ఒక లీటరు ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌లో సగటున 2.4 లక్షల ప్లాస్టిక్ ముక్కలు ఉంటాయట.  నానో ప్లాస్టిక్ కణాలు శరీరంలో అనేక రకాల సమస్యలకు దారితీస్తాయి. పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. అటు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంద‌ని,  ప్రాణాంతక వ్యాధులపై.... బెర్లిన్ - జర్మనీలో జ‌రిగిన‌ మెడికల్ కాన్ఫరెన్స్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే బెథాలేట్ అనే రసాయనం నీటిలో కలుస్తుంది. ఆ నీరు త్రాగినప్పుడు, అది రక్తంలో కలిసిపోతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అంతే కాదు పురుషులలో స్పెర్మ్ కౌంట్‌తో పాటు, నాణ్యత  తగ్గుతుందని మెడికల్ కాన్ఫరెన్స్ హెచ్చ‌రిస్తూ,  కొన్ని సూచ‌న‌లు విడుద‌ల చేసింది.   1. చమురును తిరిగి ఉపయోగించ వద్దు   2. పొడి పాలు వద్దు   3. మ్యాగీ క్యూబ్స్ వద్దు   4. కార్బోనేటేడ్ జ్యూసులు వద్దు (లీటరుకు 32 చక్కెర ఘనాలు ఉంటాయి)   5. ప్రాసెస్ చేసిన చక్కెర వద్దు   6. మైక్రోవేవ్ చేసిన తినుబండారాలు    7. ప్రినేటల్ మామోగ్రామ్ వద్దు, కానీ ఎకోమామర్ ఉపయోగించవచ్చు   8. చాలా బిగుతుగా ఉండే బ్రాలను ధరించవద్దు   9. మద్యం వద్దు   10. చ‌ల్ల‌గా వున్న‌ భోజనాన్ని మళ్లీ వేడి చేయకూడదు   11. ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయవద్దు.   12. అన్ని గర్భనిరోధక మాత్రలు మంచివి కావు ఎందుకంటే అవి మహిళ యొక్క హార్మోన్ల వ్యవస్థను మార్చి క్యాన్సర్‌కు కారణమవుతాయి.   13. డియోడరెంట్స్ ప్రమాదకరమైనవి, ముఖ్యంగా షేవింగ్ తర్వాత ఉపయోగించినప్పుడు.   14. డబ్బా పాల కంటే తల్లి పాల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ.   15. క్యాన్సర్ కణాలు ఎక్కువగా చక్కెర మరియు అన్ని కృత్రిమ చక్కెర, బ్రౌన్ చక్కెరను కూడా తింటాయి.   16. తన ఆహారంలో చక్కెరను మానుకున్న క్యాన్సర్ రోగి తన వ్యాధి తగ్గుముఖం పట్టి దీర్ఘాయుష్షును పొందగలడు.  షుగర్ = ప్రాణ శత్రువు.   17. ఒక గ్లాస్ బీర్ శరీరంలో 5 గంటలు ఉంటుంది మరియు ఈ సమయంలో ఈ గ్లాస్ కారణంగా వ్యవస్థ యొక్క అవయవాలు స్లో మోషన్‌లో పనిచేస్తాయి.   18. చక్కెరకు బదులుగా సహేతుకమైన పరిమాణంలో తేనె   19. మాంసానికి బదులుగా బీన్స్ వంటి కూరగాయల ప్రోటీన్లు   20. పళ్ళు తోముకునే ముందు ఖాళీ కడుపుతో రెండు గ్లాసుల నీరు మరియు నిద్ర లేవగానే అదే గది ఉష్ణోగ్రత వద్ద గదిలో ఉంచిన నీరు త్రాగాలి   21. క్యాన్సర్ నిరోధక రసం:    కలబంద + అల్లం + పార్స్ లీ + సెలెరీ + బ్రోమెలైన్ (పైనాపిల్ మిడిల్).. మిక్స్ చేసి ఖాళీ కడుపుతో త్రాగాలి.   22. ప్రతి రోజూ పచ్చి లేదా వండిన క్యారెట్లు లేదా వాటి రసాన్ని తినండి/త్రాగండి.   23. ప్లాస్టిక్ కప్పులో టీ తాగవద్దు   24. కాగితం లేదా ప్లాస్టిక్ సంచిలో వేడి తినుబండారాలు ఏమీ తినవద్దు.  ఉదాహరణ: బంగాళదుంపలు (ఫ్రైస్).   25. మైక్రోవేవ్‌లో ప్లాస్టిక్‌ని ఉపయోగించవద్దు - ఎం.కె. ఫ‌జ‌ల్‌
ఏపీలో ఎన్నికల నేపథ్యంలో హింసాత్మక ఘటనలు జరగ్గా, పలువురు పోలీసు అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. బదిలీ అయిన వారి స్థానంలో ఈసీ నేడు కొత్త నియామకాలు చేపట్టింది. డీఎస్పీలుగా ఐదుగురిని, ఇన్ స్పెక్టర్లుగా ఏడుగురిని నియమిస్తూ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.  గురజాల డీఎస్పీగా సీహెచ్ శ్రీనివాసరావు, నరసరావుపేట డీఎస్పీగా ఎం సుధాకర్ రావు, తాడిపత్రి డీఎస్పీగా జనార్దన్ నాయుడు, తిరుపతి డీఎస్పీగా రవి మనోహరాచారి, తిరుపతి స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా వెంకటాద్రిని నియమించారు.
