కేంద్రంలోని మోడీ సర్కార్ ఈ నెలలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక సమావేశాల్లో  మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు,   నియోజకవర్గాల పునర్విభజన బిల్లలను ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకోవాలని భావిస్తోంది.   ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశముందని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది.  ఈ ఏడాది ఏప్రిల్ 17న లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల అమలు, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో కేంద్రానికి అవసరమైన మద్దతు లభించలేదు. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండోంతుల మెజారిటీ దక్కకపోవడంతో బిల్లు ఆమోదం పొందలేదు. దీంతో ఈ బిల్లుతో  అనుసంధానమైన ఇతర బిల్లులపై కేంద్రం ముందుకు వెళ్లలేదు.   మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన చర్చలో అసలు సమస్య మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలా వద్దా అన్నదొక్కటే కాదు. ఆ రిజర్వేషన్లను ఏ విధానంలో అమలు చేయాలి? నియోజకవర్గాల సంఖ్యను ఎలా మార్చాలి? రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అన్న ప్రశ్నలు కూడా కీలకంగా మారాయి. అన్నిటికీ మించి మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన చట్టం 2023లోనే ఆమోదం పొందింది. అయితే దాని అమలు జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలతో ముడిపడి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్రం ప్రతిపాదించిన మార్పులు మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచే అంశంతో కలిసి ఉంది.   అదే వివాదానికీ కారణంగా మారింది. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంపై రాజకీయంగా దాదాపు అన్ని పార్టీలూ మద్దతు ఇస్తున్నప్పటికీ, ఆ రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అంటే..   నియోజకవర్గాల పేర్లు, సరిహద్దులు మార్చడం మాత్రమే కాదు..  ఏ రాష్ట్రానికి ఎన్ని లోక్‌సభ స్థానాలు ఉంటాయి? ఏ ప్రాంతానికి ఎంత రాజకీయ ప్రాతినిధ్యం దక్కుతుంది? వంటి అంశాలపై కూడా ప్రభావం పడుతుంది.   అందుకే ఈ వ్యవహారం   జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.  ఈసారి బిల్లులకు మద్దతు కూడగట్టేందుకు కేంద్రం ప్రతిపక్ష పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా   డీఎంకేతో చర్చలు సాగుతున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.  మరికొన్ని చిన్న పార్టీల మద్దతును కూడా కూడగట్టేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి.. బిల్లులకు ఆమోదం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో? [Special Session  Parliament,  Womens Reservation Bill, Delimitation Bill, Redrawing Constituencies, Central Government,  DMK, Discussions, Telugu One]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతకొద్ది రోజులుగా ఉత్కంఠ రేపుతున్న కూటమి సీట్ల పంచాయితీకి ఎట్టకేలకు తెరపడింది. ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది. ఈ మేరకు మూడు పార్టీలు ఎక్కడెక్కc ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేయాలో స్పష్టత వస్తూ అధికారిక ప్రకటన వెలువడింది. తాజా లెక్కల ప్రకారం, జనసేన పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా 4 కార్పొరేషన్‌లు, 21 మున్సిపాలిటీలను కేటాయించారు. అలాగే మిత్రపక్షమైన బీజేపీకి 2 కార్పొరేషన్‌లు, 7 మున్సిపాలిటీలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో తమ ప్రాబల్యాన్ని బట్టి కనీసం 40 శాతం సీట్లు ఇవ్వాలని జనసేన పట్టుబ ట్టినప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఆ పార్టీ  అధినేతతో చర్చించి జనసేనను.  20 శాతం లోపు సీట్లకే పరిమితం కావడానికి ఒప్పించారు.  మరోవైపు బీజేపీ పెద్దగా పట్టుబట్టకపోయినా, రాజమండ్రి,  అనంతపురం కార్పొరేషన్‌లతో పాటు 7 మున్సిపాలిటీలను కేటాయించడం గమనార్హం. రాజమండ్రిలో లోక్‌సభ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో అక్కడ ఆ సీటు ఇవ్వడం సహజమే అయినప్పటికీ, అనంతపురం కార్పొరేషన్‌ను కూడా కేటాయించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. చంద్రబాబు తన వ్యూహాత్మక రాజకీయాలతో జనసేనను ఆ పార్టీ కోరినన్ని స్థానాల కోసం పట్టుబట్టకుండా ఒప్పించగలిగారని పరిశీలకులు అంటున్నారు.  చంద్రబాబు తనదైన శైలిలో కూటమిలో సీట్ల సర్దుబాటును పూర్తి చేసి తన రాజకీయ పరిణతిని చాటుకున్నారు. [Ap Localbody Elections, Telugudesham Kutami Seat Sharing, Janasena TDP BJP AP Politics Telugu One]
దేశ రాజకీయాలలో  కాక్రోచ్ జనతా పార్టీ సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజా సమస్యలు, యువత సమస్య పరిష్కారం డిమాండ్ తో ఆ పార్టీ చేపడుతున్న ఆందోళనలు, ఉద్యమాలకు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.  అయితే.. తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ సీజేపీకి మద్దతు పలుకుతూ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి.  ఎన్నికల సంఘం  చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను, ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ ) జ్ఞానేశ్ కుమార్ విధానాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు, ఆందోళనలకు జగన్ మద్దతు పలికారు.   ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలకు దిగిన సీజేపీ కీలక నేతలు సౌరవ్ దాస్ ,  అశుతోష్ రాంకా తదితరులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.  ప్రైవేట్ ప్రాంగణాల ద్వారా నిరసన ప్రదేశంలోకి ప్రవేశించి, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో పోలీసులు వారిపై రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు   నమోదు చేసి, ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్   కోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్ 19 వరకు 5 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి  తీహార్ జైలుకు తరలించారు.   ఈ అరెస్టులను వైసీపీ అధినేత జగన్ ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఆ మద్దతే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం మళ్లీ పునరుద్ధరించబడాలని, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా అరెస్టులు సమస్యను పరిష్కరించలేవని జగన్ సామాజిక మాధ్యవ వేదికగా షేర్ చేసిన పోస్టులో పేర్కొన్నారు. ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  జగన్ సీజేపీకి మద్దతు పలకడం వ్యూహాత్మకమా? లేక బీజేపీతో తెగతెంపులకు సంకేతమా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.   జగన్ బొద్దింకలకు  మద్దతుగా సామాజిక మాధ్యమ వేదికగా మద్దతు పలకడాన్ని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ ఎద్దేవా చేశారు. ఈడీ , సీబీఐ   కేసులను ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి జగన్   ఇటువంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమన్నారు. జగన్ ఏపీలో అధికారంలో ఉన్న కాలంలో  జరిగిన అరాచకాలు, హింసాత్మక ఘటనలను ప్రజలు ఇంకా మరచిపోలేదని, ప్రజాస్వామ్య బద్ధంగా తగిన సమయంలో ప్రజలే వీరికి బుద్ధి చెబుతారని మాధవ్ హెచ్చరించారు.  [YS Jagan upport Cockroach Janta Party, Condemn CJP Leaders Arres, YCP Political Strategy, Election Commission India, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
