బీహార్ లోని  బంకీపూర్ అసెంబ్లీ నియోజక వర్గ ఉపఎన్నికలో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త  ప్రశాంత్ కిషోర్  విజయం సాధించారు.  మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్ నియోజకవర్గం నుంచి పీకే సాధించిన ఈ విజయం బీహార్ రాజకీయాలలో సంచలనంగా మారింది. పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై  20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో  విజయం సాధించారు.  ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది.   నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి  ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు  నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. ఇటీవల నితిన్ నబీన్ ను బీజేపీ రాజ్యసభకు పంపడంతో బంకీపూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.  ఈ ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ అనూహ్యంగా విజయం సాధించి బీజేపీకి గట్టి షాక్ ఇచ్చారు.   Prashantkumar win bamkipur by poll, election, Straregist, Shock, BJP
తమిళనాడు సీఎం  విజయ్  తనదైన ప్రత్యేక శైలిలో ప్రజాదరణ చూరగొంటూ సంచలన నిర్ణయాలతో  పాలనలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. మాటల సీఎంగా కాకుండా చేతల సీఎంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.   హామీలను నెరవేర్చడంలోనూ, ఆ దిశగా పాలనా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడంలోనూ విజయ్ వేగం  తమిళనాటే కాకుండా దేశ వ్యాప్తంగా  హాట్ టాపిక్‌గా మారింది.   ఇటీవలే  తన మంత్రివర్గం పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించిన విజయ్.. పాలనలో పారదర్శకత, బాధ్యత లేని ప్రవర్తనను ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా..  పనితీరులో నాట్ ఆప్ టు ద మార్క్ అని తేలిన నలుగురు మంత్రులకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికేందుకు నిర్ణయించారు.  ఉన్నత విద్యాశాఖ మంత్రి పి. విశ్వనాథన్, రవాణా శాఖ మంత్రి ఎ. విజయ్ తమిళన్ పార్తిబన్‌లపై వచ్చిన వరుస ఫిర్యాదులు, హెచ్చరించినా తీరు మారకపోవడంతో వారిపైనా, అలాగే..  విమర్శలు, వివాదాల కారణంగా సామాజిక సంక్షేమ శాఖ మంత్రి కె. జగదీశ్వరి, అదే కారణాలతో   హెచ్‌ఆర్‌ఎమ్ మంత్రి డి. శరత్‌కుమార్ లపై వేటు వేయాలని విజయ్ భావిస్తున్నట్లు టీవీకే వర్గాలు చెబుతున్నాయి.   కేవలం పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం  వెట్రి తమిళగం విజన్  పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద  50 వేల  కోట్ల  రాష్ట్ర పెట్టుబడి నిధి  ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా,  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు. సాంకేతిక రంగానికి కేటాలిస్ట్‌గా నిలిచేలా  అరివంగం  పేరుతో అత్యాధునిక  ఏఐ సిటీ  నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజాలను తమిళనాడుకు ఆకర్షించడంతో పాటు భారీ స్థాయిలో ఉద్యోగాల సృష్టే లక్ష్యంగా ఈఏఐ సిటీని నగరాన్ని తీర్చిదిద్దనున్నారు. ప్రజా సంక్షేమం, బ్యూరోక్రసీ నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తేవడానికి విజయ్ సర్కార్  నో అప్లికేషన్    విధానాన్ని తీసుకువస్తోంది. సాధారణంగా ఏ ప్రభుత్వ పథకానికైనా ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ కొత్త విధానంలో ఆధార్ అనుసంధానిత ఆటో ఐడెంటిఫికేషన్ ద్వారా అర్హులైన లబ్ధిదారులను   గుర్తించి, వారు ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే నేరుగా పథకాల ప్రయోజనాలను అందిస్తారు. దీనికి తోడు ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు  పీపుల్స్ ఛాయిస్ బడ్జెట్ భావనను అమలులోకి తేవాలని నిర్ణయించారు. దీని ప్రకారం జిల్లా నిధులలో ఏకంగా 10 శాతం నిధుల వినియోగాన్ని స్థానిక ప్రజల నిర్ణయానికే వదిలేస్తారు. తమ ప్రాంతానికి ఏ రకమైన అభివృద్ధి పనులు అవసరమో ప్రజలే నేరుగా నిర్ణయించుకునే హక్కును కల్పించడం ద్వారా సీఎం విజయ్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు.      CM Vijay, Tamil Nadu Politics, AI City Arivangam, Vetri Thamizhagam Vision, Vijay Cabinet ministers, oust,  TN State Investment Fund                                                                                      
ఆంధ్రప్రదేశ్‌లోని పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు పలువురు ఎంపీలతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో రైతుల ప్రయోజనాలే పరమావధిగా కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో ఈ సీజన్‌లో 140 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి అనుమతి ఉండగా, రైతులు వివిధ కారణాల వల్ల దాదాపు 240 మిలియన్ కిలోల వరకు పండించారని కేంద్రమంత్రి వివరించారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, అధిక ఉత్పత్తి కారణంగా ధరలు క్షీణించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకోవడానికి సమగ్ర ప్రణాళిక రూపకల్పన చేసినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తరఫున బోర్డు పరిధిలోని ప్రతి పొగాకు రైతుకు (45 వేల బాండ్లకు) రెండేళ్ల కాలపరిమితితో  50 వేల రూపాయల వడ్డీ లేని రుణం అందిస్తున్నామన్న పెమ్మసాని..  