బీఆర్ఎస్ నుంచి కవిత నిష్క్రమించడంతో, కేటీఆర్, కవితల మధ్య మాటల యుద్ధం    అధికారికంగా మొదలైంది. తెలంగాణలో ఎన్నో రాజకీయ పార్టీలు వస్తూ పోతూ ఉంటాయని, వాటి గురించి మాట్లాడటంలో గానీ, వాటిపై మానసిక వనరులను వృధా చేయడంలో గానీ అర్థం లేదని తన సోదరి కల్వకుంట్ల కవిత కొత్తగా ఏర్పాటుచేసిన టీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అన్నా చెళ్లెళ్ల మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి.   కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు.  బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత..  ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుం టున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే..  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.  మమ్మల్ని సీరియస్‌గా తీసుకోకూడదని  అంటున్నారు. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా తొలుత చిన్నగానే మొదలవుతుంది,  పాత టీఆర్ఎస్ కూడా చాలా నెమ్మదిగానే ప్రారంభమైందని కవిత గుర్తు చేశారు. నా పార్టీ కూడా అలాంటి ధోరణినే చూడబోతోందన్నారు. తనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఇసుమంతైనా పట్టిచుకోనన్న కవిత..  తెలంగాణ రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి కష్టపడి పనిచేస్తానన్నారు. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత, ఆమె సొంత పార్టీ ప్రకటించిన తరువాత ఆమెపై పరోక్షంగానే అయినా తొలిసారి కేటీఆర్ విమర్శించారు. అంటే అన్నాచెళ్లెళ్ల మధ్య మాటల యుద్ధం దిశగా తొలి అడుగు పడిందన్నమాటేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ముందు ముందు ఈ మాటల యుద్ధం మరింత   ముదురుతుందని అంచనా వేస్తున్నారు.   ఒకప్పుడు ఐక్యంగా ఉండి ప్రత్యర్థులను ఎదుర్కొన్న కల్వకుంట్ల కుటుంబంలో ఇప్పుడు చీలిపోయింది.  బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె పార్టీతో విభేదించి బయటకు వచ్చేశారు. ఆ సందర్భంగా కేటీఆర్.. యధాలాపంగానే అయినా  గత ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమికి   ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక ప్రధాన కారణమని అన్నారు. అయితే దానికి కవిత అప్పట్లో తీవ్రంగా ఖండించారు.  దాంతో అప్పటి నుంచీ కవిత విషయంలో కేటీఆర్ మౌనం వహిస్తూ వచ్చారు. అయితే తాజాగా కవిత టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తరువాత..  రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతుంటాయి, పోతుంటాయి.. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కవిత పార్టీని తక్కువ చేసే విధంగా మాట్లాడారు.  పార్టీ   ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.  కవిత పార్టీ లాంటి  చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వొద్దని కార్యకర్తలకు సూచించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత కూడా ఘాటుగా స్పందించారు.  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం నారా లోకేష్ హవా నడుస్తోంది. గతంలో ఆయనను లక్ష్యంగా చేసుకుని వైసీపీ సోషల్ మీడియా విభాగం చేసిన ప్రచారాలు ఇప్పుడు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పేరును తెరపైకి తెచ్చి, టీడీపీలో వారసత్వ చిచ్చు పెట్టాలనే  వైసీపీ ఎత్తుగడలు ఇప్పుడు నవ్వులపాలౌతున్నాయి.   2024 ఎన్నికల్లో కూటమి చారిత్రాత్మక విజయం సాధించడం..  అందులోనూ లోకేష్ మంగళగిరిలో రికార్డు మెజారిటీతో గెలవడం.. అంతకు ముందు తన యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ ప్రజా నాయకుడిగా ఎదగడంతో ఇప్పుడు వైసీపీ ఆయనపై ఎక్కుపెడుతున్న పాత విమర్శలు, వ్యాఖ్యలు ఇసుమంతైనా ప్రభావం చూపడం లేదు.   ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన  యువగళం పాదయాత్ర లోకేష్‌ను   ప్రజలకు చేరువ చేయడమే కాకుండా..  ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న  సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి. పాత ఇమేజ్‌ను పూర్తిగా చెరిపివేసి, ఒక మాస్ లీడర్‌గా ఆయన ఎదిగిన తీరు వైసీపీ వ్యూహకర్తలకు మింగుడుపడటం లేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి వంటి కీలక శాఖల మంత్రిగా లోకేష్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో వైసీపీ ప్రచారాల్లో వినిపించిన  పప్పు  అనే ముద్రను ఆయన తన తీరుతో  తుడిచిపెట్టేశారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతూ..  రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. మరోవైపు వైసీపీ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్ మాత్రం ఇంకా పాత వ్యూహాలతోనే లోకేష్ పై దాడి చేస్తున్నది. జూనియర్ ఎన్టీఆర్ అంశాన్ని వాడుకుంటూ లోకేష్‌ను తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే వాటిని జనాలు ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు.   సినిమా రంగంలో ఎన్టీఆర్ ప్రస్థానం వేరు, రాజకీయాల్లో లోకేష్ ప్రయాణం వేరు. ఒకరితో ఒకరిని పోల్చి విద్వేషాలు సృష్టించాలని వైసీపీ చేస్తున్న ప్రయత్నం వల్ల ఇసుమంతైనా ప్రయోజనం ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  లోకేష్ పై వైసీపీయులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న విమర్శలు, ట్రోలింగ్స్ నవ్వుల పాలౌతున్నాయి. ఇటువటి చౌకబారు ప్రయత్నాలు వైసీపీ ప్రతిష్టను మరింత మసకబారుస్తున్నాయంటున్నారు.  నారా లోకేష్ ప్రస్తుతం కేవలం ఒక వారసుడిగా మాత్రమే కాకుండా, టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.  యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ పరిస్థితుల్లో 2019 నాటి పాత స్క్రిప్టులతో లోకేష్‌ను దెబ్బతీయాలనుకోవడం వైసీపీకి రాజకీయంగా ఆత్మహత్యాసదృశ్యమేనని పరిశీలకులు అంటున్నారు. సోషల్ మీడియాలో కృత్రిమంగా సృష్టించే వివాదాల కంటే క్షేత్రస్థాయిలో లోకేష్ సంపాదించుకున్న ప్రజాభిమానం ఎంతో బలంగా ఉందని చెబుతున్నారు.  వైసీపీ ఇంకా పాతకుట్రలు, వ్యూహాలతో చేస్తున్న ప్రయత్నాలు.. ఆ పార్టీ 2014 ఘోర పరాజయం నుంచి పాఠాలు, గుణపాఠాలూ నేర్చుకోలేదనడానికి నిదర్శనమని అంటున్నారు.   
