సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుని ఐదేళ్ళుగా వేధిస్తున్న జగన్ ఆయన సర్వీసులో చివరి రోజున కూడా తన వేధింపులు ఆపడం లేదు. యూనీఫామ్‌లో రిటైర్ అవ్వాలన్న ఆయన ఆకాంక్ష నెరవేరకుండా కుతంత్రంగా వ్యవహరిస్తున్నాడు. క్యాట్, కోర్టు తీర్పులను కూడా ఖాతరు చేయకుండా తన సంకుచిత మనసుని బయటపెట్టుకుంటున్నాడు. జగన్ వ్యవహారశైలిని తెలుగు ప్రజలందరూ ఖండిస్తున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు లాంటి ఉత్తముడి ఆవేదన జగన్ ప్రభుత్వాన్ని ఉప్పెనలా ముంచేయడం ఖాయం.
దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది.   నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని తెలిపింది. గురువారం నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించినట్లు ఐఎండీ ధృవీకరించింది.   మరో మూడు, నాలుగు రోజుల్లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. గత కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ ఎంఐడీ ప్రజలకు చల్లటి కబురు అందించింది.  ఈ ఏడాది లానినా అనుకూల పరిస్థితులు, భూమధ్యరేఖ వద్ద పసిఫిక్‌ మహాసముద్రం చల్లబడడం ఆగస్టు-సెప్టెంబరు నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఈ రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురుస్తుందని ఇప్పటికే ఐఎండీ ప్రకటించిన సంగతి తెలిసిందే.   1951 నుంచి 2023 వరకు ఎల్‌నినో తర్వాత లానినా వచ్చిన సందర్భాల్లో భారత్‌లో తొమ్మిదిసార్లు మంచి వర్షాలు కురిశాయని తెలిపింది. అందుకు అనుగుణంగానే ఈ ఏడాది రుతుపవనాల కదలిక ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.    
శుక్రవారం... అదే రేపు ఏబీ వెంకటేశ్వరరావు రిటైర్మెంట్ కావాల్సి ఉంది. ఈ రోజు అంటే ఒక రోజు ముందు క్యాట్ ఉత్తర్వుల్ని సమర్దించింది హైకోర్టు. ఏబీవీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తి వేసి తక్షణం పోస్టింగ్ ఇవ్వాలని, క్యాట్ జారీ చేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పేసింది. క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేసింది. విచారణ జరిపి, తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు, ఈ రోజు తీర్పు ఇచ్చింది.  జ‌న‌ర‌ల్‌గా మ‌నం చూస్తూ వుంటాం అమాయ‌క ద‌ళితుల్ని న‌క్స‌లైట్లు అని, అమాయక ముస్లింల‌ను టెర్ర‌రిస్టుల‌ని ముద్ర వేసి ఐదు, ప‌దేళ్ళు న‌ర‌కం చూపించిన త‌రువాత వారిది త‌ప్పేమీ లేద‌ని విడిచిపెడుతుంటారు. సేమ్ టూ సేమ్‌ అదే ప‌ద్ద‌తిలో ఇక్క‌డ ఓ సీనియ‌ర్ ఐఏఎస్ అధికారిని రాజ్యం టార్గెట్ చేసింది. రాజ్యం టార్గెట్ చేస్తే సాధార‌ణ ప్ర‌జ‌లైనా, ఉన్న‌తాధికారులైన బ‌లి కావాల్సిందేన‌ని ఎబీ వెంక‌టేశ్వ‌ర‌రావు వ్య‌వ‌హారం అద్దం ప‌డుతోంది.   సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు వ‌చ్చిన క‌ష్టం ప‌గ‌వాడికి కూడా రావ‌ద్దంటూ ఏపీలో చ‌ర్చ జ‌రుగుతోంది. వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత రెండేళ్ల‌కుపైగా స‌స్పెన్ష‌న్ కు గురైయ్యారు. ఆ త‌రువాత  సుప్రీంకోర్టు తీర్పు మేర‌కు  ప్రింటింగ్‌, స్టేషనరీ, స్టోర్స్‌ విభాగం కమిషనర్‌గా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.  అయితే ఇంత‌లోనే ఆయనపై గతంలో క్రిమినల్‌ కేసు నమోదై ఉండటంతో అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ జూన్ 28న‌ ఉత్తర్వులు జారీచేశారు.  టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్‌ విభాగం అదనపు డీజీగా ఉన్నప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు దేశ రక్షణ శాఖ నిబంధనలకు విరుద్ధంగా నిఘా పరికరాలు కొనుగోలు చేశారని ఆయనపై గతంలో కేసు నమోదైంది. కేంద్ర హోంశాఖ ఆమోదించడంతో ఆయన్ను 2020, మార్చి 7న జ‌గ‌న్ ప్ర‌భుత్వం సస్పెండ్‌ చేసింది.  దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లిన ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది.  ఫిబ్రవరి 7తో ఆయ‌న స‌స్పెన్ష‌న్ ముగిసింద‌ని పేర్కొంది. రెండేళ్ల‌కు మించి అఖిల భార‌త స‌ర్వీసు అధికారుల‌ను స‌స్పెండ్ చేయ‌డం కుద‌ర‌ద‌ని కోర్టు చెప్పింది.  అయితే.. గతంలో ఆయనపై నమోదైన క్రిమినల్‌ కేసుల విషయంలో దర్యాప్తును కొనసాగించవచ్చని, అందుకు అనుగుణంగా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది.  సుప్రీంకోర్టు త‌న‌పై స‌స్పెన్ష‌న్ ఎత్తేయ‌డంతో ఆ ఉత్త‌ర్వుల కాపీతో ఏబీ.. సీఎస్ స‌మీర్ శ‌ర్మ‌ను క‌లిశారు. త‌న‌ను విధుల్లోకి తీసుకోవాల‌ని కోరారు. అలాగే త‌న‌కు ఆపేసిన జీత‌భ‌త్యాల‌ను కూడా చెల్లించాల‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును ఏమాత్రం ప్రాధాన్యం లేని ప్రింటింగ్‌, స్టేషనరీ, స్టోర్స్‌ విభాగం కమిషనర్‌గా నియమించింది.  అయితే.. ఆయ‌న‌ను మ‌ళ్లీ విధుల్లోకి చేరి కొద్ది రోజులు కూడా గ‌డ‌వ‌క‌ముందే,  తనపై నమోదైన క్రిమినల్‌ కేసుకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేసేందుకు ఆయ‌న‌ యత్నిస్తున్నారని మ‌రోసారి ఆయ‌న‌పై వేటేసింది జ‌గ‌న్ ప్ర‌భుత్వం.  టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో నిఘా విభాగం అధిప‌తిగా చ‌క్రం తిప్పిన ఏబీ వెంకటేశ్వ‌ర‌రావు నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలను కొనుగోలు చేశార‌ని.. వాటిని ఉప‌యోగించి ప్ర‌తిప‌క్ష నేత‌ల ఫోన్ల‌ను ట్యాప్ చేశార‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆరోప‌ణ‌లు చేసింది.  ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆకాశ్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టం అనే కంపెనికి అడ్డగోలుగా లబ్ధి కలిగించారన్న ఆరోపణలపై ఆయనపై కేసు పెండింగులో ఉంది. ఆకాశ్‌ అడ్వాన్స్‌డ్‌ సిస్టం కంపెనీకి ప్రయోజనం కల్పిస్తూ 2018, అక్టోబరు 31న ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు రూ.35లక్షలు చెల్లించార‌ని చెబుతోంది. ప్రభుత్వానికి కనీస సమాచారం ఇవ్వకుండా ఇజ్రాయెల్‌కు చెందిన ఉత్పత్తులను భారత్‌లో తీసుకురావ‌డానికి య‌త్నించార‌ని తీవ్ర అభియోగాలు ఆయ‌న‌పై మోపింది.  ప్రింటింగ్‌, స్టేషనరీ, స్టోర్స్‌ విభాగం కమిషనర్‌గా బాధ్యతలు చేప‌ట్టిన‌ ఏబీ వెంకటేశ్వరరావు తనపై పెండింగులో ఉన్న క్రిమినల్‌ కేసులో సాక్షులను ప్రభావితం చేసేందుకు యత్నించడం ద్వారా అఖిల భారత సర్వీసు నిబంధనలను మరోసారి ఉల్లంఘించార‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం చెప్పింది. క్రిమినల్‌ కేసు పెండింగులో ఉన్న అధికారి తన హోదాను దుర్వినియోగం చేస్తే సస్పెన్షన్‌ విధించవచ్చని పేర్కొంటూ ఆయ‌న‌ను జూన్ 28న మ‌రోసారి స‌స్పెండ్ చేసింది. అలా... జగన్ సర్కార్ ఏబీ వెంకటేశ్వరరావు  పగబట్టింది.  తప్పుడు ఆరోపణలతో సస్పెండ్ చేసింది.  ఆ ఆరోపణలను తేల్చలేకపోయింది. ఆయనను డిస్మిస్ చేయాలని కేంద్రానికి సిఫారసు చేసింది. కేంద్రం తిరస్కరించింది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత క్యాట్ ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆయన సర్వీస్ మొత్తం జీతం ఇవ్వాలని .. తక్షణం పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది. అయినప్పటికీ రకరకాల సాకులు చెబుతూ… జ‌గ‌న్‌ ప్రభుత్వ వేధించింది.   ఏబీ వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్ చేయడం చెల్లదంటూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్ )ఇచ్చిన ఆదేశాలపై జ‌గ‌న్‌ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు.. వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వు చేసింది. ఎట్ట‌కేల‌కు ఇవాళ ఆ తీర్పును ప్రకటించింది. ఇందులో క్యాట్ ఉత్తర్వుల్ని హైకోర్టు సమర్దించింది.   హైకోర్టులో పిటిషన్ వేశామన్న కారణంగా పోస్టింగ్ ఇవ్వకపోవడం సీఎస్  తప్పిదమే అవుతుంది. ఈ విషయంలోనూ సీఎస్ జవహర్ రెడ్డి గీత దాటారన్న అభిప్రాయం వినిపిస్తోంది.   - ఎం.కె. ఫ‌జ‌ల్‌
ALSO ON TELUGUONE N E W S
మిలియన్‌ స్టూడియో బ్యానర్‌ మీద ఎం.ఎస్‌.మన్జూర్‌ సమర్పణలో గుహన్‌ సెన్నియప్పన్‌ తెరకెక్కించిన చిత్రం ‘వెపన్‌’. ఈ చిత్రంలో సత్యరాజ్‌, వసంత్‌ రవి, తాన్యా హోప్‌ ప్రముఖ పాత్రలను పోషించారు. ఈ మూవీ జూన్‌ 7న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను గురువారంనాడు హైద్రాబాద్‌లో నిర్వహించారు.  సత్యరాజ్‌ మాట్లాడుతూ..  ‘పెన్‌, మైక్‌, మీడియా అనేది రియల్‌ వెపన్‌. ఓటు అనేది మరో గొప్ప వెపన్‌. తాన్యా హోప్‌ ఆంగ్లో ఇండియన్‌. కానీ తెలుగులో చక్కగా మాట్లాడారు. నేను ‘అందరికీ నమస్కారం’ మాత్రమే చెబుతున్నాను. ప్రస్తుతం భాష అనేది హద్దుగా లేదు. బాహుబలి సినిమా ఎన్నో భాషల్లోకి వెళ్లింది. ఈ వెపన్‌ మూవీ కూడా అలాంటి ఓ చిత్రమే. ఇది పెద్ద హిట్‌ కాబోతోంది. సూపర్‌ హ్యూమన్‌ సాగా కాన్సెప్ట్‌తో రాబోతోంది. ఇదొక కొత్త ట్రెండ్‌ కాబోతోంది. గుహన్‌ మంచి కథను రాసుకున్నారు. వసంత్‌ రవి జైలర్‌లో అద్బుతంగా నటించారు. యంగ్‌ టాలెంటెడ్‌ యాక్టర్లతో నటించడం ఆనందంగా ఉంటుంది. నిర్మాత మన్జూర్‌ ఈ మూవీకి ఎంతో ఖర్చు పెట్టారు. జూన్‌ 7న మా చిత్రం రాబోతోంది. కల్కి సినిమాకు మా చిత్రానికి మధ్యలో 20 రోజులున్నాయి. మా సినిమాను అందరూ చూసి ఎంకరేజ్‌ చేయండి’ అన్నారు. వసంత్‌ రవి మాట్లాడుతూ.. ‘ఫ్యాంటసీ యాక్షన్‌, సూపర్‌ హీరో ఎలిమెంట్స్‌ అంటూ ఇలా ఇంట్రెస్టింగ్‌గా గుహన్‌గారు ఈ కథను రాశారు. కామిక్‌ స్టైల్లో ఈ మూవీని రాసుకున్నారు. అది చాలా గొప్పగా వచ్చింది’ అని అన్నారు. తాన్యా హోప్‌ మాట్లాడుతూ.. ‘వెపన్‌ మూవీ కోసం ఈ రోజు ఇక్కడ ఇలా వచ్చినందుకు ఆనందంగా ఉంది. సత్యరాజ్‌, వసంత రవి, రాజీవ్‌లతో పని చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. రాజీవ్‌ పిళ్లై మాట్లాడుతూ.. ‘ప్రతీ నటుడికి ఓ సూపర్‌ హీరో మూవీని చేయాలని ఉంటుంది. నాకు అలాంటి ఓ కారెక్టర్‌ దక్కింది. కెరీర్‌ ప్రారంభంలోనే ఇలాంటి ఓ మంచి కారెక్టర్‌ రావడం మామూలు విషయం కాదు. నాకు ఈ ఛాన్స్‌ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌’ అన్నారు. గుహన్‌ సెన్నియప్పన్‌ మాట్లాడుతూ.. ‘ఇదొక సైఫై థ్రిల్లర్‌, యాక్షన్‌ మూవీ. ఈ చిత్రాన్ని ఇంత గొప్పగా నిర్మించిన అబ్దుల్‌, మన్జూర్‌, అజిజ్‌ సర్‌కు థాంక్స్‌. సత్యరాజ్‌ గారు అద్భుతమైన పాత్రను పోషించారు. ఆయన ఒక లెజెండ్‌. ఆయనలోని కొత్త కోణాన్ని మీరు ఈ చిత్రంలో చూడబోతోన్నారు. ఈ పాత్రను ఆయన మాత్రమే పోషించగలరని నాకు తెలుసు. అందుకే ఈ పాత్రకు ఆయన్ను మాత్రమే ఊహించుకున్నాను. ఈ చిత్రాన్ని రెండో వరల్డ్‌ వార్‌ను బేస్‌ చేసుకుని రాసుకున్నాను. ఈ సినిమా కోసం కొన్ని చోట్ల ఏఐ టూల్స్‌ వాడాం. జూన్‌ 7 రాబోతోన్న ఈ యాక్షన్‌ ప్యాక్డ్‌ సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’ అన్నారు.