దీని ద్వారా సుమారు  250 కోట్ల నిధులు రైతులకు అందుబాటులోకి రానున్నాయన్నారు. అదేవిధంగా, లో గ్రేడ్, ఆఫ్ స్టైల్ పొగాకుకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం కిలోకు  10 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుందని.. దీనికోసం రాష్ట్ర బడ్జెట్ నుండి 100 కోట్ల రూపాయలు  కేటాయించినట్లు తెలిపారు. మరోవైపు పొగాకు కొనుగోలుదారులతో చర్చలు జరిపి కనీస మద్దతు ధరలు ఖరారు చేశామని పెమ్మసాని వివరించారు.   బ్రైట్ గ్రేడ్‌కు 230 రూపాయలు, మీడియంకు  190, లో-గ్రేడ్‌కు  110, ఆఫ్ స్టైల్‌కు  130 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేసేందుకు ఎగుమతిదారులు అంగీకరించారని పెమ్మసాని చెప్పారు. ఈ వేలం ప్రక్రియను రోజుకు 2 మిలియన్ కిలోల చొప్పున రాబోయే రెండు నెలల్లో వేగంగా పూర్తి చేయాలని  స్పష్టంగా ఆదేశించామన్నారు.   జగన్  ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో కేవలం ఒకే ఒక్కసారి   105 కోట్ల రూపాయలతో మార్కెట్ జోక్యం చేసుకుంటే, తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే బ్లాక్ బర్లీ రైతులకు  146 కోట్లు ఇచ్చిందని గుర్తు చేసిన పెమ్మసాని.. ఇప్పుడు  మళ్లీ  100 కోట్ల రూపాయల సాయం అందిస్తూ రైతు పక్షాన నిలిచామని చెప్పారు.   ఇక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని  విమర్శించారు.   2015లోనే నాటి  తెలుగుదేశం ప్రభుత్వం  చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు. అయితే గతంలో జగన్ కోర్టు కేసులు వేయించి, 500 ఎకరాల సేకరణను అడ్డుకుని ప్రాజెక్టును జాప్యం చేశారని  ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక జీఎంఆర్ టెండర్లను రీటెండర్ చేసినా నిబంధనలేవీ మారలేదని, కేవలం కాలయాపన చేసి ప్రాంతాభివృద్ధికి విఘాతం కలిగించారని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించి భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని వేగవంతం చేశారని పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు.   ఇప్పటికే విశాఖ నుంచి ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ కల్పించే ఐదు రహదారుల పనులు పూర్తయ్యాయని, మిగిలిన రెండు రహదారులను కూడా త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. Pemmasani Chandrasekhar, Tobacco Farmers AP, Bhogapuram Airport, AP Cabinet ReviewAP TDP Coalition News
ALSO ON TELUGUONE N E W S
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల లొకేషన్‌లో ఎదురైన ఒక అనూహ్య ప్రమాదం వల్ల తీవ్ర గాయాల పాలై అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. తన రాబోయే భారీ చిత్రం మైసా షూటింగ్‌లో భాగంగా ఒక అత్యంత కఠినమైన, ఎనర్జిటిక్ డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన తర్వాత వైద్యులను సంప్రదించగా, వారు ఆమె పరిస్థితిని పరిశీలించి కనీసం 6 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని కఠినమైన సూచనలు చేశారు. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు బెడ్ రెస్ట్‌కే పరిమితమైన రష్మిక, తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ఒక భావోద్వేగపూరితమైన సుదీర్ఘమైన పోస్ట్‌ను పంచుకుంది. ఈ పోస్ట్‌లో ఆమె తన మనసులోని ఆవేదనను, గాయం తీవ్రతను ఎంతో పారదర్శకంగా వివరించింది. సాధారణంగా నటనకు, ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే రష్మికకు ఇలాంటి గాయాలు కావడం తీవ్ర అసహనాన్ని కలిగిస్తోందట. "గాయాలు కావడం నాకు నిజంగా చాలా చిరాకు తెప్పిస్తుంది. నా ఆరోగ్యం గురించి, ఈ గాయం గురించి ఎవరికీ తెలియకూడదు, రహస్యంగానే కోలుకోవాలి అని అనుకున్నాను కానీ చివరకు ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. నా జీవితంలో ఇలాంటి తీవ్రమైన కాలి గాయం కావడం ఇది ఏకంగా మూడవసారి" అంటూ తన నిరాశను వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా గాయం యొక్క వైద్యపరమైన తీవ్రతను కూడా ఆమె స్పష్టంగా వెల్లడించింది. మన శరీరంలో తుంటికి కాలుని కలిపే టెండన్స్ ఒక్కో వైపు నాలుగు ఉంటాయి. అయితే ఈ ప్రమాదంలో రష్మిక కుడి తుంటిలోని ఒక ప్రధానమైన టెండెన్ తెగిపోయి ఊడిపోయింది. తాను సాధారణంగా కాలు పైకి ఎత్తి నడవాలన్నా లేదా కదపాలన్నా ఆ టెండెన్ మళ్లీ పూర్తిగా అతుక్కోవాల్సిందేనని, అంతవరకు కదలకుండా ఉండక తప్పదని వైద్యులు చెప్పారు. తన కెరీర్‌లో నటిస్తున్న చిత్రాల్లో 'మైసా' అత్యంత సవాలుతో కూడుకున్న కష్టమైన సినిమా అని రష్మిక పేర్కొంది. అహోరాత్రులు విరామం లేకుండా వరుస ప్రాజెక్టులతో గడుపుతున్న తనకు, కాస్త విశ్రాంతిని ప్రసాదించడానికే దేవుడు ఈ రూపంలో కాలి గాయం బారిన పడేలా చేశాడేమో అని భావిస్తున్నట్లు రష్మిక ధైర్యంగా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం రష్మిక మందన్న రణబాలి మరియు మైసా అనే రెండు క్రేజీ చిత్రాల షూటింగ్స్‌లో అత్యంత బిజీగా పాల్గొంటోంది. ఇవి మాత్రమే కాకుండా మరో రెండు భారీ పాన్-ఇండియా చిత్రాల్లో కథానాయకగా నటిస్తోంది. అలాగే ప్రసిద్ధ గ్లోబల్ మరియు నేషనల్ లెవెల్‌కు చెందిన ఏకంగా 30 బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. రష్మికకు ఈ స్థాయిలో తీవ్ర గాయం కావడంతో ఆమె నటిస్తున్న భారీ సినిమాలతో పాటు ఏకంగా 30 వ్యాపార ప్రకటనల షూటింగ్స్ అన్నీ కూడా తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ వార్తతో టాలీవుడ్ పరిశ్రమతో పాటు ఆమె అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. త్వరలోనే ఆమె కోలుకుని మళ్లీ షూటింగ్స్‌తో బిజీగా మారాలని లక్షలాది మంది నెటిజన్లు సోషల్ మీడియాలో ఆకాంక్షిస్తున్నారు.
