LATEST NEWS
  టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ..! తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయంతో వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ‘అదృశ్య వ్యక్తులు’ ఎవరో నిష్పాక్షికంగా గుర్తించి, వారిపై పార్టీ క్రమశిక్షణా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవిని కోరారు. క్రమశిక్షణా కమిటీ తనకు జారీ చేసిన నోటీసుకు ఇప్పటికే వివరణ ఇచ్చానని సురేఖ తెలిపారు.  అయినప్పటికీ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఒకే తరహాలో తనపై, తన కుటుంబంపై విమర్శలు చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. క్రమశిక్షణా కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే తనపై బహిరంగ విమర్శలు చేయడం, రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇవ్వడం, చర్యలు తీసుకోవాలని మీడియా ముందు డిమాండ్ చేయడం ద్వారా కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని కూడా పరిశీలించాలని ఆమె కోరారు.  పార్టీ నాయకత్వం, క్రమశిక్షణా నియమావళిపై తనకు పూర్తి గౌరవం ఉందని పేర్కొన్న సురేఖ.. సీనియర్ బీసీ మహిళా నాయకురాలిగా తనపై సామూహికంగా విమర్శలు వస్తున్నా పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోందని లేఖలో పేర్కొన్నారు. పార్టీ ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి కట్టుబడి వున్న పార్టీ అని, ఆ విలువలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై పార్టీ క్రమశిక్షణా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సురేఖ కోరారు. Konda Surekha, CM Revanth Reddy, Telangana Congress, Konda Susmitha, TPCC, Congress MLAs Ultimatum, TPCC Disciplinary Committee, MP Mallu Ravi  
మార్గదర్శి ఫిన్ క్యాప్ కేసు వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది.   రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ కేసులో  సుప్రీం కోర్టు  ఉండవల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ, ఈ కేసుతో ఆయనకు నేరుగా ఉన్న సంబంధం ఏమిటని నిలదీసింది.   2008 నుంచి ప్రారంభమైన ఈ మార్గదర్శి కేసు అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. గతంలో హైకోర్టు ఈ కేసును కొట్టివేసినప్పటికీ, ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఊరూరా సభలు నిర్వహించి మరీ  మార్గదర్శి సంస్థలు ఆర్‌బిఐ నిబంధనలను ఉల్లంఘించాయని, ప్రజలను మోసం చేశాయని   ఆరోపణలు గుప్పించారు. అయితే ఆయన వాదనలు, ప్రచారాలు, ఆరోపణలూ అన్నీ అసత్యాలని సుప్రీం తీర్పుతో తేలిపోయింది.  దీనిపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు.. ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసారావు తెలుగువన్ చానల్ కు ఇచ్చినఇంటర్వ్యూలో ఉండవల్లి మార్గదర్శిపై కేసు, న్యాయపోరాటం అంతా కేవలం ఈర్ష్యతోనే అన్నారు. అయితే దోమ ఏనుగుని చూసి ఈర్ష్యపడితే ఏమౌతుందో.. ఇప్పుడు ఉండవల్లి పరిస్థితి కూడా అంతేనన్నారు.   మార్గదర్శి డిపాజిటర్ల పరంగా ఇప్పటివరకూ ఒక్క బాధితుడు కూడా ఫిర్యాదు చేయకపోవడం, సంస్థ ఇప్పటికే రూ.2,600 కోట్లకు పైగా ఎస్క్రో అకౌంట్‌లో జమ చేయడం వంటి అంశాలను గుర్తు చేసిన అడుసుమిల్లి..  రామోజీరావు నిర్మించిన పత్రికా, వ్యాపార సామ్రాజ్యంపై కేవలం ఈర్ష్యా ద్వేషాలతోనే ఉండవల్లి అరుణ్ కుమార్,   వైసీపీ నాయకులు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారన్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో రామోజీరావును విచారణ పేరిట ఇబ్బందులకు గురిచేసినప్పటికీ, ఆయన ఏనాడూ వెనకడుగు వేయలేదన్నారు. ఈ తీర్పు  రామోజీరావు ప్రతిష్టను ఇనుమడింపచేసిందనీ, ఆయనపై   కక్షసాధింపు చర్యలకు చెక్ పడిందని  అడుసుమిల్లి అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు లేదా రాజకీయ అజెండాతో చేసిన పోరాటాలు చివరికి న్యాయస్థానాల ముందు నిలబడవని ఈ కేసు మరోసారి స్పష్టం చేసిందన్న ఆయన. సుప్రీం కోర్టు నిర్ణయంతో మార్గదర్శి వివాదానికి   ముగింపు పడినట్లేనన్నారు.  ఇప్పటికైనా విమర్శకులు తమ వైఖరిని మార్చుకోవాలని అడుసుమిల్లి హితవు పలికారు.  Supreme Court,  Margadarsi Judgement, Vundavalli Aruna Kumar,  Margadarsi Case,  Court Verdict Telugu, TeluguOne
తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో ఇప్పుడు కాంగ్రెస్ అంతర్గత విభేదాలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా కొందరు సీనియర్ లు విమర్శలు గుప్పిస్తున్నారు.  అందుకు ప్రతిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు, 5 గురు ఎమ్మెల్సీలు ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చి,   మంత్రి కొండా సురేఖను  పదవి నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై  ప్రభుత్వ విప్ వేముల వీరేషం  తెలుగువన్ న్యస్ చానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలన్న డిమాండ్  ఎవరి స్వార్థం కోసం చేసిన రచ్చ కాదు, పార్టీ క్రమశిక్షణను కాపాడేందుకు తీసుకున్న చర్య అని  వివరించారు. కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ప్రభుత్వంని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన వీరేషం..  క్రమశిక్షణ రాహిత్యంగా ఎవరు మాట్లాడినా సరే సహించేది లేదు అని వీరేషం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక జోడెడ్ల బండిలా రాత్రింబవళ్లు కష్టపడి పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే... కొంతమంది వ్యక్తులు మీడియా మైకులు దొరగ్గానే నోటికొచ్చినట్టు లూజ్ టాక్ మాట్లాడటం వల్ల క్యాడర్ తీవ్ర గందరగోళానికి గురవుతోందని వేముల వీరేషం అన్నారు. కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలన్న డిమాండ్ ను బీసీ మంత్రిని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న దాడిగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.  పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, రెడ్డి అనే తేడాలు ఉండవు. బి ఫామ్ అందరికీ ఒక్కటే, పార్టీ క్రమశిక్షణ అందరికీ ఒక్కటే! తప్పు చేస్తే చర్యలు తప్పవు, నిన్న జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేయలేదా?" అని ప్రశ్నించారు.  తెలంగాణలో  ఆగస్టు సంక్షోభం, రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనను   క్యాన్సిల్ చేసుకుని హుటాహుటిన తిరిగి వస్తున్నారన్న కామెంట్లను కూడా వీరేషం ఖండించారు.  2029 వరకే కాదు, 2034 వరకు కూడా రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారన్నారు.   Demand in Congress to Burthruf Konda Surekha, Vemula Veeresham, CM Revanth Reddy, Telangana Congress Politics, Konda Sushmitha Comments, Revanth Reddy Cabinet 
