LATEST NEWS
తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో  కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుకి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విమర్శలకు పదును పెట్టింది.  బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, 13 డిక్లరేషన్లు,   6 గ్యారంటీల  అమలులో రేవంత్  ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని  ధ్వజమెత్తారు. ప్రజలను మాయమాటలతో వంచించి అధికార పీఠాన్ని దక్కించుకున్న కాంగ్రెస్, ఈ వెయ్యి రోజుల పాలన ఇసుమంతైనా సంతృప్తికరంగా లేదని విమర్శించారు.  రైతాంగం, వ్యవసాయ కూలీలు, మహిళలు, విద్యార్థుల జీవితాలతో  రేవంత్ ఆటలాడుతోందని బీఆర్‌ఎస్  ఆ  చార్జ్‌షీట్‌లో పేర్కొంది. వ్యవసాయ రంగానికి సంబంధించి రైతు భరోసా పథకం కింద   ఏటా ఎకరాకు అందిస్తామన్న  15 వేల రూపాయల  సాయాన్ని నిలిపివేసి రైతులను నిట్టనిలువునా మోసం చేసిందని విమర్శించింది.  అలాగే వ్యవసాయ కూలీలకు చెల్లిస్తామని వాగ్దానం చేసిన   12 వేల రూపాయల ఆర్థిక సాయం కూడా నీటి మూటగానే మిగిలిందని చార్జ్ షీట్ పేర్కొంది.  2 లక్షల రూపాయల  రుణమాఫీ ప్రక్రియను అసంపూర్తిగానే మిగిలిందనీ, సగం సగం లెక్కలతో రైతులకు అన్యాయం చేసిందని ఈ సందర్భంగా కేటీఆర్ విమర్శించారు.  యువత,  విద్యార్థుల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసిందని బీఆర్ఎస్ చార్జ్ షీట్ పేర్కొంది.  నిరుద్యోగులకు ఇస్తామని ప్రకటించిన   4 వేల రూపాయల నిరుద్యోగ భృతితో పాటు, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీ పూర్తిగా నీటిమూటగా మారిపోయిందని విమర్శించింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కాపాడటంలో విఫలమైన ప్రభుత్వం, గురుకుల పాఠశాలలను మూసివేసే దిశగా కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ చార్జిషీట్ పేర్క్ంది. విద్యార్థులకు వాగ్దానం చేసిన  5 లక్షల విద్యా భరోసా కార్డు ఆచరణకు నోచుకోలేదని, 12 వేల  కోట్ల రూపాయలకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయనీ, అలాగే..  మహిళలకు ఇస్తామన్న నెలకు  2 వేల 500 రూపాయల ఆర్థిక సాయం, కల్యాణలక్ష్మి పథకం కింద ఇస్తామన్న తులం బంగారం హామీలను రేవంత్ ప్రభుత్వం విస్మరించిందని పేర్కొంది.   ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు,  తెలంగాణకు జీవనాధారమైన కృష్ణా, గోదావరి నదీ జలాలపై రాష్ట్రానికి ఉన్న హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించిందని  విమర్శించారు. అంతేకాకుండా, బాధ్యతారహితమైన ఆర్థిక నిర్ణయాల వల్ల తెలంగాణను దాదాపు రూ. 4.5 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలను, హామీల అమలును ప్రశ్నించిన నాయకులు, ప్రజలపై అక్రమ కేసులు బనాయిస్తూ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. [BRS chargesheet on Congress, KTR press meet, Telangana Congress 1000 days, Revanth Reddy government failures, BRS vs Congress, Telangana politics,  Telugu One]
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు అవుతున్న సంగతి తెలిసిందే. అధికారం కోల్పోయిన తరువాత ఇన్నేళ్లలో ఆయన అసెంబ్లీకి హాజరైన సందర్భాలు ఒకటి రెండు కంటే ఎక్కువ లేవు. అయితే ఎమ్మెల్యేగా మాత్రం ఆయన జీత భత్యాలను నిర్మొహమాటంగా తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.    ప్రజాస్వామ్య వ్యవస్థలను, అసెంబ్లీని  గౌరవించడంలో ప్రతిపక్ష నేత కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు.   ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్‌ను లక్ష్యం విమర్శలు గుప్పించడానికి  ఎంచుకోవడం తెలంగాణలో పొలిటికల్ హీట్ ను పెంచింది.   ఎమ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.   అసెంబ్లీకి డుమ్మా కొట్టి కూడా నిస్సిగ్గుగా   గత రెండేళ్లలో కేసీఆర్ జీతం రూపంలో రూ. 1.24 కోట్లు తీసుకున్నారని రేవంత్ పేర్కొన్నారు. అసెంబ్లీకి హాజరు కాకుండా ఎమ్మెల్యేగా కేసీఆర్ జీత భత్యాలు తీసుకుంటున్నారన్న అంశం ఇప్పుడు సామాజిక మాధ్యమంలో హాట్ హాట్ గా వైరల్ అయ్యింది. 2023 ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్  దాదాపుగా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. ఇక ఇప్పుడు రేవంత్ విమర్శలు, నిలదీత తరువాతైనా కేసీఆర్.. ఫామ్ హౌస్ లో అజ్ణాత వాసానికి చుక్క పెట్టి ప్రజాక్షేత్రంలోకి వస్తారేమో చూడాలి.   [Revanth Reddy, KCR Assembly Absence, Telangana Assembly,  BRS Leader KCR, Salarie, Telangana Politics, Telugu One]
ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు జగన్ కు పులివెందుల భయం పట్టుకుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. 2024 ఎన్నికలలో పార్టీ  ఓటమి జగన్ రాష్ట్రంలో పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటను చేస్తారని అంతా భావించారు. అయితే అందుకు భిన్నంగా ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.   నిజమే.. జగన్  ఇటీవలి కాలంలో క్రమం తప్పకుండా పులివెందులలో పర్యటిస్తున్నారు.  ఈ పర్యటనలు ఆయనలో భయాన్ని సూచిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. గతంలో అంటే జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆయన పులివెందుల పర్యటనలు చాలా చాలా అరుదుగానే చేపట్టే వారు. తన తండ్రి వైఎస్ జయంతి, వర్ధంతి సందర్భాలు కాకుండా ఆయన పులివెందులలో అడుగుపెట్టడం అనేది చాలా అరుదుగా జరిగేది. కానీ 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం, పులివెందులలో తన మెజారిటీ గణనీయంగా తగ్గడంతో ఆయన పులివెందుల పర్యటనలు పెరిగాయి. అన్నిటికీ మించి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీకి డిపాజిట్ కూడా దక్కకుండా ఘోరంగా ఓడిపోయిన తరువాత ఆయనలో పులివెందులపై పట్టు జారిపోతోందన్న భయం మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దీంతో అప్పటి నుంచి సమయం, సందర్భంతో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా పులివెందుల వెడుతున్నారు.  అక్కడ  తన నివాసంలో రెండు మూడు రోజుల ఉంటున్నారు.  స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమౌతున్నారు.  ప్రజా దర్బార్ తరహాలో వినతులు స్వీకరిస్తున్నారు.   