జనం మొగ్గు ఎటువైపు ఉంది.. ఏ పార్టీ పట్ల జనంలో అభిమానం మెండుగా ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సర్కార్  ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ గద్దె ఎక్కుతుందా? లేక పరాజయం పాలై  అధికారం కోల్పోతుందా వంటి ప్రశ్నలకు సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే సర్వేల మీద ఆధారడుతుంది. అయితే  విషయాన్ని సర్వేలతో సంబంధం లేకుండా జనం మూడ్ ఏమిటి, ఎన్నికలలో విజయం సాధించే పార్టీ ఏది? పరాజయం పాలయ్యే పార్టీ ఏది అన్న విషయాన్ని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారులు ముందుగానే పసిగట్టేయగలరు. ఔను రాజకీయ పరిభాషలో బాబూస్ గా పిలవబడే ఐఎస్ఎస్ అధికారులకు జనం నాడి అందరికంటే ముందే తెలిసిపోతుంది.   అందుకే ఏపీలో  ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం మరో సారి గద్దె నెక్కే పరిస్థితి లేదని వారు ఎప్పుడో పసిగట్టేశారు. వారి విధేయతను మార్చేయడానికి, ప్లేటు ఫిరాయించడానికి ఎప్పుడో రెడీ అయిపోయారు. అయితే అతి కొద్ది మంది మాత్రం తమ విధేయతలను మార్చినా ఫలితం లేని స్థితికి వచ్చేశారు. జగన్ అక్రమ పాలనలో, నిబంధనలను తుంగలోకి తొక్కి అడ్డగోలు విధానాలను అమలు చేయడంలో జగన్ తో అంటకాగి నిండామునిగిపోయిన వారు మాత్రం నిండా మునిగిన వాడికి చలేమిటి అన్నట్లుగా ఎన్నికల కోడ్ ను సైతం లెక్క చేయకుండా అధికార పార్టీ ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారు.  మిగిలిన వారు మాత్రం ఇప్పుడు  తమ ఉద్దేశం ప్రకారం రాబోయేది తెలుగుదేశం కూటమి సర్కారే అన్న నిర్ధారణకు వచ్చేశారు.   ఇప్పటి వరకూ తామరాకు మీద నీటిబొట్టులా వ్యవహరించిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారులు, కొందరు ఐపీఎస్ అధికారులు కాబోయే సీఎం అన్న నమ్మకానికి వచ్చేసి చంద్రబాబు ప్రాపకం కోసం తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. అసలు బాబూస్ లో ఈ ప్రయత్నాలు ఎప్పుడో ఆరేడు నెలల కిందటే మొదలయ్యాయి. ఇప్పుడు అవి మరింత ముమ్మరమయ్యాయి. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబుతో కాంట్రాక్ట్ లోకి వెళ్లి మరీ తమ సచ్ఛీలతను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలీ ఒరవడి ఆరేడు నెలల కిందటే మొదలైంది.  ఇంత కాలం జగన్ సర్కార్ కు అడుగులకు మడుగులొత్తిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు  ఆరేడు నెలల నుంచీ జగన్ సర్కార్ కు దూరం జరగడం మొదలైంది.  ఇంత కాలం జగన్ చూసి రమ్మంటే కాల్చి వచ్చిన చందంగా ప్రభుత్వం ఇంత చెప్తే అంత చేసి విపక్షాన్ని చీకాకు పెట్టేందుకు మాత్రమే తమ అధికారాన్ని వాడిన అధికారుల వైఖరి గత ఆరేడు నెలలుగా పూర్తిగా మారిపోయింది. వి జగన్ కరుణా కటాక్షాల కోసం పరిధి దాటి మరీ పనులు చేసిన కొందరు అధికారులు గత ఆరేడు నెలల నుంచీ చంద్రబాబుతో భేటీకి తహతహలాడుతున్నారు. కొందరైతే రహస్యంగా ఆయనను కలిసి  క్షమాపణలకు కోరుకోవడమే కాదు.. అలా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందో వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఒక సందర్భంలో చంద్రబాబు ఈ విషయాన్నిస్వయంగా చెప్పారు. ఒక సీనియర్ అధికారి తనను మారువేషంలో కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన గురించి వివరించారనీ, తానేం చేయలేకపోతున్నానని మధనపడ్డారనీ, ఎదిరిస్తే ప్రాణాలకే ముప్పని భయపడ్డారని చంద్రబాబు చెప్పారు. అంటే కేవలం జగన్ ఒత్తిడితోనే   తాము  తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా  పని చేయాల్సి వచ్చిందని అధికారులు చెప్పుకున్నారు.  బరితెగించి మరీ ఇంత కాలం జగన్ కు భజన చేసిన అధికారులే   బాబు ప్రాపకం కోసం వెంపర్లాడారు. ఇప్పుడు ఎన్నికల ముగిసిన తరువాత మరింత మంది అదే బాటలో నడుస్తున్నారు. బాబూస్ మారిన వైఖరే రాష్ట్రంలో ప్రభుత్వం మారోబోందన్న సంకేతాలను బలంగా ఇస్తున్నది.   అయితే జగన్ ప్రాపకం కోసం పరిధి దాటి వ్యవహరించి తెలుగుదేశం శ్రేణులనూ నేతలనూ వేధింపులకు గురి చేసిన ఐఏఎస్, ఐపీఎస్ లకు ఇప్పుడు బాబు ప్రాపకం కోసం వెంపర్లాడే ధైర్యం రావడానికి కారణం.. ఇప్పుడు సర్వీస్ అధికారుల తీరే రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం కూటమిదేనన్న భావనను బలపరిచేదిగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
ALSO ON TELUGUONE N E W S
ఎస్ ఎస్ రాజమౌళి.. ఇది  కేవలం పేరు కాదు బ్రాండ్.  తెలుగు సినిమాకే ఒక  బ్రాండ్ అని చెప్పవచ్చు. ప్రపంచ సినిమా ఆధునికత తో పరుగులు పెడుతున్న టైం లో  మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలని తెరకెక్కించి తెలుగు సినిమాకి ప్రపంచ సినీ మ్యాప్ లో స్థానాన్ని కలిపించాడు.టైటానిక్, అవతార్, టెర్మినేటర్ చిత్రాల సృష్టికర్త, ప్రపంచంలోనే నెంబర్ వన్ డైరెక్ట్ గా పేరు గాంచిన జేమ్స్ కెమరున్ చేత కూడా కీర్తింప బడ్డాడు. అలాంటి  రాజమోళి తాజాగా చెప్పిన ఒక విషయం టాక్ అఫ్ ది డే గా నిలిచింది ప్రముఖ టెలివిజన్ ఛానల్ ఈటీవీ స్వర్గీయ గేయరచయిత  సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి నివాళిగా నా ఉఛ్వాసం కవనం అనే ఒక ప్రోగ్రాం ని ప్రారంభించింది. మొదటి గెస్ట్ గా దర్శక ధీరుడు రాజమౌళి హాజరయ్యాడు. ఆద్యంతం ప్రేక్షకులని కళ్ళు కదల్పకుండా కట్టిపడేసిన ఈ షో లో జక్కన్న చెప్పిన పలు విషయాలు ఆసక్తికరంగా మారాయి. రాజమౌళి తండ్రి పేరు విజయేంద్ర ప్రసాద్. ఆయన మంచి కథకుడు  కూడా. రాజమౌళి ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ వన్ తప్ప  మొన్న ఆర్ ఆర్ ఆర్ వరకు రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు ఆయనే కథ అందించాడు.  1996 లో ఆనంద్, రవళి జంటగా అర్దాంగి అనే సినిమాని విజయేంద్ర ప్రసాద్ సొంతంగా నిర్మించాడు. సినిమా ఫెయిల్ అవ్వడంతో సంపాదించిన డబ్బంతా  పోయింది. దీంతో విజయేంద్రప్రసాద్ తీవ్ర నిరాశకి లోనయ్యాడు. దాంతో జక్కన్న   తన తండ్రి కోసం ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి అనే పాట రాయమని శాస్త్రిగారిని  అడిగాడు.  ఆ పాట విజయేంద్ర ప్రసాద్ లో  ధైర్యాన్ని తెచ్చింది.  పలు సందర్బాల్లో జక్కన్న లో  కూడా  ధైర్యాన్ని నింపింది. ఈ విషయాలన్నీ స్వయంగా జక్కన్న నే  చెప్పాడు ఇక ప్రపంచ నలుమూలాలు ఉన్నట్టే శాస్తిగారికి మా ఇంట్లోను అభిమానులు ఉన్నారని, సినిమా పరిశ్రమలో తనని నంది అని పిలిచేది శాస్త్రి గారు ఒక్కరే అని కూడా చెప్పాడు. బాహు బాలి సినిమా తీసే ముందు శాస్త్రి గారిని కలిసి సలహా తీసుకున్నాం. ఆర్ ఆర్ ఆర్ లోని రెండు పాటలని శాస్తిగారు రాసారు. దోస్తానా పాట పూర్తిగా రాస్తే  నెత్తురు మరిగితే ఎత్తర జండా మాత్రం  ఆరోగ్యం సహకరించక పూర్తిగా రాయలేక పోయారు. దాంతో కొన్ని పదాలని రాసి ఇచ్చి వాడుకోమని చెప్పారని కూడా ఆయన తెలిపాడు      