తెలుగు రాజకీయాల్లో  సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి   హత్య కేసులో ఇప్పుడు ఈడీ రంగప్రవేశం చేసింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన సన్నిహితుల నివాసాలలో ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించింది.  2019 మార్చిలో జరిగిన వివేకా హత్య వెనుక 40 కోట్ల సుపారీ  ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రూ.1 కోటి అడ్వాన్స్‌గా ఇచ్చారని, అందులో రూ.70 లక్షలు రికవరీ అయ్యాయని వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు దాదాపు ఏడేళ్ల తరువాత ఈడీ సోదాలు నిర్వహించిందంటే ఏం జరుగుతోంది?  ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్ కోణంలో ఈడీ ఎలాంటి కీలక ఆధారాలు సేకరించబోతోంది? అన్న విషయంపై ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు, ఏపీ కమ్మకార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు.    ఈ కేసులో కీలక సాక్షులు కొందరు ఇప్పిటికే అనుమానాస్పద స్థితిలో చనిపోయారు.   ఇలాంటి పరిస్థితుల్లో అప్రూవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం  కీలకంగా మారింది. జైలులో బెదిరింపులు వచ్చినా, కోట్లాది రూపాయల ఆఫర్లు ఇచ్చినా లొంగకుండా దస్తగిరి మెజిస్ట్రేట్ ముందు వివరాలు వెల్లడించారు.  అదలా ఉంటే..   ప్రజా కోర్టులో  వివేకా హత్య కేసులో   తీర్పు వచ్చేసిందన్న అడుసుమిల్లి శ్రీనివాసరావు.. బాధితురాలైన కుమార్తెకు చట్టబద్ధంగా న్యాయం జరిగాల్సి ఉందన్నారు. అర్ధరాత్రి హత్య జరిగితే, తెల్లవారక ముందే ఫోన్ కాల్స్ వెళ్లడం, సాక్ష్యాధారాలు తుడిచిపెట్టే ప్రయత్నం జరగడంపై ఇప్పటికీ అనేక ప్రశ్నలు ఉన్నాయి?  అయితే ఇప్పుడు ఈ కేసులో ఈడీ ఎంట్రీ..  40 కోట్ల సుపారీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరెవరి ఖాతాల నుంచి ఎక్కడికి బదిలీ అయింది? అన్నది తేల్చడమే..   అయితే ఇప్పుడు ఇక ఈడీ సోదాల వల్ల ఒరిగిందేమీ ఉండదన్న అడుసుమిల్లి.. ఆ 40 కోట్లు వీళ్లకి రోడ్డు మీద దొరికాయని ఈడీ ముక్తాయించేసినా ఆశ్చర్యంలేన్నారు.   ఏది ఏమైనా, ఓ మాజీ ఎంపీ, మాజీ మంత్రి   స్వగృహంలోనే హత్యకు గురైతే.. ఏళ్లు గడుస్తున్నా బాధ్యులకు సరైన శిక్ష పడకపోవడం వ్యవస్థల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈడీ దర్యాప్తులోనైనా అసలు సూత్రధారులు బయటకు వస్తారా? లేక ఇది కూడా కేవలం విచారణలకే పరిమితమవుతుందా చూడాల్సి ఉంది. ED entry in YS Viveka Murder Case, ED Investigation AP, Avinash Reddy ED Raids, Dastagiri Statement, YS Jagan Mohan Reddy, AP Politics, TeluguOne
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్  ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుక  ఉభయ తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లో జరిగిన ఈ వివాహం కుటుంబ వేడుకగా కాకుండా.. వైసీపీ నేతల గ్యాదరింగ్ గా మారి పొలిటికల్ అటెన్షన్ కు కారణమైంది. పీఎస్సార్ ఆంజనేయులు కుమారుడి వివాహానికి  వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ సహా వైసీపీకి  చెందిన   కీలక నేతలు హాజరయ్యారు. జగన్, అంబటి రాంబాబు, కొడాలి నాని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీకి చెందిన  పలువురు మాజీ మంత్రులు, సీనియర్ నేతలు ఈ వివాహానికి హాజరయ్యారు.  వివాహ వేదిక దాదాపుగా వైసీపీ మినీ ప్లీనరీ జరుగుతోందా అనిపించేలా ఉంది.  ఈ వివాహ కార్యక్రమం దాదాపుగా పార్టీ అంతర్గత సమావేశాన్ని తలపింప చేసేదిగా మారిపోయింది.  ఇటీవల కాలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ స్థాయిలో ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటి సారి. మాజీ పోలీస్ ఉన్నతాధికారి కుటుంబంలో జరిగిన వేడుకకు ఒక రాజకీయ పార్టీకి చెందిన నేతలు ఈ స్థాయిలో హాజరుకావడం రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకోవడమే కాకుండా కొత్త చర్చకు దారి తీసింది.  గతంలో  వైపీపీ అధికారంలో ఉన్న సమయంలో  పీఎస్సార్ ఆంజనేయులు ఏపీ పోలీస్ శాఖలో   కీలకమైన పదవుల్లో బాధ్యతలు నిర్వహించారు. నిఘా విభాగం అధిపతిగా బాధ్యతలు చేపట్టిన కాలంలో ఆయన వైసీపీ సర్కార్ కు అనుకూలంగా వ్యవహరించారన్న   ప్రచారం అప్పట్లో పెద్ద ఎత్తున జరిగింది.   రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత..  ఆయన  చట్టపరమైన వివాదాలు, కేసులలో చిక్కుకోవడం వి తెలిసిందే. ముఖ్యంగా ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీకి సంబంధించిన వేధింపుల కేసు, అలాగే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  పరీక్షల్లో జరిగిన అక్రమాల ఆరోపణల కేసులలో ఆంజనేయులు పేరు ప్రముఖంగా ఉంది. జెత్వానీ వ్యవహారంలో ఆయన్ను ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు. ఆ తరువాత ఆయనకు బెయిల్  లభించింది అది వేరే సంగతి.  ఈ నేపథ్యంలో వైసీపీ హయాంలో  వివాదాస్పదంగా వ్యవహరించి ఆరోపణలు, విమర్శలూ ముటగట్టుకున్న ఓ మాజీ పోలీసు ఉన్నతాధికారి కుమారుడి వివాహానికి వైసీపీ అగ్రనేతలంతా తరలిరావడం అప్పటి ఆరోపణలకు బలం చేకూర్చేదిగా ఉందని పరిశీలకులు అంటున్నారు.   PSR Anjaneyulu son marriege in Hyderabad, YS Jagan Mohan Reddy, YCP Leaders, Hyderabad Wedding Gathering, AP IPS Officer, TeluguOne
ALSO ON TELUGUONE N E W S
