LATEST NEWS
కడప కార్పొరేషన్ మేయర్ గా వైసీపీ కార్పొరేటర్ పాకా సురేష్ ఏకగ్రీవంగా  ఎన్నికయ్యారు. కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ఎన్నిక ప్రక్రియలో  పాక సురేష్ వినా మరెవరూ పోటీ చేయకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.   గత ఎన్నికల్లో మేయర్ గా గెలిచిన సురేష్ బాబు కుటుంబ సభ్యులు మున్సిపల్ చట్టాలను అతిక్రమించి పనులు చేపట్టారనే‌ కారణంగా కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయగా, ఆ ఫిర్యాదు మేరకు సమగ్ర విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు  నిబంధనలకు విరుద్ధంగా మేయర్ సురేష్ బాబు కుటుంబ సభ్యులు  కాంట్రాక్టులు పొందారని తేలింది. విజిలెన్స్ నివేదికను అనుసరించి సురేష్ బాబును ఈ ఏడాది సెప్టెంబర్ 23న మేయర్ పదవి నుంచి ప్రభుత్వం తొలగించింది. డిప్యూటీ మేయర్ గా ఉన్న ముంతాజ్ బేగంను ఇన్ చార్జి మేయర్ గా నియమించింది.  తాజాగా ఖాళీగా ఉన్న మేయర్ పదవికి జరిగిన ఎన్నికలో వైసీపీ కార్పొరేటర్  పాకా సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  కడప కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్ లు ఉండగా గత ఎన్నికల్లో  టిడిపి నుంచి  ఒక్క కార్పొరేటర్ మాత్రమే గెలుపొందారు. ఒక ఇండిపెండెంట్ గిలిచారు. ఈ రెండూ మినహా మిగిలిన 48 డివిజన్ లలోనూ వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు.  అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం మార డం, కడప ఎమ్మెల్యేగా టిడిపి నుంచి మాధవీ రెడ్డి గెలవడం జరిగింది .ఆ తర్వాత ఎనిమిది మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి తెలుగుదేశంలో  చేరారు. ఇద్దరు వైసీపీ కార్పొరేటర్ లు మరణించారు. దీంతో దీంతో వైసిపి కార్పొరేటర్ల సంఖ్య సంఖ్య 38గా ఉంది. అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా వైసిపి అనుకూలంగా ఉండటంతో వారి సంఖ్య 39 . ఆ కడప కార్పొరేషన్ లో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ  ఉంది.  సంఖ్యా బలం లేకపోవడంతో  గురువారం (డిసెంబర్ 11) జరిగిన మేయర్ ఎన్నికలో తెలుగుదేశం పోటీ చేయలేదు.  వైసీపీ నుండి   47 వ డివిజన్ కార్పొరేటర్ పాక సురేస్ ను మేయర్  అభ్యర్థి పోటీకి దిగి పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా గెలుపొందారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పర్యవేక్షణలో ఎన్నిక ప్రక్రియ జరిగింది.  
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీలో కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ వేదికగా జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ మీట్ వివరాలను రేవంత్ వారికి వివరించారు. ఇంతకీ రేవంత్ ఢిల్లీ ఎందుకు వెళ్లారంటే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జన్మదినం గురువారం(డిసెంబర్ 11). తన 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజకీయ ప్రముఖులను బుధవారం (డిసెంబర్ 10)రాత్రి విందు ఇచ్చారు. ఆ విందుకు తెలంగాణ సీఎం రేవంత్ హాజర్యారు.   ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ కూడా పాల్గొన్నారు.ఈ విందుకు  కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు కూడా వచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారిలో కొద్ది సేపు ముచ్చటించారు.  తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విశేషాలు వివరించారు.  
వైసీపీలో జగన్ వినా మరే నేతకూ చోటు పదిలం కాదు. మనకు పనికిరాడు అనుకుంటే.. ఒక్క క్షణం ఆలోచించకుండా పక్కన పెట్టేస్తుంది. ఈ విషయం వైసీపీలో పలువురు నేతలకు అనుభవమే. తాజాగా ఆ పార్టీ బోరుగడ్డ అనిల్ కుమార్ ను వదిలించేసుకుంది. జగన్ అధికారంలో ఉండగా ఆయన అండ, వైసీపీ దన్ను చూసుకుని మనిషన్న వాడు మాట్లాడకూడని మాటలతో అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం నాయకులను దూషించిన వ్యక్తి బోరుగడ్డ అనిల్. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్, జనసేనాని పవన్ కల్యాణ్ లక్ష్యంగా ఇష్టారీతిగా మాట్లాడిన సంగతి తెలిసిందే. అంతే కాదు జగన్ ఆదేశిస్తే చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని హతమారుస్తానంటూ కూడా బోరుగడ్డ అనిల్ మాట్లాడారు.   గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత.. బోరుగడ్డ అనిల్ కు కష్టాలు మొదలయ్యాయి. కేసులు చుట్టుముట్టాయి. అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు కూడా.  జైలుకు వెళ్లిన సమయంలోనూ, ఆ తరువాత బయటకు వచ్చి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ కూడా బోరుగడ్డ అనిల్ పదేపదే తనకు జగన్ అండ ఉందని చెప్పుకొచ్చారు.  