బుల్లితెరపై సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి చర్చ జరగడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా యాంకర్ రష్మి గౌతమ్‌తో ఆయన కెమిస్ట్రీకి అభిమానుల్లో మంచి క్రేజ్ ఉంది. దీంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారంటూ ఎన్నోసార్లు ప్రచారం జరిగింది. అయితే సుధీర్, రష్మి ఇద్దరూ తమ మధ్య ఉన్నది స్నేహమేనని గతంలో పలుమార్లు స్పష్టం చేశారు.  ఇక ఇప్పుడు సుధీర్‌కు సంబంధించిన పాత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. ఆయనకు 2014లోనే పెళ్లి అయిపోయిందా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. వైరల్ అవుతున్న ఫోటోల్లో సుధీర్‌తో పాటు జబర్దస్త్‌కు చెందిన కొందరు ఆర్టిస్టులు కూడా కనిపిస్తున్నారు. దీంతో ఆయనకు ఎప్పుడో పెళ్లి జరిగిపోయిందని, ఇన్నేళ్లుగా ఆ విషయాన్ని బయటపెట్టలేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ ఫోటోల వెనుక ఉన్న అసలు విషయం వేరే ఉందనే ప్రచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వైరల్ అవుతున్న ఫోటోలు సుడిగాలి సుధీర్‌కు 2014లో జరిగిన ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించినవిగా చెబుతున్నారు. ఆ సమయంలో జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేష్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పాత పోస్ట్ ఇప్పుడు మళ్లీ చర్చలోకి వచ్చింది. ఆ ఫోటోల్లో సుధీర్ పెళ్లి దుస్తుల్లో, మెడలో పూలదండతో కనిపించడంతో చాలామంది ఆయనకు పెళ్లి అయిపోయిందని భావిస్తున్నారు. అయితే ఆ ప్రచారంలో వాస్తవం లేదని, సుధీర్‌కు ఎంగేజ్‌మెంట్ జరిగినప్పటికీ పెళ్లి వరకు వెళ్లకుండానే ఆ సంబంధం ముగిసిందని అంటున్నారు. అయితే దీనిపై సుధీర్ నుంచి ప్రస్తుతానికి అధికారికంగా ఎలాంటి వివరణ రాలేదు. మొత్తానికి పదేళ్ల నాటి ఫోటోలు ఇప్పుడు వైరల్ కావడంతో సుడిగాలి సుధీర్ పెళ్లి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇది కూడా చదవండి: 'రణబాలి'ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా.?       [Sudigali Sudheer Marriage, Sudigali Sudheer Engagement, Sudigali Sudheer Viral Photos, Sudigali Sudheer, Sudheer Rashmi, Jabardasth Rakesh, Telugu Film News]  
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ సినిమా విడుదలైన వేళ మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను తొలగించడంపై ఆయన కాస్ట్యూమ్ డిజైనర్ జిషాద్ షంసుద్దీన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మోహన్‌లాల్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మూడు విభిన్న లుక్స్‌ను సినిమా నుంచి పూర్తిగా తొలగించారని, ట్రైలర్‌లో చూపించిన సన్నివేశాన్ని సైతం ఫైనల్ కట్‌లో తీసేశారని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో మోహన్‌లాల్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. జిషాద్ షంసుద్దీన్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. చిత్రీకరించిన సన్నివేశాలను చూసినప్పుడు తమ పనిపై ఎంతో నమ్మకంగా ఉన్నానని తెలిపారు. ట్రైలర్‌లో మోహన్‌లాల్ కనిపించే భాగం కేవలం రెండు సెకన్లకే పరిమితమైనప్పటికీ, సినిమాలో ఆయన పాత్రకు తగిన ప్రాధాన్యం ఉంటుందని ఆశించానని పేర్కొన్నారు. అయితే సినిమా విడుదలయ్యాక మోహన్‌లాల్‌కు సంబంధించిన మూడు విభిన్న లుక్స్‌ను పూర్తిగా తొలగించడంతో పాటు, ట్రైలర్‌లో కనిపించిన సన్నివేశాన్ని కూడా కట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మోహన్‌లాల్ వంటి సూపర్‌స్టార్‌కు సంబంధించిన సన్నివేశాలను ఇలా తగ్గించడం తనకు బాధ కలిగించిందని అన్నారు. అంతేకాదు.. భవిష్యత్తులో ‘జైలర్’ ఫ్రాంచైజీలో మరో సినిమా వచ్చినా తాను భాగం కాబోనని జిషాద్ స్పష్టం చేశారు. లాభాలు, కోటి క్లబ్బులు, స్టార్‌డమ్ కోసం కాకుండా సినిమా కళను ప్రేమించే ప్రేక్షకులు, అభిమానులు, మోహన్‌లాల్ కోసం తాను నిలబడతానని తన పోస్టులో పేర్కొన్నారు. అయితే ఈ సన్నివేశాలను ఎందుకు తొలగించారనే దానిపై చిత్రబృందం నుంచి స్పష్టమైన వివరణ వెలువడలేదు. ఎడిటింగ్ నిర్ణయాల వెనుక ఉన్న కారణాలు కూడా ఇంకా తెలియరాలేదు. కాగా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్ 2’లో రజనీకాంత్ టైగర్ ముత్తువేల్ పాండ్యన్‌గా మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. మొదటి భాగంలో మాథ్యూ పాత్రలో కనిపించి అభిమానులను ఆకట్టుకున్న మోహన్‌లాల్, సీక్వెల్‌లోనూ అదే పాత్రను పోషించారు. అయితే ఆయనకు మరింత ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుందని ఆశించిన అభిమానులకు ఈసారి నిరాశ ఎదురైంది. మోహన్‌లాల్ పాత్రకు సంబంధించిన సన్నివేశాల తొలగింపుపై కాస్ట్యూమ్ డిజైనర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా చుట్టూ కొత్త చర్చకు తెరలేపాయి.     [Jailer 2 Mohanlal Scenes Cut, Mohanlal Jailer 2 Controversy, Jishad Shamsudeen, Jailer 2 Costume Designer, Rajinikanth Jailer 2, Mohanlal Mathew Character, Jailer 3 News]
ఒక కథను ఒక హీరో రిజెక్ట్ చేస్తే.. అదే కథతో మరో హీరో సినిమా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ నటించిన ‘రణబాలి’ విషయంలోనూ ఇలాంటి ఆసక్తికరమైన ప్రచారం తెరపైకి వచ్చింది. మొదట ఈ కథను ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేశారనే వార్త టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.  దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ మొదట ‘రణబాలి’ కథను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో చేయాలని అనుకున్నారట. అయితే ఈ తరహా పీరియాడిక్ డ్రామాలకు ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గిందని భావించిన రామ్ చరణ్.. ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పలేదని ప్రచారం జరుగుతోంది. ‘రణబాలి’ కథను రామ్ చరణ్ రిజెక్ట్ చేశారనే వార్తతో ఇప్పుడు సోషల్ మీడియాలో మరో చర్చ మొదలైంది. ఒకవేళ ఆయన ఈ సినిమా చేసి ఉంటే ఫలితం ఎలా ఉండేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొందరైతే ఈ సినిమా ఆయన కెరీర్‌కు మరో ఫ్లాప్‌గా మిగిలేదని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం రామ్ చరణ్ లుక్, నటనకు ఈ పాత్ర బాగా సరిపోయేదని అంటున్నారు. 1876–78 మధ్య కాలంలో రాయలసీమ ప్రాంతంలో సంభవించిన మహా కరువు నేపథ్యంతో, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడే యోధుడి కథగా ఈ సినిమాను రూపొందించారు.  తాజాగా థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమా డివైడ్ టాక్ నే సొంతం చేసుకుంది. దీంతో రామ్ చరణ్ ఈ కథ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదా? అనేది అభిమానుల మధ్య ఆసక్తికరమైన చర్చగా మారింది. ఇది కూడా చదవండి: చిరంజీవితో మల్టీస్టారర్.. ఎప్పుడు ఉంటుందో చెప్పిన నాగార్జున.!       [Did Ram Charan Reject Ranabaali, Ram Charan Rejected Ranabaali, Ranabaali Movie, Ram Charan, Vijay Deverakonda, Rahul Sankrityan, Rashmika Mandanna, Telugu Film News]  
మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కలిసి ఒక సినిమాలో నటిస్తే చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి ‘స్టైల్’ సినిమాలో కనిపించినప్పటికీ.. అది కేవలం అతిథి పాత్రలకే పరిమితమైంది. పూర్తిస్థాయిలో ఇద్దరూ కలిసి ఒక మల్టీస్టారర్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. అయితే ఈ కాంబినేషన్ ఎప్పుడు వర్కౌట్ అవుతుందనే విషయంలో తాజాగా నాగార్జున ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. చిరంజీవి, నాగార్జున మల్టీస్టారర్ గురించి గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ఇద్దరు సీనియర్ నటులతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కథ కూడా సిద్ధమైందనే టాక్ వినిపించింది. అయితే తాజాగా నాగార్జున చేసిన వ్యాఖ్యలతో ఈ కాంబినేషన్ విషయంలో మరోసారి ఆసక్తి మొదలైంది. ‘ఇట్లు అర్జున’ ప్రెస్ మీట్ సందర్భంగా చిరంజీవితో సినిమా ఎప్పుడు చేస్తారని నాగార్జునను మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. తాను కూడా ఆ సినిమా కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నానని చెప్పారు. చిరంజీవితో తనకు మంచి స్నేహం, అద్భుతమైన