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కీలక అంకం మొదలైంది. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ ) నుంచి బయటకు వచ్చి సొంత రాజకీయ వేదికను టీఆర్ఎస్ ను ఏర్పాటు చేసుకున్న   కల్వకుంట్ల కవిత..  ఇప్పుడు తన తదుపరి లక్ష్యాన్నిప్రకటించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె..  రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే   ప్రధాన ధ్యేయమన్నారు.  ఈ పోరాటంలో జెన్-జీగా పిలువబడే నేటి యువతను భాగస్వామ్యం చేస్తామన్నారు. యువత  ఆకాంక్షలకు అనుగుణంగా తన రాజకీయ పంథాను మార్చుకోబోతున్నట్లు వెల్లడించారు. కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో యువతరం ఆలోచనలు, వారి అవసరాలు గతానికి భిన్నంగా ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని  విమర్శించారు. స్క్రీన్లపై సమయం గడుపుతున్నారని యువతను విమర్శించే బదులు.. అదే డిజిటల్ వేదికలను వారి గొంతుకగా మార్చుతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని..  అందుకే ఆ పార్టీని ఓడించేందుకు యువశక్తిని ఏకం చేయాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. రాజకీయాల్లో యువత  కేవలం ఓటర్లుగానే కాకుండా, నాయకులుగా కూడా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు కవిత చెప్పారు. తన పార్టీలో జెన్-జీ ప్రతినిధులకు పెద్దపీట వేస్తానని..  సమాజంలో వెనుకబడిన వర్గాలకు, అట్టడుగున ఉన్న వారికి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. కేవలం రాజకీయ ప్రసంగాలకు పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయిలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగిత, విద్యా సంబంధిత సమస్యలపై పోరాటమే తన అజెండా  అన్న కవిత.. రాష్ట్రంలో  రేవంత్ సర్కార్   వైఫల్యాలను ఎండగట్టడంలో యువతే ముందువరుసలో ఉంటారని  విశ్వాసం వ్యక్తం చేశారు.  ఇటీవల తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్  జారీ చేసిన నోటిఫికేషన్లలో వయోపరిమితి సడలింపు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును కవిత తీవ్రంగా తప్పుబట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన 10 ఏళ్ల వయోపరిమితి సడలింపును అమలు చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆమె ఆరోపించారు. జీవో 30ని యథాతథంగా అమలు చేయాలని, లేనిపక్షంలో నిరుద్యోగుల పక్షాన భారీ ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.  రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి యువతతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించాలని కవిత ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా 2029 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే పునాదులు వేయాలని ఆమె భావిస్తున్నారు. తన తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటికీ, తెలంగాణ సెంటిమెంట్‌ను, యువత ఆకాంక్షలను కలగలిపి కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాన్ని చూపిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
  -రిలీజ్ కి ముందే పలు సంచలనాలకి కేంద్ర బిందువుగా  టాక్సిక్  -కియారా, యష్ మధ్య బోల్డ్ సీన్స్ -దయచేసి కట్ చెయ్యడంటున్న కియారా -మేకర్స్ ఏం చేయబోతున్నారు టాప్ హీరోయిన్ కియారా అద్వానీ(Kiara Advani)అప్ కమింగ్ మూవీ 'టాక్సిక్(Toxic). పాన్ ఇండియా వ్యాప్తంగా ఈ చిత్రంపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో తెలిసిందే. రిలీజ్ డేట్ విషయంలో తడబాటుకి గురువవుతున్న టాక్సిక్ కి ఇప్పుడు కియారా అద్వానీ షాక్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.  రీసెంట్ గా కియారా టాక్సిక్ ఫైనల్ కట్ చూసిందట. దీంతో తనపై యష్(Yash)పై చిత్రీకరించిన బోల్డ్ అండ్ ఇంటిమేట్ సీన్స్ ని తిలగించమని దర్శకురాలు గీతూమోహన్ దాస్ ని రిక్వెస్ట్ చేస్తుందనే  మాటలు ఇండియన్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. సదరు సీన్స్ శృతి మించి ఉండటమే కియారా రిక్వెస్ట్ కి  కారణమని తెలుస్తుంది. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో టాక్సిక్ టాపిక్ మరో సారి వైరల్ గా మారింది. Also read: Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈరోజు అదిరిపోయే న్యూస్    ఈ విషయంపై  సినీ ప్రియులు స్పందిస్తు కియారా అద్వానీ గ్లామర్ గా చెయ్యడానికి ఏ మాత్రం వెనుకాడదు. కానీ అలాంటి కియారానే సీన్స్ తొలగించమని కోరుతు ఉందంటే ఏ స్థాయిలో బోల్డ్ సీన్స్ తెరకెక్కి ఉంటాయో అనే కామెంట్స్ చేస్తున్నారు. టీజర్ రిలీజైనప్పుడు కూడా అసభ్యత శృతిమించి ఉందనే విమర్శలు విషయం తెలిసిందే. ఏది ఏమైనా రిలీజ్ కి ముందే టాక్సిక్ పలు సంచలనాలకి కేంద్ర బిందువుగా మారుతుంది. డ్రగ్ మాఫియా  క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో  టాక్సిక్ రూపొందింది.     
