బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది.  గత కొంతకాలంగా తెలంగాణ జాగృతి వేదికగా రాజకీయాలు చేస్తున్న కల్వకుంట్ల కవిత సొంతంగా ఓ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె తాను ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీకి ముహూర్తం కూడా ఖఱారు చేశారు.  గురువారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ ఏడాది మే మొదటి వారంలో తాను కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.   తాను ఏర్పాటు చేయనున్న కొత్త పార్టీ పేరులో తెలంగాణ పదం కచ్చితంగా ఉంటుందని కవిత చెప్పారు.  రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తాను పోటీ చేస్తానని స్పష్టం చేసిన ఆమె.. ఆ పోటీ ఎక్కడ నుంచైనా ఉండొచ్చన్నారు. అయితే తన మొదటి చాయిస్ మాత్రం సిద్దిపేటేనని చెప్పారు. ఇక రెండో చాయిస్ బోధన్ అని చెప్పిన కవిత.. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేదిగా తన పార్టీ పేరు ఉంటుందన్నారు.   ఇటీవల కాలంలో తెలంగాణ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జనం బాట అనే కార్యక్రమం చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా కవిత పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కరించాలని కాంగ్రెస్ సర్కార్‌కు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈనెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆమె మద్దతుదారులను ఏఐబీఎఫ్ పార్టీ బీ-ఫామ్‌పై పోటీ చేయించి తమ ఉనికిని చాటుకున్నారు     
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుపై అనుచిత భాషలో దూషణలకు పాల్పడిన కేసు సహా మరో రెండు కేసులలో జైలు పాలైన సంగతి తెలిసిందే. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 18 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా జైలు జీవితం గడిపిన అంబటి కోర్టు బెయిలు మంజూరు చేయడంతో బుధవారం (ఫిబ్రవరి 18) విడుదలయ్యారు. జైలు నుంచి విడుదల అయిన తరువాత మీడియాతో మాట్లాడిన అంబటి తనదైన శైలిలో వింత వ్యాఖ్యలు చేశారు. జైలు అధికారులు వారి విధులు వారు నిర్వహించారన్నారు. తనకు జైల్లో ప్రత్యేక సదుపాయాలేమీ కల్పించలేదన్నారు. అందుకు కోర్టు అనుమతి ఇవ్వలేదని చెప్పుకొచ్చిన ఆయన జైల్లో భోజనం ఏ మాత్రం బాలేదని చెప్పారు. అయినా తాను సద్దుకుని ఆ తిండే తిన్నానని చెప్పారు.  అక్కడితో ఆగకుండా, తాను చాలా చాలా ధనవంతుడినని చెప్పుకున్నారు. తనకు జైలు భోజనం ఇసుమంతైనా నచ్చలేదనీ, కానీ ఆ విషయంలో తాను చేయగిగిందేమీ లేకపోవడంతో  ఆ భోజనమే తిన్నానని చెప్పారు. తనకు జైలు భోజనం నచ్చలేదని చెప్పడాన్ని ఎవరూ తప్పుపట్టరు కానీ, తాను ధనవంతుడిననీ, అటువంటి తనకు జైలు కూడు తినిపించారనీ అనడంపై నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు. 18 రోజుల పాటు జైలు భోజనం చేసినా అంబటి రాంబాబులో ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదనీ, కొంచం కూడా చిక్కలేదనీ.. ఆయనీ ఫిట్ నెస్ మెయిన్ టెయిన్ చేయాలంటూ ఇంట్లో కూడా జైలు భోజనం చేసే అవకాశాలను పరిశీలించాలంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు.  
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఈ నెల 24న భేటీ కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అధ్యక్షతన జరగనున్న ఈ మంత్రివర్గ సమావేశం   స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్ఐపీబీ) ఆమోదించిన రూ.29,021 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయనుంది.   ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 24 మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడి సచివాలయంలో  కేబినెట్ సమావేశం జరగనుందని సీఎస్ విజయానంద్ బుధవారం (ఫిబ్రవరి 18)  ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేబినెట్ భేటీకి సంబంధించి ప్రతిపాదనలను నిర్ణీత ఫార్మాట్ లో 23వ తేదీలోగా పంపాలని అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులకు అధికారిక సమాచారం అందజేశారు. ఇలా ఉండగా ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చిచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  
ALSO ON TELUGUONE N E W S
జనవరిలో పెద్ద సినిమాల సందడి బాగానే ఉంది కానీ, ఫిబ్రవరిలో ఎక్కువగా చిన్న సినిమాలే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. గత వారం 'ఫంకీ', 'కపుల్ ఫ్రెండ్లీ', 'సీతా పయనం' వంటి సినిమాలు విడుదల కాగా ఈ వారం 'హే బల్‌వంత్', 'నవాబ్ కేఫ్' సినిమాలు విడుదలవుతున్నాయి. హే బల్‌వంత్: (Hey Balwanth) సుహాస్, శివాని నగరం జంటగా గోపి అచ్చర దర్శకత్వంలో రూపొందిన మూవీ 'హే బల్‌వంత్'. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ నిర్మించిన ఈ మూవీ, ఫిబ్రవరి 20న థియేటర్లలో అడుగుపెడుతోంది. అసలు ఈ చిత్ర టైటిల్ 'హే భగవాన్' కాగా.. సెన్సార్ అభ్యంతరం తెలపడంతో చివరి నిమిషంలో 'హే బల్‌వంత్'గా మార్చారు. హీరో ఫ్యామిలీ చేస్తున్న సీక్రెట్ బిజినెస్ ఏంటి? అంటూ ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఎలా ఉంటుందో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. నవాబ్ కేఫ్: (Nawab Cafe) శివ కందుకూరి, తేజు అశ్విని, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'నవాబ్ కేఫ్'. ప్రమోద్ హర్ష దర్శకుడు. హర్షిక ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం, ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి కూడా మొదట అనుకున్న టైటిల్ 'చాయ్ వాలా'. సెన్సార్ అభ్యంతరంతో 'నవాబ్ కేఫ్'గా మారింది. విదేశాలకు వెళ్ళాలి, గొప్పగా బతకాలని కలలు కనే చాయ్ వాలా కొడుకు కథగా ఇది తెరకెక్కింది.  ఓటీటీలోనూ ఈ వారం పలు సినిమాలు సందడి చేయనున్నాయి. భర్త మహాశయులకు విజ్ఞప్తి, శ్రీ చిదంబరం గారు వంటి సినిమాలు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ఈటీవీ విన్: శ్రీ చిదంబరం గారు మూవీ - ఫిబ్రవరి 19  నెట్ ఫ్లిక్స్: చథా పచ్చ మూవీ -  ఫిబ్రవరి 19  ప్రైమ్ వీడియో: 'తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ' మూవీ - ఫిబ్రవరి 19 జీ5: భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ - ఫిబ్రవరి 20  రాక్షస వెబ్ సిరీస్ - ఫిబ్రవరి 20  జియో హాట్ స్టార్: లక్కీ ది సూపర్ స్టార్ మూవీ - ఫిబ్రవరి 20  Also Read: ప్రభాస్ గురించి వినిపిస్తున్న ఆ షాకింగ్ న్యూస్ నిజమేనా?    