ర్యాపో ఉందని.. ఇద్దరూ ఎప్పుడు కలిసినా కలిసి ఒక సినిమా చేయాలని మాట్లాడుకుంటామని తెలిపారు. అయితే ఇలాంటి క్రేజీ ప్రాజెక్టు పట్టాలెక్కాలంటే సరైన సమయం రావాలని నాగార్జున అన్నారు. ఆ సమయం తప్పకుండా వస్తుందని, అప్పుడు ఈ సినిమా కచ్చితంగా జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో చిరంజీవి, నాగార్జున కలిసి నటించేందుకు సిద్ధంగానే ఉన్నారని.. ఇద్దరికీ సరిపోయే కథ, సమయం కోసం ఎదురుచూస్తున్నారని అర్థమవుతోంది. గతంలో చిరంజీవి, నాగార్జున కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి సినిమా చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. ఆయన ఇప్పటికే కథను సిద్ధం చేశారని, కుటుంబ భావోద్వేగాలు, కామెడీ, మాస్ అంశాలతో ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఇచ్చేలా సినిమా ఉండబోతోందని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు. నాగార్జున తాజా వ్యాఖ్యల్లో కూడా దర్శకుడు అనిల్ రావిపూడి పేరును ప్రస్తావించలేదు. కాబట్టి ఈ మల్టీస్టారర్ ఆయన దర్శకత్వంలోనే ఉంటుందా? లేక మరో దర్శకుడు ఇద్దరు నటులకు సరిపోయే కథతో ముందుకొస్తారా? అనేది చూడాలి. ఇది కూడా చదవండి: ఆదర్శ కుటుంబం.. అసలు ఏమైంది?.. ఇప్పట్లో విడుదల కష్టమేనా.?       [Chiranjeevi Nagarjuna Multistarrer, Megastar Chiranjeevi, Akkineni Nagarjuna, Itllu Arjuna Movie, Anil Ravipudi, Telugu Film News]  
సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో నిరూపించారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘జైలర్ 2’ సినిమా విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించింది. ట్రేడ్ వర్గాల ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.125.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. రజనీ మాస్ ఇమేజ్‌కు తోడు భారీ తారాగణం, సీక్వెల్‌పై ఉన్న అంచనాలు ఈ సినిమాకు ఘనమైన ఓపెనింగ్‌ను అందించాయి. బాక్సాఫీస్ ట్రాకర్ సాక్‌నిల్క్ గణాంకాల ప్రకారం.. భారత్‌లో ‘జైలర్ 2’ తొలిరోజు రూ.59.70 కోట్ల నెట్ వసూళ్లను, రూ.70.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. విదేశీ మార్కెట్ల నుంచి సుమారు రూ.55 కోట్ల గ్రాస్ రావడంతో ప్రపంచవ్యాప్త వసూళ్లు రూ.125.25 కోట్లకు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా 16,599 షోలలో ప్రదర్శితమైన ఈ చిత్రానికి సగటున 55.4 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. అయితే ఇవి తొలిరోజు ప్రాథమిక లెక్కలు కావడంతో తుది వసూళ్లలో మార్పులు ఉండే అవకాశం ఉంది. భాషల వారీగా చూస్తే తమిళ వెర్షన్ అత్యధిక వసూళ్లతో ముందంజలో నిలిచింది. తమిళంలో రూ.43.35 కోట్ల నెట్ కలెక్షన్లు రాగా, తెలుగు రాష్ట్రాల్లో రూ.12.50 కోట్లు వసూలయ్యాయి. హిందీలో రూ.3.50 కోట్లు, కన్నడలో రూ.35 లక్షల నెట్ వసూళ్లు నమోదయ్యాయి. రజనీకాంత్‌కు తమిళనాడుతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ఉన్న అభిమానగణం ఈ భారీ ఓపెనింగ్‌కు ప్రధాన బలంగా నిలిచింది. అయితే తొలి రోజు వసూళ్ల పరంగా ‘జైలర్ 2’ భారీ ఆరంభాన్ని అందుకున్నప్పటికీ, ‘కూలీ’, ‘లియో’ వంటి చిత్రాల ఓపెనింగ్ రికార్డులను మాత్రం అధిగమించలేకపోయింది. అయినప్పటికీ రజనీకాంత్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచే స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఇక వారాంతంలో ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుంది? ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగి కొత్త రికార్డులు సృష్టిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.     [Jailer 2 Box Office Collection, Jailer 2 Day 1 Collection, Rajinikanth Jailer 2, Jailer 2 Worldwide Gross, Jailer 2 Telugu Collections, Jailer 2 First Day Records, Nelson Dilipkumar]
విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా విడుదల విషయంలో మాత్రం ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. అక్టోబర్ 9న రావాల్సిన ఈ మూవీ వాయిదా పడిన తర్వాత కొత్త తేదీని ప్రకటించకపోవడంతో.. అసలు ఇప్పట్లో విడుదలవుతుందా అనే చర్చ జరుగుతోంది. వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా అనగానే ఫ్యామిలీ ఆడియన్స్‌లో ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి సినిమాలు ప్రేక్షకులను ఎంతగా అలరించాయో తెలిసిందే. ఇప్పుడు తొలిసారి దర్శకుడు, హీరోగా కలిసి పనిచేస్తుండటంతో ‘ఆదర్శ కుటుంబం’పై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాను మొదట అక్టోబర్ 2న విడుదల చేయాలని భావించారు. ఆ తర్వాత అక్టోబర్ 9 అన్నారు. కానీ, చివరి నిమిషంలో మెరుగైన అవుట్ పుట్ కోసమంటూ మరోసారి వాయిదా వేశారు. దీంతో దసరా సెలవుల సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించే అవకాశాన్ని ఈ సినిమా కోల్పోయింది. ఇంతవరకు మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయలేదు. అక్టోబర్ 30న విడుదలవుతుందని ఇటీవల ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపించడంలేదు.  సాధారణంగా భారీ అంచనాలున్న సినిమాలకు విడుదలకు కొన్ని వారాల ముందే ప్రమోషన్లు మొదలవుతాయి. కానీ ‘ఆదర్శ కుటుంబం’ విషయంలో మాత్రం అలాంటి హడావిడి కనిపించడం లేదు. దీంతో సినిమా ఈ నెలాఖరులో వస్తుందా? లేక నవంబర్‌కు వాయిదా పడుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కూడా చదవండి: చరణ్ నుంచి ఎన్టీఆర్ వరకు.. బాలీవుడ్ మేకర్స్ కు నో చెబుతున్నారా?       [Aadarsha Kutumbam Release Delay, Aadarsha Kutumbam Release Date, Aadarsha Kutumbam Movie, Venkatesh, Trivikram Srinivas, Telugu Film News]  
కె.రాఘవేంద్రరెడ్డి సమర్పణలో కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దినేష్ కుర్ర నిర్మిస్తున్న చిత్రం ‘డెస్టినీ’. ఈ మూవీకి చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జబర్దస్త్ ఇమాన్యుయేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. శ్రీ సత్య, ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నందినీ రెడ్డి విడుదల చేసి టీంకు బెస్ట్ విషెస్ అందించారు. ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే.. ‘డెస్టినీ’ టైటిల్‌కి తగ్గట్టుగా సరిగ్గా డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది. పోస్టర్‌లో కనిపించే సంకెళ్లు.. ఇమాన్యుయేల్ కనిపించే తీరు, పక్కనే ఉన్న కానిస్టేబుల్.. ఆ దారి.. ఆ అడవి ఇవన్నీ చూస్తుంటే.. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదో చెప్పబోతోన్నారని అర్థం అవుతోంది. టైటిల్‌‌ లోగోలోనూ ఈ ఇద్దరే కనిపిస్తున్నారు. అలా ఈ ఇద్దరి ప్రయాణమే సినిమాగా తెలుస్తోంది.  త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ఇతర అప్డేట్‌లను ప్రకటించనున్నారు. ఈ మూవీకి మారుతి రాజా సంగీతం అందిస్తుండగా, పంకజ్ తొట్టాడ కెమెరామెన్‌గా వర్క్ చేస్తున్నారు. డి. వెంకట ప్రభు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, శ్రీ సత్య, ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల తదితరులు న‌టిస్తున్న ఈ చిత్రానికి కథ-స్క్రీప్లే- డైలాగ్స్ - దర్శకత్వం - చెందు ముద్దు, నిర్మాత: దినేష్ కుర్ర, బ్యానర్: కుర్ర ప్రొడక్షన్స్, సమర్పణ : కె. రాఘవేంద్ర రెడ్డి, DOP: పంకజ్ తొట్టాడ, ఎడిటర్: డి వెంకట ప్రభు, సంగీతం: మారుతీ రాజా, ప్రాజెక్ట్ ప్రణాళిక & రూపకల్పన: చంద్రహాస్ కోట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్ర బాలాజీ, పబ్లిసిటీ డిజైన్స్: ఎ డిజైన్ ఫ్యాక్టరీ.      [destiny movie first look poster, telugu movie destiny, director nandini reddy, jabardast immanuel]  