  సమ్మర్ తన ప్రతాపాన్ని ఎంతగా  చూపిస్తున్నా సరికొత్త తాజా సినీ న్యూస్ సమ్మర్ సెగని సినీ ప్రియులకి కలగకుండా చేస్తున్నాయి.  మరి ఈ రోజు ఉన్న సినీ న్యూస్ ఏంటో చూద్దాం  1 . బ్లాక్ ఫారెస్ట్ లో మహేష్ బాబు..వైరల్ గా మారిన పిక్స్  సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల ఫ్యామిలీతో కలిసి జర్మనీ వెళ్లిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఎయిర్ పోర్ట్ పిక్స్ వైరల్ గా కూడా మారాయి. దీంతో అక్కడ్నుంచి రాగానే వారణాసి షూట్ ని స్టార్ట్ చేస్తారని అందరు అనుకున్నారు. కానీ మహేష్ వెళ్ళింది జర్మనీలో ఎంజాయ్ చేయడానికి కాదు. అక్కడున్న అడవుల్లో ట్రైనింగ్ తీసుకోవడానికి. ఈ విషయం మహేష్ రీసెంట్ గా చేసిన పోస్ట్ లతో అర్ధమవుతుంది.ట్రెక్కింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటు వారణాసి కోసం సిద్దమవుతున్నట్టుగా క్యాప్షన్ ఉంచాడు. ట్రెక్కింగ్ పిక్స్ వైరల్ గా మారాయి. 2 . రవిబాబు వర్సస్ 'పెద్ది'   'పెద్ది'  రిలీజ్ విషయంలో క్లారిటీ వచ్చేసింది.  కానీ పలు డేట్స్ నుంచి వాయిదా పడటం తెలిసిందే. ఈ విషయంపై దర్శకుడు రవిబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెద్ద సినిమాలు రాకపోయినా, రావని చెప్పకుండా మిగతా సినిమాలని  భయపెడుతూ థియేటర్లని ఖాళీగా ఉంచుతున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో పెద్ది వర్సస్ రవిబాబుగా మారిపోయింది. జూన్ 4 న పెద్ది బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. 3 .సోషల్ మీడియాలో అఖిల్ అభిమానుల సందడి  లెనిన్ జూన్ 26 న థియేటర్స్ లోకి అడుగుపెడుతుంది. పెద్ది జూన్ 25 న వస్తుందని అనుకున్నా జూన్ 4 కి వెళ్లిపోయింది. దీంతో అఖిల్ ఎలాంటి పోటీ లేకుండా సోలో గా ఉంటాడని,  పాజిటివ్ టాక్ వస్తే ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు నమోదవడం ఖాయమని ఫ్యాన్స్  హంగామా చేస్తున్నారు. అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హయ్యెస్ట్ మూవీ కాగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్  4 .అంతకు వెయ్యి రెట్లు బాధ అనుభవించాలి.. నా మద్దతు ఆ పార్టీకే అంటున్న రష్మీ    తిరుపతిలో వైసీపి నాయకుడు భూమన అభినయ్ రెడ్డి ఒక ఎడ్లబండిపై ఆటోను ఉంచి ఎద్దులతో లాగించడంపై యాంకర్ నటి  రష్మీ స్పందిస్తు ఆ ఎద్దు పడుతున్న వేదన కంటే మీరు వెయ్యి రెట్లు అధికంగా బాధపడాలనే వ్యాఖ్యలు చేసింది. దీంతో కొంత మంది వైసీపి నాయకులు రష్మీని వ్యక్తిగతంగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. వీటిపై కూడా రష్మీ స్పందిస్తు అవమానాలు నాకేం కొత్త కాదు. జంతువులపై జరిగే హింస విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఏ రాజకీయ పార్టీ అయితే జంతువుల సంక్షేమం కోసం పాటుపడుతుందో ఆ పార్టీకి బహిరంగ మద్దతు ఇస్తానని తన పోస్ట్ లో రాసుకొచ్చింది. 5 . తొలి రోజు షాకింగ్ కలెక్షన్స్ రాబట్టిన జెట్లీ, గాయపడిన సింహం  నిన్న వరల్డ్ వైడ్ గా జెట్లీ, గాయపడ్డ సింహం చిత్రాలు రిలీజయ్యాయి. జెట్లీ తొలి రోజు వరల్డ్ వైడ్ గా  1 .5 కోట్ల  గ్రాస్ ని సాధించగా ,గాయపడ్డ సింహం  కోటి రూపాయల గ్రాస్ సాధించినట్టుగా తెలుస్తుంది. మంచి అంచనాలతో వచ్చిన ఈ రెండు చిత్రాలు తొలి రోజు తక్కువ స్థాయి కలెక్షన్స్ ని రాబట్టడం పలువుర్ని ఆశ్చర్యపరుస్తుంది. మేకర్స్ మాత్రం కలెక్షన్స్ వివరాలని అధికారకంగా వెల్లడి చెయ్యలేదు. 6 .దయచేసి టాక్సిక్ లో నా రొమాన్స్ సీన్స్ కట్ చేయండంటున్న కియారా అద్వానీ  స్టార్ హీరోయిన్ కియారా టాక్సిక్ లో యష్ తో జత కట్టిన విషయం తెలిసిందే. రీసెంట్ గా కియారా టాక్సిక్ ఫైనల్ కట్ చూసిందట. దీంతో తనపై యష్ పై చిత్రీకరించిన బోల్డ్ అండ్ ఇంటిమేట్ సీన్స్ ని తిలగించమని దర్శకురాలు గీతూమోహన్ దాస్ ని రీక్వెస్ట్ చేసిందనే మాటలు ఇండియన్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారాయి. సదరు సీన్స్ శృతి మించి ఉండటమే అందుకు కారణమని తెలుస్తుంది. 7. ఆస్కార్స్ కొత్త రూల్స్: ఏఐ కంటెంట్‌పై బ్యాన్ సినిమాల్లో పెరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఆస్కార్స్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఏఐ కంటెంట్‌పై బ్యాన్ విధించడంతో పాటు, ఒకే దేశం నుంచి పలు సినిమాలు పోటీలో ఉండే అవకాశం కల్పించారు. అలాగే ఒకే నటుడు ఒకేసారి అనేక సినిమాలకు నామినేట్ కావచ్చని తెలిపారు. ఈ మార్పులు 2027లో జరిగే 99వ అకాడమీ అవార్డ్స్ నుంచి అమల్లోకి రానున్నాయి. 8 . విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్‌లోకి కృతి సనన్  విజయ్ దేవరకొండ ప్రెజెంట్ షూటింగ్ దశలో ఉన్న రణబలి, రౌడీ జనార్ధన తర్వాత హాయ్ నాన్న దర్శకుడు శౌర్యువ్ తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీలో విజయ్ సరసన  కృతి సనన్ చేయబోతోందనే న్యూస్ వినిపిస్తుంది. ఇదే నిజమైతే క్రేజీ కాంబో అని చెప్పవచ్చు. మరి ఈ విషయంపై  అధికారిక ప్రకటన వస్తుందేమో   చూడాలి. 9 .నా పెళ్ళాం నిప్పురా అంటున్న బెల్లంకొండ శ్రీనివాస్  కొత్త పెళ్లి కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ రీసెంట్ గా ట్విట్టర్ లో చేసిన పోస్ట్ మంచి ఫన్ గా మారింది. తన శ్రీమతి కావ్యరెడ్డిని పరిచయం చేస్తూ ‘నా పెళ్ళాం నిప్పురా’ అంటూ మంచి ఫన్ ని జెనరేట్ చేసాడు. అయితే ఈ పర్టిక్యులర్ లైన్ ఎందుకు పెట్టాడో అనేది చాలామందికి ఈపాటికే అర్ధం అయ్యి ఉంటుంది. తాను నటించిన జయ జానకి నాయక మూవీలో నటుడు జయప్రకాష్, రకుల్ ప్రీత్ సింగ్ ,శ్రీనివాస్ పై ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. సదరు సీన్ లోని  నీ కూతురు నిప్పురా అనే డైలాగ్ ఉన్న విషయం తెలిసిందే. 10 . త్రివిక్రమ్, వెంకీ తో చేతులు కలిపిన థమన్  విక్టరీ వెంకటేష్,త్రివిక్రమ్ ల ఆదర్శ కుటుంబం యొక్క సంగీత బాధ్యతల  నుంచి యానిమల్ ఫేమ్  హర్షవర్ధన్ రామేశ్వర్ తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో థమన్ ఎంట్రీ ఇస్తాడనే వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజమయ్యాయి. త్రివిక్రమ్ తో కలిసి ఉన్న ఒక  పిక్ ని థమన్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి  ఆదర్శ కుటుంబంలోకి ఎంట్రీ ఇచ్చానని తెలిపాడు.        
వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar), నవీన్ చంద్ర (Naveen Chandra) ప్రధాన పాత్రల్లో డైరెక్ట‌ర్ సంజీవ్ మేగోటి తెరకెక్కించిన తాజా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’ (Police Complaint). ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్న ఈ హారర్–యాక్షన్ థ్రిల్లర్ మే 22న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టించిన  కృష్ణసాయి బ‌ర్త్ డే సంద‌ర్భంగా త‌న అభిమాన న‌టుడు సూప‌ర్ స్టార్ కృష్ణపై ఈ సినిమాలో చేసిన స్పెష‌ల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. "వరలక్ష్మి శరత్‌కుమార్ గారు, నవీన్ చంద్ర చంద్ర గారి క్రేజీ కాంబినేష‌న్ అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది.  'చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ' అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. ఇదొక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్. దీనికి హారర్ థ్రిల్లర్ అంశాలను జోడించి ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని సరికొత్త అనుభూతిని అందించబోతున్నాం. ఈ సినిమా కథ, పాత్రల నిర్మాణం ప్రత్యేకంగా ఉంటూ ప్ర‌తి ఒక్క‌రిని ఖ‌చ్చితంగా అల‌రిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. మే 22న విడుద‌ల‌య్యే ఈ సినిమాను ప్ర‌తి ఒక్క‌రూ ఆద‌రించాల‌ని ప్రేక్ష‌కుల‌ను కోరుకుంటున్నాం." అన్నారు. విభిన్నమైన కథా నేపథ్యం, బలమైన నటీనటుల సమాహారం, థ్రిల్లింగ్ అంశాలతో రూపొందుతున్న ‘పోలీస్ కంప్లైంట్’ సినిమా విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంలో రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మొత్తం 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ప్రస్తుతం వైవిధ్యమైన కథలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో భారీ పీరియడ్ డ్రామా 'రణబాలి', రవి కిరణ్ కోలా దర్శకత్వంలో 'రౌడీ జనార్ధన' చిత్రాలతో బిజీగా ఉన్న విజయ్.. రీసెంట్ గా మరో క్రేజీ ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. 'హాయ్ నాన్న' సినిమాతో క్లాసిక్ డెబ్యూ ఇచ్చిన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో విజయ్ తన తర్వాతి సినిమా (#VDxShouryuv) చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ఎంట్రీ? ఈ భారీ పాన్-ఇండియా చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) నటించబోతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. మహేష్ బాబు హీరోగా నటించిన '1: నేనొక్కడినే' సినిమాతోనే హీరోయిన్ గా ప్రయాణం మొదలుపెట్టింది. నాగచైతన్యతో దోచేయ్, ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలు చేసింది. ఇప్పుడు మరోసారి తెలుగు హీరో సరసన నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. విజయ్ - కృతి జంట వెండితెరపై ఒక సరికొత్త కెమిస్ట్రీని పంచుతారని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, దీనిపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ సినిమా ఒక విజువల్ వండర్‌గా ఉండబోతోందని సమాచారం. దీనికోసం గ్లోబల్ స్థాయిలో హాలీవుడ్ సాంకేతిక నిపుణులను రంగంలోకి దింపారు. 'హౌస్ ఆఫ్ ది డ్రాగన్' ఫేమ్ అలెజాండ్రో మార్టినెజ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) సూపర్‌వైజర్ గా ఎరిక్ డర్స్ట్ వర్క్ చేస్తున్నారు. మ్యూజిక్ బాధ్యతలను మాత్రం హేషమ్ అబ్దుల్ వహాబ్ నిర్వహిస్తున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం 'మైథాలజికల్ యూనివర్స్' నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ డ్రామా అని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. విజయ్ ఒక రాయల్ లుక్‌లో కనిపిస్తూ క్రూరమైన కుక్కలను చైన్‌తో పట్టుకున్న పోస్టర్ నెట్టింట వైరల్ అయింది. విజయ్ దేవరకొండ కెరీర్‌లో భారీ బడ్జెట్ తో ఇది తెరకెక్కనుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.  
