LATEST NEWS
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల సంఘం వ్యవహారంపై పొలిటికల్ టెన్షన్ అంతకంతకూ పెరుగుతోంది. కొనసాగుతోంది. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్)పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు నిర్బంధాలు, నిషేధాలకు బెదిరేదే లే.. ఆందోళనలు కొనసాగించే విషయంలో తగ్గేదేలే అంటూ ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు. మంగళవారం (అక్టోబర్ 6) ఈసీ కార్యాలయం వైపు చేపట్టిన మార్చ్‌ను పోలీసులు అడ్డుకోవడం, అనంతరం రాహుల్ గాంధీ సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకోవడం తెలిపిందే. ఇప్పుడు తాజాగా జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు రాహుల్ గాంధీ పిలుపునివ్వడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ పరిణామాలు మరింత ఉత్కంఠకు దారితీశాయి.  ఈ నేపథ్యంలోనే  నిర్దేశిత నిరసన స్థలమైన జంతర్ మంతర్‌కు వెళ్లాలని విపక్షాలు నిర్ణయించాయి. బుధవారం (సెప్టెంబర్ 7) రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సుమారు 300 మంది ఎంపీలు ఈసీని కలవాలని ప్రయత్నించినా అవకాశం దక్కలేదన్నారు. అందుకే జంతర్ మంతర్‌లో నిరసన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.  సర్ ప్రక్రియ, ఓటర్ల జాబితాలో మార్పుల విషయంలో తగ్గేదేలే అంటున్న రాహుల్.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయన్న రాహుల్ సహా ప్రతిపక్షాల విమర్శలను ఎన్నికల సంఘం, అధికార బీజేపీ ఖండిస్తున్నాయి.  విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.  అదలా ఉంటే..  మంగళవారం (అక్టోబర్ 6) సాయంత్రం వరకు ఏ రాజకీయ పార్టీ కూడా తమను అధికారికంగా అపాయింట్‌మెంట్ కోరలేదని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. అనంతరం రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఎంపీల బృందం ఈసీని కలవాలని కోరినట్లు పేర్కొంది. అయితే పార్లమెంట్ అనెక్స్‌లో సమావేశం నిర్వహించాలన్న ప్రతిపాదన తమ ప్రోటోకాల్‌కు అనుగుణంగా లేని కారణంగా రిజెక్ట్ చేశామని వివరణ ఇచ్చింది.   [Rahul Gandhi Jantar Mantar Protest, Delhi Protest, CEC Gyanesh Kumar Resign Demand, Election Commission, SIR, INDIA, Telugu One]
తమిళ సినీ పరిశ్రమలో మరో  స్టార్ హీరో  పొలిటికల్ ఎంట్రీ కన్ ఫర్మ్ అయ్యిందా? అంటే ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో ఔనన్న సమాధానమే వస్తున్నది. స్టార్ హీరో ధనుష్ రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమైందన్న వార్త ఇప్పుడు తమిళనాట పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. ధనుష్ రాజకీయ ప్రవేశంపై గత కొద్ది కాలంగా వార్తలు వినవస్తూనే ఉన్నాయి. తమిళనాడులో  కోట్లాది మంది అభిమానులు ఉన్న ధనుష్.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు వేగంగా పావులు కదుపుతున్నారని పరిశీలకులు అంటున్నారు.  ఇప్పటికే తన సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువైన ధనుష్.. త్వరలోనే  కొత్త రాజకీయ పార్టీని ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుతెలుస్తోంది.  ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు. అయితే, ఇందుకు సంబంధించి ఎటువంటి అధికారిక ధృవీకరణనా లేదు.   గత కొంతకాలంగా ధనుష్‌ రాజకీయ ప్రవేశంపై   పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక  ఇప్పుడు పార్టీ పేరు తెరపైకి రావడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. తన రాజకీయ ప్రయాణానికి సంబంధించిన విధివిధానాలు, పార్టీ జెండా,  భవిష్యత్  కార్యాచరణపై   ధనుష్‌  త్వరలోనే  ప్రకటన చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.     [Tamil Hero Dhanush political entry, Tamilaga Eluchi Kazhagam, Dhanush New Party, Kollywood Actor, Political Entry, Tamil Nadu Politics,Telugu One]
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.  మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై  విమర్శలు  గుప్పించారు. ఇక తాను పదవీ విరమణ తర్వాత కూడా ప్రజాజీవితంలో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోవడం, ఆయన పాలనలో చోటుచేసుకున్నట్లు తాను భావిస్తున్న తప్పులను చట్టపరంగా ప్రశ్నించడం తన లక్ష్యాలన్నారు.  రిటైర్మెంట్ తర్వాత తనకు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిందనీ, అయితే తనకు పదవులపై కించిత్ కూడా ఆసక్తి లేదని చెప్పారు.  తనకు పని ఇవ్వమనీ, నిర్దుష్ట బాధ్యత అప్పగించాలనీ తాను చంద్రబాబును కోరినట్లు చెప్పారు. జగన్ రాజకీయాలకు వ్యతిరేకంగా పని చేయడానికి అవకాశం కల్పించాలని చంద్రబాబును తాను కోరాననీ, అయితే ఆయన తనకు ఎటువంటి  పనీ అప్పగించలేదని స్పష్టం చేశారు.  జగన్ హయాంలో జరిగినట్లు తాను ఆరోపిస్తున్న అవకతవకలు, తప్పిదాలను చట్టపరంగా ప్రశ్నించే పని అప్పగించాలని చంద్రబాబును కోరాననీ, అయితే ఆయన పట్టించుకోలేదని వివరించారు.   ప్రభుత్వం నుంచి తాను ఆశించిన బాధ్యత రాకపోవడంతో బయట ఉండి తనకు సాధ్యమైన మార్గాల్లో అదే అంశాలపై పోరాడుతున్నానన్నారు. ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అయితే తన ఎంట్రీ పట్ల తెలుగుదేశం అధినాయత్వం పెద్దగా ఆసక్తి చూపలేదని పేర్కొన్నారు.   [AP Inteligence, Former Chief,  AB Venkateswara Rao, CBN, Jagan, Appolitics,  Former IPS, Telugu One]
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం అనూహ్య నిర్ణయం తీసుకుని  సొంత పార్టీకి చెందిన కేంద్ర మంత్రులకు షాక్ ఇచ్చింది.  ముఖ్యంగా యూపీలో ఒక్కరంటే ఒక్క సట్టింగ్ రాజ్యసభ సభ్యుడికి కూడా టికెట్ ఇవ్వలేదు. పదవీకాలం ముగియనున్న కేంద్ర మంత్రులతో  ఏ ఒక్క సిట్టింగ్ ఎంపీకి కూడా తిరిగి అవకాశం కల్పించకుండా, ఎనిమిది మంది కొత్త ముఖాలను బరిలోకి దింపుతున్నట్లు   ప్రకటించింది. యూపీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం  సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని అధిష్ఠానం తీసుకున్న ఈ నిర్ణయం యూపీ  రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కేంద్ర కేబినెట్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఇద్దరు సీనియర్ మంత్రులకు కూడా రాజ్యసభ టికెట్ నిరాకరించడం సంచలనంా మారింది. యూపీ నుంచి ఖాళీ అవుతున్న పది రాజ్యసభ స్థానాలకు అక్టోబర్ 16న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్ర అసెంబ్లీలోని సంఖ్యాబలం ప్రకారం అధికార బీజేపీ సులభంగా ఎనిమిది స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉండగా, మిగిలిన రెండు స్థానాలను ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ గెలుచుకునే  అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ తన ఎనిమిది మంది అభ్యర్థులతో కూడిన జాబితాను  విడుదల చేసింది. ఈ జాబితాలో హర్దీప్ సింగ్ పురి, బీఎల్ వర్మ వంటి కేంద్ర మంత్రులకు చోటు దక్కలేదు. వీరు ఇద్దరూ గతంలో యూపీ కోటాలోనే రాజ్యసభ సభ్యులుగా సేవలందించినప్పటికీ, ఈసారి వారికి పార్టీ అధిష్టానం మొండిచేయి చూపింది. పార్టీ విడుదల చేసిన కొత్త జాబితాలో ధర్మపాల్ సింగ్, రాధాకాంత్ ఓఝా, ప్రకాశ్ పాల్, విద్యాసాగర్ సోన్‌కర్, గోపీ కృష్ణ పాండే, ప్రియాంక సింగ్ రావత్, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, శ్రుతి గంగ్వార్‌లను అభ్యర్థులుగా ఖరారు చేశారు. 2027లో జరగనున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని,   వ్యూహాత్మకంగా అభ్యర్థుల ఎంపిక ఉ:దని స్పష్టమవుతోంది. సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిరంతరం శ్రమించే సంస్థాగత కార్యకర్తలకు గుర్తింపునిచ్చేలా ఈ జాబితాను రూపొందించినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో వివిధ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించారు. ఇందులో ముగ్గురు ఓబీసీ వర్గాలకు చెందిన వారు, ఇద్దరు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ), మరో ముగ్గురు అగ్రవర్ణాలకు చెందిన నాయకులు ఉన్నారు. అంతేకాకుండా, సామాజిక సమతుల్యతను పాటిస్తూ ఇద్దరు మహిళా అభ్యర్థులకు కూడా  స్థానం కల్పించడం విశేషం. బారాబంకి మాజీ ఎంపీ ప్రియాంక సింగ్ రావత్ తో పాటు ఝార్ఖండ్ గవర్నర్ సంతోష్ గంగ్వార్ కుమార్తె శ్రుతి గంగ్వార్‌‌లను మహిళా కోటాలో బరిలోకి దించారు. ఇక ఇతర ప్రముఖులలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది. కింది స్థాయి నుంచి పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న నాయకులను ఎగువసభకు పంపడం ద్వారా, కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. గతంలో ఎంపీలుగా కొనసాగిన ప్రముఖులను పక్కనపెట్టి మరీ కొత్తవారికి అవకాశం కల్పించడం ద్వారా పార్టీలో నాయకత్వ మార్పునకు పెద్దపీట