నియోజకవర్గంలో తన పట్టు సడలకుండా ఉండటానికే ఆయన ఇటీవలి కాలంలో తరచూ పులివెందులలో పర్యటిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  2024 ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలలో  వ్యతిరేకత కనిపించడంతో పాటు, పార్టీ క్యాడర్ లో కూడా ఉత్సాహం తగ్గి పెద్దగా పార్టీ కార్యక్రమాలు చేపట్టకపోవడంతో జగన్ ముందుజాగ్రత్త పడుతున్నారని అంటున్నారు.   [Pulivendula Fear in Jagan, Jagans Pulivendula visits, YCP Politics, Ap Politics, Telugu One]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒంగోలు నియోజకవర్గం ఎప్పుడూ కీలకంగానే ఉంటుంది. 2024 ఎన్నికల అనంతరం వైసీపీని వీడి  జనసేన  గూటికి చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది.  ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.  ఇటీవల  టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ను లక్ష్యంగా చేసుకుని బాలినేని శ్రీనివాసరెడ్డి  మీడియా సమావేశంలో చేసిన విమర్శలు, ఆరోపణలు తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య దాదాపు చిచ్చు పెట్టినంత పని చేశాయి.  అయితే సకాలంలో తెలుగుదేశం, జనసేన అధినాయకత్వాలు జోక్యం చేసుకుని దామచర్ల, బాలినేనిలను గట్టిగా హెచ్చరించడంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే బాలినేని వ్యాఖ్యలు, విమర్శల పట్ల మాత్రం ఇరు పార్టీలలోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. వ్యక్తిగత విభేదాలు,  పాత తగాదాల లేక్క తేల్చచుకునేందుకు బాలినేని  జనసేనను   వాడుకుంటున్నారన్న విమర్శలు ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ కూడా వెల్లువెత్తాయి.  పరిస్థితిని అర్ధం చేసుకున్న జనసేనాని పవన్ కల్యాణ్.. దిద్దుబాటు చర్యలు చేపట్టారు.  ఇటీవల జనసేన పార్టీ ప్రకటించిన స్థానిక సంస్థల ఎన్నికల కమిటీలో బాలినేనికి స్థానం దక్కలేదు. బాలినేని వంటి సీనియర్ నాయకుడికి   స్థానిక ఎన్నికల బాధ్యతల్లో ప్రాతినిధ్యం ఇవ్వకపోవడాన్ని బట్టి జనసేనాని బాలినేనిని దూరం పెట్టారని అవగతమౌతోందంటున్నారు పరిశీలకులు.  అలాగే  ఒంగోలులో ఎంతో ఘనంగా నిర్వహించిన జనసేన  ఆత్మీయ సమావేశానికి బాలినేని గైర్హాజరు కూడా బాలినేనికి జనసేనలో ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోందంటున్నారు.  అంతే కాదు.. ఒంగొలులో జరిగిన జనసేన ఆత్మీయ సమావేశానికి బాలినేని గైర్హాజర్ కాలేదనీ, ఆయనను ఆ సమావేశానికి పార్టీ అధిష్ఠానం ఆహ్వానించలేదనీ, అందుకే ఆయన దూరంగా ఉన్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతున్నది. మొత్తం మీద ప్రకాశం జిల్లాలో, ఒంగోలులో బాలినేనికి జనసేనలో ప్రాధాన్యత తగ్గిందనీ, పార్టీ కార్యక్రమాలకు ఆయనను దూరం పెడుతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  బాలినేని తీరును, పార్టీ కార్యకర్తల, స్థానిక నేతల అభిప్రాయాలనూ, అలాగే మిత్రపక్షమైన తెలుగుదేశం అభిప్రాయాలనూ పరిగణనలోనికి తీసుకున్న జనసేనాని పవన్ కల్యాణ్.. పార్టీలో బాలినేని ప్రభావాన్ని,  జోక్యాన్ని తగ్గించారని అంటున్నారు.  పొత్తు ధర్మానికి విఘాతం కలగకుండా ఉండాలన్నా, పార్టీ అంతర్గత క్రమశిక్షణ దెబ్బతినకుండా ఉండాలన్నాబాలినేనిని పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టడమే మేలని, జనసేనాని అదే చేస్తున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  పవన్ కళ్యాణ్  కూటమి ఐక్యత దెబ్బతినకుండా ఉండటానికీ, అలాగే ప్రకాశం జిల్లాలో జనసైనికులలో కొత్త జోష్ నింపడానికి బాలినేనికి పార్టీలో ప్రాధాన్యత లేకుండా చర్యలు తీసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   [Balineni Srinivasa Reddy Imoprtance Diminished, Pawan Kalyan, Janasena Party, Ongole Politics, TDP Janasena Alliance, Telugu One]
  భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ప్రొరోగ్ చేయకుండా కొనసాగించడం, రాబోయే రోజుల్లో ఏ విధమైన బిల్లులను ప్రవేశపెడుతుందనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానికి లేఖ రాస్తూ, మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ మద్దతు ఉంటుందని, కానీ డీలిమిటేషన్‌ను రాబోయే 25 ఏళ్ల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఈ రెండు అంశాలను ముడిపెట్టడం వెనుక ఉన్న రాజకీయ వ్యూహాలు దక్షిణాది రాష్ట్రాలపై దీని ప్రభావం చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశంపై టోన్ న్యూస్ ప్రత్యేక చర్చ నిర్వహించారు. రాజ్యాంగ రీత్యా వ్యూహం రాజకీయ పరిణామాలు ప్రస్తుతం పార్లమెంట్ స్థానాల పెంపునకు సంబంధించి జనాభా ప్రాతిపదికన నిర్ణయం తీసుకుంటే, అది ఉత్తరాది రాష్ట్రాలకు తీవ్రమైన ప్రయోజనం చేకూరుస్తుందనే అభిప్రాయం బలపడుతోంది. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సమీకరణాల మార్పు.. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుల ద్వారా ఉభయ సభల్లోనూ మెజారిటీ నిరూపించుకునే వ్యూహంతో అడుగులు వేస్తోంది.  అయితే, ప్రాంతీయ పార్టీల వైఖరి, ముఖ్యంగా డిఎంకే  తృణమూల్ కాంగ్రెస్ మూడ్ మారడం వంటి పరిణామాలు అధికార పక్షానికి సవాలుగా మారాయి. ప్రతిపక్షాల ప్రతివ్యూహం.. మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం ఒక విభాజక వ్యూహమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మహిళా బిల్లును తక్షణమే అమల్లోకి తెచ్చి, సీట్ల పెంపు ప్రక్రియను సగానికి సగం విభజించేలా (ఉత్తరాది మరియు దక్షిణాదికి సమంగా) మార్పులు చేయాలని కోరుతోంది. రాజకీయ భయాలు & సంకోచాలు.. రాబోయే ఉత్తర ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై చూపించే ప్రభావం దృష్ట్యా, మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా అచితూచి అడుగులు వేస్తోంది.  ప్రధాని మోదీపై వ్యతిరేక స్వారాలు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు కూడా కేంద్రంలో కొత్త భయాలను సృష్టిస్తున్నాయి. భవిష్యత్ రాజకీయ ప్రభావంరాబోయే రోజుల్లో డీలిమిటేషన్ ప్రక్రియ రాజకీయంగా అత్యంత సున్నితమైన అంశంగా మారనుంది. జనాభా ఆధారిత విభజన అమలైతే, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం పెరిగి, దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కబడుతుందనే భావన మరింత బలపడుతుంది. ఇది సమఖ్య వ్యవస్థకే పెద్ద సవాలుగా మారే ప్రమాదం ఉంది.ఈ రాజకీయ సందిగ్ధత మరింత తీవ్రమైతే, జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతకు డీలిమిటేషన్ ప్రధాన అస్త్రంగా మారుతుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని కాపాడుకోవడానికి ఏకతాటిపైకి వస్తే, కేంద్ర ప్రభుత్వానికి చట్టసభల్లో నిర్ణయాలు తీసుకోవడం సంక్లిష్టంగా మారనుంది.       Delimitation Commission, South India Lok Sabha Seats, Women Reservation Bill, Mallikarjun Kharge Letter, Narendra Modi, North vs South Politics, Parliament Seats Expansion, Indian Political Analysis, Delimitation Impact Telugu, Indian Federation Issues, Telugu One, Telugu news