At 94, veteran filmmaker Singeetham Srinivasa Rao is stepping back behind the camera for a new feature film titled Sing Geetham. Known for his pioneering contributions to Indian cinema with classics like the silent film Pushpak and the science-fiction benchmark Aditya 369, the director is now exploring the musical fantasy genre.  The project is being backed by Nag Ashwin under the Vyjayanthi Movies and Swapna Cinema banners, marking a notable collaboration between the seasoned filmmaker and a modern production powerhouse. Sing Geetham is framed as a story that heavily intertwines music with magical realism.  The narrative centers on a young man named Prathap, played by Ayaan, who travels to a remote and mysterious village in search of better prospects. There, he finds himself caught in a complex struggle between modern progress and the preservation of the past. The film also features Ahilya Bamroo and Shalini Kondepudi in prominent roles. Devi Sri Prasad music and surreal setting helps the movie greatly. Singeetham has become a care of address for many creative and innovative films. Even at 94, he is ready to deliver such a brilliant film. Sing Geetham is releasing on 11th June, worldwide.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
The film 'Sathi Leelavathi' has been made with Lavanya Tripathi Konidela and Dev Mohan in lead roles. Presented by the renowned production house Anandi Arts, the film is produced by Naga Mohan under the Durgadevi Pictures banner. It is directed by Tatineni Satya, who is known for Bheemili Kabaddi Jattu and S.M.S (Shiva Manasulo Shruti). The makers are releasing this film worldwide on a grand scale on May 8. Mega Power Star Ram Charan released the movie trailer on Saturday. At the trailer launch event held in this regard,  Lavanya Tripathi said, “The hard work, love, and effort we put in for 'Sathi Leelavathi' will be seen on screen by the audience. Satya garu and Uday garu brought a good story to me. 'Sathi Leelavathi' has come out wonderfully. Naga Mohan garu worked very hard for this film. After it was known that I was pregnant during the shoot, the entire team supported me. Dev garu dubbed for himself. Thanks to my brother in law Ram Charan for releasing our trailer. Because of him, the reach of our trailer and our film has increased. Please watch our trailer and support us. Watch and support our film on May 8,” she said. Dev Mohan said.. “I’m happy to be coming before the Telugu audience again. I also watched the trailer along with all of you. I liked the trailer a lot. Thanks to Ram Charan garu for releasing our trailer. This movie, and the character I played in it, are very new and different. Thanks to the director and producers who gave me this opportunity. It was a pleasure to act with Lavanya garu. Our film is coming on May 8. I hope everyone will definitely watch and make it a success. Tatineni Satya said.. “Thanks to Ram Charan garu for launching our 'Sathi Leelavathi' trailer. Thanks to everyone who supported us during the shoot. Thanks to Uday garu who supported in writing, and to Venu garu, Ramesh garu, Srikanth garu, and Sai garu in my direction team. Our film is coming on May 8. It’s a very good film. I request everyone to come to the theatre and watch and support this film." Naga Mohan said .. “The film 'Sathi Leelavathi' is coming on May 8. I hope everyone will watch and enjoy it. Thanks to everyone who supported us in this journey. Thanks to Lavanya madam and Dev sir. We were able to bring the film this far only with the support they gave. Thanks to Ram Charan garu who launched our trailer. Our film will impress everyone." Jeevan Botimala said .. “Because I worked with Lavanya Tripathi garu, I immediately got 'Vishwambhara' and 'Ustaad Bhagat Singh' films. She became a lucky hand for me. Thanks to the director and producers who gave me this opportunity." Binendra Menon said .. “This is my second film with Satya garu. Thanks to everyone who gave me an opportunity in this film. We shot the film very enjoyably. We made this film wonderfully at a different location. Our movie is coming on May 8. Everyone please watch." Abhinaya Srinivas said .. “I wrote a song in 'Sathi Leelavathi'. Thanks to the director and producers who gave me this opportunity. This movie is coming on May 8. Everyone please watch." Tagubothu Ramesh said .. “Since 'Bheemili Kabaddi Jattu', Satya garu has been giving me opportunities. Lavanya garu shot even during her pregnancy. That’s a great thing. Thanks to everyone who gave me this opportunity. Thanks to Ram Charan garu who launched our trailer. Our movie is coming on May 8. Everyone watch and make it a success." Saptagiri said .. “I believe everyone would have liked the 'Sathi Leelavathi' trailer. We all shot together very enjoyably. Everyone liked the old 'Sathi Leelavathi'. This 'Sathi Leelavathi' we made now will also impress everyone. Currently, people are coming to theatres only by word of mouth. On May 8, come trusting our director Satya. Everyone will enjoy." Writer Uday said .. “The fun I felt while writing 'Sathi Leelavathi'... I felt even more entertained watching the teaser and trailer. Thanks to everyone who supported us in this journey. I wish this film a big success."   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
కింగ్ నాగార్జున(Nagarjuna)ఏ ముహూర్తాన లెనిన్(Lenin)జూన్  26 రిలీజ్ డేట్ వాయిదాపడదని అన్నాడో కానీ ఆ విషయం నిజమైనందుకు అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఎందుకంటే పెద్ది జూన్ 25  నుంచి జూన్ 4 కి షిఫ్ట్ అయ్యింది. దీంతో సినీ ట్రేడ్ సర్కిల్స్ లో లెనిన్ సింగిల్ గా వస్తుండంపై స్పందిస్తున్నారు. మరి ఆ లెనిన్ విశేషాలేంటో చూద్దాం. సోలో రిలీజ్ కావడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో లెనిన్  ప్రదర్శితమయ్యే అవకాశం ఉంది. పోటీ ఉండదు కాబట్టి  టాక్ కొంచెం పాజిటివ్‌గా వచ్చినా వసూళ్లు భారీగా రావడం ఖాయం. దీంతో సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కి లెనిన్ సోలో రిలీజ్ మంచి అవకాశం. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడం, అఖిల్ మాస్ లుక్ లో కనపడటంతో పాటు ఫ్యాన్స్, ప్రేక్షకులకి విపరీతంగా కనెక్ట్ అయ్యే కధాంశాలు పుష్కలంగా ఉన్నాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. దీంతో లెనిన్ రికార్డులు సాధించే అవకాశం ఉందని అంటున్నారు. Also read: Rashmi Gautam: ఆ పార్టీకి నా బహిరంగ మద్దతు.. వెల్లడి చేసిన రష్మీ ఏజెంట్ పరాజయం తర్వాత అఖిల్  చాలా గ్యాప్ తీసుకుని వస్తున్న 'లెనిన్' లో భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri borse)హీరోయిన్ కాగా మురళి కిషోర్(Murali Kishor)అబ్బూరి దర్శకుడు. అగ్ర నిర్మాణ సంస్థలు  సితార ఎంటర్ టైన్ మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు.    
లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల (Lavanya Tripathi Konidela), దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కిన చిత్రం ‘సతీ లీలావతి’ (Sathi Leelavathi). ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి) ఫేమ్ తాతినేని స‌త్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మే 8న రిలీజ్ చేస్తున్నారు మేక‌ర్స్‌. ఈ క్రమంలో శనివారం నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.   ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. "సతీ లీలావతి కోసం మేం పెట్టిన శ్రమ, మా ప్రేమ, మా కష్టం అంతా తెరపై ఆడియెన్స్ చూస్తారు. సత్య గారు, ఉదయ్ గారు మంచి కథను నా వద్దకు తీసుకు వచ్చారు. ‘సతీ లీలావతి’ అద్భుతంగా వచ్చింది. ఈ చిత్రం కోసం నాగ మోహన్ గారు చాలా కష్టపడ్డారు. నేను చిత్రీకరణ సమయంలో ప్రెగ్నెంట్ అని తెలిశాక టీం మొత్తం సపోర్ట్ చేసింది. దేవ్ గారు సొంతంగా డబ్బింగ్ చెప్పారు. మా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన మా బావ గారు రామ్ చరణ్‌కి థాంక్స్. ఆయన రిలీజ్ చేయడం వల్ల మా ట్రైలర్‌కి, మా సినిమాకు రీచ్ పెరిగింది. మా ట్రైలర్‌ని అందరూ చూసి సపోర్ట్ చేయండి. మే 8న మా సినిమాని చూసి సపోర్ట్ చేయండి" అని అన్నారు. దేవ్ మోహన్ మాట్లాడుతూ .. "తెలుగు ఆడియెన్స్ ముందుకు మళ్లీ వస్తున్నందుకు ఆనందంగా ఉంది. మీ అందరితో పాటే నేను కూడా ట్రైలర్ చూశాను. నాకు ట్రైలర్ చాలా నచ్చింది. మా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్. ఈ మూవీ, ఇందులో నేను పోషించిన పాత్ర చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. లావణ్య గారితో నటించడం ఆనందంగా ఉంది. మే 8న మా సినిమా రాబోతోంది. అందరూ తప్పకుండా చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను" అన్నారు. తాతినేని సత్య మాట్లాడుతూ .. "మా సతీ లీలావతి ట్రైలర్ లాంచ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్. ఈ చిత్రీకరణ సమయంలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. రైటింగ్‌లో సపోర్ట్ చేసిన ఉదయ్ గారికి, నా డైరెక్షన్ టీంలోని వేణు గారు, రమేష్ గారు, శ్రీకాంత్ గారు, సాయి గారికి థాంక్స్. మే 8న మా చిత్రం రాబోతోంది. ఇది చాలా మంచి సినిమా. అందరూ థియేటర్‌కు వచ్చిన ఈ సినిమాని చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను" అన్నారు. నాగ మోహన్ మాట్లాడుతూ.. "సతీ లీలావతి చిత్రం మే 8న రాబోతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. మాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. లావణ్య మేడంకి, దేవ్ సర్‌కి థాంక్స్. వారిద్దరూ ఇచ్చిన సపోర్ట్‌తోనే సినిమాను ఇక్కడి వరకు తీసుకు రాగలిగాం. మా ట్రైలర్ లాంచ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్. మా సినిమా ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటుంది" అన్నారు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే.. కూలర్ ఉపయోగించేటప్పుడు కూలర్ లో నీరు చేపల వాసన వస్తూ ఉంటుంది. కొందరు కూలర్ నుండి వాసన వస్తూ ఉందనే కారణంతో దాన్ని ఆఫ్ చేస్తారు. అయితే కూలర్ ను వాడకుండా ఉండటం పరిష్కారం కాదు.  కూలర్ ట్యాంక్ లోని పాత నీరు,  నాచు, తేమ కారణంగా కూలర్ లో చేపల వాసన లాగా వస్తూ ఉంటుంది. ఈ సమస్యకు చాలా సులువుగా చెక్ పెట్టవచ్చు.  అందుకోసం అనుసరించాల్సిన చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. కూలర్ నుండి చేపల వాసన ఎందుకు వస్తుంది? కూలర్‌లో చేపల వాసన రావడానికి అత్యంత సాధారణ కారణం ట్యాంక్‌లో పేరుకుపోయిన బయోఫిల్మ్ , బ్యాక్టీరియా. ట్యాంక్‌లో నీరు ఎక్కువ సేపు నిలిచి ఉన్నప్పుడు, సూక్ష్మజీవులు వృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. నిలిచిపోయిన నీరు బయోఫిల్మ్‌ను ఏర్పరుస్తుంది, ఇది వాసనకు కారణమవుతుంది.  అది మాత్రమే కాకుండా కూలర్‌లోని మురికి, దుమ్ము , తేమ కూడా ఈ వాసనకు కారణం అవుతాయి. వాసన ఎలా తొలగించాలంటే.. కూలర్ నుండి దుర్వాసనను తొలగించడానికి  వైట్  వెనిగర్‌ను ఉపయోగించవచ్చు. వైట్  వెనిగర్‌ను ఉపయోగించడం వల్ల కూలర్ నీటి నుండి వచ్చే చేపల వాసనను తొలగిపోతుంది. ఒకవేళ వైట్ వెనిగర్ లేకపోతే దానికి  ప్రత్యామ్నాయంగా బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. వెనిగర్ అనేది దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపే ఒక సహజ క్రిమిసంహారకం. మొదటగా  కూలర్ ట్యాంక్‌ను ఖాళీ చేయాలి. ఆ తర్వాత, ట్యాంక్‌లో వెనిగర్ పోసి కాసేపు అలానే ఉంచాలి. తర్వాత, ట్యాంక్‌ను శుభ్రంగా రుద్దాలి. ఆ తర్వాత 2 నుండి 3 టీస్పూన్ల బేకింగ్ సోడా కలపాలి. ట్యాంక్ శుభ్రం చేయాలి. దీని తర్వాత ట్యాంక్‌ను నీటితో నింపాలి. దీనివల్ల కూలర్‌లోని దుర్వాసన పోతుంది. ఎసెంటియల్ ఆయిల్స్.. ట్యాంక్‌ను శుభ్రం చేసిన తర్వాత నీటిని నింపి ఆ  నీటిలో ఎసెంటియల్ ఆయిల్స్  ఉపయోగించవచ్చు. కూలర్ నీటిలో 2 నుండి 3 చుక్కల టీ ట్రీ ఆయిల్ లేదా లెమన్‌గ్రాస్ ఆయిల్ కలపాలి. ఇది కూలర్ నుండి స్వచ్ఛమైన గాలి ప్రవహించడానికి సహాయపడుతుంది. కూలర్‌లోని నీటిని ప్రతి 2 నుండి 3 రోజులకు మార్చితే కూలర్ నుండి దుర్వాసన రాదు. చాలా మంది కూలర్ లో  నీటి మట్టం తగ్గగానే ప్రతిరోజూ నీటిని అయితే నింపుతూ ఉంటారు. కానీ.. పూర్తీగా కూలర్ ట్యాంక్ ను క్లీన్ చేసి కొత్త నీటిని నింపుతూ ఉంటే కూలర్ నుండి వాసన అనేది రాదు.                                 *రూపశ్రీ.