'హనుమాన్' (Hanuman) సంచలన విజయంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆయన తదుపరి చిత్రం పట్ల అందరిలోనూ ఆసక్తి నెలకొంది. నిజానికి 'హనుమాన్' విడుదలకు ముందు 'అధీర' (Adhira) అనే సినిమాని ప్రకటించాడు ప్రశాంత్. ఈ చిత్రంతో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కళ్యాణ్ దాసరి హీరోగా పరిచయం కానున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి ప్రశాంత్ తప్పుకోబోతున్నాడట. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా సూపర్ హీరో ఫిల్మ్ గా 'హనుమాన్' వచ్చింది. 'అధీర' కూడా సూపర్ హీరో ఫిల్మ్ నే. అయితే 'హనుమాన్' ఊహించిన దానికంటే భారీ విజయం సాధించడంతో.. దానికి సీక్వెల్ గా ప్రకటించిన 'జై హనుమాన్' (Jai Hanuman)ని ముందుగా పూర్తి చేయాలని ప్రశాంత్ భావిస్తున్నాడట. దాని ప్రభావం 'అధీర'పై పడనుంది. 'జై హనుమాన్'తో పాటు వేరే భారీ ఆఫర్లు కూడా ప్రశాంత్ కి వస్తున్నాయట. వీటి కారణంగా 'అధీర' ఆలస్యమవుతుంది. అందుకే ఆ మూవీ దర్శకత్వ బాధ్యతను వేరొకరికి అప్పగించాలని ప్రశాంత్ వర్మ నిర్ణయించుకున్నాడట. దీని కోసం 'నా సామి రంగ' ఫేమ్ విజయ్ బిన్నీని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. మరి ప్రశాంత్ రచనలో వస్తున్న ఈ సూపర్ హీరో ఫిల్మ్ ని విజయ్ బిన్నీ ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి. కాగా, 'హనుమాన్'ని నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లోనే ఈ చిత్రం రూపొందనుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్ 'కల్కి 2898 AD' (Kalki 2898 AD). వైజయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాల స్థాయిలో వరల్డ్ వైడ్ గా సత్తా చాటుతుందనే అంచనాలున్నాయి. ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన సర్ ప్రైజ్ మరింత కిక్ ఇస్తోంది. 'కల్కి 2898 AD' లో ప్రభాస్ భైరవగా కనిపించగా, అతని వాహనం బుజ్జి కూడా ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇప్పుడు ఈ రెండు పాత్రలను ప్రధానంగా చేసుకొని 'బుజ్జి అండ్ భైరవ' (Bujji & Bhairava) పేరుతో ఒక యానిమేటెడ్ సిరీస్ రాబోతుంది. నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ సిరీస్ మే 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా.. అది హాలీవుడ్ యానిమేటెడ్ సిరీస్ లను తలపించేలా ఉంది. ఇక ట్రైలర్ చివరిలో "ది కల్కి సినిమాటిక్ యూనివర్స్" అని వేయడం చూస్తుంటే.. ఒక సినిమాకో, ఒక సిరీస్ కో కల్కి పరిమితం కాదని.. మరిన్ని సినిమాలు, సిరీస్ లు వచ్చే అవకాశముంది అనిపిస్తోంది.
ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి సూర్యదేవర నాగేంద్రమ్మ (90) గురువారం 3 గంటల ప్రాంతంలో హృదయ సంబంధిత వ్యాధితో కన్నుమూశారు. ఆవిడకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. నిర్మాత చినబాబు ఆవిడకు రెండవ తనయుడు. అలాగే యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశీకి నాగేంద్రమ్మ నాయనమ్మ అవుతారు. చినబాబు సోదరుడి కుమారుడే నాగ వంశీ. రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఫిల్మ్ నగర్ లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
  అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు (mahesh babu) బావ ప్రముఖ హీరో సుదీర్ బాబు(sudheer babu) పరిస్థితి.  హీరోకి కావలసిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి .మంచి హైట్, ఫిజిక్, కలర్ ఇలా అన్ని ఉన్నాయి. పైగా మంచి పెర్ఫార్మర్ కూడా. కానీ ఎందుకో సరైన హిట్ పడలేదు. తన ఎంటైర్ కెరీర్ మొత్తంలో ప్రేమకధాచిత్రమ్  ఒక్కటే సూపర్ హిట్. దీంతో  ఇప్పుడు సుధీర్ కి అర్జెంటు గా హిట్ కావాలి. తాజా పరిస్థితులని చూస్తుంటే హిట్ కాదు బ్లాక్ బస్టర్  కొట్టేలా ఉన్నాడు.     హరోంహర (harom hara)సుదీర్ బాబు అప్ కమింగ్ మూవీ .టైటిల్ లోనే ప్యూర్  పాజిటివ్ వైబ్రేషన్స్ ని  నింపుకున్న ఈ మూవీ రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతుంది. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అయ్యింది.  బలవంతుడి కి ఆయుధం అవసరమైతే బలహీనుడుకి ఆయుధమే బలం అనే ఇంట్రెస్టింగ్  డైలాగ్ తో స్టార్ అయ్యింది. రెండు నిమిషాల ముప్పై ఆరు సెకన్లతో ఉన్న ట్రైలర్ ని చూస్తున్నంత సేపు కూడా సుధీర్ తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడని  అర్ధం అవుతుంది.అదే విధంగా మూవీ పక్కా హిట్ అనే విధంగా చాలా డైలాగ్ లు చెప్తున్నాయి. కత్తి ఉంటే పొడిపిచ్చుకునే వాడు భయపడతాడు.అదే  తుపాకీ ఉంటే  అందరు భయపడతారు. చావు చూసినా చలించలేదంటే నువ్వు మంచోడివి అనేది అబద్దం.అసలు మంచి చెడు అనేదే అబద్దం.ఇలాంటి డైలాగ్స్ చాలానే ఉన్నాయి.ఆ పక్కన ఉండే వాడికి చెప్పు. ఈ పక్కన ఒకడున్నాడనే డైలాగ్ అయితే సుధీర్ బాబు అణగారినవర్గాల నుంచి వచ్చి అందర్నీ శాసించే స్థాయికి ఎదగబోతున్నాడని అనుకోవచ్చు.  ఫైట్స్ కూడా ఒక రేంజ్ లో ఉండబోతున్నాయని తెలుస్తుంది. కుప్పం కి చెందిన వ్యక్తిగా సుధీర్ బాబు నటిస్తున్నాడు.బహుశా కుప్పం నేపథ్యంలో సినిమా రావడం ఇదే తొలిసారి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర క్రియేషన్స్ పతాకంపై  సుమంత్ జి. నాయుడు నిర్మిస్తుండగా జ్ఞానసాగర్ ద్వారా దర్శకుడు. చైతన్య భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తుండగా  మాళవిక శర్మ  హీరోయిన్. ట్రైలర్ లో  చూస్తుంటే నటనకి అవకాశం ఉన్న పాత్రనే ఆమె  పోషిస్తుందనే విషయం  ఆర్డమవుతుంది.నెక్స్ట్ మంత్ జూన్ 14 న రిలీజ్ కాబోతుంది.సుధీర్ బాబు మాస్ సంభవం పక్కా అనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. సునీల్ ,రవి కాలే , కేశవ్ దీపక్ లు కీలక పాత్రలని పోషిస్తున్నారు.కుప్పం అనగానే అందరకి చంద్రబాబు నాయుడు (chandrababu naidu) గుర్తుకొస్తారు.   