సినిమా గ్లామర్ ప్రపంచంలో మెరిసిపోయే నటీనటుల జీవితం కేవలం రెడ్ కార్పెట్లు, అభిమానుల విజిల్స్, వెండితెర రంగుల వెలుగులకే పరిమితం అనుకుంటే పొరపాటే అవుతుంది. ఆ మెరుపుల వెనుక ఎంతటి కఠిన శ్రమ, శారీరక మానసిక అలసట దాగి ఉంటాయో మరోసారి నిరూపించారు జాతీయ అవార్డు గ్రహీత, మన మహానటి కీర్తి సురేశ్. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ వేదికగా కీర్తి పంచుకున్న ఓ వర్కింగ్ అప్‌డేట్ చూసి చిత్ర పరిశ్రమతో పాటు అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఎంతటి వృత్తి నిబద్ధత ఉంటే తప్ప ఒక నటి ఇలాంటి కఠిన షెడ్యూల్‌ను తట్టుకోలేరంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కీర్తి సురేశ్ పంచుకున్న వివరాల ప్రకారం.. ఆమె ఏకంగా 20 గంటల పాటు నాన్-స్టాప్ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకు షూటింగ్ ప్రదేశానికి బయలుదేరిన ఆమె, మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు అంటే పూర్తి 24 గంటల తర్వాత మాత్రమే తిరిగి తన హోటల్ రూమ్‌లో అడుగుపెట్టారు. అసలు ఊహించని విషయం ఏమిటంటే, ఆ నిరంతర శ్రమ తర్వాత కూడా మొత్తం 41 గంటల పాటు ఆమె అస్సలు నిద్రపోలేదు. నిద్ర లేక శరీరం ఎంతగా అలసిపోయినా, కేవలం ఒకే ఒక్క గంట విరామం దొరికినప్పటికీ మళ్లీ తదుపరి ప్రాజెక్ట్ షూటింగ్ కోసం సిద్ధమైపోయారు. ఈ బిజీ షెడ్యూల్ గురించి కీర్తి సురేశ్ స్పందిస్తూ.. నిన్నటి రోజున ఈ విశేషాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేంత ఓపిక కూడా తనలో లేదని సరదాగా పేర్కొన్నారు. ఒక షూటింగ్ సెట్ నుంచి మరో షూటింగ్ సెట్‌కు పరుగులు తీస్తూ 41 గంటలు నిరంతరంగా మెలకువగా ఉన్నానని వెల్లడించారు. తీవ్రమైన అలసట వేధిస్తున్నప్పటికీ, మళ్లీ తదుపరి షూట్‌కి వెళ్లేముందు మిర్రర్ సెల్ఫీ తీసుకునేంత ఉత్సాహం తనలో ఇంకా మిగిలే ఉందంటూ ఒక క్యూట్ పిక్‌ను అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా, జీవితంలో ఇంత బిజీగా ఉండటం అనేది ఒక రకమైన మంచి సమస్యాత్మక పరిస్థితి అని, దీన్ని భగవంతుడు తనకు ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. తరువాత షూటింగ్‌కు వెళ్లే క్రమంలో ఆమె ధరించిన టీ-షర్ట్‌పై "ఐ విల్ సర్వైవ్" అని రాసి ఉంది. దానిని చూపిస్తూ "ఈ రోజు ఈ వ్యాక్యానికి సరిగ్గా సరిపోయే అర్థం దక్కింది, అవును నేను నిలబడతాను" అని ఆత్మవిశ్వాసంతో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కీర్తి సురేశ్ కెరీర్ అత్యున్నత దశలో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె చేతిలో ప్రస్తుతం 'సత్యవాన్ సావిత్రి', 'రఫ్తార్', 'అక్క', 'రౌడీ జనార్ధన' వంటి పలు ప్రతిష్టాత్మక చిత్రాలతో పాటు 'వెంకీ-అనిల్ రావిపూడి' సినిమా కూడా ఉంది. ఈ క్రేజీ ప్రాజెక్టుల వల్లనే ఆమెకు నిముషం తీరిక లేని టైట్ షెడ్యూల్ ఏర్పడింది. సినిమాల పట్ల ఉన్న అపారమైన ప్రేమ, నిబద్ధతే కీర్తి సురేశ్‌ను ఈ స్థాయిలో కష్టపడేలా చేస్తున్నాయని నెటిజన్లు కొనియాడుతున్నారు.
రామ్‌గోపాల్‌వర్మ సంచలన వ్యాఖ్యలు ఎప్పుడూ టాలీవుడ్‌లో కొత్త చర్చలకు తెరలేపుతూనే ఉంటాయి. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ తీవ్ర కలకలం రేపుతున్నాయి. సాధారణంగా ఒక సినిమా ఫ్లాప్ అయితే పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని, నిర్మాతలు రోడ్డున పడతారని అందరూ భావిస్తుంటారు. కానీ ఆర్జీవీ మాత్రం ఈ సాధారణ భావనను పూర్తిగా తిరస్కరించారు. ఇండస్ట్రీని అసలు ముంచుతోంది ఫ్లాప్ సినిమాలు కావని, హీరోలు, నిర్మాతల బాధ్యతారాహిత్యం, ప్రణాళికా లోపమేనని ఆయన కుండబద్దలు కొట్టారు. సినిమా నిర్మాణంలో జరిగే మేనేజ్‌మెంట్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఆర్జీవీ ఒక షాకింగ్ ఉదాహరణను బయటపెట్టారు. టాలీవుడ్‌కి చెందిన ఒక టాప్ హీరోయిన్ ఒక పెద్ద సినిమా షూటింగ్ కోసం ఏకంగా 10 రోజుల పాటు సెట్స్‌లోనే ఉండిపోయారట. కానీ అక్కడ నిర్మాణంలో ఉన్న తీవ్రమైన ప్లానింగ్ లోపం వల్ల ఆమెతో కేవలం ఒక్క రోజు మాత్రమే షూటింగ్ చేయించగలిగారు. మిగిలిన 9 రోజులు ఆమె సెట్స్‌కే పరిమితమైనప్పటికీ, ముందస్తు ఒప్పందం ప్రకారం ఆ 10 రోజులకూ సంబంధించిన పూర్తి పారితోషికాన్ని కథానాయిక వసూలు చేసుకున్నారని వర్మ వెల్లడించారు. ఒక్క రోజు పనికి 10 రోజుల భారీ పారితోషికం చెల్లించాల్సి రావడం అంటే నిర్మాతకు అది ఎంతటి అనవసరమైన నష్టమో ఆలోచించాల్సిన విషయమని వర్మ వ్యాఖ్యానించారు. ఇలాంటి సరైన ప్రణాళికలు లేకపోవడం, షెడ్యూలింగ్ సరిగ్గా నిర్వహించకపోవడం వల్లే నిర్మాతలు అనవసరంగా కోట్లాది రూపాయల బడ్జెట్‌ను వృథా చేసుకుంటున్నారని వర్మ విశ్లేషించారు. హీరోలు, నిర్మాతలు మేనేజ్‌మెంట్ విషయంలో చూపే ఈ నిర్లక్ష్యమే సినిమా బడ్జెట్‌లను అపరిమితంగా పెంచేస్తోందని ఆయన ఆరోపించారు. క్రమశిక్షణ లేని నిర్మాణ విధానాల వల్ల ఎంతటి భారీ ప్రాజెక్టైనా చివరకు ఆర్థికంగా కుప్పకూలిపోతుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఫ్లాప్ సినిమాల వల్ల సినీ పరిశ్రమకు జరిగే మేలు గురించి చెబుతూ రామ్‌గోపాల్‌వర్మ తనదైన మార్కు వినూత్న లాజిక్‌ను బయటకు తీశారు. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఫ్లాప్ సినిమా అనవసరపు దండగ అని అనుకుంటారు. కానీ ఒక ఫ్లాప్ సినిమా నిర్మించినప్పుడు కూడా వందలాది మంది టెక్నీషియన్లు, దినసరి కూలీలు, చిన్న తరహా నటులు, కాస్ట్యూమ్ డిజైనర్లు, డ్రైవర్లు, లైట్ మెన్లకు ఉపాధి దొరుకుతుందని వర్మ తెలిపారు. ఆ సినిమా ద్వారా మార్కెట్‌లో డబ్బు చలామణి అయి అనేక రంగాలు, పేద కార్మికుల కుటుంబాలు పోషణ పొందుతాయని ఆయన వివరించారు. అయితే, ఒక సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి రూ. 100 కోట్లు లేదా రూ. 500 కోట్ల లాభాలు తెచ్చిపెడితే ఏమవుతుందో వర్మ క్లియర్‌గా విశ్లేషించారు. ఆ విజయం వల్ల వచ్చే వందల కోట్ల భారీ లాభాలు కేవలం స్టార్ హీరో, అలాగే ఆ సినిమా నిర్మించిన నిర్మాతకు మాత్రమే చేరుతాయని, కింది స్థాయి వర్కర్లకు లేదా సామాన్య టెక్నీషియన్లకు అందులో పైసా కూడా అదనంగా దక్కదని స్పష్టం చేశారు. కాబట్టి హిట్ల వల్ల కేవలం కొద్దిమందికి మాత్రమే వ్యక్తిగతంగా లాభం చేకూరుతుందని, కానీ ప్రతి సినిమా నిర్మాణంలో జరిగే డబ్బు చలామణి ఇండస్ట్రీకి ఎంతో కొంత ఆసరాగా నిలుస్తుందని ఆర్జీవీ పేర్కొన్నారు. అందుకే సినీ పరిశ్రమను నాశనం చేస్తోంది ఫ్లాప్ సినిమాలు ఎంతమాత్రం కాదని, సమయపాలన లేకపోవడం, హీరోలు, నిర్మాతల నిర్లక్ష్య వైఖరి మాత్రమేనని తేల్చిచెప్పారు. నిర్మాతలు తమ మేనేజ్‌మెంట్ పద్ధతులను మార్చుకోకపోతే, ప్రాజెక్టులలో ప్లానింగ్ పెంచుకోకపోతే పరిశ్రమ మరింత తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోవడం ఖాయమని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి.   Ram Gopal Varma comments, RGV interview Tollywood, Telugu cinema losses