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది. అదే బెల్లం జిగటగా మారడం.  గాలిలోని వేడి, తేమ కారణంగా బెల్లం తరచుగా కరిగి జిగటగా మారుతుంది. అంతేకాకుండా, కొన్నిసార్లు దానికి బూజు కూడా పడుతుంది. వేసవిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం వల్ల వేసవి కాలంలో కూడా బెల్లం తాజాగా, పొడిగా ఉండేలా చేయవచ్చు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. ఎయిర్ టైట్ కంటైనర్.. బెల్లానికి గాలి, తేమ అనేవి అతిపెద్ద శత్రువులు. అందువల్ల బెల్లాన్ని నిల్వ చేయడానికి ఎల్లప్పుడూ మంచి నాణ్యత గల ఎయిర్ టైట్ కంటైనర్ ను  ఉపయోగించాలి. వీలైతే గాజు లేదా స్టీల్‌తో చేసిన పాత్రను ఎంచుకోవాలి. ప్లాస్టిక్ పాత్రలలోకి తరచుగా తేమ చేరి, బెల్లం కరిగిపోతుంది. చిన్న ముక్కలు.. మార్కెట్  నుండి తెచ్చిన బెల్లం ముద్ద మొత్తాన్ని ఒకేసారి డబ్బాలో వేస్తుంటారు. అయితే ఈ పద్ధతిని మానుకోవాలి. బెల్లాన్ని నిల్వ చేసే ముందు చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. దీనివల్ల  అవసరమైనంత మాత్రమే బయటకు తీయడం వీలవుతుంది. బెల్లం మొత్తం పదేపదే బయటి గాలికి గురికాకుండా సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు.. అవసరైమనప్పుడల్లా  బెల్లాన్ని బయటకు తీసి దాన్ని ఏదైనా రాయి లేదా రాడ్ లాంటి దానితో కొట్టి చిన్న ముక్క తీసుకుని,  తిరిగి దాన్ని మళ్లీ కంటైనర్ లో పెట్టడం లాంటివి చేస్తుంటే బెల్లం తొందరగా మెత్తబడి జిగటగా మారుతుంది. నీరు, తడి చేతులకు దూరం.. ఇది చాలా చిన్న విషయమే అయినా చాలా ముఖ్యమైనది. హడావిడిలో బెల్లం తీయడానికి తడి చేతులను గానీ, తడి చెంచాను గానీ ఎప్పుడూ ఉపయోగించకూడదు. చిన్న నీటి చుక్క కూడా  బెల్లం డబ్బా మొత్తాన్ని జిగటగా మార్చి, దానిని పాడుచేస్తుంది. బెల్లం తీసేటప్పుడు ఎల్లప్పుడూ పూర్తిగా పొడి చెంచాను  లేదా పొడి చేతులను మాత్రమే వాడాలి. బియ్యం చిట్కా.. బియ్యం చిట్కా మన అమ్మమ్మల కాలం నుండి వస్తున్న ఒక పాత చిట్కా.. కానీ ఇది చాలా ప్రభావవంతమైన చిట్కా. కొద్దిగా  బియ్యాన్ని ఒక శుభ్రమైన పత్తి లేదా మస్లిన్ గుడ్డలో కట్టి,  బెల్లం నిల్వ చేసే పాత్ర అడుగున ఉంచాలి. ఆ బియ్యం పాత్రలోని అదనపు తేమను పీల్చుకుంటుంది, దీనివల్ల  బెల్లం పూర్తిగా పొడిగా ఉంటుంది. ఫ్రిజ్ లో నిల్వ.. వేసవిలో  విపరీతమైన వేడి, తేమ ఉంటే , బెల్లాన్ని బయట కాకుండా ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. అయితే, దానిని నేరుగా డబ్బాలో ఉంచి నిల్వ చేయకూడదు. బెల్లం ముక్కలను జిప్-లాక్ బ్యాగ్‌లో లేదా శుభ్రమైన కాగితంలో గట్టిగా చుట్టి, ఆ తర్వాత వాటిని ఫ్రిజ్‌లోని ఎయిర్ టైట్ కంటైనర్ లో నిల్వ చేయాలి. ఇలా చేస్తే బెల్లం జిగటగా మారడం, కరగడం వంటివి జరగవు.                      *రూపశ్రీ.
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు పక్కనే ఉన్నా ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉంటున్నాం. నేటి కాలంలో మొబైల్ ఫోన్ మన అందరికీ "మొదటి లైఫ్ పార్ట్నర్" (First Life Partner) గా మారిపోయింది. ఈ డిజిటల్ వ్యసనం వల్ల మన మధ్య ఉండాల్సిన క్వాలిటీ టైమ్ మాయమైపోతోంది. ఈ పరిస్థితిని మార్చుకుని, మళ్ళీ మన బంధాలను ఎలా చిగురింపజేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొబైల్ వాడకాన్ని ఎందుకు తగ్గించాలి? (Why Should We?) మొబైల్ పక్కన పెట్టి మనుషులతో గడపడం ఎందుకు ముఖ్యం అంటే: సరైన నిర్ణయాలు తీసుకోవడానికి: ముఖాముఖి మాట్లాడుకున్నప్పుడే ఒక విషయంపై చర్చించి సరైన నిర్ణయం (Decision making) తీసుకోగలం. గౌరవం ఇవ్వడం: ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చూసుకోకుండా ఉండటం కనీస గౌరవం. బంధం బలపడటానికి: వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లేదా ఫ్యామిలీ మధ్య క్వాలిటీ టైమ్ గడపడం వల్ల అనుబంధం పెరుగుతుంది. ఏమి చేయకూడదు? (What Not To Do?) మనకు తెలియకుండానే చేసే ఈ తప్పులు బంధాలను దూరం చేస్తున్నాయి: మొదటి ప్రాధాన్యత ఇవ్వకండి: ఫోన్ కంటే ముందు మనిషికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫోన్ ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ కాకూడదు. మధ్యలో మాట్లాడకండి: ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో అకస్మాత్తుగా ఫోన్ కాల్ వస్తే అక్కడి నుండి వెళ్ళిపోవడం లేదా గట్టిగా మాట్లాడటం చేయకూడదు. దీనివల్ల అవతలి వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు. ముఖ్యమైన సందర్భాల్లో వాడొద్దు: పెళ్లి చూపులు వంటి ముఖ్యమైన చర్చల్లో పాల్గొన్నప్పుడు మొబైల్స్ చూస్తూ కూర్చోవడం వల్ల వచ్చిన అసలు ఉద్దేశమే మర్చిపోయే ప్రమాదం ఉంది. ముందుకు వెళ్ళే మార్గం - చిట్కాలు (How-To Points): మొబైల్ వ్యసనం నుండి బయటపడటానికి ఈ చిన్న మార్పులు చేయండి: సెల్ఫ్ డిసిప్లిన్ (Self-discipline): మొబైల్ వాడకం విషయంలో మనకు మనమే ఒక క్రమశిక్షణ విధించుకోవాలి. సైలెంట్ మోడ్‌లో పెట్టండి: ఎవరితోనైనా క్వాలిటీ టైమ్ గడుపుతున్నప్పుడు లేదా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టి దూరంగా ఉంచండి. ముందే చెప్పండి: ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటే, వారికి "నేను ఒక గంట పాటు బిజీగా ఉంటాను, తర్వాత కాల్ చేస్తాను" అని మెసేజ్ పెట్టి మీ క్వాలిటీ టైమ్‌ను ఆస్వాదించండి. పరస్పర అంగీకారం: భార్యాభర్తలు ఇద్దరూ కలిసి "మనం బయటికి వెళ్ళినప్పుడు మొబైల్స్ వాడొద్దు" అని ఒక రూల్ పెట్టుకోవాలి. ఎవరైనా వాడితే రెండో వ్యక్తి నిర్మొహమాటంగా గుర్తు చేయాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A): ప్రశ్న: బోర్ కొట్టినప్పుడు మొబైల్ చూడటం తప్పా? సమాధానం: బోర్ కొట్టినప్పుడు ఫోన్ చూడటం సహజమే, కానీ ఎదురుగా ఒక మనిషి ఉన్నప్పుడు వారిని వదిలేసి ఫోన్ చూస్తూ కూర్చోవడం సరైన పద్ధతి కాదు. ఇది గౌరవం మరియు కామన్ సెన్స్ (Common sense) కి సంబంధించిన విషయం. ప్రశ్న: ఫోన్ వాడొద్దు అని చెబితే అవతలి వారు కోప్పడితే ఏం చేయాలి? సమాధానం: ఇది కోప్పడాల్సిన విషయం కాదు. "మనం ఈ సమయాన్ని సరదాగా గడపడానికి వచ్చాం, కాసేపు ఫోన్ పక్కన పెడదాం" అని సున్నితంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి. మొబైల్ ఫోన్ అనేది మన అవసరానికి మాత్రమే, మన జీవితం అవ్వకూడదు. మన కళ్ళ ముందు ఉన్న మనుషుల కంటే, ఆ స్క్రీన్ లో కనిపించే ప్రపంచం ముఖ్యం కాదు. కాబట్టి, నేటి నుండే మీ మొబైల్‌ను కాసేపు పక్కన పెట్టి మీ ప్రియమైన వారితో ఆనందంగా గడపండి. అది మీ సెల్ఫ్ డిసిప్లిన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా Naveena Column యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి! సబ్స్క్రైబ్ చేసుకోండి.