  కొన్ని నిజజీవితంలో యథార్థంగా జరిగిన సంఘటనలలో నుండి తీసిన సినిమాలు క్రేజ్ ని సంపాదించుకుంటున్నాయి. అలాంటిదే ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. స్వాతంత్ర్యోద్యమ సమయంలో పోరాడిన కొంతమంది గురించి చరిత్ర కొంత మేరకే తెలియజేసింది.  రణదీప్ హూడా నటుడిగా, దర్శకుడిగా చేసిన ఈ సినిమా మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంతో రణదీప్ దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ఈ సినిమా కథేంటంటే.. సావర్కర్ జీవితంలోని దాదాపు ప్రతి కోణాన్ని ఈ సినిమాలో చూపించారు. ఒక యువ సావర్కర్ మరియు అతని కుటుంబం వారి తండ్రి మరణాన్ని చూసినప్పుడు సినిమా ప్రారంభమవుతుంది. సావర్కర్ పెద్దయ్యాక స్వాతంత్ర్య సమరయోధుడిని కావాలని నిర్ణయించుకుంటాడు. అతని పోరాటాన్ని బలంగా చేయడానికి.. లండన్ వెళ్లి బ్రిటిష్ చట్టాన్ని నేర్చుకోవాలనుకుంటున్నాడు. కానీ ప్రయాణంలో అతని మొదటి స్టాప్ పూణే, అక్కడ అతను ఫెర్గూసన్ కాలేజీలో జాయిన్ అవుతాడు. అతను క్యాంపస్‌లోకి ప్రవేశించే ముందే అభినవ్ భారత్ సొసైటీని స్థాపిస్తాడు. సావర్కర్ స్వాతంత్ర్య ఉద్యమానికి బాల్ రోలింగ్ సెట్ చేశాడు.  సావర్కర్ స్నేహితులు మరియు తోటి స్వాతంత్ర్య సమరయోధులు దేశవ్యాప్తంగా అభినవ్ భారత్ సొసైటీ యొక్క పేరుని దాని ఉద్దేశ్యాన్ని వ్యాప్తి చేస్తున్నప్పుడు.. సావర్కర్ తన కళాశాలలోని తోటి విద్యార్థులను స్వాతంత్ర్య ఉద్యమంలో భాగమయ్యేలా ప్రేరేపించడంపై దృష్టి సారించాడు. అతను పూణేలో ఉన్న సమయంలో..  రాడికల్ నేషనలిస్ట్ నాయకుడు లోకమాన్య తిలక్‌ని కలిసాడు. అతనిని తన అధీనంలోకి తీసుకుంటాడు మరియు లండన్‌లో చదువుకోవాలనే తన కలను నెరవేర్చుకోవడానికి కూడా తిలక్ సహాయం చేస్తాడు. అతను బ్రిటీష్ మైదానంలోకి దిగిన తర్వాత భారతదేశం యొక్క స్వాతంత్ర్యం కోసం అతని పోరాటం ఎలా ఆశ్చర్యకరమైన మలుపులు తిరిగిందో తెలుస్తుంది. అతనిని అరెస్టు చేయడం కూడా జరుగుతుంది. సావర్కర్ జీవితంలోని ప్రధాన మలుపులను ఈ మూవీ హైలైట్ చేసింది. మహాత్మా గాంధీతో అతని పరస్పర చర్య, ఫ్రాన్స్‌లో ఆశ్రయం పొందేందుకు తప్పించుకునే ప్రణాళికలో అతను విఫలయత్నం చేయడం, అండమాన్ దీవులలో అతని జీవిత ఖైదు అకా కాలా పానీ, జైలులో అతని సంస్కరణ, అండమాన్ జైలు నుండి రత్నగిరి జైలుకు మారడం మరియు ఆ తర్వాత అతని విడుదల అవ్వడం.. దాని తర్వాత  స్వాతంత్ర్యోద్యమ పరిణామాలు ఎలా కొత్త రూపం దాల్చాయని మేకర్స్ ఇందులో చూపించారు. ఈ సినిమాని కొంతమంది విమర్శించారు‌. ఈ నెల 24 న ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. హిందీలో రిలీజైన ఈ సినిమా తెలుగు వర్షన్ రానుందా లేదా అనేది అఫీషియల్ గా తెలియాల్సి ఉంది.
ఇప్పుడు  యంగ్ టైగర్ ఎన్టీఆర్ (ntr)అభిమానులని ఆపడం ఎవరి తరం కావడం లేదు. ఎన్టీఆర్ బర్త్ డే వేడుకల మూడ్ లో ఉన్న వాళ్ళకి ఒక నయా  వార్త అంబరాన్ని అంటే ఆనందాన్ని కలుగ చేస్తుంది.నిజం చెప్పాలంటే  ఈ రోజు కోసమే  ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. వాళ్ళ మొర ఏ దేవుడు ఆలకించాడో  గాని  ఇన్నాళ్ళకి వాళ్ళ ఆశలు ఫలించాయి  ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ (prashanth neel)కాంబోలో ఒక మూవీ ఉందనే విషయం అందరకి తెలిసిందే. కాకపోతే ఎన్టీఆర్, ప్రశాంత్ లు ఉన్న బిజీ దృష్ట్యా మూవీ స్టార్టింగ్ విషయంలో క్లారిటీ లేదు.పైగా అధికారంగా ఎలాంటి అప్ డేట్ కూడా రాలేదు. దీంతో  ఈ కాంబో త్వరగా తెరకెక్కాలని అభిమానులు, ప్రేక్షకులు తమ తమ  ఇష్ట దైవాల్ని వేడుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ టీం అప్ డేట్ ఇచ్చింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి  బర్త్ డే విషెస్ చెప్తు అగస్ట్ నుంచి షూటింగ్ అని అనౌన్స్ చేసింది. దీంతో దేవర ఫస్ట్ సాంగ్ అండ్  ప్రశాంత్ మూవీ వార్త ఫ్యాన్స్ కి డబుల్ ధమాకాని తెచ్చినట్టయ్యింది పవర్‌హౌస్ ప్రాజెక్ట్ కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి అని కూడా టీం చెప్తుంది .ఇక ఫ్యాన్స్ కి అయితే కథ ఎలా ఉండబోతుంది. ఎన్టీఆర్ క్యారక్టర్ ఎలా ఉండబోతుంది అంటు చర్చలు కూడా మొదలెట్టారు. ఒక లెవల్లో టైటిల్స్ ఫిక్స్ చేసే ప్రశాంత్ ఇప్పుడు ఎన్టీఆర్ మూవీకి ఎలాంటి టైటిల్ ఫిక్స్  చేస్తాడు అనే చర్చ కూడా ఫ్యాన్స్ లో నడుస్తుంది. సోషల్ మీడియాలో కొన్ని రోజుల నుంచి డ్రాగన్ అనే పేరు ప్రచారంలో ఉంది.మైత్రి మూవీ మేకర్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ లు కంబైన్డ్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. సలార్ తర్వాత ప్రశాంత్ నీల్, దేవర, వార్ ల తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోయే మూవీ ఇదే  
పేరున్న హీరోలు స్క్రీన్ మీద విలనిజం పండిస్తే ఆ కిక్కే వేరు. అలా విలనిజం పండించే హీరోలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో హీరో చేరిపోయాడు. అతను ఎవరో కాదు.. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ (Manchu Manoj). జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మనోజ్.. ఏవో కారణాల వల్ల కొన్నేళ్లు నటనను బ్రేక్ ఇచ్చాడు. 2017 లో వచ్చిన 'ఒక్కడు మిగిలాడు' తర్వాత అతను హీరోగా నటించిన సినిమా రాలేదు. హీరోగా రీఎంట్రీ ఇస్తూ గతేడాది 'వాట్ ది ఫిష్' అనే సినిమా ప్రకటించాడు.. కానీ కొంతకాలంగా దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా లేవు. ఈ క్రమంలో మనోజ్ విలన్ గా ఎంట్రీ ఇస్తుండటం ఆసక్తికరంగా మారింది. తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'మిరాయ్' (Mirai). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు. మనోజ్ పుట్టినరోజు(మే 20) సందర్భంగా తాజాగా అతని పాత్రను పరిచయం చేస్తూ గ్లింప్స్ విడుదల చేశారు. వరల్డ్ లోనే మోస్ట్ డేంజరస్ ఫోర్స్ 'బ్లాక్ స్వార్డ్'గా మనోజ్ పాత్రను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంది. స్టైలిష్ విలన్ గా మనోజ్ లుక్, స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోయాయి.  గ్లింప్స్ చూస్తుంటే.. లేట్ గా అయినా మనోజ్ కి సరైన పాత్ర పడిందనే అభిప్రాయం కలుగుతోంది. 'మిరాయ్' సినిమా పాన్ ఇండియా వైడ్ గా 2025, ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఈ సినిమా తరువాత.. భారీ పాన్ ఇండియా సినిమాల్లో స్టైలిష్ విలన్ గా మనోజ్ కి అవకాశాలు క్యూ కట్టినా ఆశ్చర్యంలేదు.
