కడప అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం దూసుకెడుతోంది.  ఆ పార్టీ అభ్యర్థి మాధవీరెడ్డి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వైసీపీ కంచుకోట బీటలు వారిందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా తెలుగుదేశం జోరు కనిపిస్తోంది. అదే సమయంలో వైసీపీ కడప అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు ప్రజా నిరసన సెగ తగులుతోంది. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు విజయం సాధించిన ఆయన హ్యాట్రిక్ సాధించే అవకాశాలు అంతంత మాత్రమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కడప వైసీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గమే అయినా.. గత ఐదేళ్ల వైసీపీ పాలన పట్ల ప్రజలలో వ్యక్తమౌతున్న ఆగ్రహం, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేగా అంజాద్ పాష పని తీరు పట్ల అసంతృప్తి ఎన్నికల సమయంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయంటున్నారు.  దానికి తోడు అంజాద్ పాషాకు ప్రజా వ్యతిరేకత ఒక్కటే కాకుండా పార్టీలో వర్గపోరు కూడా ఇబ్బంది పెడుతోంది.  ముఖ్యంగా కడప కార్పొరేటర్లు ఈ సారి వైసీపీకి దూరం జరిగిన పరిస్థితులు ఉన్నాయి.  వైఎస్ఆర్ పై అభిమానంతో వైసీపీకి గత ఎన్నికలలో మద్దతుగా నిలిచిన కార్పొరేటర్లలో చాలా మంది ఇతర పార్టీలకు మరీ ముఖ్యంగా తెలుగుదేశంకు వలస వెళ్లిపోయిన పరిస్థితి.  తొలి నుంచీ కాంగ్రెస్ కు పెట్టని కోటగా ఉన్న కడప అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్ మరణం తరువాత వైసీపీకి కంచుకోటగా మారింది.    అయితే ఈ సారి ఆ పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశంం అభ్యర్థిగా బరిలో నిలిచిన రెడ్డప్పగారి మాధవీరెడ్డి నాయకత్వ పటిమ, ప్రచార వ్యూహాలతో కడపలో రాజకీయ ముఖచిత్రం దాదాపుగా మారిపోయిందంటున్నారు. ఆమె ప్రచార శైలి, మాట తీరుతో నియోజకవర్గంలో మంచి గుర్తింపు సాధించారనీ, మరీ ముఖ్యంగా మైనారిటీలు, మహిళల్లో ఆమె పట్ల ఆదరణ ప్రస్ఫుటంగా కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.    మాధవీరెడ్డి ప్రచారశైలి, వ్యక్తం చేస్తున్న ఆత్మవిశ్వాసం పట్ల తెలుగుదేశం హైకమాండ్ కూడా సంతోషంగా ఉంది. మాధవీలత ధైర్యాన్నీ, కడపలో వైసీపీ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్న తీరునూ ప్రశంసిస్తోంది.  
అడవిలో ఉండాల్సిన క్రూరమైన జంతువుల్లో జనావాసంలోకి ఒక్కోసారి అదుపు తప్పి వస్తుంటాయి. ఇలా వచ్చిన ప్రతిసారి స్థానికులు భయాందోళన చెందుతారు. ఒక్కోసారి ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌ విమానశ్రయంలో చిరుత పులి సంచరిస్తూ కలకలం సృష్టిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపల్లి వద్ద ఎయిర్‌పోర్టు ప్రహరీ నుంచి చిరుత దూకినట్లు అధికారులు గుర్తించారు. దాంతో పాటు మరో రెండు పిల్లలు కూడా ఉన్నట్లు తెలుసుకున్నారు.  విమానశ్రయం ప్రహరీ దూకుతుండగా ఫెన్సింగ్‌ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్‌పోర్టు కంట్రోల్‌ రూమ్‌లో అలారం మోగింది. అనంతరం భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాలను పరిశీలించగా చిరుత సంచరిస్తున్నట్లు నిర్ధారించుకున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు జరిగిన విషయాన్ని తెలియజేశారు. అటవీ శాఖ అధికారులు విమానాశ్రయానికి చేరుకుని చిరుతను బంధించేందుకు ప్రయాత్నాలు చేస్తున్నారు. ట్రాప్‌ కెమెరా, బోన్లు ఏర్పాటు చేశారు. స్థానికులు చిరుత సంచార విషయాన్ని తెలుసుకుని భయభ్రాంతులు చెందుతున్నారు.  దాదాపు మూడేళ్ల క్రితం శంషాబాద్‌ ఎయిర్ పోర్టు గోడ దూకి చిరుత వెళ్లిన ఘటన జరిగింది. ఆ సమయంలో సీసీటీవీ కెమెరాల్లో సంచరిస్తున్నట్లు రికార్డయింది. ఎయిర్ పోర్ట్ గోడ దూకి పెద్ద గోల్కొండ, బహదూర్ గూడ వైపు చిరుత వెళ్తున్నట్లుగా వీడియోలో కనిపించింది. దానిని పట్టుకోడానికి అటవీ శాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేసి ప్రయత్నించారు.రెండు గంటల పాటు అధికారులు చిరుత కోసం గాలించారు. అనంతరం అది చిరుత కాదని తేలడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. చివరికి సీసీ కెమెరాల్లో చిక్కింది చిరుత పులి కాదు అడవి పిల్లి అని అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం కూడా చిరుతపులి వ్యవహారం తీవ్ర అలజడి సృష్టిస్తోంది. మొద‌ట దానిని అడవి పిల్లిగా భావించిన సెక్యూరిటీ సిబ్బంది సీసీటీవీ ఫుటేజీని ప‌రిశీలించిన అనంత‌రం దాన్ని చిరుత‌గా నిర్ధారించారు. అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు, అటవీ శాఖ అధికారులు చిరుత కోసం గాలింపు చేపట్టారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలతో పాటు ఎయిర్‌పోర్టు సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాలని ఆర్‌జీఐఏ పోలీసులు సూచించారు. చిరుతను పట్టుకునేందుకు రెండు బోన్లను కూడా ఏర్పాటు చేశారు.  మూడేళ్లక్రితం హైదరాబాద్ శివారులోని ప్రజలను చిరుతపులి భయాందోళనకు గురిచేసింది.  జీహెచ్ఎంసీ, పోలీసులతో సమన్వయం చేసుకొని అటవీశాఖ అధికారులు చిరుతపులిని పట్టుకొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి పట్టుకున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో చిరుత సంచారం సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డు అయినప్పటికీ బోనులో చిక్కకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 