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని మీకు తెలుసా? హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ 'ఆయుర్వేద పాన్' అద్భుతంగా పనిచేస్తుంది. గుండె రక్తనాళాల్లో అడ్డంకులను (Blockages) తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడే ప్రత్యేక ఆయుర్వేద పాన్/తాంబూలం తయారీ విధానం మరియు దాని ప్రయోజనాలు ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హార్ట్ స్పెషల్ తాంబూలం తయారీని వివరించారు: ఈ ఆయుర్వేద తాంబూలానికి కావలసినవి: తమలపాకు: ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఔషధ గుణాలను రక్తంలోకి త్వరగా చేరుస్తుంది. అర్జున చెట్టు బెరడు చూర్ణం: గుండె పనితీరును మెరుగుపరచడంలో ఇది అగ్రగామి. వెల్లుల్లి: రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును (Cholesterol) కరిగించి, అడ్డంకులను తొలగిస్తుంది. అల్లం లేదా సొంఠి: రక్త ప్రసరణను సాఫీగా చేస్తుంది. దాల్చిన చెక్క: రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎలా తీసుకోవాలి? వీడియోలో చూపిన విధంగా, తమలపాకులో ఈ మూలికలను సరైన మోతాదులో ఉంచి, తాంబూలంలా చప్పరిస్తూ తీసుకోవాలి. ఇది రక్తాన్ని పల్చగా ఉంచి, గడ్డకట్టకుండా (Blood Clots) చేయడంలో సహాయపడుతుంది. ప్రయోజనాలు: గుండె రక్తనాళాల్లో బ్లాకేజీలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె కండరాలను దృఢంగా మారుస్తుంది. అధిక రక్తపోటు (BP) సమస్యను అదుపులో ఉంచుతుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.   మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి! సూచన: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. తీవ్రమైన గుండె సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని ప్రయత్నించాలి.
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే వేసవిలో పిత్త తత్వం మరింత చురుకుగా ఉంటుంది, ఇది కడుపులో మంట, జీర్ణ సమస్యలు , అలసటకు దారితీస్తుంది. అందువల్ల, ఆయుర్వేదం కొన్ని రకాల ఆహారాలను తినమని , మరికొన్నింటిని తినకుండా ఉండమని సిఫార్సు చేస్తుంది. ఆయుర్వేదం చెప్పిన తినాల్సిన, తినకూడని ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. వేసవిలో ఏం తినాలి? వేసవిలో శరీరం బాగా వేడెక్కి, పిత్త దోషం పెరుగుతుంది. అందువల్ల, తేలికైన, చల్లని ఆహారాలు తినడం చాలా అవసరం. కర్బూజా, పుచ్చకాయ, మామిడి వంటి తాజా పండ్లు శరీరాన్ని చల్లబరిచి, కోల్పోయిన నీటిని తిరిగి అందిస్తాయి. చల్లని పాలు , పెరుగు శరీరాన్ని చల్లబరుస్తాయి. జీర్ణ వ్యవస్థను సమతుల్యం చేస్తాయి. పీచుపదార్థాలు అధికంగా ఉండే సలాడ్‌లు , తేలికపాటి కూరగాయలు జీర్ణక్రియను సులభతరం చేసి, కడుపులో వేడి అసమతుల్యతను నివారిస్తాయి. చల్లని జ్యూస్‌లు , కొబ్బరి నీరు సహజ ఎలక్ట్రోలైట్‌లను అందించి, శరీరాన్ని తేమగా ఉంచుతాయి. వేసవిలో ఏం తినకూడదు? వేసవిలో వేయించిన , బరువైన ఆహారాలకు దూరంగా ఉండాలి,  అవి జీర్ణక్రియను నెమ్మదింపజేసి, కడుపులో వేడిని పెంచుతాయి. అందుకే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి. అధిక మసాలాలు గల వంటకాలతో పాటు, కాఫీ , టీ వంటి కెఫిన్ పానీయాలు,  అధిక నూనె లేదా తీపి పదార్థాలు పిత్త దోషాన్ని పెంచి, శరీరాన్ని అసమతుల్యం చేస్తాయి. వేసవిలో కెఫిన్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. ఇవి గుర్తుంచుకోవాలి.. రోజులో ఎక్కువసార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవడం జీర్ణక్రియకు సహాయపడి, శక్తిని నిలుపుతుంది.   శరీరం చల్లగా, ఆరోగ్యంగా ఉండాలంటే, తేలికైన, నీరు అధికంగా ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.   చల్లని పదార్థాలను తీసుకోవడం వల్ల పైత్యరసం అదుపులో ఉండి, వేసవిలో అలసట , చికాకును నివారిస్తుంది.                                *రూపశ్రీ.