Kiran Abbavaram's directorial debut Reality has unveiled the first look of its leading lady, Devika Bhat, introducing her as Aalochana. Dressed in a simple green saree, she looks charming in a frame that captures a romantic moment with Kiran in a kitchen, hinting at the film's rooted, middle-class setting. The first look follows the positive response to the film's glimpse, which drew attention to its premise of a middle-class man striving to become debt-free. Kiran plays a caterer and cook whose ambitions and everyday struggles form the heart of this family drama. His line about how every middle-class man dreams of living without debt struck a chord with audiences, adding to the curiosity surrounding the film. With Reality, Kiran is stepping behind the camera after establishing himself as an actor. The glimpse suggested a story that blends family emotions, everyday challenges and romance, with the kitchen setting in Devika Bhat's first look offering another glimpse into the personal world of its characters. Produced by Sudhakar Chaganti, Reality is scheduled to release in theatres on December 25, targeting the Christmas holiday season. The film marks a new chapter for Kiran as a filmmaker, with its relatable premise and family-oriented storytelling forming the basis of its appeal. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Mythri Movie Makers is venturing into the horror thriller genre with 418, an upcoming pan-India film presented by Prashanth Neel. The makers have confirmed October 23 as the release date, with the film set to arrive simultaneously in Telugu, Kannada, Tamil and Hindi. Directed by debutant Kirtan Nadagouda, 418 is backed by the production house's confidence in its script and the vision of a new filmmaker. The trailer and promotional material have already generated curiosity around the thriller, which is taking the unconventional route of relying on its narrative rather than established star power. The film features Chaithra Achar, Surya Raj Veerabathini, Charan Lakkaraju, Preethi Pagadala, Shree Vaishnav and Shashank Patil in key roles. With an estimated budget of Rs. 6-8 crore, the project gives emerging talent an opportunity to reach a wider audience through a simultaneous multilingual release. Mythri has been balancing big-budget productions with content-driven films, while also backing new talent. With 418, the production house is placing its bet on a suspense-driven story and a fresh team.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
King Nagarjuna has decided to present Itllu Arjuna under Annapurna Studios after watching the completed film and being impressed by its content. Starring Aniesh and Anaswara Rajan, the action-packed romantic drama is directed by Mahesh Uppala, with Venky Kudumula making his debut as a producer. The film is scheduled for release on October 30. Explaining what convinced him to back the project, Nagarjuna revealed that his association with the film began when Aniesh approached him for a voice-over for the glimpse. Hearing the story at the time, he cautioned the actor about the risk of choosing a mute character for his debut. However, watching the finished film changed his perception. “I am proud and happy to be associated with Itllu Arjuna. I watched and loved it, then decided to present it on our Annapurna Studios,” Nagarjuna said. The actor also drew comparisons with some of his memorable films while praising the youthful energy of the romantic drama.  “The movie has a very youthful energy and it has Kshana Kshanam, Ninne Pelladutha vibe. Aniesh and Anaswara Rajan's performances amazed me. Mainly, in a mute character, he excelled beyond my expectations,” he said. Nagarjuna further appreciated producer Venky Kudumula's belief in the content and Mahesh Uppala's execution, while highlighting the chemistry between the lead pair. With S Thaman's music already drawing attention, Nagarjuna's association has added another boost to the film's prospects.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ప్రతిరోజూ మనం ఉదయాన్నే తెల్లటి పాలను తాగడం చూస్తూనే ఉంటాం, కానీ ఎప్పుడైనా నల్ల పాలు అనగా బ్లాక్ మిల్క్ గురించి విన్నారా? తన అందం, అద్భుతమైన ఫిట్‌నెస్‌తో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే ప్రముఖ నటి అదా శర్మ తాను తాజాగా నల్ల పాలు తాగుతున్న వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోవడంతో ఈ సరికొత్త ట్రెండ్ హాట్ టాపిక్‌గా మారింది. రోజువారీ ఆహారంలో ఒకేలాంటి పాలు తాగి విసిగిపోయిన వారికి లేదా ఆరోగ్యపరంగా సరికొత్త ప్రయోజనాలను కోరుకునేవారికి ఈ నల్ల పాలు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. ఈ బ్లాక్ మిల్క్ కేవలం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, చర్మానికి మరియు జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రత్యేకమైన పాలను ప్రధానంగా నల్ల నువ్వులు మరియు జీడిపప్పులను ఉపయోగించి తయారు చేస్తారు. వీటిలో శరీరానికి అవసరమైన కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ మరియు జింక్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ పోషకాలు ఎముకలను పటిష్టంగా మార్చడంలో సహాయపడటమే కాకుండా, జుట్టు రాలడాన్ని గణనీయంగా తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి. ఈ ఆరోగ్యకరమైన బ్లాక్ మిల్క్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే విధానం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముందుగా ఒక అరకప్పు నల్ల నువ్వులను తీసుకుని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్‌లో ఈ నువ్వులను వేసి పొడిగా (డ్రై రోస్ట్) వేయించాలి. నువ్వులు చిటపటలాడటం ప్రారంభించిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు అదే పాన్‌లో 8 నుంచి 10 జీడిపప్పులను వేసి దోరగా వేయించుకోవాలి. వేయించిన నువ్వులు కాస్త చల్లారిన తర్వాత, వాటిని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. అందులోనే వేయించిన జీడిపప్పులు, గింజలు తీసేసిన 2 ఖర్జూరాలు, చిటికెడు ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పల్చటి కాటన్ వస్త్రాన్ని తీసుకుని, ఈ మిశ్రమాన్ని అందులో వేసి గట్టిగా పిండాలి. ఇలా చేయడం ద్వారా స్వచ్ఛమైన, చిక్కటి పాలు లాంటి ద్రవం వెలువడుతుంది. దీనిని ఒక గ్లాసులోకి తీసుకుంటే పోషకాలు నిండిన నల్ల పాలు రెడీ అవుతాయి. అంతేకాకుండా, ఈ పాలు తయారు చేయగా మిగిలిన నువ్వులు, జీడిపప్పుల పిప్పిని పారేయకుండా అదా శర్మ ఒక అద్భుతమైన ఫేస్‌ప్యాక్‌లా కూడా ఉపయోగిస్తారు. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసుకుని సుమారు 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చేతులతో సున్నితంగా స్క్రబ్ చేస్తూ కడిగేయడం వల్ల ముఖం అత్యంత మృదువుగా మరియు కాంతివంతంగా మారుతుంది. ఈ విధంగా ఒకే పదార్థంతో అటు ఆరోగ్యాన్ని, ఇటు అందాన్ని కాపాడుకునే ఈ సరికొత్త ఆరోగ్య రహస్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.     Adah Sharma black milk, secret black milk recipe, black milk health benefits, Adah Sharma diet secret, natural detox drinks, celebrity health drinks, charcoal sesame milk recipe.
