LATEST NEWS
  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన దశకు చేరుకున్నాయి. గత కొంతకాలంగా రాష్ట్రంలో ప్రధాన రాజకీయ శక్తులైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP), తెలుగుదేశం పార్టీ (TDP), మరియు జనసేన పార్టీల చుట్టూనే ప్రాంతీయ రాజకీయం తిరుగుతోంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం రాష్ట్ర స్థాయి వ్యూహాలే కాకుండా, ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న జాతీయ స్థాయి సమీకరణాలు కూడా ఏపీ రాజకీయాలను శాసిస్తున్నాయి. ఈ అంశాలపై  తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన ‘తెలుగువన్ వాస్తవ వేదిక’లో ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ తన అభిప్రాయలు వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటనలు, కేంద్ర పెద్దలతో జరుపుతున్న చర్చలు ప్రాంతీయ రాజకీయాల్లో ఒక సరికొత్త చర్చకు తెరలేపాయి. జాతీయ పార్టీల అండదండలతో రాష్ట్రంలో పట్టు సాధించాలనే వ్యూహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు, అధికార, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు ఏపీ రాజకీయ వాతావరణాన్ని నిరంతరం వేడెక్కిస్తోంది. రాజకీయ వ్యూహాలు మరియు అంతరార్థాలు ప్రస్తుత రాజకీయ వ్యూహాలను పరిశీలిస్తే, ప్రతి ప్రధాన పార్టీ కూడా భిన్నమైన పంథాను అనుసరిస్తోంది. అధికారంలో ఉన్న పక్షం తమ సంక్షేమ పథకాలు మరియు ప్యాలెస్ రాజకీయాలకే పరిమితమవుతోందనే విమర్శలు వ్యూహాత్మకంగా వినిపిస్తున్నాయి. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ, ప్రత్యామ్నాయం లేదనే ధీమాతో అధికార పక్షం ముందడుగు వేస్తోంది. దీనికి భిన్నంగా, ప్రతిపక్ష టిడిపి కేవలం అధికార పార్టీ వైఫల్యాలను, ప్రజల్లో ఉన్న భయాన్ని పెట్టుబడిగా మార్చుకుని మళ్లీ పట్టు సాధించాలని చూస్తోంది. ఇరు పార్టీలు కూడా ప్రజా సమస్యల కంటే పరస్పర రాజకీయ లబ్ధికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక జనసేన విషయానికి వస్తే, జాతీయ స్థాయిలో తమ ఉనికిని చాటుకుంటూ, కేంద్రంలోని బీజేపీ అండతో రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఈ రాజకీయ పరిణామాలు రాష్ట్ర పాలనపై, ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రధాన పార్టీల వ్యూహాలు కేవలం ఎన్నికల గెలుపోటములపైనే కేంద్రీకృతమవడంతో, దీర్ఘకాలిక రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి కుంటుపడుతున్నాయి. ఢిల్లీ పెద్దల గ్రీన్ సిగ్నల్స్ మరియు అంతర్గత ఒప్పందాల చుట్టూనే రాష్ట్ర రాజకీయ చక్రం తిరుగుతుండటం వల్ల ప్రాంతీయ స్వయంప్రతిపత్తి బలహీనపడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజలు ఒక పార్టీపై ఉన్న అసంతృప్తితో మరో పార్టీని ఎన్నుకోవడం మినహా, ఆశించిన మేర మార్పును చూడలేకపోతున్నారు. ఫలితంగా, రాజకీయ పార్టీల అంచనాలకు, ప్రజల వాస్తవ అవసరాలకు మధ్య పెద్ద కందకం ఏర్పడింది. భవిష్యత్తు రాజకీయ ప్రభావం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఇరు ప్రధాన పార్టీల వైఖరి పట్ల ప్రజల్లో వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. ఈ రెండు సాంప్రదాయ రాజకీయ శక్తుల మధ్య నలిగిపోతున్న ఓటర్లు, ప్రత్యామ్నాయంగా నిలిచే మూడో శక్తి కోసం ఎదురుచూస్తున్నారు. రాజకీయాల్లో ఏర్పడే ఈ శూన్యతను భర్తీ చేయడానికి సరైన నాయకత్వం లేదా సరికొత్త కూటమి ముందుకు వస్తే, ప్రజలు వారిని బలంగా ఆదరించే అవకాశం ఉంది. భవిష్యత్తులో కేవలం ప్రాంతీయ సెంటిమెంట్లు మాత్రమే కాకుండా, కేంద్ర మార్గదర్శకత్వం మరియు సరికొత్త సంకీర్ణ సమీకరణాలు రాష్ట్ర రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి. పాత తరం రాజకీయాల నుంచి ఏపీ ఓటరు కొత్త తరం, పారదర్శక రాజకీయాల వైపు అడుగులు వేసే రోజులు ఎంతో దూరంలో లేవు.మరిన్ని అంశాలపై కంఠంనేని రవిశంకర్ – డోలేంద్ర ప్రసాద్ మధ్య జరిగిన పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించవచ్చు.  