The Pan India Production House Mythri Movie Makers is making some high-budget entertainers with top stars across different industries. They are bringing back Kollywood superstar Ajith Kumar to Telugu cinema with a multi-lingual movie written and directed by Adhik Ravichandran. The movie titled ‘Good Bad Ugly’ went on floors recently in Hyderabad. The previously released title poster got a superb response. The makers today unveiled the first look poster of the movie. It presents Ajith in a stylish best avatar with three different expressions, hinting at his role with three different shades. Wore a green printed flashy shirt with dragon shapes on it, Ajith sports a salt and pepper look. We can see dragon tattoos on his hand and a dragon-shaped bracelet. There are many deadly weapons on the table, and we can observe two golden dragons in the background. The first look poster truly lives up to all the expectations. Adhik Ravichandran who delivered a super hit with his last movie Mark Antony is making Good Bad Ugly as a stylish action thriller with another intriguing story. He is presenting Ajith Kumar in a role with multiple shades. The movie is going to offer a gripping and engrossing cinematic experience for fans and film lovers. The film produced by Naveen Yerneni and Y Ravi Shankar has a seasoned technical crew bringing in their expertise to one of the biggest projects of Indian Cinema. It features a musical score by Rockstar Devi Sri Prasad, while Abinandhan Ramanujam is taking care of the cinematography. Vijay Velukutty is the editor, while G M Sekhar is the production designer. The movie will have a Pongal release in 2025.
Young hero Anand Deverakonda is showing innovation in his choice of stories for each of his films. This time, he has also changed his look for "Gam Gam Ganesha." He will be seen with a six-pack body in this movie for the first time. Anand Deverakonda shared his six-pack ripped body picture on social media. This pic went viral on social media. "Gam Gam Ganesha" is set to hit theaters on the 31st of this month as an action crime comedy movie. Pragathi Srivastava and Nayan Sarika are starring opposite Anand. The film is being produced by Kedar Selagamshetty and Vamsi Karumanchi under the banner Hy-Life Entertainment. Uday Shetty is debuting as a director with this film. The trailer of "Gam Gam Ganesha" will be released tomorrow at 4 pm. "Gam Gam Ganesha" is attracting interest among the audience as a new effort among the films coming out at the end of this month.
The highly anticipated sequel to the 1996 blockbuster "Indian," "Indian 2" starring Universal Hero Kamal Haasan and directed by visionary filmmaker Shankar, is finally nearing its grand release. With post-production nearing completion, the makers are gearing up for a promotional blitzkrieg to reignite the excitement surrounding this cinematic event. Fans are eager to hear from Kamal Haasan himself, as he will be promoting "Bharateeyudu 2" (the Telugu title) in Mumbai, engaging with fans and hosts at Star Sports. The film's audio launch is scheduled for a lavish ceremony in Chennai on June 1st, 2024, setting the stage for a grand unveiling of Anirudh Ravichander's musical score. The makers are targeting a worldwide release on July 12th 2024. The first look and teaser of "Indian 2" have already garnered immense response, fueled by the presence of a talented cast including Kajal Aggarwal, Rakul Preet Singh, and Priya Bhavani Shankar. The film also features powerful performances by SJ Suryah, Siddharth, and Gulshan Grover. The film's first single will be unveiled on May 22nd. The song is most likely will be "COMEBACK INDIAN." Behind the camera, Shankar collaborates with esteemed writers B. Jeyamohan, Kabilan Vairamuthu, and Lakshmi Saravana Kumar, promising a compelling screenplay that blends emotion and intellect. The technical prowess of Ravi Varman's cinematography and Sreekar Prasad's editing adds further depth to the cinematic experience. Produced jointly by Subaskaran Allirajah's Lyca Productions and Udhayanidhi Stalin's Red Giant Movies, "Indian 2" is set to reaffirm the creative brilliance of its makers and raise the bar for cinematic excellence. Subaskaran Allirajah, known for his passion for films, is poised to deliver another thought-provoking and entertaining spectacle for audiences worldwide. "Indian 2" will be released as "Bharateeyudu 2" in Telugu, and "Hindustani 2" in Hindi, ensuring a global reach for this highly anticipated cinematic masterpiece.