Speculations regarding the highly anticipated collaboration between Superstar Prabhas and director Prasanth Varma have been put to rest by the production house. Hombale Films, the makers behind the project, officially addressed the ongoing rumors, stating that all current claims are baseless. The producers emphasized that any development regarding the film will be communicated through official channels at the appropriate time. The project is currently in its extensive planning stages, with production scheduled to begin only after Prabhas completes his existing commitments. Despite the online buzz, the team clarified that the creative process is moving forward steadily and there is no rush to take the film to the sets. The makers are prioritizing the scale and quality of the film to ensure Prasanth Varma’s ambitious vision is executed perfectly. Coordinating the dates of a global star like Prabhas requires meticulous planning, and the production team is dedicated to getting every detail right before the launch. Currently, Prabhas is occupied with Kalki 2, Fauji, and Spirit, while Prasanth Varma is busy with Jai Hanuman and other creative ventures. Having previously delivered the blockbuster Salaar, Hombale Films promised that this upcoming combination with Prabhas will be twice as exciting for the audience.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Pawan Kalyan defines onscreen charisma and magnetic presence. His massive craze among the audience remains unparalleled, and to celebrate this phenomenon, the makers of his upcoming film, Ustaad Bhagat Singh, have unveiled a special single titled AURA. The film marks the exciting reunion of Pawan Kalyan with director Harish Shankar, the duo behind the cult blockbuster Gabbar Singh. Produced by the prestigious Mythri Movie Makers, the project has already generated massive buzz. The newly released song promo has sent fans into a frenzy, featuring a powerful and magnanimous tune by Rockstar Devi Sri Prasad that is guaranteed to give listeners goosebumps. The visuals perfectly complement the high-energy track, showcasing the Power Star’s trademark style, swag, and iconic mannerisms. By incorporating footage of fans replicating his unique flair, the makers have crafted a true anthem for his followers. The full song is scheduled for a grand release on 22nd February. As the anticipation reaches a fever pitch, Ustaad Bhagat Singh is gearing up for a worldwide theatrical release on 26th March. This high-octane actioner features Sreeleela and Raashii Khanna as the leading ladies. With Harish Shankar presenting Pawan Kalyan in a never-seen-before mass avatar, expectations for the film are sky-high. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
Ace producer-distributor Dil Raju is making major waves in the trade circuit by aggressively securing high-profile projects. In a move to strengthen his dominance in the Telugu states and overseas, he has recently closed theatrical deals for two highly anticipated films: the sports drama Biker and the Tharun Bhascker starrer Gaayapadda Simham. Biker, featuring Sharwanand and Dr. Rajashekhar, has been acquired by Raju for approximately ₹20 crore for the AP and Telangana regions. Directed by Abhilash Reddy Kankara and produced by UV Creations, this high-octane motorsport film is being hailed as India’s first motocross racing drama. With music by Ghibran and a grand release planned for April 3, 2026, the deal highlights Raju's confidence in Sharwanand’s box-office pull and the film's unique racing backdrop. Simultaneously, Dil Raju has sealed the deal for Gaayapadda Simham for a fancy price of ₹6 crore, covering AP/TS and overseas rights. Starring Tharun Bhascker, Faria Abdullah, and Maanasa Choudhary, the film is a witty take on contemporary issues—including a humorous subversion of US immigration struggles. Directed by Kasyap Sreenivas and presented by Pavan Sadineni, the film has already created massive buzz with its teaser. These strategic acquisitions by Dil Raju signal a robust summer 2026 season for his distribution house, Sri Venkateswara Creations. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ మేకర్స్ నుంచి రాబోతోన్న మరో ఇంట్రెస్టింగ్, క్రైమ్, థ్రిల్లర్ మూవీ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ చిత్రానికి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. (D/O Prasad Rao Trailer) ‘అమ్మికి ఏమైందో అని భయంగా ఉంది రమేషా’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ను ఓపెన్ చేశారు. ఆ తరువాత కూతురి మీద తండ్రికి ఉన్న ప్రేమను చూపించారు. ‘నాకు జాబ్ ఎక్కడ వచ్చిందో తెలుసా?’.. ‘ఫస్ట్ జీతం రాంగానే తీసుకెళ్లి మా నాన్న చేతిలో పెట్టాలి’ అని చెప్పే డైలాగ్స్‌తో కూతురికి తండ్రి మీదున్న ప్రేమను చూపించే ప్రయత్నం చేశారు. ఆ తరువాత కూతురు మిస్ అవ్వడం, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమయ్యే సీన్లతో ట్రైలర్ ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ‘కళ్ల ముందే ఏదో ఉంది.. కానీ నేను ఏదో మిస్ అవుతున్నాను.. నేను ఏం మిస్ అవుతున్నాను’ అని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రెబెకా జోసెఫ్ పాత్రలో ఉదయ భాను చెప్పిన డైలాగ్స్‌తో చాలానే ట్విస్టులు సినిమాలో ఉన్నాయని అర్థం అవుతోంది. ఇక స్వాతి అనే అమ్మాయి ఎలా మిస్ అయింది? దీని వెనుకున్నది ఎవరు? హాస్టల్‌లో స్నేహితులు కారణమా? ఆఫీసులో గొడవలా? ఈ కేసులో తండ్రి పాత్ర ఏంటి? అనే పలు రకాల ప్రశ్నల్ని లేవనెత్తేలా ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశారు. ఇక ఈ మిస్టరీలు తేలాలంటే ఫిబ్రవరి 27 వరకు ఆగాల్సిందే. జీ5లో ఈ మూవీని ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి మైదాల శృతి మాటల్ని రాయగా.. శ్రీ రామ్ మద్దూరి నేపథ్య సంగీతాన్ని అందించారు. ఇక ఈ చిత్రానికి చంద్రశేఖర్ జి.వి. ఎడిటర్‌గా, రామ్ కె మహేష్ కెమెరామెన్‌గా పని చేశారు.   