    ఇరుముడి... ఇది కేవలం సినిమా కాదు.. ఎంతో మంది ఆశలకి ఉపిరిపోసిన సంజీవిని. జోరు వర్షాల్లో కడుపుకి తింటానికి కూడా కాలు బయటపెట్టకుండా యాప్స్ పై ఆధారపడిన క్లాస్, మాస్  ఫ్యామిలీస్ నిన్న వాన కురుస్తున్నా కూడా చలో టూ ఇరుముడి థియేటర్స్ అని తరలి వెళ్లారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు రెండు  తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ మొత్తం హౌస్ ఫుల్. సీట్స్ లో ఎక్కడ చూసినా సెవెంటీ పర్శంట్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈమధ్య కాలంలో టాలీవుడ్‌లో ఒక మాట బాగా వినిపిస్తోంది. ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం తగ్గించేశారని, కేవలం మాస్, యాక్షన్ సినిమాలకు మాత్రమే థియేటర్లలో కలెక్షన్లు వస్తాయనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, సరైన కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్ల బాట పడతారని  'ఇరుముడి' సినిమా నిరూపించింది.  "ఫ్యామిలీలు థియేటర్లకు రారు" అనే మాట తప్పని   నిరూపిస్తూ పరిశ్రమకి, ఫ్యామిలీ చిత్రాలని నిర్మించాలనుకునే మేకర్స్ కి  ఒక కొత్త ఆశ, భరోసాని ఇచ్చింది. ముఖ్యంగా వంశపారంపర్యంగా థియేటర్స్ ని నమ్ముకున్న వాళ్ళల్లో జోష్ తీసుకొచ్చింది. థియేటర్స్ లో  పని చేసే స్టాఫ్ కి జీతాలు ఇచ్చే ఒకటవ తారీకుకి ఎలాంటి డోకా లేకుండా చేసింది. Also Read: యాభై భాషల్లో వారణాసి మొదటి రోజు కేవలం 20 శాతం ఆక్యుపెన్సీతో ప్రారంభమైన ఈ సినిమా, కేవలం మూడు రోజుల్లోనే కుటుంబ ప్రేక్షకుల 'మౌత్ టాక్' వల్ల ఏకంగా 100 శాతానికి పైగా ఆక్యుపెన్సీని నమోదు చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఇదంతా కుటుంబప్రేక్షకుల పుణ్యమే. ఏది ఏమైనా ఇరుముడి లాంటి సినిమాలు రావడం పరిశ్రమకి ఎంతో అవసరం. రూపాయికి రెండు వందల రూపాయిల లాభాన్ని తెచ్చిపెట్టే దిశగా ఇరుముడి దూసుకెళ్తుంది. మూడు రోజులకి వచ్చిన 80 కోట్లే ఉదాహరణ. Irumudi, Raviteja, Theaters, ShivaNirvana, PriyaBhavanishankar, Nakshthra  
  ఇండియన్ సినిమా వైపు ప్రపంచ సినిమా చూడాలనే లక్ష్యంగా 'వారణాసి' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అందుకోసం మహేష్, రాజమౌళితో పాటు టీం మొత్తం అహర్నిశలు శ్రమిస్తోంది. వరల్డ్ వైడ్ గా దాదాపు 120కి పైగా దేశాల్లో విడుదల కాబోతున్న ఈ గ్లోబల్ విజువల్ వండర్ కి  సంబంధించి తాజాగా ఒక సంచలనాత్మక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.   భారతీయ చలనచిత్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా వారణాసిని  50కి పైగా  భాషల్లో విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇన్ని భాషల్లో డబ్బింగ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ వాయిస్ క్లోనింగ్ సాంకేతికతపై ఆధారపడటం సులభమైన మార్గం. అయితే, సినిమాలోని  ఎమోషన్ 'ఏఐ' ద్వారా రాదని, దాదాపు 1600 మందికి పైగా ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్టులతో ఆయా భాషల డబ్బింగ్ ప్రక్రియని  నిర్వహించేందుకు జక్కన్న  పక్కా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సుదీర్ఘ డబ్బింగ్ ప్రాసెస్ కోసం ఆయా భాషలకు సంబంధించిన స్థానిక ఉచ్చారణ, నిర్దిష్టమైన యాస మరియు సంస్కృతికి తగినట్లుగా డైలాగ్స్ రూపుదిద్దుకుంటున్నాయి. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి అంతర్జాతీయ స్థాయి నటీనటుల తెరపై కనబరిచే హావభావాలు, నటనలోని అసలైన భావోద్వేగాలు ఏ భాషలో చూసినా ప్రేక్షకులకు ఎంతో సహజంగా అనిపించేలా ప్రతి పాత్రకూ వాయిస్ టెస్టులు చేసి ప్రత్యేకంగా డబ్బింగ్ రికార్డ్ చేయిస్తున్నారు. 1600 మంది కళాకారుల విభిన్న గొంతులతో 50 భాషల్లో ఒకే చిత్రాన్ని ఈ స్థాయిలో ప్రాసెస్ చేయడం గ్లోబల్ సినిమా చరిత్రలోనే ఒక సరికొత్త మైలురాయిగా నిలవనుంది.      Also Read: మూడు రోజులకి ఎంతంటే! వారణాసి కథ విషయానికి వస్తే, ఇది కేవలం సాధారణ అడ్వెంచర్ మాత్రమే కాదు.   భూమిని ఢీకొట్టేందుకు అత్యంత వేగంగా దూసుకొస్తున్న ఒక భారీ ఉల్క వల్ల ఏర్పడే సర్వనాశనం ప్రమాదం నుండి పవిత్ర నగరం వారణాసితో పాటు మొత్తం ప్రపంచాన్ని కాపాడే ఒక ఉత్కంఠభరితమైన మిషన్‌గా ఈ సినిమా సాగనుంది. ఈ సినిమాలో మహేష్ బాబు 'రుద్ర' అనే అత్యంత సాహసోపేతమైన పాత్రలో కనిపిస్తుండగా, కథాంశంలో భాగంగా ఆయన వివిధ కాలాల మధ్య టైమ్ ట్రావెల్ చేసేలా అత్యుత్తమ స్క్రీన్ ప్లేని రాజమౌళి తీర్చిదిద్దారు. భారతీయ సనాతన ధర్మం, ప్రాచీన పురాణ వైభవం మరియు ఆధునిక మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్లను మిళితం చేస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో శరవేగంగా నిర్మాణం జరుపుకుంటూ ఉంది. 1400 కోట్ల భారీ బడ్జెట్ తో కె ఎల్ నారాయణ నిర్మిస్తుండగా కీరవాణి మ్యూజిక్. Varanasi, Mahesh Babu, Rajamouli, Priyanka Chopra
Mahakali has unveiled its grand glimpse, offering a striking look at the ambitious mythological spectacle from the Prasanth Varma Cinematic Universe. More importantly, the makers have locked 8th January, for its theatrical release, bringing the film into the Sankranti festive race. Titled Shukracharya’s WarCry, the glimpse puts Akshaye Khanna at the centre of the spectacle. Playing Shukracharya, the formidable guru of the Asuras, Khanna appears in a fierce and unrecognizable avatar. His intense gaze and commanding presence immediately create curiosity about the character and the role he will play in the impending war. The glimpse hints at a conflict far bigger than a conventional battle between good and evil. The clash between Dharma and Adharma appears to have consequences for an entire mythological universe, with ominous imagery, elaborate world-building and striking visual effects establishing the scale of the story. The final moments of the glimpse particularly stand out with a goosebumps-inducing visual. Written by Prasanth Varma and directed by Puja Aparna Kolluru, Mahakali expands the universe established with HanuMan. Sriya Reddy, Bhoomi Shetty and Rohit Saraf are also part of the prominent cast. Produced by Riwaz Ramesh Duggal under RKD Studios, Mahakali has become one of the notable releases entering the Sankranti 2027 season. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