ALSO ON TELUGUONE N E W S
హాలీవుడ్ ప్రముఖ కథానాయిక, 'వండర్ వుమెన్' ఫేమ్ గాల్ గాడోట్ నటించిన సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'ది రన్నర్' (The Runner) ఎలాంటి ముందస్తు థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. లండన్ నేపథ్యంగా సాగే ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం కేవలం ఇంగ్లీష్‌లోనే కాకుండా భారతీయ ప్రేక్షకుల కోసం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల డబ్బింగ్ వర్షన్లలో అందుబాటులో ఉండటం విశేషం. గాల్ గాడోట్ క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని తెలుగు డబ్బింగ్‌లో కూడా అందుబాటులోకి తేవడంతో టాలీవుడ్ ఓటీటీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. లండన్‌లోని ఓ ప్రముఖ లాయర్ పాత్రలో గాల్ గాడోట్ నటించారు. ఒక రోజు ఉదయం జాగింగ్‌కు వెళ్లిన ఆమెకు ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఆమె కుమారుడిని కిడ్నాప్ చేసినట్లు బెదిరిస్తూ, అతడు చెప్పిన ఆదేశాలను కచ్చితంగా పాటించాలని షరతు విధిస్తాడు. సమయం తక్కువగా ఉండటంతో తన కుమారుడి ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ తల్లి ఎలాంటి సాహసాలు చేసింది? కిడ్నాపర్ల ప్లాన్‌ను ఎలా తిప్పికొట్టింది? అనే ఉత్కంఠభరిత అంశాలతో దర్శకుడు కెవిన్ మెక్‌డొనాల్డ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సీటు అంచున కూర్చోబెట్టేలా ఉన్న స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధాన బలం. గాల్ గాడోట్ గతంలో 'వండర్ వుమెన్', 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్', 'రెడ్ నోటీస్', 'హార్ట్ ఆఫ్ స్టోన్' వంటి బిగ్ బడ్జెట్ యాక్షన్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఒకవైపు తల్లిగా భావోద్వేగాలను పండిస్తూనే, మరోవైపు రేసింగ్ యాక్షన్ సీన్స్‌లో తన నటనతో మెప్పించారు. డెమియన్ లూయిస్, ఆల్ఫ్రెడ్ ఎనోచ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. ఓటీటీ రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ చిత్రంపై మంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. కేవలం 1 గంట 25 నిమిషాల నిడివితో చాలా షార్ప్ అండ్ క్రిస్పీగా సాగే ఈ థ్రిల్లర్ డ్రామాను ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తున్నారు. గాల్ గాడోట్ నటనను నెటిజన్లు విశేషంగా ప్రశంసిస్తున్నారు. వారం మధ్యలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై మంచి థ్రిల్లింగ్ అనుభూతిని పొందాలనుకునే వారికి 'ది రన్నర్' ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. సస్పెన్స్, యాక్షన్ లవర్స్ ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో వెంటనే చూసేయవచ్చు!       [Gal Gadot The Runner Movie, The Runner OTT Streaming, Amazon Prime Video Telugu Dubbed Movies, Gal Gadot New Movie OTT, TeluguOne TMDB OTT Updates]
Spider-Man: Brand New Day has achieved another major box-office milestone in North America, overtaking Avengers: Endgame to become the second-highest-grossing film of all time domestically. Tom Holland’s latest outing has now crossed the $858.37 million domestic haul of Endgame, leaving only Star Wars: The Force Awakens ahead with around $936.6 million. The achievement is particularly significant because Endgame had represented the ceiling for Marvel’s domestic theatrical performance for years. Brand New Day has now surpassed that benchmark despite being a solo Spider-Man film rather than an Avengers ensemble event. The film had already announced its arrival by opening to approximately $360.1 million domestically, beating Endgame’s $357.1 million opening record. What makes the run even more striking is that Brand New Day has maintained strong momentum beyond its opening. The film has remained at No. 1 for multiple weekends and has continued adding substantial numbers even after crossing the major franchise milestones. Its domestic total currently stands at around $893.7 million, putting the $900 million mark within immediate reach. The success also gives Tom Holland his biggest domestic Spider-Man outing yet, comfortably moving past Spider-Man: No Way Home, which finished with more than $804 million in North America. Interestingly, No Way Home had the obvious nostalgia advantage of bringing together Holland, Tobey Maguire and Andrew Garfield, while Brand New Day has managed to achieve an even bigger domestic run without relying on that same multiverse hook. Globally, the film has been equally formidable, crossing $2 billion worldwide in just 17 days and becoming the second-fastest film to reach that milestone after Avengers: Endgame. It has since climbed further up the all-time rankings, showing that the Spider-Man brand remains one of the strongest theatrical properties in the world. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  ఈ రోజు లెజండ్రీ నటుడు, అభిమానులు టైగర్ గా పిలుచుకునే నందమూరి హరికృష్ణ గారు పరమపదించిన రోజు. తెలుగు సినీ ప్రపంచంలో, రాజకీయ యవనికపై తనదైన ముద్ర వేసిన  హరికృష్ణ జ్ఞాపకాలు నందమూరి అభిమానుల గుండెల్లో ఎప్పటికీ పదిలమే    ఈ రోజు ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆయన కుమారులు ఎన్టీఆర్,  కళ్యాణ్ రామ్  తమ తండ్రిని గుర్తుచేసుకుంటు షేర్ చేసిన భావోద్వేగ సందేశం అభిమానుల హృదయాలని హత్తుకుంటుంది. "మీరు లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిది. మా ఉనికికి, మా గుర్తింపునకు మీరే మూలం. మీ జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మాకు మార్గదర్శకంగా నిలుస్తాయి" అంటూ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న మాటలు  నందమూరి వంశం పట్ల వారికున్న గౌరవాన్ని, తండ్రిపై ఉన్న అమితమైన ప్రేమని ప్రతిబింబిస్తోంది. Also Read: Panjaa Re Release: 3 గంటల్లో 150 షోలు సోల్డ్ అవుట్.. రీ-రిలీజ్ బాక్సాఫీస్ షేక్!  2018 ఆగస్టు 29న హైదరాబాద్ నుంచి కారులో నెల్లూరులో జరిగే పెళ్ళికి వెళ్తుండగా  నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి దగ్గరలో ఉన్న  అన్నెపర్తి విలేజ్ దగ్గర కారు యాక్సిడెంట్ కి గురయ్యింది. అప్పుడు సమయం ఉదయం ఆరుగంటలు.  ప్రమాద సమయంలో హరికృష్ణ గారే డ్రైవింగ్ చేస్తున్నారు.      [ Ntr, HariKrishna, Kalyanram, jayanthi, Telugu Cinema, Telugu Cinema News, Tollywood]          
ప్రముఖ నిర్మాణ సంస్థలు పారామౌంట్ పిక్చర్స్, లెజెండరీ ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘స్ట్రీట్ ఫైటర్’ ట్రైలర్ విడుదలైంది. టోక్యోలోని షింజుకు యునికా విజన్ స్క్రీన్స్‌పై గ్రాండ్‌గా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. దర్శకుడు కిటావో సకురాయ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో జేసన్ మోమోవా, డేవిడ్ డాస్ట్‌మల్చియన్, విద్యుత్ జమ్వాల్, 50 సెంట్, కోడి రోడ్స్, రోమన్ రీన్స్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  నోహ్ సెంటినియో కెన్ మాస్టర్స్‌గా, ఆండ్రూ కోజి ర్యూగా, కాలినా లియాంగ్ చున్-లిగా నటిస్తున్నారు. 1993 నేపథ్యంలో సాగే ఈ కథలో ర్యూ, కెన్ మరోసారి పోరాటంలోకి దిగుతారు. వరల్డ్ వారియర్ టోర్నమెంట్ చుట్టూ సాగే కథలో ఓ ప్రమాదకరమైన కుట్ర వారిని ఎదురెదురుగా నిలబెడుతుంది.  ‘స్ట్రీట్ ఫైటర్’ అక్టోబర్ 16, 2026న భారత్‌లో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.       [Street Fighter Trailer, Noah Centineo, Andrew Koji, Callina Liang, Telugu Film News, Telugu News]  
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. పవర్ ఫుల్ ఎమోషన్స్, తండ్రీ కూతుళ్ల డ్రామా, భక్తి రసంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర ముఖ్య పాత్రలు పోషించారు.  చిన్న, పెద్ద, క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తూ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్న మూవీ 'ఇరుముడి'. రీసెంట్ టైమ్స్‌లో సరైన హిట్ లేక రవితేజ ఫ్యాన్స్ నిరాశలో ఉన్న సమయంలో, డైరెక్టర్ శివ నిర్వాణ ఒక అద్భుతమైన ఎమోషనల్ అండ్ డివోషనల్ కథతో ముందుకు వచ్చారు. తండ్రీ కూతుళ్ల అనుబంధం, అయ్యప్ప స్వామి భక్తి నేపథ్యం మిక్స్ చేసి చెప్పిన ఈ కథ ప్రేక్షకులకు హత్తుకుంది. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లిన 'ఇరుముడి', బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ఎంత పెద్ద కాంపిటీషన్ ఉన్నా, కొన్ని చోట్ల థియేటర్ల సమస్యలు ఎదురైనా, ఆడియన్స్ ఆదరణ ముందు అవన్నీ తలవంచక తప్పలేదు. పిల్లలు, పెద్దలు, యూత్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ 'ఇరుముడి'ని తమ సొంత సినిమాగా భావించి థియేటర్లలో పండుగ చేసుకుంటున్నారు. ఆ ఫలితంగానే 'ఇరుముడి' మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 200 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకొని, రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.       [Irumudi Movie, 200 Crore Club, Ravi Teja, Shiva Nirvana, Mythri Movie Makers, Telugu Film News, Telugu News]  
సౌత్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. 'కేజీఎఫ్' సినిమా కంటే ముందు కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ఎవరికీ తెలియదంటూ ఆయన చేసిన కామెంట్స్ కన్నడ అభిమానులతో పాటు టాలీవుడ్‌లోనూ పెద్ద చర్చకు దారితీశాయి. అయితే ఈ సంచలన వివాదంలోకి వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఎంట్రీ ఇచ్చి అల్లు అరవింద్‌కు గట్టి మద్దతు తెలిపారు. అరవింద్ అన్న మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని జనాలు తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఆర్జీవీ విశ్లేషించారు. కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు, అద్భుతమైన కథలు నటీనటులను రాత్రికి రాత్రే గ్లోబల్ స్టార్లుగా నిలబెడతాయని ఆయన పేర్కొన్నారు. అరవింద్ చెప్పిన విశ్లేషణను సాధారణ కోణంలో చూడాలని, అందులో ఎలాంటి వివాదం లేదని వర్మ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆర్జీవీ కొన్ని ఆసక్తికర ఉదాహరణలను తెరపైకి తెచ్చారు. ‘బాహుబలి’ లాంటి వండర్ రాకముందు బాలీవుడ్ లేదా ఉత్తరాది ప్రేక్షకులకు ప్రభాస్ గురించి పెద్దగా తెలియదని, అలాగే ‘కాంతార’ సినిమా సంచలనం సృష్టించే వరకు రిషబ్ శెట్టి ఇమేజ్ పరిమితంగానే ఉందనే విషయాన్ని గుర్తుచేశారు. అదే క్రమంలో ‘కేజీఎఫ్’ విజయంతోనే యశ్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి చేరిందనే ఉద్దేశంతోనే అరవింద్ ఆ వ్యాఖ్యలు చేశారని వివరణ ఇచ్చారు. హాలీవుడ్ స్థాయి విశ్లేషణను జోడిస్తూ, మార్లన్ బ్రాండో నటించిన ‘గాడ్‌ఫాదర్’ లేదా క్రిస్టోఫర్ నోలన్ తీసే సినిమాల్లో నటుల ఇమేజ్ కంటే కథా బలమే ప్రధాన పాత్ర పోషిస్తుందని వర్మ అన్నారు. ఒక మంచి అభిప్రాయాన్ని సున్నితంగా చెప్పినప్పుడు దానిని అర్థం చేసుకోకుండా అహంకారంతో ఆలోచించే వారే వ్యక్తిగతంగా తీసుకుని వివాదాలు సృష్టిస్తారని ఘాటుగా విమర్శించారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కన్నడ వర్సెస్ టాలీవుడ్ తరహాలో ఫ్యాన్ వార్స్ నడుస్తున్న వేళ ఆర్జీవీ ఇచ్చిన ఈ వివరణ కొత్త చర్చకు తెరలేపింది. ఇండస్ట్రీలో ఒక నిజమైన సినిమా విశ్లేషకుడిగా అరవింద్ అభిప్రాయాన్ని సమర్థించడం సరైనదేనని కొంతమంది ఆర్జీవీ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ అంశం తీవ్రంగా వైరల్ అవుతోంది. కన్నడ సినీ అభిమానులు, నెటిజన్లు ఆర్జీవీ పోస్ట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండగా, సినిమా కంటెంట్ బలమే నటులకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తుందన్న పాయింట్‌తో ఆర్జీవీ ఏకీభవించడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ వివాదంపై రాకింగ్ స్టార్ యశ్ లేదా అల్లు అరవింద్ కాంపౌండ్ నుంచి అధికారికంగా మరేదైనా స్పందన వస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఏదేమైనా, పాన్ ఇండియా సినిమాల ప్రభావం నటీనటుల స్టార్‌డమ్‌పై ఎలా ఉంటుందనే విషయాన్ని ఈ వివాదం మరోసారి ఎత్తిచూపింది.       [Ram Gopal Varma, Allu Aravind Yash Controversy, RGV Supports Allu Aravind, KGF Yash Controversy, Telugu Cinema Gossip]