వేస్తున్న సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలో పార్టీ పట్టును మరింత బలోపేతం చేసే దిశగా బీజేపీ అధిష్ఠానం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి యువత, అన్ని సామాజిక వర్గాలను కలుపుకొనిపోయేలా నాయకత్వ బృందాన్ని సిద్ధం చేయడంలో ఈ రాజ్యసభ ఎన్నికల ఎంపిక ఒక ముఖ్యమైన మెట్టుగా నిల వనుంది. సిట్టింగ్‌లను కాదని సరికొత్త బృందాన్ని ఎగువసభకు పంపడం ద్వారా పార్టీలో పోటీతత్వాన్ని పెంచడంతో పాటు, సమర్థులైన కొత్త నాయకులను జాతీయ స్థాయికి పరిచయం చేయాలనే ఉద్దేశం కూడా దీని వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో యూపీ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సీనియర్ నాయకులను పక్కనపెట్టడంపై కొంతమేర అంతర్గత అసంతృప్తి వ్యక్తమయ్యే ఆస్కారం ఉన్నప్పటికీ, సామాజిక సమీకరణాల కోణంలో ఈ జాబితా పార్టీకి ఎన్నికల సమయంలో లబ్ధి చేకూరుస్తుందని పార్టీ శ్రేణులు గట్టిగా విశ్వసిస్తున్నాయి. అక్టోబర్ 16న జరగనున్న పోలింగ్ అనంతరం ఈ కొత్త అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా లేదా సులభంగానే రాజ్యసభకు ఎన్నికవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. [Rajya Sabha elections, BJP candidates, Uttar Pradesh politics, Union Ministers, UP Assembly elections, Telugu One]
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈక్వేటర్ ప్రావిన్స్‌లోని న్గోంబే-లుకోలేలా ప్రాంతం సమీపంలో రెండు పెద్ద పడవలు ప్రమాదవశాత్తూ ఎదురెదురుగా అత్యంత వేగంగా ఢీకొన్నాయి. ఈ ఘోర దుర్ఘటనలో ప్రాథమిక అంచనాల ప్రకారం కనీసం 30 మంది ప్రయాణికులు నీట మునిగి ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో ప్రయాణికులు ఆచూకీ లేకుండా గల్లంతయ్యారు. రెస్క్యూ టీమ్‌లు, స్థానిక అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ముమ్మరంగా గాలింపు మరియు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అధికారులు  ప్రత్యక్ష సాక్షులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ప్రమాదానికి గురైన రెండు పడవల్లో ఒకటి దేశ వాయువ్య ప్రాంతంలోని ఉబాంగి ప్రాంతం నుంచి కాంగో రాజధాని కిన్షాసాకు ప్రయాణిస్తుండగా, మరొక నౌక కిన్షాసా నుంచి లుకోలేలా ప్రాంతానికి వెళ్తోంది. ఈ క్రమంలో రెండు పడవలు ఒకదానికొకటి ఎదురుగా వచ్చి బలంగా ఢీకొనడంతో ఈ పెను ప్రమాదం సంభవించింది. ప్రమాద తీవ్రత కారణంగా పడవలు దెబ్బతిని ప్రయాణికులు ఒక్కసారిగా నీటిలో పడిపోయారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం మరియు రాత్రి సమయంలో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలగడంతో ప్రాణనష్టం భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ విషాద ఘటనను మరింత సంక్లిష్టం చేస్తూ, ప్రమాదానికి గురైన పడవల్లో ఒకదానిలో భారీ మొత్తంలో చమురు తరలిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే పడవలోని ఆయిల్ అంతా నది నీటిలో పెద్ద ఎత్తున లీక్ కావడంతో పరిస్థితి మరింత భయానకంగా మారింది. నది ఉపరితలంపై భారీ పరిమాణంలో చమురు తేలడంతో, ప్రయాణికులలో కొందరికి ఈత వచ్చినా కూడా నీటి నుంచి సురక్షితంగా బయటపడటం సాధ్యం కాలేదని, ఆయిల్ కారణంగా వారు ఈదుకుంటూ రాలేక ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. రెస్క్యూ సిబ్బందికి కూడా ఈ చమురు లీకేజీ వల్ల సహాయక చర్యలు చేపట్టడంలో తీవ్రమైన ఆటంకాలు ఎదురవుతున్నాయి. కాంగో నదిలో ఇలాంటి పడవ ప్రమాదాలు జరగడం సర్వసాధారణంగా మారిపోవడం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా అధిక బరువుతో ప్రయాణికులను ఎక్కించడం, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వంటి కారణాల వల్ల ప్రతి ఏటా వందలాది మంది అమాయక ప్రజలు నీటిపాలై ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించి పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. ప్రమాదానికి అసలు కారణాలు ఏమిటి, అనుమతి లేని ప్రయాణాలు ఎలా సాగుతున్నాయనే అంశాలపై అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు ముమ్మరం చేయడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.     [ congo river, boat collision, congo boat accident, kinsasha news, ubangi boat crash, congo river disaster,  Telugu One, Telugu News ]  
ALSO ON TELUGUONE N E W S
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం తన కొత్త సినిమా ‘బెయిల్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న శివన్న.. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఓ థియేటర్‌కు వెళ్లారు. ఆయనకు స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అయితే శివరాజ్ కుమార్ థియేటర్‌లోకి వెళ్తున్న సమయంలో ఆయనకు అత్యంత సమీపంలో ఒక్కసారిగా బాణసంచా పేలడంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. చిత్రదుర్గలోని బసవేశ్వర థియేటర్ వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. శివరాజ్ కుమార్ రాక సందర్భంగా అభిమానులు టపాసులు కాల్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఆయన థియేటర్ ఎంట్రన్స్‌కు చేరుకునే సమయంలో అక్కడ ఉంచిన బాణసంచాలో ఒకటి అకస్మాత్తుగా పేలింది. దీంతో మంటలు, నిప్పురవ్వలు ఆయనకు చాలా దగ్గరగా కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన శివన్న తన ముఖం, తలను చేతులతో కప్పుకుని అక్కడి నుంచి పక్కకు జరిగారు. వెంటనే భద్రతా సిబ్బంది కూడా ఆయన చుట్టూ చేరి రక్షణగా నిలిచారు. ఈ అనూహ్య ఘటనతో అక్కడ కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అయితే అదృష్టవశాత్తూ శివరాజ్ కుమార్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ఘటన నుంచి తేరుకున్న ఆయన అభిమానులను పలకరిస్తూ తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శివన్నకు అంత దగ్గరగా టపాసులు పేలడం చూసిన అభిమానులు.. ఇలాంటి ప్రమోషన్ కార్యక్రమాల్లో భద్రతా ఏర్పాట్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక శివరాజ్ కుమార్ నటించిన ‘బెయిల్’ విషయానికి వస్తే.. పవన్ వడయార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైంది. ఇందులో శివన్న విజయ్ అనే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే ఆయన చిత్రదుర్గలో పర్యటించారు. ఈ సందర్భంగా ‘బెయిల్ 2’కు సంబంధించిన పనులు కూడా ప్లాన్ చేస్తున్నట్లు శివరాజ్ కుమార్ వెల్లడించినట్లు సమాచారం. మరోవైపు శివరాజ్ కుమార్ ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న ‘జైలర్ 2’లోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ‘జైలర్’లో ఆయన చేసిన నరసింహ పాత్రకు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు సీక్వెల్‌లో ఆయన పాత్ర ఎలా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది. మొత్తంగా సినిమా ప్రమోషన్ కోసం చిత్రదుర్గ వెళ్లిన శివన్నకు టపాసుల రూపంలో ఊహించని ప్రమాదం ఎదురైనా.. ఎలాంటి గాయాలు కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.     [Shiva Rajkumar, Shiva Rajkumar Firecracker Accident, Shivarajkumar Accident, Shiva Rajkumar Narrow Escape, Shiva Rajkumar Viral Video, Shiva Rajkumar Bail Movie, Bail Movie Promotion, Bail Movie, Shiva Rajkumar Firecracker Incident]
'RawKing' Manoj Manchu, along with his wife Bhuma Mounika Manchu, son Dhairav, and daughter Devasena Shobha, visited the sacred Sri Chamundeshwari Temple atop the famed Chamundi Hills in Mysuru to seek divine blessings.   Upon arrival, the temple priests accorded a traditional Poornakumbham welcome to the couple. The family performed special poojas and rituals inside the sanctum sanctorum and received Vedic blessings from the scholars. Following the darshan, temple authorities honored them with Seshavastram and presented sacred Theertha Prasadam. The visit of 'RawKing' Manoj Manchu and his family drew widespread enthusiasm from the devotees and fans present at the temple complex.    The shoot of the prestigious high-octane action film 'Daada', starring Natasimham Nandamuri Balakrishna and helmed by director Gopichand Malineni, is currently progressing at a brisk pace across Mysuru. Taking time out from his hectic shoot schedule, 'RawKing' Manoj Manchu who plays a pivotal role in this movie visited the hill shrine along with his wife Mounika and children to seek the Goddess's blessings before resuming work. Several local dignitaries were also present on the occasion.  