    మంచి కంటెంట్ ఇచ్చి కలెక్షన్స్ సంగతి మాకు వదిలేయండి అన్నటుగా ఉంది ఇరుముడి కలెక్షన్స్ పరిస్థితి. మొన్న శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చిన ఇరుముడి ఆ ఏరియా ఈ ఏరియా అని కాదు వరల్డ్ వైడ్ గా అన్ని ఏరియాస్ లో రికార్డు కలెక్షన్స్ దిశగా దూసుకెళ్తుంది.  మూడు రోజులకి 80 కోట్ల రికార్డు మార్కుని అందుకొని రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మేకర్స్ కూడా కలెక్షన్స్ పై అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేసారు. దీంతో మాస్ మహారాజా అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. 200 కోట్ల మార్కుని అందుకుంటామని నెట్టింట హంగామా చేస్తున్నారు. ఇరుముడి వేగాన్ని చూస్తే 200 కోట్లు పెద్ద కష్టమేమి కాదనే మాటలు ట్రేడ్ సర్కిల్స్ లో సైతం వినిపిస్తున్నాయి. Also Read: చిరంజీవి బర్త్ డే రోజు రిలీజైన ఒకే ఒక్క సినిమా ఏంటో తెలుసా!  తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే భావోద్వేగమైన అనుబంధానికి,  అయ్యప్ప దీక్షా నేపథ్యం కలవడంతో ప్రేక్షకుల హృదయాలను తాకడంతో థియేటర్లకు జనాలు క్యూ కడుతున్నారు. చాలా సినిమాల తర్వాత  రేపు ఇరుముడి మూవీకి వెళ్లాలని  ముందురోజే  ప్రేక్షకులు ప్రిపేర్ అయ్యి తమ రోజువారీ టైం టేబుల్ వేసుకుంటున్నారంటే ఇరుముడికి యొక్క ప్రాశస్త్యాన్ని అర్ధం చేసుకోవచ్చు.   మైత్రీ మూవీ మేకర్స్,  టి సిరీస్ సంయుక్తంగా నిర్మించగా బంగాళా ఖాతంలో ఎన్ని వాయుగుండాలుపడినా ఇరుముడి థియేటర్స్ మాత్రం అభిమానులు, ప్రేక్షకులతో కళకళలాడటం ఖాయం. అందుకు హైదరాబాద్ లో  నిన్న ఆదివారం కురిసిన భారీ వర్షాలే ఉదాహరణ.   Irumudi, Raviteja, Shiva Nirvana, PriyaBhavani Shankar, Nakshtra    
ప్రస్తుతం సోషల్ మీడియాలో జయరామ్, సిమ్రాన్‌ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సాంప్రదాయ దుస్తులు, మెడలో పూలదండలతో చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోలు చూసి.. జయరామ్, సిమ్రాన్‌ పెళ్లి చేసుకున్నారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.  సీనియర్ యాక్టర్స్ ఉన్నట్టుండి ఇలా పెళ్లి బట్టల్లో కనిపించేసరికి అభిమానులకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. అయితే దీని వెనుక ఉన్న అసలు మ్యాటర్ ఏంటో తెలిస్తే మరింత షాక్ అవ్వడం గ్యారెంటీ. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫోటోలు నిజమే. వారి మెడలో పూలదండలు ఉన్న మాట కూడా వాస్తవమే. కానీ, వారు పెళ్లి చేసుకోలేదు. వైరల్ అవుతున్న ఆ ఫోటోల వెనుక ఉన్న అసలు కారణం.. ఒక కొత్త సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం. ఇటీవల ప్రారంభమైన ఒక కొత్త మూవీ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా, సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న జయరామ్, సిమ్రాన్‌ కు నిర్వాహకులు పూలదండలు వేసి సత్కరించారు. అక్కడ తీసిన ఫోటోలనే కొందరు పెళ్లి ఫోటోలు అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీంతో నిజంగానే వీరిద్దరికి పెళ్లయిందని చాలామంది నెటిజెన్లు భ్రమపడ్డారు. మొత్తానికి సోషల్ మీడియా పుణ్యమా అని.. ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోవడం ఎంత కష్టమైపోయిందో దీని ద్వారా మరోసారి అర్థమవుతోంది.       Jayaram, Simran, Viral Photos  
Nandamuri Balakrishna and Gopichand Malineni’s upcoming action entertainer, tentatively titled NBK111, appears to be heading towards a Christmas release. The film was initially being planned for a Dussehra release, but the latest industry buzz suggests that the makers are now considering December 24 as the new target. The change in plans is reportedly linked to the shooting schedule. Balakrishna recently sustained an injury while filming a high-intensity action sequence and underwent surgery. With the actor currently recuperating, the team has had to rework its shooting plans. The additional time could also help the makers complete the film’s elaborate action blocks and post-production without rushing the project. The film has already generated considerable interest following its birthday glimpse, which showcased Balakrishna in a younger and stylish avatar. Manchu Manoj and Kajal Aggarwal are playing prominent roles, while S Thaman’s background score has added further impact to the glimpse. Produced by Venkata Satish Kilaru under Vriddhi Cinemas, NBK111 is being mounted on a large scale as a commercial action spectacle. A Christmas release would give the film access to a strong holiday window across domestic and overseas markets, making Christmas an attractive alternative to the earlier Dussehra plan.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Yash’s confidence in Toxic was evident throughout his speech at the film’s grand pre-release event in Hyderabad, but what stood out just as much was his effort to connect with the Telugu audience in their own language. The Rocking Star spoke extensively in Telugu, displaying an impressive command over the language and making the interaction feel far more personal. Yash fondly recalled how Telugu audiences embraced him as Rocky Bhai through the KGF franchise. He described Toxic as a major step towards his larger ambition of taking Indian Cinema to the world, calling the film “bold, sensational, original, unique and path-breaking.” His conviction was unmistakable as he confidently promised that the film would be an “Oora Mass” entertainer capable of reaching and entertaining everyone. Interestingly, Yash’s speech also reflected the thought behind Toxic beyond its scale and action. He specifically spoke about the film’s women characters and how society often underestimates women. According to him, every woman in Toxic has been written differently and their journeys should inspire audiences to believe that they can achieve anything. His connection with the Hyderabad audience became even more evident when he stopped his speech after noticing people falling from a height in the crowd. Yash refused to continue until he was assured that they were safe, showing a genuine concern for the people who had gathered to see him. More than the usual pre-release promises, Yash’s words revealed a star who clearly believes in the film he has made. His confidence in Toxic, coupled with his comfortable Telugu delivery and genuine affection for the Telugu audience, made his speech one of the highlights of the event. With the film arriving worldwide on August 26, the conviction behind Yash’s ambitious vision is now set to meet the audience. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ మూవీ 'NBK111'. కాకినాడ పోర్ట్ షూటింగ్‌లో బాలకృష్ణ మోకాలికి గాయం కావడంతో షూటింగ్ ఆలస్యమై దసరా విడుదల వాయిదా పడింది. అయితే ఇప్పుడు బాలయ్య షూటింగ్ కి రెడీ అవుతుండటంతో.. కొత్త రిలీజ్ డేట్ లాక్ అయినట్లు తెలుస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీశ్ కిలారు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిజానికి ఈ హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను దసరా కానుకగా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. కానీ, బాలకృష్ణ మోకాలికి సర్జరీ జరగడంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. అయితే, గాయం నుంచి కోలుకుంటున్న బాలయ్య సెప్టెంబర్ నుంచే మళ్ళీ ఫుల్ ఫిట్‌నెస్‌తో లొకేషన్‌లోకి అడుగుపెట్టబోతున్నారట. గోపీచంద్ మలినేని ఆల్రెడీ కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసి, మిగిలిన బ్యాలెన్స్ పార్ట్‌ను శరవేగంగా పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారని సమాచారం. దసరా రేసు నుంచి తప్పుకున్నా.. బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేయడానికి మేకర్స్ ఒక పర్ఫెక్ట్ డేట్‌ను సెట్ చేశారు. ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. క్రిస్మస్ హాలిడే సీజన్, ఇయర్ ఎండ్ వీకెండ్ అడ్వాంటేజ్ తోడైతే బాలయ్య బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, మంచు మనోజ్ ఒక కీలకమైన పాత్రలో మెరవనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర టైటిల్ ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.         NBK111 Release Date, Nandamuri Balakrishna, Gopichand Malineni, Kajal Aggarwal, Manchu Manoj
Ravi Teja’s latest outing Irumudi is turning into a major box office success, with the film collecting more than Rs. 75 crore+ gross worldwide within just three days of its release. The film has also achieved a significant milestone in the overseas market by becoming Ravi Teja’s first film to cross the US$1 million mark. The response from family audiences has particularly surprised trade circles. The strong turnout and continuous demand for tickets have made the film’s eventual lifetime collections difficult to predict, with trade observers expecting exceptionally strong profit margins for the buyers and other parties involved. Irumudi reportedly achieved its breakeven target within two days of release, while the Monday advance bookings have remained strong. The film is selling around 15,000 tickets per hour on BookMyShow, an impressive trend for a weekday that indicates the movie could maintain substantial momentum beyond the opening weekend. Director Shiva Nirvana is receiving appreciation for presenting an intense narrative while incorporating an important social message. The integration of Ayyappa Deeksha and the devotional element has also connected strongly with audiences. Ravi Teja’s performance has emerged as one of the film’s major strengths, with Baby Nakshatra and Priya Bhavani Shankar also earning praise. GV Prakash Kumar’s music and the film’s technical execution have added to the overall impact. Produced by Mythri Movie Makers, Irumudi is now looking at a strong weekday run and could potentially set new benchmarks if its current momentum continues. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇరుముడి’ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. తండ్రి-కూతుళ్ళ ఎమోషన్, అయ్యప్ప భక్తి నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 21న థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. చాలా చోట్లా టికెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. షోలు పెంచాలన్న డిమాండ్ కూడా ఉంది. ప్రస్తుత జోరు చూస్తుంటే రూ.150 కోట్ల గ్రాస్ రాబట్టడం ఖాయమని.. అన్నీ కలిసొస్తే ఆ నెంబర్ రూ.200-300 కోట్ల వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదనే అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ‘ఇరుముడి’ సినిమాకి అతిపెద్ద సవాల్‌ ఎదురుకాబోతుంది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ ఆగష్టు 26న థియేటర్లలోకి వస్తోంది. కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే ‘టాక్సిక్’ రిలీజ్ అవుతుండటంతో.. ‘ఇరుముడి’ థియేటర్ల కౌంట్, కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. 'కేజీఎఫ్' తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో 'టాక్సిక్'పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా, ఈ మూవీ తెలుగు రైట్స్ ను దిల్ రాజు ఏకంగా రూ.120 కోట్లకు దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాల మాట. ఆ మొత్తం రాబట్టుకోవడానికి తెలుగునాట భారీ విడుదల ఉంటుంది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా తెలంగాణలో ఫస్ట్ డే దాదాపు 80 శాతం సింగిల్ స్క్రీన్స్ 'టాక్సిక్' వెళ్లనున్నాయి అంటున్నారు.  ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ‘ఇరుముడి’ సునామీ కనిపిస్తోంది. చూసిన వాళ్ళు మళ్ళీ చూడాలని, ఇంకా చూడని వాళ్ళు ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక వారం కూడా పూర్తి కాకుండానే.. కావాల్సినన్ని థియేటర్లు లేకపోవడం అనేది పెద్ద దెబ్బ అనే చెప్పాలి.  