కర్ణాటక రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం ఎవరికైనా కష్టమే. గత కొంతకాలంగా ముఖ్యమంత్రి పీఠం చుట్టూ తిరుగుతున్న అంతర్గత రాజకీయాలు ఇప్పుడు  కీలక మలుపు తిరిగాయి. కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరదించుతూ, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా పూర్తి మద్దతు ప్రకటించినట్లు  ప్రచారం సాగుతోంది. 2023 మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్  విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య సీఎం పదవి కోసం గట్టి పోటీ నెలకొంది. పార్టీ హైకమాండ్ మధ్యవర్తిత్వంతో రెండున్నరేళ్ల రొటేషనల్ పవర్ షేరింగ్   ఒప్పందం కుదిరిందని, అందులో భాగంగానే సిద్ధరామయ్యకు మొదట అవకాశం ఇచ్చారని డీకే శివకుమార్ అనుచరులు గట్టిగా చెప్తున్నారు. ఇప్పుడు సిద్ధరామయ్య మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటున్న తరుణంలో, ముఖ్యమంత్రి పీఠాన్ని డీకే శివకుమార్‌కు అప్పగించాలనే డిమాండ్ జోరందుకుంది.  డీకే శివకుమార్ పార్టీ కోసం చేసిన కష్టాన్ని, ఆయనకున్న వ్యూహాత్మక చతురతను కాంగ్రెస్ అధిష్టానంలోని కొందరు ప్రముఖులు బలంగా సమర్థిస్తున్నారు. ముఖ్యంగా సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ ఇద్దరూ డీకే శివకుమార్ పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంలో కేపీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ పోషించిన పాత్ర చాలా ముఖ్యమనీ,  ఒడుదొడుకులు ఎదురైన ప్రతిసారీ పార్టీని ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ఆదుకున్న ట్రబుల్ షూటర్ ఆయనేనీ అంటున్నారు. 2023 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం డీకే శివకుమార్‌కు రూ. 1,413.80 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. 2018లో ఈ ఆస్తుల విలువ రూ. 840.01 కోట్లుగా ఉండగా, అది ఐదేళ్లలో భారీగా పెరిగింది. ఇందులో రూ. 1,140.38 కోట్ల స్థిరాస్తులు, రూ. 273.41 కోట్ల చరాస్తులు ఉన్నాయి. అలాగే ఆయనకు రూ. 265.06 కోట్ల అప్పులు, ఏడాదికి రూ. 14.4 కోట్ల వార్షిక ఆదాయం ఉంది. ఐటీ, ఈడీ, సీబీఐ వంటి సంస్థల ద్వారా దాదాపు 19 కేసులు ఎదుర్కొంటున్నప్పటికీ, ఆయన పార్టీ లైన్‌ను దాటకుండా నమ్మకంగా నిలబడ్డారు. అందుకే ఆయన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని, సీఎం కుర్చీ ఆయనకే ఇవ్వాలని ప్రియాంకా గాంధీ గట్టిగా అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అయితే, ఈ అధికార మార్పిడి అంత సులభంగా సాగేలా కనిపించడం లేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక బలమైన ఓబీసీ నాయకుడు కావడంతో..  ఆయనను అకస్మాత్తుగా పదవి నుంచి తప్పిస్తే పార్టీ ఇమేజ్‌కు భంగం కలుగుతుందేమోనని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ  ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపి, కేంద్ర రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఒక సరికొత్త వ్యూహాన్ని అధిష్టానం పరిశీలిస్తోందంటున్నారు. బీహార్‌లో నితీష్ కుమార్ సీఎం పదవి వదిలి రాజ్యసభకు వెళ్లిన తరహాలోనే, కర్ణాటకలోనూ అధికార బదిలీ ఫార్ములాను అమలు చేయాలని కాంగ్రెస్ అగ్రనాయకులు భావిస్తున్నారు. కానీ సిద్ధరామయ్య మాత్రం తన స్థానంలో డీకే శివకుమార్ రావడాన్ని అంతగా ఇష్టపడటం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. కర్ణాటకలోని బొక్కలిగ సామాజిక వర్గంలో డీకే శివకుమార్‌కు ఉన్న పట్టు, బూత్ స్థాయి కార్మికులను నడిపించే నైపుణ్యం పార్టీకి శ్రీరామరక్ష అని ప్రియాంక వాదిస్తున్నారు. రాబోయే రోజుల్లో కేరళ, తమిళనాడు, అస్సాం అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున, దక్షిణాదిలో కీలకమైన కర్ణాటకలో ఎలాంటి అస్థిరత రాకూడదని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే డీకే శివకుమార్  ఓపిక ఎల్లప్పుడూ మంచి ఫలితాన్ని ఇస్తుంది  అని వ్యాఖ్యానించడం విశేషం. ప్రియాంకా గాంధీ అండతో డీకే శివకుమార్ అనుకున్నది సాధిస్తారా, లేదా సిద్ధరామయ్య తన పీఠాన్ని కాపాడుకుంటారా  అన్న చర్చ కర్నాటక రాజకీయాలలో జోరుగా సాగుతోంది. 
  తమిళనాడులో అన్నాడీఎంకేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో తాజాగా అంబసముద్రం ఎమ్మెల్యే సుబ్బయ్య కూడా తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఆయన నేరుగా లోక్‌భవన్‌కు వెళ్లి అసెంబ్లీ స్పీకర్‌ను వ్యక్తిగతంగా కలిశారు. అనంతరం తన రాజీనామా లేఖను స్పీకర్‌కు సమర్పించారు. సుబ్బయ్య ఇచ్చిన రాజీనామా పత్రాన్ని పరిశీలించిన తర్వాత త్వరలోనే అధికారిక నిర్ణయం వెల్లడిస్తామని స్పీకర్ మీడియాకు తెలిపారు.  ఇటీవల రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే టీవీకే పార్టీలో చేరగా, సుబ్బయ్య కూడా త్వరలోనే ఆ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వరుస రాజీనామాలతో అన్నాడీఎంకేలో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతున్నట్లు కనిపిస్తోంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యే వేలుమణి వర్గానికి చెందిన 25 మంది  ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్లు అసెంబ్లీలో మద్దతు తెలిపాయి.  
  జనసేన పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. పార్టీలో ఎట్టిపరిస్థితుల్లోనూ క్రమశిక్షణారాహిత్యాన్ని సహించేది లేదని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగానే ప్రకాశం జిల్లా జనసేన కమిటీని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాజమండ్రి వేదికగా నిర్వహించిన పార్లమెంటరీ స్థాయి కీలక ప్రతినిధులు, క్రియాశీలక కార్యకర్తల సదస్సులో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత పన్నెండేళ్లుగా తాను చూపిస్తూ వస్తున్న ఓపికకు ఇక ముగింపు పలికే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. పార్టీని మరింత పటిష్ఠమైన సైనిక క్రమశిక్షణ గల వ్యవస్థగా రూపాంతరం చెందించేందుకు కఠిన నిర్ణయాలకు వెనుకాడబోనని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా కమిటీ పరిధిలో చోటుచేసుకుంటున్న గ్రూపు రాజకీయాల పట్ల పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం పాతిక మంది సభ్యులు ఉన్న చోట ఏకంగా యాభైకి పైగా అంతర్గత వివాదాలు తలెత్తడంపై ఆయన ఆవేదన చెందారు. ఇలాంటి వర్గ విభేదాల కారణంగా ఒకరిని ఒకరు తొక్కేస్తూ, పార్టీ ప్రతిష్ఠను మసకబారుస్తున్నారని నేతల తీరును తప్పుబట్టారు. సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేస్తూ.. ఇప్పటివరకు పార్టీ శ్రేణులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చానని, కానీ ఇకపై నిబంధనల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. "పార్టీ నిర్దేశించిన మార్గంలో కలిసి నడవండి, లేదంటే తప్పుకోండి" (ఫాల్ ఇన్ లైన్ ఆర్ ఫాల్ అవుట్ ఆఫ్ లైన్) అంటూ గట్టి సంకేతాలు పంపారు. ఈ నిర్ణయంతో పార్టీలో పదవులు అనుభవిస్తూ గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించే ఏ స్థాయి నేతలకైనా కఠిన చర్యలు తప్పవనే స్పష్టమైన హెచ్చరిక వెళ్ళింది. కేవలం ఎన్నికల విజయాలతో సరిపెట్టుకోకుండా, సంస్థాగతంగా పార్టీని పటిష్ఠం చేయడమే తన లక్ష్యమని ఆయన నిరూపించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈ నిర్ణయం జనసేన శ్రేణుల్లో పెను సంచలనంగా మారింది. పార్టీ అధినేత తీసుకున్న ఈ కఠిన నిర్ణయం తర్వాత జిల్లా రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఎలాంటి వర్గపోరుకు తావులేకుండా సరికొత్త నాయకత్వంతో ప్రకాశం జిల్లాకు సరికొత్త కార్యవర్గాన్ని ప్రకటించేందుకు కసరత్తులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.  