After reports about her injury went viral, actress Rashmika Mandanna has finally broken her silence with a heartfelt and candid note on social media. The actress assured fans that she is recovering well while revealing the extent of her injury and explaining why she has been away from the spotlight. Beginning her note on a cheerful note, Rashmika wrote, "Injuries suck... and I was really hoping that no one will get to know... Sorry I've been MIA... but hieeee! I'm hereeee!" She also revealed that this is the third injury she has suffered back-to-back, admitting, "I should definitely learn to treat my body like a human body and not some machine." Explaining what exactly happened, the actress said one of the tendons in her right hip got detached during the shoot of her upcoming film Mysaa. "There are four tendons on each side of your hip that connect your hip to your leg, and one of those tendons on my right hip apparently had detached. That has to attach again for me to be able to lift my leg up and stuff. This happened during my dance shoot for Mysaa. My God, that's the most aggressive film I've ever done for sure!" she shared. Despite the painful setback, Rashmika maintained her trademark positivity. "Don't worry... it hurts but it's not unbearable. I feel like this is God saying, 'You'll never take a break if it's left to you, so here... let me do it for you!'" she joked, adding that all her recent injuries have been "random" and "freak accidents." The forced break has also brought its own challenges. Rashmika admitted she's trying hard not to gain weight since she can't work out or run for a while. "I workout and run like a beast... and now I won't be able to workout or run for awhile. If I can't workout then what do I do... I eat... and I become a dessert monster," she wrote humorously. She also revealed that she's spending her recovery time solving puzzles and has discovered she's surprisingly good at them. Ending the note on an emotional note, Rashmika reassured her fans that there is no reason to worry. "Love ya! Don't worry ok... Biggest loves and kisses and hugs!" she wrote, promising to keep everyone updated on her recovery. Fans and well-wishers have since flooded social media with messages wishing the actress a speedy recovery as she prepares to return to the sets once she is fully fit. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
కన్నడ సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న నటుడు విజయ్ రాఘవేంద్ర కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'సెకండ్ కేస్ ఆఫ్ సీతారామ్'. గతంలో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన 'సీతారామ్ బెనోయ్ కేసు నెంబర్ 18' చిత్రానికి ఇది అధికారిక సీక్వెల్‌గా రూపుదిద్దుకుంది. దేవీప్రసాద్ శెట్టి దర్శకత్వంలో ఫ్లయింగ్ ఎలిఫెంట్ స్టోరీ టెల్లర్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమా మొదట ఫిబ్రవరి 20, 2026న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్ అయిన 'అమెజాన్ ప్రైమ్' ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రారంభంలో కన్నడ, తమిళ, హిందీ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ చిత్రం, జులై 31, 2026 నుంచి తెలుగు వర్షన్‌లోనూ ప్రసారమవుతూ ఓటీటీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా కథ కర్ణాటకలోని ఒక గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. అక్కడ సీతారామ్ అనే నిబద్ధత కలిగిన పోలీస్ ఆఫీసర్‌గా విజయ్ రాఘవేంద్ర బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. ఆ ప్రశాంతమైన గ్రామంలో హఠాత్తుగా వరుసగా దారుణమైన హత్యలు జరుగుతూ అలజడి రేగుతుంది. బాధితుల కాళ్లు, చేతులను ఇనుప ముళ్లతీగలతో అత్యంత కిరాతకంగా కట్టేసి ప్రాణాలు తీస్తుంటాడు ఒక వ్యక్తి. వరుస హత్యల సరళిని పరిశీలించిన సీతారామ్, ఈ నేరాలకు పాల్పడుతున్నది ఒక సైకో కిల్లర్ అనే నిర్ధారణకు వస్తాడు. సరిగ్గా అదే సమయంలో, తన కూతురిని ఒక యువకుడు తీవ్రంగా వేధిస్తున్నాడంటూ సెబాస్టియన్ అనే స్కూల్ మాస్టర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తాడు. ప్రాంతీయంగా టిప్పర్ డ్రైవర్లు, కుర్రాళ్లు సృష్టిస్తున్న గొడవలు ఒకవైపు, సైకో కిల్లర్ ఆచూకీ కనుగొనాల్సిన ఇన్వెస్టిగేషన్ మరొకవైపు సీతారామ్‌ను బిజీగా ఉంచుతాయి. దీనికితోడు సెబాస్టియన్ ఇచ్చిన ఫిర్యాదుపై కూడా అతను దృష్టి సారిస్తాడు. అయితే, ఊహించని విధంగా పోలీస్ ఆఫీసర్ సీతారామ్ సొంత గన్ మాయమవుతుంది. తన సర్వీస్ రివాల్వర్‌ను ఎవరు దొంగిలించారు, దానితో ఎలాంటి ఘోరానికి ఒడిగడతారోనన్న ఆందోళన అతనిని తీవ్రంగా వెంటాడుతుంది. కేసు విచారణను వేగవంతం చేసిన సీతారామ్‌కు మైండ్ బ్లాక్ అయ్యే షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తాయి. సెబాస్టియన్ కూతురు మూడు నెలల క్రితమే మరణించిందనీ, ఆమెను వేధించాడని ఆరోపించిన యువకుడు కూడా గత 3 నెలలుగా కనిపించడం లేదని సీతారామ్ తెలుసుకుంటాడు. ప్రతీ హత్య జరగడానికి సరిగ్గా ముందు, ఆయా బాధితుల