయటపడి మీ ఆరోగ్యాన్ని సురక్షితంగా కాపాడుకోవచ్చు.     [ Doomscrolling, Social Media Addiction, Instagram Reels, Smartphone Addiction, Screen Time, Attention Span, Digital Eye Strain, Sleep Problems, Mental Health, Digital Detox ]
 గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి డాక్టర్లు చెప్పిన సలహాలు..! గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది ఒక్క రోజులో జరిగే  పని కాదు. నేటి ఆధునిక జీవనశైలి, సరైన పోషకాహారం లేకపోవడం, శారీరక శ్రమ తగ్గడం వంటి అనేక కారణాల వల్ల చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. నివేదికల ప్రకారం మన దేశంలో సంభవిస్తున్న మరణాలలో ఎక్కువ భాగం గుండె జబ్బుల వల్లే జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం సమస్య వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం కంటే, ముందే మన లైఫ్ స్టైల్ లో  కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చని ప్రముఖ వైద్యులు సూచిస్తున్నారు. వాటి గురించి వివరంగా తెలుసుకుంటే.. చురుగ్గా ఉండటం.. బాగా  వర్కవుట్లు చేయలేకపోయినా, రోజూ కొంత సమయం నడవడాన్ని అలవాటు చేసుకోవాలి. రోజంతా ఒకే చోట కూర్చుని పనిచేసే వారు మధ్యమధ్యలో లేచి కాసేపు అటుఇటు తిరగడం వల్ల శరీరంలో రక్తం సరఫరా మెరుగ్గా ఉంటుంది. ఆహారం..  బరువు తగ్గడం కోసమే కాకుండా, శరీర జీవక్రియలను క్రమబద్ధీకరించే పౌష్టికాహారాన్ని ఎంచుకోవాలి. మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారం ఎంత పరిమాణంలో ఉందో, అందులో ఎలాంటి పోషకాలు ఉన్నాయో గమనించడం చాలా అవసరం. దీర్ఘకాలంలో గుండెకు మేలు చేసే బాలెన్స్డ్  ఆహారాన్ని అలవాటు చేసుకోవడం మంచిది. కండరాలను బలంగా ఉంచే వ్యాయామాలు..  వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కండరాల సాంద్రత తగ్గుతుంది. అందుకే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లేదా కండరాలను దృఢపరిచే వ్యాయామాలు చేయడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుందని, ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో రక్షణ ఇస్తుందని వైద్యులు చెబుతున్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం.. ఇప్పటి వేగవంతమైన జీవితంలో ఒత్తిడి చాలా సాధారణమైపోయింది. ఒత్తిడి గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే మనస్సును, నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచడానికి సంగీతం వినడం, ధ్యానం చేయడం, లోతైన శ్వాస తీసుకోవడం వంటివి చేయాలి. రోజులో కొంత సమయాన్ని మనస్సును తేలికపరిచే కార్యకలాపాల కోసం కేటాయించడం చాలా ఉపయోగకరం. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏవేవో  ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. మన రోజువారీ అలవాట్లలో నడకను భాగం చేసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని దూరం చేసుకోవడం వంటి చిన్న చిన్న మార్పుల ద్వారానే ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు.                                  *రూపశ్రీ.  
