LATEST NEWS
  కాకినాడ జిల్లాలోని రంగరాయ వైద్య కళాశాల్లో లైంగిక వేధింపుల ఘటనపై  నలుగురు ఆర్ఎంసి  ఉద్యోగులు  సస్పెన్షన్ విధించారు. ల్యాబ్‌ అటెండెంట్‌ కల్యాణ్ చక్రవర్తి,  టెక్నీషియన్లు జిమ్మి రాజు, గోపాలకృష్ణ, ప్రసాద్‌లను సస్పెండ్‌ చేస్తూ ధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.అజ్ఞాతంలో A1 నిందితుడు కళ్యాణ్ చక్రవర్తి ఉన్నట్లు తెలుస్తోంది.బీఎస్సీ, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సులు చదువుతున్న విద్యార్థినులపై ల్యాబ్ సహాయకుడు, మరో ఉద్యోగి లైంగికంగా వేధిస్తున్నారని బాధిత విద్యార్థినులు కొందరు ఫ్యాకల్టీ వద్ద చెప్పుకుని విలపించారు.  ఇదే విషయమై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు అందడంతో ఆయన తీవ్రంగా పరిగణించి అంతర్గత కమిటీ ద్వారా విచారణ చేయించారు. మైక్రో బయాలజీ, పాథాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాల్లో కొందరు సిబ్బంది తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు 50 మంది విద్యార్థినులు కమిటీ ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఈ నివేదిక ఆధారంగా నిందితులను రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ సస్పెండ్‌ చేసి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఎస్‌పి బిందుమాధవ్‌ మాట్లాడుతూ నిందితులను శుక్రవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నామన్నారు. సంబంధిత సెక్షన్ల ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు  
  రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, పరిపాలన అంశాలను సీఎం గవర్నర్‌కు  వివరించారు. అంతకు ముందు క్యాంపు కార్యాలయంలో కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. డేటా అనలిటిక్స్ వంటి సాంకేతికతను ఉపయోగించి, పన్ను ఎగవేతలను అడ్డుకోవాలని అధికారులకు సూచించారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్లలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. త్వరలో సీఎం చంద్రబాబు దిల్లీలో పర్యటించనున్నారు. బనకచర్ల అంశంపై గవర్నర్‌‌తో చర్చించినట్లు తెలుస్తోంది
  మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి ఖమ్మం కోర్టులో ఊరట లభించింది. 2014 లో ఆమెపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కోర్టు కొట్టివేసింది.  2014లో తనకు, లేదా తన భర్తకు వైరా ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని చెప్పి రేణుకా చౌదరి చీటింగ్ చేశారంటూ భూక్య రాంజీ భార్య కళావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టును కూడా ఆశ్రయించారు. దీనికి సంబంధించి ఖమ్మం జిల్లా కోర్టులోని ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానంలో విచారణ కొనసాగింది. అయితే రేణుకపై ఆరోపణలు రుజువు కాకపోవడంతో కేసును కొట్టివేస్తూ జడ్జి తీర్పును వెలువరించారు. రేణుక తరపున సీనియర్ న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, మద్ది శ్రీనివాస్ రెడ్డి వాదనలు వినిపించారు.   
  నంద్యాల శిల్పం సైకిలెక్కనుందా? అన్న టాక్ వినిపిస్తోంది. కారణం.. ఆయన ఓడిపోయినప్పటి నుంచీ వైసీపీ అంటేనే చిన్న చూపు ఏర్పడిందట. అంతే కాదు.. ఎప్పుడో ఎక్కడో ఒక సారి పార్టీ ఆఫీసుకు వచ్చి వెళ్తున్నారట. దీంతో నంద్యాలలో పార్టీ క్రమంగా పట్టు తప్పుతున్నట్టు ఇంటర్నల్ టాక్. దానికి తోడు ఆయన చూపు టీడీపీ వైపు మళ్లు తున్నట్టుగానూ భావిస్తున్నారట ఇక్కడ ఫ్యాను పార్టీ కార్యకర్తలు. ఇక్కడ అసలు మేటరేంటంటే.. ఈయనగారి ఈమాత్రం రాజకీయానికి అనవసరంగా వేలు పెట్టి లేని పోని గొడవకు కారణమయ్యాం కదాని తెగ ఫీలవుతున్నారట పుష్పరాజ్ అలియాస్ అల్లు అర్జున్.  పుష్పరాజ్ గా ఫేమస్ అయిన దానికంటే.. నంద్యాల రవి కోసం ప్రచారానికి వెళ్లినపుడే ఎక్కువగా ట్రోల్ అయ్యారాయన. అంతేనా కుటుంబంలో లేని పోని గొడవలు. నానా యాగీ జరిగింది. నాగబాబు ట్వీట్ నుంచి మొదలు పెడితే.. మెగాహీరోల్లో సాయి ధరమ్ వంటి కొందరు హీరోలు అల్లువారబ్బాయిని అన్ ఫాలో చేయడం వంటి పరిణామక్రమాలు. ఆపై అల్లు అర్జున్ ఈ మొత్తం ఎపిసోడ్ పై వివరణ ఇచ్చుకోవల్సి రావడం.. ఇలా నానా రకాల రభస జరిగింది. ఏదో తన రెడ్డింటి భార్యామణి బంధువు కదాని.. వెళ్లినందుకు ఇంత హైరానా హంగామా జరిగాయి. ఇప్పుడవన్నీ బూడిదలో పోసిన పన్నీరా? అన్న క్వశ్చిన్ మార్క్ అల్లు అర్జున్ని తెగ డిస్ట్రబ్ చేస్తోందట.  తాను సపోర్టుగా వెళ్లిన రవి చూస్తే కూటమి పార్టీలకే పెద్ద దిక్కయిన టీడీపీలోకి వెళ్లడమంటే ఇన్నాళ్ల పాటు తాను అనుభవించిన కష్టానికే అతి పెద్ద అవమానకరంగా భావిస్తున్నారట అల్లు అర్జున్. ఒక పక్క చూస్తే కుటుంబంలో కలహాలు. మరొక పక్క చూస్తే రాజకీయ కక్ష సాధింపుల్లాంటి ఘటనలు. ఎటు నుంచి ఎటు చూసినా.. నంద్యాల ఎపిసోడ్ నుంచి అల్లు అర్జున్ పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమా రెండు వేల కోట్ల రూపాయల మేర వసూళ్లు చేసినా, తనకు నేషనల్- స్టేట్ అవార్డులు రెండొచ్చినా.. రవీ తీసిన ఈ ఎదురు దెబ్బ ముందు అవన్నీ తేలిపోయినట్టుగా భావిస్తున్నారట అల్లు అర్జున్. ఇది తాను అస్సలు ఊహించలేదట. వ్రతం చెడ్డా ఫలితం దక్కాలంటారు.  ఇంత పెద్ద సెలబ్రిటీ వెళ్లి కూడా అక్కడ రవి ఓడిపోయారు. ఇప్పుడు చూస్తే ఆయన పార్టీయే మారనున్నారు. అంటే, ఒకటికి రెండు దెబ్బలు. రవి కోసం నంద్యాలకు వెళ్లడంతో తనను వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నెత్తిన పెట్టుకుని చూసుకున్నాయి. ఈగ కూడా వాలనివ్వలేదు. మొన్నటికి మొన్న పవన్ అడవులను దోచేవాడు హీరో ఏంటన్న కామెంట్ల సమయంలో కూడా అల్లు అర్జున్నే వెనకేసుకొచ్చారు వీరంతా. దీనంతటికీ కారణమైన రవి ఒక వేళ టీడీపీలోకి వెళ్లిపోతే.. తాను కూడా ఆ పార్టీలోకి వెళ్లినట్టా? లేక ఫ్యాన్ పార్టీలో తన ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే కంటిన్యూ అవుతుందా? తేలాల్సి ఉందంటున్నారు అల్లు అర్జున్ ఆర్మీ.
