తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిరంతరం ప్రజల మధ్య ఉంటారు. ప్రజా శ్రేయస్సు కోసం అనుక్షణం తపిస్తుంటారు. ఆయన అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ఈ విషయంలో  ఆయన తీరు ఇసుమంతైనా మారదు. విజయవాడలో డయోరియా మరణాలు రోజు రోజుకూ పెరుగుతూ ఉంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కానీ, అధికార పార్టీ నేతలు కానీ కనీసం అక్కడి పరిస్థితులపై సమీక్షించలేదు. బాధితులను పరామర్శించలేదు. అసలు విజయవాడ నడిబొడ్డులో డయేరియా విజృంభించి అమాయకుల ఉసురు తీస్తోందన్న విషయం తెలియనట్లుగానే వ్యవహరిస్తున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన విదేశీ పర్యటన ముగించుకుని అమరావతిలో అడుగుపెట్టీపెట్టగానే బెజవాడ డయేరియా బాధితులపై స్పందించారు. వారిని తక్షణమే ఆదుకోవాలని అధికారులను కోరారు. కలుషిత నీరు సరఫరా కారణంగానే ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందన్న చంద్రబాబు బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడం సరికాదని అన్నారు. కలుషిత నీటిపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కోరారు.  ఇంతెందుకు పోలింగ్ పూర్తయిన తరువాత ఆయన ప్రతిక్షణం రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య పరిష్కారం కోసం తన వంతు కృషి చేశారు. అధికారులకు, ఎన్నికల సంఘానికీ లేఖలు రాశారు.  ఈ-ఆఫీస్‌ అప్‌గ్రేడేషన్‌  కూడా చంద్రబాబు ఫిర్యాదుతోనే ఆగింది. వైసీపీ తీసుకొచ్చిన తప్పుడు జీవోలను మాయం చేసేందుకు వైసీపీ సర్కార్ చేసిన ప్రయత్నానికి అడ్డుకట్ట పడింది. రాష్ట్ర బాగోగుల విషయంలో చంద్రబాబు రాజీప డరనడానికి వీటిని ఉదాహరణలుగా పరిశీలకులు చూపుతున్నారు.    
ఓటమి అంచున నిలబడి వైసీపీ నేతలు కొందరు బెదరింపులకు దిగుతున్నారు. హెచ్చరికలు చేస్తున్నారు. ఇంత కాలం తమ వద్ద కుక్కిన పెనుల్లా పడి ఉన్న అధికారులే తమపై కేసులు నమోదు చేస్తుంటే.. ఏమిటీ ధిక్కారం అంటూ పెచ్చులకు పోతున్నారు. రేపు మీ సంగతేమిటో చూస్తాం అంటూ రంకెలు వేస్తున్నారు. ఇంత అన్యాయమా అంటూ పెడబొబ్బలు పెడుతున్నారు. ఔను పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి మరీ రేపు అనేది లేదనుకుంటున్నారా? మీలో ఒక్కర్నీ వదలం తస్మాత్ జాగ్రత్త అంటూ నిన్నమొన్నటి వరకూ తమ అడుగులకు మడుగులొత్తిన అధికారులపై బెదరింపులకు పాల్పడుతున్నారు.  నిజమే.. నిన్నటి దాకా నేరుగా ఎవరి మౌఖికాదేశాలపై అయితే పోలీసులు పని చేశారో.. ఆయనపై ఇప్పుడు అదే పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఔను మామూలుగా అయితే సజ్జలపై క్రిమినల్ కేసు అదీ తాడేపల్లి పోలీసు స్టేషన్ లో నమోదు అయ్యిందంటే.. అర్ధం ఏమిటి?  వైసీపీ హవా ఎత్తిపోయిందనే కాదా? ఎన్నికల ఫలితాలు వెలువడగానే జగన్ మాజీ అయిపోబోతున్నారనే కాదా? అయినా ఆ విషయం పేర్ని నాని లాంటి వారికి ఎందుకు అర్ధం కావడం లేదు? ఒక వేళ అర్ధమైనా చివరి క్షణం వరకూ తమ దబాయింపు సెక్షన్ చెల్లుబాటు అయ్యేలా చేసుకోవాలని భావిస్తున్నారా? తాడేపల్లి పోలీసు స్టేషన్ లో  సజ్జలపై  క్రిమినల్ కేసు, అలాగే వైసీపీకి అందునా ఆ పార్టీ అధినేత జగన్ కు కంచుకోట లాంటి కడపలో కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలు, నేతలకు నగర బహిష్కరణ..