వైసీపీకి కంచుకోట అయిన కడపలో ఆ పార్టీ ఆధిపత్యానికి బీటలు వారుతున్నాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. వాస్తవానికి కడప జిల్లా వైఎస్ కుటుంబానికి కంచుకోట. ఆ జిల్లాలో ఇప్పటి వరకూ ఆ కుటుంబానికి ఎదురన్నదే లేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆ కుటుంబానికి జిల్లాపై అలాంటి సాధికారత లేకుండా పోయింది. అందుకు ప్రధాన కారణం ఇప్పుడా కుటుంబం నిట్టనిలువుగా చీలిపోయి ఆధిపత్యం కోసం పరస్పరం పోటీ పడటమే. ఔను కడప జిల్లాలో ఇప్పుడు వైఎస్ కుటుంబం రెండుగా చీలిపోయి ఆధిపత్యం కోసం పోరాడుతోంది.  గత ఎన్నికల సమయంలో వైసీపీ అధికారంలోకి రావడం కోసం, జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం కుటుంబం మొత్తం ఐక్యంగా నిలబడింది. జిల్లాలో ఫలితాలు అందుకు తగ్గట్టుగానే వచ్చాయి. అయితే ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఐదేళ్ల కిందట జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితులు వైఎస్ కుటుంబీకులే కావడం, ఆ అంశంపైనే కుటుంబం రెండుగా చీలిపోవడంతో జిల్లాలో పరిస్థితి తారుమారైంది.  జగన్ అధకారంలోకి వచ్చిన తరువాత చెల్లెలు షర్మిల అన్నతో విభేదించింది. న్యాయంగా తనకు రావలసిన కుటుంబ ఆస్తులను ఇవ్వకపోవడమే కాకుండా పార్టీలో తన ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించి, చవరకు పార్టీ నుంచే సాగనంపిన జగన్ కు వ్యతిరేకంగా ఆమె గళమెత్తారు. అలాగే వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులను జగన్ వెనకేసుకు వస్తున్నారని ఆరోపిస్తూ, వివేకా కుమార్తె డాక్టర్ సునీత చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించి, ఆమెకు బాసటగా నిలిచారు.  ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా కడప లోక్ సభ స్థానం నుంచి పోటీలో ఉంటే.. వైఎస్ షర్మిల అదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో నిలిచారు. ఇక ఇదే లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అధినేత, సీఎం జగన్ పోటీ చేస్తున్నారు.   తన భర్తకు మద్దతుగా  వైఎస్ భారతి పులివెందులలో ప్రచారం చేస్తున్నారు. కడప లోక్ సభ అభ్యర్థిగా రంగంలో ఉన్న షర్మిల ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. నేరుగా జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో కడప వీధుల్లో వైఎస్ భారతి, వైఎస్ షర్మిల రాజకీయ పోరాటం రాష్ట్ర రాజకీయాల్లోనే హైలైట్ గా నిలవనుంది.  ఇప్పటి  వరకూ అయితే వైఎస్ భారతి వ్యూహాత్మకంగా  షర్మిలపై నేరుగా ఎటువంటి విమర్శలూ చేయకుండా ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే షర్మిల మాత్రం  భారతిపై నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో వైఎస్ భారతి కూడా షర్మిలపై డైరెక్టుగా విమర్శలు సంధించడానికి ఎక్కవ రోజులు తీసుకునే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు. దీంతో తొలిసారిగా వైఎస్ కుటుంబ కోటకు బీటలువారిన సంకేతాలు కనిపిస్తున్నాయి. కడప ఫలితమే నిజమైన వైఎస్ రాజకీయవారసులెవరన్నది తేలుస్తుందని చెబుతున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
ఈ సమ్మర్ సీజన్ లో టాప్ స్టార్ల సినిమాల సందడి లేదు. ఎక్కువగా చిన్న, మీడియం రేంజ్ సినిమాలే విడుదలవుతున్నాయి. ఈవారం ఐదు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. మే 3న 'ఆ ఒక్కటీ అడక్కు', 'ప్రసన్న వదనం', 'శబరి', 'జితేందర్ రెడ్డి', 'బాక్' సినిమాలు విడుదల కానున్నాయి. ఆ ఒక్కటీ అడక్కు (Aa Okkati Adakku): ఇటీవల సీరియస్ సినిమాలు చేస్తున్న అల్లరి నరేష్.. మళ్ళీ తన మార్క్ వినోదాన్ని పంచడానికి 'ఆ ఒక్కటీ అడక్కు' చిత్రంతో వస్తున్నాడు. మల్లి అంకం డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఫరియా అద్బుల్లా హీరోయిన్. ఒకప్పుడు కామెడీ హీరోగా ఎన్నో విజయాలు అందుకున్న నరేష్.. మళ్ళీ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడేమో చూడాలి. ప్రసన్న వదనం (Prasanna Vadanam): విభిన్న సినిమాలతో అలరిస్తూ హీరోగా తనదైన ముద్ర వేస్తున్న సుహాస్.. ఇప్పుడు 'ప్రసన్న వదనం' అనే సినిమాతో రాబోతున్నాడు. ఇందులో ఫేస్ బ్లైండ్ నెస్ తో బాధపడే యువకుడి పాత్రలో సుహాస్ కనిపించనున్నాడు. ఈ థ్రిల్లర్ సినిమాకి అర్జున్ దర్శకుడు. శబరి (Sabari): వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో అనిల్ దర్శకత్వంలో రూపొందిన సినిమా శబరి. ఒక బిడ్డ కోసం తల్లి పడే తపనను సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందినట్లు చిత్ర బృందం తెలిపింది. జితేందర్ రెడ్డి (Jithender Reddy): ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో ఆకట్టుకున్న డైరెక్టర్ విరించి వర్మ రూపొందించిన పొలిటికల్ మూవీ 'జితేందర్ రెడ్డి'. 1980 లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. బాక్ (Baak): సూపర్ హిట్ హారర్ కామెడీ ఫ్రాంచైజ్ 'అరణ్మనై' నుంచి వస్తున్న నాలుగో చిత్రమిది. సుందర్. సి ప్రధాన పాత్ర పోషిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ వారం ఓటీటీలోనూ పలు సినిమాలు సందడి చేయనున్నాయి. నెట్ ఫ్లిక్స్: డియర్ మూవీ (తమిళ్/తెలుగు) - ఏప్రిల్ 28  హీరామండి సిరీస్ - మే 1 షైతాన్ మూవీ (హిందీ) - మే 3 హాట్ స్టార్: ది వీల్‌ వెబ్‌సిరీస్‌ - ఏప్రిల్‌ 30  మంజుమ్మల్ బాయ్స్ మూవీ - మే 5  అమెజాన్ ప్రైమ్: ది ఐడియా ఆఫ్‌ యూ మూవీ (హాలీవుడ్‌) - మే 2  
పవర్ ఫుల్ యాక్టింగ్ తో సినీ సీమలో తన కంటు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఆమె ఒక సినిమా ఒప్పుకుందంటే చాలు. ఖచ్చితంగా అది  విషయం ఉన్న సినిమా అనే భావన ప్రేక్షకుల్లో చాలా బలంగా నాటుకుపోయింది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో  తన కాబోయే  భర్త పై చేసిన వ్యాఖ్యలు  వైరల్ గా మారాయి. వరలక్ష్మి కి ఇటీవలే ముంబై కి చెందిన నికోలయ్ సచ్ దేవ్ తో ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇరు వైపుల కుటుంబాలకి చెందిన సన్నిహితులు మాత్రమే ఆ వేడుకకి హాజరయ్యారు. ఇటీవల సోషల్ మీడియాలో వరలక్ష్మి, నికోలయ్ మీద  ట్రోల్ల్స్ వస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే  నికోలయ్ కి ఇది రెండవ వివాహం. మొదట భార్యకి ఒక కూతురు కూడా ఉంది. ఈ విషయం పైనే ట్రోల్ల్స్ చేస్తున్నారు. వీటికి వరలక్ష్మి తన దైన స్టైల్లో జవాబు ఇచ్చింది. మా రిలేషన్ గురించి  ఎవరు ఏమని అనుకున్నా పర్లేదు. మా నాన్న కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఆయన సంతోషంగా ఉన్న వరకు అందులో ఎలాంటి తప్పు లేదు. నికోలయ్ మాజీ భార్యతో నాకు పరిచయం ఉంది. ఆమె వ్యక్తిత్వం చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.14  సంవత్సరాల క్రితం  నికోలయ్ తో  పరిచయం అయ్యింది.ఆ తర్వాత స్నేహితులమయ్యాం. ఆ స్నేహం ఇటీవల ప్రేమగా మారింది.  నా కెరీర్ కి సంబంధించి సలహాలు కూడా ఇస్తుంటాడు అని చెప్పుకొచ్చింది ఆమె లేటెస్ట్ గా శబరి అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.  సైకిలాజికల్ థ్రిల్లర్ గా  తెరకెక్కగా  మే 3 న విడుదల కానుంది. ఇక నికోలయ్ ముంబై లో ఆర్ట్ గ్యాలరీలు నిర్వహిస్తుంటాడు  