కుటుంబ సభ్యులకు ఒక చిన్న 'వీణ' బొమ్మ దొరకడం సీతారామ్‌ను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతేకాకుండా, దారుణంగా హత్యకు గురైన వారందరూ టీనేజ్ వయసున్న ఆడపిల్లల తండ్రులే కావడం ఈ కేసును మరింత గందరగోళంలోకి నెట్టివేస్తుంది. హంతకుడు ఆడపిల్లల తండ్రులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు, వీణ బొమ్మలకు ఈ హత్యలకు ఉన్న రహస్య సంబంధం ఏమిటనేది కథలో ప్రధాన ఆసక్తికర అంశం. ఈ క్రమంలోనే సీతారామ్ అక్క కూతురుకి కూడా ఒక வீణ బొమ్మ దొరకడంతో కథలో ఉత్కంఠ పరాకాష్టకు చేరుకుంటుంది. తన సొంత కుటుంబానికే ముప్పు పొంచి ఉందనే నిజం తెలిశాక సీతారామ్ ఆ సైకో కిల్లర్‌ను ఎలా పట్టుకున్నాడు అనేదే మిగతా సినిమా. ఈ చిత్రంలో నటుడు విజయ్ రాఘవేంద్ర పోలీస్ ఆఫీసర్‌గా చాలా చక్కటి నటనను కనబరిచారు. సాంకేతికంగా హేమంత్ ఆచార్య ఛాయాగ్రహణం, నవనీత్ శ్యామ్ నేపథ్య సంగీతం, శశాంక్ నారాయణ ఎడిటింగ్ వర్క్ ఫరవాలేదనిపిస్తాయి. అయితే, ఒక రొటీన్ రిベンజ్ ఫ్లాష్‌బ్యాక్, సంగీతం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలు కథనాన్ని కొంత సాగదీసినట్లు అనిపిస్తాయి. ఈ చిత్రానికి సమీక్షకులు 5 పాయింట్లకు గాను 2.25 రేటింగ్ కేటాయించారు. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను, ఓటీటీ కంటెంట్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉన్న ఈ 'సెకండ్ కేస్ ఆఫ్ సీతారామ్' ఒకసారి చూడదగిన చిత్రంగా నిలుస్తుంది.     Second Case of Seetharam Review, Vijay Raghavendra
With just days left for the worldwide release of Korean Kanakaraju on August 7, director Merlapaka Gandhi has opened up about the film's unique concept and why he believes Varun Tej's performance will be one of its biggest attractions. Produced by UV Creations on a grand scale, the supernatural comedy has already created strong buzz through its teaser, trailer, and chartbuster songs composed by Thaman. Speaking about the film's origin, Gandhi revealed that the idea came from his observations of the Korean community living around the Kia factory in Anantapur. "I wondered how funny it would be if a Korean spirit possessed a local boy from Anantapur. That thought eventually became the foundation of Korean Kanakaraju," he shared. The director said Varun Tej had to prepare extensively to portray the film's two contrasting shades. The actor underwent training to master both the Anantapur dialect and Korean language, with language coaches brought in to ensure authenticity. Gandhi also praised Varun for being deeply involved in the project from the script stage and for effortlessly transforming into two completely different personalities. "He always looks for unique concepts and sheds all traces of his previous roles. The variations in his character will surprise audiences," he said. To give the film a fresh visual appeal, the makers shot key portions in real locations across South Korea and Kazakhstan. Gandhi revealed that despite visa challenges, the team spent nearly 20 days filming on an island in South Korea, believing that authentic locations would enhance the cinematic experience. Apart from the supernatural comedy, Korean Kanakaraju also features a light-hearted romance with Ritika Nayak, who plays a factory worker fascinated by Korean culture. The film's comedy largely stems from the hero speaking fluent Korean after being possessed, leaving everyone around him confused while Telugu subtitles help the audience enjoy every punchline. Supported by an ensemble cast including Satya, Sunil, and Muralidhar Goud, Gandhi is confident the film will deliver non-stop entertainment and emerge as a wholesome commercial entertainer when it releases worldwide.   Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.  
    ప్రభాస్(Prabhas).. మహేష్ బాబు(Mahesh Babu)ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్  గా తన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. సెల్యులాయిడ్ పై బొమ్మ  పడితే తొలి రోజు వచ్చే కలెక్షన్స్ లెక్కపెట్టడానికి మిషన్స్ కూడా చాలవు. ఇప్పుడు ఈ ఇద్దరికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఏం ఎస్ రాజు.. నిర్మాతగా తెలుగు చలన చిత్ర సీమలో ఈ పేరు సృష్టించిన ప్రభంజనం మాములు ప్రభంజనం కాదు.  ఆ హిట్ హిస్టరీ చూసిన తర్వాత జెన్ జి సినీ బ్యాచ్ మనకి తెలియాల్సింది చాలా ఉందని నోరెళ్ళ బడుతుంది. ముచ్చటగా మూడు చెప్పుకోవాలంటే ఒక్కడు, వర్షం, దేవి. ఈ నెల 14 న ఆయనే డైరెక్టర్ గా 'అగధ' అనే కొత్త చిత్రంతో వస్తున్నాడు. ఈ సందర్భంగా తెలుగు వన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఏం ఎస్ రాజు గారు మాట్లాడుతు నేను వర్షం సినిమా తీసేటప్పుడు ప్రభాస్ పై ఎలాంటి అంచనాలు లేవు. వర్షం ముందు వచ్చిన సినిమాలు కూడా సరిగా ఆడలేదు. కానీ వర్షం మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యి ప్రభాస్ కి స్టార్ ఇమేజ్ తెచ్చింది. వర్షం వల్లనే ఛత్రపతి సినిమా తీశారు. ఆ తర్వాత ప్రభాస్ తో పౌర్ణమి తెరకెక్కించాను. కానీ ప్రభాస్ పై అంచనాలు పెరిగిపోవడంతో పౌర్ణమి డిజాస్టర్ గా నిలిచింది. కానీ సినిమా మాత్రం బాగుంటుంది. అందుకే స్టార్ డమ్ అంటే నాకు భయం. Also read: ఓటీటీ కంపెనీల టార్చర్..  వాళ్ళ బతుకు బస్టాండ్ పాలేనా!  మహేష్ తో తెరకెక్కించిన 'ఒక్కడు' కి ఎక్కువ మొత్తంలో ఫైనాన్స్ చేయకుండా మనసంతా నువ్వే తో  వచ్చిన డబ్బు మొత్తం ఒక్కడుకి ఖర్చు చేశాను.  ఒక్కడికి ముందు మహేష్ కి సరిగా సక్సెస్ లేకపోవడంతో బయ్యర్లు తక్కువ రేటుకి అడిగేవారు. మహేష్ ని అవమానించే విధంగా మాట్లాడే వారు.దీంతో నేనే ఓన్ గా రిలీజ్ చేసానని చెప్పుకొచ్చాడు.    