మాటకు ముందొక జగన్, మాటకు వెనకొక జగన్ అంటూ జగన్ భజన చేసిన బోరుగడ్డ అనిల్ ను సహజంగానే వైసీపీ వ్యక్తే అని అంతా భావించారు. బోరుగడ్డ అనిల్ కూడా అలానే చెప్పుకొచ్చారు. అన్నిటికీ మించి వైసీపీ అధికారంలో ఉండగా,  చంద్రబాబు, లోకేష్, పవన్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మౌనంగా ఉండటం ద్వారా వైసీపీ అతడుమావాడే అనే సంకేతాలు ఇచ్చింది. అయితే అధికారం కోల్పోయిన తరువాత బోరుగడ్డ జైలుకు వెళ్లిన సందర్భంలో వైసీపీకి చెందిన వారెవరూ కూడా బోరుగడ్డను పరామర్శించ లేదు. సరే బోరుగడ్డ జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా తన వైఖరి మార్చుకోలేదు. నేతలపై అనుచిత వ్యాఖ్యలను మానలేదు. అదే సమయంలో తనకు జగన్ అండ ఉందనీ, తాను వైసీపీయుడనేననీ చెప్పుకుంటున్నాడు. అయితే జగన్ మాత్రం ఎవరైనా తనకు బలంగా ఉండాలి కానీ, తన బలం అండగా భావించకూడదు. వివాదాస్పద దర్శకుడు గతంలో తీసిన శివ అనే సినిమాలో విలన్ . ఎవరైనా మనకు బలం కావాలి కానీ మన బలంతో బతకకూడదు అనే డైలాగ్ చెబుతాడు. సరిగ్గా జగన్ తీరు కూడా అంతేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ పదే పదే జగన్ పేరు వల్లిస్తూ, తనకు జగన్ అండ ఉందని చెప్పుకోవడం జగన్ కు, వైసీపీకీ నచ్చలేదు.  దీంతో జగన్ పేరు చెప్పుకుంటూ తిరుగుతున్న బోరుగడ్డ అనల్ ను వైసీపీ వదిలించేసుకుంది.   పార్టీకీ బోరుగడ్డ అనిల్ కు ఏం సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.  బోరుగడ్డ అనిల్ కుమార్ తో వైసీపీకి ఎటువంటి సంబంధం లేదని ప్రకటన విడుదల చేసింది. అతడు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఇటీవల కొన్ని మీడియా ఇంటర్వ్యూల్లోనూ, సోషల్‌ మీడియా వేదికలపై కనిపించడం చెప్పుకోవడాన్ని వైసీపీ ఖండిస్తోందని పేర్కొంది. దీనిపై బోరుగడ్డ ఇంకా స్పందించలేదు. కానీ పరిశీలకులు మాత్రం బోరుగడ్డతో వైసీపీ బంధం ఒక్క ఖండన ప్రకటనతో తీరిపోయేది కాదంటున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
    అభిమానుల హంగామా  ఏంటి ఆ రికార్డు  కెరీర్ లోనే ఫస్ట్ టైం        మరికొన్నిగంటల్లో గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో డెవోషనల్ యాక్షన్ డ్రామా 'అఖండ 2'(Akhanda 2)ప్రీమియర్స్ తో అడుగుపెట్టనున్నాడు. దీంతో అభిమానులతో పాటు మూవీ లవర్స్ లో సందడి వాతారవరణం నెలకొని ఉంది. బాలకృష్ణ కెరీర్ లోనే మునుపెన్నడూ లేధంగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. దీంతో తొలి రోజు వరల్డ్ వైడ్ గా బాలయ్య రికార్డ్స్ కలెక్షన్స్ సాధించడం ఖాయమనే టాక్ సినీ సర్కిల్స్ లో వినపడుతుంది.     ఇందుకు నిదర్శనంగా యూఎస్ కి సంబంధించిన ప్రీ సేల్స్ లో ఈ రోజు ఉదయం వరకు 250 k డాలర్స్ ని రాబట్టింది. బాలయ్య కెరీర్ లోనే ఇంత ఫాస్ట్ గా బుకింగ్ జరిగిన మూవీ  అఖండ 2 నే కావడం గమనార్హం. సినీ ఎనలిస్ట్ లు కూడా 250 k డాలర్స్ వసూళ్లపై  స్పందిస్తు ప్రీమియర్స్ బిగిన్ అయ్యే లోపే 350 k డాలర్స్ ని చెరుకోవడం ఖాయమని అంటున్నారు.   also read:   దురంధర్ కి  హృతిక్ రోషన్ ఇచ్చిన రివ్యూపై విమర్శలు     ఇక యూఎస్ ప్రీమియర్ రికార్డుపై అభిమానులు స్పందిస్తు నిన్న అఖండ 2 ని యూఎస్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మోక్ష మూవీస్  అఖండ 2 గురించి మాట్లాడుతు రిలీజ్ డేట్ తేడా జరగడం వలన అఖండ 2  కి  యూఎస్ లో ఎక్కువ థియేటర్స్ ని కేటాయించలేకపోతున్నామని చెప్పారు. అయినా సరే బాలయ్య యూఎస్ సెల్యులాయిడ్ పై రికార్డులు సృష్టిస్తున్నాడని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.      
Madras High Court has issued stay on Akhanda 2 release before 4th December and the movie producers took time of a week to release it. Now, Vaa Vaathiyaar starring Karthi is similar legal troubles. The Court has issued stay on the film's release as producer KE Gnanavelraja needs to clear pending dues to a financier.  The movie was supposed to release on 5th December, but makers have decided to release it on 12th December, after last minute hurdles. Now, a financier Arjunlal Sunderdas, has gone to court stating that from 2014, Gnanavelraja has not been clearing his amount. Apparently, the producer took Rs.10.35 crores back in the year.  He explained to court that in these 11 years, Gnanavelraja did not pay any interest and the total including everything amounts to Rs.21.78 crores which needs to be settled immediately. The High Court has stated that the film cannot be released without producer clearing the amount.  Even though Gnanavelraja offered to pay Rs.3.75 crores by night and immovable properties documents as assurance, Court did not think such a settlement is probable. Well, Karthi and Krithi Shetty have been promoting the film in Telugu and Tamil states from past one week but looks like cinema will be postponed for sure.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