అదితి రావు హైదరి.. 2006 లో వచ్చిన  మలయాళ చిత్రం ప్రజాపతితో సినీ రంగ ప్రవేశం చేసింది. ప్రెజంట్ తన ఖాతాలో   తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి  30 చిత్రాలకి పైనే ఉన్నాయి. ముఖ్యంగా హిందీలో రాక్ స్టార్, పద్మావత్,మర్డర్ 3 లాంటి  భారీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపుని పొందింది. రీసెంట్ గా భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ గొప్ప   దర్శకుడు  సంజయ్ లీల భన్సాలీ డ్రీం ప్రాజక్ట్ హీరామండి ది డైమండ్ బజార్ లో నటిస్తుంది. ఈ క్రమంలో ఆమె చెప్తున్న మాటలు ఆసక్తి గా మారాయి అదితి హీరామండి లో ఒక వేశ్య పాత్రలో  కనపడనుంది. స్వేచ్ఛ కోసం అందాన్ని సైతం ఆయుధంగా ఉపయోగించుకునే కళ ఈ బిబ్బోజాన్ కి మాత్రమే  తెలుసు. ఈ డైలాగ్ తో   మేకర్స్  తన పాత్రని  పరిచయం చేసారు. దీంతో ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తన  క్యారక్టర్ కి సంబంధించిన పలు విషయాలని  వెల్లడించింది. బిబోజాన్ స్వచ్ఛమైన మనసు ఉన్న వేశ్య. ఎక్కడ పుట్టిందో ఎలాంటి పరిస్థితుల్లో వేశ్యగా మారిందో  తెలియని అయోమయ పరిస్థితి. ఆమెది. కానీ తన లక్ష్యాన్ని చేరుకోడానికి మాత్రం ఎంత దూరమైనా వెళ్తుంది.   ఇక  దర్శకుడు బన్సాలి నా అభిమాన దర్శకుడు. ఆయన సినిమాల్లోని స్త్రీలు ఎంత ప్రేమని చూపిస్తారో అంతే  స్థాయిలో ప్రతీకారం తీర్చుకోగలరు. నిజ జీవితంలో కూడా అలాగే ఉంటానని  చెప్పుకొచ్చింది. అదితి తో పాటు మనీషా కోయిరాల, సోనాక్షి సిన్హా, సంజిదా షేక్ ,రిచా చద్దా లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హీరామండి లో  ఈ ఐదుగురు కూడా  వేశ్యలుగా కనిపించనున్నారు. మే 1 న ఓటిటి వేదికగా నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ఇక అదితి కి ఇటీవలే ప్రముఖ హీరో సిద్దార్ధ్ తో ఎంగేజ్ మెంట్ జరిగింది. త్వరలోనే  వివాహం జరగనుంది  
నాగ చైతన్య(Naga Chaitanya) గత చిత్రాలు 'థాంక్యూ', 'కస్టడీ' నిరాశపరిచినప్పటికీ.. ఆయన తదుపరి చిత్రం 'తండేల్'పై మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్లింప్స్ విడుదల తరువాత అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే షూటింగ్ దశలోనే కళ్ళు చెదిరే బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి. 'తండేల్'(Thandel) మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ రికార్డు ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ.40 కోట్లకు 'తండేల్' రైట్స్ ని దక్కించుకున్నట్లు సమాచారం. ఇది నాగ చైతన్య కెరీర్ లోనే హైయెస్ట్. చైతన్య లాంటి యంగ్ స్టార్ సినిమా ఓటీటీ రైట్స్ రూ.40 కోట్లకు అమ్ముడవ్వడం నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి. 'ప్రేమమ్', 'సవ్యసాచి' తరువాత నాగ చైతన్య, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రమిది. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
The upcoming comedy-horror film Aranmanai 4, the fourth film from the highly successful horror comedy series ‘Aranmanai’ starring Sundar C, starring Sundar C, Tamannaah Bhatia, and Raashi Khanna, is gearing up for its theatrical release on May 3rd. Titled in Telugu as BAAK, the film is directed by Sundar C and produced by Khushbu Sundar and ACS Arun Kumar under Avni Cinemax P Ltd. Today, the makers unveiled the theatrical trailer of the movie which entertains as well as scares. The makers arranged grand pre release event at Hyderabad. At the event Raashi Khanna revealed how she got the role in Aranmanai 4. When Sundar C garu called me and said "Iam Making Aranamani 4 and will you be part of it". I said "I don't even want to listen the script. It was such a great experience working with talented director and actors like Kovai Sarala, Vennela Kishore and others. Tamannaah reveals that director Sundar C genuinely celebrates women's power. She also revealed that Ayyayoo is just a promotional song in BAAK and there is no connection for the film. It might not be in the film Aranmanai 4 Asian Suresh Entertainment LLP will be releasing the movie in Telugu states. The movie will hit the screens on May 3rd.
Priyadarshi is currently doing two major projects as main lead. Recently the actor signed another project under prestigious Sree Venkateswara Cinemas LLP (SVCLLP). Rana Daggubati’s Spirit Media presents the movie directed by debutant Navneeth Sriram. This marks the maiden production venture for Jhanvi Narang who was awarded the Prestigious TIMES POWER WOMEN 2024 Award. Priyadarshi who attained big success with Balagam scored a blockbuster this year with Om Bheem Bush. While the Save The Tigers franchise is one of the biggest hit Telugu originals of all time, Priyadarshi has a wonderful line-up of films. This new movie is a quirky romantic tale with a fresh concept, where Priyadarshi will be seen in a different yet hilarious role. The movie gets a catchy tagline “Thrill-u Praptirasthu”, which indicates the kind of experience it is going to give in cinemas. The script work of the movie is complete and pre-production will kick start soon. The movie is set to go on floors in January, 2025. The film’s title will be revealed soon along with cast and crew details.