Gopichand has completed a remarkable 25 years in Indian cinema, marking the milestone with a heartfelt letter expressing gratitude to everyone who has been part of his journey. Sharing the note on social media, the actor described the occasion as one he would "forever be grateful for," crediting his late father T. Krishna's blessings for guiding him throughout his career. Looking back on his silver jubilee in films, Gopichand wrote that the last 25 years have been filled with learning, growth and unforgettable memories. He thanked every producer, director, writer, co-actor, technician and member of the film fraternity who believed in him and contributed to his journey, acknowledging that their constant support made his career possible. In a special mention, the actor expressed his gratitude to the media and Telugu film journalists for standing by him over the years. He said their appreciation, encouragement and honest feedback had meant a great deal to him throughout his professional journey. The emotional note was also dedicated to his fans and audiences. Gopichand said words were not enough to express his gratitude for the unconditional love, trust and encouragement they have showered on him. He thanked not only the Telugu audience but also viewers across languages and even fans of other heroes who appreciated his work and supported him through every phase of his career. Concluding the letter, Gopichand promised to continue working harder and bring stories and performances that would make his well-wishers proud. He signed off by thanking everyone for being a part of his journey and invited audiences to meet him in theatres soon with his upcoming films BharataVarsha, SINGA, and many more. His heartfelt message has resonated with fans, who have been celebrating the actor's 25-year milestone and wishing him continued success in the years ahead.   Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
 తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు.. పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి..!++ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలోని ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కోవాలని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు, తల్లిదండ్రులకు తెలియకుండానే వారి కొన్ని అలవాట్లు, వారి పిల్లల ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరుస్తాయి. ఏ తల్లిదండ్రులు కూడా ఉద్దేశపూర్వకంగా తమ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని కోరుకోరు.. పిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుంది,  వారు తమ పరిసరాల నుండి త్వరగా నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ఏమైనా మాట్లాడితే అది వారి భవిష్యత్తును చాలా గందరగోళంగా మారుస్తుంది.  చిన్నతనంలో పిల్లలకు ఎమోషనల్ గా సపోర్ట్ చేస్తేనే వారు భవిష్యత్తులో ఆత్మవిశ్వాసంగా ఉండగలుగుతారు. తాము కూడా తెలియకుండానే తమ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, ఆ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేని స్థితికి తీసుకెళ్లే పరిస్థితి రాకుండా ఉండాలంటే.. తల్లిదండ్రులు కొన్ని విషయాలను తెలుసుకోవాలి.. పిల్లల తప్పుకు పోల్చి తిట్టడం.. చాలా మంది తల్లిదండ్రులు, తమ పిల్లల తప్పుకు కోపం తెచ్చుకుని, వారిని ఇతర పిల్లలతో పోల్చడం మొదలు పెడతారు.  ఇలా పోల్చడం ఎప్పుడైతై  మొదలవుతుందో అప్పుడు పిల్లలు ఇతరులను చూపించి, వారితో పోల్చి తిడతారు కూడా.  మార్కుల విషయంలో కావచ్చు,  తెలివి తేటల విషయంలో కావచ్చు, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడంలో కావచ్చు,  చురుగ్గా ఉండే విషయంలో కావచ్చు..  ఇలా  ప్రతిదానికి తల్లిదండ్రులు పిల్లలను పోల్చి మాట్లాడితే..  పిల్లలు చాలా బాధపడతారు, తమను తాము పనికిరానివారిగా భావిస్తారు. ఇక్కడే వారి ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం మొదలవుతుంది. తిట్టడం.. తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లలను తప్పులు చేసినందుకు కఠినంగా తిడతారు. కానీ తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సినది.. వారు పిల్లలని, ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారని, అలాంటప్పుడు  తరచుగా తప్పులు జరుగుతాయని అర్థం చేసుకోవాలి.   పిల్లలను తప్పులకు పదేపదే తిడితే, వారు కొత్తగా ఏదైనా ప్రయత్నించడానికి భయపడతారు. తప్పు చేయడం చెడ్డ విషయమని, మళ్ళీ తిట్లు పడతాయని భావించి, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి, లేదా ప్రయత్నించడానికి కూడా భయపడి ప్రయత్నాలు మానేస్తారు. ఎమోషన్స్ ను లైట్ తీసుకోవడం.. పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు.  వారు భయపడినప్పుడు, బాధపడినప్పుడు లేదా కలత చెందినప్పుడు,  "ఇంత చిన్న విషయానికి ఏడవకు"  అనడం లేదా "ఇది పెద్ద విషయమేమీ కాదు" అని తోసిపుచ్చేయడం.. వంటివి తల్లిదండ్రులు చేస్తుంటారు.  