  ఈ భూమ్మీద ఉన్న అత్యంత అదృష్టవంతులు ఎవరంటే  ఓటిటి సినీ ప్రేక్షకులు అని చెప్పుకోవచ్చు. ఎంచక్కా  అన్ని భాషలకి చెందిన సినిమాలని  థియేటర్స్ లోకి వచ్చిన  తక్కువ వ్యవధిలోనే  వీక్షిస్తున్నారు. పైగా  డబుల్ బొనాంజాలా  బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా అలరించే  లిస్ట్ లో ఉంటున్నాయి. రీసెంట్ గా మరో బ్లాక్ బస్టర్ మూవీ వాళ్ళని కనువిందు చెయ్యనుంది. బడే మియా చోటే మియా(bade miyan chote miyan) బాలీవుడ్ అగ్ర హీరోలు అక్షయ్ కుమార్(akshay kumar) టైగర్ ష్రఫ్ (tiger shroff)లు  కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఏప్రిల్ పది న థియేటర్స్ లోకి అడుగు పెట్టింది. దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కగా విడుదలైన అన్ని చోట్ల మంచి విజయాన్ని సాధించింది. 350 కోట్ల రూపాయిల బడ్జట్ తో తెరకెక్కిన  ఈ మూవీ ఇప్పుడు  నెట్ ఫ్లిక్స్ వేదికగా జూన్ 6 న స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సదరు సంస్థ అధికారకంగా కూడా  ప్రకటించింది. ప్రత్యేకించి  తెలుగు ప్రేక్షకులకి ఇది నయా  గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే  బడే మియా చోటే మియా తెలుగు భాషలోను అందుబాటులోకి రానుంది.అంటే బడే మియా చోటా మియా తెలుగులో మాట్లాడబోతున్నారు.   ఇండియన్ ఆర్మీ లో పని చేసి మంచి గుర్తింపుని పొందిన బడేమియా చోటామియా ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల ఉద్యోగాన్ని కోల్పోతారు.  కొన్ని సంవత్సరాల తర్వాత ఆర్మీ కి ఆ ఇద్దరి అవసరం ఏర్పడుతుంది. ఆ అవసరం ఏంటి ? అందుకు ఆ ఇద్దరు ఒప్పుకున్నారా? ఒప్పుకుంటే  ఆ పనిని ఎలా గెలిచారు అనేదే కథ.మూవీ ఆద్యంతం  బడే మియా చోటేమియా పోరాటాలు  కనువిందు చేస్తాయి. మానుషీ చిల్లర్, అలయా ఎఫ్ హీరోయిన్ లు గా చేసారు. ఇమ్రాన్ హష్మీ విలన్ గా చెయ్యగా మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ ఒక ముఖ్య పాత్ర పోషించాడు.అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు. రకుల్ ప్రీత్ సింగ్ హస్బెండ్ జాకీ భగ్నానీ తో కలిసి  అలీ అబ్బాస్ జాఫర్  నే నిర్మించాడు. జూన్ 6 న దేశ వ్యాప్తంగా ఉన్న  సినీ ప్రేమికులు  ఓటిటి కి అతుక్కుపోవడం ఖాయం.    
Recently, rumours have been going around that the film Rakshas which was said to be directed by Prasanth Varma and headlined by powerhouse Ranveer Singh - the duo, decided to part ways on the project due to creative differences. Amid speculations from various industry sources, the makers and actor have now cleared their stance and addressed the ongoing developments.  Prasanth Varma, Mythri Movie Makers and Ranveer Singh have now clarified with their official statements.  Talking about it Ranveer Singh mentioned, “ Prasanth is a very special talent. We met and explored the idea of a film together. Hopefully we will collaborate on something exciting in the future.” Prasanth Varma said, “Ranveer’s energy and talent is rare to find. We shall manifest our forces combining soon sometime in the future. “  Both the parties including Mythri Movie Makers agree that everyone’s intentions were right to make it happen but something’s sometimes aren’t meant to be at that time.  The team shook hands with a promise to associate in times to come.