టాలీవుడ్ లో తన తోటి స్టార్లతో మంచి అనుబంధాన్ని కలిగి ఉండే హీరోలలో జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) ముందు వరుసలో ఉంటాడు. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వారితో ఆయన ఎంతటి అనుబంధాన్ని కలిగి ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో సైతం ఎన్టీఆర్ అందరివాడు అనిపించుకుంటున్నాడు. హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న 'వార్ 2'(War 2)తో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. అలా షూట్ స్టార్ట్ అయిందో లేదో అప్పుడే బాలీవుడ్ లో ఎన్టీఆర్ పేరు మారుమోగిపోతోంది. తాజాగా ముంబైలో జరిగిన ఓ పార్టీలో బాలీవుడ్ స్టార్స్ తో కలిసి ఎన్టీఆర్ సందడి చేశాడు. తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి తారక్ పాల్గొన్న ఈ పార్టీకి.. హృతిక్ రోషన్- సబా ఆజాద్, రణబీర్ కపూర్- అలియా భట్, కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీ తదితరులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిలో ఎన్టీఆర్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హృతిక్ తో కలిసి 'వార్ 2' షూట్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్.. ఇప్పటికే ఆయనకు బాగా దగ్గరై ఉంటాడు అనడంలో సందేహం లేదు. అలాగే 'ఆర్ఆర్ఆర్'లో అలియా భట్ తో కలిసి నటించాడు ఎన్టీఆర్. ఇందులో వీరు జంటగా నటించనప్పటికీ.. ప్రమోషన్స్ సమయంలో  తారక్-అలియా మధ్య ఫ్రెండ్ షిప్ చూసి అందరూ ఫిదా అయ్యారు. అంతేకాదు తన భర్త రణబీర్ తో కలిసి అలియా నటించిన 'బ్రహ్మాస్త్ర' మూవీ తెలుగు ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. ఆ సినిమాకి కరణ్ జోహార్ నిర్మాత కావడం విశేషం. అప్పటి నుంచి రణబీర్, కరణ్ తోనూ తారక్ కి మంచి అనుబంధం ఏర్పడింది. ముఖ్యంగా కరణ్ అయితే.. ఎన్టీఆర్ యాక్టింగ్ టాలెంట్ గురించి పబ్లిక్ గా పొగిడేస్తుంటాడు. ఇక 'బ్రహ్మాస్త్ర' దర్శకుడు అయాన్ ముఖర్జీ నే ఇప్పుడు 'వార్ 2'కి దర్శకత్వం వహిస్తుండటం మరో విశేషం. ఇలా బాలీవుడ్ స్టార్స్ కి, మేకర్స్ కి దగ్గరవుతూ తారక్ అందరివాడు అనిపించుకుంటున్నాడు. రాబోయే రోజుల్లో ఆయన బాలీవుడ్ లో మరిన్ని సినిమాలు చేసినా ఆశ్చర్యం లేదు.
Samantha is celebrating her birthday today. Fans, celebrities, and the general audience shower her with birthday wishes. On this special occasion, the pan-Indian star Samantha Ruth Prabhu announces her maiden feature film venture under her own banner, Tralala Moving Pictures. Titled "Maa Inti Bangaram," the film marks Samantha's debut as a producer. She will also star as the lead protagonist, promising to bring her unique flair and intensity to the role. The film is anticipated to be released in multiple languages, catering to her diverse fan base across the country. Accompanying the announcement, the actress shared a striking poster and motion poster on her social media platforms. In the poster, Samantha looks stunning, holding a gun with kitchen elements visible in the background. Her Mangalsutra and the golden outline are prominently highlighted, capturing everyone's attention. While details about the storyline remain under wraps, the visual elements suggest "Bangaram" will be an earthy, gritty tale. The film is expected to go on floor soon and is slated for a theatrical release in 2025.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
వేసవికాలం వచ్చిందంటే వామ్మో అంటాము. మండిపోయే ఎండలు, మగ్గబెట్టే ఉక్కపోత, వీటికి తోడు కరెంట్ కోతలు. ఉదయం, సాయంత్రం తప్ప ఏ మధ్యాహ్నపు ఎండలోనో బయటకు వెళ్లాల్సిన అవసరం వచ్చిందంటే గుండె గుభేలుమంటుంది. అందుకే ఎండ అంటే చెప్పలేనంత మంట అందరికీ. కానీ సమయం గడుస్తూ ఉంటే ఈ కాలాలు అదేనండి వర్షాకాలం, చలికాలం వచ్చినట్టు ఎండాకాలం కూడా రాక తప్పదు. అది తన ప్రతాపం చూపించక తప్పదు. అయితే ఈ వేసవిని చూసి భయపడటానికి ఎన్ని కారణాలు ఉన్నాయో, దీన్ని ఎంజాయ్ చేయడానికి అన్నే మార్గాలు ఉన్నాయి. ఓసారి తెలుసుకుంటే సమ్మర్ మీద హమ్మర్ తో ఓ మోస్తరు సౌండ్ చేయచ్చు. ఒకప్పుడు!! సంవత్సరకాలం అంతా పిల్లలు ఎదురుచూసేరోజులు ఇవే అంటే ఆశ్చర్యమేస్తుంది. నిజంగానే వేసవి కోసం పిల్లలు అర్రులు చాచేవాళ్ళు. ఒక పూట బడి ముగియగానే ఎండను కూడా లెక్కచేయకుండా బావుల వెంట, చేల వెంట వెల్తూ ఎన్నో మధురస్మృతులను మూటగట్టుకునేవాళ్ళు. ఓ ముప్పై సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళను పిలిచి బాల్యం గురించి చెప్పమంటే కళ్ళు మెరవడం, చిరునవ్వు బయటకు రావడం ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి.  