దీనివల్ల  తమ భావాలకు విలువ లేదని  పిల్లలు భావిస్తారు. దీనివల్ల, తమను ఎవరూ అర్థం చేసుకోరనే భావనతో వారు తమ భావాలను, ఆలోచనలను దాచుకుంటారు. ఇది వారి నమ్మకాన్ని బలహీనపరుస్తుంది, దాని ప్రభావం వారి ఆత్మవిశ్వాసంపై నేరుగా పడుతుంది ఓవర్ ప్రొటెక్షన్,  హెల్పింగ్.. చాలామంది తల్లిదండ్రులు, తమ పిల్లలకు సహాయం చేసే నెపంతో, వారి స్కూల్ బ్యాగులు సర్దడం, పిల్లల ఇష్టాలతో పని లేకుండా  తామే బట్టలు షాపింగ్ చేయడం లేదా నిర్ణయాలు తీసుకోవడం వంటి ప్రతి పనిని తామే చేస్తారు. దీనివల్ల పిల్లలు తమ పనులు తాము చేసుకునే అవకాశాన్ని కోల్పోతారు. పిల్లలు ఏదైనా పనిని  తామే చేసినప్పుడు వారికి తమ సామర్థ్యం పెరుగుతుంది. అలా కాకుండా అన్నీ తల్లిదండ్రులే చేస్తుంటే పిల్లలకు వారి సామర్థ్యం గురించి తెలియదు.  క్రమంగా, వారు చిన్న చిన్న విషయాలకు కూడా తమ తల్లిదండ్రులపై ఆధారపడతారు తక్కువ చేసి మాట్లాడటం.. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను తిడతారు లేదా బంధువులు, స్నేహితులు లేదా అతిథుల ముందు వారి బలహీనతలను  బయటపెడతారు. దీనివల్ల పిల్లలు చాలా షేమ్ గా ఫీలవుతారు. తమను తాము తక్కువగా భావించుకుంటారు. పదేపదే అందరి ముందు  అవమానపడటం వల్ల,  అందరి ముందు ఓపెన్ మాట్లాడటానికి , ఏదైనా చెప్పడానికి భయపడతారు. అది వారి ఆత్మవిశ్వాసంపై నేరుగా ప్రభావం చూపుతుంది. అభిరుచులు రుద్దడం.. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు చదువు విషయంలో గానీ, అభిరుచుల విషయంలో గానీ తమకు నచ్చినది చేయాలని కోరుకుంటారు. పిల్లల సొంత ఇష్టాయిష్టాలను, అభిప్రాయాలను  పట్టించుకోరు. పిల్లలకు తమకు నచ్చింది ఎంచుకోవడం,  నచ్చిన పని చేయడం వంటి అవకాశాలు లేనప్పుడు తమ నిర్ణయాలకు విలువ లేదని పిల్లలు భావిస్తారు. ఇది వారిలో ఆత్మవిశ్వాసం లోపించడానికి, అలాగే దృఢమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకడుగు వేయడానికి  దారితీస్తుంది.                                *రూపశ్రీ  
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు. కానీ చాలామంది చేసే మిస్టేక్.. సైడ్ ఇన్కమ్ కోసం ప్రయత్నించకపోవడం. ఉద్యోగం చేస్తూనే ఎక్స్టాగా ఇన్కమ్ సంపాదించడం వల్ల ఆర్థికంగా ఎంతో వృద్ధి చెందవచ్చు.  దీనికోసం మంచి మార్గాలు,  ఎక్ట్సా ఇన్కమ్ సంపాదించాలనుకునే వారు చేయకూడని తప్పులు తెలుసుకుంటే.. ఫ్రీలాన్సింగ్..  రైటింగ్, డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్ లేదా కోడింగ్ వంటి స్కిల్స్  ఉంటే  ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు చేయవచ్చు. ఇది  మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ఫ్రీలాన్సర్,  ఫైవర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో క్లయింట్ లు ఉంటారు. వారానికి 10–12 గంటలు కేటాయించడం ద్వారా, ₹10,000 నుండి ₹25,000 వరకు సంపాదించవచ్చు. బ్లాగింగ్, కంటెంట్ క్రియేషన్.. రాయడం పట్ల మంచి అభిరుచి ఉంటే  బ్లాగింగ్, యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను క్రియేట్ చేయవచ్చు. సబ్స్క్రైబర్స్,  వ్యూస్ బాగా వచ్చిన తరువాత  యాడ్స్ , స్పాన్సర్‌షిప్‌లు కూడా వస్తాయి. వీటి ద్వారా అదనపు ఆదాయం కూడా ఉంటుంది. అయితే దీనికి మంచి కంటెంట్, క్లిక్ అయ్యేవరకు సమయం అవసరం అవుతాయి. ఆదాయం వెంటనే ఉండదు. కాస్త ఓపిక అవసరం. ఆన్లైన్ ట్యూటరింగ్.. కోర్సెస్.. ఏదైనా ఒక  సబ్జెక్టులో బాగా గ్రిప్ ఉంటే అలాంటి వారు  ఆన్‌లైన్ క్లాసెస్ చెప్పవచ్చు.  లేదా డిజిటల్ కోర్సులను క్రియేట్ చేసి  కూడా టీచింగ్ చేయవచ్చు. YouTube, Unacademy వంటి ప్లాట్‌ఫామ్‌లలో చేరవచ్చు.  లేదా Google Meetలో స్వయంగా  క్లాసెస్ చెప్పవచ్చు. ఇది   విద్యార్థులకు,  టీచింగ్ చేసేవారికి కూడా  చాలా బాగుంటుంది. ఈ-బుక్స్.. రాయడం పట్ల మంచి అబిరుచి ఉంటే ఈ-బుక్స్  రాసి కిండిల్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అమ్మడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇంటి నుండి వ్యాపారాన్ని ప్రారంభించడానికి రీసెల్లింగ్ లేదా ఈ-కామర్స్ కూడా ఒక గొప్ప మార్గం. ఈ కామర్స్-రీసెల్లింగ్.. అమెజాన్,  ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఉత్పత్తులను అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.  ఇంటి నుండి చిన్నగా ప్రారంభించవచ్చు. దుస్తులు, హస్తకళలు లేదా గృహోపకరణాలను అమ్మవచ్చు. ఇది క్రమంగా లాభదాయకమైన వ్యాపారంగా మారవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్.. సైడ్ ఇన్‌కమ్ అంటే కేవలం పని చేయడం ద్వారా సంపాదించేది మాత్రమే కాదు, డబ్బు సంపాదించడం గురించి. మ్యూచువల్ ఫండ్ SIPలు, స్టాక్ మార్కెట్, బాండ్లు లేదా డిజిటల్ గోల్డ్‌లో  వంటి వాటిలో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల క్రమంగా అదనపు నిధులు వస్తాయి. సరైన సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల దీర్ఘకాలికంగా మంచి ఆదాయం సృష్టించవచ్చు. ఈ తప్పులు చేయకండి.. సైడ్ ఇన్‌కమ్‌ను మొదలుపెట్టే ముందు  త్వరగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో  తరచుగా తప్పులు చేస్తాము. ఆ తప్పులేంటంటే.. తొందరపాటు చాలామందికి ఉంటుంది.  సైడ్ ఇన్కమ్ కావాలనే తొందరలో తప్పటడుగు వేయకూడదు. సైడ్ ఇన్కమ్ మీద ఆశతో ఎలాంటి పరిశోధనలు చేయకుండా లేదా డబ్బులు పెట్టుబడి పెట్టడం లేదా డబ్బు సరిగా చెల్లించని చోట వర్క్ చేయడానికి ఒప్పుకోవడం వంటివి చేయకూడదు. సైడ్ ఇన్కమ్ మోజులో పడిచాలామంది  ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎక్కువ లాభం వస్తుందని ఇచ్చే ప్రకటనలు చూసి మోసపోయి డబ్బులు పెట్టకూడదు. కేవలం అదనంగా చేసే పని ద్వారా సైడ్ ఇన్కమ్ ఉండేలా చూసుకోవాలి. అంతేకానీ డబ్బు కోసం ఎక్కువ ఒత్తిడి తీసుకుని పని చేయకూడదు. సైడ్ ఇన్కమ్ అయిన, ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం అయినా కుటుంబం కోసమే.. కానీ పని కోసం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. గొప్పలు చెప్పుకోవడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించడం మంచిది కాదు. భవిష్యత్ కోసం పొదువు చేయడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించాలి.                               *రూపశ్రీ.