సోషల్ మీడియాలో తనదైన మాటతీరు, కామెడీతో ఓ రేంజ్‌లో పాపులర్ అయిన ‘అగ్గిపెట్టె మచ్చ’ అలియాస్ కిరణ్ కుమార్ ఇక లేరు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. తిరుపతిలోని సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. ‘అగ్గిపెట్టె మచ్చ’ అంటే సోషల్ మీడియా ఫాలో అయ్యే చాలామందికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తనదైన యాస, డిఫరెంట్ మాటతీరు, హావభావాలతో కిరణ్ చేసిన వీడియోలు ఒకప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఆయన మాట్లాడే విధానం, ఒక్కో సందర్భంలో ఇచ్చే రియాక్షన్స్ నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ‘అగ్గిపెట్టె మచ్చ’ అనే పేరుతోనే కిరణ్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా.. కిరణ్ పలు టీవీ కార్యక్రమాల్లో కూడా సందడి చేశారు. ‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వంటి కార్యక్రమాల్లో కనిపించి బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. పలువురు యూట్యూబర్లు ఆయనతో ఇంటర్వ్యూలు చేసి తమ వీడియోల్లో ప్రత్యేకంగా చూపించేవారు. అయితే కొంతకాలంగా కిరణ్‌కు సంబంధించిన కొత్త వీడియోలు, రీల్స్ సోషల్ మీడియాలో పెద్దగా కనిపించలేదు. అసలు ‘అగ్గిపెట్టె మచ్చ’ ఏమయ్యారు? అంటూ అభిమానులు కూడా ఆరా తీస్తున్న సమయంలో.. ఆయన తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్టు వార్తలు వచ్చాయి. అక్టోబర్ 5న కిరణ్‌ను తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించినట్టు న్యూస్ వచ్చింది. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు కూడా సమాచారం బయటకు వచ్చింది. కానీ వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో చికిత్స పొందుతూ కిరణ్ తుదిశ్వాస విడిచారు.  ఇది కూడా చదవండి: బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల కాదు.. ఊహించని దర్శకుడితో చిరంజీవి మూవీ.!       [Aggipette Macha Is No More, Aggipette Macha Passed Away, Aggipette Macha Death, Aggipette Macha Kiran, Aggipette Macha, Telugu News]  
హీరో మంచు మనోజ్ తన సతీమణి భూమా మౌనిక మంచు, కుమారుడు ధైరవ్, కుమార్తె దేవసేన శోభలతో కలిసి మైసూరులోని ప్రసిద్ధ చాముండి కొండలపై వెలసిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మనోజ్ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు వారికి శేషవస్త్రాలు సమర్పించి, తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. మంచు మనోజ్ కుటుంబ సమేతంగా రావడంతో ఆలయ ప్రాంగణంలో భక్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వారిని పలకరించేందుకు ఆసక్తి చూపించారు. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రం 'దాదా' షూటింగ్ ప్రస్తుతం మైసూరు పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న మంచు మనోజ్, షూటింగ్ షెడ్యూల్ విరామంలో తన సతీమణి మౌనిక, పిల్లలతో కలిసి ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: 'ప్యారడైజ్'కి జరిగిన ద్రోహం.. లేటుగా వెలుగులోకి.. రగిలిపోతున్న నిర్మాత.!       [RawKing Manoj Manchu, Bhuma Mounika Manchu, Sri Chamundeshwari Temple Mysuru, Nandamuri Balakrishna, Gopichand Malineni, Daada Movie, Telugu Film News]  
తెలుగు చిత్రసీమలో నటుడిగా, అగ్ర నిర్మాతగా తనదైన ముద్ర వేసిన ప్రముఖ వ్యక్తిత్వం బండ్ల గణేష్. సోషల్ మీడియాలో నిత్యం తన వ్యాఖ్యలతో, విశ్లేషణలతో ట్రెండింగ్‌లో నిలిచే ఆయన, తాజాగా సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఒక ప్రకటన నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. 2026 అక్టోబర్ 6వ తేదీన తన అధికారిక లేఖ ద్వారా ఆయన స్పందిస్తూ, తన గురించి ప్రచారంలో ఉన్న వివిధ రకాల పుకార్లకు తీవ్రంగా స్పందించారు. తానూ ఎలాంటి పదవులకు లేదా అధికారాలకు ఆశపడటం లేదని, ప్రజాభిమానమే తనకు అత్యున్నతమైన ఆస్తి అని అత్యంత స్పష్టమైన పదాల్లో తేల్చి చెప్పారు. తన సుదీర్ఘ ప్రకటనలో బండ్ల గణేష్ రాస్తూ, "ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నాకు ఎలాంటి పదవులు, హోదాలు, అధికారాలపై వ్యామోహం లేదు. ప్రజలు ఇన్నేళ్లుగా అందించిన ప్రేమ, అభిమానంతో నేను సంపాదించుకున్న గౌరవమే నాకు ఎంతో విలువైనది. నా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నా ఆలోచనలు, నా ప్రయాణం, నేను ఎవరో నన్ను దగ్గరగా చూసిన వారికి తెలుసు" అంటూ భావోద్వేగంగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో తన భవిష్యత్తు ప్రణాళికలు మరియు ఆలోచనా విధానంపై ఆయన పూర్తి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. అనంతరం రాజకీయ విమర్శలు, ప్రచారాలపై స్పందిస్తూ, "అందుకే ఒక స్పష్టమైన మనవి. దయచేసి లేనిపోని విషయాలను నా పేరుతో ముడిపెట్టకండి. నా ప్రమేయం లేని విషయాల్లో నా పేరును ఉపయోగించకండి. నేను చెప్పనిది నా మాటగా, నేను చేయనిది నా పనిగా ప్రచారం చేయకండి. పుకార్లకు, గాలి వార్తలకు స్పందించకపోవడం నా సంయమనం మాత్రమే. నా పేరును అనవసరమైన వివాదాలకు దూరంగా ఉంచండి. నా పేరు మీద రాజకీయాలు చేయకండి. నా పేరును రాజకీయాలకు ఉపయోగించకండి" అంటూ ఒక గట్టి హెచ్చరికలాంటి విజ్ఞప్తిని చేశారు. సినిమా రంగంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్ర అభిమానిగా, మెగా కాంపౌండ్‌కు ఆత్మీయుడిగా గుర్తింపు పొందిన బండ్ల గణేష్, గతంలో రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో ఆయన పేరును వివిధ రాజకీయ సమీకరణలు,  వివాదాలతో ముడిపెడుతూ వస్తున్న వార్తలపై ఆయన తీవ్ర అసంతృప్తి చెందారు. తన నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించవద్దని, కేవలం సంయమనంతో మాత్రమే ఉన్నానని ఆయన స్పష్టం చేయడం విశేషం. 2026 అక్టోబర్ 6 నాటి ఈ లేఖ ద్వారా పొలిటికల్ మరియు సినీ వర్గాల్లో చెలరేగిన అనవసరపు ఊహాగానాలకు బండ్ల గణేష్ ముగింపు పలికారనే చెప్పవచ్చు.     Bandla Ganesh press note, Bandla Ganesh latest letter, Bandla Ganesh politics statement, Bandla Ganesh open letter, Bandla Ganesh clarify news, Tollywood producer Bandla Ganesh
సినిమా తీయడం ఒకెత్తయితే.. దానిని కాపాడుకోవడం మరో ఎత్తు. కొందరు టెక్నీషియన్లు తెలిసీతెలియక చేసే పనుల వల్ల.. సీనో, సాంగో, ఏకంగా సినిమానో లీకైన సందర్భాలు ఉన్నాయి. అయితే ఒక ప్రముఖ టెక్నీషియన్ కావాలని చేసిన నమ్మక ద్రోహం మాత్రం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అతనొక ప్రముఖ టెక్నీషియన్. టాలీవుడ్ లో రెగ్యులర్ గా సినిమాలు చేస్తుంటాడు. రీసెంట్ గా 'ప్యారడైజ్' సినిమాకు వర్క్ చేశాడు. రిలీజ్ కి ముందే రెమ్యూనరేషన్ కోటిన్నర ముట్టాయి. అంత రెమ్యూనరేషన్ తీసుకున్న ఆ వ్యక్తి.. తనని నమ్మి ఒక పెద్ద సినిమా చేతిలో పెడితే ఎంత బాధ్యతగా ఉండాలి?. అతను ఆ బాధ్యతను మరిచాడు, విలువలను పక్కన పెట్టాడు. రిలీజ్ కి రెండు నెలల ముందే 'ప్యారడైజ్'  సినిమాను సీక్రెట్ గా తనకు తెలిసిన ఇద్దరు నిర్మాతలు బాబాయ్-అబ్బాయ్ లకు చూపించాడు.  ఆ టెక్నీషియన్ చేసిన పని వల్ల 'ప్యారడైజ్'కి ఎంతో నష్టం జరిగింది. విడుదలకు ముందు సినిమా మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగిటివ్ క్యాంపెయిన్ జరిగింది. సినిమా ఎలా ఉండబోతుందో ముందే బయటకు లీక్ అయింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ తేలిపోయింది అంటూ న్యూస్ స్ప్రెడ్ చేశారు.  ఒక టెక్నీషియన్ సీక్రెట్ గా ఇద్దరికి సినిమా చూపించడం, ఆ తర్వాత సినిమా మీద నెగిటివ్ క్యాంపెయిన్ జరగడం.. ఇదంతా ప్లానింగ్ ప్రకారమే జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. టెక్నీషియన్ చేసిన ద్రోహం గురించి ఆలస్యంగా తెలుసుకున్న నిర్మాత, హీరో రగిలి పోతున్నారట. హీరో తన అసహనాన్ని వ్యక్తం చేయగా.. నిర్మాత మాత్రం ఆ టెక్నీషియన్ కి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడట. సినిమాలు రాకుండా చేస్తానని బెదిరించడమే కాకుండా.. తన తోటి నిర్మాతలకు ఫోన్లు చేసి, అతని చేసిన మోసాన్ని వివరించాడట.  అతను ఎంత పెద్ద టెక్నీషియన్ అయినప్పటికీ.. తను చేసిన పని చాలామంది నిర్మాతలకు కోపం తెప్పించింది. ఇప్పుడు వీళ్ళని మోసం చేశాడు.. రేపు మనల్ని చేస్తాడు. ఇలాంటి విలువలు లేని వ్యక్తిని కాంపౌండ్ లోకి కూడా రానివ్వొద్దని పలువురు నిర్మాతలు డిసైడ్ అయ్యారట. ఇండస్ట్రీ ఇన్‌సైడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం.. అతని కెరీర్ కి ఇది బ్లాక్ మార్క్ అని, అతన్ని నమ్మి వేరే నిర్మాతలెవరూ సినిమాలు ఇచ్చే పరిస్థితి ఉండదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: ‘జైలర్ 2’ సెన్సార్ రిపోర్ట్.. మొదటి భాగం కంటే రెండో భాగం కాస్త తగ్గింది.!       [The Paradise Movie, Nani Paradise Movie, Natural Star Nani, Srikanth Odela, Sudhakar Cherukuri, Telugu Film News]  
సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్’ ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే మొదటి భాగాన్ని మించి మరింత గ్రాండ్‌గా సినిమాను రూపొందించడంతో పాటు.. స్టార్ కాస్ట్ విషయంలోనూ నెల్సన్ పెద్ద స్కెచ్చే వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో రజినీకాంత్‌తో పాటు పలువురు భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు కనిపించబోతున్నారు. తాజాగా ట్రైలర్‌తో మరికొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ‘జైలర్ 2’లో మోహన్‌లాల్, మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్, సూరజ్ వెంజారమూడు, ఎస్‌జే సూర్య తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మొదటి భాగంలో కనిపించిన రమ్యకృష్ణన్, యోగిబాబు, మిర్నా వంటి వారు కూడా సీక్వెల్‌లో కొనసాగుతున్నారు. ఇలా వివిధ భాషలకు చెందిన స్టార్లను ఒకే సినిమాలో భాగం చేయడంతో ‘జైలర్ 2’కు పాన్ ఇండియా అప్పీల్ మరింత పెరిగింది. ట్రైలర్‌లో కూడా ఈ స్టార్లకు సంబంధించిన గ్లింప్స్ కనిపించడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. అయితే టాలీవుడ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ నెల్సన్ మరో పెద్ద ప్లాన్ వేసినట్లు NTV కథనం పేర్కొంది. సినిమాలో ఓ స్పెషల్ రోల్ కోసం నందమూరి బాలకృష్ణను దర్శకుడు సంప్రదించినట్లు సమాచారం. తొలుత బాలయ్య కూడా ఈ పాత్ర చేయడానికి అంగీకరించినప్పటికీ.. ఆ తర్వాత ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ పాత్రలోకి బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌ను తీసుకొచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ‘జైలర్ 2’ ట్రైలర్‌లో హృతిక్‌ను పూర్తిగా చూపించకుండా దాచిపెట్టడం కూడా ఈ సర్‌ప్రైజ్ క్యామియోలో భాగమేనని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఇతర భాషల మార్కెట్లను దృష్టిలో పెట్టుకుని ‘జైలర్ 2’లో భారీ తారాగణాన్ని తీసుకున్న నెల్సన్.. ఈసారి హిందీ మార్కెట్‌పైనా గట్టిగానే ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. గతంలో కొన్ని తమిళ సినిమాల్లో బాలీవుడ్ స్టార్ హీరోల క్యామియోలను తీసుకొచ్చినా.. అవి ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదనే అభిప్రాయం ఉంది. మరి ఇప్పుడు హృతిక్ రోషన్ లాంటి స్టార్‌ను తీసుకురావడం ‘జైలర్ 2’కు ఎంతవరకు ప్లస్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రజినీకాంత్, హృతిక్ కాంబినేషన్ ప్రేక్షకులకు ఎలాంటి సర్‌ప్రైజ్ ఇవ్వబోతుందో చూడాలి. మరోవైపు ‘జైలర్ 2’ అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో రజినీకాంత్ మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో అదరగొట్టబోతున్నట్లు అర్థమవుతోంది. నెల్సన్ మార్క్ డార్క్ కామెడీ, యాక్షన్‌తో పాటు ఇంతటి భారీ స్టార్ కాస్ట్ కూడా తోడవడంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు మరింత పెరిగాయి. మొత్తంగా చూస్తే.. ‘జైలర్ 2’లో కథతో పాటు స్టార్ పవర్‌ను కూడా భారీగా పెంచాడు నెల్సన్. ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో స్టార్‌ను తీసుకుంటూ సినిమాకు పాన్ ఇండియా రేంజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇక బాలయ్య స్థానంలో హృతిక్ రోషన్ వచ్చారనే వార్త నిజమైతే మాత్రం.. సినిమాలో ఆయన క్యామియో మరో పెద్ద హైలైట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ట్రైలర్‌లో హృతిక్‌ను దాచిపెట్టిన నేపథ్యంలో.. ఆయన పాత్ర ఎలా ఉండబోతోందన్నది సినిమా విడుదలయ్యే వరకు సస్పెన్స్‌గానే ఉండనుంది.       [Jailer 2, Rajinikanth Jailer 2, Nelson Dilipkumar, Hrithik Roshan Jailer 2, Balakrishna Jailer 2, Jailer 2 Cast, Mohanlal, Mithun Chakraborty, Vidya Balan, SJ Suryah, Jailer 2 Trailer, Jailer 2 Telugu, Rajinikanth Movies, Jailer 2 Release Date]
సినిమా దర్శకులు అంటే సాధారణంగా కథ, దర్శకత్వం, హీరోహీరోయిన్లను హ్యాండిల్ చేయడం వరకు మాత్రమే మనకు గుర్తొస్తుంది. కానీ కొంతమంది దర్శకుల్లో మాత్రం సినిమాలకు మించి ఎన్నో టాలెంట్స్ ఉంటాయి. అలాంటి వారిలో అనిల్ రావిపూడి కూడా ఒకరు. రచయితగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన ‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భగవంత్ కేసరి’ వంటి సినిమాలతో వరుస విజయాలు అందుకున్నారు. డైరెక్షన్‌తో పాటు డ్యాన్స్, మిమిక్రీతోనూ ప్రేక్షకులను అలరించే అనిల్.. ఇప్పుడు మరో టాలెంట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ‘సరిగమప – ది నెక్స్ట్ సింగింగ్ సెన్సేషన్’ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న అనిల్ రావిపూడి.. తాజాగా అదే వేదికపై సింగర్‌గా మారారు. ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్‌తో కలిసి ‘దళపతి’ సినిమాలోని ‘సింగరాల పైరుల్లోన’ పాటను పాడారు. ఇద్దరూ కలిసి చేసిన ఈ పర్ఫార్మెన్స్‌ ఫ్రెండ్‌షిప్‌ను సెలబ్రేట్ చేసుకునేలా సాగింది. అనిల్ రావిపూడి పాట పాడిన విధానం, ఆయన బాడీ లాంగ్వేజ్‌ షోలో నవ్వులు పూయించగా.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ పాటలో అనిల్ రావిపూడి వాయిస్ విన్న నెటిజన్లు కూడా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఆయన గొంతు, పాడిన విధానం ప్రముఖ నటుడు, యాంకర్ సుడిగాలి సుధీర్‌ను గుర్తు చేస్తోందంటూ కొందరు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు అనంత శ్రీరామ్ తన మధురమైన స్వరంతో అనిల్‌కు జత కలవడంతో వీరిద్దరి కాంబినేషన్ మరింత ఆకట్టుకుంది. డైరెక్టర్‌గా, రైటర్‌గా, డ్యాన్సర్‌గా, మిమిక్రీ ఆర్టిస్ట్‌గా తనలోని టాలెంట్ చూపించిన అనిల్ రావిపూడి.. ఇప్పుడు సింగర్‌గానూ ప్రేక్షకులను అలరించడంతో అభిమానులు ‘నెక్స్ట్ లెవెల్ టాలెంట్’ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీస్టారర్‌ను తెరకెక్కిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రమోషనల్ వీడియోలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. మొత్తంగా అనిల్ రావిపూడి ఇప్పటివరకు తన సినిమాలతో ప్రేక్షకులను నవ్విస్తూ, ఎంటర్‌టైన్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ‘సరిగమప’ వేదికపై సింగర్‌గా మారి మరోసారి తనలోని కొత్త టాలెంట్‌ను బయటపెట్టారు. అనంత శ్రీరామ్‌తో కలిసి ఆయన చేసిన ఈ పర్ఫార్మెన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. ‘డైరెక్టర్ గారిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?’ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.     [Anil Ravipudi, Anil Ravipudi Singing, Sa Re Ga Ma Pa Telugu, Anil Ravipudi Singer, Ananth Sriram, Singarala Pairulona, Dalapathi Song, Anil Ravipudi Viral Video, Telugu Cinema News, Anil Ravipudi Multi Talented Director]