అందుకే అన్ని కాలలను ఒకేలా పుస్తకాల మధ్య కాకుండా కాసింత ప్రత్యేకంగా గడిపేలా మీ పిల్లలకు ఏర్పాటు చేయండి. అది వాళ్లకు ఆసక్తికరమై, వాళ్ళ సంతోషానికి కారణమయ్యేది అయ్యుండాలి సుమా!! ప్రకృతి ఆతిథ్యం!! నిజంగా నిజమే. వేసవిలో ప్రకృతి ఎంత గొప్ప ఆతిథ్యం ఇస్తుందని. అవన్నీ చాలా వరకు ఇప్పటి తరానికి తెలియకుండా ఉన్నాయి. వాళ్లకు ఓసారి పరిచయం చేసి చూడండి. నాచురల్ లైఫ్ మీద లవ్ లో పడతారు వాళ్ళు. పుల్లని విందు!! బలే బలే పసందు ఈ పుల్లని విందు. అదే అదే ఫలాల రాజు మామిడి గారు ఎంతో ఠీవిగా చెట్లలో పెరిగి అందరినీ పలకరించడానికి ఇంటింటికి వస్తాడు. అందరి నోర్లు జలపాతాలు చేస్తాడు.  చెరకు చరిష్మా!! చిన్నప్పటి దంతాల రహస్యం. నోటితోనే చెరకు పొట్టు తీసి, కొరికి, కసకస నమిలి, రసాన్ని జుర్రుకుంటూ పిప్పిని పడేస్తే ఆహా ఉంటుంది ఆ నాలుగు అదృష్టం ఎంతో అనిపిస్తుంది. ఇప్పట్లో అంత సీన్లు లేకపోయినా ఎంచక్కా రోడ్ సైడ్ దొరికే చెరకు రసం తాగేసి హాయి హాయిగా వెళ్లిపోవచ్చు.  ఇవి మచ్చుకు రెండు మాత్రమే. ఇంకా చింతచిగురు వేరే లెవెల్. తాటి ముంజలు మరొక ఎత్తు, చల్ల చల్లటి మజ్జిగ, శరీర తాపాన్ని తగ్గించే పుదీనా శరబత్ ఇవన్నీ హైలైట్.  అయితే మరొక మ్యాజిక్ కూడా ఉంది. అదే కేవలం రాయలసీమ ప్రాంతంలో లభ్యమయ్యే సుగంధి సిరప్. కేవలం కడప జిల్లాలో అడవులలో మాత్రమే పెరిగే సుగంధ మొక్కల వేర్లను ఉడికించి పంచదార కలిపి సిరప్ చేసి అమ్ముతుంటారు. సువాసన అద్భుతంగా ఉంటుంది. చల్లని నీళ్లు, లేదా షోడాతో ఈ సిరప్ కలిపి తీసుకుంటే వేసవి కాలం వెంట తీసుకొచ్చే వడదెబ్బ వంద కిలోమీటర్లు పరిగెత్తి పరిగెత్తి పారిపోతుంది. శరీర వేడిని తక్షణమే తగ్గిస్తుంది.  వేసవి భయం అసలు వద్దు!! ఎవరు ఎన్ని చెప్పుకున్నా బయటకు వెళ్ళేవాళ్లకు అదొక భయం. సర్రుమని కాలిపోతున్న రోడ్లన్నీ నరకంలో యమధర్మరాజు ఏర్పాటు చేసినట్టు అనుభూతి కలుగుతుంది. అందుకే సులువైన, మరియు అందరూ ఆచరించగల జాగ్రత్తలు. బయటకు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. మరి నీళ్లు అయిపోతే?? ఏముంది ఏకంగా బాటల్  కొనే పని తప్పుతుంది ఎక్కడో ఒక చోట అయిదు రూపాయల్లో బాటల్ నింపుకోవచ్చు. లేదు కాదు అంటే 20 నుండి 30 పెట్టి వాటర్ బాటిల్ కొనేబదులు ఎంచక్కా ఫ్రూట్ జ్యూస్, లేదా నిమ్మ షోడా వంటివి తాగడం హాయి. వేసవి తాపాన్ని తగ్గిస్తాయి ఇవి. ఇవి కాకుండా మరొక సలహా ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కీరా దోస, పుచ్చకాయ వంటి నీరు అధికంగా ఉన్నవి తినడం లేదా జ్యూస్ తాగడం మంచిది. ఉప్పు, కారం, మసాలాలు వంటివి తగ్గించుకోవాలి ఈ కాలంలో. శరీర ఉష్ణోగ్రత మీద అవి ప్రభావం చూపిస్తాయి.  వెంట గొడుగు ఉంచుకోవడం మర్చిపోకండి. లేదంటే టోపి, లేదా స్పార్క్ ఇలా ఎదో ఒకటి నెత్తిని కప్పి ఉంచేలా జాగ్రత్త పడాలి. వీలైనంత వరకు ఉదయం మరియు సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు వెళ్లేలా చూసుకోవాలి. మధ్యలో సమయం అంతా ఇంటి పట్టున లేదా ఉద్యోగాలు చేసే ప్రాంతాలలో ఉండటం మంచిది. ఇలా చెప్పుకుంటూ పోతే వేసవి కోసం బోలెడు మార్గాలు. అయితే మనం ఎంత డాబు చెప్పుకున్నా ఈ ఎండల కొరడా దెబ్బకు ఒళ్ళు చురుక్కుమనడం సాధారణం. అందుకే దాని నుండి జాగ్రత్త మరి. జాగ్రత్తగా షేక్ హాండ్ ఇచ్చి కూల్ గా డీల్ చేసి పంపిద్దాం.                                     ◆వెంకటేష్ పువ్వాడ.
ఇంట్రోవర్ట్.. ఎవ్వరితోనూ ఎక్కువ కలవరు. ఎవరైనా పలకరించినా, మాట్లాడినా ఎప్పుడెప్పుడు అక్కడి నుండి పారిపోదామా అని ఎదురు చూస్తుంటారు. ఎప్పుడూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు.  ఒంటరిగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతారు. ఈ కారణంగానే ఇంట్రోవర్ట్ అనే మాట బయటకు తెలిస్తే అదేదో వాళ్లకు ఏదో జబ్బు ఉందన్నట్టు ట్రీట్ చేస్తూ ఉంటుంది సమాజం. అయితే ఇంట్రోవర్ట్ లను తేలిగ్గా తీసిపడేయకూడదని, ఇంట్రోవర్ట్ లు గా ఉండి ప్రపంచాన్ని తమ ప్రతిభ ద్వారా, విజయాల ద్వారా ఆకర్షించిన వారి గురించి తెలిస్తే వాళ్లను తక్కువ అంచనా అస్సలు వేయకూడదని అనిపిస్తుంది. ఇంట్రోవర్ట్ ల గురించి.. మనిషన్నాక సందర్భాన్ని బట్టి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అయితే అందరూ మాట్లాడటం అస్సలు అవసరం లేదు. కొంతమంది మౌనంగా ఉండి తమ ఎనర్జీ లెవెల్‌ని మెయింటైన్ చేసి దానిని తమ శక్తిగా మార్చుకోవడానికి ఇష్టపడతారు. ఇది ఏదో మాటవరుసకు చెబుతున్నది కాదు. సాక్షాత్తూ మైయర్స్ బ్రిగ్స్ టైప్ ఇండికేటర్ పరిశోధన ఇలా చెబుతోంది. గ్లోబల్ శాంపిల్‌పై అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని 56.8% మంది వ్యక్తులు అంతర్ముఖులుగా ఉన్నారు.  అంటే తమతో తాము ఉండటానికి  లేదా మౌనంగా ఉండటానికి వీరు ఇష్టపడతారు. బహిర్ముఖ వ్యక్తుల కంటే  అంతర్ముఖులే ఎక్కువ విజయాలు సాధిస్తారని, ప్రపంచ రూపురేఖలను మార్చిన ఎంతో మంది ప్రసిద్ద వ్యక్తులు అంతర్ముఖులే అని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. తక్కువ మాట్లాడటం.. సమయానికి మాట్లాడటం.. కొందరు వ్యక్తులు అంతర్ముఖులతో వ్యవహరించడం కొంచెం కష్టమని అంటుంటారు. ఎందుకంటే అంతర్ముఖులు తమ భావాలను ఎవరికీ చెప్పరు. కానీ తక్కువ మాట్లాడటం అంటే ఏదో దాచడం అని కాదు. పరిశోధన ప్రకారం అంతర్ముఖులు ఆలోచనాత్మకంగా మాట్లాడతారు. వారి  మాటలు చాలా విస్తృతంగా సరైన కారణాలతో కూడుకుని ఉంటాయి. వీరు ఎవరికీ త్వరగా స్పందించరు. ఎమోషనల్ అటాచ్మెంట్ తక్కువగా ఉంటుంది.  