నందమూరి నటసింహం బాలకృష్ణ (balakrishna) కి టెంపుల్  కి ఏదో అవినావ సంబంధం ఉంది. ఆయన  సినీ కెరీర్ ని ఒకసారి గమనిస్తే చాలా చిత్రాల్లోని ముఖ్యమైన సన్నివేశాలు టెంపుల్ లోనే తెరకెక్కాయి.బహుశా ఆయనకి ఉన్న ఆధ్యాత్మక భావాలు వలన దర్శక రచయితలు ఆ దిశగా ఆలోచిస్తున్నారేమో. పైగా ఆ సీన్స్ అభిమానులకి గాని ప్రేక్షకులకి గాని థియేటర్స్ లో పూనకాలు తెప్పిస్తాయి. సింహ, లెజండ్, అఖండ వంటి సినిమాలే అందుకు ఉదాహరణ చిరంజీవి(chiranjeevi)హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య తో భారీ హిట్ ని అందుకున్న బాబీ(bobby) దర్శకత్వంలో బాలయ్య కొత్త  మూవీ తెరకెక్కుతున్న విషయం అందరకి తెలిసిందే. రెండు నెలల క్రితం విడుదలైన గ్లింప్స్ తో  అందరిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా సరికొత్త బాలయ్య ని చూడబోతున్నామనే విషయం కూడా అందరకి  అర్ధమయ్యింది. ప్రెజంట్   హైదరాబాద్‌ లో షూటింగ్  జరుగుతోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం  నెక్స్ట్  షెడ్యూల్ లో ఇంటర్వెల్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.ఇందుకోసం ప్రత్యేకంగా ఒక  భారీ టెంపుల్ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ సీక్వెన్స్  సినిమా మొత్తానికే హైలెట్ కానున్నాయని కూడా  అంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలతో బాలయ్య ఫ్యాన్స్ అయితే  ఫుల్ ఖుషిగా ఉన్నారు. టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన గత చిత్రాలని గుర్తు చేసుకుంటున్నారు వరుస విజయాలతో జోరు మీద ఉన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (sitara entertainments)బాలకృష్ణ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.  హీరోయిన్ ఎవరనేది ఇంకా కన్ఫార్మ్ కాలేదు. వాల్తేరు వీరయ్య లో చిరంజీవి ని పార్టీ అడిగిన  ఊర్వశి రౌటేలా ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది. విలన్ గా యానిమల్ బాబీ డియోల్ చేస్తున్నాడు. కలర్ ఫోటో ఫేమ్  చాందిని చౌదరి కూడా బాలయ్య తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. బాలకృష్ణ కెరీర్ లో ఇది  109 వ చిత్రం   
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
ప్రతి మనిషి జీవితంలో ఎన్నో బంధాలు ఉంటాయి. తల్లిదండ్రులు, స్నేహితులు, చుట్టాలు, తెలిసిన వారు ఇలా చాలామంది జీవితంలో  ముఖ్య పాత్ర పోషిస్తుంటారు. తల్లిదండ్రులు కన్నవారు కాబట్టి వారు జీవితాంతం పిల్లల విషియంలో పాజిటివ్ గానే ఉంటారు. ఇక స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు ఈ బంధాలన్నీ బయటినుండి వచ్చేవే.. అయితే అన్నింటి కంటే భాగస్వామి పాత్ర మాత్రం చాలా పెద్ది. జీవితంలో ఓ దశలో బంధంలోకి వచ్చి చివరి వరకు కలసి ఉండేవారు జీవిత భాగస్వాములు.  జీవిత భాగస్వాములతో బంధం  ఎంత బలంగా ఉంటే ఇద్దరి జీవితం, ఇద్దరి భవిష్యత్తు  అంతే గొప్పగా ఉంటుంది. ఈ బంధం ఎంత బలంగా ఉందో నిర్ణయించే   5 ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు దొరికే సమాధానాలే బంధం బలాన్ని స్పష్టం చేస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. ప్రభావవంతంగా కమ్యూనికేట్ చేస్తున్నారా.. ఒక బంధం బలంగా ఉండాలంటే దానికి ముఖ్యంగా మంచి కమ్యూనికేషన్ అవసరం. మీరు,  మీ భాగస్వామి,  మీ ఆలోచనలు, భావాలు,  అవసరాలను బహిరంగంగా వ్యక్తపరచగలరో లేదో అంచనా వేయాలి.  ఒకరు చెప్పేది మరొకరు శ్రద్దగా వింటున్నారా? ఇద్దరి మధ్య చర్చలు వివాదాలు  వాదనలుగా మారుతున్నాయా? ఇలాంటివి  వివాదాలుగా మారకుండా   పరిష్కరించగలుగుతున్నారా? ఇవన్నీ కమ్యూనికేషన్  సమర్థవంతంగా ఉందా లేదా అనే విషయాన్ని నిర్ణయిస్తాయి.  కమ్యూనికేషన్ బాగుంటే ఇద్దరికి ఒకరి మీద మరొకరికి గౌరవం, నమ్మకం పెరుగుతాయి. ఏకభావం.. బలమైన బంధానికి  భాగస్వాముల విలువలు, ఇద్దరూ ఒకరి పట్ల మరొకరు ఎలా ఉంటున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది . మీరు అయినా,  మీ భాగస్వామి అయినా, ఇద్దరి  ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నారా? ఇద్దరి నిర్ణయాలు  కెరీర్, కుటుంబం, జీవనశైలి లేదా వ్యక్తిగత ఎదుగుదలకు సంబంధించినవా అని ఆలోచించాలి. ఇద్దరూ జీవితంలో ఎలాంటి విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు?  వంటివి ఇద్దరూ భవిష్యత్తు కోసం ఎంత మాత్రం ఏకభావంతో ఉన్నారనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.  సంఘర్షణలు.. ఏ సంబంధంలోనైనా సంఘర్షణలు  తప్పనిసరిగా ఉంటాయి. అయితే వాటిని ఎలా డీల్ చేస్తారనే దానిపైనే బంధం ఆధారపడి ఉంటుంది.   భాగస్వామితో కలిగే  విభేదాలు,  సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో, ఎలా ఎదుర్కోవాలో పరిశీలించాలి. గొడవలు జరిగినప్పుడు రాజీ పడటం,  పరిష్కారం కోసం ప్రయత్నించడం వంటివి ఏ మేరకు జరుగుతున్నాయో తరచి చూసుకోవాలి.    వివాదాలు పెరుగుతున్నాయా?  వాటిని పరిష్కరించుకోవడానికి ఎంత సమయం తీసుకుంటున్నారు?  ఆరోగ్యకరమైన  రీతిలో గౌరవం మరియు పరస్పర ప్రయోజనకరమైన పరిష్కారాలను కనుగొనే సుముఖత ఉంటాయి. భావోద్వేగాలు.. భావోద్వేగ సాన్నిహిత్యం భౌతిక సాన్నిహిత్యానికి మించినది.  భాగస్వామితో భావోద్వేగ పరంగా లోతుగా కనెక్ట్  అయితే  ఇద్దరి మధ్య బంధం కూడా బలంగా ఉంటుంది. ఇద్దరి ఆలోచనలు, భయాలు , ఇబ్బందులను ఒకరితో మరొకరు సరిగా ఓపెన్ అయ్యి చెప్పుకుంటున్నారా?  అవసరమైన సందర్భాలలో ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారా?  ఇవన్నీ ఇద్దరి మధ్య బంధం ఎంత గాఢంగా ఉందో తెలియజేస్తుంది.  పెట్టుబడి.. ఏ వ్యాపారానికి అయినా ఎలాగైతే డబ్బు, కష్టం పెట్టుబడిగా పెడతారో.. అదే విధంగా  బంధం బలంగా ఉండటానికి సమయం పెట్టుబడి పెట్టాలి. ఇద్దరూ ఒకరికోసం ఒకరు సమయం ఎలా కేటాయించుకుంటున్నారనే దానిపై బంధం ఆధారపడి ఉంటుంది. ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో చురుకుగా ఉంటున్నారా?. ఇద్దరూ  కలిసి  క్వాలిటీ టైమ్ మెయింటైన్ చేస్తున్నారా?  ఒకరి అవసరాలకు మరొకరు ప్రాధాన్యత ఇస్తున్నారా? ఒకరిని మరొకరు మెచ్చుకోవడం, ప్రోత్సహించడం, సపోర్ట్ ఇవ్వడం  వంటివి చేస్తున్నారా? ఇవన్నీ ఒక బంధం బలపడటానికి పెట్టుబడులే.                                                       *రూపశ్రీ.