గత ప్రభుత్వ హయాంలో పర్యావరణ నిబంధనలను బేఖాతరు చేస్తూ..  సుమారు 452 కోట్ల రూపాయల భారీ ప్రజాధనంతో విశాఖలోని ఋషికొండపై నిర్మించిన విలాసవంతమైన ప్యాలెస్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తెల్ల ఏనుగులా మారింది. ఈ భవనం వల్ల పైసా ఆదాయం రాకపోగా..  కేవలం దాని మెయింటెనెన్స్,  కరెంట్ బిల్లుల కోసమే నెలకు పాతిక లక్షల రూపాయల చొప్పున కూటమి ప్రభుత్వం ప్రజాధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది. అధికారం చేపట్టి రెండేళ్లు దాటినా ఈ ప్యాలెస్‌ను ఏ విధంగా ఉపయోగించుకోవాలో తేల్చలేక ప్రభుత్వం తలలు పట్టుకుంటోంది. ఈ ప్యాలెస్ కథ, దాని వెనుక ఉన్న అక్రమాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అంకంరావు గారి తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. మాట్లాడుతూ..  ఈ భవనాన్ని అలాగే వదిలేయడం వల్ల ఇప్పటివరకు   6 కోట్ల రూపాయల ప్రజాధనం బుడిదలో పోసిన పన్నీరైందన్నారు.  వైసీపీ ప్రభుత్వ హయాంలో   ఈ నిర్మాణాన్ని పర్యాటకుల కోసమని, రాష్ట్రపతి లేదా కేంద్ర పెద్దలు వచ్చినప్పుడు విడిది చేయడానికి నిర్మిస్తున్నామని కోర్టులకు సైతం తప్పుడు సమాచారం ఇచ్చిందన్న ఆయన..  వాస్తవానికి మాజీ ముఖ్యమంత్రి   జగన్ మోహన్ రెడ్డి తన సొంత నివాసం కోసం, విశాఖ నుండి పరిపాలన సాగించడం కోసమే దీన్ని అత్యంత విలాసవంతంగా నిర్మించుకున్నారనేది బహిరంగ రహస్యమన్నారు.  ఇందులో ఏర్పాటు చేసిన లగ్జరీ బాత్‌టబ్‌లు, సముద్ర  అందాలు చూసేలా డిజైన్ చేసిన స్నానాల గదులు, ప్రత్యేక మసాజ్ రూమ్‌లు, కోట్ల విలువైన షాండ్లియర్స్ ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పారు.  ఈ ప్యాలెస్‌ను ప్రైవేట్ వ్యక్తులకు,  లగ్జరీ హోటల్స్ నిర్వాహకులకు లీజుకు ఇద్దామన్నా అనేక సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇది కేవలం ఒక వ్యక్తి నివాసానికి సరిపోయేలా భారీ మీటింగ్ హాళ్లు, కేవలం 20 గదులతో నిర్మితమవడంతో వాణిజ్యపరంగా రన్ చేయడం కష్టంగా మారిందనీ,  ప్రముఖ హోటల్ సంస్థలు దీనిపై ఆసక్తి చూపించినప్పటికీ, వారు హోటల్‌గా మార్చడానికి అదనపు నిర్మాణాలు మరియు పక్కనే ఉన్న సిఆర్జెడ్  పరిధిలోని 7 ఎకరాల భూమిని అడుగుతున్నారు. వీటికి కేంద్ర పర్యావరణ అనుమతులు రావడం అంత సులువు కాదు.  ప్రభుత్వం దీనిపై నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పటికి పలుమార్లు సమావేశమైనా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేకపోయింది.  ప్రైవేట్ సంస్థలకు అప్పగించడానికి కాలయాపన చేయకుండా, ప్రభుత్వమే నేరుగా టూరిజం రిసార్ట్స్‌గా మార్చాలి. విశాఖకు వచ్చే అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు, గూగుల్ వంటి సంస్థల సమావేశాల కోసం ఈ 20 గదులను, మీటింగ్ హాళ్లను రోజువారీ అద్దె ప్రాతిపదికన కేటాయిస్తే నెలకు కనీసం 30 లక్షల రూపాయల వరకు ఆదాయం సమకూరుతుందని, తద్వారా నిర్వహణ భారం తప్పుతుందన్నారు. ఈ భవన నిర్మాణానికి అక్రమంగా అనుమతులు ఇచ్చిన వారిపై, కోర్టులను తప్పుదోవ పట్టించిన అధికారులపై కూటమి ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజాధనాన్ని వృథా చేయకుండా త్వరితగతిన దీనిపై ఒక స్పష్టమైన పాలసీని తీసుకురావాలని అంకంరావు అన్నారు.   
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో వైసీపీ, కూటమి నాయకుల మధ్య రాజకీయ యుద్ధం   ముదిరింది. వైసీపి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి లక్ష్యంగా తెలుగుదేశం కూటమి నాయకుడు నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల జరిగిన మత్స్యకార సొసైటీ ఎన్నికల వివాదం, కిడ్నాప్ ఆరోపణల నేపథ్యంలో అనపర్తి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలో తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో   నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి.. సత్తి సూర్యనారాయణ రెడ్డిపై విమర్శల జడివాన కురిపించారు.  సూర్యనారాయణ రెడ్డికి సొంతంగా మాట్లాడే శక్తి లేదని, చేతిలో స్క్రిప్ట్ ఉంటే తప్ప ఆయన ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడలేరని ఎద్దేవా చేశారు. ఆయన ప్రవర్తనను సినీ నటుడు బ్రహ్మానందం హావభావాలతో పోలుస్తూ  వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవల పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన వివాదాన్ని ప్రస్తావిస్తూ.. వైసీపి నేతలు జక్కంపూడి రాజా, జగ్గిరెడ్డి వంటి వారు అక్కడ గొడవ పడుతుంటే, సూర్యనారాయణ రెడ్డి మాత్రం ఏం చేయాలో తెలియక బిత్తరచూపులు చూస్తూ నిలబడ్డారని నల్లమిల్లి విమర్శించారు. వైసీపి నేతలు కొందరు హీరోలు అవ్వాలని చూసి, చివరికి సూర్యనారాయణ రెడ్డిని జీరోను చేశారని చురకలు అంటించారు. ఈ వివాదానికి కారణమైన మత్స్యకార సొసైటీ ఎన్నికల గురించి నల్లమిల్లి క్లియర్ కట్ వివరణ ఇచ్చారు. మార్చి 5న తాము శాసనసభ సమావేశాల్లో ఉండగా ఈ గొడవ జరిగిందని, తాము ఎవరినీ కిడ్నాప్ చేయలేదని స్పష్టం చేశారు. వైసీపి నాయకులే ఓటర్లను కిడ్నాప్ చేసి, ఆ కేసును డైవర్ట్ చేయడానికి పోలీసులపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. చివరికి ఈ కిడ్నాప్ కేసును కోర్టు పరిశీలించి నిందితులకు రిమాండ్ విధించిందని, దాంతో వైసీపి నేతల నోర్లు మూతపడ్డాయని నల్లమిల్లి గుర్తు చేశారు. సూర్యనారాయణ రెడ్డి బయటకు సౌమ్యుడిగా కనిపిస్తారనే వాదనను ఆయన కొట్టిపారేశారు. మైక్ లేకపోతే ఆయన మాట్లాడే భాష దారుణంగా ఉంటుందని, పచ్చి బూతులు మాట్లాడతారని నల్లమిల్లి అన్నారు.   వైసీపి ప్రభుత్వ హయాంలో తనపై 39 తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారని, కూటమి కార్యకర్తలపై 151 కేసులు పెట్టి వేధించారని నల్లమిల్లి ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యనారాయణ రెడ్డి హయాంలో జరిగిన భూసేకరణ అవినీతిపై ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిందని, దాదాపు 15 కోట్ల రూపాయల అక్రమాలు ప్రూవ్ అయ్యాయని వెల్లడించారు. త్వరలోనే ఈ భూసేకరణ అక్రమాలకు సంబంధించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని, ఐఏఎస్ అధికారులతో పాటు రాజకీయ నాయకుల పేర్లు కూడా విజిలెన్స్ నివేదికలో ఉన్నాయని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే గత ప్రభుత్వం వేసిన మూడు విజిలెన్స్ ఎంక్వైరీల్లోనూ క్లీన్ చిట్‌తో బయటపడ్డామని నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి చెప్పారు. 