ప్రపంచ వెన్నుముక దినోత్సవం (World Spine Day) సందర్భంగా, జిమ్‌లో చేసే వ్యాయామాలు మరియు బరువులు ఎత్తడం వల్ల వెన్నుముకకు శాశ్వత నష్టం కలుగుతుందా లేదా అనే ప్రశ్న చాలా మందిలో మెదులుతుంది. కోల్‌కతాలోని నారాయణ ఆర్‌ఎన్ టాగోర్ హాస్పిటల్ కన్సల్టెంట్, స్పైన్ సర్జన్ డాక్టర్ సాయి విక్షేత్ రాజ్ బసాని దీనిపై స్పష్టతనిచ్చారు. సరైన పద్ధతిలో చేసే స్ట్రెంత్ ట్రైనింగ్ వెన్నుముకను పాడుచేయదు సరికదా, దానికి మద్దతుగా నిలిచే కండరాలను బలోపేతం చేస్తుందని మరియు కోర్ స్టెబిలిటీని మెరుగుపరుస్తుందని ఆయన తెలిపారు. చాలా మంది జిమ్ వ్యాయామాలు లేదా బరువులు ఎత్తడం వల్లే వెన్నుపూస దెబ్బతింటుందని తప్పుగా భావిస్తుంటారు, కానీ వాస్తవానికి సమస్య వ్యాయామంలో లేదు, దానిని చేసే విధానంలోనే ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీర సామర్థ్యానికి మించి బరువులు ఎత్తడం, సరైన భంగిమ (Posture) పాటించకపోవడం మరియు వ్యాయామ తీవ్రతను ఒక్కసారిగా పెంచడం వంటి పొరపాట్లు వెన్నుముక డిస్కులు, కీళ్లు, స్నాయువులు మరియు చుట్టుపక్కల కండరాలపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి. వ్యాయామం చేసిన వెంటనే వెన్నునొప్పి రాగానే అది వెన్నుముకకు జరిగిన శాశ్వత నష్టంగా భావించకూడదని డాక్టర్ బసాని స్పష్టం చేశారు. కొత్తగా లేదా కఠినమైన వ్యాయామాలు చేసేటప్పుడు కండరాల నొప్పులు రావడం సహజం, సరైన విశ్రాంతి తీసుకుంటే ఇవి తగ్గిపోతాయి. అయితే, నొప్పిని లెక్కచేయకుండా అదేపనిగా వ్యాయామాలు కొనసాగించడం, లక్షణాలను విస్మరించడం వల్ల సమస్య మరింత జటిలమవుతుంది. వ్యాయామం చేసేటప్పుడు కొందరు తమ శారీరక శక్తిని మించి బరువులు ఎత్తుతుంటారు. అలసట కారణంగా కండరాలు బలహీనపడినప్పుడు, రిపీటీషన్లను పూర్తి చేయడానికి భంగిమను తప్పుగా మారుస్తుంటారు. శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వకుండా పదేపదే అదే కండరాల సమూహాలపై తీవ్రమైన వ్యాయామాల భారాన్ని మోపడం కూడా ప్రమాదకరమే. కాబట్టి, భారీ బరువుల కంటే సరైన టెక్నిక్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, బరువులను క్రమంగా పెంచుకోవాలని మరియు ప్రతి సెషన్‌ మధ్య తగిన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలనే దానిపై స్పష్టత ఉండాలి. వెన్నునొప్పి తగ్గకుండా దీర్ఘకాలం కొనసాగడం, తిమ్మిర్లు రావడం, కండరాల బలహీనత లేదా కాళ్లలోకి నొప్పి పాకడం వంటి సంకేతాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అలాగే మూత్ర విసర్జన లేదా మలవిసర్జనపై నియంత్రణ కోల్పోవడం, గజ్జ ప్రాంతంలో తిమ్మిర్లు వంటి అత్యవసర లక్షణాలు కనిపిస్తే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎమర్జెన్సీ మెడికల్ అసెస్‌మెంట్ పొందాలి, ఎందుకంటే ఇవి తీవ్రమైన నరాల కుదింపును (Nerve Compression) సూచిస్తాయి. చివరగా, భయంతో వెన్నుముక వ్యాయామాలు లేదా వెయిట్ ట్రైనింగ్‌ను పూర్తిగా మానుకోవడం పరిష్కారం కాదని, తెలివిగా వ్యాయాయం చేయడం నేర్చుకోవాలని డాక్టర్ బసాని సూచించారు. బలవర్ధకమైన శరీరాన్ని నిర్మించడం అనేది ఒక క్రమమైన ప్రక్రియ అని, డంబెల్ లేదా బార్‌బెల్ మీద కనిపించే నంబర్ కంటే సరైన పద్ధతే ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ప్రపంచ వెన్నుముక దినోత్సవం మన శరీర ఆకృతిని రక్షించుకోవాల్సిన ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది. సరైన శిక్షణ, దశలవారీగా బరువు పెంచడం మరియు ముందస్తు హెచ్చరికలను గమనించి తగిన వైద్య సలహాలు తీసుకోవడం ద్వారా ఎవరైనా తమ వెన్నుముకను ఆరోగ్యంగా ఉంచుకుంటూ బలమైన శరీరాన్ని పొందవచ్చు.     gym workouts spine damage, back pain gym exercises, gym spine injuries myths, safe heavy lifting tips, gym back safety, gym workouts safe for spine, fitness spine care.  