  -సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ  -డ్రాగన్ ప్లేస్ లో ఆ టైటిల్ వచ్చిందా! -రూమరా, నిజామా! -ఇంతకీ ఆ టైటిల్ ఏంటి  కొన్నిసార్లు రూమర్స్ అనేవి మూవీ లవర్స్ కి మంచి కిక్ ని ఇస్తాయి. ఇక అభిమానులకైతే చెప్పక్కర్లేదు. సదరు రూమర్ ఇచ్చే కిక్ స్థాయిని కొలవడం అత్యంత సాంకేతిక నిపుణుల బృందం వల్ల కూడా కాదు. దీంతో ఒక్కోసారి రూమర్ కోసమే  సోషల్ మీడియాని వెతికే పరిస్థితి వస్తుంది. తద్వారా రోజులు మారాయి ఒరిజినల్ బాబు అని రూమర్ సగర్వంగా లైక్స్ ని అందుకునే పనిలో బిజీ అవుతుంది. రూమర్ కి ఆ అధికార హోదా కల్పించింది మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)అప్ కమింగ్ మూవీ. అసలు మ్యాటర్ లోకి వెళ్దాం. ఎన్టీఆర్ తన అప్ కమింగ్ మూవీని 'ప్రశాంత్ నీల్(Prashanth Neel)తో చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అరబ్ కంట్రీ 'జోర్డాన్‌'లో షూట్ జరుగుతుంది. డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉన్నా అధికారంగా మాత్రం ధ్రువీకరించలేదు. ఇప్పుడు ఈ మూవీకి టైటిల్ గా 'బ్రూస్‌లీ'(Bruslee)పేరుని పరిశీలిస్తున్నట్టుగా సినీ సర్కిల్స్ లో ఒక రూమర్ చక్కర్లు కొడుతుంది. బ్రూస్‌లీ టైటిల్ తో  రామ్ చరణ్ (Ram Charan)నుంచి ఇప్పటికే మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇద్దరి అభిమానుల్లో సదరు రూమర్ ఎంతో ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. మరి నిజంగానే ఎన్టీఆర్ మూవీకి బ్రూస్‌లీ టైటిల్ ని ఫిక్స్ చేస్తే ఆ ఇద్దరి అభిమానుల కంటే ఎక్కువగా సంతోషించే వారు ఉండరు.  Also read: ది కేరళ స్టోరీ పార్ట్ 2 రిలీజ్..కేరళ సీఎం పినరయి విజయన్ కీలక వ్యాఖ్యలు  మూవీ విషయానికి వస్తే పక్కా యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ రేంజ్ ని హిమాలయాల శిఖరాల అంత ఎత్తుకి తీసుకెళ్లాలనే  పట్టుదలతో ప్రశాంత్ నీల్ ఉన్నాడు. మార్షల్ ఆర్ట్స్ కింగ్ 'బ్రూస్‌లీ' లుక్ లో కూడా ఎన్టీఆర్ కనిపించబోతుండటంతో పాటు హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కి అయితే కొదవే లేదు.మైత్రి మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ కనివిని ఎరుగని బడ్జెట్ తో నిర్మిస్తుండగా కాంతార చాప్టర్ 1 ఫేమ్ రుక్మిణీ వసంత్(Rukmini vasanth)హీరోయిన్. రవి బస్రూర్ మ్యూజిక్ కాగా  2026 జూన్‌ 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.     
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన న్యూస్ ప్రభాస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడా? ఆ వార్తల్లో నిజమెంత? ఈ ఏడాది సంక్రాంతికి 'ది రాజా సాబ్'తో నిరాశపరిచిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas).. తన తదుపరి సినిమాలతో బాక్సాఫీస్ కి తన పవర్ ఏంటో చూపించాలి అనుకుంటున్నారు. ప్రస్తుతం 'ఫౌజి', 'స్పిరిట్', 'కల్కి-2' వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. 'సలార్-2' కూడా చేసే అవకాశముంది. ఇలాంటి తరుణంలో ఒక ఊహించని న్యూస్ తెరపైకి వచ్చింది. ప్రభాస్ తో 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ(Prasanth Varma) భారీ మైథలాజికల్ ఫిల్మ్ ని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. రీసెంట్ గా ఆ వార్తలు మరింత ఊపందుకున్నాయి. ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.  అయితే ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ప్రభాస్- ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో మూవీ ఖచ్చితంగా ఉంటుందని సమాచారం.  ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న మూడు సినిమాలు పూర్తయిన తరువాత.. ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని వినికిడి. ఈ లోపు ప్రశాంత్ కూడా 'జై హనుమాన్' పూర్తి చేయాల్సి ఉంది.  ప్రభాస్ తో సినిమా ఉండటం ప్రశాంత్ వర్మకు బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తనవి రెండు ప్రాజెక్ట్ లు ఆగిపోయాయి. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో తలపెట్టిన 'బ్రహ్మ రాక్షస' ఆగిపోయింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కూడా ఎందుకనో పట్టాలెక్కలేదు. ఆ రెండు సినిమాల బాటలోనే ప్రభాస్ ప్రాజెక్ట్ కూడా అటకెక్కినట్లే అని వార్తలొచ్చాయి. వరుసగా మూడో ప్రాజెక్ట్ ఆగిపోవడం అనేది ఏ దర్శకుడికైనా దెబ్బే. దీంతో ప్రశాంత్ వర్మ సినీ కెరీర్ పై తీవ్ర ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రభాస్ ప్రాజెక్ట్ ఆగిపోలేదనే తాజా వార్త.. ప్రశాంత్ వర్మకు ఎంతో ఊరట అని చెప్పవచ్చు. 'హనుమాన్' బాటలోనే 'జై హనుమాన్'తో మరో హిట్ కొట్టి.. ఆ తర్వాత ప్రభాస్ ప్రాజెక్ట్ తో మ్యాజిక్ చేస్తే.. ప్రశాంత్ వర్మ స్టార్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయినట్లే.    