  తమిళ రాజకీయాల్లో డీఎంకే చిరకాల మిత్రుడు ఎండీఎంకే అధ్యక్షుడు వైకో తాజాగా స్టాలిన్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. వైకో టీవీకే అధినేత, సీఎం విజయ్‌ను కలవడం, విజయ్ నాయకత్వంపై ప్రశంసులు కురిపించడం తమిళనాడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రానున్న ఎన్నికల్లో టీవీకే మరింత అద్భుత ఫలితాలు సాధిస్తుందని వైకో వ్యాఖ్యానించడం స్టాలిన్ శిబిరంలో కలకలం రేపుతోంది. తాజాగా వైకో, విజయ్ భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో విజయ్ మ్యాజిక్ చేసే అవకాశముందని వైకో అభిప్రాయపడటం ప్రాధాన్యత సంతరించుకుంది.  1994లో డీఎంకే  నుంచి విడిపోయి ఎండీఎంకే స్థాపించిన వైకో, ఇటీవల ఎన్నికల్లో డీఎంకే కూటమి సెక్కులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్‌తో కలిసి నాలుగు స్థానాల్లో పోటీ చేశారు. రెండో స్థానాల్లో ఎండీఎంకే అభ్యర్ధులు గెలిచారు. అయితే కొంతకాలంగా ఎండీఎంకే నేతల వైఖరిలో మార్పు కనిపిస్తోంది. వైకో కుమారుడు ఎండీఎంకే కీలక నేత దురై వైకో ఇటీవల టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు. వైకో వంటి సీనియర్ ద్రవిడ నాయకుడు విజయ్‌ని బహిరంగంగా ప్రశంసించడంతో రాజకీయ వర్గాలు విస్తుపోతున్నాయి. ప్రస్తుతం వైకో డీఎంకే కూటమిలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ఆయన స్టాండ్ ఎలా ఉండబోతుందన్న దానిపై చర్చ జరుగుతోంది. ఎండీఎంకే నిజంగానే డీఎంకే కూటమిని వీడి టీవీకేతో జతకడితే, అది స్టాలిన్‌కు రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బే అంటున్నారు. విజయ్‌కి ద్రవిడ రాజకీయాల్లో మైలేజ్ మరింత పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏసీ రూముల్లో కూర్చుని సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేయడం కాదు..  ధైర్యముంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి నేరుగా చర్చకు రావాలని  సవాల్ విసిరారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఉద్యోగాల భర్తీపై బహిరంగ చర్చకు తాను ఎప్పుడైనా సిద్ధమేనని లోకేష్ స్పష్టం చేశారు. గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో నిరుద్యోగులను ఘోరంగా వంచించిందని లోకేష్ ధ్వజమెత్తారు. తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పారదర్శకంగా మెగా డీఎస్సీ ప్రక్రియను చేపట్టి 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అడుగులు వేసిందని గుర్తుచేశారు. ఈ భర్తీ ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రతిపక్ష నేతలు 240కి పైగా కోర్టు కేసులు వేసి కుట్రలు పన్నారని ఆరోపించారు. కోర్టులు ఆ కేసులను కొట్టివేసినా..  ఇంకా బురదజల్లేందుకే వైకాపా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. త్వరలోనే మళ్లీ టెట్, డీఎస్సీ పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులకు నమ్మకం ప్రకటించారు. రాష్ట్ర హోంమంత్రి అనితపై వైసీపీ నేతలు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలను లోకేష్ తీవ్రంగా ఖండించారు. మహిళల పట్ల వైకాపా నేతలకు ఉన్న సంస్కృతి ఇదేనా అని ప్రశ్నించారు. ఒక హోంమంత్రి అని కూడా చూడకుండా ఆమె దుస్తులు, బాడీ లాంగ్వేజ్‌పై నీచంగా మాట్లాడిన వ్యక్తిని మెచ్చుకుంటూ జగన్‌మోహన్ రెడ్డి ఫోన్ చేసి అభినందించడం దారుణమన్నారు. తమ కుటుంబ మహిళలను గతంలో అవమానించినా.. తాము మాత్రం ప్రతిపక్ష మహిళా నేతలను గౌరవిస్తామని, సోషల్ మీడియాలో హద్దులు దాటిన తమ కార్యకర్తలను సైతం జైలుకు పంపిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. బెంగళూరు, హైదరాబాద్ ప్యాలెస్‌లకే పరిమితం కాకుండా జగన్ క్షేత్రస్థాయిలోకి వస్తే నిజాలు తెలుస్తాయని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.4,000 వృద్ధాప్య పింఛన్, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను పక్కాగా అమలు చేస్తోందని వివరించారు. ఐటీ ఆధారిత అప్లికేషన్ల ద్వారా ఓటర్ల నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తుంటే, అవగాహన లేని వైకాపా నేతలు ఓట్లు తొలగిస్తున్నారంటూ కొత్త డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. అభివృద్ధిపై చర్చకు జగన్ ఎక్కడికి రమ్మన్నా తానే వస్తానని లోకేష్ సవాల్ విసిరారు.
ALSO ON TELUGUONE N E W S
సలార్ సినిమాలో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయిపోయిన మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మన ముందుకు వచ్చేస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన సరికొత్త మైండ్ బ్లోయింగ్ హైస్ట్ థ్రిల్లర్ మూవీ ‘ఐ, నోబడీ’ (I, Nobody). తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కంప్లీట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో సాగిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బ్యాంకింగ్ వ్యవస్థలో ఉండే లొసుగులు, టెక్నికల్ లోపాలను ఆధారంగా చేసుకుని ఒక సామాన్య వ్యక్తి ఎంతటి భారీ దోపిడీలకు పాల్పడ్డాడనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. అసలు ఆ అపరిచితుడు బ్యాంకులని ఎలా బురిడీ కొట్టించాడు? అతన్ని పట్టుకోవడానికి పోలీస్ యంత్రాంగం, ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థలు ఎలాంటి వ్యూహాలు పన్నాయనే అంశాలు ట్రైలర్‌లో ఎంతో ఉత్కంఠభరితంగా చూపించారు. అవుట్‌పుట్ చూస్తుంటే థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సీరియస్ అండ్ గ్రిప్పింగ్ థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్ లభించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ట్రైలర్ చూసిన సినీ ప్రియులకు దుల్కర్ సల్మాన్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘లక్కీ భాస్కర్’ సినిమా గుర్తుకు రాక మానదు. ఆ సినిమాలో బ్యాంక్ క్లర్క్ స్కామ్స్ ఎలాగైతే అలరించాయో, అంతకంటే రెట్టింపు ఇంటెన్సిటీతో, నెక్స్ట్ లెవెల్ మైండ్ గేమ్‌తో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో మెప్పించబోతున్నట్లు