  హైదరాబాద్‌లో కల్తీ కల్లు తాగి 9 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బాలానగర్ ఎక్సైజ్ సీఐ వేణు కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. DTF నర్సిరెడ్డి, ఏఈఏఎస్ మాధవయ్య సహా మిగతా వారి పాత్రపై దర్యాప్తు చేస్తోంది. తనిఖీలు చేయకుండా కల్తీ కల్లు తయారవుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించారని వేణుపై వేటు వేసింది. కల్తీ కల్లు ఘటనపై ఐదు టీంలో ఎంక్వైరీ చేయించిన ఎక్సైజ్ శాఖ   ఇప్పటికే  హైదర్‌నగర్, హెచ్ఎంటీ హిల్స్, షంషీగూడ, సర్దార్ పటేల్ నగర్ కల్లు దుకాణాల లైసెన్సులు రద్దు చేసింది . నలుగురు వ్యాపారులు  రవితేజ గౌడ్ (29), కోన సాయి తేజ గౌడ్ (31), చెట్టు కింది నాగేష్ గౌడ్ (51), బట్టి శ్రీనివాస్ గౌడ్ (39)లను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‎కు తరలించారు.  కల్తీ కల్లు తాగి 8 మృతి చెందగా.. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న విషయం తెలిసిందే.   
ALSO ON TELUGUONE N E W S
  బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్, మిత్రా శర్మతో పాటు గీతానంద్, జెనీఫర్ ఇమ్మానుయేల్, రోనీత్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం 'వర్జిన్ బాయ్స్'. రాజా దారపునేని నిర్మాణంలో దయానంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, 'టికెట్ కొట్టు - ఐఫోన్ పట్టు' వంటి ప్రమోషనల్ ఆఫర్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి ఈ సినిమా ఉందనేది రివ్యూలో చూద్దాం.   కథ:   ఒక యూనివర్సిటీలో చదువుకునే డుండీ (శ్రీహాన్), ఆర్య (గీతానంద్), రోనీ (రోనీత్ రెడ్డి) స్నేహితులు. కాలేజీలో అందరికీ గర్ల్‌ఫ్రెండ్స్ ఉండగా, తమకు లేరనే నిరాశలో ఉన్న వీరిని.. వారి స్నేహితుడు (కౌశల్) మరింత రెచ్చగొడతాడు. "నేను అమెరికా నుంచి తిరిగి వచ్చేలోపు మీరు వర్జినిటీ కోల్పోవాలి" అని సవాల్ విసురుతాడు. ఈ సవాల్‌ను స్వీకరించిన ముగ్గురు స్నేహితులు.. ముగ్గురు అమ్మాయిలతో ప్రేమలో పడతారు. జెనీఫర్‌ ను డుండీ, సరయు (మిత్రా శర్మ)ను ఆర్య , శ్లోక (అన్షులా ధావన్)ను  రోనీ ప్రేమిస్తారు. అయితే, వారి ప్రేమ జీవితంలో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. వారి ప్రేమ కథలు విజయ తీరాలకు చేరాయా? వర్జినిటీ కోల్పోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ముగ్గురు మిత్రులు తమ సవాల్‌లో గెలిచారా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.   విశ్లేషణ:   తెలుగులో అడల్ట్ కామెడీ సినిమా రావడం అరుదు. 'వర్జిన్ బాయ్స్' టైటిల్, ప్రమోషనల్ కంటెంట్ చూసి.. ఇది అడల్ట్ కామెడీ సినిమా అని భావించారంతా. థియేటర్‌లో చూసిన తర్వాత.. ఇది పూర్తిగా అడల్ట్ కామెడీ సినిమా కాదని క్లారిటీ వస్తుంది. కాలేజీలో కొత్తగా చేరిన యువతలో చాలామందికి గర్ల్‌ఫ్రెండ్ ఉండాలని, వర్జినిటీ కోల్పోవాలని కోరిక ఉంటుంది. కానీ, వర్జినిటీ కోల్పోవడం కంటే నిజమైన ప్రేమే ముఖ్యమనే సందేశంతో ఈ సినిమాను రూపొందించారు. అక్కడక్కడ బోల్డ్ జోక్స్, స్కిన్ షో ఉన్నప్పటికీ.. మరీ గీత దాటే ప్రయత్నం చేయలేదు. అయితే సినిమాలో కొత్తదనంలేదు. కథా కథనాలు కూడా గొప్పగా లేవు. తెలిసిన కథ అయినప్పటికీ.. ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ తో బోర్ కొట్టకుండా నడిపే ప్రయత్నం చేశారు. అదే ఈ సినిమాని కాపాడింది. వినోదాన్ని పంచుతూనే.. చివర్లో ఈ తరానికి కావాల్సిన ఓ మంచి సందేశాన్ని ఇచ్చారు.    నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: శ్రీహాన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. అతని కామెడీ టైమింగ్ ప్రేక్షకులను నవ్వించింది. గీతానంద్ కూడా ఈజ్‌తో నటించాడు. రోనీత్ రెడ్డి తన పాత్రలో పర్వాలేదు అనిపించదు. మిత్రా శర్మ, జెనీఫర్ ఇమ్మానుయేల్, అన్షులా ధావన్ ఆకట్టుకున్నారు.  స్మరణ్ సాయి అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయింది. నేపథ్య సంగీతం సన్నివేశాలకు తగ్గట్టు బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాల పనితీరు బాగానే ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.   ఫైనల్ గా... 'వర్జిన్ బాయ్స్'లో యూత్ కి నచ్చే అంశాలు బాగానే ఉన్నాయి. ఓ మంచి సందేశం కూడా ఉంది. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే సినిమా నచ్చే అవకాశముంది.   రేటింగ్: 2.75/5  
Cast: David Corenswet, Rachel Brosnahan, Nicholas Hoult, Edi Gathegi, Anthony Carrigan, Nathan Fillion, Isabela Merced Crew:  Based on DC Comics Cinematography by Henry Braham Music by John Murphy, David Fleming Edited by William Hoy, Craig Alpert Written & Directed by James Gunn Produced by Peter Safran, James Gunn DC Comics have tried to build on momentum created by Christopher Nolan with Dark Knight trilogy to create DCEU and fight with Marvel Cinematic Universe, MCU. But Zack Snyder could not deliver on Man of Steel, Superman vs Batman: Dawn of Justice, Suicide Squad, Justice League did not work as anticipated. Aquaman, Wonder Woman worked big time but their sequels did not work and hence, they brought in James Gunn to revamp. He directed and produced Superman as first one from new DCU. Let's discuss about the movie in detail.  Plot:  Lex Luthor (Nicholas Hoult) hates Superman (David Corenswet), who has been saving people from major calamities over past 3 years. He has announced himself and Lex wants to hurt him and eliminate him. He creates a huge military problem between Jahranpur and Borovan borders. He plans to blame Superman and even on social media negativity against him, increases. Lois Lane (Rachel Brosnahan) his girlfriend tries to understand what he is going through with all this. How Superman will overcome this obstacle by Lex? What more challenges he created for him? Watch the movie to know more.  Analysis:  David Corenswet looks good as Superman but he doesn't get much to perform as per stunts or in emotional scenes. While there are sequences that talk about his relationship with humans, human family, love and people, James Gunn doesn't give him that space to really explore his full potential as an actor. Still, he makes an impression and Rachel Brosnahan did well. Nicholas Hault did his best to make sense of Lex Luthor character but it is not well defined.  James Gunn's quirky humor sense worked well in Guardians of Galaxy films has the characters have in-built quirkiness and goofiness. But Superman is more serious as a character and more powerful. We have seen Superman taking on huge challenges rather than just political issues on Earth. This political issue seems to be convoluted and not clearly defined. The Blackhole built artifically doesn't really terrorise as much as it seems impossible to create.  But in human side of the story, James Gunn is able to create some good sequences in human relationship ones. Mainly, the father and son conversation between Clark Kent and his father is well written. But other sequences just don't really stand out. It feels like an episode of a series than a film that showcases how Superman is defining himself. More or less, James Gunn seems to have gone for a safe bet where he needed the movie to at least be a watchable flick.  In writing, we don't see him trying much different from his Guardians of Galaxy films. Few sequences also seem to be a repeat from his GOG films too. Nathan Fillion's Green Lantern, Hawk Girl and others do have important sequences but they do not really leave an impact. Overall, the movie ends up being a decent flick compared to DC films from recent past. So, we can say it as a watchable film, only if you have very low expectations.  Bottomline:  This Superman doesn't fly high as he doesn't get such a platform or space.  Rating: 2.75/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. So, we would encourage viewers' discretion before reacting to them. 
  మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆగస్టు 27న 'మాస్ జాతర'తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో చేస్తున్న ప్రాజెక్ట్.. 2026 సంక్రాంతికి విడుదల కానుంది. అలాగే 'మ్యాడ్' కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యాడు. అది డిసెంబర్ లో పట్టాలెక్కే అవకాశముంది. ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.   రవితేజకు ఇటీవల దర్శకుడు శివ నిర్వాణ ఓ కథ చెప్పినట్లు తెలుస్తోంది. శివ చెప్పిన స్టోరీకి ఇంప్రెస్ అయిన రవితేజ.. సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ ప్రాజెక్ట్ రూపొందనుందని వినికిడి. ఈ సినిమాకి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.   'నిన్ను కోరి', 'మజిలీ' సినిమాలతో ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు శివ నిర్వాణ. మూడో చిత్రం 'టక్ జగదీష్' నేరుగా ఓటీటీలో విడుదలైంది. గత చిత్రం 'ఖుషి' భారీ అంచనాలతో థియేటర్లలో అడుగుపెట్టి, ఆశించిన ఫలితాన్ని అందుకోలేక పోయింది. ఈ చిత్రాన్ని మైత్రి సంస్థ నిర్మించడం విశేషం. అయితే 'ఖుషి' ఆశించిన విజయాన్ని అందుకోనప్పటికీ.. శివ నిర్వాణ ప్రతిభ మీద నమ్మకంతో.. మైత్రి మరో సినిమా నిర్మించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.   ఇటీవల రామ్ పోతినేనికి కూడా శివ నిర్వాణ కథ చెప్పినట్లు వార్తలొచ్చాయి. మరి అది ఇది ఒకే కథేనా? లేక వేరు వేరు కథలా? అనేది తెలియాల్సి ఉంది.  
  సినిమా పేరు: ఓ భామ అయ్యో రామ తారాగణం: సుహాస్, మాళవిక మనోజ్,అనిత, బబ్లూ పృథ్వీ, అలీ, ప్రభాస్ శ్రీను, రవీంద్ర విజయ్, సాత్విక్ ఆనంద్ తదితరులు సంగీతం: రాధాన్ ఫొటోగ్రఫీ : మణికంధన్  ఎడిటర్: భవిన్ ఎమ్ షా  రచన, దర్శకత్వం: రామ్ గోదాల  నిర్మాత:హరీష్ నల్లా బ్యానర్: వి ఆర్ట్స్,   విడుదల తేదీ: జూలై 11 ,2025    సుహాస్(Suhas) హీరోగా తమిళ 'జో'మూవీతో ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్న 'మాళవిక మనోజ్'(Malavika Manoj) హీరోయిన్ గా నటించిన చిత్రం 'ఓ భామ అయ్యో రామ' (Oh Bhama Ayyo Rama). ప్రచార చిత్రాలతో మంచి బజ్ ని క్రియేట్ చేసుకోగా, ఈ రోజు థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.   కథ  రామ్ (సుహాస్) తన పదేళ్ల వయసులోనే తల్లి మీనాక్షి(అనిత) చనిపోవడంతో ఆమె జ్ఞాపకాలతో బతుకుతుంటాడు. సినిమా అంటే ఇష్టం ఉండదు. కానీ స్క్రీన్ పై సినిమా చూడకుండా, థియేటర్ ఆవరణలోనే సినిమా తాలూకు మాటలు వింటు, సినిమా హిట్టా, ప్లాపా అని చెప్పడంలో మంచి నేర్పరి. ఫారెన్ లో ఉన్నత చదువు కోసం వెళ్లాలనే లక్ష్యంతో  ఉంటాడు. కానీ తన చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటనని గుర్తు చేసుకొని భయపడుతుంటాడు. సత్యభామ అలియాస్ సత్య(మాళవిక మనోజ్) అనే మిలినియర్(బబ్లూ పృథ్వీ) కూతరు రామ్ జీవితంలోకి వస్తుంది. ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరి కంటే తనే అందగత్తెని  అనే కాన్ఫిడెన్స్ తో ఉంటు, చాలా సరదాగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటుంది. రామ్, భామ ఒకరికొకరు ప్రేమించుకుంటారు. రామ్ పెద్ద సినిమా దర్శకుడు అవ్వాలని  అసిస్టెంట్ డైరెక్టర్ గా భామ జాయిన్ చేస్తుంది. సినిమా అంటే ఇష్టం లేని రామ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవుతాడు. రామ్ జీవితంలోకి సత్య ఎందుకు వచ్చింది? ఫారెన్ వెళ్లే వ్యక్తిని ఎందుకు అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ చేసింది? రామ్ చిన్నప్పటి జీవితానికి భామకి ఏమైనా సంబంధం ఉందా? రామ్ తల్లి మీనాక్షి ఎవరు? ఆమె ఏ విధంగా చనిపోయింది? సినిమా అంటే రామ్ కి ఇష్టం లేకపోవడానికి కారణం ఏంటి? ఏ విషయాన్నీ గుర్తు చేసుకొని రామ్ పెద్దయ్యాక కూడా భయపడుతున్నాడు? అసలు రామ్ జీవితంలోకి భామ ఎందుకు వచ్చింది?  చివరకి ఆ ఇద్దరు ఒక్కటయ్యారా లేదా అనేదే ఈ చిత్ర  కథ.    ఎనాలసిస్  ఖచ్చితంగా 'ఓ భామ అయ్యో రామ' మంచి కథతోనే తెరకెక్కింది. ఆడవాళ్ళ గొప్పతనం గురించి చాలా చక్కగా చెప్పారు. కానీ కథనంలోని లోపల వల్ల అంతగా కనెక్ట్ అవ్వదు. ఎన్నో  సినిమాల ఇన్ స్పిరేషన్ తో అక్కర్లేని సన్నివేశాలు పెట్టి మంచి కథని చేరువ కాకుండా చేసారు. ఫస్ట్ హాఫ్ ఓపెన్ చేస్తే   రామ్ ఇంట్రడక్షన్ తో పాటు తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం, ఆ తర్వాత భామ ఇంట్రడక్షన్, ఆమె క్యారక్టర్ ని మలిచిన తీరు ఇవన్నీ మూవీపై మంచి ఆసక్తిని కలిగించాయి. కానీ ఆ తర్వాత నెమ్మది నెమ్మది గా రామ్ క్యారక్టర్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు. ఈ విషయమే సినిమాకి ప్రధాన లోపం. భామ క్యారక్టరయిజేషన్  మాత్రం చాలా బాగుంది. రామ్ కి సంబంధించిన గతం భామకి ఏమైనా తెలుసా అనే ఆసక్తిని  కలిగించింది. కాకపోతే ఆ ఇద్దరి మధ్య వచ్చిన సన్నివేశాలు మాత్రం ఆకట్టుకోలేదు. రామ్ అండ్ ఫ్రెండ్స్, రామ్ మేనమామ అలీ మధ్య వచ్చిన సన్నివేశాలు కూడా ఆకట్టుకొని విధంగా ఉన్నాయి. రామ్ తో భామ సినిమా కథలు చెప్పే సన్నివేశాలు కొత్తగా ఉన్నా కామెడీ వర్క్ అవుట్ కాలేదు. డైలాగులు కూడా ప్రధాన మైనస్ గా నిలిచాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ లో చూసుకుంటే రామ్ తల్లి మీనాక్షి ఫ్లాష్ బ్యాగ్ బాగుంది. ఎంతలా అంటే  సినిమా మొత్తంపై ఆ ఎపిసోడ్  హైలెట్ అని చెప్పవచ్చు. క్లైమాక్స్ విషయంలో మరింత శ్రద్ధ చూపించాల్సింది.   