విజయనగర సామ్రాజ్యం అనగానే మనందరికీ గుర్తుకువచ్చే ఏకైక పేరు.. శ్రీకృష్ణదేవరాయలు. ఆ గొప్ప విజయనగర సామ్రాజ్య వైభవాన్ని, కృష్ణదేవరాయ రాజసాన్ని ఇప్పుడు మళ్ళీ బిగ్ స్క్రీన్ పై చూడబోతున్నాం. కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు, సినీ ప్రేమికులకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒక మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్ ఇచ్చింది. అదే 'దేవరాయ' (Devaraaya) సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్. సుప్రియన్వి పిక్చర్ స్టూడియోతో పీపుల్ మీడియా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కిచ్చా సుదీప్ శ్రీకృష్ణదేవరాయల పాత్రలో కనిపించబోతున్నారు. దేవరాయ పాత్రలో సుదీప్ రాయల్ లుక్, ఈ టైటిల్ గ్లింప్స్ సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టైటిల్ గ్లింప్స్ తోనే గూస్ బంప్స్ తెప్పించారని చెప్పొచ్చు. ప్రొడ్యూసర్స్ టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతిష్టాత్మకంగా ఈ విజువల్ స్పెక్టకిల్‌ని తెరకెక్కిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయ చరిత్ర, పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్ గ్రాండ్‌నెస్.. ఇవన్నీ చూస్తుంటే ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, బిగ్ స్క్రీన్ పై ఒక పీరియాడిక్ ఎపిక్ కాబోతోందని స్పష్టమవుతోంది. ఈ చిత్రానికి గౌరహరి అందిస్తున్న సంగీతం వింటేనే ఒక రేంజ్‌లో గూస్‌బంప్స్ వస్తున్నాయి. కిచ్చా సుదీప్ పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ నిర్మాణ విలువల కలయికలో రాబోతున్న ఈ 'దేవరాయ' విజువల్ వండర్ ని బిగ్ స్క్రీన్స్ పై చూడటానికి 2027 డిసెంబర్ వరకు వేచి చూడక తప్పదు. https://x.com/Theteluguone/status/2095044144825770169       [Kiccha Sudeep, Sri Krishna Devaraaya, Sri Krishnadevaraya, Devaraaya, People Media Factory, Telugu Film News, Telugu News]  
  థియేటర్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  పవర్ ప్యాకేజ్డ్ మూవీ 'పంజా' జోరు కొనసాగుతూ ఉంది.ఆ ఏరియా, ఈ ఏరియా అని కాకుండా ఆల్ ఏరియాస్ హౌస్ ఫుల్ బోర్డ్స్ తో దర్శనమిస్తున్నాయి.  నిన్న ప్రీమియర్స్ ప్రదర్శించడం, అవి కూడా ఫుల్ కావడం కూడా ఒక రికార్డు. డిజాస్టర్ మూవీకి ఈ స్థాయి క్రేజా అని  ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి.  అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన కేవలం 3 గంటల్లోనే హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో 150కి పైగా షోలు పూర్తిగా సోల్డ్ అవుట్ కావడం పవన్ మేనియాకు అద్దం పడుతోంది. నైజాం ఏరియాలో రీ రిలీజ్ మొదటి రోజే 1.2 కోట్ల షేర్ సాధించి ట్రేడ్ పండితులను సైతం షాక్‌కి గురిచేసింది. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 220కి పైగా స్క్రీన్‌లలో రిలీజవ్వగా   ప్రతి థియేటర్ వద్ద 100% ఆక్యుపెన్సీ నమోదు కావడం గమనార్హం. ఈ రీ-రిలీజ్ హంగామా కేవలం థియేటర్ల లోపలే కాదు, బైట కూడా జాతరను తలపిస్తోంది. అభిమానులు బ్యానర్లు, కటౌట్లు, పాలాభిషేకాలు మరియు బాణసంచా కాల్పులతో థియేటర్ కాంప్లెక్స్‌లను పండగ వాతావరణంగా మార్చేశారు. ‘పాప రాయుడు’ పవర్ ఫుల్ సీన్స్, ఇంటర్వెల్ ఫైట్ అండ్ మేజర్ క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ వస్తున్నప్పుడు థియేటర్లలో ఆడియెన్స్ చేస్తున్న విజిల్స్, కేకలతో హాల్స్ దద్దరిల్లుతున్నాయి. కాలం మారినా, ఏళ్లు గడిచినా 'జై' రోల్ లో పవన్ ప్రదర్శించిన రోల్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుందని చెప్పడానికి రీ రిలీజ్ ఒక  ఉదాహరణ. Also Read: 200 కోట్లకి చేరువలో:  మరో డివోషనల్ సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్  2011 డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్ల భారీ బడ్జెట్‌తో విడుదలైన ‘పంజా’, అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రూ. 28 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆశించిన స్థాయిలో వాణిజ్య విజయం సాధించలేకపోయింది. అయితే, కాలక్రమేణా ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా స్టైలిష్ విజువల్స్, యువన్ శంకర్ రాజా అందించిన ఐకానిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, శరత్ మారార్ - నీలిమ తిరుమలశెట్టి నిర్మాణం ఈ చిత్రానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోషించిన జైదేవ్ అలియాస్ ‘డెక్స్‌స్టర్’ పాత్రలో చూపించిన రాయల్టీ, కామ్ గ్యాంగ్‌స్టర్ షేడ్స్ అభిమానులను కట్టిపడేసాయి. హాలీవుడ్ కల్ట్ సిరీస్ ‘డెక్స్‌స్టర్’ స్ఫూర్తితో డిజైన్ చేసిన క్రూరమైన మరియు విచక్షణతో కూడిన పవర్ ఫుల్ ప్యాకేజ్ అభిమానులకు ఎప్పటికీ విసుగు తెప్పించలేదు.     [ Panjaa Re Release, Pawan Kalyan, pawan fans, Telugu Cinema, Telugu Cinema News, Tollywood]      