సూపర్‌స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘జైలర్ 2’ రిలీజ్‌కు మరింత దగ్గరైంది. నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాకు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. సినిమా రన్‌టైమ్ కూడా బయటకు వచ్చింది. సెన్సార్ బోర్డు నుంచి U/A 16+ సర్టిఫికెట్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇక సినిమా నిడివి విషయానికి వస్తే.. ఏకంగా 165 నిమిషాలు ఉన్నట్టు సర్టిఫికేషన్ వివరాల్లో నమోదైంది. అంటే దాదాపు 2 గంటల 45 నిమిషాలు అన్నమాట. ఇది పెద్దగా ఆశ్చర్యపరిచే రన్‌టైమ్ అయితే కాదు. 2023లో వచ్చిన ‘జైలర్’ కూడా దాదాపు 2 గంటల 48 నిమిషాల నిడివితో వచ్చింది. అంటే సీక్వెల్ రన్‌టైమ్ తొలి భాగం కంటే సుమారు మూడు నిమిషాలు తక్కువగా ఉంది. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్ గా రజినీకాంత్ మాస్ అవతార్‌లో కనిపించనున్నారు. ఈసారి కథ మరింత పెద్ద స్థాయిలో ఉండబోతున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ వంటి క్యామియోలు మరోసారి హైలైట్‌గా నిలవగా.. ఎస్.జే. సూర్య, విద్యాబాలన్, మిథున్ చక్రవర్తి, సూరజ్ వెంజరమూడు తదితరులు కొత్తగా జాయిన్ అయ్యారు. దీంతో ‘జైలర్ 2’లో స్టార్ కాస్ట్ కూడా భారీగానే ఉంది. ఈ సినిమా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. సెన్సార్ కూడా పూర్తవడంతో ‘జైలర్ 2’ ఇక రిలీజ్‌కు పూర్తిగా సిద్ధమైనట్టే. మరి నెల్సన్ ఈసారి టైగర్ ముత్తువేల్ పాండియన్‌తో ఎలాంటి మాస్ ట్రీట్ ఇస్తాడో చూడాలి. ఇది కూడా చదవండి: బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల కాదు.. ఊహించని దర్శకుడితో చిరంజీవి మూవీ.!       [Jailer 2 Censor Report, Jailer 2 Movie, Super Star Rajinikanth, Nelson Dilipkumar, Anirudh Ravichander, Mohanlal, Shiva Rajkumar, Vidya Balan, Telugu Film News]  
సినిమా అంటే భారీ బడ్జెట్.. స్టార్ హీరో.. భారీ సెట్స్.. పాన్ ఇండియా ప్రమోషన్స్.. ఇలా ఎన్నో లెక్కలు ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో కంటెంట్ బాగుంటే ఇవేవీ లేకపోయినా ప్రేక్షకులు సినిమాను నెత్తిన పెట్టుకుంటారు. ఇప్పుడు ‘హనుమాన్ అంశ్’ సినిమా విషయంలో అదే జరిగింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.400 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాపై మైత్రీ మూవీ మేకర్స్ వై.రవిశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాము వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నామని, కానీ లెక్కలు సరిగ్గా కుదరడం లేదని రవిశంకర్ అన్నారు. అలాంటిది కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తీసిన సినిమా రూ.400 కోట్ల గ్రాస్ సాధించడం తమలాంటి నిర్మాతలకు, మొత్తంగా సినిమా పరిశ్రమకే ఒక రకంగా చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. భారీ బడ్జెట్ కంటే మంచి కంటెంట్ ఎంత ముఖ్యమో ‘హనుమాన్ అంశ్’ విజయం మరోసారి చూపించిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు.. హనుమంతుడి ప్రస్తావన ఉన్న సినిమాలకు ఏదో ఒక దైవశక్తి తోడవుతున్నట్టుగా అనిపిస్తోందని రవిశంకర్ అన్నారు. గతంలో ‘హను-మాన్’ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుందని, ఇప్పుడు రాజమౌళి ప్రాజెక్ట్ ట్రైలర్‌లోనూ హనుమంతుడి ప్రస్తావన కనిపించిందని గుర్తుచేశారు. అయితే ‘హనుమాన్ అంశ్’ సాధించిన విజయం మాత్రం సాధారణమైనది కాదని, చిన్న బడ్జెట్‌తో వచ్చి దేశవ్యాప్తంగా ఇంతటి సంచలనం సృష్టించిన ఈ సినిమానే నిజమైన పాన్ ఇండియా మూవీ అని అన్నారు. ఇంకా ఏయే భాషల్లో ఈ సినిమా విడుదల కాలేదో, అక్కడ కూడా వెంటనే రిలీజ్ చేయాలని ఆయన సూచించారు. హోంబలే ఫిలిమ్స్ లాంటి ప్రముఖ సంస్థ ఇలాంటి మంచి ప్రాజెక్ట్‌ను తీసుకోవడం అభినందనీయమని రవిశంకర్ చెప్పారు. నైజాం ప్రాంతంలో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం తమకు రావడం ఆనందంగా ఉందన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుత సమాజంలో ఇలాంటి భక్తిరస చిత్రాల అవసరం కూడా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్, నెగెటివిటీ, ఏఐ కారణంగా ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియని పరిస్థితి ఉందని, ముఖ్యంగా యువత ఈ ప్రభావానికి లోనవుతున్నారని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో మనశ్శాంతిని కలిగించే, భక్తి భావనను పెంచే సినిమాలు అవసరమని చెప్పారు. నీమ్ కరోలీ బాబా ఎంతో గొప్ప దైవస్వరూపమని, ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు సైతం ఆయనను దర్శించుకున్నారని రవిశంకర్ పేర్కొన్నారు. దసరా సెలవుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ సినిమాకు తప్పకుండా తీసుకెళ్లాలని ఆయన కోరారు. అదే సమయంలో సినిమాలో నటించిన శోభినవ్ సత్య నటనను, దర్శకుడు విశాల్ చతుర్వేది టేకింగ్‌ను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇప్పటికే ఉత్తర భారతంలో భారీ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా అక్టోబర్ 9న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఇక్కడ కూడా మంచి ఆదరణ దక్కుతుందనే నమ్మకాన్ని రవిశంకర్ వ్యక్తం చేశారు. మొత్తంగా చూస్తే.. కేవలం రూ.2 కోట్ల పెట్టుబడితో రూ.400 కోట్ల వసూళ్లను అందుకోవడం ‘హనుమాన్ అంశ్’ ప్రత్యేకతగా నిలిచింది. అందుకే ఈ సినిమా విజయం ఇప్పుడు కేవలం ఒక చిన్న సినిమా సక్సెస్‌గా కాకుండా.. భారీ బడ్జెట్ సినిమాల లెక్కలపై కూడా చర్చకు దారితీస్తోంది. కంటెంట్‌లో బలం ఉంటే ప్రేక్షకులు సినిమాను ఏ స్థాయికి తీసుకెళ్లగలరో ‘హనుమాన్ అంశ్’ మరోసారి నిరూపించిందనే చెప్పాలి.     [Hanuman Ansh, Hanuman Ansh Telugu Release, Mythri Ravi Shankar, Ravi Shankar Comments, Hanuman Ansh Box Office, Hanuman Ansh Rs 400 Crore, Shobhinav Satyaa, Vishal Chaturvedi, Neem Karoli Baba, Hombale Films, Telugu Movie News]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మన భారతీయ సాంప్రదాయ వంటకాల్లో, ప్రాచీన వైద్య విధానాల్లో పెసలకు ఒక ప్రత్యేకమైన విశిష్ట స్థానం ఉంది. పూర్వీకుల కాలం నుండి నేటి ఆధునిక పోషకాహార నిపుణుల వరకు ప్రతీ ఒక్కరూ రోజువారీ ఆహారంలో పెసలను భాగం చేసుకోవాలని బలంగా రికమండ్ చేస్తుంటారు. ఉదయాన్నే ఒక గిన్నెడు నానబెట్టిన లేదా మొలకెత్తిన పెసలను తీసుకోవడం వల్ల శరీరానికి ఏనుగు లాంటి కొండంత బలం లభిస్తుందని, రోజంతా నీరసం అనే మాటే లేకుండా శరీరం ఎంతో చురుగ్గా మారుతుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేవలం రుచిలోనే కాకుండా, అంతర్గత అవయవాల పనితీరును మెరుగుపరచడంలో, సాధారణ రుగ్మతల నుండి దీర్ఘకాలిక వ్యాధుల వరకు సమర్థవంతంగా అడ్డుకోవడంలో పెసలు ఒక శక్తివంతమైన సూపర్ ఫుడ్‌గా నిలుస్తాయి. ప్రోటీన్లకు అత్యంత అద్భుతమైన మూలంగా నిలిచే పెసలు, శరీర కండరాల నిర్మాణానికి మరియు దెబ్బతిన్న కణజాలాల వేగవంతమైన మరమ్మత్తుకు విశేషంగా తోడ్పడతాయి. పెసలను నీటిలో నానబెట్టి, మొలకెత్తించి లేదా ఉడికించి తీసుకోవడం వల్ల వాటిలోని పోషక విలువలు రెట్టింపు అవుతాయి. ముఖ్యంగా మొలకెత్తిన పెసలలో విటమిన్ A, విటమిన్ B, విటమిన్ C మరియు విటమిన్ E లు అత్యధిక పరిమాణంలో లభిస్తాయి. వీటితో పాటు శరీరానికి నిత్యం అవసరమయ్యే పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, కాపర్, ఫోలేట్ వంటి ముఖ్యమైన ఖనిజాలు మరియు డైటరీ ఫైబర్ పుష్కలంగా అందుతాయి. ఐరన్ లోపంతో బాధపడేవారు రోజూ పెసలు