నటీ నటులు సాంకేతిక నిపుణుల పని తీరు సుహాస్ ఎప్పటిలాగానే రామ్  క్యారక్టర్ లో కథకి సూటయ్యేలా నటించాడు. తన గత చిత్రాల్లో లేని విధంగా డాన్స్ లో మెప్పించాడు. భామ క్యారక్టర్ లో తమిళ నటి 'మాళవిక మనోజ్' ఒక రేంజ్ లో నటించింది. ఎంతలా అంటే తను స్క్రీన్ పై కనపడుతున్నంత సేపు హుషారుని తీసుకొచ్చింది. సీన్స్ ఎలివేషన్ బాగోలేకపోయినా, అచ్చ తెలుగు అమ్మాయిగా నటనతో, అందంతో మూవీకి నిండు తనాన్ని తీసుకొచ్చింది. రామ్  తల్లిగా చేసిన నువ్వు నేను ఫేమ్  హీరోయిన్ అనిత, ఆమె భర్త క్యారక్టర్ లో చేసిన రవీంద్ర విజయ్, అలీ, భామ తండ్రిగా చేసిన  బబ్లూ పృథ్వీ తమ పాత్ర పరిధి మేరకు నటించారు. ఇక దర్శకుడు రామ్ గోదాల(Ram Godala)డైరెక్టర్ గా పర్వాలేదని అనిపించినా, రచయితగా ఫెయిల్ అయ్యాడు. మంచి కథ కి మంచి స్క్రీన్ ప్లే ని సమకూర్చులేకపోయాడు. నిర్మాణ విలువలు మాత్రం ఎక్స్ లెంట్ గా ఉన్నాయి, మ్యూజిక్, ఆర్ .ఆర్ ఒక మాదిరిగా ఉన్నా ఫొటోగ్రఫీ బాగుంది.   ఫైనల్ గా చెప్పాలంటే... మంచి కథని ఎంచుకున్నారు. కానీ స్క్రీన్ ప్లే  విషయంలో ఇంకొంచం జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. హీరోయిన్ మాత్రం తన పెర్ ఫార్మెన్స్, అందంతో చివరిదాకా థియేటర్ లో కుర్చోపెట్టింది.    రేటింగ్ 2.5/5                                                                       - అరుణాచలం    Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. We would encourage viewers' discretion before reacting to them.
  Cast: Suhas, Malavika Manoj, Ravindra Vijay, Anitha Hassanandhani, Ali, Babloo Prithviraj, Satvik Anand, Nayani Pavani  Crew:  Cinematography by Manikandan  Edited by Bhavin M Shah Music by Radhan Written & Directed by Ramu Godhala  Produced by Harish Nalla    Suhas has been growing into a reliable leading man in Telugu Cinema with his unique script selection. But his films have been struggling at the box office, recently. Now, his movie Oh Bhama Ayyo Rama released today. Let's discuss about the movie in detail.    Plot:  Ram (Suhas) has a troubled childhood and he grows into a coward, fearful and uninitiated. He is a brilliant student in college. One night, he saves Satyabhama (Malavika Manoj) when she is drunk. She gets obsessed by him and starts to stalk him. Later, she starts to take him on weird dates telling him stories. He starts to fall in love with her and accepts her. She asks him to join under Harish Shankar as an assistant, as she always wanted to become a director but as her family won't allow, he should for her. Ram accepts and he starts working hard. Suddenly, she tells him that they should take three years break to meet again. Why? What happens to her and their relationship? Watch the movie to know more.    Analysis:  Suhas is good in the role but he is let down by confused writing and execution. His role lacks any sort of depth and it suffers with unimaginative writing all over. In trying to narrate his story in a new age screenplay, the director fails to engage audiences into his struggle.  It feels like Malavika Manoj's character is just written to narrate his story and bring him out of his misery with no proper character for her. While she is beautiful and did well, writing for her character is pathetic. While trying to make her unpredictable and keep audiences guessing, the writer lost giving her character any sense.  As the writing and directing don't have a proper direction, the narrative just gets tiring. The movie looses any sort of novelty with the convoluted narrative. Even Ali, Ravindra Vijay, Babloo Prithviraj, Satvik Anand couldn't really save this film from falling into its own traps of mediocrity and amateurish execution.    Bottomline:  The movie fails in engaging audiences and lacks coherence.    Rating: 2.5/5     Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. We would encourage viewers' discretion before reacting to them.  