ALSO ON TELUGUONE N E W S
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)మరియు టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga)కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’ (Spirit) మూవీ షూటింగ్ శరవేగంగా దూసుకుపోతోంది. ఈ భారీ ప్రాజెక్టుకి సంబంధించి సినీ ప్రియులలో అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ గురించిన ఒక అదిరిపోయే అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  బాలీవుడ్ బ్యూటీ, త్రిప్తి డిమ్రి(Triptii Dimri)నిన్నటి నుంచే స్పిరిట్ సెట్స్ లోకి అడుగుపెట్టింది. అలా అడుగుపెట్టిందో లేదో ఇనిస్టాగ్రమ్ వేదికగా ఒక పిక్ జారీ చేసింది. సదరు పిక్ లో ఒక ఆవు, పొలం కనపడుతూ ఉన్నాయి.ఇప్పుడు ఈ పిక్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిత్ర యూనిట్ ప్లాన్ ప్రకారం ఈ షెడ్యూల్‌ను సుదీర్ఘంగా ప్లాన్ చేశారు. దాదాపు 25 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన టాకీ పార్ట్‌తో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను కూడా షూట్ చేయనున్నారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, సుమారు 42 డిగ్రీల ఎండని  సైతం లెక్కచేయకుండా చిత్ర బృందం షూట్ లో పాల్గొంటుంది. బాలీవుడ్ హీరో  వివేక్ ఒబెరాయ్ విలన్‌గా ఒక పవర్‌ఫుల్ రోల్‌లో చేస్తున్న విషయం తెలిసిందే. Also read: కొత్త మూవీకి సంబంధించిన 66 హార్డ్ డిస్క్‌లు మాయం!.. కోట్లలో నష్టం సందీప్ రెడ్డి వంగా మార్క్ రగ్గడ్ ,హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్నస్పిరిట్ లో  ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.  దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది.  
టాలీవుడ్(Tollywood)లో గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన 'సింగిల్ స్క్రీన్ థియేటర్ల పర్సంటేజ్ వివాదం' ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దల వద్దకు చేరింది. ఇండస్ట్రీలో నెలకున్న ఈ సంక్షోభ పరిస్థితులపై చర్చించేందుకు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)ను కలుసుకున్నారు. ప్రస్తుతం రాజమండ్రి పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను స్థానిక షెల్టన్ హోటల్‌లో నిర్మాతల బృందం కలిసింది. ఈ కీలక సమావేశం ఇండస్ట్రీ వర్గాల్లో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఈ తాజా సమస్యలపై చర్చించేందుకు టాలీవుడ్ కు చెందిన పలువురు అగ్ర నిర్మాతలు రాజమండ్రికి తరలివచ్చారు. పవన్ కళ్యాణ్‌ను కలిసిన వారిలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ, మైత్రీ మూవీ మేకర్స్ వై.రవిశంకర్, ప్రముఖ నిర్మాత కిలారి సతీష్‌తో పాటు మరికొందరు ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలకు, డిస్ట్రిబ్యూటర్లు – నిర్మాతలకు మధ్య పర్సంటేజ్ షేరింగ్ విషయంలో వివాదం నడుస్తోంది. దీనివల్ల ఇరు వర్గాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. ఈ ఇష్యూ కారణంగా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను, థియేటర్ల రన్‌పై పడుతున్న ప్రభావాన్ని నిర్మాతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు వివరించారు. థియేటర్ల వ్యవస్థను కాపాడుకుంటూనే, అటు నిర్మాతలకు కూడా నష్టం రాకుండా ఈ పర్సంటేజ్ గొడవకు ఒక శాశ్వత మరియు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలంటూ నిర్మాతలు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పరంగా ఈ వివాదంలో జోక్యం చేసుకుని, ఇరు వర్గాలతో మాట్లాడి సమస్య సద్దుమణిగేలా చూడాలని వారు డిప్యూటీ సీఎంను కోరారు. సినీ ఇండస్ట్రీ నుండే వచ్చిన వ్యక్తి కావడం, ప్రస్తుతం ప్రభుత్వంలో కీలకమైన స్థానంలో ఉండటంతో నిర్మాతలు పవన్ కళ్యాణ్ పై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. నిర్మాతలు తెలిపిన సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సినిమా రంగానికి ప్రభుత్వం వైపు నుండి పూర్తి మద్దతు ఉంటుందని ఆయన హామీ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఈ సింగిల్ థియేటర్ల వివాదంపై డిప్యూటీ సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఈ పర్సంటేజ్ గొడవకు ఎలాంటి ముగింపు లభిస్తుందనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.  
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) ఏం చేసినా, ఏం మాట్లాడినా అది క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎప్పుడూ విభిన్నమైన కాన్సెప్ట్‌లతో, హాట్ టాపిక్స్‌తో వార్తల్లో నిలిచే ఆర్జీవీ, తాజాగా తన ట్విట్టర్ (X) ఖాతా ద్వారా పంచుకున్న ఒక ఆసక్తికరమైన పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్‌లో సరికొత్త చర్చకు దారితీసింది. తాజాగా ఆయన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సరికొత్త అప్‌డేట్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం 'పోలీస్ స్టేషన్ లో భూత్' (POLICE STATION MEIN BHOOT) అనే ఒక వెరైటీ టైటిల్‌తో సరికొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన సాంగ్ షూటింగ్‌ను ఆయన తాజాగా పూర్తి చేశారు. ఈ సాంగ్‌కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. సాంగ్ షూటింగ్ ముగిసిన అనంతరం జానీ మాస్టర్‌తో కలిసి దిగిన ఫోటోను ఆర్జీవీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో వీరిద్దరూ ఎంతో క్లోజ్‌గా, చిరునవ్వుతో కనిపిస్తూ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ, జానీ మాస్టర్‌ను ఆకాశానికెత్తేశారు. "మోస్ట్ టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ మరియు అత్యంత అద్భుతమైన మనసున్న వ్యక్తి అయిన జానీ మాస్టర్‌తో కలిసి ఇప్పుడే 'పోలీస్ స్టేషన్ లో భూత్' కోసం సాంగ్ షూటింగ్‌ను పూర్తి చేశాను" అని ఆర్జీవీ పేర్కొన్నారు. అంతేకాకుండా, జానీ మాస్టర్ ఇండియన్ సినిమా కొరియోగ్రఫీకి ఒక 'జాన్' (ప్రాణం) లాంటివారని ఆర్జీవీ అభివర్ణించారు.  అలాగే, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కాంబినేషన్‌లో త్వరలో రాబోతున్న 'పెద్ది' (Peddi) సినిమాలో జానీ మాస్టర్ తన అద్భుతమైన కొరియోగ్రఫీతో అలరించబోతున్నారని ఆర్జీవీ రాసుకొచ్చారు. ఆర్జీవీ చేసిన ఈ క్రేజీ ట్వీట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.   https://x.com/RGVzoomin/status/2059054447461011564