మన ఇంట్లోని ఫ్లోర్ ఎంత మెరిసిపోతున్నప్పటికీ, టైల్స్ మధ్యలో ఉండే గ్యాప్స్ లేదా సిమెంట్ లైన్స్ నల్లగా మారిపోతే మాత్రం ఇల్లు మొత్తం మురికిగా, పాతదానిలా కనిపిస్తుంది. ముఖ్యంగా రోజూ వాడే వంటగది మరియు బాత్రూమ్‌లలో ఈ సమస్య అత్యంత సాధారణంగా కనిపిస్తుంటుంది. మనం రోజువారీగా ఇల్లు ఎంత శ్రద్ధగా ఊడ్చి, మోపింగ్ చేసినప్పటికీ ఆ సన్నని గ్యాప్‌లలో పేరుకుపోయే నల్లటి మురికి అంత సులభంగా వదలదు. దీంతో చాలామంది మార్కెట్లో లభించే ఖరీదైన క్లీనర్లు కొనుగోలు చేయడం లేదా ఇనుప పీచులతో టైల్స్‌ను గట్టిగా రుద్దడం వంటి పనులు చేస్తుంటారు. దీనివల్ల అనవసరమైన శ్రమ పెరగడంతో పాటు టైల్స్ రంగు మారి దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. అయితే, దీనికోసం భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సిన పనిలేదు, మన ఇంట్లోని వంటగది సామాన్లతోనే ఈ సమస్యను చాలా సులభంగా పరిష్కరించుకోవచ్చు. అసలు టైల్స్ మధ్యలో ఈ నల్లటి మురికి ఎందుకు చేరుతుందో తెలుసుకోవడం చాలా అవసరం. సాధారణంగా టైల్స్ పైభాగం చాలా నునుపుగా ఉండటం వల్ల వాటిపై పడే దుమ్ము, ధూళి సులభంగా తుడిచిపోతాయి. కానీ, రెండు టైల్స్ మధ్యలో ఉండే సిమెంట్ లేదా గ్రౌటింగ్ భాగం కొద్దిగా రంధ్రాలతో ఉండి, కాలక్రమేణా దుమ్ము, మురికి మరియు తేమను తనలోకి పీల్చుకుంటుంది. అందుకే ఆ ప్రాంతంలో క్రమంగా నల్లటి పొర పేరుకుపోతుంది. ఇక వంటగదిలో వంట చేసేటప్పుడు ఎగిరే నూనె జిడ్డు, పొగ మరియు ఆవిరి ఆ లైన్లపై పడి గట్టిపడతాయి. మరోవైపు బాత్రూమ్‌లలో అయితే ఎల్లప్పుడూ నీరు నిలవడం వల్ల అధిక తేమ ఏర్పడి, మురికితో పాటు ప్రమాదకరమైన ఫంగస్, పాచి కూడా తయారవుతాయి. దీనివల్ల ప్రారంభంలో తెల్లగా లేదా లేత రంగులో ఉండే ఆ లైన్లు కాస్త నల్లగా మారి ఇల్లు శుభ్రత లేనిదానిలా కనిపిస్తుంది. ఈ నల్లటి మురికి పొరను సురక్షితంగా మరియు సమర్థవంతంగా వదిలించడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది. ముందుగా ఒక చిన్న గిన్నెలో తగినంత బేకింగ్ సోడా తీసుకుని, అందులో కొద్దికొద్దిగా నీరు కలుపుతూ చిక్కటి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ టైల్స్ మధ్యలో ఉన్న గ్యాప్‌లలో సులభంగా అంటుకునేలా ఉండాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను టైల్స్ మధ్య నల్లగా మారిన ప్రదేశంలో వేళ్లతో లేదా బ్రష్‌తో సరిగ్గా వర్తింపజేయాలి. మురికి లోతుగా వదిలిపోవడానికి ఈ పేస్ట్‌ను కొన్ని నిమిషాల పాటు అలాగే ఆరనివ్వాలి. ఆ తర్వాత ఇంట్లో వాడని పాత టూత్‌బ్రష్ లేదా మెత్తటి ప్లాస్టిక్ బ్రష్‌తో ఆ లైన్లను మెల్లగా రుద్దాలి. ఈ ప్రక్రియలో ఎప్పుడూ ఎక్కువ బలప్రయోగం చేయడం కానీ, ఇనుప స్క్రాపర్లు వాడటం కానీ అస్సలు చేయకూడదు. అలా చేస్తే గ్యాప్‌లలో ఉన్న సిమెంట్ ఊడిపోయి టైల్స్ లూజ్ అయ్యే ప్రమాదం ఉంది. బ్రష్‌తో శుభ్రం చేశాక ఒక తడి గుడ్డతో ఆ పేస్ట్‌ను మరియు విడిపోయిన మురికిని పూర్తిగా తుడిచేయాలి. ఆ తర్వాత మంచి నీళ్లతో శుభ్రంగా కడిగి, చివరగా పొడి గుడ్డతో తుడిచి ఆరబెట్టాలి. ముఖ్యంగా బాత్రూమ్‌లో నీరు నిలవకుండా చూసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే తేమ ఉంటే మళ్లీ ఫంగస్ వేగంగా చేరే అవకాశం ఉంటుంది. అలాగే ఈ శుభ్రత ప్రక్రియలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పక పాటించాలి. చాలామంది బేకింగ్ సోడా మరియు వెనిగర్ కలిపి వాడుతుంటారు, అలా కలిపినప్పుడు కెమికల్ రియాక్షన్ వచ్చి నురుగు వస్తుంది కానీ దానివల్ల శుభ్రం కావడం అనేది అంతగా జరగకపోవచ్చు. పైగా వెనిగర్ మరియు నిమ్మరసంలో ఉండే యాసిడ్ గుణాలు మార్బుల్స్, గ్రానైట్ లాంటి సహజమైన రాళ్లను మరియు సిమెంట్ బంధాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. అలాగే బ్లీచింగ్ పౌడర్ లేదా బ్లీచ్‌ను ఎప్పుడూ కూడా వెనిగర్, నిమ్మరసం లేదా ఇతర కెమికల్ క్లీనర్లతో కలపకూడదు. అలా కలిపితే విషపూరితమైన వాయువులు వెలువడి శ్వాసకోశ ఆరోగ్యానికి తీవ్ర హాని చేస్తాయి. టైల్స్ మధ్య ఎప్పుడూ మురికి పేరుకోకుండా ఉండాలంటే వంటగదిలో నూనె పడిన వెంటనే తుడిచేయాలి. వారాంతాల్లో మెత్తటి బ్రష్‌తో ఆ లైన్లను శుభ్రం చేసుకోవడం ద్వారా మీ ఇల్లు ఎప్పుడూ సరికొత్తగా, మెరిసిపోతూ కనిపిస్తుంది.     tile grout cleaning, clean black dirt between tiles, floor tile cleaning tips, bathroom tile grout cleaner, natural tile cleaner home remedies, clean tile gaps easily.  