మూవీ: నరివెట్ట నటీనటులు: టొవినో థామస్, సూరజ్ వెంజరమూడి, చేరన్, ఆర్య సలీమ్, ప్రణవ్, ప్రియంవద కృష్ణన్ తదితరులు ఎడిటింగ్:  షమీర్ మహమ్మద్ సినిమాటోగ్రఫీ: విజయ్ మ్యూజిక్: జేక్స్ బిజోయ్ నిర్మాతలు: షియాస్ హసన్, టిప్పుషాన్ దర్శకత్వం: అనురాజ్ మనోహర్ ఓటీటీ: సోనీ లివ్ కథ:  వర్జీస్ పీటర్ (టొవినో థామస్) ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు. చిన్న చిన్న పోస్టుల్లో అవకాశం వచ్చినా వాటిలో చేరేందుకు ఆసక్తి చూపడు. మరోవైపు తన చిన్నప్పటి స్నేహితురాలు సోఫియా (ప్రియంవద కృష్ణన్), వర్ఘీస్ ఇద్దరు ప్రేమించుకుంటారు. అయితే, ఉద్యోగం ఉంటేనే పెళ్లి గురించి మాట్లాడమని సోఫియా తండ్రి కండిషన్ పెడతాడు. దీంతో ఇష్టం లేకపోయిన కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరతాడు వర్ఘీస్. అక్కడే అతడికి హెడ్ కానిస్టేబుల్ బషీర్ (సూరజ్ వెంజరమూడి) పరిచయమవుతాడు. అన్నివిధాలా అండగా ఉంటాడు. ఈ క్రమంలోనే వర్ఘీస్ ఉన్న బెటాలియన్ వయనాడ్ అడవుల్లో ఇళ్ల కోసం గిరిజనులు చేస్తున్న ఆందోళన కార్యక్రమం బందోబస్తుకు వెళ్లాల్సి వస్తుంది. మరి వయనాడ్ వెళ్లిన అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? బషీర్ కనబడకుండా పోవడానికి కారణమేంటి? ఆ సంఘటన వల్ల వర్ఘీస్ జీవితం ఎలా మలుపు తిరిగిందనేది మిగతా కథ. విశ్లేషణ: ఇది వర్ఘీస్ అనే కానిస్టేబుల్ , బషీర్ అనే హెడ్ కానిస్టేబుల్ చుట్టూ సాగే కథ. నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనలని బేస్ చేసుకొని తీసిన కథే ఈ 'నరివెట్ట'.  ఇందులో కానిస్టేబుల్స్ తమ విధులని చేస్తూనే పైఅధికారుల నుండి ఉండే ప్రెజర్ ని దాటి ఓ పెద్ద కుట్రని బయటపెడతారు. దర్శకుడు అనురాజ్ మనోహర్ ఎంచుకున్న కథా పాయింట్ బలమైనదే మరి దానిని ప్రెజెంట్ చేయడంలో కొంతవరకు సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే కథ చాలా స్లోగా సాగుతుంది. హీరో, హీరోయిన్ మధ్య సాగే సీక్వెన్స్ అంతా బోరింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఓవైపు సీరియస్ సిచువేషన్ జరుగుతుంటే అదంతా చూపించడం మానేసి హీరో, హీరోయిన్ మధ్య లావ్ ట్రాక్ కాస్త ఇబ్బంది పెడుతుంది. ఫస్టాఫ్ చెప్పగా స్లోగా సాగుతుంది. సెకెంఢాఫ్ లో బషీర్ తప్పిపోయిన నుండి కథ ఎంగేజింగ్ గా సాగుతుంది. ఇంకా చివరి ముప్పై నిమిషాలు కథలో వచ్చే ట్విస్ట్ లు‌ ఆకట్టుకుంటాయి. పోలీసుల దౌర్జన్యం, ఆదివాసీల దుర్బల జీవితాలను దర్శకుడు కళ్లకు కట్టినట్లు చూపించిన తీరు బాగుంది. కానీ బలమైన ఇంపాక్ట్ రాలేదు. అడల్ట్ సీన్లు లేవు. అశ్లీల పదాలు లేవు. అలా అని కుటుంబంతో కలిసి చూసేంత గా ఏమీ లేదు. లవ్ ట్రాక్ బోరింగ్ గా సాగుతుంది. ‌ఇంకా బషీర్, వర్ఘీస్ ల మధ్య ఇంకాస్త బాండింగ్ ఉంటే బాగుండేది. కాన్సెప్ట్ బాగున్నప్పటికి దానిని ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు కాస్త వెనుకబడ్డాడు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా సెకెంఢాఫ్ లో వచ్చే బిజిఎమ్ ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల పనితీరు:  వర్ఘీస్ గా టొవినో థామస్, బషీర్ గా సూరజ్ వెంజరమూడి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సోఫియాగా ప్రియంవద కృష్ణన్ తమ పాత్రకి న్యాయం చేశారు.‌ ఇక మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు.  ఫైనల్ గా : జస్ట్ ఒకే.. వన్ టైమ్ వాచెబుల్ రేటింగ్: 2.5 / 5  ✍️.దాసరి మల్లేష్
  హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే మెజారిటీ సినిమాలు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. ఇప్పుడదే బాటలో 'కుబేర' కూడా పయనిస్తోంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించారు. (Kuberaa on OTT)   ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కుబేర'. జూన్ 20న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ క్రైమ్ డ్రామా.. విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల మెప్పు పొందింది. వరల్డ్ వైడ్ గా రూ.130 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన కుబేర.. మంచి విజయాన్ని సాధించింది. త్వరలో ఈ సినిమా ఓటీటీలో అడుగుపెట్టనుంది.   'కుబేర' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని జూలై 18 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.   ఇటీవల పలు సినిమాలు ఓటీటీ కోసం హిందీ మార్కెట్ ను కూడా వదులుకుంటున్నాయి. నేషనల్ చైన్స్ లో హిందీ వెర్షన్ రిలీజ్ చేయాలంటే.. 8 వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేసే కండిషన్ కి ఒప్పుకోవాలి. చాలా సినిమాలు హిందీ థియేట్రికల్ బిజినెస్ ని కాదనుకొని.. ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నాయి. అదే బాటలో 'కుబేర' కూడా పయనించింది.  
  హీరోలకు సమానమైన క్రేజ్ ను సంపాదించుకున్న అతి కొద్దిమంది హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. ఒక దశాబ్ద కాలం పాటు తెలుగునాట తిరుగులేని స్టార్డంను చూసింది. అలాంటి అనుష్క.. కొన్నేళ్లుగా సినిమాలు తగ్గించింది. బయట కూడా పెద్దగా కనిపించట్లేదు. దీంతో అసలు అనుష్కకు ఏమైంది? అనే చర్చ జరుగుతోంది. (Anushka Shetty)   'బాహుబలి-1' విడుదలై ఈ జూలై 10కి పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా మూవీ టీమ్ రీ-యూనియన్ అయింది. ఈ రీ-యూనియన్ కు రాజమౌళి, ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ ఇలా అందరూ హాజరయ్యారు. కానీ, అనుష్క మాత్రం మిస్ అయింది. బాహుబలి అనేది తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్ళిన చిత్రం. అంతటి గొప్ప చిత్రం పదేళ్ళ రీ-యూనియన్ కి అనుష్క రాకపోవడం అభిమానులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదొక్కటనే కాదు.. ఇతర ఈవెంట్లలోనూ అనుష్క పెద్దగా కనిపించట్లేదు. అయితే ఆమె బయటకు రాకపోవడానికి బలమైన కారణం ఉంది అంటున్నారు.   'బాహుబలి-1', 'బాహుబలి-2'కి మధ్యలో 'సైజ్ జీరో' అనే ఓ సినిమా చేసింది అనుష్క. ఎంతో ఫిట్ గా ఉండే అనుష్క.. ఆ సినిమా కోసం రిస్క్ చేసి మరీ, బాగా బరువు పెరిగింది. కానీ, అదే ఆమె కొంపముంచింది. అప్పటినుంచి అనుష్క సన్నబడటానికి ఎంత ట్రై చేసినా.. మునుపటి శరీరాకృతి రావట్లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. కొన్నేళ్లుగా అనుష్క చేస్తున్న సినిమాల్లో ఆమెను సన్నగా చూయించేందుకు సీజీ ఉపయోగిస్తున్నారని అంటుంటారు. అందుకే అనుష్క సినిమాలు చాలా తక్కువ చేస్తుందని, బయటకు కూడా పెద్దగా రావట్లేదని చెబుతున్నారు.   'సైజ్ జీరో' అనే ఒకే ఒక్క సినిమా అనుష్క కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపించిందని అంటున్నారు. ఆ సినిమా చేయకపోయినా లేదా ఆ సినిమా కోసం అలా బరువు పెరగకుండా ఉన్నా.. అనుష్క కెరీర్ మరోలా ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనుష్క మునుపటిలా ఫిట్ గా ఉంటే.. బాహుబలి తర్వాత పాన్ ఇండియా వైడ్ గా ఎందరో స్టార్ హీరోల సినిమాలు, ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేసేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు బరువు తగ్గలేకపోవడం వల్ల.. పెద్దగా సినిమా చేయట్లేదు, బయటకు కూడా రావట్లేదని అనుష్క ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.  