స్పష్టమవుతోంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను టాలెంటెడ్ డైరెక్టర్ నిషమ్ బషీర్ అద్భుతంగా తెరకెక్కించారు. పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు విలక్షణ నటి పార్వతి తిరుమోతు, హక్కీం షాజహాన్, అశోకన్ వంటి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని రకాల పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం నెట్టింట ‘ఐ, నోబడీ’ తెలుగు ట్రైలర్‌పై ప్రేక్షకుల నుంచి, ముఖ్యంగా థ్రిల్లర్ జోనర్ లవర్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. సలార్ లాంటి యాక్షన్ డ్రామా తర్వాత పృథ్వీరాజ్ నుండి వస్తున్న ఈ తరహా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మలయాళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న మరో ప్రయోగాత్మక చిత్రం కావడంతో ట్రేడ్ వర్గాల్లోనూ మంచి బజ్ ఏర్పడింది. ఈ మైండ్ గేమ్ హైస్ట్ డ్రామా జూలై 9న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
బుల్లితెర రంగంపై సుదీర్ఘ కాలంగా నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి 'ఈటీవీ ప్రభాకర్'. ఆయన నటవారసత్వాన్ని పుచ్చుకుని ఇప్పటికే కుమారుడు చంద్రహాస్ హీరోగా టాలీవుడ్‌లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ కూడా వెండితెరకు హీరోయిన్‌గా పరిచయం అవుతూ గ్లామర్ ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. దివిజ ప్రభాకర్ కథానాయికగా అరంగేట్రం చేస్తున్న ఈ సరికొత్త ఫ్యామిలీ డ్రామా చిత్రానికి “వెంకట్రామయ్య గారి తాలూకా” అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. దినేష్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సతీష్ ఆవాల దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన అన్ని రకాల నిర్మాణానంతర పనులు తుది దశకు చేరుకోగా, రాబోయే జూలై నెలాఖరున ఈ సినిమాను థియేటర్లలో భారీగా విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. కోమలి క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ జానపద గాయని (ఫోక్ సింగర్) కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఈ సందర్భంగా నిర్మాత కోమలి సినిమా ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. చిత్ర పరిశ్రమపై ఉన్న ఫ్యాషన్‌తో ఎన్నో ఒడుదుడుకులను, రాత్రుళ్లు నిద్రలేని క్షణాలను అనుభవిస్తూ ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశామని, ఒక గాయనిగా నన్ను ఆదరించినట్లే ఈ సినిమాను కూడా ప్రేక్షకులు గుండెలకు హత్తుకుంటారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అన్నదమ్ముల మధ్య ఉండే ఆప్యాయతలు, అనుబంధాలతో పాటు కన్నవారి విలువను చాటిచెప్పే హృదయపూర్వకమైన కుటుంబ కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో టైటిల్ పాత్రల్లో సీనియర్ నటులు మురళీధర్ గౌడ్, సుధా అద్భుతమైన నటన కనబరిచారు. వీరితో పాటు కాశీవిశ్వనాథ్, మిర్చి మాధవి, సత్యశ్రీ, రాజీవ్ కనకాల, వెన్నెల కిషోర్ వంటి ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో కీలకమైన పాత్రలను పోషించారు. బుల్లితెరపై ప్రభాకర్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్ నేపథ్యంలో, ఆయన కుమార్తె దివిజ ఎంట్రీపై టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ మంచి బజ్ క్రియేట్ అయింది. ఒక మంచి ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమాతో పరిచయం అవుతుండటంతో ఈ స్టార్ కిడ్‌కు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ లభిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ట్రైలర్ లాంచ్ మరియు ఆడియో విడుదల తేదీలను మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు.
అక్కినేని యువ హీరో సుమంత్ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న సరికొత్త ఆధ్యాత్మిక సస్పెన్స్ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టీజర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. మైండ్ బ్లోయింగ్ విజువల్స్‌తో సాగిన ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌పై తెగ వైరల్ అవుతోంది. మహేంద్రగిరి కొండల నేపథ్యంతో పాటు వారాహి మాత దివ్య శక్తి చుట్టూ ఈ సినిమా కథ అల్లినట్లు టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. భక్తి, పురాతన నమ్మకాలతో పాటు సైన్స్ అండ్ మిస్టరీ ఎలిమెంట్స్‌ను జోడించి దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. భూగర్భంలో దాగి ఉన్న రహస్యాలు, ప్రకృతి సృష్టించే వింతలు ఈ టీజర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఒక తెలియని గంభీరమైన వాతావరణాన్ని, హారర్ ఎలిమెంట్స్‌ని దర్శకుడు పర్‌ఫెక్ట్‌గా ఎలివేట్ చేశారు. ఆధ్యాత్మిక చిత్రాలను అద్భుతంగా డీల్ చేయగలరని నిరూపించుకున్న డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) హైలైట్‌గా నిలిచింది. ఆధ్యాత్మిక శ్లోకాలతో కూడిన ఆయన సంగీతం టీజర్‌లోని థ్రిల్లింగ్ సీన్లను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లింది. ప్రతాప్ ఆర్. కృష్ణా అందించిన విజువల్స్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచేశాయి. ఈ భారీ చిత్రంలో సుమంత్ సరసన స్టార్ హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ కథానాయికగా నటిస్తోంది. అంతేకాకుండా మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్ కీలక పాత్రల్లో మెరవనున్నారు. వీరితో పాటు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, అలీ, రాజీవ్ కనకాల వంటి భారీ తారాగణం ఈ సినిమాలో భాగమయ్యారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు బ్రిడ్జ్ ఫిల్మ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నపూర్ణ స్టూడియోస్‌లో శరవేగంగా జరుగుతున్నాయి. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని నెటిజన్లు, సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలతో పాటు విడుదల తేదీని కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.