తినడం వల్ల రక్తహీనత (ఎనీమియా) సమస్య నుండి సులభంగా ఉపశమనం పొందవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి పెసల ఆహారం ఒక వరప్రసాదం అని చెప్పవచ్చు. వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల బరువు పెరుగుతామనే భయం లేకుండా నిర్భయంగా ఆహారంలో చేర్చుకోవచ్చు. పెసల్లో ఉండే అధిక పీచు పదార్థం (ఫైబర్) కడుపు నిండిన అనుభూతిని కలిగించి, తరచూ వేధించే తీవ్రమైన ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది. ఒక కప్పు పెసరపప్పును చపాతీలతో కలిపి రాత్రి వేళల్లో తీసుకోవడం ద్వారా లేదా బియ్యంలో కొద్దిగా పెసలు కలిపి పులగం చేసుకుని తినడం ద్వారా క్రమంగా ఊహించని రీతిలో బరువు తగ్గుతారని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది శరీర మెటబాలిజంను వేగవంతం చేసి, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడమే కాకుండా శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వును వేగంగా కరిగిస్తుంది. అంతేకాకుండా, పెసలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల డయాబెటిస్ నియంత్రణలోకి వస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అడ్డుకోవడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. పెసలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) ప్రమాణాలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచడం ద్వారా గుండె సంబంధిత తీవ్రమైన జబ్బులు రాకుండా కాపాడతాయి. పెసల్లో ఉండే సోడియం మరియు పొటాషియం నిష్పత్తి రక్తపోటును (బిపి) నిలకడగా ఉంచుతుంది. పేగుల్లో ఉండే వ్యర్థాలను సులభంగా బయటకు పంపడంలోనూ, ఎసిడిటీ, అజీర్ణం, గ్యాస్ మరియు మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను శాశ్వతంగా దూరం చేయడంలోనూ పెసలు అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే స్త్రీ పురుషులిద్దరిలోనూ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కూడా పెసల పోషకాలు ఎంతో ఉపకరిస్తాయి.     Green Gram Benefits, Eating Moong in the Morning, Health Benefits of Green Gram, Sprouted Moong Benefits, Morning Superfoods, Moong for Weight Loss.
చాలామంది మధుమేహం లేదా టైప్ 2 డయాబెటిస్ అనగానే కేవలం తీపి పదార్థాలు, స్వీట్లు, చక్కెర ఎక్కువగా తినడం వల్ల మాత్రమే వస్తుందని భావిస్తుంటారు. స్వీట్లను దూరంగా పెడితే డయాబెటిస్ రాదని బలంగా నమ్ముతుంటారు. కానీ వైద్య నిపుణులు మరియు ఆరోగ్య పరిశోధనలు చెబుతున్న నిజం ఏమిటంటే.. డయాబెటిస్ బారిన పడటానికి కేవలం ఆహారంలో తీపి మాత్రమే కారణం కాదు. మనకు తెలియకుండానే మనం ప్రతిరోజూ పాటించే కొన్ని చిన్న చిన్న జీవనశైలి అలవాట్లు, శరీర శ్రమ లేకపోవడం, నిద్ర లేమి, మరియు అలవాటైన ప్రతికూల చర్యలు మన జీవక్రియపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇవి కాలక్రమేణా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచి, ఇన్సులిన్ నిరోధకతకు దారితీసి టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని ఊహించని స్థాయిలో పెంచుతాయి. మన దైనందిన జీవితంలో టైప్ 2 డయాబెటిస్ ముప్పును పెంచే ఆ ఐదు ప్రధాన అలవాట్ల గురించి మరియు వాటి వెనుక ఉన్న సైంటిఫిక్ నిజాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటిది, మనం విరివిగా తినే ప్యాకేజ్డ్ మరియు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా చాలామంది ప్యాకెట్ స్నాక్స్, తీపి కలిపిన కూల్ డ్రింక్స్, ప్రాసెస్ చేసిన మాంసాహారం, మరియు రెడీ టు ఈట్ ఆహార పదార్థాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇటీవల వెలువడిన పలు మెటా అనాలిసిస్ అధ్యయనాల ప్రకారం, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను ఎక్కువగా తీసుకునే వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ముప్పు గణనీయంగా పెరుగుతోందని తేలింది. వీటిలో ఉండే కృత్రిమ రసాయనాలు, అధిక ప్రిజర్వేటివ్‌లు, ట్రాన్స్ ఫ్యాట్స్ జీర్ణవ్యవస్థపై మరియు మెటబాలిక్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి ప్యాకేజ్డ్ ఆహారాలకు దూరంగా ఉంటూ, రోజువారీ ఆహారంలో తాజా కూరగాయలు, ఆకుకూరలు, మరియు తక్కువ ప్రాసెస్ చేసిన సహజ ఆహార ధాన్యాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఎంతైనా అవసరం. రెండవది, ఉదయాన్నే టిఫిన్ లేదా బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేయడం. బరువు తగ్గాలనే ఉద్దేశంతోనో లేదా ఆఫీసులకు, కళాశాలలకు వెళ్లే హడావుడిలోనో చాలామంది ఉదయం అల్పారాహారాన్ని మానేస్తుంటారు. కానీ పరిశోధనాధారిత అధ్యయనాల ప్రకారం, క్రమం తప్పకుండా బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసే వారిలో టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. ఉదయం పూట శరీరానికి అందాల్సిన పోషకాలు అందకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది ఇన్సులిన్ సరైన రీతిలో పనిచేయకుండా అడ్డంకులు సృష్టిస్తుంది. కాబట్టి ఉదయం పూట పొట్టను ఖాళీగా ఉంచకుండా, శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, ఫైబర్ ఉన్న సమతుల్య అల్పాహారం తీసుకోవడం చాలా మంచిది. మూడవది, గంటల తరబడి కదలకుండా ఒకేచోట కూర్చోవడం. ఆధునిక ఉద్యోగాలు, కంప్యూటర్ స్క్రీన్ల ముందు గంటల తరబడి పనిచేయడం, మరియు నిరంతరం టీవీలు లేదా మొబైల్ ఫోన్లు చూడటం వల్ల శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. గంటల తరబడి కదలకుండా కూర్చోవడం వల్ల శరీరంలోని కండరాలు గ్లూకోజ్‌ను వినియోగించుకునే సామర్థ్యాన్ని కోల్పోతాయి. అంతర్జాతీయ డయాబెటిస్ నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం, ప్రతి 30 నిమిషాలకు ఒకసారి కనీసం లేచి నిలబడటం లేదా కొద్దిసేపు అడుగులు వేయడం చాలా అవసరం. ఒకేచోట కూర్చునే సమయాన్ని తగ్గించి, ప్రతిరోజూ క్రమం తప్పకుండా చిన్నపాటి వ్యాయామం, నడకను అలవాటు చేసుకోవడం ద్వారా డయాబెటిస్ ప్రమాదాన్ని చాలావరకు తగ్గించుకోవచ్చు. నాలుగవది, నిద్ర విషయంలో నిర్లక్ష్యం చేయడం మరియు నిద్ర వేళలు మారడం. రాత్రిళ్లు ఆలస్యంగా పడుకోవడం, సరిపడా నిద్ర లేకపోవడం, మరియు రోజుకో సమయానికి నిద్రపోవడం వల్ల శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. నిద్ర నాణ్యత, నిద్రపోయే సమయం టైప్ 2 డయాబెటిస్ ప్రమాదంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. నిద్రలేమి వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరిగి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపు తప్పుతాయి. అందువల్ల ప్రతిరోజూ క్రమబద్ధమైన వేళల్లో శరీరానికి అవసరమైన తగినంత ప్రశాంతమైన నిద్రను పొందడం మెటబాలిక్ ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఐదవది, స్మోకింగ్ లేదా పొగతాగే అలవాటు ఉండటం. పొగతాగడం కేవలం ఊపిరితిత్తులు లేదా గుండెకు మాత్రమే హానికరం అని చాలామంది అనుకుంటారు. కానీ సిగరెట్ తాగడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణ తీవ్రంగా దెబ్బతింటుంది. ప్రముఖ ఆరోగ్య సంస్థ సిడిసి (CDC) అందించిన గణాంకాల ప్రకారం, పొగతాగని వారితో పోలిస్తే స్మోకింగ్ అలవాటు ఉన్నవారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం సుమారు 30 శాతం నుండి 40 శాతం వరకు ఎక్కువగా ఉంటుంది. సిగరెట్ పొగలో ఉండే నికోటిన్ మరియు ఇతర ప్రమాదకర రసాయనాలు శరీరంలో ఇన్సులిన్ పనితీరును అడ్డుకోవడమే కాకుండా, శరీర కణజాలాలలో వాపును పెంచుతాయి. కాబట్టి డయాబెటిస్‌ను నివారించాలంటే స్వీట్లు తగ్గించడంతో పాటు స్మోకింగ్ అలవాటును పూర్తిగా మానడం తక్షణ అవసరం.     Type 2 Diabetes Risk Factors, Habits Causing Diabetes, Diabetes Prevention Tips, Lifestyle Mistakes Diabetes, Blood Sugar Control, Diabetes Awareness.  