చిత్ర పరిశ్రమలో కొందరు దర్శకులు కొన్ని రకాల సినిమాలకే పరిమితం అవుతుంటారు. వాళ్లు ఎలాంటి సినిమాతో విజయం సాధించారో ఆ తర్వాత కూడా అదే తరహా సినిమా చెయ్యాలంటూ హీరోలు, నిర్మాతలు కోరుతుంటారు. కానీ, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, కృష్ణవంశీ వంటి దర్శకులు మాత్రమే ఏ జోనర్‌ సినిమా అయినా చేసి ప్రేక్షకుల్ని మెప్పించగలరు. కానీ, ఒకే తరహా సినిమాలు చేసే డైరెక్టర్లు తమ ట్రాక్‌ మార్చి మరో జోనర్‌లో సినిమాలు చేసి బాగా దెబ్బ తిన్నవారు కూడా ఉన్నారు.    ఫలానా జోనర్‌లోనే సినిమా చెయ్యగలడు అనే ముద్ర పడిన తర్వాత దాని నుంచి బయటికి రావడం అంత ఈజీ కాదు. కానీ, డైరెక్టర్‌ మారుతి విషయంలో అది సులభం అయింది. అది కూడా ప్రేక్షకులు, ఇండస్ట్రీలోని కొందరు, మీడియా మారుతిని తిట్టడం వల్ల అతన్నుంచి డిఫరెంట్‌ జోనర్‌ సినిమాలు వస్తున్నాయి. ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో చేస్తున్న ‘ది రాజా సాబ్‌’ దానికి ఉదాహరణ. తనను తిట్టడం వల్లే ప్రభాస్‌ వంటి టాప్‌ హీరోతో భారీ సినిమా చెయ్యగలుగుతున్నానని ఒక వేదికపై స్వయంగా చెప్పారు మారుతి.    2012లో వచ్చిన ‘ఈరోజుల్లో’ చిత్రంతో దర్శకుడిగా మారారు మారుతి. ఈ సినిమాకి నిర్మాత కూడా ఆయనే. 54 లక్షల్లో నిర్మించిన ఈ సినిమా 18 కోట్లు కలెక్ట్‌ చేసి రికార్డు క్రియేట్‌ చేసింది. ఆ తర్వాత చేసిన ‘బస్‌స్టాప్‌’ చిత్రం కూడా సూపర్‌హిట్‌ అయింది. అయితే ఈ రెండు సినిమాల్లో డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌, అడల్ట్‌ కంటెంట్‌ ఉండడంతో ప్రేక్షకుల నుంచి, మీడియా నుంచి చాలా విమర్శలు ఎదుర్కొన్నారు మారుతి.    డైరెక్టర్‌గా క్లీన్‌ ఇమేజ్‌ తెచ్చుకునే ప్రయత్నంలో తన దగ్గర సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న జె.ప్రభాకరరెడ్డి డైరెక్షన్‌లో ‘ప్రేమకథా చిత్రమ్‌’ మూవీని నిర్మించారు. రెండున్నర కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 20 కోట్లు కలెక్ట్‌ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే డైరెక్టర్‌గా తన సినిమాటోగ్రాఫర్‌ పేరు వేసినా చేసింది మాత్రం మారుతీయేనని ఇండస్ట్రీలోని అందరికీ తెలుసు. ఎలాంటి బూతులు లేకుండా సినిమా చేసి సూపర్‌హిట్‌ చెయ్యగలనని ఆ సినిమాతో ప్రూవ్‌ చేసుకున్నారు మారుతి.    తను చేసిన మొదటి రెండు సినిమాలను వదిలేస్తే.. తర్వాత చేసిన సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు మారుతి. డైరెక్టర్‌గా పది సినిమాలు చేసిన తర్వాత రెబల్‌స్టార్‌ ప్రభాస్‌తో ‘ది రాజా సాబ్‌’ వంటి పాన్‌ ఇండియా మూవీ చేసే ఛాన్స్‌ వచ్చింది. తను ఈ స్థాయికి రావడానికి ప్రేక్షకుల తిట్లే కారణమని, తన మొదటి రెండు సినిమాలు చూసి కొందరు బూతులు తిట్టారని అన్నారు. దాంతో తనకు పట్టుదల పెరిగి అందరూ మెచ్చే సక్సెస్‌ఫుల్‌ మూవీస్‌ చేసే స్థాయికి వచ్చానని వివరించారు మారుతి. 
      చిన్మయి కి షాక్  దారుణంగా మార్ఫింగ్ పిక్  వాళ్ళు ఎవరో కూడా చెప్పిన చిన్మయి     సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా 'చిన్మయి'(Chinmayi)కి పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్న పేరు ప్రఖ్యాతులు తెలిసిందే. ఆ రెండు విభాగాల్లో స్టార్ స్టేటస్ ని పొందటంతో పాటు ఎంతో మంది అభిమానులని కూడా సంపాదించింది. అదే విధంగా ఇండస్ట్రీతో పాటు బయట మహిళలు ఎదుర్కుంటున్న ఎన్నో సమస్యలపై తన గళాన్ని, భావాన్ని చాలా బలంగా చాటుతుంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఆకతాయిలు చెప్పడానికి కూడా అసభ్యం కలిగించే రీతిలో చిన్మయి ఫోటోని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ఉంచారు.     ఆ మార్ఫింగ్ ఫోటోని చిన్మయి 'ఎక్స్' వేదికగా షేర్ చేయడంతో పాటు ఆ విషయంపై తన స్పందన ని తెలియచేస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. సదరు వీడియోలో ఆమె మాట్లాడుతు 'ఈ రోజు ఒక పేజీ నుండి మార్ఫింగ్ చేసిన చిత్రాన్ని తీసుకొని పోలీసులకి ట్యాగ్ చేసాను. చట్టపరమైన చర్యలు జరుగుతాయా లేదా అనేది సమస్య కాదు. డబ్బు తీసుకుని గత ఎనిమిది, పది వారాల నుంచి మా కుటుంబాన్ని వేధిస్తున్నారు. ఫోటోలని మార్ఫింగ్ చేస్తు చెప్పరాని బూతులు తిట్టే వ్యక్తుల నుండి అమ్మాయిలని, వారి కుటుంబాలని  కాపాడటానికి నేను ఈ వీడియో చేశాను అని చిన్మయి వెల్లడి చేసింది. తన మార్ఫింగ్ ఫొటో షేర్ చేసిన అకౌంట్ తాలూకు స్క్రీన్ షాట్ ని కూడా ఆమె పోస్ట్ చెయ్యడం జరిగింది.     Also read:   తెలంగాణ అడ్వాన్స్ బుకింగ్ లో బాలయ్య తాండవం      ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆడవారి పట్ల ఆ విధంగా ప్రవర్థించే వాళ్ళని పోలీసులు పట్ట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రీసెంట్ గా రష్మిక టైటిల్ రోల్ లో తెరకెక్కిన గర్ల్ ఫ్రెండ్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.           https://x.com/Chinmayi/status/1998821518026092881?s=20