Releasing tomorrow, June 19, Maa Inti Bangaaram is generating strong momentum in overseas markets. The film has already crossed $300K in overseas pre-sales, with ticket bookings continuing at a rapid pace. Early trends indicate that the Samantha-starrer is poised for a solid start at the box office, backed by growing excitement among audiences. The movie has seen an impressive rise in ticket sales across the United States, where Samantha enjoys a significant fan following. With the current buzz and advance bookings, industry observers believe the film has a good chance of entering the prestigious $1 million club overseas. Back home, Maa Inti Bangaaram is also attracting strong attention and is expected to register one of the best openings in Samantha’s career. Reasonably priced tickets have further boosted demand, making it an appealing choice for family audiences during its opening weekend. The film's biggest strength lies in its unique blend of action and family entertainment. Samantha's powerful screen presence in action sequences has sparked tremendous curiosity. Advance bookings continue to show strong momentum across markets, reflecting the confidence audiences have in the project. Supported by Samantha's massive fan following and her successful collaboration with director Nandini Reddy. The film has Srinivas Gavireddy, Manjusha, Diganth, Gulshan Devaiah, Sree Mukhi, Gautami, Anand, Lakshmi, and others playing important roles. Samantha, Raj Nidimoru, and Himank Duvvuru produced the film under Tralala Moving Pictures banner.   Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
టాలీవుడ్ యంగ్ అండ్ వర్సటైల్ హీరో శర్వానంద్ నటిస్తున్న సరికొత్త చిత్రం 'భోగి'. మాస్ కమర్షియల్ చిత్రాల డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం శరవేగంగా పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి తాజాగా దర్శకుడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక భావోద్వేగ పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్‌గా మారింది. సినిమాలోని కొన్ని సన్నివేశాలు తనను ఎంతగానో కదిలించాయని, గత 24 గంటలుగా ఆ ఎమోషన్స్ నుండి తాను బయటకు రాలేకపోతున్నానని సంపత్ నంది పేర్కొన్నారు. ముఖ్యంగా హీరో శర్వానంద్ గత పదేళ్ల కెరీర్‌లో ఎన్నడూ లేనంత అద్భుతంగా ఈ చిత్రంలో జీవించారని కొనియాడారు. కొన్ని క్లిష్టమైన ఎమోషనల్ సీన్స్ చిత్రీకరణ సమయంలో శర్వానంద్ నటనకు ముగ్ధుడై తను 'కట్' చెప్పడం కూడా మర్చిపోయానని తెలిపారు. ఆ సమయంలో షూటింగ్ సెట్‌లో ఉన్న దాదాపు 200 మంది యూనిట్ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి లోనై, కళ్లు తుడుచుకుంటూ చప్పట్లు కొట్టారని డైరెక్టర్ వెల్లడించారు. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఇలాంటి అరుదైన అనుభూతిని ఎదుర్కోవడం ఇదే మొదటిసారని ఆయన చెప్పుకొచ్చారు. థియేటర్లలో ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా కచ్చితంగా ఇలాగే కళ్లు చెమ్మగిల్లేలా ఫీలవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రం పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంటోంది. ఉత్తర తెలంగాణ మరియు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్ కథాంశంతో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో ముందుండే శర్వానంద్‌కు ఈ చిత్రం కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. ఈ మూవీలో శర్వానంద్‌ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. గ్లామరస్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ 'కందుల సులోచన రాణి' అనే కీలక పాత్రలో కనిపించనుండగా, మరో కథానాయిక డింపుల్ హయాతి 'మందారం' అనే కాస్త బోల్డ్ అండ్ పవర్‌ఫుల్ పాత్రలో సందడి చేయనుంది. వీరిద్దరి పాత్రలు కూడా కథను మలుపు తిప్పే విధంగా ఉంటాయని సమాచారం. దర్శకుడు సంపత్ నంది పెట్టిన ఈ పోస్ట్‌తో శర్వానంద్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయింది. సోషల్ మీడియాలో ఈ అప్‌డేట్ తెగ హల్చల్ చేస్తోంది. శర్వానంద్ లోని అసలైన నటుడిని సంపత్ నంది ఈ సినిమా ద్వారా సరికొత్తగా ఆవిష్కరించబోతున్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో సైతం పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. అన్ని హంగులు అద్దుకుంటున్న ఈ హై-వోల్టేజ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాను ఈ ఏడాది ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. మరి శర్వానంద్-సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తున్న ఈ 'భోగి' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
The makers of Ram Pothineni’s RAPO23 have issued an official clarification after noticing unauthorized casting call posters being circulated across social media platforms. Through an official statement, the team alerted people to stay cautious and avoid engaging with individuals falsely claiming to represent the film. The production house stated that no unofficial casting process is being conducted and warned users not to share personal details, contact information or any sensitive data with anyone approaching in the name of the project. With large-scale films increasingly becoming targets for fake auditions and casting scams, such incidents have become more common in recent years. Makers are now taking proactive steps to issue public notices before misinformation spreads further. The statement also made it clear that any official casting calls, talent requirements or project updates related to RAPO23 will only be announced through verified official handles and communication channels. The warning serves as a reminder for aspiring actors and fans to verify announcements before responding, especially when projects with major stars generate high public interest. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
Mahesh Babu is currently fully focused on Varanasi and the actor has not accepted any new film yet. But that has not stopped industry gossip from beginning discussions around what kind of film he could choose next.  According to trade chatter, Mahesh is said to be interested in trying a sports drama with an intriguing storyline after completing his current commitment. However, there is no confirmation about any narration being locked or the actor committing to a project. Interestingly, reports also suggest that Mahesh could consider collaborations with Sandeep Reddy Vanga and Prashanth Neel depending on how schedules and development shape up in the coming months. At the same time, the stronger industry talk remains that Mahesh is in no hurry to announce his next.  Reports indicate that the actor wants to wait and see how Varanasi performs globally before taking a call on the direction of his immediate future lineup. For now, the sports drama discussion remains industry gossip. But if it turns true, it could mark a genre space Mahesh has not fully explored at this scale before. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
ప్రపంచ సినిమా చరిత్రలోనే తెలుగు జెండాను రెపరెపలాడించిన ట్రెండ్ సెట్టర్ 'బాహుబలి'. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సృష్టించిన ఈ మహా అద్భుతం ఇప్పుడు మరోసారి గ్లోబల్ వేదికపై గర్జించడానికి సిద్ధమైంది. బాహుబలి ఫ్రాంఛైజీ నుంచి వస్తున్న లేటెస్ట్ యానిమేషన్ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఫ్రాన్స్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరగబోయే 'అన్నెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిలిం ఫెస్టివల్'లో ఈ మూవీ ప్రదర్శితం కానుంది. ఈ వేడుకల్లో భాగంగా 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' సినిమాకు సంబంధించిన బుకింగ్స్‌ను నిర్వాహకులు తాజాగా ప్రారంభించారు. విండోస్ ఓపెన్ చేసిన కేవలం రెండే రెండు నిమిషాల్లో టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోవడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఇంతటి ఘనత సాధించడం వెనుక దర్శకుడు రాజమౌళి బ్రాండ్ ఇమేజ్, ప్రభాస్ గ్లోబల్ ఫ్యాన్ బేస్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక ఫెస్టివల్‌లో 'వర్క్ ఇన్ ప్రోగ్రెస్' కేటగిరీ కింద ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. గతంలో ఇదే విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న యానిమేషన్ వండర్స్ 'స్పైడర్‌మ్యాన్ ఇంటు ది స్పైడర్ వర్స్', 'ఫ్లో' వంటి చిత్రాలు స్క్రీనింగ్ కావడం విశేషం. ఇప్పుడు ఆ లైనప్‌లోకి మన బాహుబలి చేరడంతో తెలుగు వారి ఖ్యాతి మరింత పెరిగింది. మొత్తం రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటున్న ఈ యానిమేషన్ ప్రాజెక్ట్‌ను ఇషాన్ శుక్లా డైరెక్ట్ చేస్తున్నారు. జక్కన్న స్వయంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సమర్పకుడిగా వ్యవహరిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన మొదటి భాగానికి సంబంధించిన గ్లింప్స్ అండ్ టీజర్ విశేషమైన రెస్పాన్స్ అందుకొని సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. గ్లోబల్ మార్కెట్‌లో బాహుబలి రేంజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ అరుదైన టికెట్ల సునామీతో మరోసారి ప్రూవ్ అయింది. ఈ అప్‌డేట్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ నెట్టింట తెగ రచ్చ చేస్తున్నారు. అంతర్జాతీయ ఆడియన్స్ సైతం మహిష్మతి సామ్రాజ్యపు యానిమేషన్ విజువల్స్ చూసేందుకు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది (2027)  ఈ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయడానికి ముస్తాబవుతోంది.