ఆరోగ్యం, అందం అనేవి వేర్వేరు కావు, ఒకదానితో ఒకటి అత్యంత లోతుగా ముడిపడి ఉన్నాయి. మన శరీరాన్ని లోపలి నుంచి ఎంత బలంగా, ఆరోగ్యంగా ఉంచుకుంటే.. బయటకు మన చర్మం అంత ప్రకాశవంతంగా, మెరుస్తూ కనిపిస్తుంది. కేవలం ఖరీదైన క్రీములు లేదా బ్యూటీ ప్రొడక్ట్స్ వాడితే తాత్కాలిక మెరుపు మాత్రమే వస్తుంది, కానీ నిత్యం మెరిసే సహజ సౌందర్యం పొందాలంటే మనం తినే ఆహారమే అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. రోజువారీ ఆహారంలో సరైన పోషకాలు చేర్చుకోవడం ద్వారా కండరాల బలాన్ని సాధించవచ్చు, అదే సమయంలో కాంతివంతమైన చర్మాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. ఆరోగ్య నిపుణులు సూచిస్తున్న అలాంటి ఐదు అద్భుతమైన సూపర్ ఫుడ్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొదటిగా, గుడ్లు మన శరీరానికి అవసరమైన అత్యుత్తమ ప్రోటీన్లు, విటమిన్లు మరియు ఖనిజాలతో నిండిన పరిపూర్ణ ఆహారం. గుడ్లలో ఉండే అధిక ప్రోటీన్ కండరాల నిర్మాణానికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా, దెబ్బతిన్న చర్మ కణాల పునరుద్ధరణలో గుడ్లు కీలక పాత్ర పోషిస్తాయి. నిపుణుల సలహా ప్రకారం గుడ్లను ఆయిల్ ఎక్కువ వేసి ఆమ్లెట్‌గా తినడం కంటే, ఉడికించిన గుడ్ల రూపంలో తీసుకోవడం వల్ల గరిష్ట ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇది శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతూనే చర్మానికి సహజమైన బిగుతును, మెరుపును అందిస్తుంది. రెండవది, తీపి మరియు పులుపు సమ్మేళనంగా ఉండే బ్లూబెర్రీస్ అద్భుతమైన యాంటీఆక్సిడెంట్ నిధి. ప్రతిరోజూ బ్లూబెర్రీస్ తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా, గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. వీటిలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ మరియు విటమిన్ కె వంటి అత్యంత శక్తివంతమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఎముకల సాంద్రతను పెంచడంతో పాటు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో అద్భుతంగా తోడ్పడతాయి. చర్మాన్ని వృద్ధాప్య ఛాయల నుంచి కాపాడటంలో బ్లూబెర్రీస్ సూపర్ ఫుడ్‌గా పనిచేస్తాయి. మూడవది, నాన్  వెజ్ ప్రియులకు సాల్మన్ చేప ఒక వరప్రసాదం. సూపర్ ఫుడ్స్ జాబితాలో అగ్రస్థానంలో ఉండే సాల్మన్ చేపలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అత్యధిక పరిమాణంలో ఉంటాయి. నిత్యం సాల్మన్ చేపను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి విపరీతంగా పెరుగుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు చర్మంలో తేమను కాపాడి, పొడిబారకుండా చూస్తాయి. అంతేకాకుండా, మెదడు పనితీరును వేగవంతం చేయడానికి మరియు గుండె ఆరోగ్యాన్ని రక్షించడానికి సాల్మన్ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. నాన్  వెజ్ తినని వారికి, లేదా విటమిన్ సి అధికంగా కోరుకునే వారికి కివి పండు అద్భుతమైన ప్రత్యామ్నాయం. సాధారణంగా విటమిన్ సి కి నారింజ పండును ఉదాహరణగా చెబుతుంటారు, కానీ కివి పండులో నారింజ కంటే కూడా అత్యధికంగా విటమిన్ సి ఉంటుంది. ఇది శరీరంలో గొప్ప యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి ఉచిత రాడికల్స్ (free radicals) దాడి నుంచి చర్మాన్ని కాపాడుతుంది. కివి పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో తెల్ల రక్త కణాలు (White Blood Cells) తగినంత సంఖ్యలో పెరుగుతాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం పెరిగి, ముఖంపై ముడతలు రాకుండా చర్మం కాంతివంతంగా మారుతుంది. చివరగా, క్యాబేజీ కుటుంబానికి చెందిన బ్రోకోలీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మరో శక్తివంతమైన ఆహారం. బ్రోకోలీని లేతగా ఉడకబెట్టి గానీ లేదా పచ్చిగా గానీ తినవచ్చు. బ్రోకోలీలో ఉండే విటమిన్ కె మరియు కాల్షియం ఎముకలను ఎంతో దృఢంగా మారుస్తాయి. దీనిలోని అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి, అనవసరమైన ఆకలి కోరికలను నియంత్రిస్తుంది. ఇది శరీరంలో కొవ్వు చేరకుండా నిరోధించి బరువు పెరగకుండా చూస్తుంది, తద్వారా పర్ఫెక్ట్ ఫిట్ బాడీని సాధించవచ్చు. ఈ ఐదు సూపర్ ఫుడ్స్‌ను మీ రోజువారీ డైట్‌లో భాగం చేసుకుని, మీ వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా తగిన పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యకరమైన శరీరం, మెరిసే చర్మం మీ సొంతమవుతాయి.     Beauty Foods for Glowing Skin, Foods for Radiant Skin, Healthy Diet for Skin and Fitness, Superfoods for Natural Glow, Nutrition for Skin and Body, Skin Care Foods.  