      -బుకింగ్స్ లో జోరు కొనసాగిస్తున్న బాలయ్య  -కలెక్షన్స్ పై ఆసక్తి  -అభిమానుల హంగామా    నందమూరి అందగాడు, బాక్స్ ఆఫీస్ బొనాంజా, గాడ్ ఆఫ్ మాసెస్, పద్మభూషణ్ బాలకృష్ణ(Balakrishna)చేసే శివ తాండవంతో థియేటర్స్ ఊగిపోవడానికి సర్వం సిద్దమయ్యింది. ఈ రోజు నైట్ తొమ్మిది గంటల నుంచే బెనిఫిట్ షోస్ ప్రదర్శిస్తుండటంతో  అభిమానుల్లో అయితే పండుగ వాతావరణం నెలకొని ఉంది. ఆన్ లైన్ లో బెనిఫిట్ షోస్ టికెట్స్ ని ఉంచడం ఆలస్యం బుక్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు.     ఇక ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా నిన్న ఉదయం నుంచే ఆన్ లైన్ వేదికగా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కావడంతో హెవీ క్రౌడ్ నెలకొని ఉన్న విషయం తెలిసిందే. సదరు క్రౌడ్ పై బాలయ్య బాక్స్ ఆఫీస్ పై చేస్తున్న సర్జికల్ స్ట్రైక్ అంటూ మేకర్స్ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఇపుడు అదే రీతిలో నిన్న నైట్ తెలంగాణ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి . ఓపెన్ చేసిన నిమిషాల వ్యవధిలోనే హాట్ కేక్ లా బుకింగ్స్ జరుగుతున్నాయి. ఎంతలా అంటే ఎన్ని షోస్ ని అయితే ఆన్ లైన్ లో ఉంచారో అన్ని షోస్ సింగల్ స్క్రీన్, మల్టి ప్లెక్స్ అనే తేడా లేకుండా ఫుల్ అవుతున్నాయి.     also read:   అడ్వాన్స్ బుకింగ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న అఖండ 2     దీంతో అభిమానులు, సినీ విశ్లేషకులు స్పందిస్తూ అఖండ 2(Akhanda 2)ద్వారా బాలయ్య సృష్టించబోయే సునామీకి ఇదొక నిదర్శనం అని, పాన్ ఇండియా వ్యాప్తంగా అడ్వాన్స్  బుకింగ్ లో అఖండ 2 ద్వారా సంచలనం నమోదు కావచ్చనే అభిప్రాయాన్ని  వ్యక్తం చేస్తున్నారు. మరి రిలీజ్ కి ముందే పాజిటివ్ టాక్ కూడా రన్ అవుతుండటంతో బాలయ్య సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. బోయపాటి, బాలయ్య కాంబోకి ఉన్న ట్రాక్ రికార్డు కూడా అఖండ 2 కి అదనపు బలం.    
గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ చిత్రం ‘అఖండ2 తాండవం’. డిసెంబర్‌ 12న థియేటర్లలో తన నటవిశ్వరూపాన్ని చూపించేందుకు సిద్దమయ్యారు నందమూరి బాలకృష్ణ. డిసెంబర్‌ 11న ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్‌ పడనున్నాయి.  డిసెంబర్‌ 11 రాత్రి 9 గంటలకు ప్రీమియర్స్‌ ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అలాగే టికెట్ల ధరలను ఏమేరకు పెంచుకోవచ్చు అనే విషయాలను కూడా అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే ‘అఖండ2’ చిత్రానికి సంబంధించిన రిలీజ్‌ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. సినిమాలో బాలయ్య నట విశ్వరూపం ఎలా ఉంటుంది అనే విషయాన్ని టీజర్‌లో బలంగా చూపించారు. ‘కాషాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు.. త్రిశూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు.. ఎవడ్రా విభూది కొండను ఆపేది..’ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే డైలాగ్‌.. అఘోరా క్యారెక్టర్‌ను ఎలివేట్‌ చేస్తోంది. దాన్ని బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మరింత హైలైట్‌ చేసింది.  గదతో, త్రిశూలంతో దుష్ట శక్తుల్ని అంతమొందించే కీలక సన్నివేశాలను ఎంతో పవర్‌ఫుల్‌గా చిత్రీకరించారు. ఇలాంటి సీన్స్‌ ప్రేక్షకుల చేత తప్పకుండా విజిల్స్‌ వేయిస్తాయని టీజర్‌ చూస్తుంటేనే అర్థమవుతోంది. ‘అఖండ2’ చిత్రాన్ని చూసేందుకు, దైవానుభూతిని పొందేందుకు ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారికి రేపు థియేటర్లలో శివానుగ్రహం కలిగించే రీతిలో బోయపాటి శ్రీను ఆయా సీన్స్‌ను ఎంతో పవర్‌ఫుల్‌గా చిత్రీకరించారు. దీంతో ‘అఖండ2’ థియేటర్లలో ప్రేక్షకులు భక్తి పారవశ్యంలో మునిగిపోవడం ఖాయమని టీజర్‌ ప్రూవ్‌ చేస్తోంది. 
The anticipation for the pan-India film Akhanda 2, starring the God of Masses Nandamuri Balakrishna, has reached unprecedented levels. This highly-awaited project marks the fourth collaboration between NBK and director Boyapati Srinu, a legendary duo aiming for a remarkable fourth blockbuster following Simha, Legend, and Akhanda. Originally scheduled for December 5th, the movie's release was postponed, but it is now set to hit screens worldwide with premieres starting after 9 PM on December 11th, followed by a general release on December 12th. To celebrate the confirmed release date and amplify the excitement, the makers have launched a new release promo featuring never-before-seen shots of NBK. The teaser showcases the actor in an electrifying avatar, particularly in sequences where he is seen protecting Harshali Malhotra and dramatically channeling the Almighty spirits of Lord Shiva and Lord Hanuman while battling adversaries. Every frame serves to elevate NBK's persona to unimaginable heights, proving once again that Boyapati Srinu excels at bringing out the actor's best. NBK's magnetic screen presence is undeniable, and the teaser intensely increases the urge to witness the film on the big screen. Samyuktha, Aadi Pinisetty, Harshali Malhotra are playing other crucial roles.  Produced by 14 Reels Plus on a massive scale, the movie promises high production values, great technical standards, and brilliant visuals that spectacularly showcase the essence of Indian Sanatana Dharma. This action-packed promo strongly indicates that Akhanda 2 is poised to create a massive Mass Mayhem at the pan-India Box Office. Bookings for the film have already opened at full throttle across both Telugu states. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన 'అఖండ2 తాండవం' చిత్రం ఎట్టకేలకు డిసెంబర్‌ 12న థియేటర్లలోకి రాబోతోంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదలపై నెలకొన్న సస్పెన్స్‌ తొలగిపోయి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కి సిద్ధమైంది. డిసెంబర్‌ 11న ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్‌ పడనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 'అఖండ2' ప్రీమియర్స్‌, టికెట్‌ ధరల పెంపుకు సంబంధించిన జీ.ఓ.ను విడుదల చేసింది.  డిసెంబర్‌ 11 రాత్రి 9 గంటలకు ప్రీమియర్స్‌ ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అలాగే టికెట్ల ధరలను ఏమేరకు పెంచుకోవచ్చు అనే విషయాలను కూడా అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్‌ 12 నుంచి 14వ తేదీ వరకు అంటే మూడు రోజులపాటు పెంచిన టికెట్‌ ధరలు అమలులో ఉంటాయి. ప్రీమియర్స్‌కి సంబంధించిన టికెట్‌ ధరను రూ.600గా నిర్ణయించింది. సింగిల్‌ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో పెంచిన టికెట్‌ ధరలను కూడా ప్రకటించారు. మల్టీప్లెక్స్‌లలో రూ.100 రూపాయలు, సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.50లు పెంచుకునే వెసులుబాటు కల్పించారు.  తెలంగాణ ప్రభుత్వం ముందుగా సూచించిన విధంగా పెంచిన ధరలకు సంబంధించిన మొత్తంలో 20 శాతం సినీ కార్మికుల సంక్షేమానికి వినియోగించాలని జీ.ఓ.లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఫిలిం డెవలప్‌ కార్పొరేషన్‌ ఒక ప్రత్యేక ఖాతాను తెరవనుంది. లేబర్‌ కమిషనర్‌తో కలిసి ఎఫ్‌డిసి ఈ సెపరేట్‌ ఎకౌంట్‌ను ఆపరేట్‌ చేస్తారని ప్రకటించారు. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
ప్రేమ,  భార్యాభర్తల బంధం,  సహజీవనం.. ఏదైనా సరే.. మనసులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కీ పాయింట్ గా ఉంటుంది. నేటికాలంలో బంధాలు చాలా పెళుసుగా మారాయి.  చాలా తొందరగా బ్రేకప్ లు  జరుగుతున్నాయి.  ఒకరు చాలా సీరియస్ గా భావిస్తే.. మరొకరు చాలా సులువుగా బంధాన్ని వదిలేస్తారు. మరీ ముఖ్యంగా మోసం చేయడం అనేది కొందరికి అలవాటుగా కూడా మారింది.  డబ్బు, వస్తువులు కోల్పోతే పోతే పోయాయని సర్థి చెప్పుకోవచ్చు. కానీ మనసుకు గాయం చేసి, నమ్మకాన్ని దెబ్బతీసి,  జీవితంలో ఆశల మీద నీళ్లు చల్లే పనులు చేసే మోసగాళ్లు ఉంటారు.  ఒకప్పుడు అమ్మాయిలు ఎక్కువగా మోసపోయేవారు. కానీ ఇప్పట్లో చాలామంది అమ్మాయిలు ప్రేమ పేరుతో అబ్బాయిలను మోసం చేస్తున్నారు.  మోసం చేసేముందు అమ్మాయిలు కొన్ని పనులు చేస్తారట. అవేంటో తెలుసుకుంటే ఎవరి జీవితంలో అయినా ఎప్పుడైనా అలాంటి సంఘటనలు ఎదురైతే జాగ్రత్త పడవచ్చు. మోసాన్ని గ్రహించి మనసు గాయపడకుండా కాపాడుకోవచ్చు. మాట్లాడే విధానం.. అమ్మాయిలు అబ్బాయిలకు దూరంగా జరిగేటప్పుడు కనిపంచే మొదటి మార్పు మాట్లాడే విధానం మారడం. ఒకప్పుడు ఆప్యాయంగా,  ఎక్కువగా కేర్ తీసుకుంటూ,  ఎప్పుడూ మాట్లాడుతూ ఉండే అమ్మాయి,  ఒక్కసారిగా మాట్లాడటం తగ్గించడమే కాకుండా క్రమంగా కఠినంగా మాట్లాడుతుంది అంటే ఆ అమ్మాయి తొందరలోనే బ్రేకప్ చెప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అర్థం. ఫోన్ కాల్స్.. అమ్మాయిలు పదే పదే బంధువులు లేదా కుటుంబ సభ్యులు కాల్ చేశారని చెబుతూ దూరంగా వెళ్లి మాట్లాడుతూ ఉంటే అది ఖచ్చితంగా ఆమె దూరం అయ్యే సూచనలు ఇస్తుందట.  మోసం చేసే అమ్మాయిలు తరచుగా కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి ఇతరులతో ఫోన్ మాట్లాడుతూ ఉంటారని అంటారు.   మాటల్లో మార్పు.. ప్రేమించిన అమ్మాయి మొదట్లో ఎంతో ఆప్యాయంగా,  కేరింగ్ గా మాట్లాడుతుంది. కానీ ఆ తరువాత ఆమె ఆ రిలేషన్ నుండి తప్పించుకోవాలని,  వేరే రిలేషన్ లోకి వెళ్లాలని అనుకున్నప్పుడు ఆమె మాటతీరు మారుతుందట.  ప్రేమ, ఆప్యాయత, కేరింగ్ స్థానంలో చిరాకు, అసహనం,  వ్యంగ్యం వచ్చి చేరతాయట. కొన్ని సార్లు చాలా ఘాటుగా కూడా మాట్లాడతారట. సమయం తగ్గించడం.. బయట కలవడం అయినా,  ఫోన్ లో మాట్లాడటం అయినా ప్రేమించిన అమ్మాయి గతంలో లాగా ఎక్కువసేపు మాట్లాడటం, కబుర్లు చెప్పడం కాకుండా  కేవలం రెండు మూడు నిమిషాలలో మాట్లాడటం,  రెండు మూడు ముక్కలలో సమాధానం చెప్పి పోన్ పెట్టేయడం,  తర్వాత మాట్లాడతాను అని చెప్పం.. వంటివి చేస్తుంటే ఆమె తొందరలోనే బ్రేకప్ చెప్పేస్తుందని అర్థమట. కారణాలు.. సమయం లేకపోవడం, పనిలో బిజీగా ఉండటం లేదా మూడ్ సరిగ్గా లేకపోవడం వంటి సాకులు చెబుతూ ఉంటే వాస్తవానికి ఆమెకు మాట్లాడే ఆసక్తి లేదని అర్థం. నేరుగా ఆ విషయాన్ని చెప్పలేక అలా కారణాలు చెబుతూ ఉంటారు. మార్పులు.. లైఫ్ స్టైల్ మార్చుకోవడం,  కొత్త అలవాట్లు,  సీక్రెట్స్ మెయింటైన్ చేయడం వంటివి చేస్తుంటే ఆ అమ్మాయి మరొకరితో సన్నిహితంగా ఉండటం మొదలు పెట్టిందని అర్థం.  ఇవన్నీ కనివిస్తే ఆ అమ్మాయి మోసం చేస్తోందని అర్థం.  ఇలాంటి మార్పులు కనిపించినప్పుడు అబ్బాయిలు జాగ్రత్త పడితే మనసుకు గాయం కాకుండా జాగ్రత్త పడవచ్చు.                                       *రూపశ్రీ.
ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదోకటి సాధించాలనే లక్ష్యం పెట్టుకుంటాడు. కానీ వారు  చేసే కొన్ని తప్పులు విజయానికి అడ్డుపడతాయి. చాణక్యుడు తెలిపిన  ఆ తప్పులు ఏంటి..? మీ లక్ష్యాలను సాధించడంలో మీరు చేయకూడని ఆ రెండు తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జీవితం అన్నాక సమస్యలు సర్వసాధారణం. ముఖ్యంగా ఒకలక్ష్యంతో ముందుకు సాగుతున్న వ్యక్తి ఎన్నో సమస్యలను ఎదుర్కొవలసి ఉంటుంది. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మన లక్ష్యం ఎంత పెద్దది అయితే...అన్ని ఎక్కువ సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుందని పేర్కొన్నారు. తన లక్ష్యాన్ని సాధించే మార్గంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి..తన జీవితంలో ఏదో ఒక రోజు గొప్ప విజయాన్ని సాధిస్తాడు. మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే దృఢ సంకల్పం, కఠోర శ్రమ అవసరం. వీటితోపాటు కొన్ని ప్రత్యేక విషయాలపై శ్రద్ద పెట్టాలి. మనం తీసుకునే చిన్న నిర్ణయం పెద్ద మార్పునకు కారణం అవుతుంది. ఆచార్య చాణక్యుడు చెబుతూ..మన లక్ష్యాలను సాధించేందుకు కొన్ని తప్పులు చేయకూడదని తెలిపారు. అవి ఏంటో చూద్దాం. లక్ష్యం గురించి ఎవరికీ చెప్పవద్దు. మనం విజయం సాధించాలంటే దానికి కృషి, ప్రణాళిక, సమయపాలన చాలా అవసరం. ఇవే కాదు విజయం సాధించడానికి చాణక్య ఒక ప్రత్యేక సమాచారాన్ని అందించాడు. జీవితంలో విజయం సాధించాలంటే మన లక్ష్యం గురించి ఎవరికీ చెప్పకూడదు. ఎందుకంటే శత్రువు ఎల్లప్పుడూ మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. అలాంటప్పుడు, మన లక్ష్య సాధన గురించి మనం బయటకు చెప్పినప్పుడు.. వారు మన లక్ష్యాన్ని నాశనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ శత్రువు మీ లక్ష్యం గురించి తెలుసుకుంటే,మీకు సమస్యలను లేదా అడ్డంకులు కలిగించవచ్చు. మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు తీసుకున్న ప్రణాళికలు,నిర్ణయాల గురించి ఎక్కడా ప్రస్తావించకూడదు. లక్ష్యం సాధించే వరకు రహస్యంగా ఉంచాలని చాణక్యుడు చెప్పాడు. లక్ష్యం నుండి వెనక్కి తగ్గకూడదు: లక్ష్య సాధన కోసం శ్రమించే వ్యక్తిని చాణక్యుడు సింహంతో పోల్చాడు. సింహం తన వేటను చూసి వెనక్కి తగ్గనట్లేదు. ఒక లక్ష్యాన్ని సాధించాలనుకునే వ్యక్తి ఆ దిశగానే అడుగులు వేయాలి తప్ప..వెనక్కు తగ్గకూడదు.  ఎలాంటి పరిస్థితులు ఎదురైనా లక్ష్యం నుంచి వెనక్కి తగ్గకూడదన్నది చాణక్యుడి మాట. చాణక్యుడు ప్రకారం, ఎవరైతే తన పాలసీలో ఈ రెండు అంశాలకు ఎక్కువ శ్రద్ధ వహిస్తారో, ఆ వ్యక్తి తన లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తాడు.   
  పెళ్లి ప్రపంచంలో ప్రజలందరూ సాగించే ఒక పవిత్రమైన  బంధం. భారతీయులు పెళ్లికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.  సాధారణంగా వయసు రాగానే పెళ్లి వయసు వచ్చింది అని అంటుంటారు.  దానికి తగ్గట్టే పెళ్ళిళ్లు చేస్తుంటారు. కానీ చాలా బంధాలు విచ్చిన్నం అవ్వడానికి,  వివాహం నిలబడకపోవడానికి కారణం వారి ఆలోచనలే అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. కేవలం వయసు చూసి పెళ్లి చేయడం సరికాదని, కొన్ని లక్షణాలు వచ్చాకే పెళ్ళి చేయాలని   అంటున్నారు. ఈ లక్షణాలు ఉంటే ఇక పెళ్లి చేసుకోవడానికి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదట.   వయసు కాకుండా పెళ్లి  చేసుకోవడానికి ఉండాల్సిన  ముఖ్యమైన లక్షణాలు ఏంటి? తెలుసుకుంటే.. నేను కాదు మనం.. పెళ్లి అంటే కేవలం ఇంకొక వ్యక్తితో కలిసి జీవించడం మాత్రమే కాదు, అది  జీవితాన్ని వేరొకరితో పంచుకోవడం. పెళ్లి చేసుకోవడాన్ని కేవలం  స్వంత ప్రయోజనం కోసం మాత్రమే కాకుండా వచ్చే భాగస్వామి, వారి  కుటుంబాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. పెళ్లి చేసుకోవడం అంటే ప్రతిది తనకు నచ్చినట్టు,  తను కోరుకుంటున్నట్టు ఉండేది కాదు.. అందరికీ నచ్చినట్టు, అందరూ కలిసి ఉండేలా ఉండాలి.  