అన్నానికి ప్రత్యామ్నాయంగా ఈమధ్య చాలామంది చూపు క్వినోవా వైపు మళ్లుతోంది. బరువు తగ్గాలనుకునే వారు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలనుకునే వారు ప్రతిరోజూ తినే తెల్ల అన్నాన్ని పక్కన పెట్టి క్వినోవాను ఎంచుకుంటున్నారు. ఇది చూడటానికి చిన్న చిన్న గింజల్లా అనిపించినా, దీనివల్ల శరీరానికి అందే పోషకాలు మాత్రం చాలా ఎక్కువ. మన చిరు ధాన్యాల మాదిరిగానే క్వినోవా కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ అన్నం స్థానంలో క్వినోవాను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఎలాంటి  మార్పులు వస్తాయో తెలుసుకుంటే.. ఎక్కువ పోషకాలు.. అన్నంలో పిండి పదార్థాలు ఎక్కువ. దీనివల్ల అన్నం తిన్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు త్వరగా పెరుగుతాయి. కానీ క్వినోవాలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తాయి. దీనివల్ల డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా మంచి ప్రత్యామ్నాయం. అలాగే, ఇది తిన్న తర్వాత చాలా సేపటి వరకు కడుపు నిండిన భావన ఉంటుంది. పదే పదే ఆకలి వేయకపోవడం వల్ల ఆటోమేటిక్‌గా ఆహారం తక్కువగా తింటారు. ఫలితంగా శరీరంలో అనవసరమైన కొవ్వు కరిగి బరువు తగ్గడం చాలా తేలికవుతుంది. తొమ్మిది రకాల అమైనో ఆమ్లాలు.. శాకాహారులకు క్వినోవా ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. సాధారణంగా మొక్కల సంబంధిత ఆహారాల్లో అన్ని రకాల అమైనో ఆసిడ్లు లభించడం కష్టం. కానీ క్వినోవాలో శరీరానికి అవసరమైన తొమ్మిది రకాల అవసరమైన అమైనో ఆసిడ్లు ఉన్నాయి. దీనివల్ల శరీరానికి కావలసిన సంపూర్ణ ప్రొటీన్ అందుతుంది. ఇది కండరాల నిర్మాణానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. ప్రొటీన్ ఎక్కువగా ఉండటం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండటానికి అవసరమైన శక్తి లభిస్తుంది. మలబద్దకానికి చెక్.. ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య మలబద్ధకం , జీర్ణక్రియ లోపాలు. క్వినోవాలో ఉన్న అధిక పీచు పదార్థం జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, వ్యర్థాలు తేలికగా బయటకు వెళ్లేలా చేస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.  గుండె ఆరోగ్యం కూడా.. క్వినోవా గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. క్వినోవాలో ఉండే పోషకాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. గ్లూటెన్ ఫ్రీ.. గ్లూటెన్ అలర్జీ ఉన్నవారికి క్వినోవా ఒక అద్భుతమైన ఆహారం. ఇందులో గ్లూటెన్ ఉండదు. కాబట్టి గోధుమలు, ఇతర ధాన్యాలు పడనివారు కూడా దీనిని నిరభ్యంతరంగా తినవచ్చు. ఇందులో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి  ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉన్నాయి. ఐరన్ శరీరంలో రక్తం కొరత రాకుండా చూస్తే, మెగ్నీషియం నరాలు , కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. వండుకోవడం కూడా తేలిక.. క్వినోవాను వండుకోవడం కూడా చాలా తేలిక. బియ్యాన్ని ఏ విధంగా వండుకుంటామో, అదే విధంగా రెండుసార్లు నీటితో శుభ్రంగా కడిగి ఉడికించుకోవచ్చు. దీనిని ఉడికించిన తర్వాత కూరలతో కలిపి తినవచ్చు లేదా రకరకాల కూరగాయలు చేర్చి ఉప్మా, పులావ్, సలాడ్స్ రూపంలో కూడా తయారుచేసుకోవచ్చు.  రోజువారీ ఆహారంలో తెల్ల అన్నం స్థానంలో క్వినోవాను చేర్చుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని, చక్కటి ఫిట్‌నెస్‌ను  సొంతం చేసుకోవచ్చు.                     *రూపశ్రీ.
మన జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళన, సమస్యలకు బయట పరిస్థితులే కారణమా? లేక మనలోని ఆలోచనలు, భావాలు, నిర్ణయాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయా? ఈ వీడియోలో Inner Engineering అంటే ఏమిటి? మనలోని ఆలోచనా విధానం మారితే మన ప్రవర్తన, నిర్ణయాలు, జీవన విధానంలో ఎలాంటి మార్పులు వస్తాయి? అనే విషయాలను డాక్టర్ శారదా దేవి, Professor of Human Development and Family Studies వివరిస్తున్నారు. మనల్ని మనం అర్థం చేసుకోవడం, Self-Awareness పెంచుకోవడం, మన ఆలోచనలు మరియు ప్రవర్తనను గమనించడం ద్వారా జీవితంలో సానుకూల మార్పులు ఎలా తీసుకురావచ్చో ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. Stress Relief, Mental Well-being, Self-Awareness, Motivation వంటి అంశాలపై ఉపయోగకరమైన విషయాలను తెలుసుకోవడానికి ఈ పూర్తి వీడియోను చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)