అందుకే  ఇతర వ్యక్తుల కంటే వీళ్లు   సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వీరు వారికి నచ్చింది మాత్రమే మాట్లాడుతారు. ఒంటరితనమే బలం.. మానసిక  రోగుల వైద్యుల అభిప్రాయం ప్రకారం అంతర్ముఖ వ్యక్తులు బహిర్ముఖుల కంటే బలంగా , శక్తివంతంగా ఉంటారు. ఎందుకంటే వారు ప్రతి పరిస్థితిని ప్రశాంతంగా, తెలివిగా ఆలోచిస్తారు. దానికి తగినట్టే నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రశాంత స్వభావం కారణంగా ఇంట్రోవర్ట్ లు  ఎప్పుడూ కోపం తెచ్చుకోరు. లేదా దూషించే మాటలు మాట్లాడరు.  సాధారణంగా వీరు ఇతరులకు చాలా పొగరు వ్యక్తులుగా అనిపిస్తారు. కానీ వీరు అర్థమయ్యే కొద్దీ.. వీరి మీద గౌరవం పెరుగుతుంది. మానసికంగా దృఢంగా.. అంతర్ముఖులు తమ భావోద్వేగాలను బయటకు  వ్యక్తం చేయకపోవచ్చు. కానీ వారు మానసికంగా బలంగా ఉంటారు. వీరు సులభంగా ఎవరికీ  భయపడరు. తక్కువ మాట్లాడటం వల్ల  వీరిని చాలామంది పిరికివాళ్లు అని అంటూ ఉంటారు. కానీ అంతర్ముఖుల శక్తి అసాధ్యం. వారు మానసికంగా దృఢంగా ఉంటారు. జ్ఞాపకశక్తి ఎక్కువ.. 2007లో రష్యాలో అంతర్ముఖులపై నిర్వహించిన పరిశోధనలో   వీరు ఏవైనా సంఘటనలు, విషయాలను చాలా కాలంపాటూ గుర్తుంచుకుంటారని తెలిసింది. ఎందుకంటే ఇంట్రోవర్ట్ వ్యక్తులకు ఫ్రంటల్ లోబ్‌లో ఎక్కువ రక్త ప్రసరణ ఉంటుంది. ఫ్రంటల్ లోబ్ అనేది మెదడులోని జ్ఞాపకాలను నిల్వ చేసే భాగం. ఇది సమస్యలకు పరిష్కాలు ఆలోచించడం, సరైన ప్రణాళికలు రచించడం వంటి విషయాలలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల అంతర్ముఖులు బాగా ప్రణాళిక వేయడంలో ,సమస్యలను పరిష్కరించడంలో కూడా తెలివిగా ఉంటారు.  లాజిక్‌పై దృష్టి పెట్టడంతో పాటు, వీరు  సృజనాత్మకంగా , శక్తివంతంగా ఉంటారు.                                          *నిశ్శబ్ద.
ప్రేమ, స్నేహం రెండు కవలపిల్లల లాంటివి. చూడ్డానికి రెండు ఒకేలా ఉంటాయి. కానీ చాలా సున్నితమైన వ్యత్యాసాలు దాగుంటాయి. స్నేహం ప్రేమ లానూ, ప్రేమ స్నేహం లానూ అనిపించి చాలా మందిని గందరగోళ పెడుతుంది. మరీ ముఖ్యంగా నేటి కాలంలో జెండర్ తో సంబంధం లేకుండా అమ్మాయిలు, అబ్బాయిలు ఫ్రెండ్షిప్ చేస్తుంటారు. అమ్మాయిలు స్నేహం అనుకున్నా. దాన్ని ప్రేమగా భావించే అబ్బాయిలు, అబ్బాయిలు స్నేహం అనుకుంటే దాన్ని ప్రేమగా భ్రమ పడే అమ్మాయిలు బోలెడుమంది ఉన్నారు. నిజానికి ఈ వ్యత్యాసం తెలుసుకోలేక చాలామంది స్నేహాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తమది స్నేహమా?? లేక ప్రేమా?? అనే విషయం గురించి అమ్మాయిలలో ఉండే సందేహాలు క్లియర్ చేసుకుంటే.. అసూయ చూపిస్తున్నారా? ఒక వ్యక్తికి చాలా మంది స్నేహితులు ఉండవచ్చు, కానీ మీరు మీ స్నేహితుడికి దగ్గరగా ఉన్న వారిని చూసి మీకు అసూయగా అనిపించినప్పుడు, లేదా మీరు ఇతరులతో చాలా దగ్గరగా ఉన్నప్పుడు మీ స్నేహితుడు అసూయగా ఫీలవుతుంటే మీ మధ్య స్నేహం ప్రేమగా మారుతుందని అర్థం. ఉదాహరణకు  ఇతరులకు దగ్గర ఉండటం, వారితో సినిమాలు, పార్టీలు, మొదలైన వాటికి ఆసక్తి చూపిస్తూ వెళ్ళడం చేస్తే అవన్నీ చూసి స్నేహితుడు లేదా స్నేహితురాలు చిటపటలాడుతున్నా, కోప్పడుతున్నా, అలుగుతున్నా  వారితో స్నేహం కంటే ఎక్కువ అనుభూతి చెందుతున్నారని అర్థం. ఏకాంతం కోరుకుంటున్నారా? సాధారణంగా స్నేహితులు అంటే ఒక బ్యాచ్ గా ఉంటారు. వీళ్లలో కొందరు అమ్మయిలు, మరికొందరు అబ్బాయిలు కూడా ఉంటారు. అయితే ఇంతమంది స్నేహితులలో కేవలం ఒక్కరితోనే ఏకాంతంగా ఉండాలని అనిపిస్తుంటే అది స్నేహం కంటే ఎక్కువ భావనను సూచిస్తుంది.  పదే పదే గుర్తుచేసుకోవడం.. చాలా వరకు స్నేహితులతో సమయం గడిపిన తరువాత ఇంటి పనుల్లోనూ ఇతర కార్యకలాపాలలోను మునిగిపోతుంటారు. కానీ అలా కాకుండా కేవలం ఒకే ఒక్కరి గురించి పదే పదే ఆలోచిస్తున్నా, వారితో మాట్లాడాలని అనిపిస్తున్నా వారు మిగిలిన వారికంటే చాలా స్పెషల్ అని అర్థం.  ప్రాధాన్యత.. ఎంతమందిలో ఎప్పుడు ఏ విషయం గురించి మాట్లాడుతున్న తమ స్నేహితుడు లేదా స్నేహితురాలి గురించి ప్రస్తావిస్తూ, తమ మధ్య ఉండే సాన్నిత్యన్ని బయటకు గర్వంగా చెప్పుకుంటున్నా, ఇతరులకంటే వారిని ఎక్కువగా పరిచయం చేస్తున్నా, వారికి అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, వారంటే ప్రత్యేక భావన అని అర్థం. ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిల మధ్య జెండర్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఈ కారణంగా చాలామంది తొందరగా ఫ్రెండ్స్ అయిపోతారు. అయితే ఈ ఆకర్షణ కారణంగా ఏర్పడే స్నేహం, ఆకర్షణ ఉన్నంత వరకు ఉంటుంది. ఈలోపు నిజంగా స్నేహం వెల్లివిరిస్తే.. అది ప్రత్యేక సాన్నిత్యం కోరుకుండా..  కష్టసుఖాలు చెప్పుకోవడానికి, కష్టసమయంలో సాయం చేసుకోవడానికి తోడుగా ఉండేది అయితే స్నేహమే.. ప్రేమకు, స్నేహానికి  మధ్య సన్నని గీతను గుర్తెరగాలి.                                   *నిశ్శబ్ద.