  -ఈ నెల 27 న రిలీజ్ కి రెడీ అవుతున్న ది కేరళ స్టోరీ పార్ట్ 2   -విద్వేషపూరిత ప్రోపగాండా అంటూ మండి పడుతున్న సీఎం - రిలీజ్ కి ఇబ్బందులు ఏమైనా తలెత్తుతాయా! -మేకర్స్ ఏమంటున్నారు 'ది కేరళ స్టోరీ'(The Kerala Story)సృష్టించిన సంచలన విజయం గురించి తెలిసిందే. విజయాన్ని బీట్ చేసే విధంగా వివాదాలు, విమర్శలని కూడా ఎదుర్కున్న రికార్డు కేరళ స్టోరీ సొంతం. ఈ నెల 27 న పార్ట్ 2 తో మరోసారి  వరల్డ్ వైడ్ సెల్యు లాయిడ్ పై మెరవనుంది.ప్రచార చిత్రాలు చూస్తుంటే కథ, కథనం విషయంలో పార్ట్ 1 ని మించిన అంశాలు ఉండబోతున్నట్టుగా  అర్ధమవుతుంది. రీసెంట్ గా పార్ట్ 2 పై కేరళ సిఎం పినరయి విజయన్ చేసిన వ్యాఖ్యలతో మూవీ విషయంలో వాట్ నెక్స్ట్ అనే పరిస్థితి. మరి విజయన్ ఏం మాట్లాడారో చూద్దాం. పినరయి విజయన్ మాట్లాడుతు కేరళ స్టోరీ మూవీ 'విద్వేషపూరిత ప్రోపగాండా. కేరళ రాష్ట్రం అక్షరాస్యత, సామాజిక అభివృద్ధిలో దేశానికే ఆదర్శం.కానీ సినిమా ముసుగులో కేరళ ని ఉగ్రవాదానికి కేంద్రంగా ప్రపంచం ముందు తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తోసిపుచ్చిన ‘లవ్ జిహాద్’ అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకురావడం మతపరమైన విభజనకి దారితీసే ప్రయత్నం. తప్పుడు సందేశాలు ఇచ్చే ఇలాంటి చిత్రాల్ని ప్రజలు తిరస్కరించాలి.శాంతియుత వాతావరణాన్ని చెడకొట్టడానికి కొన్నిశక్తులు ప్రయత్నిస్తున్నాయని విజయన్ చెప్పుకొచ్చారు. Also read: vishwak sen: వాలైంటెన్స్ డే ఎందుకు కలిసి రావడం లేదు  అయితే రీసెంట్ గా కేరళ స్టోరీ 2(The Kerala Story 2) నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా మాట్లాడుతు కళాకారులకి తమ అభిప్రాయాలని వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉంది. ఎవరినీ లక్ష్యంగా చేసుకుని కేరళ స్టోరీ ని నిర్మించలేదు. సమాజంలో ఉన్న కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగానే తెరకెక్కించాం. సినిమాని పూర్తిగా చూసిన తర్వాతే ఎవరైనా ఒక అభిప్రాయానికి రావచ్చని  తెలిపారు. ఈ నేపథ్యంలో కేరళ లో రిలీజ్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. ఉల్కా గుప్తా, ఐశ్వర్య ఓజా, అదితి భాటియా, అర్జన్, సుమిత్, రాజీవ్  కీలకమైన క్యారెక్టర్స్ లో కనిపిస్తున్నారు. కేరళ స్టోరీ 2023 లో రాగా ఆదా శర్మ ప్రధాన క్యారక్టర్ ని పోషించింది. సుదీప్తో సేన్ దర్శకుడు. ఇప్పుడు పార్ట్ 2 కి  కామాఖ్యా నారాయణ్ సింగ్(Kamakhya Narayan Singh)దర్శకుడు.  
-సోషల్ మీడియాలో విశ్వక్ సేన్ గురించి సరికొత్త చర్చ  -గత ఏడాది లైలా ని గుర్తుకు తెస్తున్నారు -అది సెంటిమెంట్ గా మారనుందా!   ఉదయం ఎనిమిది గంటల షో తో థియేటర్స్ దగ్గర అభిమాన సందడి కనిపించే స్థాయికి విశ్వక్ సేన్(Vishwak Sen)ఎదిగాడని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మంచి పెర్ ఫార్మర్ అనే పేరు కూడా ప్రేక్షకుల దగ్గర నుంచి వినిపిస్తుంటుంది. కానీ వరుస పరాజయాలు విశ్వక్ సేన్ కి హాయ్ చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ కి సంబంధించిన ఒక ఆసక్తికర చర్చ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ ఆసక్తికర న్యూస్ ఏంటో చూద్దాం. విశ్వక్ సేన్ ఈ నెల 13 న వాలైంటెన్స్ డే కానుకగా కామెడీ ఎంటర్ టైనర్ 'ఫంకీ'(Funky)తో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. మొదటి షో కి పాజిటీవ్ టాక్ వచ్చింది. కానీ బంగాళా ఖాతంలో వాయుగుండం పడి క్రమం క్రమంగా బలహీన పడినట్టుగా షోస్ ప్రదర్శించే కొద్దీ  ఫంకీ బలహీన పడుతూ వస్తుందనే టాక్ వినిపిస్తుంది. కలెక్షన్స్ సైతం కనీస హుషారు ని ప్రదర్శించడం లేదనేది ట్రేడ్ సర్కిల్స్ రిపోర్ట్. దీంతో పరాజయాన్ని డిక్లైర్ చేయవచ్చనే అభిప్రాయంలో సినీ మేధావులు ఉన్నారు. విశ్వక్ సేన్ ప్రీవియస్ మూవీ లైలా(laila). ఈ చిత్రం   గత ఏడాది ఫిబ్రవరి 14 న సరిగ్గా వాలైంటెన్స్ డే రోజునే  ల్యాండ్ అయ్యి డిజాస్టర్ ని అందుకుంది. దీంతో వాలైంటెన్స్ డే విశ్వక్ సేన్ కి కలిసి రాలేదనే కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. also read: Mrunal thakur: ఆ హీరోని చూసి నా మాజీ ప్రియడు భయపడ్డాడు.. తన వల్ల కాదన్నాడు   లైలా, ఫంకీ లో విశ్వక్ సేన్ పెర్ఫార్మ్ మాత్రం సూపర్ గా ఉంటుంది. యాక్టర్ గా ఫెయిల్ కాలేదనే చెప్పాలి. లైలా లో అయితే లేడీ గెటప్ లో ఎంతో కష్టపడి చేసి మెప్పించాడు. కాకపోతే అలాంటి చిత్రాలు గతంలో ప్రేక్షకుల ముందుకు చాలానే వచ్చాయని. కొత్త తనం లేకపోవడం వలనే  ఆ రెండు చిత్రాలకి పరాజయం గ్రాండ్ వెల్ కమ్ చెప్పిందనేది సోషల్ మీడియాలో సినీ ప్రియులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం.    