Ravi Mohan has been going through one of the toughest phases of his personal and professional life over the last few months. Amid ongoing personal struggles and emotional setbacks, the actor reportedly found it difficult to return to work and continue regular film shoots. However, in what many in the industry are calling a heartwarming gesture of friendship, actor Karthi is said to have played a major role in helping Ravi Mohan regain confidence and return to film sets. According to industry sources, Karthi stayed in constant touch with Ravi Mohan during the difficult period and encouraged him not to distance himself from cinema. The actor reportedly reminded Ravi Mohan that audiences still love him deeply and that setbacks in personal life should not stop an artiste from moving forward creatively. Sources also suggest that Karthi encouraged Ravi Mohan to resume pending commitments and slowly rebuild a healthy routine around work. The support appears to have had a positive effect, with Ravi Mohan now gradually returning to professional engagements and discussions related to upcoming projects. Fans on social media have appreciated Karthi’s gesture, calling it an example of genuine friendship in the film industry. Many have also expressed happiness seeing Ravi Mohan slowly getting back to normalcy and focusing once again on cinema. On the work front, Karthi started shooting for his Kalyan Shankar film in Telugu.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
బాలీవుడ్ ప్రముఖ చలనచిత్ర దర్శకులు, నిర్మాతలు అయిన జోయా అక్తర్, రీమా కాగ్తీలకు ఊహించని భారీ షాక్ తగిలింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న వారి ప్రముఖ నిర్మాణ సంస్థ 'టైగర్ బేబీ డిజిటల్ ఎల్‌ఎల్‌పీ' (Tiger Baby) కార్యాలయంలో అత్యంత విలువైన సమాచారంతో కూడిన హార్డ్ డిస్క్‌లు భారీ ఎత్తున దొంగతనానికి గురయ్యాయి. ఈ ఘోర డేటా చోరీ ఉదంతం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతోంది. ఇంకా విడుదల కాని సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, పెద్ద పెద్ద బ్రాండ్‌లకు సంబంధించిన యాడ్ షూట్స్ వంటి అత్యంత రహస్యమైన డిజిటల్ ఫుటేజ్ ఉన్న ఏకంగా 66 హార్డ్ డిస్క్‌లు ఆఫీస్ నుండి మాయమవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ హార్డ్ డిస్క్‌ల మార్కెట్ విలువే సుమారు 13 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే వాటిలో భద్రపరిచిన ఒరిజినల్ డేటా గనుక బయటకు లీక్ అయితే, ఆ నష్టం వందల కోట్ల రూపాయల్లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విస్తుపోయే దొంగతనం వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ సంస్థలో మొత్తం 119 హార్డ్ డిస్క్‌ల ఇన్వెంటరీ ఉండగా, అందులో 66 డిస్క్‌లు కనిపించకుండా పోయాయి. ఇవన్నీ సాదాసీదా స్టోరేజ్ డివైజ్‌లు కావు, వీటి సామర్థ్యం ఒక్కొక్కటి 16TB నుండి ఏకంగా 72TB వరకు ఉంటుంది. ఈ భారీ స్టోరేజ్ డిస్క్‌లలో షూటింగ్‌కు సంబంధించిన రా ఫుటేజ్, రఫ్ ఎడిట్స్, సీన్ కట్స్, పోస్ట్-ప్రొడక్షన్ మెటీరియల్స్ , గతంలో ఘనవిజయం సాధించిన ప్రాజెక్టుల తాలూకు బ్యాకప్ డేటా భద్రపరిచారు. వీటిలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో సూపర్ హిట్ అయిన 'మేడ్ ఇన్ హెవెన్' సిరీస్, నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన 'ఘోస్ట్ స్టోరీస్' వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ఫైల్స్  ఉన్నాయి. అయితే, ఆఫీస్ క్యాబినెట్‌లో భద్రంగా ఉండాల్సిన ఈ డిస్క్‌లను మాయం చేసి, యాజమాన్యానికి అనుమానం రాకుండా ఉండేందుకు దొంగలు వాటి స్థానంలో ఖాళీగా ఉన్న బాక్సులని, కొన్ని పాడైపోయిన డబ్బాలని  ఉంచడం గమనార్హం. ఈ దొంగతనం ఉదంతం మే 21వ తేదీన వెలుగులోకి వచ్చింది. ఆఫీస్ సిబ్బంది తమ రొటీన్ వర్క్ కోసం ఒక నిర్దిష్ట హార్డ్ డిస్క్‌ని  వెతకగా అది దొరకలేదు. దాంతో కంపెనీ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మరియు హెచ్ఆర్ అడ్మినిస్ట్రేటర్ అయిన మెహజబీన్ ముస్తాక్ షేక్ ఆఫీస్ కప్‌బోర్డులను నిశితంగా పరిశీలించారు. అక్కడ కొన్ని బాక్సులు పాడైపోయి, లోపల డిస్క్‌లు లేకపోవడాన్ని గమనించి ఆమె వెంటనే బాంద్రా పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అంతర్గత విచారణ చేపట్టగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఈ ఘోరానికి పాల్పడింది మరెవరో కాదు, గత ఏడేళ్లుగా అదే ఆఫీసులో నమ్మకంగా పనిచేస్తూ, ఆ స్టోరేజ్ క్యాబినెట్‌ను పర్యవేక్షించే ఆఫీస్ బాయ్ మహ్మద్ షాహిద్ అజీమ్ ఖాన్ అని తేలింది. ఈ ఇంటిదొంగ గత ఐదు నెలల కాలంలో ఎవరికీ అనుమానం రాకుండా విడతల వారీగా 24 హార్డ్ డిస్క్‌లను దొంగిలించి గ్రే మార్కెట్‌లో అమ్మేసుకున్నట్లు అంగీకరించాడు. Also read: మతిస్థిమితం లేని వ్యక్తికి హెయిర్ కటింగ్ చేసిన స్టార్ హీరో.. వీడియో వైరల్  బోరివలికి చెందిన రితేష్ సురేష్ షా అనే స్టేషనరీ షాప్ వ్యాపారికి ఒక్కో హార్డ్ డిస్క్‌ను కేవలం 15,000 నుండి 20,000 రూపాయల మధ్య తక్కువ ధరకే విక్రయించినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. పోలీసులు వెంటనే యాక్షన్ లోకి దిగి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, కోర్టు ద్వారా మే 29 వరకు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం దొంగిలించబడిన 66 డిస్క్‌లలో 24 డిస్క్‌ల వివరాలు లభ్యమవగా, మిగిలిన 42 హార్డ్ డిస్క్‌లు ఎక్కడ ఉన్నాయనే దానిపై పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే, ఈ కేసులో హార్డ్‌వేర్ రికవరీ కంటే కూడా అందులోని అత్యంత రహస్యమైన, అన్‌రిలీజ్డ్ సినిమా కంటెంట్‌ను నిందితులు ఎక్కడైనా కాపీ చేశారా, లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఎవరికైనా విక్రయించి లీక్ చేశారా అనే కోణంలో సైబర్ క్రైమ్ నిపుణులు చాలా నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు. డిజిటల్ యుగంలో ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో డేటా సెక్యూరిటీ ఎంత ప్రాణాధారమైనదో ఈ ఘటన మరోసారి నిరూపించింది.   