మన టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్‌కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో, మాలీవుడ్ (మలయాళ చిత్రసీమ)లో 'ఓనమ్' పండుగ సీజన్‌కు అంతకంటే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈ స్పెషల్ సీజన్‌ను క్యాష్ చేసుకోవడానికి అక్కడి స్టార్ హీరోలు ఎప్పుడూ తెగ పోటీ పడుతుంటారు. అయితే రాబోయే ఓనమ్ పండుగ విండో మాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ మరియు రసవత్తరమైన బాక్సాఫీస్ పోరాటానికి వేదిక కాబోతోంది. మలయాళ పరిశ్రమకు చెందిన ముగ్గురు టాప్ స్టార్స్ పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్, నివిన్ పౌలీ ఒకేసారి థియేటర్లలో ఢీకొనడానికి కర్చీఫ్ వేశారు.   మొదటగా, వర్సటైల్ యాక్టర్ కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'ఖలీఫా'. వైశాఖ్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఓనమ్ కానుకగా ఆగస్టు 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాలో మాలీవుడ్ లెజెండ్ మోహన్ లాల్ ఒక పవర్‌ఫుల్ క్యామియో రోల్ చేస్తున్నారనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తుండటంతో, ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.  మరోవైపు టాలీవుడ్, కోలీవుడ్ లలో వరుస సినిమాలు చేస్తూ మాతృభాషకు కాస్త గ్యాప్ ఇచ్చిన డీక్యూ (దుల్కర్ సల్మాన్) ఈసారి ఓనమ్ రేసులో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. 'కింగ్ ఆఫ్ కోత' తర్వాత ఆయన మలయాళంలో నటిస్తున్న తాజా చిత్రం 'ఐయామ్ గేమ్'. 'ఆర్డీఎక్స్' లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన నహాస్ హిదాయత్ దర్శకత్వంలో హీస్ట్ అండ్ గ్యాంబ్లింగ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ కూడా సరిగ్గా ఆగస్టు 20నే థియేటర్లలోకి రానుంది. గత ఏడాది ప్రొడ్యూసర్‌గా సక్సెస్ చూసిన దుల్కర్, ఈ పండుగకు హీరోగా గట్టి హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు.   ఇక ఈ ఇద్దరు స్టార్లతో పాటు బాక్సాఫీస్ రేసులోకి సైలెంట్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు లవర్ బాయ్ నివిన్ పౌలీ. 'ప్రేమలు' చిత్రంతో సౌత్ ఇండియాను ఊపేసిన డైరెక్టర్ గిరీష్ ఏడీ కాంబినేషన్‌లో నివిన్ పౌలీ, క్రేజీ బ్యూటీ మమితా బైజు లీడ్ రోల్స్‌లో నటిస్తున్న హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ 'బెత్లెహం కుడుంబ యూనిట్'. ఇప్పటికే మే నెలలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ క్లీన్ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను కూడా ఓనమ్ పండుగ సీజన్‌ను టార్గెట్ చేస్తూనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ముగ్గురు స్టార్ హీరోలకు కూడా ఈ పండుగ సీజన్ విజయం అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం మాలీవుడ్ మార్కెట్ రేంజ్ విపరీతంగా పెరగడంతో సోషల్ మీడియాలో ఈ బిగ్గెస్ట్ క్లాష్‌పై ఇప్పుడే భారీ ఎత్తున చర్చలు, ఫ్యాన్ వార్స్ మొదలయ్యాయి. ఆగస్టు 16 నుండి 25 వరకు జరిగే ఈ పండుగ హడావిడిలో థియేటర్ల సర్దుబాటు ఎలా ఉండబోతుందో చూడాలి. ఇంకా రెండు నెలల సమయం ఉండటంతో, ఈ క్రేజీ రేసులో చివరికి ఎవరు నిలుస్తారో, ఎవరు తప్పుకుంటారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!
న్యాచురల్ స్టార్ నాని (Nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ది ప్యారడైజ్' (The Paradise). బ్లాక్‌బస్టర్ సినిమా 'దసరా' తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న మూవీ కావడంతో టాలీవుడ్‌లో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమా మేకర్స్‌కు ఒక ఊహించని తలనొప్పి వచ్చి పడిందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం, మరోవైపు డిజిటల్ పార్ట్‌నర్ అయిన ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) నుంచి రిలీజ్ డేట్ కోసం విపరీతమైన ఒత్తిడి రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిస్థితితో అటు హీరో నాని, ఇటు నిర్మాత తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్. నిజానికి, ఈ సినిమా షూటింగ్‌ను మొదట మార్చి 27న విడుదల చేయాలనే లక్ష్యంతో ప్రారంభించారు. కానీ, క్వాలిటీ విషయంలో రాజీపడని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరికొంత సమయం కావాలని కోరడంతో మేకర్స్ ఆగస్టు 21కి రిలీజ్ డేట్‌ను మార్చారు. అయితే తాజా సమాచారం ప్రకారం, ఆగస్టు 21 నాటికి కూడా సినిమాను థియేటర్లలోకి తీసుకురావడం అసాధ్యమని తెలుస్తోంది. ఎందుకంటే ఈ చిత్రానికి సంబంధించి ఇంకా దాదాపు 60 రోజుల షూటింగ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. ఈ 60 రోజుల టాకీ, యాక్షన్ పార్ట్ పూర్తయిన తర్వాతే మొత్తం సినిమాను ఎడిటింగ్ టేబుల్‌పైకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆపై భారీ ఎత్తున పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతం చేయాలి. ఈ భారీ ఆలస్యం కారణంగా మేకర్స్ అనధికారికంగా ఆగస్టు 21 రిలీజ్ డేట్‌ను కూడా వదులుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారు డిసెంబర్ నెలను టార్గెట్‌గా పెట్టుకుని వర్క్ ప్లాన్ చేసుకుంటుండగా, డిజిటల్ రైట్స్ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్ మాత్రం దీనికి అంగీకరించడం లేదని సమాచారం. అగ్రిమెంట్ ప్రకారం ముందుగా అనుకున్న విండోలోనే అంటే సెప్టెంబర్ నాటికే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఒత్తిడి చేస్తోంది. ఒకవేళ అంతకంటే ఆలస్యమైతే ఓటీటీ రైట్స్ కోసం కుదుర్చుకున్న డీల్ ప్రైస్‌ను భారీగా తగ్గించాల్సి ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ హెచ్చరించినట్లు సమాచారం. నాని కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో, ఓటీటీ రేట్ తగ్గితే నిర్మాతలకు కోట్లలో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆలస్యం కారణంగా బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. ఇలాంటి తరుణంలో ఓటీటీ రైట్స్ అమౌంట్ తగ్గితే భరించడం కష్టం. గతంలో 'పెద్ది' సినిమా మేకర్స్ కూడా రీషూట్ల కోసం సమయం కావాలనుకున్నా, ఓటీటీ రైట్స్ ప్రెజర్ మరియు బడ్జెట్ ఇష్యూస్ వల్ల జూన్ 4వ తేదీనే రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు 'ది ప్యారడైజ్' కూడా అదే తరహా సమస్యను ఎదుర్కొంటోంది. అందుకే కనీసం దసరా పండుగ కానుకగా అయినా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి పనులన్నీ పూర్తి చేసి సినిమాను సిద్ధం చేయాలని నిర్మాత దర్శకుడిని కోరినట్లు తెలుస్తోంది. మరి శ్రీకాంత్ ఓదెల ఈ డెడ్‌లైన్‌ను ఎలా అందుకుంటారో చూడాలి.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
భారతీయుల ప్రధాన ఆహారం అన్నం.  మరీ ముఖ్యంగా దక్షిణ భారతీయులకు రోజులో కనీసం రెండు పూటల అయినా అన్నం ఉండాల్సిందే.. ఒకవేళ మధ్యాహ్న  భోజనంలో అయినా,  రాత్రి భోజనంలో అయినా చపాతీ లాంటివి తిన్నా.. కనీసం అందులో కాసింత అన్నం అయినా లేకపోతే భోజనం తిన్న తృప్తి ఉండదు చాలామందికి. అయితే ఈ మధ్యకాలంలో రాత్రి పూట అన్నానికి బదులుగా చపాతీలు తినమని కొందరు, టిఫిన్ లు తినమని మరికొందరు చెబుతూ ఉంటారు. రాత్రి సమయంలో అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారని కూడా చెబుతుంటారు. రాత్రి సమయంలో అన్నం తింటే బరువు పెరుగుతారా?  ఇది నిజమా? దీని గురించి వైద్యులు చెబుతున్న నిజాలు ఏంటి? తెలుసుకుంటే.. బరువు పెరగడానికి అసలు కారణం.. డాక్టర్ల ప్రకారం..  బరువు పెరగడం లేదా తగ్గడం అనేది  తినే ఏదో ఒక ఆహారంపై ఆధారపడి ఉండదు. అది పూర్తిగా  రోజూ తీసుకునే కేలరీలు , శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుంది.  అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకుంటే, ఆ కేలరీలు అన్నం నుండి వచ్చినా లేదా ఇతర ఆహారాల నుండి వచ్చినా బరువు పెరుగడం జరుగుతుంది. అందువల్ల, రాత్రిపూట కేవలం అన్నం తింటేనే లావు అవుతామని చెప్పలేమని అంటున్నారు. అన్నం తినవద్దని ఎందుకు అంటారంటే.. అన్నంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి  శరీరానికి శక్తిని అందిస్తాయి.  రాత్రి భోజనం చేసేటప్పుడు,  శారీరక శ్రమ గణనీయంగా తగ్గిపోతుంది. అందువల్ల,  ఎక్కువగా అన్నం తిని,  రోజువారీ కేలరీల పరిమితిని మించిపోతే, అదనపు శక్తి శరీరంలో కొవ్వుగా పేరుకుపోవడం మొదలవుతుంది. అందుకే రాత్రిపూట అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారని చెబుతుంటారు. బియ్యం రకం ముఖ్యం.. అన్ని రకాల బియ్యం ఒకేలా ఉండవని వైద్యులు చెబుతున్నారు.  తెల్ల బియ్యంతో పోలిస్తే బ్రౌన్ రైస్, అంటే తక్కువగా పాలిష్ చేసిన బియ్యంలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతిని కలిగించడంలో సహాయపడుతుంది.  అన్నాన్ని పప్పులు, పుష్కలంగా కూరగాయలు , ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలతో కలిపి తీసుకోవడం వల్ల సమతుల్య ఆహారం లభిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి , అతిగా తినడాన్ని నివారించడానికి కూడా సహాయపడుతుంది. జీర్ణక్రియ, నిద్రపై అన్నం ప్రబావం.. ప్రతి వ్యక్తి శరీరం భిన్నంగా ఉంటుంది. కొంతమందికి రాత్రిపూట అన్నం తినడం సులభంగా జీర్ణమై, బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. మరోవైపు, మరికొందరు ఎక్కువగా అన్నం తిన్న తర్వాత కడుపులో భారంగా ఉన్నట్లు ఫీలవుతారు. దీన్ని బట్టి అన్నం యొక్క ప్రభావాలు ప్రతి వ్యక్తి  జీర్ణవ్యవస్థ, జీవనశైలి , ఆరోగ్యంపై ఆధారపడి మారుతూ ఉంటాయి. సమతుల్యం ఉంటేనే.. రాత్రిపూట అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారన్న భావన పూర్తిగా నిజం కాదు.  క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ,  రోజువారీ కేలరీలను  గమనిస్తూ, సమతుల్య మోతాదులో అన్నం తింటే, రాత్రిపూట అన్నం తినడం వల్ల  బరువు పెరగడం అనేది జరగదు.  బరువును అదుపులో ఉంచుకోవడానికి, రోజులోని సమయం కంటే కూడా  తినే ఆహారం పరిమాణం, ఆహార రకం ,  మొత్తం జీవనశైలికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందువల్ల, అన్నాన్ని సరైన మోతాదులో , సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచిది.                            *రూపశ్రీ.