గత కొన్నిరోజులుగా టాలీవుడ్‌ కామెడీ విలన్‌ ఫిష్‌ వెంకట్‌ అనారోగ్య కారణాల వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ వెంకట్‌ కుమార్తె స్రవంతి మీడియాకు తెలియజేశారు. దీనిపై స్పందించిన ‘జెట్టి’ సినిమా హీరో కృష్ణ మానినేని తన ఫౌండేషన్‌ తరఫున రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందించారు. పిఆర్‌కె హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఫిష్‌ వెంకట్‌ని పరామర్శించిన కృష్ణ మానినేని అక్కడి వైద్యులతో మాట్లాడారు. వైద్య ఖర్చుల నిమిత్తం తమ 100 డ్రీమ్స్‌ ఫౌండేషన్‌ తరఫున రూ.2లక్షలు వెంకట్‌ కుమార్తె స్రవంతికి అందించారు. కృష్ణ అందించిన ఈ సాయం తమకెంతో ఆసరాగా నిలుస్తుందని, ఆయన గొప్ప మానవతావాది అని స్రవంతి కృతజ్ఞతలు తెలిపారు.  ఈ సందర్భంగా కృష్ణ మానినేని మాట్లాడుతూ ‘100 డ్రీమ్స్‌ ఫౌండేషన్‌ని ఒక కార్యమ్రం అయిన పునరపి(అవయవ దానం అవగాహన కార్యక్రమం) మా ఆశయం మాత్రమే కాదు, అవసరంలో ఉన్నవారికి జీవితం ఇవ్వాలన్న సంకల్పం. అవయవ దానం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒక్క నిర్ణయం..ఒక జీవితం’ అని తెలిపారు.
  Energetic Star Ram Pothineni is presently starring in a first-of-its-kind entertainer Andhra King Taluka, being helmed by Mahesh Babu P and produced ambitiously by Naveen Yerneni and Y. Ravi Shankar under the prestigious Mythri Movie Makers banner. The production works of the movie are progressing at fast pace.   Meanwhile, the film’s new month-long shooting schedule commenced today in a set erected in Hyderabad. Currently, love sequences featuring the lead pair, Ram and Bhagyashree Borse, are being filmed against a night backdrop. This night schedule will continue for 10 days, after which the team will shift to daytime shoots for the next 20 days to film the climax and other key scenes. With this final schedule, it will be a wrap for the film’s shoot.   The movie also features Kannada superstar Upendra in a pivotal role. The title glimpse, which was released earlier, received an enthusiastic response and has heightened anticipation for the film.   Siddhartha Nuni handles the cinematography, while the music is composed by the talented duo Vivek–Merwin. National Award-winning editor Sreekar Prasad is part of the movie, with popular production designer Avinash Kolla is crafting the visual aesthetic.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం  ఉద్దేశ్యం ప్రపంచంలోని జనాభాకు సంబంధించిన సమస్యలపై ప్రజల దృష్టిని ఆకర్షించడం. 2025 నాటికి ప్రపంచ జనాభా 806.19 కోట్లు దాటిందని అంచనా. ఐక్యరాజ్యసమితి 1989లో ఈ దినోత్సవాన్ని  ప్రకటించింది. కానీ దీనిని మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా జూలై 11, 1990న జరుపుకున్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకోవడం  అంటే   జనాభా లెక్కలను ప్రజలకు తెలియజేయడమే కాదు, పెరుగుతున్న జనాభా కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడం,  వాటికి పరిష్కారాలను కనుగొనడం.  ప్రపంచ వ్యాప్తంగా జనాభా విషయంలో వివిధ దేశాలు వివిధ రకాల సమస్యలను ఎదుర్కుంటున్నాయి.  భారతదేశ జనాభా గురించి, పరిస్థితుల గురించి వివరంగా తెలుసుకుంటే.. ప్రతి సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దినోత్సవ వేడుకలు 1990 జూలై 11న ప్రారంభమయ్యాయి. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం పాలక మండలి ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలను ప్రారంభించింది. 1989లో ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలను ప్రకటించింది. ఈ రోజు అంటే జూలై 11, 1987న ప్రపంచ జనాభా సంఖ్య 5 బిలియన్లు దాటినప్పుడు ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలనే ఆలోచన వచ్చింది. ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలనే సూచనను మొదట డాక్టర్ కె.సి. జకారియా ఇచ్చారు.   2025 ప్రపంచ జనాభా దినోత్సవం  థీమ్.. ఈసారి 2025 ప్రపంచ జనాభా దినోత్సవం  ఇతివృత్తం, యువతకు న్యాయమైన,  ఆశాజనకమైన ప్రపంచంలో తమకు నచ్చిన కుటుంబాన్ని సృష్టించడానికి సాధికారత కల్పించడం. భారతదేశ జనాభా..    ఐక్యరాజ్యసమితి ప్రకారం, 2025 నాటికి భారతదేశ జనాభా 1,463.9 మిలియన్లుగా ఉండే అవకాశం ఉంది.  భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. నివేదికల ప్రకారం, రాబోయే 40 సంవత్సరాలలో ఈ జనాభా 1.7 బిలియన్లకు చేరుకుంటుంది. అత్యధిక జనాభా కలిగిన 10 దేశాలు.. ప్రస్తుతం ప్రపంచ జనాభా దాదాపు 8.2 బిలియన్లు. అత్యధిక జనాభా కలిగిన దేశాలలో భారతదేశం  అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా చైనా, అమెరికా, ఇండోనేషియా, పాకిస్తాన్, నైజీరియా, బ్రెజిల్, బంగ్లాదేశ్, రష్యా,  ఇథియోపియా ఉన్నాయి. టాప్ 10 దేశాలు ఇవే..   1. భారతదేశ జనాభా (అంచనా) - 1.46 బిలియన్ 2. చైనా జనాభా - 1.42 బిలియన్ 3. అమెరికా జనాభా - 347 మిలియన్లు   4. ఇండోనేషియా జనాభా - 286 మిలియన్లు 5. పాకిస్తాన్ జనాభా - 255 మిలియన్లు 6. నైజీరియా జనాభా - 238 మిలియన్లు 7. బ్రెజిల్ జనాభా - 213 మిలియన్లు 8. బంగ్లాదేశ్ జనాభా - 176 మిలియన్లు 9. రష్యా జనాభా - 144 మిలియన్లు 10. ఇథియోపియా జనాభా - 135 మిలియన్లు                                      *రూపశ్రీ.