వెండితెరపైనే కాదు నిజజీవితంలోను రియల్ హీరో అనిపించుకునే హీరోలని ఎంతో మందిని చూస్తుంటాం. ఆ కోవలోనే  నిరంతరం ప్రజాసేవలో మునిగితేలే ఒక హీరో , మరోసారి తనలోని గొప్ప మానవత్వాన్ని చాటుకుని అందరి హృదయాలని గెలుచుకున్నారు.  రీసెంట్ గా రాక్ స్టార్ మంచు మనోజ్  రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్‌ ప్రాంతంలోని 'మాతృదేవోభవ' అనాథాశ్రమాన్ని  నిర్వాహకుల పిలుపు మేరకు సందర్శించాడు.  కేవలం పలకరింపులతో సరిపెట్టకుండా ఆశ్రమంలో నివసిస్తున్న వారి సౌకర్యార్థం డైనింగ్ టేబుళ్లు, కూర్చోవడానికి అవసరమైన కుర్చీలని,ప్రతి ఒక్కరికీ  దుస్తులని  పంపిణీ చేశారు. కొత్త బట్టలు అందుకున్న అక్కడి వారి ముఖాల్లో కనిపించిన ఆనందం, మనోజ్‌కు ఎనలేని తృప్తిని ఇచ్చింది. ఒక సెలెబ్రిటీగా కాకుండా, వారిలో ఒకడిగా కలిసిపోయి సమయం గడపడం అక్కడి వారిని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పర్యటనలో చోటుచేసుకున్న ఒక అనూహ్యమైన సంఘటన అక్కడున్న వారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. Also read: Ranveer singh: బ్యాన్ విధించిన వేళ పవర్ ఫుల్ అమ్మవారి ఆలయంలో రణ్‌వీర్ సింగ్.. అసలు కారణం ఇదేనా! ఆశ్రమంలో ఉన్న ఒక మతిస్థిమితం లేని వ్యక్తిని చూసిన మనోజ్, అతనికి తానే స్వయంగా హెయిర్ కటింగ్ చేయడానికి ముందుకు వచ్చారు. ఏమాత్రం సంకోచం లేకుండా, ఒక సామాన్య వ్యక్తిలా మారిపోయి, చేతిలోకి కత్తెర తీసుకుని ఆ వ్యక్తికి చాలా ఓపిగ్గా హెయిర్ కటింగ్ చేసాడు. ఆ సమయంలో సదరు వ్యక్తి పేరు సంతోష్ అని  కూడా ఎంతో ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. అయితే అతనికి తన పేరు తప్ప మరే ఇతర వివరాలు, గతం గుర్తులేవని ఆశ్రమ నిర్వాహకులు మనోజ్‌కి  వివరించారు. దానికి స్పందించిన మనోజ్ "నీ పేరు చాలా బాగుంది బ్రదర్" అంటూ చిరునవ్వుతో అతనిని ఉత్సాహపరుస్తూ కటింగ్ పూర్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా షేర్ అవుతూ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.    
సినిమా రంగంలో నటీనటులు తమ పాత్రల కోసం రకరకాల ప్రయోగాలు చేయడం, రిస్కులు తీసుకోవడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. కొందరు బరువు పెరిగితే, మరికొందరు ప్రాణాలకు తెగించి స్టంట్లు చేస్తుంటారు. కానీ, కేవలం ఒకే ఒక్క పాత్ర కోసం ఒంటికి వేసుకున్న రంగు కారణంగా ఒక నటుడు తన ప్రాణాలనే కోల్పోయాడనే చేదు నిజం చాలా మందికి తెలియదు. కేవలం 300 రూపాయల కోసం సినిమాలోని ఒక సీన్‌లో బాడీ మొత్తం పెయింటింగ్ వేయించుకోవడానికి ఒప్పుకున్న ఆ నటుడు, చివరకు ఆ రంగు కెమికల్స్ ప్రభావంతోనే తీవ్ర అనారోగ్యానికి గురై మరణించాడు. వెండితెరపై నవ్వులు పూయించిన ఆ హాస్యనటుడి జీవితం చివరి రోజుల్లో అత్యంత దయనీయంగా, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల మధ్య ముగిసిపోవడం సినీ పరిశ్రమలోని మరో చీకటి కోణాన్ని మనకు చూపిస్తుంది. ఆ దురదృష్టకర నటుడి పేరు కరుప్పు సుబ్బయ్య. తెలుగు ప్రేక్షకులకు ఈయన పేరు పెద్దగా తెలియకపోవచ్చు కానీ, తమిళ చిత్ర పరిశ్రమలో 1980, 1990వ దశకాలలో ఈయన ఒక సుపరిచితమైన ముఖం. మధురైకి చెందిన సుబ్బయ్య 1960ల ప్రారంభంలోనే సినిమా అవకాశాల కోసం మద్రాస్ (చెన్నై) నగరంలో అడుగుపెట్టారు. 1961లో వచ్చిన 'కుముదం' చిత్రంతో ఆయన నటుడిగా ప్రయాణం మొదలైంది. తమిళ చిత్రసీమలో అప్పటికే ఎస్. వి. సుబ్బయ్య వంటి దిగ్గజ నటులు ఉండటంతో, ఈయనను ప్రత్యేకంగా గుర్తించడం కోసం శారీరక రంగును బట్టి పరిశ్రమ వర్గాలు 'కరుప్పు సుబ్బయ్య' అని పిలిచేవారు. అలాగే ఆయనకు 'మొట్టై సుబ్బయ్య', 'వెళ్లై సుబ్బయ్య' అనే పేర్లు కూడా ఉండేవి. లెజెండరీ నటుడు శివాజీ గణేషన్ నటించిన ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆయన, ప్రముఖ స్టార్ కమెడియన్ గౌండమణితో కలిసి చేసిన కామెడీ సీన్లు తమిళ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఒక సినిమాలో గౌండమణిని 'ఆఫ్రికా అంకుల్' అని పిలిచే సీన్‌తో ఆయన బాగా పాపులర్ అయ్యారు. తన సుదీర్ఘ కెరీర్‌లో దాదాపు 300 కి పైగా తమిళ చిత్రాలలో హాస్య పాత్రలు, చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ పోషించి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే, 1994వ సంవత్సరంలో విడుదలైన 'పెరియ మరుదు' అనే తమిళ సినిమా కరుప్పు సుబ్బయ్య జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. ఆ సినిమాలో క‌థ‌పరంగా ఆయన పోషించిన ఒక పాత్ర కోసం శరీరానికి పూర్తిగా నలుపు లేదా ఒక ప్రత్యేక రకమైన రంగు వేయాల్సి వచ్చింది. ఆ రోజుల్లో నాణ్యమైన బాడీ పెయింట్స్ అందుబాటులో లేకపోవడం, బడ్జెట్ పరిమితుల కారణంగా కేవలం 300 రూపాయల ఖర్చుతో కూడిన చౌకబారు కెమికల్ రంగులను ఆయన శరీరానికి పూర్తిగా పూసారు. నటనపై ఉన్న పిచ్చితో, సినిమా సీన్ బాగా రావాలనే తాపత్రయంతో సుబ్బయ్య కూడా దానికి వెనుకాడకుండా ఒప్పుకున్నారు. షూటింగ్ సజావుగానే సాగిపోయినప్పటికీ, ఆ తర్వాతే అసలు విపత్తు మొదలైంది. ఆ చౌకబారు పెయింటింగ్‌లోని ప్రమాదకరమైన కెమికల్స్ ఆయన చర్మ రంధ్రాల ద్వారా శరీరంలోకి విపరీతంగా ఇంకిపోయాయి. ఇది క్రమంగా ఆయన అంతర్గత అవయవాలపై తీవ్ర ప్రభావం చూపడం ప్రారంభించింది. ఆ రంగుల సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా కరుప్పు సుబ్బయ్య క్రమక్రమంగా తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడ్డారు. వయసు పైబడుతున్న కొద్దీ ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఒకవైపు శారీరక బాధలు, మరోవైపు వృద్ధాప్యంలో సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. దాదాపు 300 సినిమాల్లో నటించి ప్రేక్షకులను నవ్వించిన ఆ నటుడిని చివరి రోజుల్లో ఆదుకోవడానికి సినీ పరిశ్రమ నుండి ఎవరూ ముందుకు రాలేదు. కనీసం వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేని దుస్థితిలో, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో పోరాడుతూ చివరకు 2013లో కరుప్పు సుబ్బయ్య కన్నుమూశారు. 
కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా "బాలన్ - ది బాయ్" (Balan The Boy). ఈ చిత్రానికి "ఆవేశం" ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్ తో "మంజుమ్మెల్ బాయ్స్" చిత్ర దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా జూన్ 19న హిందీతో పాటు మలయాళం, తెలుగు, కన్నడ, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. "బాలన్ - ది బాయ్" సినిమాను ఏపీ, తెలంగాణలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ పంపిణీ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ రోజు మేకర్స్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ అన్నపూర్ణ స్టూడియోస్ తో కొలాబ్రేట్ అవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా "బాలన్ - ది బాయ్" సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ప్రేక్షకుడికి చేరువ కానుంది. ఈ సినిమా ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.  ఇటీవలే "బాలన్ - ది బాయ్" మూవీ ఫ్రాన్స్ లో జరిగే ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితమై, గ్లోబల్ వేదికపై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మన నేటివిటీతో సాగే కథా కథనాలతో యూనివర్సల్ గా ప్రతి ఆడియెన్ మనసును హత్తుకునే భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని దర్శకుడు చిదంబరం తెరకెక్కిస్తున్నారు. థియేటర్స్ లో తప్పక చూడాల్సిన చిత్రమిది అంటూ మేకర్స్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.
ధురంధర్ సిరీస్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్న స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ చుట్టూ ప్రస్తుతం వివాదాలు ముసురుకున్నాయి. ఒకవైపు సినిమా ఇండస్ట్రీ నుంచి తీవ్రమైన బహిష్కరణ సెగ, మరోవైపు కోర్టు కేసుల ఒత్తిడితో సతమతమవుతున్న రణవీర్ ఈ రోజు   మంగళవారం తెల్లవారుజామున కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మైసూరు చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. ఎలాంటి హడావుడి లేకుండా, సాధారణ భక్తుడిలా ముఖానికి మాస్క్ ధరించి అమ్మవారి దర్శనానికి వెళ్లడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ ఆలయ సందర్శన కేవలం రణ్‌వీర్ సింగ్ సొంత నిర్ణయం మాత్రమే కాదు, దీని వెనుక కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఒక కీలకమైన ఆదేశం కూడా ఉంది. గతేడాది నవంబర్ 28, 2025న గోవాలో జరిగిన 56వ అంతర్జాతీయ చలనచిత్ర జాతీయ అవార్డుల (IFFI) ముగింపు వేడుకల్లో రణ్‌వీర్ సింగ్ తన 'ధురంధర్' సినిమా ప్రమోషన్స్ కోసం స్టేజ్ పైకి వచ్చారు. ఆ సమయంలో కన్నడ సంచలన చిత్రం 'కాంతార' హీరో రిషబ్ శెట్టి నటనని  ప్రశంసించే క్రమంలో, రణ్‌వీర్ ఆ సినిమాలో అత్యంత పవిత్రమైన 'భూత కోల' ఆచారానికి సంబంధించిన ఒక సీన్‌ని  స్టేజ్‌పై అనుకరిస్తూ మిమిక్రీ లాగా చేసాడు . దీంతో  కన్నడిగుల మనోభావాలని  తీవ్రంగా గాయపరిచారనే ఆరోపణలు వచ్చాయి. బెంగళూరుకు చెందిన ఒక న్యాయవాది ఫిర్యాదు మేరకు రణ్‌వీర్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) 2023లోని సెక్షన్లు 196, 299, 302 కింద మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుకు సంబంధించి రణ్‌వీర్ సింగ్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి, తనకు ఎవరినీ అవమానించే ఉద్దేశం లేదని, కేవలం రిషబ్ శెట్టి నటనపై ఉన్న అభిమానంతోనే అలా చేశానని స్పష్టం చేస్తూ బేషరతుగా క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన జస్టిస్ ఎం. నాగప్రసన్న రణ్‌వీర్ క్షమాపణలను అంగీకరిస్తూ కేసును కొట్టివేయడానికి అంగీకరించారు. అయితే ఒక నిబంధన చేసారు. నాలుగు వారాల వ్యవధిలో మైసూరులోని చాముండీ హిల్స్ పై ఉన్న చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకుని, అక్కడ ప్రాయశ్చిత్త పూజలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాల ప్రకారమే రణ్‌వీర్ సింగ్ ఈ రోజు ఉదయం 7:30 గంటల సమయంలో  గుడికి చేరుకున్నారు. Also read: silk smitha: సిల్క్ స్మితపై షకీలా సంచలన వ్యాఖ్యలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న అసలు నిజం సరిగ్గా కోర్టు ఆదేశాలు అమలు చేయాల్సిన ఈ సమయంలోనే రణ్‌వీర్ సింగ్‌కు మరో భారీ షాక్ తగిలింది. ప్రముఖ దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'డాన్ 3' సినిమా నుంచి రణ్‌వీర్ తప్పుకోవడం వల్ల నిర్మాతలకు దాదాపు 45 కోట్ల రూపాయల భారీ నష్టం వాటిల్లింది. దీంతో ఆగ్రహించిన ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) రణ్‌వీర్ పై నాన్-కోఆపరేషన్ డైరెక్టివ్ అంటే సహాయ నిరాకరణ ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం బాలీవుడ్ కార్మికులు, సాంకేతిక నిపుణులు ఎవరూ ఆయనతో కలిసి పని చేయకూడదనే ఒక రకమైన షాడో బ్యాన్ విధించారు. ఒకవైపు 45 కోట్ల వివాదం, మరోవైపు కోర్టు ఆదేశించిన 4 వారాల గడువు ముగుస్తున్న నేపథ్యంలో రణ్‌వీర్  చాముండేశ్వరి అమ్మవారి  ఆలయ పర్యటనని  అత్యంత రహస్యంగా ముగించారు.  
Balan – The Boy, jointly produced by KVN Productions and Thespian Films, known for their grand filmmaking standards, is gearing up for a worldwide theatrical release on June 19 in Malayalam, Telugu, Tamil, Kannada, and Hindi. The film is directed by Chidambaram, the filmmaker behind the blockbuster Manjummel Boys, with a script penned by Aavesham fame director Jithu Madhavan. Venkat K. Narayana and Shylaja Desai Fenn are producing the movie. Leading distribution house Annapurna Studios has acquired the theatrical distribution rights for Andhra Pradesh and Telangana. The makers officially announced their collaboration with Annapurna Studios and expressed happiness over partnering with such a reputed banner. Through Annapurna Studios’ distribution network, Balan – The Boy is expected to reach audiences across both Telugu states on a grand scale. The film has already been drawing attention at the pan-India level. Recently, Balan – The Boy was screened at the prestigious Cannes Film Festival in France, where it received a positive response on the global stage. Director Chidambaram is said to have crafted the film with rooted storytelling and universal emotions that will connect with audiences everywhere. The makers are highly confident that this will be a must-watch theatrical experience. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
పుదీనా ఎంతో సువాసనగా, ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్క.  ఎన్నో రకాల కూరల నుండి పచ్చళ్ల తయారీ  వరకు పుదీనాను  ఉపయోగిస్తారు.   ఇక వేసవి కాలంలో అయితే షర్బత్ నుండి నిమ్మరసం, ఆమ్ పన్నా, మసాలా మజ్జిగ ఇలా.. చాలా పానీయాల తయారీలో కూడా పుదీనాను ఉపయోగిస్తారు. పుదీనా పానీయాల రుచిని పెంచుతుంది. శరీరాన్ని చల్లబరుచుతుంది. అయితే వేడి ఎక్కువగా ఉంటే పుదీనా మొక్క చాలా తొందరగా వాడిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో మొక్కకు పచ్చదనాన్ని పెంచడానికి , మొక్క పచ్చగా ఎదగడానికి కొన్నిచిట్కాలు ఉపయోగించవచ్చు. వాటిలో ఎంతో ప్రబావవంతంగా పనిచేసే చిట్కా తెలుసుకుంటే.. పటిక నీరు.. పుదీనా మొక్కకు పటిక నీటిని కలపడం వల్ల మట్టి ఆమ్లంగా మారుతుంది. కుండీలోని మట్టి క్షారంగా మారినప్పుడు, పుదీనా పెరుగుదల కుంటుపడి, ఆకులు పసుపు రంగులోకి మారతాయి. ఇటువంటి పరిస్థితిలో, పటిక నీటిని ఉపయోగించడం మొక్కకు మేలు చేస్తుంది. పటిక నీరు మట్టి  pH స్థాయిని తగ్గిస్తుంది, దీనివల్ల అది పుదీనా మొక్కకు అనుకూలంగా మారి, పోషకాలను మరింత సులభంగా గ్రహించడానికి వీలు కలుగుతుంది. క్రిమినాశకం.. పుదీనా వాసన తరచుగా కీటకాలను దూరంగా ఉంచుతుంది, కానీ కొన్నిసార్లు చీమలు , బూజు దాని వేళ్ళను ఆశించి, మొక్క దెబ్బతినేలా చేస్తాయి. ఈ సమస్యలున్నప్పుడు   మొక్కపై పటిక నీటిని చల్లవచ్చు. పటికలో యాంటీ బాక్టీరియల్  యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి, ఇవి మొక్కను కీటకాలు, బూజు , చీమల నుండి రక్షించడంలో సహాయపడతాయి. పెరుగుదల.. కొన్నిసార్లు, మొక్కలకు సరైన పోషకాలు అందకపోవడం వల్ల ఆకుల పెరుగుదల మందగిస్తుంది. పటిక నీటిని కలపడం వల్ల ఆకులు పెద్దవిగా, పచ్చగా, , మరింత నిగనిగలాడేలా పెరగడానికి సహాయపడుతుంది. మొక్క  కొమ్మలను చిగురింపజేసి, మరింత దట్టంగా పెరగడం ప్రారంభిస్తుంది. ఎలా వాడాలి? ఒక లీటరు శుభ్రమైన నీటిని తీసుకుని, అందులో ఒక పటిక ముక్కను వేయాలి. అర టీస్పూన్ పటిక పొడి వచ్చేంత ముక్కను వాడాలి. దానిని 10 నుండి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. . నీరు మరీ చిక్కగా ఉండకూడదు. ఈ పటిక నీటిని పుదీనా వేర్లకు అందేలా  పోయాలి. నీటిని కేవలం మట్టికి మాత్రమే అందించాలి.                                 *రూపశ్రీ.
భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ.  పేదవారిలో కూడా చాలా పేదవారు,  ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే  వారు ఎంతో మంది ఉన్నారు. సాధారణంగా కాలం గడిచేకొద్ది జీవితాలలో  ఎంతో కొంత ఎదుగుదల అనేది ఉండాలి.  అలా ఉండకపోవడానికి కారణాలు ఉన్నాయి. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు.. కానీ పేదవాడిగా మరణించడం తప్పు అని ఒక వాక్యం ఉంది.  మనిషి జీవితంలో ఎదగాలని కాలంతో పాటు జీవితాన్ని మెరుగ్గా మార్చుకోవాలని ఈ వాక్యం చెబుతుంది, చాలామంది పేదవాళ్లుగానే మిగిలిపోవడానికి దారితీసే కారణాలు ఏంటో తెలుసుకుంటే.. టీవి, పోన్.. చాలామందికి రోజంతా టీవీ లేదా ఫోన్ చూస్తూ గడిపే అలవాటు ఉంటుంది.  టీవి, ఫోన్ వంటివి మనిషిని వ్యసనపరుడిగా మారుస్తాయి.  టీవిలో ఛానెల్స్ కానీ,  స్మార్ట్ ఫోన్ లో ఎంటర్టైన్మెంట్ యాప్స్ కానీ ఎంత సేపు అయినా అలా మార్చి మార్చి చూస్తుంటారు.  పోన్ లో అయితే స్క్రోల్ చేస్తూ ఉంటే అసలు సమయమే తెలియకుండా గడిచిపోతుంది.   జీవితంలో ఏమీ సాధించకుండా పేదవారిగా ఉండిపోవడానికి టీవి,  స్మార్ట్ ఫోన్ వంటివి ప్రధాన కారణాలు. అలవాట్లు,  అభిరుచులు.. ప్రతి ఒక్కరికి అభిరుచులు, అలవాట్లు అంటూ కొన్ని ఉంటాయి. జీవితంలో ఎదుగుదల ఏమీ లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయినట్టు ఉన్నవారిని గమనిస్తే.. వారికి ఎలాంటి అలవాట్లు,  అభిరుచులు ఉండవు.  అందుకే వారికి జీవితంలో ఎదుగుదల లేకుండా కేవలం ఒకేచోట కూర్చుని కాలక్షేపం చేస్తూ అందులోనే సుఖం అనుభవిస్తూ ఉంటారు. లక్ష్యాలు.. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక లక్ష్యం అనేది ఉండాలి.  లక్ష్యం లేని జీవితంలో ఎదుగుదల అనేది అసలు ఉండదు. లక్ష్యం ఉంటే కష్టపడటం,  జ్ఞానాన్ని ఆర్జించడం,  ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండటం వంటివి జరుగుతాయి. కానీ లక్ష్యం లేకపోతే జీవితం ఒకేచోట పాతిన స్ధంభంలా ఉండిపోతుంది. కంఫర్ట్ జోన్.. చాలామందికి సుఖంగా బ్రతకడం ఇష్టం.  ఛాలెంజ్ తీసుకోవాలన్నా, రిస్క్ చేయాలన్నా అస్సలు ఇష్టపడరు. ఉన్న సంతోషం,  ఉన్న సౌకర్యాలు చాల్లే అనుకుంటారు.  కొత్తగా అ ప్రయత్నం చేయాలన్నా అస్సలు సిద్దపడరు. అందుకే కాలం ఎంత గడిచినా అలాంటి వారు పేదవారిగానే ఉండిపోతారు తప్ప ధనవంతులు, గొప్ప వారు కాలేరు. అదృష్టం.. ప్రపంచంలో కష్టం కంటే అదృష్టాన్ని నమ్మేవారే ఎక్కువగా ఉన్నారు. ఏ అదృష్టమో వచ్చి తమను ధనవంతులను చేస్తుందని నమ్ముతూ.. కష్టపడకుండా, ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా అలాగే ఉండిపోతారు. జాతకాలలోనూ, రంగు రాళ్లలోనూ,  గ్రహాల మార్పులోనూ తమ భవిష్యత్తు ఆధారపడి ఉందని నమ్ముతూ ఉంటారు. ఇతరులను నిందించడం.. నన్ను బాగా చదివించి ఉంటే నేను పెద్ద  ఉద్యగం తెచ్చుకునేవాడిని,  నాకు  బాగా డబ్బు ఇచ్చి ఉంటే నేను మంచి వ్యాపారం చేసేవాడిని అని తల్లిదండ్రుల మీద నిందలు వేస్తూ జీవితంలో ఎదగకుండా ఆగిపోయిన వారు చాలామంది ఉంటారు.  తాము ఎదగకపోవడానికి కారణం పక్కవారే అని చెప్పి పేదవారిగానే ఉండిపోతున్న వారే ఎక్కువగా ఉన్నారు. జీవితంలో ఎదగడానికి కష్టపడేవారు చాలా తక్కువ ఉన్నారు.  పైన చెప్పుకున్న విషయాలే.. ఏ మనిషి అయినా పేదవాడిగానే ఉండిపోవడానికి అసలు కారణాలు.                            *రూపశ్రీ.