  మాస్ మహారాజ రవితేజ, నక్షత్ర, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్, హరిహర సుతుడు అయ్యప్ప ల 'ఇరుముడి' 200 కోట్ల రూపాయిలు చేరుకోవడానికి రెడీ అవుతుంది.  తాజాగా ఇరుముడి నుంచి సరికొత్త డివోషనల్ వీడియో సాంగ్ 'కార్తీక మాసం' విడుదలై అభిమానులని ప్రేక్షకులని ఎంతోగానో ఆకట్టుకుంటోంది. స్వామి అయ్యప్ప భక్తి పారవశ్యాన్ని, మండల దీక్షా నియమాలను ఎంతో లోతుగా ఆవిష్కరించిన ఈ పాట ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా ఉంది.  ఈ అద్భుతమైన గీతానికి దర్శకుడు శివ నిర్వాణ స్వయంగా సాహిత్యాన్ని అందించగా,  జి. వి. ప్రకాష్ కుమార్ తో కలిసి  శివ నిర్వాణ ఆలపించాడు 4 నిమిషాల 5 సెకన్ల నిడివితో ఉండగా   నేరుగా శబరిమల భక్తి లోకంలోకి తీసుకెళ్తుంది.  "ఇది మరి కార్తీక మాసం స్వామి... తలపై చన్నీళ్ల స్నానం కాని మనసే మరింత భద్రం స్వామి" అంటూ సాగే లిరిక్స్ దీక్షా ధారుల జీవితాన్ని, శారీరక కష్టాలను దాటి పొందే ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రతిబింబిస్తాయి. భక్తులు పడే తపన, చలిలో ఉదయాన్నే చేసే స్నానాలు, కటిక నేలపై పడుకునే నిరాడంబరమైన జీవనశైలిని చాలా సహజంగా ఈ పాటలో వర్ణించారు.  పాటలోని అతి ముఖ్యమైన అంతరార్థం ఏమిటంటే— "కనిపించని శత్రువు కాదు, యుద్ధం కాదీ మండల దీక్ష... నాతోటి నేనే చేసే యుద్ధమే ఈ దీక్ష". బయటి సమాజంతో లేదా శత్రువులతో చేసే పోరాటం కాదు మండల దీక్ష, మనలోని అహంకారాలు, ద్వేషాలు, కామక్రోధాలపై మనతో మనమే చేసే అంతర్యుద్ధం అనే గొప్ప సందేశాన్ని ఈ పాటకు శివ నిర్వాణ అందించారు.  అలాగే "నేను అంటే నువ్వే అంటూ స్వామి పదవి ఇచ్చావు... ద్వేషాల్ని దూరం చేసి వర్ణాన్ని ఒక్కటి చేసి" అని అయ్యప్ప దీక్షలోని సమభావనను ఎత్తిచూపారు. కులమతాల భేదం లేకుండా, చిన్నపెద్ద తారతమ్యం లేకుండా నల్లటి దుస్తులు ధరించి ప్రతి ఒక్కరినీ 'స్వామి' అని పిలుచుకునే ఆచారాన్ని అత్యంత భావోద్వేగంగా పాటలో చూపించారు. రవితేజ ఈ పాటలో అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపించిన తీరు, ఆయన చూపించిన హావభావాలు అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి.   Also read: అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ అయిన మమితా భైజు..ప్రాబ్లమ్ ఇదే  ఇప్పటికే విడుదలైన 'ఇరుముడి కట్టు... శబరిమల ఎక్కు', 'మల్లెపూల పల్లకీ', 'యాలాలో యాలాలో సాంగ్స్ యూ ట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుకెళ్తున్న విషయం తెలిసిందే.     [irmudi, Raviteja, Karthika Maasam Song, Shiva Nirvana, Telugu Cinema, Telugu Cinema News, Tollywood ]    
Kiccha Sudeep’s next, Billa Ranga Baasha: First Blood, has finally offered a glimpse of the world that Anup Bhandari is creating. The first look, unveiled on Sudeep’s birthday, presents the actor in a rugged avatar riding a motorcycle across a frozen battlefield, with a giant mechanical war machine and aircraft occupying the backdrop. The visual immediately suggests that BRB First Blood is aiming for something far removed from a conventional action film. The combination of snow-covered terrain, futuristic machinery and large-scale warfare points towards a stylised world where technology and adventure appear to be central to the narrative. Sudeep himself gets a distinctly rugged makeover, with a fur-lined costume and an intense expression that fit the harsh surroundings. However, the poster deliberately keeps the character’s identity and the actual conflict under wraps. That mystery is likely to remain one of the film’s biggest talking points as the promotional campaign progresses. The project reunites Sudeep with Anup Bhandari after their earlier collaboration Vikrant Rona, making the scale and ambition of their second outing particularly interesting. K Niranjan Reddy and Chaitanya Reddy are producing the film, with PrimeShow Entertainment backing the project. The makers are planning a long promotional runway, with the teaser expected in the first quarter of 2027, followed by the trailer in the third quarter. Billa Ranga Baasha: First Blood is targeting a worldwide theatrical release in the final quarter of 2027 across the South Indian languages and Hindi. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన మూలికా సంపదలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో మాత్రమే లభించే  పహాడీ వెల్లుల్లి  లేదా  హిమాలయన్ సింగిల్ క్లోవ్ గార్లిక్  ఎంతో ప్రత్యేకమైనది. దీనిని సాధారణంగా కశ్మీరీ వెల్లుల్లి అని కూడా పిలుస్తారు. సాధారణంగా మనం వంటల్లో వాడే వెల్లుల్లి పాయల కంటే ఇది పరిమాణంలో చిన్నగా, ఒకే ఒక్క పాయగా (Single Clove) గుండ్రంగా ఉంటుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, మన సాధారణ వెల్లుల్లితో పోలిస్తే ఈ పహాడీ వెల్లుల్లిలో దాదాపు 7 రెట్లు అధికంగా పోషకాలు మరియు ఔషధ గుణాలు దాగి ఉంటాయని ఆయుర్వేద నిపుణులు మరియు శతాబ్దాల వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. హిమాలయాలలోని స్వచ్ఛమైన వాతావరణం, మంచు నీరు మరియు ప్రత్యేకమైన నేల స్వభావం దీనికి అపరిమితమైన శక్తిని అందిస్తాయి. పహాడీ వెల్లుల్లిలో అత్యధిక గాఢత కలిగిన  అల్లిసిన్  (Allicin) అనే అద్భుతమైన ఆర్గానోసల్ఫర్ సమ్మేళనం ఉంటుంది. సాధారణ వెల్లుల్లి కంటే ఇందులో 300 శాతం ఎక్కువ అల్లిసిన్ నిల్వలు ఉంటాయి, ఇది మన శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. దీనితో పాటు పహాడీ వెల్లుల్లిలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, ఐరన్, కాపర్, మాంగనీస్, విటమిన్ బి6 మరియు విటమిన్ సీ పుష్కలంగా లభిస్తాయి. రోజుకు కేవలం 2 నుండి 3 పహాడీ వెల్లుల్లి పాయలను పరగడుపున నమిలి తింటే, శరీరంలో రోగనిరోధక శక్తి దాదాపు 50 శాతం వరకు పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది శరీరంలో ఉండే有害 ఉచిత రాడికల్స్ (Free Radicals) ను నిరోధించి కణాల క్షీణతను 40 శాతం వరకు అడ్డుకుంటుంది. హృదయ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి పహాడీ వెల్లుల్లి ఒక వరప్రసాదం లాంటిది. ఇది రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించి, రక్త ప్రసరణను 35 శాతం వరకు మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా పహాడీ వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (LDL) మరియు ట్రైగ్లిజరైడ్ల స్థాయిలు 20 శాతం నుండి 25 శాతం వరకు తగ్గుతాయి. అంతేకాకుండా అధిక రక్తపోటు (High Blood Pressure)ను నియంత్రించడంలో ఇది 90 శాతం సమర్థవంతంగా పనిచేస్తుంది. రక్తనాళాలను రిలాక్స్ చేసి, బ్లడ్ క్లాట్స్ (రక్తపు గడ్డలు) ఏర్పడే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.       how to use pahadi garlic daily,pahadi garlic vs normal garlic benefits.