అయితే ఇక్కడ ‘ఇరుముడి’కి కలిసొచ్చే కొన్ని అంశాలు ఉన్నాయి. టాక్సిక్ అనేది మితిమీరిన వయలెన్స్ తో కూడిన బోల్డ్ మూవీ. దీనికి ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్లే పరిస్థితి దాదాపు ఉండదు. పైగా ఇప్పుడు తెలుగునాట 'టాక్సిక్' నిలబడాలంటే.. ఇరుముడిని మించిన గొప్ప టాక్ రావాలి. అప్పుడే యూత్ అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ‘టాక్సిక్’కి ఓ రేంజ్ టాక్ రాకపోయినా, జనరల్ ఆడియన్స్ సపోర్ట్ లేకపోయినా నిలబడటం కష్టమే. ఒకవేళ అదే జరిగి, ఆడియన్స్ రాకపోతే.. రెండు రోజు నుంచే థియేటర్లు తగ్గుతూ, ఆటోమేటిక్ గా ఇరుముడికి వస్తాయి. అదే జరిగితే ఇరుముడి ప్రభంజనాన్ని ఆపడం ఎవరి తరం కాదు. మరి తెలుగు ఆడియన్స్ 'టాక్సిక్' రూపంలో ఎదురుకానున్న సవాల్ ను ఎదుర్కొని, ‘ఇరుముడి’ని పల్లకిలా భుజాన మోస్తారేమో చూడాలి.         Irumudi vs Toxic, Irumudi Collections, Ravi Teja, Irumudi Movie, Toxic Movie  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రకృతి మనకు ప్రసాదించిన అత్యంత అమూల్యమైన వరాలలో కొబ్బరి చెట్టు ఒకటి. దీనిని మన పెద్దలు కల్పవృక్షం అని పిలుస్తారు. ఎందుకంటే కొబ్బరి చెట్టులోని ప్రతి భాగం అనగా లేత కొబ్బరి నీళ్లు, కొబ్బరి గుజ్జు, కొబ్బరి పాలు మరియు స్వచ్ఛమైన కొబ్బరి నూనె మన శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, నిత్య యవ్వనాన్ని అందిస్తాయి. నేటి ఉరుకులు పరుగుల ఆధునిక జీవనశైలిలో సహజసిద్ధమైన పోషకాలను కోల్పోతున్న మన శరీరానికి కొబ్బరి ఒక అద్భుతమైన అమృతంలా పనిచేస్తుంది. ప్రతిరోజూ మన ఆహారంలో లేదా దినచర్యలో కొబ్బరిని ఏదో ఒక రూపంలో భాగం చేసుకోవడం ద్వారా ఊహించని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని ఆయుర్వేద మరియు పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మొదటగా, కొబ్బరి నీళ్ల గురించి చెప్పుకోవాలంటే ఇవి కేవలం దాహార్తిని తీర్చే సాధారణ పానీయం మాత్రమే కావు. ఒక కప్పు అనగా సుమారు 240 మి.లీ తాజా కొబ్బరి నీళ్లలో దాదాపు 600 మి.గ్రాముల పొటాషియం లభిస్తుంది. ఇది శరీరంలోని ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడటంలో, రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వ్యాయామం చేసిన తర్వాత లేదా శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నప్పుడు కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా శరీరం తక్షణ శక్తిని పుంజుకుంటుంది. అంతేకాకుండా, ఇందులో కెలొరీలు చాలా తక్కువగా అనగా కేవలం 45 నుంచి 60 కెలొరీలు మాత్రమే ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ డ్రింక్. మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శరీరంలోని హానికారక వ్యర్థాలను బయటకు పంపడంలో కొబ్బరి నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. ఇక కొబ్బరి కాయ లోపల ఉండే తెల్లని గుజ్జులో శరీరానికి అవసరమైన డైటరీ ఫైబర్, కాపర్, ఐరన్ మరియు మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తాజా కొబ్బరిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. మలబద్ధకం సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తూ, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ముఖ్యంగా ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది. మహిళల్లో హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో, చర్మం మరియు జుట్టు కాంతివంతంగా మారడంలో కొబ్బరి గుజ్జు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.       Coconut water and oil nutrition guide, health benefits of coconut from water to oil.
  నేటి ఆధునిక వేగవంతమైన జీవనశైలిలో ఉదయాన్నే ఒక వేడి కప్పు కాఫీ లేదా టీతో రోజును ప్రారంభించడం చాలామందికి ఒక అలవాటుగా మారింది. అలసటను తరిమికొట్టి, శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడానికి కెఫిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, పరిమితికి మించిన కెఫిన్ వినియోగం ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి, వారి హార్మోన్ల సమతుల్యతకు తీవ్రమైన హాని కలిగిస్తుందని వైద్య ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ క్రమం తప్పకుండా 400 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోవడం వల్ల మహిళల్లో ఈస్ట్రోజెన్ మరియు ప్రోజెస్టిరాన్ వంటి అత్యంత కీలకమైన హార్మోన్ల ఉత్పత్తిలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఇది కేవలం తాత్కాలిక అసౌకర్యంతో ఆగకుండా, దీర్ఘకాలికంగా తీవ్రమైన శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మహిళల శరీరంలో కెఫిన్ ప్రవేశించినప్పుడు అది ప్రాథమికంగా స్ట్రెస్ హార్మోన్ అయిన కోర్టిసాల్ స్థాయిలను దాదాపు 30% నుండి 40% వరకు పెంచుతుంది. శరీరంలో కోర్టిసాల్ విపరీతంగా పెరగడం వల్ల మనస్సు నిరంతరం తీవ్రమైన ఒత్తిడికి, ఆందోళనకు గురవుతుంది. ఈ అధిక కోర్టిసాల్ ప్రభావం నేరుగా అడ్రినల్ గ్రంధులపై పడి, లైంగిక మరియు సంతానోత్పత్తి హార్మోన్ల ఉత్పత్తిని క్రమంగా క్షీణింపజేస్తుంది. ఫలితంగా, రుతుక్రమ చక్రంలో తీవ్రమైన అసమతుల్యతలు తలెత్తుతాయి. రోజుకు 2 నుండి 3 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగే మహిళల్లో సుమారు 25% మంది పీరియడ్స్ ఆలస్యం కావడం, అధిక రక్తస్రావం కావడం లేదా తీవ్రమైన పొత్తికడుపు నొప్పితో బాధపడటం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, అధిక కెఫిన్ వినియోగం ఈస్ట్రోజెన్ డామినెన్స్‌కు కారణమవుతుంది. శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు అవసరమైన దానికంటే ఎక్కువగా పెరిగినప్పుడు, థైరాయిడ్ గ్రంధి పనితీరు మందగిస్తుంది. ఇది థైరాయిడ్ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసి, జీవక్రియల రేటును గణనీయంగా తగ్గిస్తుంది. దీనివల్ల చాలామంది మహిళల్లో ఎంత వ్యాయామం చేసినా బరువు తగ్గకపోవడం, నిరంతరం నీరసంగా అనిపించడం, మరియు తీవ్రమైన జుట్టు రాలడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. పిసిఒడి (PCOD), పిసిఒఎస్ (PCOS) మరియు ఫైబ్రాయిడ్స్ వంటి సమస్యలతో బాధపడుతున్న మహిళలు కెఫిన్ వినియోగాన్ని తగ్గించుకోకపోతే, వారి శరీరంలో ఇన్సులిన్ నిరోధకత మరింత పెరిగి వ్యాధి తీవ్రత 50% వరకు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.       How caffeine affects estrogen and pcos,caffeine and period problems in women.