చేతిలో ఒక్క పండు ఉన్నా దాన్ని ఒక్కరే కాకుండా అందరూ కలిసి పంచుకుని తినాలి అనే మనస్తత్వం ఉండాలి. ఇలా ఉంటే పెళ్లి చేసుకోవడానికి ఒక లక్షణం ఉన్నట్టే. సమస్యలు, పరిష్కారాలు.. వివాహం అయ్యాక భార్యాభర్తల మధ్య సమస్యలు చాలా వస్తాయి. కానీ చాలామంది వాటిని పరిష్కరించడంలో విఫలం అవుతారు.  భార్యాభర్తల మధ్య సమస్య లేదా గొడవ వస్తే కోపం చేసుకుని దాన్ని పెంచుకోవడానికి బదులు దాన్ని ఎలా సామరస్యంగా పరిష్కరించుకోవాలి అనేది తెలిసి ఉండాలి.  సాధారణంగా సమస్యను పరిష్కరించే నైపుణ్యాలు కలిగి ఉంటే వివాహ బంధంలో కూడా అది చేయగలుగుతారు. తప్పు చేసినప్పుడు ఒప్పుకునే స్వభావం కూడా ఉండాలి. అలాగే ఎదుటివారు తప్పు చేసినప్పుడు దాన్ని క్షమించగలిగే మనసు కలిగి ఉండాలి. ఇలా ఉంటే ఒక మంచి లైప్ పార్టనర్ అవుతారు. వాస్తవ జీవితం.. చిన్నతనం నుండి కొన్ని కలలు ఉంటాయి. మరీ ముఖ్యంగా సినిమాలు, టీవీలు,  పుస్తకాల ప్రబావం వల్ల భాగస్వామి గురించి,  వివాహం తర్వాత జీవితం గురించి చాలా డ్రీమ్స్ పెట్టుకుంటారు. కానీ నిజానికి వివాహం తర్వాత జీవితంలో కలలను వెతక్కూడదు.  వాస్తవిక జీవితంలోనే బ్రతకాలి. ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ గా ఉండరు. అలాగే జీవితంలోకి వచ్చే వ్యక్తి గురించి చాలా ఆశలు, అంచనాలు పెట్టుకోకూడదు.  వాస్తవాన్ని, వ్యక్తి ఎలా ఉంటారో దాన్నే అంగీకరించాలి.  యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. ఈ లక్షణం ఉంటే జీవితంలో అసంతృప్తి ఫీలవడం చాలా తక్కువ. మంచి భాగస్వామి కాగలుగుతారు. ఆర్థిక బాధ్యతలు.. వివాహానికి ముందు వివాహం తర్వాత ఆర్థిక విషయాలలో చాలా మార్పులు వస్తాయి.  ఒక్కసారిగా భార్యాభర్తల ఇద్దరి మీద బాధ్యతలు పెరుగుతాయి.  ఖర్చులు ఎలా చేయాలి? దుబారా ఎలా తగ్గించాలి? భవిష్యత్తు కోసం పొదుపు ఎలా చేయాలి? ఇవన్నీ ఆలోచించేవారు,  వీటిని ఎలా నిర్వహించాలి అనే విషయం తెలిసిన వారు అయితే కుటుంబాన్ని పోషించే క్వాలిటీ ఉంటే పెళ్లి చేసుకోవడానికి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండదు. సంతోషం.. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా సంతోషంగా ఉండగలగడం  పెళ్లికి సిద్దంగా ఉండే గొప్ప లక్షణం. ఇది చాలామందికి వింతగా అనిపిస్తుంది కానీ ఇదే నిజం. ఏ వ్యక్తి అయినా తన సంతోషం ఇతరుల మీద ఆధారపడి ఉండేలా ఉండకూడదు. పెళ్లి చేసుకోగానే తాము ఇతరుల సంతోషమే చూడాలి అనుకోవడం చాలా తప్పు. ఎవ్వరూ లేకపోయినా తాను సంతోషంగా ఉండగలను అనే వ్యక్తిత్వం కలిగి ఉండాలి. ఎలాంటి పరిస్థితిలో అయినా తనను తాను సంతోషంగా ఉంచుకునే వ్యక్తి ఇతరులను సంతోష పెట్టడంలో ఎప్పుడూ విఫలం కారు.  కష్టాలు.. బాలెన్సింగ్.. ఒంటరిగా ఉన్నా, జంటగా ఉన్నా జీవితం ఎప్పుడూ సులువుగా ఉండదు. కాకపోతే జంటగా ఉన్నప్పుడు సవాళ్లు, సమస్యలు, కాస్త ఎక్కువ ఉంటాయి.  అయితే అలాంటివి ఫేస్ చేయడానికి బంధంలో మరొకరు కూడా తోడుగా ఉంటారు. జీవితంలోకి వచ్చే వ్యక్తి అనారోగ్యంతో ఉన్నా,  ఆర్థిక సమస్యలలో ఉన్నా, కుటుంబ సమస్యలతో ఉన్నా, పరిస్థితులు ఏవైనా సరే.. అన్ని సమయాలలో ఓపికతో కలిసి ఉండే ధైర్యం,  అన్నింటిని అధిగమించే నైపుణ్యం కలిగి ఉండాలి.  ఈ లక్షణం కూడా కలిగి ఉంటే పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేనట్టే.. పైన చెప్పుకున్న లక్షణాలు అన్నీ ఉన్నవారు పెళ్లి చేసుకోవడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ పైన చెప్పుకున్న లక్షణాలు లేకపోతే మాత్రం వయసు వచ్చినా సరే.. పెళ్లి చేసుకోవడానికి  మీరు కరెక్ట్ కాదని అర్థం. ఒకవేళ పెళ్లి చేసుకుంటే మీ వల్ల మీ లైఫ్ లోకి వచ్చే భాగస్వామి ఖచ్చితంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.  కొన్ని పరిస్థితులలో ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు,  విడిపోవడానికి దారితీసే గొడవలు కూడా రావచ్చు.                                  *రూపశ్రీ.
శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె.  ఏ ఇతర అవయవాలు సరిగా పని చేయకపోయినా ప్రాణం నిలబడుతుందేమో కానీ.. గుండె కొట్టుకోవడం కొన్ని నిమిషాల పాటు ఆగిపోతే శరీరం నిర్జీవం అవుతుంది.   అయితే ఈ మధ్య కాలంలో గుండె సంబంధ సమస్యలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలామందిలో గుండె  బలహీనంగా మారడం వల్ల తొందరగా గుండె జబ్బులు రావడం జరుగుతోంది.  అందుకే గుండెకు బలాన్ని ఇచ్చే ఆహారాలు తీసుకోవాలని వైద్యులు చెబుతారు.  గుండెకు బలాన్ని పెంచే ఆహారాలు ఏవి? ఆ లిస్ట్ ఒక్కసారి చూస్తే.. గుండెను బలంగా ఉంచే ఆహారాలు.. సాల్మన్.. సాల్మన్ వంటి కొవ్వు చేపలలో గుండెకు బలాన్ని చేకూర్చే  ఒమేగా-3 కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. సాల్మన్ చేపలు EPA,  DHA లను అందిస్తాయి.  ఇవి ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో, గుండె లయను స్థిరంగా ఉంచడంలో, రక్త నాళాల లైనింగ్‌ను మెరుగుపరచడంలో సహాయపడతాయి.  క్రమం తప్పకుండా తింటే హృదయ సంబంధ సమస్యలను చాలా వరకు   తగ్గించడంలో సహాయపడతాయి. ఈ ఒమేగా-3 లు గుండె కణ త్వచాలలో కలిసిపోయి ఆరోగ్యకరమైన విద్యుత్ కమ్యునికేషన్ కు సహాయపడతాయి. ఆలివ్ ఆయిల్.. ఎక్స్టా వర్జిన్ ఆలివ్ ఆయిల్ నూనెలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు,  పాలీఫెనాల్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మెరుగైన ఆరోగ్యకరమైన  కొలెస్ట్రాల్ ను అందిస్తాయి. అలాగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.  రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.  ఆలివ్ నూనె తీసుకోవడం  వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి. అవకాడో.. అవకాడోలు సహజంగా ఒలీక్ ఆమ్లం, ఫైబర్, పొటాషియం, ఫోలేట్,  విటమిన్ E లతో నిండి ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్,  రక్తపోటు స్థాయిలకు మద్దతు ఇస్తాయి. వాల్నట్స్. క్రమం తప్పకుండా వాల్‌నట్‌లను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వాల్‌నట్‌లలో మొక్కల ఆధారిత ఒమేగా-3లు, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు,  యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వాల్‌నట్‌లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన కొవ్వులను భర్తీ చేయడంలో సహాయపడుతుంది.  రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది. బ్లూబెర్రీస్.. బ్లూబెర్రీస్ యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. బ్లూబెర్రీస్‌లో ఉండే ఆంథోసైనిన్లు,  పాలీఫెనాల్స్ రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని,  ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయని చెబుతారు. ఇది రక్తపోటును తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుందట. ముదురు ఆకుకూరలు.. ముదురు ఆకుకూరలు రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.  సహజ నైట్రేట్లతో సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. విటమిన్ K, ఫోలేట్, పొటాషియం,  యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి గుండెను బలంగా మారుస్తాయి.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
భారతీయులు రిఫ్రెషింగ్ కోసం తీసుకునే పానీయాలలో టీ చాలా  ముఖ్యమైనది.  ఉదయం లేవగానే బ్రష్ చేసి టీ తాగాలి,  టిఫిన్ తినగానే టీ తాగాలి,  స్నేహితులతో బయట కలిస్తే టీ తాగాలి,  ఆఫీసు వర్క్ లో కాసింత బ్రేక్ కావాలంటే టీ తాగాలి,  అన్నింటికి మించి తలనొప్పి వచ్చినా,  ఫుడ్ లేటయినా కనీసం టీ  అయినా తాగాలి.  ఇలా టీ అనేది పానీయంలా కాకుండా ఒక ఎమోషన్ లా మారిపోయింది. అయితే టీ తాగడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు ఆరోగ్య నిపుణులు.  మరీ ముఖ్యంగా నెలరోజుల పాటు టీ తాగడం మానేయండి,  ఫలితాలు చూసి మీరే షాకవుతారు అని అంటున్నారు. ఇంతకూ నెలరోజుల పాటు టీ తాగడం మానేయడం వల్ల కలిగే మార్పులేంటో తెలుసుకుంటే.. నెలరోజులు టీ తాగడం మానేస్తే.. ఒక నెల పాటు టీ తాగడం మానేయడం వల్ల శరీరం నుండి  హానికరమైన సమ్మేళనాలను తొలగించడంలో సహాయపడుతుందట. ఇది కడుపులో యాసిడ్ ఎఫెక్ట్,  ఉబ్బరాన్ని తొలగించడమే కాకుండా,శరీర శక్తి స్థిరంగా ఉండేలా చేస్తుందట. ఇలా శరీరంలోపల శుద్ది కావడం శరీరానికి  రీసెట్ బటన్ గా పనిచేస్తుంది. నెల రోజుల పాటు టీ తాగడం మానేస్తే  నాలుగు ముఖ్యమైన మార్పులు ప్రధానంగా చోటు చేసుకుంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జీర్ణక్రియ.. టీ మానేయడం వల్ల కలిగే మొట్టమొదటి,  అత్యంత ప్రయోజనకరమైన విషయం జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగవ్వడం. టీలోని కెఫిన్,  టానిన్లు కడుపులో ఆమ్ల ఉత్పత్తిని పెంచుతాయి. ఒక నెల పాటు టీ తాగకుండా ఉండటం వల్ల కడుపులో ఆమ్ల స్థాయిలు నార్మల్ అవుతాయి. ఆమ్లత్వం, గుండెల్లో మంట,  అజీర్ణం దాదాపుగా తొలగిపోతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఐరన్ శోషణ.. టీలోని టానిన్లు ఆహారం నుండి ఐరన్ ను గ్రహించడంలో  ఆటంకం కలిగిస్తాయి. టీ మానేసిన తర్వాత శరీరం ఆహారం నుండి ఐరన్ ను పూర్తి స్థాయిలో గ్రహిస్తుంది. రక్తహీనత లేదా అలసటతో బాధపడేవారికి ఇది చాలా మెరుగైన ఫలితాలు ఇస్తుంది. టీ మానేయడం వల్ల ఐరన్ గ్రహించే సామర్ఱ్యం పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం.. టీలో కెఫిన్ ఉంటుంది. ఇది నిద్ర హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఒక నెల పాటు టీ తాగకుండా ఉండటం వల్ల  నిద్ర చక్రం తిరిగి రికవర్ అవుతుంది. గాఢంగా,   నాణ్యమైన నిద్రను పొందడంలో  సహాయపడుతుంది. మంచి నిద్ర నేరుగా  మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక కల్లోలం,  ఒత్తిడిని తగ్గిస్తుంది. చర్మం, దంతాల ఆరోగ్యం.. టీలోని టానిన్లు దంతాల మీద మరకలుగా మారి  దంతాల  రంగు మారుస్తాయి. టీ తాగడం మానేయడం వల్ల సహజంగా  దంతాలు శుభ్రంగా,  ప్రకాశవంతంగా కనిపిస్తాయి.  శరీరం హైడ్రేషన్ గా ఉండటం,  వాపు తగ్గడం మొదలైన వాటి వల్ల  పొడిబారడం తగ్గుతుంది.  చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...