విజయం సాధించాలంటే ఎలాంటి మనస్తత్వం వుండాలి? వ్యక్తి ఏరకంగా ఆలోచిస్తే గెలుపు పొందగలడు? అతనిలో ఎలాంటి భావనవుండాలి? ఈ విషయాల గురించి ఒక్కొక్కరు ఒకో విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలుగుతారు. అయితే జీవితంలో ఎన్నో అనుభవాలు చూసి, ఎంతో పరిణితి కలిగిన వ్యక్తి అయితే దానికి చెబుతున్న వివరణ సరైనదేనా కాదా అని చెప్పగలుగుతారు.  ఒకానొకప్పుడు ఒక ఆంగ్ల దినపత్రిక గెలుపుకూ ఓటమికీ తేడా ఎంత??  అనే విషయం గురించి జరిగిన సంఘటనలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ వ్రాసినవారికి బహుమతులు ఇస్తామని ప్రకటించింది. దానికోసం ఎంతోమంది ఎన్నో విషయాలను కథలుగా రాసి పంపారు. వాటిలో ఇద్దరు వ్యక్తులు రాసిన కథలు బహుమతులకు ఎంపికయ్యాయి. ఆ రెండు కథలలో ఒక కథను మనం చదివితే మనకు గెలుపు, ఓటమి గురించి ఓ నిర్ధిష్టమైన అవగాహన, నమ్మకం ఏర్పడుతాయి.  ఒక నట్టనడి సముద్రంలో ఒక ఓడ మునిగిపోయింది. అక్కడ అందరూ తమని తాము కాపాడుకోవడానికి అందులో ఏర్పాటు చేసిన లైఫ్ బోట్ లను, చిన్న పడవలను ఉపయోగించుకుంటున్నారు. అవి కొద్దిమొత్తమే ఉండటంతో ఆ ఓడలో ఉన్న అందరికీ అవి సరిపోలేదు. దాంతో ఎంతోమంది ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని సముద్రపు నీళ్లలో ఉక్కిరిబిక్కరి అవుతున్నారు. సముద్రపు ఒడ్డు ఎంత దూరంలో ఉందొ తెలియకపోయినా ఆశతో ఈదుకుంటూ పోతున్నారు.   ఐదుగురుమాత్రం ఎలాంటి రక్షణ లేకుండా సముద్రంలో  ఈదుతూ వున్నారు. వారికి జీవితం మీద ఆశ వారిని అలా ఈదేలా చేస్తోంది. ఒడ్డు అనేది వారికి వందల మైళ్ళ దూరంలో ఉంది. వారిలో నలుగురికి నిరాశ ఏర్పడింది. ఆఖరుకు మొసళ్ళకు ఆహారం కావలసివస్తుందే అని ఒకడు, ఈనీటిలో చావాలని భగవంతుడు రాసిపెట్టాడని మరొకడు, భార్యాపిల్లలు ఆఖరు క్షణంలో దగ్గరలేక పోయారే అని ఇంకొకడు, తన బ్యాంకులో డబ్బు ఖర్చు చేయకపోతినే అని మరొకడు, ఇలా వాళ్ళకళ్ళముందు తాము అనుభవించని సంతోషాలు, సుఖాల గురించి గుర్తు తెచ్చుకుని బాధపడసాగారు. నలుగురూ తామిక జీవించే ఆశలేదని మనస్సులో నమ్మకానికి వచ్చారు. ఆఖరుకు తమకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం భగవంతుడే అని ఆ భగవంతుని నిందించడం ప్రారంభించారు. ఎప్పుడైతే వారి మనస్సులో బలహీనత వచ్చిందో అప్పటినుంచీ వాళ్లు సరిగా ఈదలేక మరణించారు. అయితే ఆ ఐదో వ్యక్తిమాత్రం “నేను చావను. భగవంతుడు నన్ను అనవసరంగా సృష్టించాడంటే నమ్మను. నేను బ్రతికి తీరాలి" అంటూ శక్తినంతా కూడగట్టుకొని ఈదడం ప్రారంభించాడు. అతడలా ఈడుతూ ఉన్నప్పుడు దృఢనిశ్చయం లేని ఆ నలుగురూ మరణించిన ఐదు నిముషాలకే ఒక విమానం అటు రావడం, దానిలోనివారు ఈదుతున్న వ్యక్తిని చూసి రక్షించడం జరిగింది! ఓడ మునుగుతున్నపుడు కెప్టెన్ వైర్ లెస్ ద్వారా చేసిన విజ్ఞప్తి వలన ఆ విమానం అక్కడికి వచ్చిందని అతడు తర్వాత తెలుసుకున్నాడు. మరణించిన నలుగురిని గుర్తు చేసుకొని విజయానికీ ఓటమికీ తేడా ఐదు నిముషాలని అతడు చెబుతాడు. ఇదీ ఓ కథ. మనిషి జీవితంలో విజయం కోసం పోరాడుతూ మధ్యలో ఏదో నిరాశను తెచ్చుకుని దానికారణంగా పోరాటాన్ని అపకూడదని చెప్పే కథ.                                ◆నిశ్శబ్ద.
పిల్లలను పెంచడం పిల్లల ఆట కాదు. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డకు మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటారు. దానికి తగినట్టే అన్నీ వారికి అందించాలని అనుకుంటారు. కానీ చాలా సార్లు, తెలిసి లేదా తెలియకుండా తల్లిదండ్రులు కొన్ని తప్పులు చేస్తారు. అవి పిల్లలపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతాయి. కొన్ని పరిస్థితులలో పిల్లలను తిట్టడం వారి మెదడు,  మానసిక పెరుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంటున్నారు. పిల్లలను  ఎప్పుడు తిట్టకూడదో,  దీని వెనుక కారణాలు ఏమిటో తెలుసుకుంటే.. పిల్లలు భయంలో ఉన్నప్పుడు.. తప్పు చేసిన తర్వాత పిల్లలు కొన్నిసార్లు భయపడతారు. ఇలా  భయపడితే లేదా ఇప్పటికే ఏదైనా విషయం గురించి ఒత్తిడిలో ఉంటే, ఈ సమయంలో పిల్లలను తిట్టడం సరైనది కాదు. అలాంటి పరిస్థితిలో, పిల్లల మనస్సు మరింత భయపడవచ్చు. దీని ఫలితంగా పిల్లలు తను చేసిన పనులను,  విషయాలను తల్లిదండ్రులతో  పంచుకోవడం మానేస్తాడు. అటువంటి పరిస్థితిలో పిల్లవాడు ఇప్పటికే సున్నితంగా ఉంటే అతన్ని తిట్టడానికి బదులుగా ప్రేమతో జరిగిన తప్పు గురించి   వివరించడం మంచిది. కొత్తగా ఏదైనా చేసేటప్పుడు చేసే తప్పులు.. పిల్లలు ఏదైనా విషయం గురించి  ఆసక్తిగా ఉండి, ప్రతి క్షణం కొత్తగా ఏదైనా చేయాలని లేదా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని ప్రయత్నిస్తుంటే, అలాంటి పరిస్థితిలో, పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ తిట్టకూడదు. పిల్లలు నేర్చుకునేటప్పుడు తరచుగా తప్పులు చేస్తారు. ఈ తప్పులు వారు మంచిగా మారడానికి,  వారికి గొప్ప అనుభవాలుగా సహాయపడతాయి. అందువల్ల, ప్రతి చిన్న తప్పుకు వారిని తిట్టడం వల్ల వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. దీని కారణంగా పిల్లలు కొత్తగా ఏదైనా చేసే ముందు భయపడతారు.   పిల్లలు అలసిపోయినప్పుడు.. పిల్లలు బాగా అలసిపోయినప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు, వారు ఏదైనా తినేటప్పుడు  పిల్లలను  తిట్టకూడదు. పెద్దల మాదిరిగానే పిల్లలు కూడా  అలసిపోయినా లేదా ఆకలిగా ఉన్నా వారి మానసిక స్థితి సరిగా ఉండదు. అలాంటి సమయంలో పిల్లలను తిడితే  ఇది పిల్లలకు మరింత  చిరాకు తెప్పిస్తుంది. ఆ సమయంలో పిల్లలను  తిట్టడం ప్రారంభిస్తే, విషయం మరింత దిగజారిపోతుంది.అందుకే పిల్లలను మందలించాలన్నా మొదట వారి పరిస్థితి  సాధారణ స్థితికి వచ్చాక ఆ తరువాత  తప్పు గురించి వివరించి చెప్పాలి.                                         *రూపశ్రీ.