వినికిడి లోపం అంటే ఒక వ్యక్తి అకస్మాత్తుగా శబ్దాలను వినలేకపోవడం అని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. చాలా సందర్భాలలో వినికిడి సమస్యలు మెల్లిగా  మొదలవుతాయి. మొదట్లో దీని లక్షణాలు  చాలా సాధారణంగా అనిపిస్తాయి. వయసు కారణంగా, లేదా అలసిపోవడం వల్ల జరుగుతోందేమోనని, పరిసరాల కారణంగా సరిగా వినిపించడం లేదేమోనని ఇలా.. రకాలుగా అనుకుంటూ   వినికిడి సమస్యను లైట్ తీసుకుంటారు. చాలామంది ఇతరులతో  మాట్లాడటం కష్టమయ్యే వరకు తమ సమస్యను గుర్తించరు. కానీ వినికిడి సమస్య రావడానికి ముందుగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.  ఆ లక్షణాలేంటో తెలుసుకోవడం వల్ల సమస్యను ముందే గుర్తించవచ్చు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. వినికిడి సమస్యను మొదట్లోనే  గుర్తించడం ఎందుకు ముఖ్యం? వయసు పెరగడంతో వచ్చే వినికిడి లోపం క్రమంగా అభివృద్ధి చెంది, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తుంది.  దీని లక్షణాలను ముందుగానే గుర్తిస్తే, దీర్ఘకాలికంగా వినికిడిని , జీవన నాణ్యతను కాపాడుకోవచ్చు. చుట్టూ ఉన్న అందరూ ఎంతో బాగా మాట్లాడుతూ, నవ్వుతూ, తుళ్లుతూ ఉంటే.. వినికిడి సమస్య ఉన్నవారు మాత్రం తమ సమస్య కారణంగా ఎవరితో ఎక్కువ మాట్లాడలేకపోవడం, తమ రోజు వారీ కార్యకలపాలను సమర్థవంతంగా నిర్వహించలేకపోవడం వంటివి జరుగుతాయి.  దీని వల్ల వినికిడి సమస్యను ముందుగానే గుర్తించడం ముఖ్యం. లక్షణాలు.. గందరగోళం.. వినికిడి లోపానికి మొదటి లక్షణం వినిపించకపోవడమే కాదు.. . కొన్నిసార్లు ఇతరులు మాట్లాడటం వినగలుగుతారు, కానీ మాటలను స్పష్టంగా అర్థం చేసుకోలేరు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రదేశాలలో, కుటుంబంలో అందరూ కలిసి మాట్లాడుతున్నప్పుడు లేదా రెస్టారెంట్లలో మాట్లాడే మాటలను  అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది.  ఇది ప్రారంభ దశలో వినికిడి లోపానికి ఒక సాధారణ లక్షణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పించుకోవాల్సి రావడం..  ఇతరులు ఏదైనా చెప్పినప్పుడు పదేపదే మళ్ళీ చెప్పమని అడుగుతున్నట్లయితే, ఇది కూడా ఒక హెచ్చరిక సంకేతం కావచ్చు. మొదట్లో ఇది సాధారణంగానే అనిపించవచ్చు, కానీ ఈ అలవాటు రోజువారీ లైఫ్ స్టైల్ లో  భాగంగా మారినప్పుడు, దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎక్కువగా కుటుంబ సభ్యులు లేదా స్నేహితులే ఈ మార్పును మొదటగా గమనిస్తారు. వ్యాల్యూమ్.. టీవీ, మొబైల్ ఫోన్ లేదా రేడియో వాల్యూమ్‌ను నిరంతరం పెంచడం మరో సాధారణ లక్షణం. తరచుగా, ఇంట్లోని ఇతర వ్యక్తులు ఆ వాల్యూమ్‌ను చాలా ఎక్కువగా అని చెబుతూ ఉంటారు, అయితే వినికిడి లోపం ఉన్న వ్యక్తి దానిని సాధారణంగానే అనుకుంటారు. ఈ మార్పు క్రమంగా జరుగుతుంది, కాబట్టి చాలా మంది దీనిని తీవ్రంగా పరిగణించరు. ఫోన్లో  మాట్లాడటంలో ఇబ్బంది.. ఫోన్‌లో మాట్లాడటంలో ఇబ్బంది కూడా వినికిడి లోపానికి ఒక సంకేతం కావచ్చు. నేరుగా, ఎదురుగా ఉండి మాట్లాడేటప్పుడు  ముఖ కవళికలు , పెదవుల కదలికలు అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి, కానీ ఫోన్‌లో కేవలం  గొంతుపైనే ఆధారపడవలసి ఉంటుంది. స్వల్ప వినికిడి లోపం కూడా  ఫోన్ లో మాట్లాడటం కుదరకపోతే అది స్పష్టంగా తెలిసిపోతుంది. చెవిలో శబ్దాలు.. చెవుల్లో నిరంతరం రింగింగ్, గింగురుమనే లేదా ఈల శబ్దాలు రావడం ఆందోళన కలిగించే విషయం. టిన్నిటస్ అని పిలువబడే ఈ పరిస్థితి, తరచుగా వినికిడిలో ఒక అంతర్లీన సమస్యను సూచిస్తుంది. వినికిడి సమస్యలను నిర్లక్ష్యం చేయడం కేవలం చెవులకే పరిమితం కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాలక్రమేణా ఇది సామాజిక ఒంటరితనం, నిరాశ, ఒత్తిడి , కుంగుబాటుకు కూడా దారితీయవచ్చు. అందువల్ల, ఈ లక్షణాలు కొనసాగితే ఈ.ఎన్.టి నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.                                            *రూపశ్రీ.
ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య నరాల బలహీనత మరియు విపరీతమైన నీరసం. షుగర్, బీపీ, అధిక బరువు, పోషకాహార లోపం లేదా దీర్ఘకాలికంగా వాడే కొన్ని మందుల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల నరాల బలహీనత రావచ్చు. అయితే, కొంతమందికి అన్ని రకాల వైద్య పరీక్షలు నార్మల్‌గా ఉన్నప్పటికీ ఒంట్లో శక్తి లేనట్టు, నిస్త్రాణగా అనిపిస్తుంది. వైద్య పరిభాషలో దీనిని 'క్రానిక్ ఫ్యాటిగ్ సిండ్రోమ్' (Chronic Fatigue Syndrome) అంటారు. తాత్కాలిక ఉపశమనం కోసం కాఫీ, టీలు లేదా స్వీట్లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలాంటి అంతుపట్టని నరాల బలహీనత మరియు నీరసం నుండి శాశ్వతంగా బయటపడటానికి ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఇంట్లోనే సులభంగా చేసుకోదగ్గ రెండు అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలను ఈ వీడియోలో వివరించారు.   చిట్కా 1 (ఎండు ద్రాక్ష మరియు నిమ్మరసం):** రాత్రి వేళల్లో ఒక గ్లాసు నీటిలో గుప్పెడు (సుమారు 25 గ్రాములు) ఎండు ద్రాక్ష (కిస్మిస్) వేసి, అందులో ఒక నిమ్మకాయ రసం పిండి మూత పెట్టాలి. ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగి, నానిన కిస్మిస్ పండ్లను తినాలి. ఇలా 40 రోజుల పాటు చేయడం వల్ల రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. చిట్కా 2 (షుగర్, కొలెస్ట్రాల్ ఉన్నవారి కోసం - తులసి మరియు మట్టి ముంత):** ఒక చిన్న కొత్త మట్టి ముంతను శుభ్రం చేసుకుని, అందులో రాత్రి పూట ఒక గ్లాసు నీరు పోసి 10 తులసి ఆకులను నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి తాగాలి. మట్టిలో ఉండే సహజసిద్ధమైన ఖనిజాలు, తులసిలోని ఔషధ గుణాలు కలిసి నరాలకు అమితమైన శక్తిని ఇస్తాయి. ఖరీదైన మందులు లేకుండా, ఇంట్లోనే ఈ చిన్న చిట్కాలతో నరాల బలహీనతను ఎలా దూరం చేసుకోవాలో డాక్టర్ గారి మాటల్లోనే ఈ వీడియో చూసి పూర్తిగా తెలుసుకోండి! మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!