Hero Vijay Antony, well-known to South audiences through various films, is set to appear before the audience with the film "Toofan." Recently, his movie "Love Guru" achieved significant success in Telugu. "Toofan" is being produced by Kamal Bora, D. Lalitha, B. Pradeep, and Pankaj Bora under the banner of Infinity Film Ventures. This company previously produced "Raghavan" and "Hathya," both starring Vijay Antony. Directed by Vijay Milton, "Toofan" is a poetic action entertainer. The story revolves around a man who changed the future of a society that once looked down on him. Currently, the shooting of "Toofan" is in its final stages. The filming, set on an island, took place in Andaman and Diu Daman. The film is scheduled for a grand theatrical release in June. Recently, the teaser for "Toofan" was released at Hyderabad's Prasad Labs. During the event: Producer Vamsi Nandipati said: Producer Dhanunjayan is the reason I came to this event. I had the opportunity to meet Vijay Antony at his house, where he told me about his work on "Bichagadu 2." I was amazed. Vijay Antony is a hero not only on-screen but also in real life. He has bravely faced several challenges. There are two Vijays in this movie—Vijay Milton and Vijay Antony. With two Vijays, success is inevitable. All the best to the "Toofan" movie team. Writer Bhashyasree said: Vijay Antony has created a stylish action entertainer with "Toofan." I believe the film will generate significant box office returns, like a storm. This is the most stylish movie our director Vijay Milton has made in his career. Vijay Antony's performance is impressive. He has also composed the music for this movie along with Achu Rajamani. I wrote the songs and lyrics. "Toofan" features many well-known actors, and we aimed to make it feel like a straight Telugu movie. It will definitely be a hit. Producer Dhanunjayan said: "Toofan" is not just a commercial action entertainer; it includes all the elements of emotion and relationships. To give the audience a new experience, our director Vijay Milton chose unique locations like Andaman and Diu Daman for filming. "Toofan" has a huge cast, all of whom played good roles. Vijay Antony's movie "Love Guru" was watched by one million people on OTT. We believe that "Toofan" will be a super hit.. Director Vijay Milton said: There is a good craze for Telugu heroes and directors in Tamil. They are well-liked. I love the Telugu audience. My dream is to make a super hit movie in Telugu. The way they celebrate films is impressive. I have twenty years of friendship with Vijay Antony. Thank you, Vijay, for traveling with me all this time. We worked hard for two years on the movie "Toofan." This story takes place on an island and begins when a stranger enters an unfamiliar society. We planned to shoot in Andaman, but it wasn't possible as we thought. Instead, we shot in Goa, Daman, and Diu. The hero's character in the story is like the calm before the storm. Thanks to Bhashyasree for suggesting this title. We are coming to you with a big cast. Thanks to all our cast and crew who supported me in making "Toofan." Hero Vijay Antony said: "Toofan" is an action-packed movie. It will appeal to all sections of the audience. Our producers have invested significantly, ensuring high production values without compromising anywhere. Our director Vijay Milton has worked on many films as a cinematographer. He was the cinematographer for the Telugu film "Premitsa." It was a pleasure working with Vijay. Bhashyasree has been continuously traveling with me. This movie will also bring him good recognition. Producer Vamsi Nandipati, who will be associated with "Bicchagadu 2," has my thanks for attending this program. "Toofan" features a cast of well-known actors like Sathyaraj, Sarath Kumar, and Daali Dhanunjaya. We are planning to release it in June. I hope you all like it. My recent words about reviewers were not intended for everyone. The movie is our baby. Just as you would get angry if someone insults your baby, we feel hurt when someone criticizes our hard work. We mentioned that our movie could suffer due to reviews from a few people with bad intentions. It was a personal response. The media has the right to review movies, and I respect that freedom. Recently, some Telugu movies haven't been well received in theatres, but films like "Hanuman" and "Tillu Square" did well at the box office. If the content is good, the audience will surely come to the theatres.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
ప్రేమ ఒక మైకం అంటారు.  ప్రేమలో ఉన్నవారి ప్రపంచం వేరే ఉంటుంది.  అందులో మునిగి తేలుతూ ఉంటారు. ఇద్దరు వ్యక్తులు ప్రేమలో ఉన్నప్పుడు వారి మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేనప్పుడు వారి మధ్య బంధం చాలా లోతుగా ఉంటుంది. ఇలాంటి వారికి ప్రేమ మత్తులో ఉన్నారని అంటుంటారు.  ఇలా ప్రేమ మత్తులో ఉన్నప్పుడు ఏ పని చేయడానికి అయినా సంకోచించరు.  ఈ క్రమంలోనే ప్రేమికులు ప్రేమ మత్తులో కొన్ని పనులు చేసి తరువాత బ్రేకప్ అయ్యాక కుమిలిపోతుంటారు.  లవ్ లో ఉన్నవారు తమ పార్ట్నర్ మీద ఎంత ప్రేమ ఉన్నా సరే..  పొరపాటున కూడా కొన్ని పనులు చెయ్యకూడదని రిలేషన్ షిప్ నిపుణులు అంటున్నారు. ఇంతకీ లవ్ లో ఉన్నవారు చెయ్యకూడని పనులేంటో ఓ లుక్కేస్తే.. ఫొటోస్.. చాలామంది ప్రేమికులు ఇంచుమించు భార్యాభర్తల్లానే బిహేవ్ చేస్తుంటారు. పెళ్లి కాలేదు.. కలసి ఉండలేదు అనే విషయం మినహాయిస్తే అన్ని విధాలా ఓపెన్ అయిపోతుంటారు. కానీ చాలా క్లోజ్ గా ఉన్నాం కదా అని ప్రైవేట్ ఫొటోలను తమ పార్ట్నర్ తో పంచుకోకూడదు. ముఖ్యంగా అబ్బాయిలు నార్సిసిస్టక్ మెంటాలిటీ కలిగి ఉన్నవారు అయితే బ్రేకప్ తరువాత  అమ్మాయిలను బ్లాక్మెయిల్ చెయ్యడం,  వారి మీద ప్రతీకారం తీర్చుకోవడం వంటి వాటికి అమ్మాయిల ప్రైవేట్ ఫొటోలను ఉపయోగించే ప్రమాదం ఉంటుంది.   అంతే కాదు..  ఇలాంటి ఫొటోలు షేర్ చేయడం వల్ల సైబర్ నేరాల బాధితులు అయ్యే అవకాశం ఉంటుంది. ఏవైనా యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు ఫొటో గ్యాలరీకి పర్మిషన్ అడుగుతుంటాయి. ఈ ఫొటోలు సదరు యాప్ కు వెళ్లిపోతాయి. ఈ ఫొటోల ద్వారా కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతుంటారు. కాబట్టి ప్రైవేట్ ఫొటోస్ ఎట్టి పరిస్థితులలోనూ ఎవరికీ పంపకూడదు. బ్యాంక్ అకౌంట్.. బ్యాంక్ ఖాతా అనేది ఒక వ్యక్తి వ్యక్తిగత ఆర్ఠిక విషయం.  ప్రేమలో ఉన్నంత మాత్రాన బ్యాంక్ ఖాతా వివరాలు, ఆర్థిక విషయాలు పంచుకోవడం సబబు కాదు.  ప్రేమలో ఉన్నప్పుడు  లవ్ పార్ట్నర్ బ్యాంక్ అకౌంట్ వివరాలు అడిగితే సున్నితంగా అవన్నీ చెప్పడం ఇప్పుడు అంత అవసరం లేదని చెప్పాలి. కానీ కొందరు తమ లవ్ పార్ట్నర్ ఎక్కడ నొచ్చుకుంటారో అనే ఆలోచనతో అన్నీ చెప్పేస్తుంటారు.  లవ్ లో బ్రేకప్ వచ్చి విడిపోతే వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఆర్థిక సమస్యలలో కూడా చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. కుటుంబం.. ప్రేమలో ఉన్నవారు సంతోషం, దుఃఖం, బాధ వంటి విషయాలు అన్నీ ఓపెన్ గా చెప్పుకోవం మంచిదే కానీ కుటుంబం గురించి, కుటుంబంలో ఉన్న గొడవలు, సమస్యలు, కుటుంబ వ్యక్తిగత విషయాలు అన్నీ ఓపెన్ అయ్యి చెప్పుకోవడం మంచిది కాదు. ఇది కుటుంబానికి, కుటుంబంలో వ్యక్తుల గౌరవానికి ఎప్పటికైనా ఇబ్బందే. చనువుతో ఓపెన్ అయ్యి చెప్పుకున్న కొన్ని విషయాలు తరువాత బ్రేకప్ అయినప్పుడు నలుగురికి చాలా సులువుగా చేరిపోతాయి. అప్పుడు ఎవరికి వారు వారి కుటుంబ పరువును, గౌరవాన్ని తగ్గించుకున్నట్టు అవుతుంది. రహస్యాలు.. ఇప్పటి కాలంలో పరిచయాలు చాలా తొందరగా జరిగిపోతాయి. అదే విధంగా దగ్గరితనం కూడా తొందరగా వచ్చేస్తుంది. కానీ ఆ బందం ఏదైనా నిలబడటమే కష్టంగా ఉంటుంది. ఒకరి నుండి విడిపోయాక మళ్ళీ ఇంకొకరితో పరిచయం కావడం, వారితో మళ్ళీ దగ్గరి తనం ఏర్పడటం, అది కాస్తా ప్రేమకు దారితీయడం చాలా వేగంగా జరుగుతాయి.  ఈ క్రమంలో ఎవరితోనూ గతానికి సంబంధించి  విషయాలు ఓపెన్ అయ్యి చెప్పుకోకూడదు.  దీనివల్ల వ్యక్తిత్వం మీద దారుణమైన ముద్రలు, అవమానాలు ఎదురవుతాయి.