స్త్రీలలో వచ్చే గైనకాలజిక్ క్యాన్సర్లు నేటి వైద్య ప్రపంచంలో అత్యంత తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్న ప్రధానమైన ఆరోగ్య సమస్యలలో ఒకటిగా మారాయి. గర్భాశయ, అండాశయ, మరియు సర్వికల్ క్యాన్సర్ల బారిన పడుతున్న మహిళల సంఖ్య రోజురోజుకూ వేగంగా పెరుగుతుండటం వైద్య రంగాన్ని తీవ్ర ఉలిక్కిపాటుకు గురిచేస్తోంది. అయితే ఈ వ్యాధుల తీవ్రత కంటే కూడా, వీటిని సకాలంలో గుర్తించకపోవడమే రోగుల ప్రాణాలకు అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తోంది. అంతర్జాతీయంగా వెలువడుతున్న పలు ఆరోగ్య పరిశోధనల ప్రకారం, గైనకాలజిక్ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులలో దాదాపు 60% కంటే ఎక్కువ మంది చివరి దశల్లో లేదా అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో మాత్రమే ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించకపోవడం వల్ల చికిత్స విధానాలు ఎంతో సంక్లిష్టంగా మారడమే కాకుండా, బాధితుల ప్రాణాలను కాపాడే అవకాశాలు గణనీయంగా పడిపోతున్నాయి. మహిళల్లో ఈ వ్యాధుల నిర్ధారణ ఇంతగా ఆలస్యం కావడానికి అనేక సామాజిక, ఆర్థిక మరియు మానసిక కారణాలు ముడిపడి ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా చాలామంది మహిళల్లో ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాల పట్ల ప్రాథమిక అవగాహన లోపించడం అతిపెద్ద ప్రతిబంధకంగా మారింది. అసాధారణ రక్తస్రావం, పొత్తికడుపులో తీవ్రమైన నొప్పులు, లేదా శరీర బరువులో ఆకస్మిక మార్పులు కనిపించినప్పుడు కూడా, వాటిని సాధారణ రుతుక్రమ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారు. బాధితులలో దాదాపు 45% మంది మహిళలు ప్రారంభ లక్షణాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడమో లేదా ఇతరులతో చెప్పుకోవడానికి సంకోచించడమో చేస్తున్నారని వైద్య గణాంకాలు చెబుతున్నాయి. వైద్య నిపుణుల వద్దకు వెళ్లి క్రమం తప్పకుండా రెగ్యులర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకునే అలవాటు కేవలం 15% లోపు మహిళల్లో మాత్రమే ఉండటం అత్యంత విషాదకరం. పరిశోధనల డేటా ప్రకారం, అండాశయ క్యాన్సర్ (Ovarian Cancer) కేసులలో 70% కంటే ఎక్కువ కేసులు మూడవ లేదా నాల్గవ దశకు చేరుకున్న తర్వాతే బయటపడుతున్నాయి. మొదటి దశలోనే వ్యాధిని గుర్తిస్తే ప్రాణాలు దక్కే అవకాశం 90% వరకు ఉంటుంది. కానీ చివరి దశలో నిర్ధారణ కావడం వల్ల ఐదేళ్ల సర్వైవల్ రేటు కేవలం 30% కి పడిపోతోంది. అలాగే గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో నివసించే మహిళలకు ఆధునిక గైనకాలజిక్ క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు స్పెషలిస్ట్ వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్ల వ్యాధి తీవ్రత మరింత పెరుగుతోంది. ఆర్థిక ఇబ్బందులు మరియు సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల దాదాపు 35% మంది పేద రోగులు అవసరమైన రోగనిర్ధారణ పరీక్షలను పూర్తి చేయలేకపోతున్నారు.       Ovarian cancer early detection importance,women gynecologic cancer screening guide.
సూపర్‌మార్కెట్‌లో, షాప్స్ లో, చిన్న అంగళ్లలో కొనుగోలు చేసే బిస్కెట్లు, ప్యాకెట్ ఫుడ్స్, పాల ఉత్పత్తులు, జ్యూస్‌లు, సాస్‌లు, రెడీ-టు-ఈట్ ఆహార పదార్థాలపై “Best Before”, “Use By”, “Expiry Date” వంటి పదాలు కనిపిస్తుంటాయి. చాలామందికి వీటి మధ్య తేడా స్పష్టంగా తెలియదు. “తేదీ అయిపోయింది కదా… ఇక ఆహారం మొత్తం పారేయాలా?” అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అంతే కాదు.. తేదీ దాటి ఇంకా ఒక్కరోజే, ఒక్క వారమే.. కాబట్టి ఏమి కాదు అనుకుని  వాడేవాళ్ళు  కూడా ఉంటారు. అయితే Best Before తేదీ , Use By/Expiry తేదీ ఒకే అర్థాన్ని ఇవ్వవు. ఆహారం ఎంతకాలం నాణ్యతగా ఉంటుంది? ఎప్పుడు దాన్ని తినడం సురక్షితం కాదు? అనే విషయాల్లో ఈ తేదీలకు చాలా తేడా ఉంది. దీని గురించి ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. తేదీ ఎందుకు వేస్తారు? ఆహార పదార్థాలను తయారు చేసిన తర్వాత వాటి రుచి, వాసన, రంగు, ఆకృతి, పోషకాల నాణ్యత, భద్రత కాలం గడిచేకొద్దీ మారవచ్చు. అందుకే తయారీదారులు ప్యాకెట్‌పై ఒక నిర్దిష్ట తేదీని సూచిస్తారు. అయితే ఆ తేదీ ప్రతి సందర్భంలో “ఆ రోజు తర్వాత ఆహారం విషంగా మారుతుంది” అని అర్థం కాదు.  ఇక్కడే Best Before, Use By మధ్య తేడా వస్తుంది. “Best Before” అంటే ఏమిటి? Best Before అంటే ఆ ప్యాక్ లో ఉన్న ఆహార పదార్థం  మంచి నాణ్యతను కలిగి ఉండే కాలం. అంటే, ప్యాకెట్‌పై..  