ప్రతి మనిషి జీవితంలో ఎన్నో బంధాలు ఉంటాయి. తల్లిదండ్రులు, స్నేహితులు, చుట్టాలు, తెలిసిన వారు ఇలా చాలామంది జీవితంలో  ముఖ్య పాత్ర పోషిస్తుంటారు. తల్లిదండ్రులు కన్నవారు కాబట్టి వారు జీవితాంతం పిల్లల విషియంలో పాజిటివ్ గానే ఉంటారు. ఇక స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు ఈ బంధాలన్నీ బయటినుండి వచ్చేవే.. అయితే అన్నింటి కంటే భాగస్వామి పాత్ర మాత్రం చాలా పెద్ది. జీవితంలో ఓ దశలో బంధంలోకి వచ్చి చివరి వరకు కలసి ఉండేవారు జీవిత భాగస్వాములు.  జీవిత భాగస్వాములతో బంధం  ఎంత బలంగా ఉంటే ఇద్దరి జీవితం, ఇద్దరి భవిష్యత్తు  అంతే గొప్పగా ఉంటుంది. ఈ బంధం ఎంత బలంగా ఉందో నిర్ణయించే   5 ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు దొరికే సమాధానాలే బంధం బలాన్ని స్పష్టం చేస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. ప్రభావవంతంగా కమ్యూనికేట్ చేస్తున్నారా.. ఒక బంధం బలంగా ఉండాలంటే దానికి ముఖ్యంగా మంచి కమ్యూనికేషన్ అవసరం. మీరు,  మీ భాగస్వామి,  మీ ఆలోచనలు, భావాలు,  అవసరాలను బహిరంగంగా వ్యక్తపరచగలరో లేదో అంచనా వేయాలి.  ఒకరు చెప్పేది మరొకరు శ్రద్దగా వింటున్నారా? ఇద్దరి మధ్య చర్చలు వివాదాలు  వాదనలుగా మారుతున్నాయా? ఇలాంటివి  వివాదాలుగా మారకుండా   పరిష్కరించగలుగుతున్నారా? ఇవన్నీ కమ్యూనికేషన్  సమర్థవంతంగా ఉందా లేదా అనే విషయాన్ని నిర్ణయిస్తాయి.  కమ్యూనికేషన్ బాగుంటే ఇద్దరికి ఒకరి మీద మరొకరికి గౌరవం, నమ్మకం పెరుగుతాయి. ఏకభావం.. బలమైన బంధానికి  భాగస్వాముల విలువలు, ఇద్దరూ ఒకరి పట్ల మరొకరు ఎలా ఉంటున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది . మీరు అయినా,  మీ భాగస్వామి అయినా, ఇద్దరి  ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నారా? ఇద్దరి నిర్ణయాలు  కెరీర్, కుటుంబం, జీవనశైలి లేదా వ్యక్తిగత ఎదుగుదలకు సంబంధించినవా అని ఆలోచించాలి. ఇద్దరూ జీవితంలో ఎలాంటి విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు?  వంటివి ఇద్దరూ భవిష్యత్తు కోసం ఎంత మాత్రం ఏకభావంతో ఉన్నారనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.  సంఘర్షణలు.. ఏ సంబంధంలోనైనా సంఘర్షణలు  తప్పనిసరిగా ఉంటాయి. అయితే వాటిని ఎలా డీల్ చేస్తారనే దానిపైనే బంధం ఆధారపడి ఉంటుంది.   భాగస్వామితో కలిగే  విభేదాలు,  సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో, ఎలా ఎదుర్కోవాలో పరిశీలించాలి. గొడవలు జరిగినప్పుడు రాజీ పడటం,  పరిష్కారం కోసం ప్రయత్నించడం వంటివి ఏ మేరకు జరుగుతున్నాయో తరచి చూసుకోవాలి.    వివాదాలు పెరుగుతున్నాయా?  వాటిని పరిష్కరించుకోవడానికి ఎంత సమయం తీసుకుంటున్నారు?  ఆరోగ్యకరమైన  రీతిలో గౌరవం మరియు పరస్పర ప్రయోజనకరమైన పరిష్కారాలను కనుగొనే సుముఖత ఉంటాయి. భావోద్వేగాలు.. భావోద్వేగ సాన్నిహిత్యం భౌతిక సాన్నిహిత్యానికి మించినది.  భాగస్వామితో భావోద్వేగ పరంగా లోతుగా కనెక్ట్  అయితే  ఇద్దరి మధ్య బంధం కూడా బలంగా ఉంటుంది. ఇద్దరి ఆలోచనలు, భయాలు , ఇబ్బందులను ఒకరితో మరొకరు సరిగా ఓపెన్ అయ్యి చెప్పుకుంటున్నారా?  అవసరమైన సందర్భాలలో ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారా?  ఇవన్నీ ఇద్దరి మధ్య బంధం ఎంత గాఢంగా ఉందో తెలియజేస్తుంది.  పెట్టుబడి.. ఏ వ్యాపారానికి అయినా ఎలాగైతే డబ్బు, కష్టం పెట్టుబడిగా పెడతారో.. అదే విధంగా  బంధం బలంగా ఉండటానికి సమయం పెట్టుబడి పెట్టాలి. ఇద్దరూ ఒకరికోసం ఒకరు సమయం ఎలా కేటాయించుకుంటున్నారనే దానిపై బంధం ఆధారపడి ఉంటుంది. ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో చురుకుగా ఉంటున్నారా?. ఇద్దరూ  కలిసి  క్వాలిటీ టైమ్ మెయింటైన్ చేస్తున్నారా?  ఒకరి అవసరాలకు మరొకరు ప్రాధాన్యత ఇస్తున్నారా? ఒకరిని మరొకరు మెచ్చుకోవడం, ప్రోత్సహించడం, సపోర్ట్ ఇవ్వడం  వంటివి చేస్తున్నారా? ఇవన్నీ ఒక బంధం బలపడటానికి పెట్టుబడులే.                                                       *రూపశ్రీ.
పొగిడి చెడినవాడు లేడు. సమయోచితంగా పొగడలేని వారు అన్ని చోట్లా చెడిపోతారు. జీవితంలో కొందరికి జ్ఞానం ఒక దశలో వస్తుంది. అంతకు క్రితం నష్టమైపోయిన కాలాన్ని కూడదీసుకోవడానికి అన్నట్లుగా జ్ఞానోదయమైన మరుక్షణం నుండి అవతలివారిని అమితంగా, భరించలేనంతగా పొగడడం నేర్చుకుంటారు. ఇలాంటి వ్యక్తి తాను పొగిడేవాణ్ణి ఆకాశానికి ఎత్తేస్తాడు. 'ది స్కై ఈజ్ ది లిమిట్” అని రుజువు చేస్తాడు. అవతలి వ్యక్తి అలిసిపోయేంత వరకూ, లేక తాను అలిసేంత వరకూ పొగుడుతాడు.  ఒక్కొక్కసారి అక్కడ పొగడడానికి తగినంత విషయం లేనప్పుడు అతడి ఇంట్లో తనకు ఆతిథ్యమిచ్చిన ఆయన సతీమణి అమృతహస్తాన్ని, ఆవిడ వండి వడ్డించిన పదార్థాలు ఎంత రుచికరంగా వుంటాయో ఇలాంటి విషయాలను ఇరికించి మరీ చెప్తాడు. ఇలాంటి సబ్జక్టును గురించి ఎంతైనా చెప్పే వీలుంది. ఆ వంకాయ కూర, ఆ పాయసం, వారింటి నెయ్యి ఘుమఘుమలు, ఇట్లా చెప్పుకుపోతూ వుంటే దీనికి అంతుందా అనిపిస్తుంది. అక్కడ సన్మానంలో సన్మానితుడూ, ఉపన్యాసకుడూ అలసి పోయేలోగా శ్రోతలమైన మనం అలసిపోవడం ఖాయం. ఇలా ప్రసంగించేవాడికి సన్మానితుడు అసలెవరో తెలీని సందర్భాలు కూడా ఎదురావుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఈ ప్రాసంగికుడు ఏ మాత్రం జంకడు. ఎవర్ని సన్మానిస్తున్నారో వారిని గురించి చీటిమీద మూడు ముక్కలు వ్రాసి ఇలా ఇవ్వండి. మూడునిమిషాల్లో ప్రసంగ పాఠంతో రెడీ అయిపోతాను. మీరు వేదికమీద ఆహ్వానితులు నలుగురికీ పూలమాలలు వేసేలోగా నా చెవిలో నాలుగుముక్కలు ఊదితే దంచి పారేస్తాను. ఎవరిని