మామిడి పండ్ల సీజన్ మొదలైంది. మార్కెట్‌లో వివిధ రకాల మామిడి పండ్లను విక్రయిస్తుంటారు. మామిడి  పండు తినడమంటే అందరికీ ఇష్టమే.. అయితే కొందరు మాత్రం దీన్ని మినహాయించాలని చెబుతారు. వారే మధుమేహం ఉన్నవారు. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం మధుమేహం ఉన్నవారు కూడా మామిడి పండ్లను తప్పకుండా తినచ్చని, కానీ అది తగినంత మోతాదులో చాలా కొద్దిగా మాత్రమే తినాలని చెబుతారు. అంతేనా మరికొందరు బాగా పండిన మామిడి పండ్లను మధుమేహం ఉన్నవారు అస్సలు తినకూడదని కూడా అంటున్నారు. అసలు మధుమేహం ఉన్నవారు మామిడి పండ్లు తినడంలో తీసుకోవలసిన జాగ్రత్తలేంటి? తెలియకుండానే మామిడిపండ్లు తినడంలో వారు చేస్తున్న తప్పులేంటి? తెలుసుకుంటే.. మామిడి పండ్లను తింటే డయాబెటిక్ పేషెంట్ల పరిస్థితి మరింత దిగజారుతుందనేది పెద్ద అపోహ అని డాక్టర్లు చెబుతున్నారు. మామిడి పండ్లు ఆరోగ్యానికి మంచివి, కానీ తీపి కారణంగా మధుమేహ రోగులు తరచుగా వాటిని తినకుండా ఉంటారు.లేదా వాటిని తప్పుడు పరిమాణంలో లేదా తప్పుడు పద్ధతిలో తినడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. మనం ఏది తిన్నా అది షుగర్ స్థాయిని ప్రభావితం చేస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది.  ఇది ఏ ఆహారం తినడం ద్వారా చక్కెర స్థాయి ఎంత పెరుగుతుందో చెప్పడంలో సహాయపడుతుంది. డయాబెటిక్ రోగులందరూ క్రమం తప్పకుండా పండ్లు తినాలి. అయితే మామిడి గ్లైసెమిక్ ఇండెక్స్ స్కోర్ ఎక్కువగా ఉంది (51-56). అందుకే తినే పరిమాణం,  విధానంపై మధుమేహ రోగులు శ్రద్ధ వహించాలి. డయాబెటిక్ పేషెంట్లు మామిడిపండ్లు తినడం మానేయాల్సిన అవసరం లేదు.  ప్రతిరోజూ 100 గ్రాముల చిన్న మామిడిపండును సమతుల్య పరిమాణంలో తీసుకోవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లను తినే విధానంపై శ్రద్ధ వహించాలి.  వాటిని తీసుకునేటప్పుడు జాగ్రత్త పడాలి. ఒకేసారి 100 గ్రాముల కంటే ఎక్కువ మామిడి తినకూడదు. మామిడికాయ గుజ్జును మాత్రమే తినాలి.  మామిడి రసం లేదా షేక్ రూపంలో తీసుకోకూడదు. పండ్లు తిన్న రెండు గంటల తర్వాత చక్కెర స్థాయిని చెక్ చేసుకోవాలి. పండ్లు తిన్న తర్వాత చక్కెర స్థాయి పెరిగితే పరిమాణాన్ని తగ్గించాలి.  వైద్యుడిని సంప్రదించాలి. భోజనం తర్వాత లేదా రాత్రి మామిడి తినకూడదు. ఎల్లప్పుడూ మామిడికాయను మధ్యాహ్నం సలాడ్‌గా లేదా ఉదయం అల్పాహారంగా తినాలి.                                          *రూపశ్రీ.  
అందరినీ వేదించే సమస్య ముఖ్యంగా యువతను వేదిస్తున్న సమస్య ఊబ కాయం అంటే ఒబెసిటీ. దీనికోసం తిరగని చోటంటూ ఉండదు .  వెళ్ళని డాక్టర్ అంటూ లేదు. సక్షన్లు, నాన్ లైపోసక్షన్లు. ప్రత్యేకంగా దీనికోసమే ఉన్న ఆసుపత్రులు. ప్రత్యేక సర్జన్లు. ఇలా ఊబకాయం అనేక ఆరోగ్య సమస్యలకు కారణం కావడం  గమనించ వచ్చు.చేతి వాడిని ఒదిలి కాలివాడిని పట్టుకున్నట్లు మనం పాటించాల్సిన కనీస  నియమావళిని అమలు చేయకుండా స్వీయ నియంత్రణ  లేకుండా ఊబ కాయాన్ని తగ్గించలేమని అంటున్నారు వైద్యులు.మీ శరీరం బరువు తగ్గాలంటే రాత్రి వేళ ఈ పది సూత్రాలు అమలు చేయండి.మీరు మీ శరీర బరువు తగ్గాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు.ప్రతిరోజూ వర్క్ అవుట్ తప్పని సరిగా  చేస్తూ ఉంటారు. కొన్ని మార్పులు చేసి ప్రయత్నం చేయండి. దీని వల్ల మీరు నాజూకుగా స్లిమ్ముగా కనపడడానికి దోహదం చేస్తాయి. రాత్రి సమయమే సరైన సమయం... మన శరీర బరువు తగ్గించే ప్రయత్నం చేస్తు ఆరోగ్యకర మైన ఆహారం తీసుకుంటూనే వర్క్ అవుట్ చేస్తూ ప్రతిరోజూ ప్రత్యేకమైన  విషయాలు అనుసరించాలి.అందులోను కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తూ రాత్రివేళ ప్రయత్నించండి మీరు స్లిమ్ గా మారచ్చు .