చాలామంది సంకల్పబలం, క్రమశిక్షణల గురించి ఓ అరగంట ప్రసంగించమంటే తడుముకోకుండా మాట్లాడతారు. కానీ వాటిని పాటించే విషయంలోనే వస్తాయి చిక్కులన్నీ. తమ దాకా వచ్చేసరికి అవి అందరికీ సాధ్యం కాదని తేల్చేస్తారు. అది పుట్టుకతోనే రావాలని చల్లగా జారుకుంటారు. అలాంటి వారికి సమాధనమే ఈ కింది విషయాలు.. దృఢనిర్ణయాలు తీసుకోవాలంటే? ...  మీ మానసిక బలాన్ని పరీక్షించుకొని, పెంపొందించుకొనే మార్గాల్లో ముఖ్యంగా ప్రతి నిత్యం జీవితంలో కొన్ని ఇష్టం లేని, కష్టంగా కనిపించే పనుల్ని చేయడం ఒకటి. అలా తరచూ సాధన చేయాలి. వీటి వల్ల ప్రయోజనాలు కలుగుతాయని తెలిసినా మీ మనసు ఆ పనుల్ని ఏదో ఒక వంకతో వ్యతిరేకిస్తూనే ఉంటుంది. అయినా సరే ఆ పనులు చేయాలి. అలా చేయడం ద్వారా మీ మెదడులో నిక్షిప్తమైన వ్యతిరేక భావాలను అధిగమించగలుగుతారు. అంతర్గతంగా ఉన్న వ్యతిరేక శక్తులను అధిగమించడం ద్వారానే మనకు అవసరమైన అంతర్గత శక్తిని మేల్కొల్పగలం. ఉదాహరణకు మీరు బస్సులో ప్రయణిస్తున్నారనప్పుడు సీటు దొరికితే హాయిగా కూర్చుంటారు, లేకపోతే తప్పదు కాబట్టి నిలబడి ప్రయాణిస్తారు. ఒకవేళ మీకు సీటు దొరికినా సరే ఆ సీటును ఇంకొకరికి ఇవ్వండి. ఓ పదిహేను లేదా ఇరవై నిమిషాలు నిలబడి ప్రయాణించండి. ఈ చిన్న విషయంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, మీలోని మానసిక నిరోధ భావాలను గమనించండి. అయినా మనస్సు మాట వినకుండా ఇంకొకరికి ఆ సీటు ఇచ్చి, ప్రయాణం చేయండి. ఆ తరువాత చూడండి. మీరు ఈ నిరోధ భావాల నుంచి బయటపడడానికి చేసిన సంఘర్షణ, చివరికి సాధించడం చూస్తే మీలో మీకే తెలియని ఆత్మవిశ్వాసం, ధైర్యం కలుగుతాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు, అర్జునుడితో మానసిక దౌర్బల్యాన్ని జయించాలని చెబుతూ ఎవరికైనా మనస్సును అదుపులో ఉంచుకోవడం దుస్సాధ్యమే, కానీ అభ్యాస, వైరాగ్యాల ద్వారా దాన్ని సాధించవచ్చని బోధిస్తాడు. మీ ఇంట్లోని వారికి వారి పనుల్లో ఎప్పుడైనా సహాయం చేశారా?  ఈసారి ఈ విధంగా ప్రయత్నించండి! నేరుగా వంటింట్లోకి వెళ్ళి అమ్మతో "అమ్మా! నేను ఏదైనా సహాయం చేయనా?” అని అడగండి, ఎప్పుడూ ఆ మాట అడగని మీరు ఈ ప్రశ్న వేసేసరికి ఆవతలివారు కాస్త కంగారు పడి, మిమ్మల్ని కొత్తగా చూడడం సహజమే. అయినా సరే, వంటిల్లు సర్దడంలోనో, కూరలు తరగడంలోనో, గిన్నెలు కడగడంలోనో సహాయం చేయండి. అది చిన్న పనే అయినా, మీకిష్టం లేని పని చేసిన తరువాత ఒక్కసారి వారి కళ్ళలోని ఆ వెలుగును చూడండి. రెండూ మిమ్మల్ని సంకల్ప బలం వైపు నడిపిస్తాయి.  ఒక్కోసారి మీరు అలసిపోయి ఇంటికొస్తారు. రాగానే మీ శరీరాన్ని సోఫాలో పడేసి అందుబాటులో ఉన్న టీవీ రిమోట్ తీసుకొని, అలా ఎంతసేపు ఛానల్స్ మారుస్తూ కూర్చుంటారో మీకే తెలియదు. అప్పుడు స్నానం చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ బద్దకం మీ కన్నా బలమైంది కాబట్టి, అది అక్కడ నుంచి లేవనీయదు. అయితే ఈ సారి మీ బద్ధకం మాట వినకండి. కష్టమైనా సరే లేచివెళ్ళండి. చేయాలనుకున్న పని వాయిదా వెయ్యకుండా చేయండి. అప్పుడు చూడండి మీపై మీకే తెలియని దృఢత్వం,  ఒక నమ్మకం, ధైర్యం కలుగుతాయి. ప్రయత్నిస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది. ఒకరోజు మీరు కాఫీ, టీ, పాలల్లో చక్కెర లేకుండా తాగేందుకో లేదా కనీసం పెరుగన్నంలో ఉప్పు లేకుండా తినేందుకో ప్రయత్నించండి. మీ కన్నా ముందు మీ నాలుక ఈ ప్రయోగానికి ఒప్పుకోదు. దాన్ని జయించడానికేగా ఈ ప్రయత్నమంతా! అలాగే వేడినీళ్ళ  స్నానం అలవాటున్న వాళ్ళు వరుసగా వారం రోజులు చన్నీటి స్నానం చేసి మీలోని శారీరక, మానసిక నిబ్బరాన్ని పరీక్షించి సాధించండి. చదువుకునేటప్పుడు కష్టమైన సబ్జెక్టుతో వాయిదా వేయకుండా పోరాడండి. కొన్ని మాటలు మాట్లాడే కన్నా మాట్లాడకుండా ఉంటేనే ఎక్కువ ప్రయోజనం ఉన్నప్పుడు మౌనాన్ని ఆశ్రయించండి. మీ ఉద్వేగాన్ని అదుపులో ఉంచుకోండి.  ఇలా అన్నీ ఒక్కొక్కటిగా మీ జీవితంలో ఫాలో అయ్యారంటే మీ మీద మీరు విజయం సాధిస్తారు కచ్చితంగా.                                      ◆నిశ్శబ్ద.