      చర్మంపై అకస్మాత్తుగా కనిపించే చిన్నచిన్న పులిపిర్లు (Warts) చాలామందిని వేధించే ప్రధాన సౌందర్య మరియు ఆరోగ్య సమస్య. ఇవి ముఖం, మెడ, చేతులు, కాళ్లపై ఏర్పడి చర్మ సౌందర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా కొన్నిసార్లు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తాయి. సాధారణంగా ఇవి హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) అనే ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. చాలామంది వీటిని తగ్గించుకోవడానికి పార్లర్లు, క్లినిక్‌ల చుట్టూ తిరుగుతూ వేలాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అయితే మన వంటింట్లోనే దొరికే ఒక చిన్న చిటికెడు పసుపుతో ఎటువంటి నొప్పి లేకుండా, సహజ సిద్ధంగా ఈ పులిపిర్లను తొలగించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు మరియు చర్మ వైద్యులు సూచిస్తున్నారు. పసుపులో  కర్కుమిన్ (Curcumin) అనే అత్యంత శక్తివంతమైన జీవక్రియ సంబంధిత సమ్మేళనం ఉంటుంది. ఇది అద్భుతమైన యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. కర్కుమిన్ వైరస్‌ల పెరుగుదలను సమర్థవంతంగా నిరోధించి, చర్మ కణాలను పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అధ్యయనాల ప్రకారం పసుపును క్రమంగా ఉపయోగించడం వల్ల దాదాపు 70 శాతం నుండి 80 శాతం వరకు పులిపిర్ల సమస్య నయమవుతుంది. పసుపులోని సహజ ఎక్స్‌ఫోలియేటింగ్ గుణాలు పులిపిరు కణజాలాన్ని నెమ్మదిగా ఎండబెట్టి, చర్మం నుండి విడిపోయేలా చేస్తాయి. ఈ సహజ వైద్యం కోసం పసుపును ఉపయోగించడం చాలా సులభం. ఒక చిన్న గిన్నెలో అర స్పూన్ పసుపు పొడిని తీసుకుని, దానికి కొన్ని చుక్కల ఆవనూనె లేదా వెజిటబుల్ ఆయిల్ కలిపి చిక్కటి పేస్ట్‌లా తయారు చేయాలి. ఆవనూనెలో ఉండే విటమిన్ ఇ మరియు పసుపులోని యాంటీ వైరల్ గుణాలు కలిపి వేగవంతమైన ఫలితాలను ఇస్తాయి. ఈ పేస్ట్‌ను పులిపిరి ఉన్న ప్రాంతంలో మాత్రమే ఖచ్చితంగా అప్లై చేసి, దానిపై ఒక కాటన్ బ్యాండేజ్ లేదా ప్లాస్టర్ వేసి రాత్రంతా ఉంచాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు క్రమం తప్పకుండా 2 నుండి 3 వారాల పాటు చేస్తే పులిపిరు పరిమాణం 50 శాతం వరకు తగ్గి, క్రమంగా రాలిపోతుంది.       How to remove warts with turmeric, painless home remedies for warts.
మన వంటింట్లో లభించే సుగంధ ద్రవ్యాలలో పసుపుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. శతాబ్దాలుగా మన సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో పసుపును ఒక దివ్యౌషధంగా ఉపయోగిస్తున్నారు. సాధారణంగా మనం ప్రతిరోజూ వంటల్లో పసుపు పొడిని ఉపయోగిస్తుంటాం. అయితే మార్కెట్‌లో లభించే పసుపు పొడి కంటే పచ్చి పసుపు కొమ్ముల్లో 30 శాతం నుండి 50 శాతం వరకు అధికంగా ఔషధ గుణాలు, పోషకాలు దాగి ఉంటాయని వైద్య నిపుణులు మరియు ఇటీవలి పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. పసుపును ప్రాసెస్ చేసి పొడిగా మార్చే క్రమంలో అందులో ఉండే సహజ నూనెలు, సువాసన మరియు కీలక పోషకాలు కొంతవరకు నశిస్తాయి. కానీ పచ్చి పసుపును నేరుగా తీసుకోవడం వల్ల శరీరానికి లభించే ప్రయోజనాలు అపారం. పచ్చి పసుపులో  కర్కుమిన్  (Curcumin) అనే శక్తివంతమైన జీవక్రియ సంబంధిత సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. పచ్చి పసుపులో 3 శాతం నుండి 5 శాతం వరకు అధిక గాఢత కలిగిన కర్కుమిన్ లభిస్తుంది, ఇది శరీరంలో వాపును తగ్గించడంలో మరియు కణజాలాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనికి తోడు పచ్చి పసుపులో శరీరానికి అవసరమైన ఫైబర్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ సి, విటమిన్ బి6 మరియు ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున 2 నుండి 3 గ్రాముల పచ్చి పసుపు ముక్కను నమిలి తినడం లేదా దాని రసాన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ దాదాపు 40 శాతం వరకు బలపడుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో పచ్చి పసుపును మించిన ఔషధం లేదు. దీనిలోని  జింజరాల్  (Gingerol) సమ్మేళనం మరియు సహజ ఫైబర్ జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచి, పేగుల కదలికలను వేగవంతం చేస్తాయి. భోజనానికి ముందు చిన్న పచ్చి పసుపు ముక్కను తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి మరియు యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు 70 శాతం వరకు తగ్గుతాయి. అంతేకాకుండా, పచ్చి పసుపు కాలేయంలో ఉండే టాక్సిన్లను తొలగించి, లివర్ ఫంక్షన్‌ను 25 శాతం వేగవంతం చేసే సహజ డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, ఇన్సులిన్ నిరోధకతను నియంత్రించడంలో కూడా ఎంతగానో తోడ్పడుతుంది.       how to use raw turmeric daily, curcumin benefits of fresh turmeric.
ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ అంటారు, కానీ నేటి వేగవంతమైన జీవనశైలిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. చాలామంది ఆరోగ్యం అంటే కేవలం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లేదా కఠినమైన ఆహార నియమాలు పాటించడమే అని అనుకుంటారు. కానీ నిజమైన ఆరోగ్యం మన రోజువారీ అలవాట్లలోనే దాగి ఉంటుంది. చిన్న చిన్న మార్పులు మన జీవితంలో ఊహించని పెద్ద సానుకూల ఫలితాలను తీసుకోస్తాయి. మన జీవితాన్ని సంపూర్ణంగా, ఆరోగ్యకరంగా మార్చే కొన్ని ముఖ్యమైన అలవాట్లు , ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నిజాల గురించి  వివరంగా తెలుసుకుంటే... ఉదయాన్నే నీరు..  ఉదయాన్నే పరగడుపున నీరు తాగడం చాలా ప్రభావవంతమైన అలవాటు. రాత్రంతా మన శరీరం విశ్రాంతిలో ఉన్నప్పుడు అనేక జీవక్రియలు జరుగుతాయి. ఉదయం లేవగానే ఒక లీటరు వరకు గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్ళిపోతాయి. ఇది జీర్ణవ్యవస్థను ఉత్తేజపరచడమే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. రోజంతా కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల నీరు తాగడం వల్ల డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉండవచ్చు.  పోషకాహారం.. మన శరీరం మనం తినే ఆహారాన్ని బట్టే పనిచేస్తుంది. జంక్ ఫుడ్, వేపుళ్లు, అధిక పంచదార ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, నట్స్ , మొలకెత్తిన విత్తనాలు భాగం చేసుకోవాలి. మనం తినే ఆహారంలో పీచు పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్లు సరిపడా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఆహారం తినేటప్పుడు ప్రశాంతంగా, నమిలి తినడం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది.  