ఒక నిర్దిష్ట తేదీ వరకు ఆహారం తన రుచి, వాసన, క్రిస్పీనెస్, రంగు వంటి నాణ్యతలను బాగా కలిగి ఉంటుందనీ అర్ధం. తేదీ దాటిన వెంటనే ఆహారం పాడైపోతుందా? సరిగ్గా నిల్వ చేసిన కొన్ని ఆహార పదార్థాలు Best Before తేదీ దాటిన తర్వాత కూడా కొంతకాలం తినడానికి అనుకూలంగా ఉండవచ్చు. అయితే వాటి నాణ్యత తగ్గి ఉండవచ్చని చెబుతున్నారు. ఉదాహరణకు.. బిస్కెట్లు మెత్తబడవచ్చు, సీరియల్స్ క్రిస్పీనెస్ కోల్పోవచ్చు, కొన్ని ప్యాకెట్ ఫుడ్స్ రుచి తగ్గవచ్చు, టీ, కాఫీ వంటి పదార్థాల సువాసన తగ్గవచ్చు. అందుకే  Best Before అనేది ప్రధానంగా నాణ్యతకు సంబంధించిన అంశం అని చెబుతారు. “Use By” అంటే ఏమిటి? Use By అనేది ఆహారం  భద్రతకు సంబంధించిన గడువు. ఈ తేదీ ముఖ్యంగా త్వరగా పాడయ్యే ఆహార పదార్థాలకు వర్తిస్తుంది. ఉదాహరణకు: కొన్ని తాజా పాల ఉత్పత్తులు,  తాజా మాంసం, చేపలు, కొన్ని రెడీ-టు-ఈట్ ఆహారాలు, త్వరగా పాడయ్యే ఇతర ఆహారాలు ప్యాకెట్‌పై నిర్ణీత తేదీ ఉంటే.. ఆ తేదీ దాటిన తర్వాత అది బయటికి చూడటానికి లేదా వాసనకు బాగానే ఉన్నప్పటికి తినడం సురక్షితం అని అని అనుకోకూడదు.  అందుకే Use By తేదీ దాటిన ఆహారాన్ని తినకుండా ఉండటం మంచిది. Best Before తేదీ దాటితే ఏం చేయాలి? ఆహారం ఏ రకమైనది, ఎలా నిల్వ చేశారు, ప్యాకెట్ తెరిచారా లేదా అనే విషయాలపై ఇది ఆధారపడి ఉంటుంది. కొన్ని ఆహారాలు ఈ తేదీ దాటిన తర్వాత కూడా తినడానికి అనువుగానే ఉంటాయి. కానీ వాటిలో నాణ్యత మాత్రం తగ్గిపోయి ఉంటుంది. అలాంటి ఆహారం తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. వాసన చూసి ఆహారం సురక్షితమా కాదా తెలుసుకోగలమా? కొన్ని హానికరమైన బ్యాక్టీరియా లేదా ఇతర సూక్ష్మజీవులు ఆహారంలో పెరిగినా, ఆహారంలో  దుర్వాసన, రంగు మార్పు కనిపించకపోవచ్చు కూడా. అందువల్ల ఆహారం వాసన రాలేదనే కారణంతో తినడం సరైనది కాదు. ముఖ్యంగా Use By తేదీ దాటిన ఆహారాన్ని కేవలం వాసన లేదా రుచి చూసి ఏమి కాదని  నిర్ధారించుకోవడం సరైన పద్ధతి కాదు. ప్యాకెట్ తెరిచిన తర్వాత గడువు మారుతుందా? కొన్ని ఆహార పదార్థాలకు ఇది చాలా ముఖ్యమైన విషయం. కొన్ని ఆహారాల మీద best before అని ఉన్నా.. ప్యాకెట్ లు లేదా బాటిల్ మూతలు తెరిచిన తర్వాత వాటిని ఎక్కువ రోజులు వాడటం మంచిది కాదు. వాటిని తొందరగా వాడేయాలి.                                                                                                                                                   *రూపశ్రీ.
ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా గుర్తించాలి? అనే విషయాలను ఈ వీడియోలో డాక్టర్ ఆర్. బాలాజీ సులభంగా వివరిస్తున్నారు. కాలేయ కణాల్లో అధికంగా కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ (Fatty Liver Disease) అంటారు. చాలా మందిలో దీనివల్ల ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే కొంతమందిలో అలసట, బరువు తగ్గడం లేదా పొత్తికడుపులో అసౌకర్యం వంటి సమస్యలు కనిపించవచ్చు. అధిక బరువు, ఊబకాయం, జీవనశైలి వంటి కారణాలు ఫ్యాటీ లివర్‌కు దారితీయవచ్చు. ఆహారపు అలవాట్లలో మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువును నియంత్రించుకోవడం ద్వారా ప్రమాద కారకాలను తగ్గించుకోవచ్చు. ఫ్యాటీ లివర్‌ను నిర్లక్ష్యం చేయకుండా సరైన సమయంలో వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. కొంతమందిలో ఈ సమస్య కాలేయంలో తీవ్రమైన మార్పులకు దారితీసే అవకాశం ఉంటుంది. ఫ్యాటీ లివర్‌కు కారణాలు ఏమిటి? దాని లక్షణాలు ఏంటి? ఎలా నిర్ధారిస్తారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి పూర్తి వివరాలను డాక్టర్ ఆర్. బాలాజీ ఈ వీడియోలో వివరించారు. వీడియోను పూర్తిగా చూడండి.. ఫ్యాటీ లివర్ గురించి ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి. గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు లేదా లక్షణాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
మునగాకు (Moringa Leaves) మనకు ప్రకృతి అందించిన పోషక విలువలు ఉన్న ఆహారాల్లో ఒకటి. మునగాకులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే దీనిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతుంటారు. మునగాకు పొడిని ఎలా తీసుకోవాలి? ఎంత మోతాదులో తీసుకోవాలి? దీన్ని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? షుగర్, కీళ్ల నొప్పులు, రోగనిరోధక శక్తి వంటి విషయాల్లో మునగాకు ఎలా ఉపయోగపడుతుంది? అనే అంశాలను ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ వివరించారు. మునగాకు పొడిని సరైన విధంగా తీసుకోవడం, ఆహారంలో ఎలా చేర్చుకోవాలి అనే విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. గమనిక: మునగాకు లేదా మునగాకు పొడి ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా ఉపయోగపడవచ్చు. అయితే డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనల మేరకు ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిది. మందులకు బదులుగా మునగాకు పొడిని ఉపయోగించకండి. TeluguOne Health లో ఆరోగ్యానికి సంబంధించిన తాజా సమాచారం, నిపుణుల సూచనలు, ఉపయోగకరమైన ఆరోగ్య చిట్కాలను తెలుసుకోండి.