  -మాజీ ప్రియుడు పై సంచలన వ్యాఖ్యలు చేసిన మృణాల్ ఠాకూర్  -ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగాను -ఆ విషయంలో పెంచడమే కాదు, మళ్ళీ తగ్గించాడు   ఈ మధ్య కాలంలో అప్ కమింగ్ మూవీస్ కి సంబంధించిన విషయాల కంటే పర్సనల్ మ్యాటర్స్ ని షేర్ చేసుకుంటు ఎక్కువగా ట్రెండ్ అవుతుంది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). అభిమానులు మాత్రం తన డేర్ ని మెచ్చుకుంటు రాబోయే చిత్రాల్లో మృణాల్ పెర్ఫార్మ్ చూడాలనే కుతూహలంతో ఉన్నారు. ఈ విషయంలో అభిమానులు వేరే వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా తన ఆధీనంలో ఉంచుకుంది. ఈ మధ్య కాలంలో ఆ రకమైన అభిమానం మృణాల్ కి మాత్రమే దక్కిన గౌరవంగా భావించవచ్చు . రీసెంట్ గా మృణాల్ మరో సారి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి చెప్పిన విషయాలు వైరల్ గా మారాయి. తను ఏం చెప్తుందో చూద్దాం. ఆమె మాట్లాడుతు హృతిక్ రోషన్(Hrithik Roshan)సార్ తో కలిసి సూపర్ 30 మూవీ చేసే టైంలో  నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ చాలా టెన్షన్ పడ్డాడు. ఎక్కడ తనని వదిలేస్తానేమో అనేది అతని భయం. దీంతో జిమ్ కి వెళ్లి కండలు పెంచి ఇరవై కిలోల బరువు తగ్గాడు. కానీ కొన్ని రోజులకి జిమ్ మానేసి బరువు పెరిగాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాను.నీ చుట్టూ ఉండే సినిమా వాళ్ళతో పోటీపడాలని అనుకుంటున్నా. కానీ నా వల్ల కావడం లేదు అని చెప్పాడు. దీంతో నేను ఎంత నిజాయితీగా ఉన్నా ఆ రిలేషన్ ముందుకు వెళ్లలేకపోయింది. ఫిట్ నెస్ విషయంలో ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఎంత ఒత్తిడికి గురవుతారో అతన్ని చూసాకే అర్థమైందని చెప్పుకొచ్చింది.  also read:  రంభ రీ ఎంట్రీ.. ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది కొన్ని రోజుల క్రితమే మృణాల్  తన మరో బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతు 'నేను యాక్ట్ చేయడం ఇష్టం లేకపోవడంతో బ్రేక్ అప్ చెప్పినట్టుగా వెల్లడి చేసింది.ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఎవరనే క్యూరియాసీటీ నెలకొని ఉన్న నేపథ్యంలో అభిమానులు తమ మెదళ్ళకి పని చెప్పారు.తన అప్ కమింగ్ మూవీస్ విషయానికి వస్తే తెలుగులో అడవి శేష్(Adivi Sesh)సరసన డెకాయిట్(Dacoit)తో జత కడుతుంది. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో మృణాల్ క్యారక్టర్ ఒక రేంజ్ లో ఉండబోతుందనే విషయంలో ఎలాంటి డౌట్ లేదు. హిందీలోను రెండు భారీ చిత్రాలని తన చేతుల్లో ఉంచుకుంది. అల్లు అర్జున్(Allu Arjun),అట్లీ(Atlee)ప్రాజెక్ట్ లో ఉందనేది చాలా రోజుల నుంచి వినిపిస్తున్న టాక్.    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రతి వ్యక్తి జీవితం గురించి చాలా ఆలోచిస్తారు.  తమ జీవితం ఎలా ఉండాలో,  ఎలా ఉంటే బాగుంటుందో అని చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.  సరిగ్గా గమనిస్తే.. కొందరు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని అంటూ ఉంటారు.  కొందరు మాత్రం ఇలాంటి మాటలు విన్నప్పుడు అదేదో కామెడీ అన్నట్టు రియాక్ట్ అవుతూ ఉంటారు.  మనిషి వ్యక్తిత్వంలో సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కీలకపాత్ర పోషిస్తుంది.  అయితే మనిషిలో ఉండే లక్షణాలను బట్టి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత ఉందనేది చెప్పవచ్చట. సెల్ప్ రెస్పెక్ట్ లేకపోతే.. ఎప్పుడూ తమను తాము తక్కువ చేసుకుంటూ ఉంటారు చాలామంది.  ఇంతకీ మనుషుల్లో ఏ లక్షణాలు ఉంటే అవి వ్యక్తిత్వం మీద ప్రభావితం చూపిస్తాయి? సెల్ప్ రెస్పెక్ట్ తక్కువ ఉందని ఏ లక్షణాలు సూచిస్తాయి?  మనస్తత్వవేత్తలు ఏం చెబుతున్నారు? తెలుసుకుంటే.. తప్పు చేయకపోయినా క్షమాపణ చెప్పడం.. తప్పు లేకుండా క్షమాపణ చెప్పడం లేదా  అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు అపరాధ భావన కలిగి ఉండటం.. తక్కువ సెల్ప్ రెస్పెక్ట్ కలిగి ఉన్నారని  సూచిస్తుందని మనస్తత్వవేత్తలు అంటున్నారు.  నిజంగా ఎవరికైనా హాని చేశారా అని  ఎవరికి వారు ప్రశ్నించుకోవాలని మనస్తత్వవేత్తలు సలహా ఇస్తున్నారు. ఎవరికి  ఎలాంటి హాని చేయకపోతే ధైర్యంగా, నమ్మకంతో నిలబడాలని చెబుతున్నారు. తక్కువ చేసి మాట్లాడే వారి ముందు.. ఎవరైనా తక్కువ చేసి మాట్లాడుతుంటే.. కుటుంబ సభ్యులు లేదా లైఫ్ పార్ట్నర్.. స్నేహితులు, ఇతరులు తక్కువ చేసి మాట్లాడినప్పుడు వారికి ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతే.. వారి మాటలను అంగీకరించినట్టే.. ఇలా చేస్తే తమను తాము తక్కువ చేసుకున్నట్టే. ఇలాంటి వారికి సెల్ప్ రెస్పెక్ట్ తక్కువగా ఉంటుందని అంటున్నారు. ఫెయిల్యూర్.. తమను తాము ఫెయిల్యూర్ పర్సన్ గానూ,  తెలివి తక్కువ వారి గానూ భావించే వారికి సెల్ప్ రెస్పెక్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. ఇలాంటి వారు తమకు తాము హాని చేసుకుంటారని అంటున్నారు. ప్రశంసలు, భరోసా.. ఎప్పుడూ తమను ఎవరో ఒకరు పొగుడుతూ, మెచ్చుకుంటూ,  భరోసా ఇస్తూ తమ వెంట ఉండాలని కోరుకునేవారు ఉంటారు. ఇలాంటి వారికి సెల్ప్ రెస్పెక్ట్ తక్కువగా ఉంటుందట.  మెచ్చుకోలు,  భరోసా లోపించినప్పుడు తాము వేస్ట్ అనుకునే మెంటాలిటీ వీరిలో ఏర్పడుతుందట. ఇది ఎమోషనల్ గా తమను తాము దెబ్బతీసుకోవడానికి దోహదం చేస్తుందట. ఇతరుల కోసం.. ఇతరుల కోసం బాధపడటం,  అన్నం తినడం మానేయడం,  ఇతరుల కోసం తమను తాము హింసించుకోవడం, ఇతరుల ముందు తమను తాము తక్కువ చేసుకోవడమేనని అంటున్నారు. ప్రతి ఒక్కదానికి ఒక హద్దు అనేది ఉంటుంది. ఈ హద్దులను నిర్ణయించుకోలేని వారు సెల్ఫ్ రెస్పెక్ట్ తక్కువ కలిగి ఉంటారు. బంధాలు.. తెలిసో, తెలియకో.. బంధాలు ఏర్పడిపోతాయి. అయితే ఒక చెడు బంధంలో ఉన్నప్పుడు.. అవతలి వ్యక్తి మారతారనే ఆశతో బాధ కలిగించే విషయాలను మభ్యపుచ్చుకోవడం, భరించడం అనేది సెల్ప్ రెస్పెక్ట్  తక్కువగా ఉందని సూచిస్తుంది. అవతలి వ్యక్తి తప్పు ఉంటే తప్పు ఉందని చెప్పకపోగా,  తమదే తప్పు అని అంగీకరించే వారు సెల్ప్ రెస్పెక్ట్ చాలా తక్కువ కలిగి ఉంటారు. పోలిక.. ఇతరులతో పోల్చుకునే వారు కూడా తక్కువ సెల్ప్ రెస్పెక్ట్ కలిగి ఉంటారు. ఇతరుల జీవితాలతో తమను తాము పోల్చుకోవడం అనేది ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. సెల్ప్ కేర్.. సెల్ప్ కేర్ ఎంత ఎక్కువ ఉంటే వారు అంత  సెల్ప్ రెస్పెక్ట్ కూడా కలిగి ఉంటారు.  చాలామందిలో సెల్ప్ కేర్ అనేది ఉండదు.  తమ చుట్టూ ఉన్నవారి గురించి ఆలోచించి,  వారి కోసం అన్నీ చేసి, కష్టపడి.. వారు మెచ్చుకుంటే ఆ మాటలతోనే తృప్తి పడుతుంటారు. అయితే ఇది చాలా తప్పు.  తమ గురించి తాము కేర్ తీసుకోని వ్యక్తులు తమను తాము ఇతరుల ముందు రెస్పెక్ట్ గా నిలబెట్టుకోలేరు.                               *రూపశ్రీ.