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా మంచి గ్రేడ్‌లు సాధించడం అని చాలామంది అనుకుంటారు. కానీ పిల్లలలో  మానసిక బలాన్ని పెంపొందించడం, వారు భవిష్యత్తులో గొప్పగా ఎదగడం మరీ ముఖ్యంగా నాయకత్వ లక్షణాలతో ఉండటం చాలా ముఖ్యం.  ఆత్మవిశ్వాసం అనేది ఏ బిడ్డ వ్యక్తిత్వానికైనా పునాది. అది వారికి తమ మనసులోని మాటను నిర్భయంగా చెప్పే ధైర్యాన్ని, అలాగే వైఫల్యాల నుండి నేర్చుకుని ఓపికతో ముందుకు సాగే బలాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసం ఉన్న పిల్లలు కాలక్రమేణా బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారు. అయితే, ఈ లక్షణాలు రాత్రికి రాత్రే పుట్టేవి కాదు.. వీటికి చిన్నతనం నుండే సరైన మార్గదర్శకత్వం అవసరం. పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచి వారిలో నాయకత్వ లక్షణాలు మెరుగుపడి వారు లీడర్లుగా తయారవ్వాలంటే.. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను పెంచే సమయంలో కొన్ని టిప్స్ పాటించాలి.  అవేంటో తెలుసుకుంటే.. పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచి నాయకత్వ లక్షణాలు పెంచే టిప్స్.. వ్యక్తీకరణ..  పిల్లలకు వారి అభిప్రాయాలను, భావాలను వ్యక్తపరిచే అవకాశం ఇవ్వడం వల్ల వారు స్వేచ్ఛగా తమను తాము వ్యక్తపరచుకోవడానికి , వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. విజయాల గుర్తింపు.. పిల్లలు ఒక చిత్రాన్ని గీసినా లేదా ఒక పద్యాన్ని చదివినా, వారి కృషిని ప్రశంసించాలి. ఇలా మెచ్చుకోవడం వల్ల  పిల్లలలో తాము గౌరవించబడుతున్నామనే భావన కలుగుతుంది, ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని, ప్రేరణను రెండింటినీ పెంచుతుంది. విలువలు,సంప్రదాయాలు.. పిల్లలను కుటుంబ సంప్రదాయాలు, పండుగలు , ఆచారాలతో అనుసంధానించడం వారిలో సాంస్కృతిక అవగాహనను పెంపొందించడానికి , వారి గుర్తింపు పట్ల విశ్వాసాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. సహనం, ఓర్పు..  గెలవడం ఎల్లప్పుడూ అవసరం కాదని, వెంటనే  ఫలితాలు ఆశించాల్సిన అవసరం లేదని పిల్లలకు నేర్పించడం ముఖ్యం. ఓర్పు, సహనం వారు పరిణతి చెందడానికి సహాయపడతాయి. ఆరోగ్యకరమైన అలవాట్లు..  సరైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమయానికి నిద్రలేవడం , రాత్రి సమయానికి నిద్రపోవడం,  వంటివి పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని అంతర్గతంగా బలపరుస్తాయి. ఇది క్రమశిక్షణ , ఆత్మనియంత్రణను కూడా నేర్పిస్తుంది. వైఫల్యాల నుండి నేర్చుకోవడం..  పిల్లలు చేసే  ఏదైనా పనిలో  విఫలమైతే, వైఫల్యం అనేది నేర్చుకోవడంలో ఒక భాగమని వారికి వివరించాలి. ఇది వైఫల్యం  తర్వాత తిరిగి లేచి ముందుకు సాగడాన్ని వారికి నేర్పుతుంది, ఇదే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి కీలకం అవుతుంది. చెప్పేది వినాలి..   పిల్లలతో నిష్కపటంగా మాట్లాడాలి. వారు చెప్పేది శ్రద్ధగా వినాలి. దీనివల్ల, వారు తమ సమస్యలను, ప్రశ్నలను  పంచుకోగలరనే నమ్మకం వారిలో పెరుగుతుంది . వినయం..  ఇతరులకు సహాయం చేయడం, చిన్న విషయాలకే కృతజ్ఞత చూపడం, అందరితో మర్యాదగా ప్రవర్తించడం పిల్లలకు నేర్పాలి. ఇవి వారు ఇతరులతో మమేకమవ్వడానికి, సమాజంలో గౌరవం సంపాదించుకోవడానికి సహాయపడతాయి. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో పైవన్నీ నేర్పిస్తూ ఉంటే.. పిల్లలు తప్పకుండా తమ జీవితంలో ఆత్మవిశ్వాసంలో ఉంటారు.  నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకుని వారి జీవితంలో ఎంతో ఉన్నత స్థానానికి ఎదుగుతారు.                                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న ఆరోగ్య సమస్యలలో ‘క్యాన్సర్’ ముందు వరుసలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ మహమ్మారి, నేడు మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల యువతలోనూ వేగంగా విస్తరిస్తోంది. అసలు క్యాన్సర్ అంటే ఏమిటి? కుటుంబంలో ఒకరికి ఉంటే మిగతా వారికి కూడా వస్తుందా? (Family Cancer Syndromes). దీనికి గల కారణాలు, అధునాతన చికిత్సల గురించి నిమ్స్ (NIMS) హాస్పిటల్ మాజీ సీనియర్ ప్రొఫెసర్ & హెడ్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ మరియు అశ్విన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ జి. సూర్యనారాయణ రాజు (Dr. GSN Raju) గారు ఈ VIDEO లో అందించిన పూర్తి వివరాలు మీకోసం... క్యాన్సర్ అంటే ఏమిటి? (What is Cancer?) మన శరీరంలో కోట్లాది కణాలు ఉంటాయి. ఇవి క్రమపద్ధతిలో విభజన చెందుతూ, పాత కణాలు చనిపోయాక కొత్త కణాలు పుడుతుంటాయి. కానీ, ఈ కణాల విభజన ప్రక్రియపై నియంత్రణ తప్పినప్పుడు, కణాలు అసాధారణంగా, అమితంగా పెరిగిపోతాయి. అలా పెరిగిన కణాల సమూహాన్నే గడ్డలు లేదా ‘ట్యూమర్లు’ అంటారు. ఇవి శరీరంలోని ఇతర భాగాలకు పాకినప్పుడు దానిని క్యాన్సర్ (Malignant) గా గుర్తిస్తారు. ఫ్యామిలీ క్యాన్సర్ సిండ్రోమ్స్ అంటే ఏమిటి? (Family Cancer Syndromes / Hereditary Cancer) చాలా మందిలో ఉండే పెద్ద అనుమానం—"మా కుటుంబంలో ఒకరికి క్యాన్సర్ ఉంది, అది మాకు కూడా వస్తుందా?". డాక్టర్ జి.ఎస్.ఎన్. రాజు గారి వివరణ ప్రకారం, అన్ని క్యాన్సర్లు వంశపారంపర్యంగా రావు. కేవలం 5 నుండి 10 శాతం క్యాన్సర్లు మాత్రమే జన్యుపరమైన లోపాలు (Genetic Mutations) తర్వాతి తరాలకు బదిలీ అవ్వడం వల్ల వస్తాయి. దీనినే 'ఫ్యామిలీ క్యాన్సర్ సిండ్రోమ్' అంటారు. ముఖ్య లక్షణాలు: కుటుంబంలో ఒకే తరానికి చెందిన ఇద్దరు ముగ్గురికి క్యాన్సర్ రావడం, చాలా తక్కువ వయసులోనే (ఉదాహరణకు 30 లేదా 40 ఏళ్లకే) క్యాన్సర్ బారిన పడటం, లేదా ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ రకాల క్యాన్సర్లు (ఉదాహరణకు రొమ్ము క్యాన్సర్ మరియు అండాశయ క్యాన్సర్ రెండూ) రావడం వంటివి జరిగితే అది వంశపారంపర్య క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణలు: బ్రెస్ట్ క్యాన్సర్ (రొమ్ము క్యాన్సర్), ఒవేరియన్ క్యాన్సర్ (అండాశయ క్యాన్సర్), మరియు కోలోరెక్టల్ క్యాన్సర్ (ప్రేగు క్యాన్సర్) లలో ఈ వంశపారంపర్య ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు (Causes of Cancer) వంశపారంపర్య కారణాలు కాకుండా, మిగిలిన 90% క్యాన్సర్లకు మన చేతులారా చేసుకునే పొరపాట్లే కారణమని డాక్టర్ గారు హెచ్చరిస్తున్నారు. అందులో ముఖ్యమైనవి: ధూమపానం మరియు మద్యపానం: సిగరెట్లు, బీడీలు తాగడం, గుట్కా నమలడం వల్ల ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్లు వస్తాయి. అనారోగ్యకరమైన ఆహారం: జంక్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉన్న ఆహారం, మైదా, అతిగా వేయించిన మాంసాహారం తీసుకోవడం. స్థూలకాయం (Obesity): శారీరక శ్రమ లేకపోవడం వల్ల బరువు పెరిగి క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. రసాయనాలు & కాలుష్యం: ఫ్యాక్టరీల నుండి వచ్చే రసాయనాలు, పురుగుమందుల ప్రభావం ఉన్న ఆహార పదార్థాలు. వైరల్ ఇన్‌ఫెక్షన్లు: హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV), హెపటైటిస్-B వంటి వైరస్ల వల్ల కూడా క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స (Diagnosis and Treatment) క్యాన్సర్‌ను మొదటి లేదా రెండో దశలోనే గుర్తిస్తే 100% నయం చేయవచ్చని డాక్టర్ జి.