సాయంత్రం వేళ మిమ్మల్ని మీరు బిజీగా ఉంచండి. సాయంత్రం వేళ మిమ్మల్నిమీరు ఒక వ్యాపకం వైపుకు మళ్లించండి. కొన్ని సందర్భాలలో ప్రజలు చాలా ఎక్కువగా ఆహారం తీసుకుంటారు. అలా చెయడం బోరింగ్ మీరు ఫిట్ గా ఉండాలంటే నిద్ర పోయే ముందు కొంత పని చేయాల్సి ఉంటుంది. కొంచం సేపు నడవడం, చాట్ చేయడం, వ్యాసాలు రాయడం, మీమిత్రులతో పంచుకోవడం. లేదా కొన్ని పుస్తకాలు చదవడం వల్లమీరు  ఆహారం పెద్దగా తీసుకోరు. ఒక కొత్త అలవాటు ఒక్కొఅంశం పైన ఆశక్తి పెంచుకోడం వల్ల పెయింటింగ్ వేయడం. సంగీతం పాడడం లేదా ఏదైనా వాయిద్యం వాయించడం. అల్లికలు చేయడం వంటి పనుల వల్ల ఆహారం తినాలన్న కోరిక తగ్గిపోతుంది. మళ్ళీ తినా లన్నా కాంక్ష బోర్ గా ఉంటుంది. సరిగా నిద్రపోవాలి... సాయంత్రం వేళలో  కాస్త వ్యాయామం కొంత మేర మీకు సహాయ పడుతుంది. అది ఎక్కువ సేపు వ్యాయామం చేయకూడదు. విరామం లేకుండా చేసే వ్యాయామం చెయడం వల్ల నిద్ర పోవడం కొంచం కష్టంగా ఉంటుంది. మరీ ఆలస్యంగా వర్క్ అవుట్ చేయకండి. నిద్రపోడానికి రాత్రివేళ గంట ముందు  వ్యాయామం ఆపేయండి ఆతరువాతే నిద్రకు ఉపక్రమించండి. నిద్రపోయే ముందు తినకండి... నిద్రపోయే ముందు మీరు డిన్నర్ తీసుకుంటారా? అల్పాహారం అంటే టిఫిన్ తీసుకుంటారా? ఏదైనా మీరు మీఅహారాని నిద్రకు ముందే ముగించేయ్యాలి. అలాకాకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మీఆహారం తీసుకుంటే అది మీ శరీర బరువును మరింత పెంచుతుంది. అయితే మీరు మీ బరువు తగ్గాలన్న ప్రయత్నం విఫలం కావచ్చు. సరైన సమయం, అంటే ఏ సమయంలో ఆహారం తిన్నారు అన్నది విషయం కాదు. చాలా మంది రాత్రి వేళలో  ఆహారం తీసుకునే వాళ్ళు పైగా ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకుంటారు. అర్ధ రాత్రి భోజనం ,అల్పాహారం తీసుకోడం వల్ల  నిద్రపోలేరు. దీనివల్ల మళ్ళీ బరువు పెరుగుతారు. కొన్ని గంటల పాటు వంట గది నుంచి బయటికి రండి. నిద్రపోయేముందు నుంచి మరుసటి రోజు ముందు వరకు మేల్కుని ఉంటారు. మీ మధ్యాహ్న భోజనాన్ని రేపటికి ప్యాక్ చెయ్యండి... ప్రతి రోజూ మీరు మాధ్యాహ్న భోజనానికి బయటికి వెళ్తున్నారా? అయితే కొంత పొడుపు చేయండి. రాత్రికి ముందే మీ లంచ్ ను ప్యాక్ చెయ్యండి. బయట తినడము అంటే  అందులో ఎక్కువ కొవ్వు పదార్ధాలు, సోడియం ఉంటుంది మీ ఆహారాన్ని మీరే  ప్యాక్ చేసినప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ ఇచ్చే బాదాం, టర్కీస్లై సెస్, హోల్ గ్రైన్, తక్కువ కొవ్వు ఇచ్చే  పాల ఉత్పత్తులు చాలా రకాల పండ్లు ఫలాలు తీసుకోవచ్చు. మీరు మీ సమయ పాలనకు కట్టుబడి ఉండండి... రాత్రి వేళ మీరు ఆహారం ఎక్కువగా తీసుకుంటున్నారని గమనిస్తే అంటే దాని ఆర్ధం ఉదయం వేళ మీరు సరిపడే ఆహారాన్ని తీసుకోలేదని అర్ధం. దీనిని ఎలా ఎదుర్కోవాలి అన్న ప్రశ్నకు సమాధానంగా మీ భోజనం మీరు ప్రతిరోజూ తీసుకోవాలి. ఆరకంగా మీ శరీరానికి ఎప్పుడు ఆహారం తీసుకోవాలో  తెలుస్తుంది. మాధ్యాహ్న భోజనం రాత్రి డిన్నర్ మధ్య స్నాక్ తీసుకుంటే మంచిది. అలా ప్రయత్నం చేయడం అది మీరు ఎక్కువగా చేయకండి. టి వి ని కట్టెయ్యండి... రాత్రి వేళ ఆహారం తీసుకుంటూ టివి చూసే అల వాటు మీకు ఉంటె మీరు ఆహారం తీసుకునే సమయం టి వి చూసే సమయం ఆమధ్యలో మీరు ఎక్కువ ఆహారం తీసుకునే అవకాసం ఉంది.రాత్రి ఆహారం తీసుకున్నాక మీ చిగుళ్ళను పళ్ళను బ్రష్ చేయండి. రాత్రి వేళ మీరు తీసుకునే ఆహారాన్నిపూర్తిగా తగ్గించాలంటే మీరు మీపళ్ళను  చిగుళ్ళను శుబ్రం చేసుకోండి. ఒక వేళ మీ పళ్ళు శుభ్రంగా ఉంటె నిద్రపోవడానికి ముందే అల్పాహారం తీసుకునే ముందు రెండు సార్లు ఆలోచించండి. పళ్ళు శుభ్రం చేయడానికి 6౦ నిమిషాలు ఆలోచించండి. ప్రత్యేకంగా మీరు యాసిడ్స్ లాంటివి అంటే నిమ్మరసం, ద్రాక్ష పళ్ళు, సోడా లాంటివి తీసుకుంటే 6౦ నిమిషాలు  ఆగాలి అంటున్నారు నిపుణులు. ఒత్తిడిని సులభంగా జయించవచ్చు... మీరు ఒత్తిడిని ఎదుర్కుంటూ న్నట్లైతే మీ బరువు పెరిగే అవకాశం ఉంది. రాత్రి వేళ కాసేపు రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి. లోపలి సుదీర్ఘ శ్వాస తీసుకునే పద్దతులు అవలంబించండి. లేదా మెడిటేషన్ ధ్యానం చెయడం ద్వారా ఒత్తిడిని జయించ వచ్చని అలా చేయడం వల్ల నాణ్యతతో కూడుకున్న నిద్ర ను పొందవచ్చు. ఇక చివరగా రాత్రివేళ నిద్ర పోయే ముందు లైట్లు తీసి వేయండి.. చీకాట్లో నిద్రపోవడం చాలా మందికి అల వాటు. అలా చేయడం వల్ల మాంచి నిద్ర పడుతుంది.మీరు బరువు తగ్గించు కోవాలన్న ప్రయత్నాం చేయడం ద్వారా మీ కిటికీలు మూసి వేయండి. కర్టెన్లు వేసుకోండి. ఫోన్లు ల్యాబ్ టాబ్ కు దూరంగా ఉండండి. పడు కునేందుకు ముందు 3౦ నిమిషాలు వాటికి దూరంగా ఉండండి. కంటి మీద మాస్క్ వేసుకుంటే సహాయ పడుతుంది.