క్రమం తప్పకుండా శారీరక శ్రమ, వ్యాయామం.. గంటల తరబడి జిమ్ లో కష్టపడాల్సిన అవసరం లేదు. రోజువారీ జీవితంలో కనీసం 30 నుండి 45 నిమిషాల పాటు వేగంగా నడవడం, యోగా చేయడం, ఈత కొట్టడం లేదా సైక్లింగ్ చేయడం వంటివి సరిపోతాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది, రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది, ఎముకలు , కండరాలు బలంగా మారతాయి. వ్యాయామం వల్ల శరీరంలో ఎండోర్ఫిన్లు అనే హార్మోన్లు విడుదలవుతాయి, ఇవి మన మానసిక ఒత్తిడిని తగ్గించి రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. నిద్ర.. మంచి నిద్ర చాలా ముఖ్యమైన అలవాటు. నేటి డిజిటల్ యుగంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సరిగ్గా నిద్రపోకపోవడం. రాత్రి వేళల్లో కనీసం 7 నుండి 8 గంటల ప్రశాంతమైన నిద్ర శరీరానికి చాలా అవసరం. నిద్రపోయే సమయంలోనే మన శరీరం తనను తాను రీఛార్జ్ చేసుకుంటుంది, కణాల మరమ్మత్తు జరుగుతుంది. రాత్రి పడుకోవడానికి ఒక గంట ముందు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు పక్కన పెట్టడం మంచిది. సరిపడా నిద్ర లేకపోతే ఉబకాయం, మధుమేహం, గుండె జబ్బులు , మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మానసిక ఆరోగ్యం..  శరీరం ఎంత ఆరోగ్యంగా ఉన్నా, మనస్సు ప్రశాంతంగా లేకపోతే పూర్తి ఆరోగ్యం లభించదు. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం 10 నుండి 15 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి నచ్చిన పనులు చేయడం, సంగీతం వినడం, పుస్తకాలు చదవడం లేదా ప్రకృతితో సమయం గడపడం వంటివి చేయాలి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటూ, సానుకూల ధోరణిని పెంపొందించుకోవడం వల్ల జీవన నాణ్యత పెరుగుతుంది. చివరగా.. ధూమపానం, మధ్యపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఇవి శరీరంలోని అవయవాలను లోపలి నుండి బలహీనపరుస్తాయి. అలాగే ఏటా లేదా ఆరు నెలలకోసారి సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యాధులను ప్రారంభంలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఈ ఆరోగ్యకరమైన అలవాట్లను ఒకే రోజులో సాధించడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రతిరోజూ ఒక్కో చిన్న మార్పు చేసుకుంటూ పోతే, కొద్ది రోజుల్లోనే ఇవి మన జీవనశైలిలో భాగమైపోతాయి. ఆరోగ్యకరమైన జీవితం అనేది ఒక రోజులో వచ్చేది కాదు, అది మనం ప్రతిరోజూ చేసుకునే ఎంపికలపై ఆధారపడి ఉంటుంది.                        *రూపశ్రీ.  
పిల్లలకు అంజీర్ ఇస్తున్నారా.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! అంజీర్ పండు (Fig Fruit) ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందించే పండు. తాజా అంజీర్ అయినా, ఎండిన అంజీర్ అయినా సరైన పద్ధతిలో తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. రక్త ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, జీర్ణవ్యవస్థతో పాటు పిల్లల ఎదుగుదలకు కూడా అంజీర్ ఉపయోగకరంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే Fresh Figs, Dried Figsలో ఏది మంచిది? అంజీర్‌ను ప్రతిరోజూ ఎలా తినాలి? ఎండిన అంజీర్‌ను నేరుగా తినవచ్చా? డ్రై రోస్ట్ చేస్తే ఏమవుతుంది? వంటి విషయాలు చాలామందికి తెలియవు. ఈ వీడియోలో సీనియర్ ఆయుర్వేద వైద్య నిపుణురాలు డాక్టర్ శిరీష అంజీర్ పండును తీసుకునే సరైన విధానం, తాజా అంజీర్ మరియు ఎండిన అంజీర్ మధ్య తేడాలు, ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు, పిల్లల ఎదుగుదలలో దాని ప్రాధాన్యత వంటి విషయాలను సులభంగా వివరిస్తున్నారు. అంజీర్‌ను ఆహారంలో ఎలా చేర్చుకోవాలి? ఎవరు ఎలా తీసుకోవాలి? ఎందుకు డ్రై రోస్ట్ చేయకూడదు? అనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి పూర్తి వీడియోను చూడండి. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా ఆహారం తీసుకునే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
భారతీయ సాంప్రదాయ వైద్య విధానమైన ఆయుర్వేదంలో పిప్పళ్లకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. నల్లగా, చిన్న పొడుగు ఆకారంలో ఉండే ఈ పిప్పళ్లు కేవలం వంటగదిలోని దినుసు మాత్రమే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న దివ్యౌషధం. శతాబ్దాల నుంచి మన పెద్దలు, ఆయుర్వేద నిపుణులు రకరకాల ఆరోగ్య సమస్యల నివారణకు పిప్పళ్లను ప్రధానంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. పిప్పళ్లు చేసే మేలు.. పిప్పళ్లలో ఉండే కెమికల్ కాంపౌండ్ పైపరీన్ శరీరంలో జీవక్రియలను వేగవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి పిప్పళ్లు చేసే మేలు అపారం. జలుబు, దగ్గు, ఉబ్బసం, గొంతు నొప్పి, ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి పిప్పళ్లు తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి. పిప్పళ్ల పొడిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం సులభంగా బయటకు వచ్చేస్తుంది. పిప్పళ్ల గురించి ఆయుర్వేదం ఏం చెబుతుంది? ఆయుర్వేదంలో పిప్పళ్లను రసాయన మూలికగా వర్గీకరించారు. అంటే ఇవి శరీరానికి పునరుజ్జీవనాన్ని అందిస్తాయి. ఆయుర్వేదంలో దీనిని త్రిదోషాలలో ప్రధానమైన కఫ, వాత దోషాలను సమతుల్యం చేయడానికి ఉపయోగిస్తారు. శరీరంలో జఠరాగ్నిని అంటే జీర్ణశక్తిని రగిల్చే గుణం పిప్పళ్లకు ఉంది. తిన్న ఆహారం సరిగ్గా అరగకపోయే సమస్యను, ఆకలి మందగించడాన్ని ఇది నివారిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ లేదా విష పదార్థాలను బయటకు పంపడంలో ఆయుర్వేద వైద్యంలో పిప్పళ్లను క్రియాశీలకంగా ఉపయోగిస్తారు. పిప్పళ్ల వల్ల కలిగే మరికొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే.. జీర్ణ వ్యవస్థ మెరుగుపడటం..  గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను పిప్పళ్లు త్వరితగతిన నివారిస్తాయి. జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి ఆహారం వేగంగా అరిగేలా చేస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుదల..  యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబియల్ గుణాలు సమృద్ధిగా ఉండటం వల్ల ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. తరచూ వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. బరువు నియంత్రణ..  శరీరంలో జీవక్రియల వేగాన్ని పెంచి, చెడు కొవ్వును కరిగించడంలో పిప్పళ్లు ఎంతో సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి సహజ నివారణి. నొప్పులు , వాపుల నివారణ..  పిప్పళ్లలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, వాతపు నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాలేయ ఆరోగ్యం.. కాలేయంలోని వ్యర్థాలను తొలగించి, కాలేయం సరిగ్గా పనిచేయడానికి పిప్పళ్లు తోడ్పడతాయి. పిప్పళ్లను నిత్య జీవితంలో తగిన మోతాదులో వాడటం వల్ల అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అయితే ఇవి శరీరంలో వేడిని పెంచే గుణం కలిగి ఉంటాయి కాబట్టి, పిత్త ప్రకృతి ఉన్నవారు లేదా గర్భిణులు ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవడం మంచిది.                        *రూపశ్రీ.