ఆడుకోవడం అందరికీ ఇష్టం అయితే ఓ వయసు దాటిన తరువాత పిల్లల్లా ఆడుకోలేం. అయితేనేం ఆడుకోవాల్సినవి ఆడుకోవచ్చు. చక్కగా నెంబర్స్ తో కాలక్షేపం చేయచ్చు. సాధారణంగా దినపత్రికలు,  సండే స్పెషల్ బుక్స్ లో నెంబర్స్ తో మ్యాజిక్ చేసే సుడోకు చూసే ఉంటారు. కొందరికి ఈ సుడోకు పూర్తీ చేయడం ఎంతో ఇష్టం. 1నుండి 9 అంకెలను నిలువుగానూ, అడ్డుగానూ ఎటు కూడినా 9 వచ్చేలా, అంకెలు ఏ వరుసలోనూ రిపీట్ కాకుండా  ఉండటం దీని విశిష్టత. ఇది మెదడును చురుగ్గా మారుస్తుంది. తెలివితేటలు పెంచుతుంది. పిల్లలలో చదువుపట్ల ఏకాగ్రతను పెంచుతుంది. ఇలా ఎన్నో ఉపయోగాలున్న సుడోకుకు ఓ రోజును కేటాయించారు. ఈ రోజున సుడోకు గురించి చర్చిస్తారు.  అయితే ఈ సుడోకు ఎప్పుడు ఎక్కడ పుట్టింది? దీని వెనుక చరిత్ర ఏంటి?  పూర్తీగా తెలుసుకుంటే.. 1892లో ఫ్రెంచ్ వార్తాపత్రిక "La Siecle" సుడోకుకు సమానమైన గేమ్‌ను ముద్రించింది, అందులో ప్రతి అడ్డు వరుస,  నిలువు వరుస అన్ని నిర్దేశిత సంఖ్యలను కలిగి ఉండాలి, కానీ సుడోకులా కాకుండా, ఇది 9 కంటే ఎక్కువ సంఖ్యలను కలిగి ఉంటుంది. ఇందులో ఎన్నో గణితానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్లియర్ చెయ్యాల్సి ఉంటుంది.  ఇవి ఎంతో తర్కంతో కూడుకుని ఉంటాయి. ఆ తరువాతి సంవత్సరాల్లో ఇతర ఫ్రెంచ్ పేపర్‌లు ఇలాంటి గేమ్‌లతో ట్రెండ్‌ను వ్యాప్తి చేశాయి. కానీ ఏదీ సుడోకుతో సమానంగా లేదు.  మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే సమయంలో ఆ గేమ్‌ల ప్రజాదరణ క్షీణించింది. 1979లో  ఇండియానా ఆర్కిటెక్ట్ హోవార్డ్ గార్న్స్ "డెల్ మ్యాగజైన్"లో తన స్వంత ఆవిష్కరణ  ద్వారా పజిల్ ను రూపొందించారు. దీన్ని అప్పటిలో "నెంబర్ ప్లేస్" అని పిలిచారు. దాన్నే ఇప్పుడు  సుడోకు అని పిలుస్తున్నారు. అయితే గార్న్స్ తన కనుగొన్న ఆవిష్కరణ అంతర్జాతీయ సంచలనంగా మారడాన్ని చూడకుండానే కన్నుమూశారు.  మిలియన్ల మంది  సుడోకు ఆడే ఆటగాళ్ళతో  మొదటిసారి సుడోకు అనే పేరును పొందింది. 1997లో, హాంకాంగ్ న్యాయమూర్తి వేన్ గౌల్డ్ ప్రత్యేకమైన సుడోకు పజిల్‌లతో కూడిన కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను కనుగొన్నారు. అతను UKలోని వార్తాపత్రికలకు రోజువారీ పజిల్ ఫీచర్‌గా గేమ్‌ను అందించాడు. దీని వల్ల  తొందరలోనే సుడోకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక ఇప్పుడు సుడోకు స్మార్ట్‌ఫోన్ యాప్‌లలో తక్షణమే అందుబాటులో ఉంది.  పేపర్లు మరియు మ్యాగజైన్‌లలో విస్తృతంగా అచ్చవుతోంది. 2013లో వరల్డ్ పజిల్ ఫెడరేషన్ సెప్టెంబరు 9ని అధికారిక అంతర్జాతీయ సుడోకు దినోత్సవంగా ప్రకటించింది.  అప్పటి నుండి  దీనిని జరుపుకుంటున్నారు. బ్రిటీష్ TV స్టేషన్ “ఛానల్ 4” తన టెలిటెక్స్ట్‌లో రోజువారీ సుడోకు పజిల్‌ను చేర్చడం 2005 నుండి ప్రారంభించింది.  ప్రోగ్రామ్ గైడ్ “రేడియో టైమ్స్” వారానికోసారి, 16x16 గ్రిడ్ లతో “సూపర్ సుడోకు”ను ప్రారంభించింది. 2006లో సుడోకు అనే అంశం పై నెంబర్లను చేర్చడం, వరుసలు కూర్చడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ  పీటర్ లెవీ ఒక పాటను క్రియేట్ చేశారు. ఆస్ట్రేలియాలో మిలియన్ డాలర్ల డ్రగ్ ట్రయల్ పన్నెండు మంది జ్యూరీలలో ఐదుగురు సాక్ష్యాలను వినడానికి బదులుగా సుడోకు ఆడుతున్నట్లు కనుగొన్నారు. అప్పుడు ఈ ట్రయల్ రద్దు చేశారు. ఇది 2008లో జరిగింది. 2013లో వరల్డ్ పజిల్ ఫెడరేషన్ సెప్టెంబరు 9ని అంతర్జాతీయ సుడోకు దినోత్సవ వార్షిక తేదీగా నిర్ణయించింది.  ఇందులో  బోలెడు రౌండ్లతో కూడిన ఆన్‌లైన్ పోటీలను నిర్వహిస్తోంది.                                                  *నిశ్శబ్ద.  