ఆరోగ్యంగా ఉండాలని చాలామంది విటమిన్ సప్లిమెంట్లు, ఇతర మందులు వాడుతుంటారు. అయితే ఏ మందును ఎంత మోతాదులో తీసుకోవాలి? ఎన్ని రోజులు వాడాలి? ఇతర మందులతో కలిపి తీసుకోవచ్చా? అనే విషయాలు తెలుసుకోకుండా మందులు వాడితే అనవసరమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా Vitamin D, Vitamin B12 వంటి సప్లిమెంట్లను వైద్యుల సూచనల మేరకు తీసుకోవడం ఎంతో ముఖ్యం. మందులు వాడేటప్పుడు చేసే చిన్న పొరపాట్లు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. వైద్యులకు తమ ఆరోగ్య సమస్యలను పూర్తిగా చెప్పకపోవడం, వాడుతున్న మందుల వివరాలను తెలియజేయకపోవడం, సొంతంగా మందుల మోతాదును మార్చుకోవడం వంటి అలవాట్లు చికిత్సకు ఆటంకం కలిగించవచ్చు. ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం (World Patient Safety Day) సందర్భంగా, రోగుల భద్రతకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను హోమియోపతి వైద్యులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఈ వీడియోలో వివరించారు. Vitamin D, B12 సప్లిమెంట్లు వాడేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? Vitamin D శరీరంలో కాల్షియం శోషణకు, ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనది. Vitamin B12 నరాల పనితీరుకు, ఎర్ర రక్తకణాల తయారీకి అవసరం. ఈ విటమిన్ల లోపం ఉన్నప్పుడు వైద్యులు తగిన పరీక్షలు చేసి, అవసరాన్ని బట్టి సప్లిమెంట్లను సూచించవచ్చు. అయితే ఈ మందులను ఎక్కువ మోతాదులో తీసుకుంటే త్వరగా ఆరోగ్యం మెరుగుపడుతుందని భావించడం సరైంది కాదు. ముఖ్యంగా Vitamin D అధిక మోతాదులో తీసుకోవడం వల్ల రక్తంలో కాల్షియం స్థాయులు పెరిగి ఆరోగ్య సమస్యలు రావచ్చు. అందువల్ల వైద్యుల సలహా లేకుండా మోతాదును పెంచడం లేదా ఎక్కువకాలం కొనసాగించడం చేయకూడదు. వైద్యులకు మీ ఆరోగ్య సమస్యలను ఎందుకు పూర్తిగా చెప్పాలి? కొంతమంది తమకు ఉన్న లక్షణాలను, గతంలో ఎదురైన ఆరోగ్య సమస్యలను లేదా ప్రస్తుతం వాడుతున్న మందులను వైద్యులకు పూర్తిగా తెలియజేయరు. మరికొందరు ఇతరుల సలహాతో మందులు వాడుతుంటారు. ఇలాంటి వివరాలు దాచడం వల్ల సరైన చికిత్స నిర్ణయించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీకు ఉన్న లక్షణాలు, అలర్జీలు, ఇప్పటికే వాడుతున్న మందులు, విటమిన్ సప్లిమెంట్లు, గతంలో తీసుకున్న చికిత్సల గురించి వైద్యులకు స్పష్టంగా చెప్పాలి. ఈ సమాచారం సరైన చికిత్స అందించడానికి, మందుల మధ్య అవాంఛిత ప్రతిచర్యల ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మందుల మోతాదులో చేసే పొరపాట్లు ఎంత ప్రమాదకరం? వైద్యులు సూచించిన మోతాదు కంటే ఎక్కువగా లేదా తక్కువగా మందులు తీసుకోవడం, సమయానికి తీసుకోకపోవడం, ఒకరి మందులను మరొకరు వాడటం వంటి పొరపాట్లను నివారించాలి. మందుల పేర్లు, మోతాదు, తీసుకోవాల్సిన సమయం, వాడే కాలం గురించి స్పష్టత లేకపోతే వైద్యుడిని లేదా ఫార్మసిస్ట్‌ను అడిగి తెలుసుకోవాలి. మందుల వల్ల ఏవైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. వైద్యుల సలహా లేకుండా సూచించిన చికిత్సను నిలిపివేయడం లేదా మోతాదును మార్చడం కూడా సరికాదు. రోగుల భద్రతలో మన బాధ్యత ఏమిటి? రోగుల భద్రత అనేది వైద్యుల బాధ్యత మాత్రమే కాదు. రోగులు కూడా తమ ఆరోగ్యం గురించి అవగాహన కలిగి ఉండాలి. మందుల వివరాలను సరిచూసుకోవడం, వైద్యులు సూచించిన విధంగా వాడటం, సందేహాలు ఉంటే అడగడం, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం వంటి అలవాట్లు చికిత్సను మరింత సురక్షితంగా మార్చడంలో సహాయపడతాయి. ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ అందించే ఈ వీడియోలో Vitamin D, Vitamin B12 మందుల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్యులకు ఆరోగ్య వివరాలను చెప్పడం ఎందుకు అవసరం, మందుల మోతాదులో పొరపాట్లను ఎలా నివారించాలి, సురక్షితమైన చికిత్స కోసం రోగులు పాటించాల్సిన పద్ధతులు వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి. గమనిక: ఈ సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా మందులు, విటమిన్ సప్లిమెంట్లు వాడేందుకు వైద్యులను సంప్రదించండి. వైద్యుల సూచన లేకుండా మందుల మోతాదును మార్చవద్దు.
  శరీర సౌందర్యాన్ని కాపాడుకోవడానికి , చిన్నచిన్న అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి మన పెద్దలు ఎన్నో రకాల గృహ వైద్యాలను సూచించారు. అలాంటి వాటిలో నాభిలో నూనె వేసుకోవడం అనేది చాలా కాలంగా వస్తున్న ఒక సాంప్రదాయ పద్ధతి. ముఖ్యంగా శీతాకాలం లేదా మారుతున్న కాలానికి తగినట్లుగా చర్మం పొడిబారడం, పెదవులు పగిలిపోవడం వంటి సమస్యలు సర్వసాధారణం. ఈ నేపథ్యంలో రాత్రి పడుకునే ముందు నాభిలో కొన్ని చుక్కల ఆవనూనె రాసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, దాని వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటో  వివరంగా తెలుసుకుంటే.. చర్మానికి తేమను అందిస్తుంది.. సాంప్రదాయం వైద్యంలో, ఇంటి చిట్కాలలోనూ, రోజువారీ అలవాట్ల లోనూ నాభికి నూనె రాయడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతారు. ఆవనూనెలో సహజ సిద్ధమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి అవసరమైన తేమను అందించడంలో సహాయపడతాయి. రాత్రి సమయంలో నిద్రపోయే ముందు బొడ్డు ప్రాంతంలో ఆవనూనెను రాసుకోవడం ద్వారా చర్మం లోపలి నుండి పోషణ పొందుతుంది. ఆయుర్వేదంలో శరీరానికి నూనెతో మర్దన చేయడం ఆరోగ్యానికి మంచిదని చెబుతారు.  పొడి చర్మానికి రక్షణ.. మారుతున్న వాతావరణం కారణంగా చాలా మందిలో చర్మం తేమను కోల్పోయి పొడిబారుతుంది. దీనివల్ల చర్మంపై పీచు వలె గరుకుగా మారడం, లాగడం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమయంలో ఆవనూనెలో ఉండే కొవ్వు పదార్థాలు చర్మం పైపొరను మృదువుగా మార్చడానికి సహాయపడతాయి. కేవలం నాభి చుట్టూ మాత్రమే కాకుండా, ఈ నూనె రాయడం వల్ల శరీరంలోని ఇతర భాగాల చర్మానికి కూడా మంచి అనుభూతి కలుగుతుంది. అయితే తీవ్రమైన పొడి చర్మం ఉన్నవారు నేరుగా మంచి మాయిశ్చరైజర్లను ఉపయోగించడం మరింత వేగంగా ఫలితాన్ని ఇస్తుంది. పగిలిన పెదాలను రిపేర్ చేస్తుంది.. చలికాలం లేదా ఎండ తీవ్రత కారణంగా పెదవులు పగిలిపోవడం చాలా మందిలో కనిపిస్తుంది. పెదవులు పగిలి రక్తం రావడం లేదా ఇబ్బందిగా అనిపించడం జరుగుతుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు నాభిలో రెండు లేదా మూడు చుక్కల ఆవనూనె వేసి సున్నితంగా మర్దన చేయడం వల్ల పెదవులు పొడిబారకుండా మృదువుగా మారుతాయని చెబుతారు. అయితే దీనితో పాటు పెదవుల సంరక్షణ కోసం సాధారణ లిప్ బామ్ లేదా పెట్రోలియం జెల్లీని ఉపయోగించడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. జీర్ణవ్యవస్థ కు మంచిది.. జీర్ణవ్యవస్థ విషయానికి వస్తే, కడుపులో తేలికపాటి అసౌకర్యం లేదా నొప్పిగా ఉన్నప్పుడు పొట్ట భాగంలో గోరువెచ్చని నూనెతో మర్దన చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఆవనూనె వంటి వాటితో మసాజ్ చేయడం వల్ల ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల కండరాలు రిలాక్స్ అవ్వడానికి సహాయపడుతుంది.  మహిళల నెలసరిలో.. ముఖ్యంగా మహిళలకు నెలసరి సమయాల్లో పొత్తికడుపులో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి ఈ పద్ధతి కొంత వరకు మానసిక ప్రశాంతతను , మంచి నిద్రను ఇస్తుంది. ఎలా ఉపయోగించాలి? ఆవనూనెను నాభిలో ఎలా ఉపయోగించాలనే సరైన పద్ధతిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. రాత్రి పడుకునే ముందు నాభి ప్రాంతాన్ని శుభ్రంగా కడిగి పొడిగా ఉంచుకోవాలి. ఆ తర్వాత రెండు నుంచి మూడు చుక్కల ఆవనూనెను తీసుకుని, నాభిలో , దాని చుట్టూ ఉన్న చర్మంపై సున్నితంగా రాయాలి. దీనిని చాలా గట్టిగా రుద్దాల్సిన అవసరం లేదు అలాగే అతిగా నూనె పోయాల్సిన పని కూడా లేదు.  కొద్దిపాటి నూనెతో సున్నితంగా మర్దన చేస్తే సరిపోతుంది. అయితే ఈ పద్ధతి అందరికీ ఒకేలా సరిపోతుంది అని చెప్పలేము. సున్నితమైన చర్మం ఉన్నవారికి లేదా ఆవనూనె పడని వారికి దీనివల్ల చికాకు, ఎరుపుదనం, దురద లేదా అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ నూనె రాసిన తర్వాత ఏమైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే  కడిగివేయాలి. ఎలాంటి సమస్యలు లేనివారు ఈ చిట్కాను పాటిస్తూ చర్మాన్ని సంరక్షించుకోవచ్చు.                  *రూపశ్రీ.