నేటి ప్రపంచంలో మనం ఒక బటన్ నొక్కితే ప్రపంచంలోని ఏ మూలకైనా ఇమెయిల్‌లు, మెసేజ్ లు  పంపవచ్చు, కానీ ఆకాశం గుండా ఉత్తరాలు పంపడం అనే ఆలోచన కూడా ఒక మాయా కలలా అనిపించే కాలం ఉండేది. భారతదేశంలోని పవిత్ర భూమి అయిన ప్రయాగ్‌రాజ్ ఈ కలను నిజం చేసింది.  114 సంవత్సరాల క్రితం కుంభమేళా సమయంలో, ప్రపంచంలో మొట్టమొదటి అధికారిక ఎయిర్ మెయిల్ సేవ ప్రారంభించబడింది. ఈ సేవ ఎలా ప్రారంభమైందో,  దాని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుంటే..  ఫిబ్రవరి 18, 1911..  ఫిబ్రవరి 18, 1911 సాయంత్రం మొదలైన ప్రస్థానం ఇద. ప్రయాగ్‌రాజ్‌లోని యమునా నది ఒడ్డున ఉత్తర ప్రదేశ్ ఎగ్జిబిషన్ జరుగుతోంది. సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో, దాదాపు లక్షమందితో కూడిన భారీ జనసమూహం అక్కడ గుమిగూడింది. ఆ రోజుల్లో, విమానాలు ఒక అద్భుతం.  ప్రతి ఒక్కరూ  చారిత్రాత్మక క్షణాన్ని చూడాలని అక్కడ గుమిగూడారు. ఫ్రెంచ్ పైలట్ మాన్సియర్ హెన్రీ పెక్వెట్ తన విమానంలో 6,500 ఉత్తరాలతో నిండిన మెయిల్ బ్యాగ్‌ను ఎక్కించుకుని ప్రయాగ్‌రాజ్ నుండి నైనికి ప్రయాణించాడు. ఇది కేవలం ఒక విమానం కాదు, ప్రపంచ కమ్యూనికేషన్ విప్లవానికి నాంది. 13నిమిషాల యాత్ర.. ప్రయాగ్‌రాజ్ నుండి నైని వరకు ఉన్న దాదాపు 15 కిలోమీటర్ల దూరాన్ని పైలట్ పాకెట్ కేవలం 13 నిమిషాల్లోనే అధిగమించాడు. విమానం నైని జంక్షన్ సమీపంలో విజయవంతంగా ల్యాండ్ అయింది. మెయిల్ బ్యాగ్‌పై "ఫస్ట్ ఎయిర్ మెయిల్",  "ఉత్తర ప్రదేశ్ ఎగ్జిబిషన్, అలహాబాద్" అని ముద్ర కూడా వేశారు. ఈ చిన్న విమానం ప్రపంచ పోస్టల్ చరిత్రలో భారతదేశం పేరును సువర్ణాక్షరాలతో లిఖించింది. విద్యకు మార్గం.. విరాళం.. ఈ ప్రత్యేక ఎయిర్ మెయిల్ సేవలో పాల్గొనడానికి రుసుము ఆరు అణాలు.  బరువు పరిమితుల కారణంగా ఈ మొదటి బ్యాగ్‌లో 6,500 ఉత్తరాలు మాత్రమే చేర్చబడ్డాయి. ఈ చారిత్రాత్మక సేవ నుండి వచ్చిన మొత్తం ఆదాయాన్ని ఆక్స్‌ఫర్డ్-కేంబ్రిడ్జ్ హాస్టల్‌కు విరాళంగా ఇచ్చారు. భారతదేశ మైలు రాయి.. ప్రయాగ్‌రాజ్‌లో సాధించిన ఈ విజయం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పోస్టల్  విమానయాన చరిత్రలో ఒక మైలురాయిగా పరిగణించబడుతుంది. ఈ విమానం భారతదేశపు మొట్టమొదటి ఎయిర్ మెయిల్ డెలివరీ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా మెయిల్ డెలివరీ చేయడానికి కొత్త,  వేగవంతమైన మార్గానికి కూడా మార్గం సుగమం చేసింది.                                             *రూపశ్రీ.