ఎస్.ఎన్. రాజు గారు స్పష్టం చేశారు. కుటుంబ చరిత్రలో క్యాన్సర్ ఉన్నవారు ముందుగానే 'జెనెటిక్ స్క్రీనింగ్' (Genetic Testing) మరియు క్రమంతప్పకుండా హెల్త్ చెకప్స్ చేయించుకోవడం మంచిది. ప్రస్తుతం వైద్యరంగంలో అధునాతన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి: సర్జరీ (Surgery): క్యాన్సర్ గడ్డను శస్త్రచికిత్స ద్వారా తొలగించడం. కీమోథెరపీ (Chemotherapy): శక్తివంతమైన మందుల ద్వారా క్యాన్సర్ కణాలను నిర్మూలించడం. రేడియేషన్ థెరపీ (Radiation Therapy): హై-ఎనర్జీ ఎక్స్-రేల ద్వారా క్యాన్సర్ కణాలను నాశనం చేయడం. ఇమ్యునోథెరపీ (Immunotherapy): శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచి, క్యాన్సర్‌తో పోరాడేలా చేయడం. క్యాన్సర్ పట్ల భయం వద్దు... అవగాహన ముఖ్యం! సరైన జీవనశైలిని అలవర్చుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పండ్లు-కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ ముప్పు నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
ఒకప్పుడు వృద్దులలో కనిపించే ఆరోగ్య సమస్యలు అన్నీ నేటికాలంలో యువతలో కూడా కనిపిస్తున్నాయి. ఎంతో మంది వెన్ను నొప్పి,  డయాబెటిస్,  బిపి, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా చాలామంది యువతను కూడా ఇబ్బంది పెడుతున్న ఇంకొక సమస్య కీళ్ల వాతం. దీన్నే ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. జీవనశైలి సరిగా లేకపోవడం,  ఊబకాయం,  శారీరక శ్రమ తక్కువగా ఉండటం లేదా అసలు శారీరక శ్రమ లేకపోవడం కీళ్ల వాతానికి దారి తీస్తుంది.  కీళ్లవాతం దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉండాలంటే.. కొన్ని పనులు చేయాలి.  అవేంటో తెలుసుకుంటే.. ఊబకాయం.. సాధారణంగా ఎత్తుకు తగ్గ బరువు ఉండాలని చెబుతూ ఉంటారు.  దీన్ని బిఎమ్ఐ అని చెబుతారు. అయితే ఎత్తుకు తగ్గ బరువు కాకుండా ఎక్కువ బరువు ఉండే అధిక బరువు అంటారు.  ఈ అధిక బరువు కంటే కూడా ఎక్కువ బరువు ఉంటే దాన్ని ఊబకాయం అని అంటారు.  కీళ్లవాతం సమస్య ఎక్కువగా ఊబకాయం ఉన్నవారికే వస్తుంది.  అందుకే కీళ్లవాతం రాకూడదంటే ఊబకాయం రాకుండా చూసుకోవాలి.  బరువును అదుపులో ఉంచుకోవాలి.  అదిక బరువు సమస్యలు.. అధిక బరువు ఉంటే మోకాళ్లు, కీళ్లపై ఒత్తిడిని పెంచి ఆర్థరైటిస్ ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. పరిష్కారం.. ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయాలి. అలాగే వాకింగ్,  యోగా,  స్ట్రెచింగ్ వ్యాయామాలు కూడా చేయాలి.  ఇది కీళ్లను బలపరుస్తుంది. కీళ్ల వాతం రాకుండా చేస్తుంది. ఎముకల బలం.. ఎముకలు బలంగా ఉంటే కీళ్ల వాతం కూడా అంత సులువుగా రాదు.  అందుకే ఎముకలను బలంగా ఉంచేందుకు కాల్షియం,  విటమిన్-డి ఉన్న ఆహారాలు చాలా బాగా తీసుకోవాలి. సిట్టింగ్ పొజిషన్.. నేటికాలంలో ఉద్యోగాలు అన్నీ ఒకేచోట కూర్చుని చేసేవే.  ఈ సిట్టింగ్ వర్క్ వల్ల కీళ్లు బిగుసుకుపోయి నొప్రి పెరగడానికి దారితీస్తుంది. అందుకే సిట్టింగ్ వర్క్ చేసేవారు కనీసం అరగంట లేదా గంటకు ఒకసారి లేచి కాస్త అటు ఇటు తిరుగుతూ ఉండాలి. దీనివల్ల కీళ్లు రిలాక్స్ అవుతాయి. ఆహారం.. చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు,  ప్రాసెస్ చేసిన ఆహారాలు శరీరంలో వాపును పెంచడం ద్వారా కీళ్ల సమస్యలకు కారణం అవుతాయి.  అందుకే చక్కెర అధికంగా ఉన్న ఆహారాలను, ప్రాసెస్ చేసిన ఆహారాలను వీలైనంత తక్కువగా లేదా అసలు తీసుకోకుండా ఉండటం మంచిది.                                  *రూపశ్రీ.
దంతాల నొప్పి (Toothache) అనేది ఈ రోజుల్లో చాలా మందిని వేధించే ఒక సాధారణ సమస్య. పంటి నొప్పి వస్తే ఆ బాధ వర్ణనాతీతం. ఒక్కోసారి రాత్రి వేళల్లో అకస్మాత్తుగా నొప్పి వస్తే ఏం చేయాలో తోచక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమయంలో మన ఇంటి చుట్టుపక్కల సులభంగా దొరికే జామ ఆకులు (Guava Leaves) అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయని ప్రముఖ హెర్బలిస్ట్ చెబుతున్నారు.  తెలుగువన్ హెల్త్ (TeluguOne Health) ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆస్ట్రేలియన్ హెర్బల్ క్లినిక్ & మెడిసిన్ కన్సల్టెంట్ హెర్బలిస్ట్ డాక్టర్ జి. లక్ష్మణరావు, Ph.D (Australia) గారు జామ ఆకుల విశిష్టతను, వాటితో దంతాల నొప్పిని ఎలా నయం చేసుకోవచ్చో క్లియర్ గా ఈ వీడియోలో వివరించారు.  జామ ఆకుల్లోని ఔషధ గుణాలు: జామ ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ (Anti-inflammatory), యాంటీ మైక్రోబియాల్ (Anti-microbial) మరియు అనల్జెసిక్ (నోప్పి నివారణ) గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నోట్లోని బ్యాక్టీరియాను నశింపజేసి, చిగుళ్ల వాపులను మరియు పంటి నొప్పిని తక్షణమే తగ్గించడంలో సహాయపడతాయి. డాక్టర్ లక్ష్మణరావు గారు సూచించిన సులువైన ఇంటి చిట్కాలు: జామ ఆకులను నమలడం: లేత జామ ఆకులను శుభ్రంగా కడిగి, నోట్లో వేసుకుని బాగా నమలాలి. ఆ రసం పంటి నొప్పి ఉన్న భాగంలోకి చేరడం వల్ల నొప్పి నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది.  జామ ఆకుల కషాయం (మౌత్ వాష్): కొన్ని జామ ఆకులను నీళ్లలో వేసి బాగా మరిగించాలి. ఆ నీరు గోరువెచ్చగా అయిన తర్వాత కొద్దిగా ఉప్పు కలిపి, నోట్లో పోసుకుని పుక్కిలించాలి (Gargling). ఇది సహజసిద్ధమైన మౌత్ వాష్‌లా పనిచేసి చిగుళ్ల వాపులను, నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 [TeluguOne Health] సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!