థైరాయిడ్ సమస్యలు మహిళల్లోనే ఎందుకు ఎక్కువగా కనిపిస్తాయి? బరువు పెరగడం, నెలసరి సక్రమంగా రాకపోవడం, అలసట, మానసిక ఒత్తిడి వంటి సమస్యల వెనుక థైరాయిడ్ హార్మోన్ల పాత్ర ఎంత? మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి, థైరాయిడ్ పనితీరుకు మధ్య సంబంధం ఉందా? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన సందేహాలకు ఈ వీడియోలో ప్రముఖ వైద్య నిపుణులు, Cell Health Clinics వ్యవస్థాపకులు డాక్టర్ చింతా రవికుమార్ వివరణ ఇచ్చారు. మహిళల్లో థైరాయిడ్ సమస్యలు ఎందుకు ఎక్కువగా ఉంటాయి? మహిళల శరీరంలో యుక్తవయస్సు, నెలసరి, గర్భధారణ, ప్రసవం, మెనోపాజ్ వంటి వివిధ దశల్లో హార్మోన్లలో మార్పులు చోటుచేసుకుంటాయి. రోగనిరోధక వ్యవస్థలోని కొన్ని మార్పుల వల్ల కూడా మహిళలకు థైరాయిడ్ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రతి మహిళకూ థైరాయిడ్ సమస్య వస్తుందని కాదు. లక్షణాలను గుర్తించడం, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. TSH, T3, T4 హార్మోన్లు ఏం చేస్తాయి? థైరాయిడ్ గ్రంథి శరీరంలో జీవక్రియలు, శక్తి వినియోగం, బరువు నియంత్రణ వంటి అనేక ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది. TSH పరీక్ష ద్వారా థైరాయిడ్ పనితీరు గురించి ప్రాథమిక సమాచారం తెలుసుకోవచ్చు. T4 హార్మోన్ శరీరంలో T3 అనే క్రియాశీల హార్మోన్‌గా మారుతుంది. ఈ మార్పిడిని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి? థైరాయిడ్ పరీక్షల్లో వచ్చే ఫలితాలను ఎలా అర్థం చేసుకోవాలి? అనే విషయాలను డాక్టర్ వివరిస్తారు. గట్ హెల్త్‌కు థైరాయిడ్‌కు సంబంధం ఏమిటి? మన పేగుల్లో ఉండే సూక్ష్మజీవులు జీర్ణక్రియతో పాటు శరీరంలోని కొన్ని జీవక్రియల్లోనూ పాత్ర పోషిస్తాయి. పోషకాలు సరిగా అందడం, పేగుల ఆరోగ్యం, శరీరంలోని హార్మోన్ల ప్రక్రియలు పరస్పరం ప్రభావితం చేసుకోవచ్చు. థైరాయిడ్ హార్మోన్ల పనితీరులో గట్ హెల్త్ పాత్ర ఏమిటి? జీర్ణవ్యవస్థ ఆరోగ్యంపై ఎందుకు శ్రద్ధ పెట్టాలి? అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. హషిమోటోస్ థైరాయిడిటిస్ అంటే ఏమిటి? రోగనిరోధక వ్యవస్థ పొరపాటున థైరాయిడ్ గ్రంథిపై దాడి చేసే ఆటో ఇమ్యూన్ పరిస్థితిని హషిమోటోస్ థైరాయిడిటిస్ అంటారు. ఇది థైరాయిడ్ పనితీరును ప్రభావితం చేయవచ్చు. ఈ సమస్యకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు, వైద్య పరీక్షల ప్రాధాన్యత గురించి డాక్టర్ వివరిస్తారు. PCOS, బరువు పెరగడం, నెలసరి సమస్యలకు థైరాయిడ్ కారణమా? PCOS ఉన్న మహిళల్లో నెలసరి క్రమం తప్పడం, బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. థైరాయిడ్ సమస్యల్లోనూ ఇలాంటి కొన్ని లక్షణాలు ఉండవచ్చు. అయితే ఈ సమస్యలన్నింటికీ థైరాయిడ్ ఒక్కటే కారణం కాదు. లక్షణాలను బట్టి సరైన వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. థైరాయిడ్ ఆరోగ్యానికి అయోడిన్, సెలీనియం, జింక్ ఎందుకు అవసరం? థైరాయిడ్ హార్మోన్ల తయారీకి అయోడిన్ అవసరం. సెలీనియం, జింక్ వంటి పోషకాలు కూడా శరీరంలోని సాధారణ జీవక్రియలకు, థైరాయిడ్ హార్మోన్ల ప్రక్రియలకు తోడ్పడతాయి. వీటిని ఆహారం ద్వారా తగినంతగా పొందడం ఎందుకు ముఖ్యం? పోషకాల లోపం ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేయవచ్చు? అనే విషయాలపై ఈ వీడియోలో అవగాహన పొందవచ్చు. మెదడు ఆరోగ్యం, డోపమైన్, సెరోటోనిన్‌తో సంబంధం ఏమిటి? డోపమైన్, సెరోటోనిన్ వంటి రసాయనాలు మెదడులో మానసిక స్థితి, ప్రేరణ, నిద్ర వంటి విధులకు సంబంధించిన ప్రక్రియల్లో పాత్ర పోషిస్తాయి. థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత శక్తి స్థాయులు, ఏకాగ్రత, మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపవచ్చు? ఈ అంశాల గురించి కూడా డాక్టర్ వివరిస్తారు. గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్యలను ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు? గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యంతో పాటు శిశువు ఎదుగుదలకు కూడా థైరాయిడ్ హార్మోన్లు ముఖ్యమైనవి. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనల ప్రకారం పరీక్షలు చేయించుకోవడం, అవసరమైన చికిత్సను కొనసాగించడం ముఖ్యం. గర్భం దాల్చాలని ఆలోచిస్తున్న మహిళలు కూడా తమ థైరాయిడ్ ఆరోగ్యం గురించి వైద్యులను సంప్రదించాలి. మహిళల్లో థైరాయిడ్ సమస్యలకు గల కారణాలు, TSH స్థాయులు, T4 నుంచి T3గా మారే ప్రక్రియ, హషిమోటోస్ థైరాయిడిటిస్, PCOS, గట్ హెల్త్, అవసరమైన పోషకాలు, మెదడు ఆరోగ్యం, గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి ముఖ్యమైన అంశాలపై డాక్టర్ చింతా రవికుమార్ అందించే పూర్తి వివరణను ఈ వీడియోలో చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. థైరాయిడ్ సమస్య ఉన్నట్లు అనుమానం వచ్చినా, పరీక్షల్లో మార్పులు కనిపించినా వైద్యులను సంప్రదించండి. వైద్యుల సలహా లేకుండా థైరాయిడ్ మందులను ఆపడం లేదా వాటి మోతాదును మార్చడం చేయకండి. పోషకాహార సప్లిమెంట్లను కూడా వైద్యుల సూచనల మేరకే ఉపయోగించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా...మన హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మన యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)