తల్లిదండ్రులు పిల్లలు ఎంత పెద్దైనా వారు చిన్నవారిగానే కనిపిస్తారు అని  అంటుంటారు.  కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు,  పిల్లల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీనికి   అతిపెద్ద కారణం  చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత కూడా వారిపై నియంత్రణ కొనసాగించాలని అనుకుంటారు. వారి దృష్టిలో  18 ఏళ్లే కాదు.. పెళ్లైనా కూడా తమ పిల్లల విషయంలో నిర్ణయాలు పూర్తీగా తమవే కావాలని అనుకుంటారు.   ఇలా పిల్లల విషయంలో అతిగా నియంత్రణ చేసే తల్లిదండ్రుల మూలాన పిల్లలు ఆత్మవిశ్వాసం కలిగి ఉండరని,  వారికంటూ ప్రత్యేకత, వారి ప్రతిభ, వారి గుర్తింపు వారు పొందలేరని అంటున్నారు లైఫ్ స్టైల్ నిపుణులు.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. మారుతున్న కెరీర్.. చాలెంజెస్.. నేటి ప్రపంచంలో  జీవన ప్రమాణాలు, కెరీర్ ఎంపికలు వేగంగా మారుతున్నాయి.  దీని కారణంగా 18–34 సంవత్సరాల వయస్సు గల యువకులలో 33శాతం మంది స్వతంత్రంగా ఉండలేకపోతున్నారు.  తల్లిదండ్రులతో కలిసి జీవించడం కంటే.. తల్లిదండ్రులే వారి జీవితాన్ని నిర్తేశించడం,  వారిని నియంత్రణలో ఉంచడం జరుగుతోంది. తల్లిదండ్రులు ఇలా పిల్లల విషయంలో నియంతలుగా ఉండటం కంటే.. వారికి స్నేహితులుగా ఉండాలని అంటున్నారు లైఫ్ స్టైల్ నిపుణులు.  దీని వల్ల పిల్లలు తమ వయసుతో పాటు.. తమ జీవితం పట్ల ఒక స్పష్టత కూడా కలిగి ఉంటారు. నిఘా పెడితే.. ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.. చాలా మంది తల్లిదండ్రులు తెలియకుండానే హెలికాప్టర్ పేరెంటింగ్‌ను ఆశ్రయిస్తారు. అంటే తమ పిల్లలను నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఇది వారి ఆత్మవిశ్వాసం,  మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. హాస్టల్‌లో చదువు పూర్తి చేసుకున్న తర్వాత పిల్లలు పెద్దవారై ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఇంటి ఖర్చులు, పనులు,  దాచి ఉంచవలసిన విషయాల గురించి పిల్లలతో కలిసి మాట్లాడాలని నిపుణులు చెబుతున్నారు.  ఇది పిల్లలకు జీవితంలో పరిపక్వత పెంచే దిశగా అడుగులు వేయిస్తుంది. అవగాహన తోనే  కుటుంబ సంతోషం.. సంబంధాలలో అతిగా ఆధారపడటం  మంచిది కాదు, కానీ అన్ని రకాలుగా ఆధారపడటాలు చెడ్డవి కావు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఎంత వయసు పెరిగా అన్ని విషయాలలోనూ తమ మీద ఆధారపడి ఉండాలని, పిల్లలు కేవలం చదువుకుని ఉద్యోహాలు తెచ్చుకున,  తల్లిదండ్రుల ఇష్టప్రకారం  జీవితాన్ని గడపాలని అనుకుంటూ ఉంటారు.  కానీ ఇది వారి జీవితాన్ని ఏదో ఒక రోజు కష్టాలలోకి నెట్టివేయడం లేదా తల్లిదండ్రుల మీద చెడు అభిప్రాయం ఏర్పడేలా చేయడానికి దారితీస్తుంది. పెద్దవారు లేకుండా పిల్లలు ఏదీ నేర్చుకోలేరు. కానీ పెద్దవారు చెప్పినట్టు జీవితాంతం పిల్లలు ఉండాలని అనుకోవడం చాలా తప్పు.   ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన పిల్లలను ఒత్తిడి చేయకూడదు.  వారితో స్నేహంగా ఉంటూ చర్చించడం ద్వారా వారి జీవితాన్ని మంచి దిశలో నడిపించేందుకు కృషి చేయాలంతే..                                       *రూపశ్రీ.  
తలనొప్పి చాలా కామన్ గా అందరికీ వచ్చే సమస్య.  ఆఫీసు ఒత్తిళ్లు, దినచర్య క్రమంగా ఉండకపోవడం,   భోజనం ఆలస్యం కావడం,  సరిపడని ఆహారం తినడం వంటివి  తలనొప్పి కలిగిస్తూ ఉంటాయి. కానీ ప్రతి తలనొప్పి ఒత్తిడి వల్ల లేదా పైన చెప్పుకున్న సమస్యల వల్ల  వస్తుందని అనుకుంటే పొరపాటే.. కొన్నిసార్లు  తలనొప్పికి పొట్ట ఆరోగ్యం కూడా కారణం అవుతుందని అంటున్నారు వైద్యులు.  దీనిని సాధారణంగా గ్యాస్ తలనొప్పి లేదా గ్యాస్ట్రిక్ తలనొప్పి అని పిలుస్తారు. అసలు గ్యాస్ తలనొప్పి ఎలా వస్తుంది? ఈ తలనొప్పి వల్ల జరిగేదేంటి? తెలుసుకుంటే.. గ్యాస్ తలనొప్పి.. గ్యాస్ట్రిక్ తలనొప్పి అనేది సాధారణ టెన్షన్ లేదా సైనస్ తలనొప్పి కాదు. జీర్ణవ్యవస్థలో అజీర్ణం, ఆమ్లత్వం లేదా గ్యాస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు ఇది వస్తుంది. కడుపు, మెదడు దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. కడుపులో అసమతుల్యత ఉన్నప్పుడు, శరీరం ప్రతిస్పందిస్తుంది.  చాలా మందిలో కడుపులో ఉండే సమస్య తలకు వ్యాపిస్తుంది. కారంగా ఉండే ఆహారాలు, సక్రమంగా భోజనం చేయకపోవడం, అధికంగా  టీ,  కాఫీ తీసుకోవడం,  నిరంతర ఒత్తిడి ఇవన్నీ వంటివన్నీ సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. గ్యాస్ట్రిక్ తలనొప్పి.. గ్యాస్ట్రిక్ తలనొప్పి  లైట్ గా ఉండవచ్చు లేదంటే ఎప్పుడూ తలనొప్పిగా కూడా ఉండవచ్చు.  అయితే గ్యాస్ట్రిక్ మైగ్రేన్ మరింత తీవ్రంగా  ఉంటుంది. ఇది కాంతికి,  శబ్దాలకు చాలా రియాక్ట్ అవుతుంది. వికారం లేదా వాంతులు కూడా ఉండొచ్చు. రెండింటిలోనూ  అంతర్లీనంగా  జీర్ణ సమస్యలే కారణం. ఈ సమస్య అప్పుడప్పుడు వస్తే అది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కానీ తరచుగా  వస్తుంటే మత్రం లైట్ గా తీసుకోకూడదు.  గ్యాస్ తలనొప్పి పదే పదే వస్తుంటే దీర్ఘకాలిక గ్యాస్ట్రిటిస్, పెప్టిక్ అల్సర్లు, పిత్తాశయ వ్యాధి, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ లేదా గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్  వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉండొచ్చు.   డాక్టర్ ను ఎప్పుడు కలవాలి.. వారానికి రెండుసార్లు కంటే ఎక్కువసార్లు తలనొప్పి వస్తే, ఎటువంటి కారణం లేకుండా బరువు తగ్గుతుంటే, వాంతులు అవుతున్నా లేదా తీవ్రమైన కడుపు నొప్పిని ఉంటున్నా, లేదా ఇంటి చిట్కాలు ఫాలో అయినా  ఉపశమనం కలగకపోతే, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను సంప్రదించాలి. అవసరమైతే, ఎండోస్కోపీ వంటి పరీక్షలు జీర్ణవ్యవస్థ పరిస్థితిని స్పష్టం చేస్తాయి. చికిత్స అంటే నొప్పి నివారణ మందులు మాత్రమే కాదు, జీర్ణక్రియను మెరుగుపరచడం. సమయానికి తినడం, తేలికైన,  సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత నీరు త్రాగడం,  నిరాశకు దూరంగా ఉండటం వంటివి ఈ సమస్యకు మంచి ఉపశమనం లభిస్తుంది.                                       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