ఆచార్య చాణక్యుడు   గొప్ప రాజనీతిజ్ఞుడు,  వ్యక్తిత్వ విశ్లేషణా నిపుణులు,  ఆర్థిక శాస్త్ర నిపుణులు.  ఆయన వేల సంవత్సరాల కిందటే మనిషి జీవితంలో ఎన్నో విషయాలను ఎంతో స్పష్టంగా, వివరంగా చెప్పాడు.  చాణక్య నీతిలో ఆయన చెప్పిన విషయాలు నేటికీ ప్రజలు ఆచరించదగిన  విధంగా ఉన్నాయి.  మనిషి జీవితంలో ఆప్తులకు,  సన్నిహితులకు, స్నేహితులకు.. ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాడు.  వీటి కారణంగా జీవితంలో ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది.  ముఖ్యంగా ఎవరితోనూ షేర్ చేసుకోకూడని విషయాలు కొన్ని ఉంటాయి.  ఆ విషయాలను గోప్యంగా ఉంచడం వల్ల లైఫ్ బిందాస్ గా ఉంటుందట. నలుగురిలో గౌరవంగా, మర్యాదగా,  బిందాస్ గా ఉండాలంటే.. చాణక్యుడు చెప్పిన నాలుగు విషయాలు తప్పక పాటించాలి. అవేంటో తెలుసుకుంటే..  ఆర్థిక నష్టాలు.. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో  పెద్ద ఆర్థిక నష్టం వాటిల్లితే  ఆ విషయాన్ని ఇతరులతో పంచుకోకూడదని ఆచార్య చాణక్యుడు తన సిద్ధాంతంలో చెబుతాడు.  ఆర్థిక పరిస్థితి బలహీనపడినప్పుడు చుట్టూ ఉన్నవారు మెల్లిగా దూరం జరుగుతారు,  పైగా గౌరవించడం కూడా మానేస్తారు. అందుకే ఆర్థికంగా నష్టపోతే ఎవరికీ చెప్పకూడదు. ఇంటి గొడవలు.. ఇంట్లో గొడవ జరిగినా లేదా కుటుంబ సభ్యులతో  అభిప్రాయ భేదం వచ్చినా, ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకూడదు. కుటుంబ తగాదాలను గోప్యంగా ఉంచుకోవాలి. కుటుంబ తగాదాలను ఇతరులతో పంచుకోవడం వల్ల, దాన్నే అదనుగా తీసుకుని సంబంధాలను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించేవారు చాలా మంది ఉంటారు. ఇది  జీవితంలో తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. అవమానం.. సమాజంలో మిమ్మల్ని ఎవరైనా అవమానించినా లేదా మాటలతో ఎవరైనా మిమ్మల్ని దూషించినా, ఆ విషయాన్ని  ఎదుటి వ్యక్తితో ఎప్పటికీ పంచుకోకూడదు. ఒకవేళ  ఆ అవమానం గురించి ఎవరికైనా చెబితే, ఆ వ్యక్తి మిమ్మల్ని గౌరవించడం మానేసే అవకాశం ఉంది. పైగా వాళ్లు అన్నప్పుడు లేని నొప్పి నేను అనగానే ఎందుకొచ్చింది వంటి మాటలు కూడా అంటారు. అందుకే  జీవితంలో ఎదురైన అవమానాల గురించి ఎప్పుడూ ఎవరికీ చెప్పకూడదు.  ప్రణాళికలు..   ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం  పనిలో విజయం సాధించాలనుకుంటే చేయబోయే పనుల ప్రణాళికలు ఎవరికీ చెప్పకూడదు.  ఎవరైనా ఒక పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు,  తరచుగా తమ ప్రణాళికను ఇతరులతో షేర్ చేసుకుంటారు. కానీ కొందరు ఇలా గోల్స్ పెట్టుకున్న వారిని ఎగతాళి చేస్తారు, మరికొందరు మాటల ద్వారా  ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి దానిని సాధించకుండా అడ్డుకుంటారు.                                 *రూపశ్రీ
పిల్లలు తమ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో స్వేచ్ఛగా పంచుకుంటున్నారా? లేక కొన్ని విషయాలను దాచిపెడుతున్నారా? పిల్లలు తమ సమస్యలు, భయాలు, సందేహాలు, విజయాలు, అపజయాలు అన్నింటినీ తల్లిదండ్రులతో నమ్మకంగా చెప్పుకోవడం వారి మానసిక ఎదుగుదలకు ఎంతో అవసరం.  ఈ వీడియోలో ప్రముఖ నిపుణురాలు డా. పూర్ణిమ నాగరాజ్ పిల్లలతో తల్లిదండ్రులు ఎలా స్నేహపూర్వకంగా ఉండాలి, పిల్లల్లో నమ్మకాన్ని ఎలా పెంచాలి, వారు ఏ పరిస్థితిలోనైనా తమ మనసులోని మాటను చెప్పేలా ఎలా ప్రోత్సహించాలి అనే అంశాలను సులభంగా వివరించారు. అలాగే పిల్లల మాటలను మధ్యలో అడ్డుకోకుండా వినడం, విమర్శించకుండా స్పందించడం, భయపెట్టకుండా మార్గనిర్దేశం చేయడం, కుటుంబంలో ఓపెన్ కమ్యూనికేషన్‌ను పెంపొందించడం వంటి ముఖ్యమైన పేరెంటింగ్ సూచనలను కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ప్రతి తల్లిదండ్రి తప్పకుండా చూడాల్సిన ఈ వీడియో పిల్లలతో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఉపయోగపడుతుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)    
పంచదార.. నేటికాలంలో చాలా విరివిగా వాడుతున్నారు. కాఫీ, టీ,  స్వీట్లు,  ఇంట్లో చేసే తీపి పదార్థాలు, డిజర్ట్ లు.. ఇలా చాలా తీపి పదార్థాల తయారీలో పంచదారది అగ్రస్థానం.  కాఫీ, టీ ల విషయాని వస్తే.. రోజులో కప్పుల కొద్ది తాగేవారు కూడా ఉంటారు. అయితే.. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నేటికాలంలో వైద్యులు కూడా పెద్ద ఎత్తునే చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా చక్కెరను ఎడాపెడా వాడిన వారిలో చాలా మంది ప్రస్తుతం డయాబెటిస్ పేషెంట్లుగా మారారన్నది ఒప్పుకోవాల్సిన నిజం. అయితే.. కేవలం ఒక వారం రోజుల పాటూ చక్కెర వాడకాన్ని ఆపి చూడమని వైద్యులు, ఆహార నిపుణులు చెబుతున్నారు.  వారం రోజులు చక్కెర వాడటం మానేస్తే శరీరంలో జరిగే మార్పుల గురించి కూడా వారు చెబుతున్నారు.  అసలు వారం రోజుల పాటూ పంచదార వాడటం మానేస్తే  ఏం జరుగుతుంది? పూర్తీగా తెలుసుకుంటే.. వారం రోజులు చక్కెర వాడటం మానేస్తే జరిగే మార్పులు.. చక్కెర అలవాటు ఉన్నవారు ఉన్నపళంగా చక్కెర వాడటాన్ని ఆపేస్తే.. మొదటి ఒకటి రెండు రోజులు తీపి తినాలని అనిపిస్తుంది. కానీ క్రమంగా శరీరం చక్కెర లేకుండా ఉండటానికి అలవాటు పడుతుంది. చక్కెర వాడటం మానేస్తే.. మునుపటి కంటే ఎక్కువగా శరీరంలో ఎనర్జీ ఉండటాన్ని గమనించవచ్చు.  దీన్ని అనుభూతి కూడా చెందవచ్చు. చర్మంలో కూడా గణనీయమైన మార్పులు కనిపిస్తాయి. చర్మంలో మెరుపు వస్తుంది.  ముఖ్యంగా చర్మం మీద మొటిమలు,  దద్దుర్లు.. వంటివి క్రమంగా తగ్గడం గమనించవచ్చు. చక్కెర వాడటం ఆపేస్తే జీవక్రియ మెరుగవుతుంది.  గతంలో అంటే.. చక్కెర వాడుతున్నప్పుడు కంటే.. చక్కెర వాడటం మానేసిన తర్వాత జీవక్రియ వేగంగా మారుతుంది. చక్కెర వాడటం మానేస్తే.. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా మారతాయి. అధిక బరువు ఉన్నవారు చక్కెర వాడటం మానేస్తే.., క్రమంగా బరువు తగ్గడం మొదలవుతుంది.  వారం రోజులలో స్పష్టంగా మార్పు కనిపించకపోయినా.. చక్కెర వాడటం మానేస్తే.. క్రమంగా బరువు తగ్గడం సులువు అవుతుంది.                                       *రూపశ్రీ.