భారతీయులకు మిర్చి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన రోజువారీ జీవితంలో మిరపకాయలు లేనిదే పనిజరగదు. ఆయుర్వేదపరంగా కూడా మిర్చిని మితంగా తీసుకుంటే ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. వంటకాల్లో ఎండుకారం కంటే మిరపకాయలు వేసుకోవడమే ఆరోగ్యమని సూచిస్తుంటారు. అమెరికాలో జరిగిన ఓ పరిశోధన అయితే పండు మిరపకాయల వల్ల ఏకంగా ఆయుష్షే పెరుగుతోందని చెబుతోంది.   అమెరికాలోని వెర్మోంట్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మిరపకాయలకీ, ఆరోగ్యానికి మధ్య సంబంధాన్ని తెలుసుకునేందుకు కొన్ని గణాంకాలను సేకరించారు. ఇందుకోసం పదహారు వేలమంది అమెరికన్లకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు 23 ఏళ్లపాటు వీరి ఆరోగ్య వివరాలను నిశితంగా గమనించారు. తాము సేకరించిన వివరాలలో పండు మిర్చి తినే అలవాటు కల్గినవారు కాస్త భిన్నంగా ఉన్నట్లు పరిశోధకులకు తోచింది. యువకులు, మంచి తిండిపుష్టి కలిగినవారు, మగవారు పండుమిరపకాయలను ఎక్కువగా తీసుకుంటున్నట్లు గమనించారు. తక్కువగా చదువుకుని చిన్నపాటి జీతాలతో బతికేవారిలో మిర్చిని తినే అలవాటు ఎక్కువగా కనిపించింది. (కాస్త జాగ్రత్తగా గమనిస్తే మన దేశంలో కూడా ఎండుమిర్చిని తినేవారు ఈ కోవకే చెందడాన్ని గమనించవచ్చు)   ఆశ్చర్యకరంగా పండుమిర్చి తినేవారిలో గుండెపోటు లేదా పక్షవాతంతో చనిపోయే అవకాశం ఏకంగా 13 శాతం తక్కువగా కనిపించింది. పండుమిరపకాయలు తినేవారు తప్పనిసరిగా సుదీర్ఘకాలం బతుకుతారన్న హామీని ఇవ్వలేం కానీ.... వారిలో కొన్నిరకాల ఆరోగ్యసమస్యల తాకిడి తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు. మిర్చిలో ఉండే కేప్సైసిన్ (CAPSAICIN) వంటి పదార్థాల వల్ల రక్తప్రసారం మెరుగుపడుతుందనీ, శరీరంలోని హానికారక క్రిములు నశిస్తాయనీ భావిస్తున్నారు. రుచి, రంగు ఉండని ఈ కేప్సైసిన్ వల్ల మన కణాల మీద ఉండే Transient Receptor Potential (TRP) అనే వ్యవస్థ ఆరోగ్యవంతంగా ఉంటుందట. ఇది కూడా దీర్ఘాయుష్షుకి కారణం అని నమ్ముతున్నారు.   పండుమిర్చి వల్ల ఉపయోగాలు ఉన్నాయంటూ శాస్త్రవేత్తలు ధృవీకరించడం ఇది మొదటిసారేం కాదు! మనలోని కొవ్వుపదార్థాలను విడగొట్టి ఊబకాయం దరిచేరకుండా చేయగల సమర్థత మిర్చికి ఉందని ఈపాటికే తేలిపోయింది. ఒంట్లో కొవ్వు పేరుకోకపోతే గుండె కూడా దృఢంగానే ఉంటుంది కదా! తాజా పరిశోధన ఈ విషయాన్నే రుజువులతో సహా నిరూపించింది. కాకపోతే మోతాదుకి మించి కారాన్ని తీసుకుంటే మాత్రం నానారకాల ఆరోగ్యసమస్యలూ దరిచేరక తప్పవంటున్నారు వైద్యలు. మితంగా తీసుకుంటే ఏ ఆహారం వల్లనైనా ఉపయోగమే అని పెద్దలు ఊరికే అనలేదు కదా. - నిర్జర.  
టీ తాగడం  ఆరోగ్యానికి మేలు చేస్తుందా లేదా హానికరమా? అనే విషయం గురించి  చాలా కాలంగా చర్చ నడుస్తూనే ఉంది. టీని మితంగా తీసుకుంటే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా బ్లాక్ టీ ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని అందరూ అంటుంటారు. పరిశోధకులు కూడా ఇప్పుడు ఇదే విషయం చెబుతున్నారు. బ్లాక్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.  గుండె నుండి గట్ వరకు ఇంకా  మధుమేహం నుండి బరువు నియంత్రణ వరకు చాలా సమస్యలలో బ్లాక్ టీ మంచి ప్రయోజనాలు చేకూరుస్తుంది.  కరోనా  సమయంలో బ్లాక్ టీ చాలా చర్చనీయాంశమైంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని తెలిసింది, ఇది  అంటు వ్యాధుల శరీరాన్ని సురక్షితంగా ఉంచడానికి సహాయపడుతుంది. బ్లాక్ టీలోని కెఫిన్.. బ్లాక్ టీ లో ఉండే కెఫిన్ మధుమేహం నుండి గుండె జబ్బుల వరకు ప్రతిదానికీ ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే కెఫిన్ మూత్రపిండాలకు హానికరమని కొందరు చెబుతుంటారు.    టీ,  కాఫీలలో  కెఫీన్ ఉండటం సాధారణం. ఇది మూత్రపిండాలకు మంచితో పాటు చెడు కూడ చేస్తుంది. ఇదంతా ఎంత టీ తీసుకుంటున్నాం అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది.  మూత్రపిండాలపై కెఫీన్  దుష్ప్రభావాలు ఎంతంటే.. కెఫిన్ మూత్రపిండాలకు ప్రయోజనం చేకూరుస్తుందని పరిగణించబడుతున్నప్పటికీ, ఇది  దుష్ప్రభావాలను కూడా కలిగి ఉంటుంది. కెఫిన్  రక్తపోటును ప్రభావితం చేస్తుంది.  అధికంగా కెఫిన్ తీసుకోవడం సిస్టోలిక్,  డయాస్టొలిక్ రక్తపోటు రెండింటినీ పెంచుతుంది. కిడ్నీ వ్యాధికి అధిక రక్తపోటు ప్రధాన ప్రమాద కారకం కాబట్టి, కెఫిన్ అధికంగా ఉండే ఆహారాలు మూత్రపిండాల సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. బ్లాక్-టీ లో ఆక్సలేట్ గురించి తెలుసా?? బ్లాక్ టీలో కనిపించే ఆక్సలేట్  మూత్రపిండాలకు చాలా హానికరమైనది.  బ్లాక్ టీలో   కరిగే ఆక్సలేట్  సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఈ ఆక్సలేట్లు కాల్షియంతో కలుస్తాయి. ఇవి స్ఫటికాలను ఏర్పరుస్తాయి, ఇది మూత్రపిండాల్లో రాళ్లకు దారితీస్తుంది. ఈ కారణంగానే బ్లాక్ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉందని చెబుతారు  నిపుణుల సలహా ఏమిటంటే.. బ్లాక్ టీ  ఆరోగ్యానికి మేలు చేసేదే, ఈ విషయం పరిశోధనల్లో కూడా తేలింది.   ఇది గుండె జబ్బులను తగ్గించడంలో,  కొలెస్ట్రాల్,  రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. కానీ ఇదంతా బ్లాక్ టీ ని మితంగా తీసుకోవడం వల్ల మాత్రమే కలిగే ప్రయోజనం. బ్లాక్ టీ ని  ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. రోజులో రెండు కప్పులకు మించి బ్లాక్ టీ తాగడం ప్రమాదం.                             *నిశ్శబ్ద.