మునక్కాడల గురించి అందరికీ తెలిసే ఉంటుంది.  మునక్కాడలను వివిధ వంటకాల తయారీలో వాడుతూ ఉంటారు. అయితే మునగాకు గురించి చాలామందికి తెలియదు. పల్లె ప్రాంతాలలో విరివిగా మునగ చెట్లు పెరుగుతూ,  మునగాకు విరివిగా లభించినా వాటిని ఆహారంలో భాగం చేసుకునేవారు మాత్రం చాలా తక్కువే.. అయితే చాలా ప్రాంత ప్రజలు మాత్రం మునగాకులో ఉన్న పోషకాలను,  మునగాకు ఉపయోగాలను తెలుసుకుని డబ్బు వెచ్చించి మరీ మునగాకు కొని ఆహారంలో తీసుకుంటారు.  అయితే మునగాకు ఆరోగ్యానికి మంచిదే అయినా,  మునగాకును తినడం కొందరికి మంచిది కాదు.  ఇంతకీ మునగాకు ఎవరు తినకూడదు? ఎందువల్ల తినకూడదు? తెలుసుకుంటే.. మునగాకు పోషకాలు.. మునగలో మొక్కల ఆధారిత ప్రోటీన్ ఉంటుంది.  అలాగే విటమిన్-ఎ,  విటమిన్-సి, విటమిన్-ఇ,  కాల్షియం,  పొటాషియం,  ఐరన్, ఫైబర్,  యాంటీ ఆక్సిడెంట్లు,  బీటా కెరోటిన్,  బీటా క్వెర్సెటిన్ వంటివి మాత్రమే కాకుండా.. అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. మునగాకు ఎవరు తినకూడదు.. థైరాయిడ్.. థైరాయిడ్ సమస్యలతో ఉన్నవారు మునగ తినడం చాలా ప్రమాదం అంటున్నారు.  ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యను కలిగిస్తుంది.  థైరాయిడ్ సమస్య ఉన్నవారు మునగ తినడం మానుకోవాలని చెబుతున్నారు. లో బిపి.. మునగ ఆకులలో అధిక మొత్తంలో ఆల్కలాయిడ్లు ఉంటాయి.  దీని వల్ల లో బిపి సమస్య ఉన్నవారికి మునగాకు తినడం వల్ల సమస్య పెరుగుతుంది. గర్బిణీ స్త్రీలు.. గర్బిణీ స్త్రీలు లేదా పాలిచ్చే తల్లులు వైద్యుల సలహా లేకుండా మునగ తినకూడదని అంటున్నారు.  ఇది గర్భస్రావం అయ్యే ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతారు.   సెన్సిటివ్ స్టమక్.. కడుపు సున్నితంగా ఉండేవారు ఉంటారు.  ఇలాంటి వారు మునగ తీసుకోవడం చాలా పరిమితం చేయాలి.  కడుపు సున్నితంగా ఉండేవారు మునగాకు తీసుకుంటే విరేచనాలు,  తీవ్రమైన కడుపునొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
   నేటి కాలంలో నడుస్తున్న  బిజీ,  ఒత్తిడితో కూడిన జీవితంలో చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ట్రాఫిక్‌లో చిక్కుకోవడం, ఇంటర్నెట్ నెమ్మదిగా ఉండటం లేదా స్నేహితుల మాటలకు వెంటనే కోపం తెచ్చుకోవడం ఇవన్నీ చాలా మంది అనుభవిస్తూ ఉంటారు. అయితే కోపం అనేది కేవలం ఒక ఎమోషన్  మాత్రమే కాదు, అది  శారీరక,  మానసిక ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పదే పదే  కోపం రావడం అనేది అధిక రక్తపోటు, గుండె జబ్బులు,  జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా ఇది మానవ  సంబంధాలను,  వృత్తి జీవితాన్ని కూడా  ప్రభావితం చేస్తుంది.  అందువల్ల కోపాన్ని సరిగ్గా నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. అయితే కోపాన్ని నియంత్రించుకోవడం కూడా ఒక గొప్ప నైపుణ్యం అనే చెప్పవచ్చు. కోపాన్ని అదుపు చేసుకోవడం అంటే కోపాన్ని పూర్తిగా అణచివేయడం కాదు, దానిని వ్యక్తీకరించే విధానం కావచ్చు, దానిని ప్రదర్శించే ప్రాంతం కావచ్చు.. వీటిని మార్చుకోవడం.  ముఖ్యంగా  కోపానికి గల కారణాలను  అర్థం చేసుకుని, దానిని నియంత్రించుకోవడానికి పద్ధతులను అవలంబించినప్పుడు  భావోద్వేగాలపై  మంచి నియంత్రణను కలిగి ఉండగలుగుతాము. కోపాన్ని నియంత్రించుకునే పద్దతులు ఏంటో తెలుసుకుంటే.. ట్రిగ్గర్ లు..  కోపాన్ని నియంత్రించుకోవాలనుకుంటే,మొదట చేయాల్సింది ఎందుకు కోపం వస్తుంది? ఎవరి వల్ల కోపం వస్తుంది? ఎలాంటి పరిస్థితులలో కోపం వస్తుంది? ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు  పని ఒత్తిడి కావచ్చు లేదా ఒక  వ్యక్తి కావచ్చు,  కొన్నిసార్లు  రద్దీగా ఉండే ట్రాఫిక్ ప్రాంతం కావచ్చు. దేని వల్ల కోపం వస్తుందనేది గుర్తించగలిగితే ఆ కోపాన్ని నియంత్రించడానికి ఒక ప్రణాళికను తయారు చేసుకోవచ్చు.  శ్వాస సాధన..  కోపం వచ్చినప్పుడల్లా వెంటనే స్పందించే బదులు కొద్ది సేపు ఆగి లోతైన శ్వాసను ప్రాక్టీస్ చేయాలి. ఈ టెక్నిక్  శరీరాన్ని ప్రశాంతపరుస్తుంది.  హృదయ స్పందనను సాధారణీకరిస్తుంది.  ఆలోచించడానికి సమయం ఇస్తుంది. నెమ్మదిగా ఉచ్ఛ్వాసము,  నిశ్వాసము  కోపాన్ని తక్షణమే నియంత్రించగలవు. పరిస్థితి నుండి దూరం.. ఏదైనా  పరిస్థితి  చాలా ఇబ్బంది పెడుతుంటే ఆ ప్రదేశం నుండి కొంత సమయం దూరంగా వెళ్లడం మంచిది. తర్వాత  ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడటం  లేదా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించడం చేయాలి. దూరాన్ని సృష్టించడం వల్ల పరిస్థితిని కొత్త కోణం నుండి చూసే అవకాశం లభిస్తుంది. ఇది కోపాన్ని శాంతపరుస్తుంది. వ్యాయామం,  ధ్యానం.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కోపాన్ని నియంత్రించడానికి సులువు అవుతుంది. శారీరక శ్రమ.. ఒత్తిడిని,  కోపాన్ని తగ్గించే హార్మోన్లను విడుదల చేస్తుంది. దీనితో పాటు ధ్యానం,  యోగా సాధన చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారి ఏకాగ్రత పెరుగుతుంది. తద్వారా  చిన్న విషయాలకు స్పందించడం మానేస్తారు.                          *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...