డయాబెటిస్ ఉన్నవారిలో తరచుగా కనిపించే కొన్ని సమస్యలు రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా కూర్చొని లేవగానే తల తిరగడం, నిలబడినప్పుడు తూలినట్లు అనిపించడం, శరీరంలో బలహీనత, కండరాల బలం తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. తల తిరగడానికి షుగర్ కారణమా? లేక చెవి, మెదడు, మెడకు సంబంధించిన సమస్యల వల్ల Vertigo వస్తుందా? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. ఈ వీడియోలో డాక్టర్ ప్రవీణ్ కుమార్ డయాబెటిస్ మరియు Vertigo గురించి సులభమైన తెలుగులో ముఖ్యమైన విషయాలను వివరిస్తున్నారు. షుగర్ పూర్తిగా Zero అవుతుందా? డయాబెటిస్‌ను పూర్తిగా నయం చేయగలమా? Type 1 Diabetes, Type 2 Diabetes మధ్య తేడా ఏమిటి? శరీరంలో Insulin Resistance ఎలా ఏర్పడుతుంది? డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు అవసరం? వంటి సాధారణ సందేహాలకు ఈ వీడియోలో వివరణ లభిస్తుంది. డయాబెటిస్‌లో షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా పర్యవేక్షణ, శారీరక చురుకుదనం వంటి అంశాల ప్రాధాన్యతను కూడా తెలుసుకోవచ్చు. దీర్ఘకాలంగా షుగర్ నియంత్రణలో లేకపోతే శరీరంపై ఎలాంటి ప్రభావాలు ఉండవచ్చు? కండరాల బలం ఎందుకు తగ్గుతుంది? బలహీనత, లైంగిక సమస్యలు వంటి ఇబ్బందులకు డయాబెటిస్‌తో సంబంధం ఉందా? అనే విషయాలను కూడా డాక్టర్ వివరిస్తారు. ఇక తల తిరగడం లేదా Vertigo విషయానికి వస్తే ప్రతి తల తిరుగుడూ ఒకే కారణంతో ఉండదు. Vertigoలో వివిధ రకాలు ఉంటాయి. ముఖ్యంగా తల లేదా శరీరాన్ని ఒక పొజిషన్ నుంచి మరో పొజిషన్‌కు మార్చినప్పుడు అకస్మాత్తుగా తల తిరిగినట్లు అనిపించే BPPV (Benign Paroxysmal Positional Vertigo) గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అలాగే చెవికి సంబంధించిన సమస్యలు, Aural Vertigo, మెడకు సంబంధించిన Cervical Spondylosis, శరీర స్థితి (Posture) వంటి కారణాల వల్ల కూడా తల తిరగడం లేదా బ్యాలెన్స్ సమస్యలు రావచ్చని వివరిస్తున్నారు. తల తిరుగుతున్నప్పుడు అసలు కారణాన్ని గుర్తించడం ఎందుకు ముఖ్యమో, ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలో కూడా ఈ వీడియో ద్వారా అర్థం చేసుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షుగర్‌ను క్రమం తప్పకుండా ఎలా మానిటర్ చేయాలి? శరీరంలో బలహీనత, కండరాల నష్టం రాకుండా ఎలాంటి జీవనశైలి పాటించాలి? Vertigo ఉన్నప్పుడు చెవుల ఆరోగ్యం, శరీర భంగిమ, రోజువారీ అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి ఉపయోగకరమైన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. అదేవిధంగా Homeopathy Approach గురించి కూడా ఈ వీడియోలో ప్రస్తావించారు. అయితే డయాబెటిస్ లేదా Vertigo వంటి సమస్యలకు స్వయంగా మందులు తీసుకోవడం లేదా ఇప్పటికే వాడుతున్న వైద్య చికిత్సను ఆపడం కాకుండా, అర్హత కలిగిన వైద్యుడి సలహాతోనే చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. షుగర్ కంట్రోల్, డయాబెటిస్‌లో వచ్చే సమస్యలు, తల తిరగడానికి కారణాలు, Vertigo రకాలు, BPPV, చెవి సమస్యలు, Cervical Spondylosis, ఆహారం మరియు రోజువారీ ఆరోగ్య జాగ్రత్తల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: ఈ వీడియోలో అందించిన సమాచారం అవగాహన కోసం మాత్రమే. డయాబెటిస్, Vertigo లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు వ్యక్తిగత చికిత్సను వైద్యుల సలహా లేకుండా మార్చకండి లేదా మందులను నిలిపివేయకండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
ఉదయాన్నే  పరగడుపున టీ లేదా కాఫీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. రోజును చురుగ్గా ప్రారంభించడానికి కాఫీ, టీ లు తాగుతూ ఉంటారు.  అయినప్పటికీ ఇవి శరీరంలో  అసిడిటీ, హార్మోన్ల అసమతుల్యత , ఇతర జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. వీటి స్థానంలో శరీరాన్ని చురుగ్గా ఉంచుతూనే శరీరంలో ఉన్న అనారోగ్యాలను, జబ్బులను, ఇబ్బందులను తగ్గించగల పానీయం తాగడం చాలా మంచిది.  ఈ పానీయాన్ని తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు తొలగిపోవడమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంతకీ అంత శక్తివంతమైన ఆ పానీయం ఏమిటో? దాన్ని ఎలా తయారుచేసుకుని తాగాలో.. వివరంగా తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. ధనియాలు,  జీలకర్ర,  సోంపు ,  వాము  పైన పేర్కొన్న దినుసులలో ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ​తయారీ విధానం... ఈ పానీయాన్ని తయారు చేయడం చాలా సులభం. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాసు నీటిని తీసుకుని మరిగించాలి. అందులో అర టీస్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ సోంపు , పావు టీస్పూన్ వాము వేయాలి. ఈ మిశ్రమాన్ని నీరు సగం అయ్యేంత వరకు చిన్న మంటపై బాగా మరిగించాలి. నీరు బాగా మరిగిన తర్వాత వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. రుచి కోసం లేదా అదనపు ఆరోగ్య ప్రయోజనాల కోసం కాస్త నిమ్మరసం లేదా తేనె కూడా కలపవచ్చు. ఈ పానీయం తాగడం వల్ల శరీరానికి కలిగే  ఉపయోగాలు.. ​హార్మోన్ల సమతుల్యత.. మహిళల్లో ఎదురయ్యే థైరాయిడ్, పిసిఓడి , పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం  వంటి సమస్యలకు ఈ పానీయం చాలా మేలు చేస్తుంది. ధనియాలు , సోంపు శరీరంలో హార్మోన్ల ఉత్పత్తిని క్రమబద్ధీకరించడానికి తోడ్పడతాయి. ​జీర్ణవ్యవస్థ మెరుగుదల.. జీలకర్ర , వాము జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ , మలబద్ధకం వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ​రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ.. టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారికి ఈ పానీయం సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గేందుకు సహాయం.. శరీరంలో ఉన్న కొవ్వును కరిగించడంలో జీలకర్ర , వాము కీలక పాత్ర పోషిస్తాయి. క్రమం తప్పకుండా ఈ పానీయం తాగడం ద్వారా శరీర మెటబాలిజం పెరిగి బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ​చర్మ సౌందర్యం , డిటాక్సిఫికేషన్.. శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఫలితంగా చర్మంపై మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం సహజంగా మెరుస్తుంది. ​కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం.. ఈ పదార్థాల్లో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు , వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. ​ఈ డిటాక్స్ డ్రింక్‌ను ప్రతిరోజూ ఉదయం పరగడుపున క్రమం తప్పకుండా తాగడం ద్వారా శరీరంలో సహజమైన మార్పులను గమనించవచ్చు. టీ, కాఫీలకు ప్రత్యామ్నాయంగా ఈ నేచురల్  పానీయాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా శరీరంలో చాలా మార్పులు గమనించవచ్చు.                       *రూపశ్రీ.
గొంతుకు, గడ్డానికి మధ్య భాగంలో , గడ్డానికి కింద చర్మం, కండర కణజాలం పెరిగి.. గొంతు, గడ్డం ఏకం అయినట్టు చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. దీన్ని డబుల్ చిన్ అని అంటారు. లావు పెరగడం వల్ల డబుల్ చిన్ వచ్చిందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే లావు ఎక్కువగా లేకపోయినా కొందరిలో డబుల్ చిన్ కనిపిస్తూ ఉంటుంది. అయితే   డబుల్ చిన్ కు,  థైరాయిడ్ సమస్యలకు మధ్య ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు ఉన్నాయని  వైద్యులు చెబుతున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. డబుల్ చిన్ ఎందుకు, ఎలా వస్తుంది? థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగ్గా లేనప్పుడు శరీర జీవక్రియ మందగిస్తుంది. ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్నవారిలో బరువు వేగంగా పెరగడం, శరీరంలో నీరు చేరడం లేదా వాపులు రావడం సాధారణం. దీని ప్రభావం ముఖం , మెడ భాగాలపై స్పష్టంగా కనిపిస్తుంది. మెడ కింద కొవ్వు చేరడం లేదా ముఖం ఉబ్బినట్లు అవ్వడం వల్ల డబుల్ చిన్ ఏర్పడుతుంది. అంతేకాకుండా థైరాయిడ్ సమస్య వల్ల మెడ ముందు భాగంలో ఉన్న గ్రంథి వాచి గాయిటర్ గా మారినప్పుడు కూడా గడ్డం కింద వాపు వచ్చి డబుల్ చిన్ లాగా కనిపించే అవకాశం ఉంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు డబుల్ చిన్ తగ్గించుకోవడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు , జీవనశైలి మార్పులు పాటించాలి..  థైరాయిడ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం.. థైరాయిడ్  లెవెల్స్ కంట్రోల్ లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. వైద్యుల సలహా మేరకు సరైన మోతాదులో థైరాయిడ్ మందులు క్రమం తప్పకుండా వాడాలి. శరీరంలో థైరాయిడ్ హార్మోన్లు సమతుల్యంగా ఉన్నప్పుడు జీవక్రియ వేగవంతమై, అదనపు బరువు , వాపు తగ్గుతాయి.  పోషకాహార నియమం..  ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక చక్కెర ఉన్న పదార్థాలు, మైదా , వేపుళ్లను పూర్తిగా తగ్గించాలి. పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు , తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. శరీరంలో సోడియం నిల్వలు ఎక్కువైతే నీరు చేరే అవకాశం ఉంది కాబట్టి ఉప్పు చాలా పరిమితంగా తినాలి. నీరు..  ప్రతిరోజూ తగినన్ని నీళ్లు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. నీరు బాగా తాగితే ముఖం , మెడ భాగంలో నీరు చేరడం తగ్గి వాపు తగ్గుతుంది.  వ్యాయామం.. కేవలం మెడ భాగంలోనే కాకుండా శరీరం మొత్తానికి సంబంధించిన వ్యాయామాలు చేయాలి. రోజూ క్రమం తప్పకుండా నడక, యోగా లేదా కార్డియో వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలోని క్యాలరీలు కరిగి బరువు తగ్గుతారు. దీనితో పాటు మెడ , గడ్డం కండరాలను బలోపేతం చేసే చిన్న చిన్న ముఖ వ్యాయామాలు చేయవచ్చు. ఈ ఫేస్ వ్యాయామాలు మెడ వద్ద ఉన్న చర్మాన్ని బిగుతుగా మార్చడానికి తోడ్పడతాయి.  నిద్ర , ఒత్తిడి..  రోజుకు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం. నిద్రలేమి , మానసిక ఒత్తిడి వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత పెరిగి బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం ప్రాణాయామం వంటివి పాటించాలి. పైన చెప్పుకున్న విధంగా థైరాయిడ్ కు సరైన వైద్యం పొందుతూ, ఆరోగ్యకరమైన ఆహారం , రోజువారీ వ్యాయామం అలవాటు చేసుకుంటే డబుల్ చిన్ సమస్య నుండి క్రమంగా బయట పడవచ్చు.                                                                                                                                     *రూపశ్రీ.