  లాంగ్ జర్నీ చాలామందికి ఇష్టం. అయితే అనుకున్న సులువుగా వీటిని ప్లాన్ చేయడానికి ధైర్యం సరిపోదు.  దీనికి కారణం మోషన్ సిక్నెస్. దీన్నే వాంతుల సమస్య, తల తిరగడం అంటారు. ప్రయాణంలో  వాంతులు లేదా తల తిరుగుతున్నట్లు అనిపిస్తే ప్రయాణంలోని సరదా అంతా పాడైపోతుంది. మోషన్ సిక్‌నెస్ అనేది ఒక సాధారణ సమస్య, ఇది ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు,  స్త్రీలలో సర్వసాధారణం. బస్సు, కారు, రైలు లేదా విమానం..ఇలా ప్రయాణం ఎందులో అయినా సరే..  ప్రయాణించేటప్పుడు మన చెవులు, కళ్ళు,  శరీర సమతుల్యత అసౌకర్యానికి లోనైనప్పుడు , వికారం, చెమట, తల తిరగడం,  వాంతులు వంటి పరిస్థితులు తలెత్తుతాయి. అయితే ఒక రోజు ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ మోషన్ సిక్నెస్ కు చెక్ పెట్టవచ్చు. ప్రయాణాన్ని హాయిగా ఎంజాయ్ చేయవచ్చు. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే.. ఆహారం.. ప్రయాణానికి ఒక రోజు ముందు భారీ, వేయించిన,  కారంగా ఉండే ఆహారాన్ని తినకుండా ఉండాలి. ఇది కడుపులో భారంగా మారుతుంది,  గ్యాస్ లేదా ఆమ్లత్వం కారణంగా  అనారోగ్యం పెరుగుతుంది. తేలికైన, సులభంగా జీర్ణమయ్యే,  ఫైబర్ ఆధారిత ఆహారాన్ని తినాలి. నిద్ర.. అలసట,  నిద్ర లేకపోవడం శరీరాన్ని బలహీనపరుస్తుంది. ఇది ప్రయాణ సమయంలో తలనొప్పి లేదా వాంతులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రయాణానికి ఒక రోజు ముందు తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం. మందులు.. గతంలో మోషన్ సిక్‌నెస్ చాలాసార్లు జరిగి ఉంటే వైద్యుల సలహా మందులు వాడవచ్చు. ప్రయాణానికి 30-60 నిమిషాల ముందు వైద్యులు సిఫార్సు చేసిన మందులు  తీసుకోవాలి.  తద్వారా ప్రయాణం సాఫీగా సాగుతుంది. అల్లం లేదా నిమ్మకాయ నీరు.. అల్లం,  నిమ్మకాయ రెండూ కడుపుని శాంతపరచడానికి సహజ నివారణలు. అల్లం టీ లేదా గోరువెచ్చని నిమ్మకాయ నీరు ఒక రోజు ముందుగానే తీసుకోవడం మంచిది. ఇది వికారం అవకాశాలను తగ్గిస్తుంది. ముఖ్యమైన వస్తువులు.. ప్రయాణానికి ఒక చిన్న బ్యాగును సిద్ధంగా ఉంచుకోవాలి.   అందులో వాంతి బ్యాగ్, టిష్యూ పేపర్, పుదీనా క్యాప్సూల్స్, మౌత్ ఫ్రెషనర్,  వాటర్ బాటిల్ ఉండాలి.  మార్గంలో ఏదైనా అసౌకర్యాన్ని ఎదుర్కొంటే ఈ వస్తువులు సహాయపడతాయి.                                          *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
  మోకాళ్ల నొప్పులు ప్రజల జీవితాన్ని కష్టతరం చేస్తాయి. దీని కారణంగా, లేవడం, కూర్చోవడం,  నడవడం నుండి రోజువారీ పనులు చేయడంలో సమస్యలు తలెత్తుతాయి. మోకాళ్లలో నిరంతరం నొప్పితో బాధపడే వారు ఈ సమస్యకు సర్జరీ లేదా చాలా తీవ్రమైన చికిత్సలతో తప్ప నయం కాదని అనుకుంటూ ఉంటారు.  అయితే ఇంటి చిట్కాతో మోకాళ్ల నొప్పిని ఈజీగా తగ్గించవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.  ఈ చిట్కా వల్ల మోకాళ్ల నొప్పి తగ్గడమే కాదు.. హాయిగా చకచకా తిరిగేసేంత శక్తి మోకాళ్లకు వస్తుంది అంటున్నారు. ఇంతకీ ఆ చిట్కాలేంటో తెలుసుకుంటే.. మోకాళ్లలో వాపు, మోకాళ్లు బిగుసుకుపోయినట్టు ఉండటం,   నొప్పి ఎక్కువగా ఉండటం  వంటి సమస్యలను తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక పురాతన  పేస్ట్ ఉంది.    దానిని మోకాలి నొప్పి ఉన్న  ప్రాంతంపై పూసి రాత్రంతా అలాగే ఉంచాలి.  ఉదయం నిద్రలేచిన తర్వాత  చాలా ఉపశమనం కలుగుతుందట. ఈ ఆయుర్వేద పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే..   పేస్ట్ తయారీ విధానం.. మోకాలి నొప్పి నుండి సహజ ఉపశమనం పొందడానికి,  ఆయుర్వేద పేస్ట్‌ను ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని కోసం  కావలసిన పదార్థాలు.. 1 టీస్పూన్ ఆముదం 1 టీస్పూన్ తేనె 1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి 1  నిమ్మకాయ. తయారు విధానం.. ఒక గిన్నెలో అన్ని పదార్థాలను బాగా కలిపి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ చాలా గట్టిగా  లేదా చాలా పలుచగా ఉండకూడదు.  మధ్యస్థంగా మోకాలి మీద రాసినప్పుడు కారిపోకుండా లేదా తొందరగా ఆరిపోయి రాలిపోకుండా ఉండాలి. ఈ పేస్ట్ ను చాలా సులభంగా అప్లై చేయవచ్చు. తయారు చేసుకున్న ఆయుర్వేద పేస్ట్ ను పలుచని పొరలాగా మోకాలిపై నొప్పి ఉన్న ప్రాతంలో లేదా మోకాలు అంతటగా  పూయాలి.  దానిపై మెత్తని  కాటన్ వస్త్రాన్ని చుట్టాలి.  8-10 గంటలు అలాగే ఉంచాలి. దీన్ని రాత్రి సమయంలో అప్లై చేసుకుంటే చాలా మంచిది.  ఉదయం గోరువెచ్చని నీటితో సున్నితంగా శుభ్రం చేసుకోవాలి. ప్రయోజనాలు.. ఈ పేస్ట్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీన్ని పూయడం వల్ల వాపు నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది మోకాలు బిగుసుకుపోవడాన్ని  తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.                                       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..