గురించి చెప్పే వాక్యాలైనా నాకు కంఠస్థమే, తడుము కోవలసిన అవసరముండదు. రాజకీయ, పారిశ్రామిక, విద్యావేత్తలెవరైనా సరే, కళాకారులు, సినిమా స్టారులైనా సరే. ఎవరికి తగిన సన్మాన వాక్యాలు వారికి వప్పజెప్పడానికి ఎప్పటికప్పుడు సిద్ధంగానే వుంటాను. గుటికెడు కాఫీ సేవించి గొంతు సవరించానంటే ఇక ఆ తర్వాత ఉపన్యాసం అనర్గళంగా సాగిపోతుంది" అని హామీ ఇస్తాడు. అన్ని రంగాల్లోనూ స్పెషలైజేషన్ చోటు చేసుకున్న నేటి కాలంలో పొగిడే కళలో కొందర్ని తర్ఫీదు చేసి, వారికి లైసెన్స్ మంజూరు చేయడంలో తప్పేమీ కనిపించదు అనిపిస్తుంది. ఈ లలితకళను శాస్త్రీయంగా ఎక్కడా అభ్యసించకపోయినా, అనేక సంవత్సరాల అలవాటు కొద్దీ దీనిని క్షుణ్ణంగా నేర్చినవారు మన రాష్ట్రంలో ఎందరో వున్నారు. ఇలాంటివి నేర్పటానికి  నెలకొల్పే సంస్థల్లో ప్రస్తుతానికి వీరిని అధ్యాపకులు గానూ, శిక్షకులుగానూ నియమించవచ్చు. ఒక బాచ్ విద్యార్థులు శిక్షణ పొందితే ఇక ఆ తర్వాత కావలసినంత మంది అధ్యాపకులు. సమోవా అనే చిన్న రాజ్యానికి ఒక రాజుండేవాడు. అతడి రాజ్యంలో డాక్టర్ విన్సెంట్ హైనర్ అనే పెద్దమనిషి కొన్నాళ్ళుండి కొంత ప్రజాసేవ చేశాడు. డాక్టరు మహాశయుడు ఆ రాజ్యాన్ని వదలి వెళ్ళే తరుణంలో ఆ రాజుగారు ఆయన గౌరవార్థం విందు ఏర్పాటు చేశాడు. ఆ సందర్భంగా రాజు డాక్టర్ను గురించి నాలుగు వాక్యాలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. కాని రాజు కుర్చీలో కదలకుండా కూచున్నాడు. రాజు లేచి నుంచోని ప్రసంగించకుండా అలానే కూచోనుండటం డాక్టర్ హైనర్కు ఆశ్చర్యం కలిగించింది. ఈలోగా పొగడ్తనే వృత్తిగా చేసుకున్న ఒక వక్త వచ్చి రాజు తరపున డాక్టర్ హైనర్ గురించి బ్రహ్మాండమైన వాక్యాలతో దంచి పారేశాడు. సుదీర్ఘమైన ఆ ప్రశంసా వాక్యాల తర్వాత హైనర్ కొంత కింధా మీదై. ఉచిత రీతిని సమాధానం చెప్పడానికి లేచి నుంచోబోయాడు. రాజుగారు హైనర్ను వారిస్తూ కూచోమంటూ సౌంజ్ఞ చేశాడు. "మీ తరపున ప్రసంగించటానికి కూడా ఒక వక్తను నియమించాను. ఇక్కడ మా రాజ్యంలో ఇలాంటి ప్రసంగాలు ఆ వృత్తి స్వీకరించిన వారే చేస్తారు. ఔత్సాహికుల్ని ప్రోత్సహించడం మా పద్ధతి కాదు" అని వివరించాడు. ఇది పొగడటానికి కూడా ఎంత ప్రతిభ ఉండాలో తెలియజేస్తుంది. వాక్చాతుర్యం మనిషికి ఎంత ముఖ్యమో స్పష్టపరుస్తుంది.                                    ◆నిశ్శబ్ద.
నేడు దేశంలో ని సగానికి పైగా యువత తక్కువ వయసులోనే జుట్టు ఊడిపోవడం, బట్టతల సమస్య ఎదుర్కుంటున్నారు.ఈ సమస్యవల్లె చాలామందికి పెళ్ళికూడా కాక పోవడం సంభవిస్తోంది అందరిముందు బట్టతల తో తిరగాలంటే సిగ్గుపడడం గమనించవచ్చు. ఇందుకోసం అందంగా కనపడడానికి బాగా జుట్టుపెరగాదానికి చేయని ప్రయాత్నం అంటూ లేదు అందుకోసం పడుతున్న పడరాని పాట్లు వర్ణనాతీతం చివరగా ఎదిక్కులేక హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ అంటే జుట్టు మార్పిడి చేయించుకోడానికి సిద్ధమౌతున్నారు.హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేసేందుకు ఇబ్బిడి ముబ్బిడిగా పుట్టుకొస్తున్న నేపధ్యంలో మే నెలలో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ వల్ల ౩5 సంవత్సరాల వ్యక్తి మృతి చెందం తీవ్ర కలకలం రేపింది. డిల్లి నార్త్ వెస్ట్ ప్రాంతం లోనిరోహిణి లో  హెయిర్ టాన్స్ ప్లాంట్ చేస్తున్న సమయంలో రోగి మరణిం చడం పై డిల్లి హైకోర్ట్ తీవ్రంగా పరిగణిస్తూ కేంద్రం ప్రభుత్వాలు హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేసేవారిపట్ల వైద్య నియమ నిబందనలు అనుగుణంగా ఉన్నాయో లేదో చూడాలని డిల్లి హైకోర్ట్ ఆదేశించింది. ఇందుకోసం జాతీయ స్థాయి ప్రమాణాలు నియమ నిబందనలకు అనుగుణంగా పరిశీలించాలని నష్నల్ మెడికల్ కమీషన్ కు ఆదేశాలు జారీచేసింది. హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సమయంలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించేందుకు అత్యవసర సమయంలో అందించాల్సిన చికిత్చలు కు సత్వరం అందించేందుకు సమీపంలో పెద్ద ఆసుపత్రులలో నిర్వహించాలని క్లినిక్ నిర్వాహకులకు సూచించింది.హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ వల్ల జీవితం అంతమై పోదు, మరనిస్తారాని కాదు నష్నల్ మెడికల్ కమీషన్ తీసుకున్న నిర్ణయం పట్ల హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్ సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది ప్రముఖ ఆసుపత్రులలో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ నిర్వహిస్తే ఇబ్బందులు తప్పవని ప్రైవేట్ ఆసుపత్రులలో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ బృందం ఉంటుందని క్లినిక్లకు పెద్దసవాలు కాగలదని హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ డాక్టర్ చండి జైన్ గుప్తాఅన్నారు ప్రైవేట్ క్లినిక్లను కార్పోరేట్ పెద్ద ఆసుపత్రులు అనుమతించ బోవని ఆయా ఆసుపత్రుల నుండి సవాళ్లు తప్పవని డాక్టర్ మయాంక్ సింగ్ అన్నారు.హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సమయం లో అనుసరించే పద్ధతి అలసటతో కూడుకున్నది పెద్ద పెద్ద వసతులు ఉన్నప్పుడు ఎంపిక సులభమని అన్ని సదుపాయాలు ఉన్న చోట అనుభవజ్ఞులైన వైద్యుల సేవలు అందుతాయని పి ఎస్ ఆర్ ఐ ఆసుపత్రి ఎల్లప్పుడూ స్వగాతిస్తుందని వైద్యులు అన్నారు.అయితే దీనికోసం నూతన విధి విధానాలు అమలు చేయాలని సరైన సదుపాయాలూ శిక్షణ లేని వారుహెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ నిర్వహించడం వల్ల ప్రజల ప్రాణాలకు హానికలిగే అవకాసం ఉంది. డిల్లి లో సరైన సదుపాయాలు లేని ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్ లు చాలానే ఉన్నాయాని పద్దతి ప్రకారం నిర్వహించే ట్రాన్స్ ప్లాంట్ కు 1.5 నుండి 2 లక్షలు అవుతుందని అంటున్నారు నిపుణులు.హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ పరిశ్రమను నూతన జవసత్వాలు కల్పించడం నాణ్యత ప్రమాణాలు సాడుపాయాలు లేని ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్ లపై ఉక్కు పాదం మోపడం అంటే నియంత్రించడం. జాతీయ ఆరోగ్య మిషాన్ ఎన్ ఎం సి నియమ నిబంధనల అనుగుణంగా పనిచేయాలని పేర్కొంది.ఈ విషయాన్ని మోడ్రన్ ఈస్థటిక్స్ స్వాగతించింది.ఇది కేవలం డే కేర్ సర్జరీ మాత్రమే అనిస్పష్టం చేసారు. ఎన్ ఎం సి నిబందనల ప్రకారం ట్రాన్స్ ప్లాంట్ క్లినిక్ కు సమీపం లో నర్సింగ్ హోం ఉండాలన్న నిబంధన విధించిందన్న విషయం గుర్తుచేశారు. అత్యవసర మైన పక్షం లో అవసరమైన సమయం లో చేర్చేందుకు అవసరమైన వైద్య సదుపాయాలు ఉండడం అత్యవసరమని పేర్కొంది తద్వారా రోగిని ప్రమాదం నుండి తపాయించావచ్చని పేర్కొంది. అయితే ట్రాన్స్ ప్లాంట్ లో సమయంలో ప్రమాదం జరగడం అరుదని డాక్టర్ గుప్తా అన్నారు.ఈ మధ్యకాలం లో దేశవ్యాప్తంగా చోటు చేసుకోవడం పై గుప్తా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. సర్జరీ సమయం లో ప్రత్యేక పద్దతి అనుసరించాలాని బలమైన అనస్తీషియా బృందం ఉండాలాని ఎందుకంటే దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయాని చాలా క్లినిక్స్ లో డర్మటాలాజిస్ట్ లు లేదా ప్లాస్టిక్ సర్జన్స్ ఎనేస్తీషియా ఎక్స్ పర్ట్ గా వ్యవహరిస్తున్నారని వారి వద్ద సురక్షిత మైన వారు లేరని రోగులు తీవ్రమైన విచిత్ర మైన పరిస్థితులు ఎదుర్కోవడం సంభవిస్తుందని అందుకే అప్రమత్తం గా ఉండాలని ఎన్ ఎం సి హేచారించింది.ఎన్ ఎం సి నియనిబంధనలకు లోబడే ప్లాస్టిక్ సర్జన్లు ఉండాలి. అర్హత లేని వ్యక్తుల పై చట్టప్రకారం చర్యలు ఉంటాయాని ఎన్ ఎం సి హెచ్చరించింది.                                          
ఎండుద్రాక్ష సాధారణంగా పాయసం, స్వీట్ల తయారీలో ఉపయోగిస్తారు. కొన్నిచోట్ల వంటకాలలోనూ, స్పైసీ స్నాక్స్ లో కూడా వీటిని జత చేస్తుంటారు. అయితే ఎండుద్రాక్షను నానబెట్టి తినమని అమ్మమ్మల మొదలు అమ్మలు కూడా చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా మహిళలు ఎండుద్రాక్ష నానబెట్టుకుని తినడం వల్ల చాలా ఆరోగ్యమని అంటారు.  ఎండుద్రాక్షను నానబెట్టి ప్రతిరోజూ తింటే  కలిగే అద్భుత ఫలితాలు ఇవే.. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.. రాత్రంతా నీటిలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం   గుండెకు చాలా మంచిది.  నానబెట్టన ఎండు ద్రాక్ష  శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి  మంచి కొలెస్ట్రాల్ ను  ప్రోత్సహిస్తుంది . ఇది  ధమనులలో ఏర్పడే  ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిని తినడం వల్ల ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి ఇది స్ట్రోక్,  గుండె జబ్బుల నుండి  రక్షించడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.. యాంటీ ఆక్సిడెంట్లు  శరీరంలో ఫ్రీ రాడికల్స్ డ్యామేజీని తగ్గిస్తాయి. ఎండుద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని నీటిలో నానబెట్టి తినడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు త్వరగా విడుదలవుతాయి. యాంటీ-ఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి  రక్షించడంలో సహాయపడతాయి. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.. ఎండు ద్రాక్ష  బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎండుద్రాక్ష తినడం వల్ల  చాలా శక్తి లభిస్తుంది, దీని వల్ల  పదే పదే ఆకలి అనిపించదు.   ఆహారం ఎక్కువగా తినాలనే  కోరికలు కూడా తగ్గుతాయి. ఆహారం నియంత్రణ కారణంగా  బరువు పెరిగే అవకాశాలు తగ్గుతాయి.  తద్వారా  బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. రక్తపోటును నిర్వహిస్తుంది.. ఎండుద్రాక్షలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది రక్త నాళాలు గట్టిపడకుండా నిరోధిస్తుంది. దీని కారణంగా రక్తపోటు ఎక్కువగా ఉండదు. ఒకవేళ రక్తపోటు ఎక్కవగా ఉంటే దాని ప్రభావం తగ్గిస్తుంది.  అంతేకాకుండా ఇందులో పొటాషియం కూడా ఉంటుంది, ఇది అధిక రక్తపోటును కూడా నివారిస్తుంది. కాబట్టి రాత్రంతా నీటిలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల  రక్తపోటు అదుపులో ఉంటుంది. జీర్ణక్రియకు ప్రయోజనకరం.. ఆహారం జీర్ణం కావడానికి,  మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి ఫైబర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎండుద్రాక్షలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల  పేగు ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ప్రేగులలో ఆహారాన్ని తరలించడంలో సహాయపడుతుంది, ఇది ఉబ్బరం,  మలబద్ధకాన్ని నివారిస్తుంది. కాలేయానికి మంచిది.. బయోఫ్లావనాయిడ్స్ ఎండుద్రాక్షలో ఉంటాయి. ఇవి  రక్తం,  కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి . యాంటీ-ఆక్సిడెంట్లు  కూడా ఎండుద్రాక్షలో పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కాలేయానికి మేలు చేస్తాయి. శరీరం నుండి విషాన్ని తొలగించడానికి ఆరోగ్యకరమైన కాలేయాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. అందువల్ల ప్రతిరోజూ రాత్రిపూట ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టి తినడం  కాలేయానికి ప్రయోజనకరంగా ఉంటుంది.                                                     *నిశ్శబ్ద.