దీంతోనే ఇప్పటి దాకా ఏమో ఫలితం ఎలా ఉంటుందో అని ఊగిసలాడుతున్న వారికి కూడా వైసీపీ భవిష్యత్ ఏమిటో అర్ధమైపోయింది. దీంతో రేపు కౌంటింగ్ లో గలాటా చేసే వాళ్లే  ఏజెంట్లుగా కూర్చోవాలి అన్న హుంకరింపుల నుంచి అసలు కౌంటింగ్ సెంటర్ లో కూర్చోడానికి ఏజెంట్ దొరికితే చాలన్న పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఒక వేళ ఏజెంట్లు దొరికినా వారు ఎటూ ఓటమే కదా ఇంతోటి దాని కోసం వాదనలు, గొడవలు ఎందుకు అని ప్రేక్షకపాత్రకే పరిమితమౌతారన్న అనుమానం వైసీపీ నేతలను వేధిస్తోంది. అందుకే అధికారులపై హెచ్చరికలు, బెదరింపులకు పాల్పడటం ద్వారా రాబోయేది మన ప్రభుత్వమే అన్న భరోసా అంతో ఇంతో పార్టీ కేడర్ లో నిలపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని భావించవచ్చు.  ఇక అధికారులు, పోలీసుల తీరు ఒక్క సారిగా ఇలా మారిపోవడానికి వారికి గ్రౌండ్ రియాలిటీ స్పష్టంగా 70ఎంఎం స్క్రీన్ మీద కనిపించడమే అంటున్నారు. ఫలితం ఎలా రాబోతోందో స్పష్టంగా తెలిసిపోయిన నేపథ్యంలో చివరి రోజులలోనైనా నిజాయితీగా నిక్కచ్చిగా పని చేస్తే రాబోయే ప్రభుత్వ గుడ్ లుక్స్ లో పడతామన్న ఆశతోనే అధికారులు వ్యవహరిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ రోజుల హింసాకాండకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనీ, ఏ మాత్రం ఉపేక్షించమన్న స్పష్టమైన హెచ్చరికలు పోలీసుల నుంచి వస్తున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే విజయంపై నమ్మకాన్ని వదిలేసుకున్న వైసీపీ నేతలు  ఆ ఫ్రస్ట్రేషన్ లో అధికారులను బెదరించి మరింత అభాసుపాలౌతున్నారు.  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ హయాంలో అలుపెరుగని పోరాటం ద్వారా ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు రాజకీయ నాయకుడు అయితే మరొకరు ఐపీఎస్ అధికారి. ఇద్దరినీ కూడా కేవలం వ్యక్తిగతంగా కక్ష పెట్టుకుని జగన్ వేధింపులకు గురి చేశారు. వారి స్థాయి, హోదాకు ఇసుమంతైనా విలువ ఇవ్వకుండా నానా రకాలుగా వేధించారు. అయితే ఇద్దరూ కూడా ఎక్కడా తలవొంచలేదు. వేధింపులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఎటువంటి అండా లేకుండా ఒంటరిగానే అలుపెరుగని పోరాటం సాగించారు. వారిద్దరిలో ఒకరు  శుక్రవారం(మే31) సగౌరవంగా రిటైరైన డీజీపీ స్ధాయి పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. మరొకరు ఉండి టీడీపీ అభ్యర్ధి రఘురామకృష్ణంరాజు! ఇరువురూ కూడా జగన్ బాధితులే. ఇరువురూ కూడా ఒంటరిగానే న్యాయపోరాటం, రాజకీయ పోరాటం సాగించారు. ఇరువురూ కూడా అంతిమంగా విజయం సాధించారు. నైతికంగా కూడా ఉన్నతంగా నిలిచారు. అదే స్థాయిలో అశేష ప్రజాభిమానానికీ పాత్రులయ్యారు.  ముందుగా ఏబీ వెంకటేశ్వరరావు విషయం తీసుకుంటే.. 2019లో జగన్ అధికార పగ్గాలు చేపట్టిన రోజు నుంచి మొత్తం అధికార వ్యవస్థకు, అధికార యంత్రాంగానికి ఆయన టార్గెట్ గా మారారు. పెగాసన్ పరికరాల కొనుగోలులో అవినీతి వంకతో ఆయనను సస్పెండ్ చేశారు. సుప్రీం కోర్టు సస్పెన్షన్ చెల్లదని విస్పష్ట తీర్పు ఇచ్చినా సస్పెన్షన్ ఎత్తివేసినట్లే ఎత్తివేసి మళ్లీ అదే కేసులో ఆయనను సస్పెండ్ చేశారు. క్యాట్ ఉత్తర్వ్యులనూ ఖాతరు చేయకుండా ఆయనను సస్పెన్షన్ లోనే ఉండగానే పదవీ విరమణ చేసే పరిస్థితి తీసుకురావడానికి శతథా ప్రయత్నించారు. అయితే ఏబీ వెంకటేశ్వరరావు న్యాయపోరాటానికి తలవంచక తప్పలేదు. ఆయనకు పోస్టింగ్ ఇచ్చితీరాల్సిన అనివార్య పరిస్థితి ప్రభుత్వానికి వచ్చింది. దీంతో ఆయన సగౌరవంగా రిటర్ అయ్యారు. ఏబీ విషయంలో ప్రభుత్వ తీరు ఎంత దుర్మార్గంగా ఉందో ప్రపంచం మొత్తానికి అర్ధమైంది. సామాన్య ప్రజలు కూడా ఆయన ధైర్యానికి, నిజాయితీకి సెల్యూట్ చేస్తున్నారు.  ఇక రఘురామకృష్ణం రాజు విషయానికి వస్తే.. అధికార పార్టీ ఎంపీగా ఆయన ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపడమే నేరమైంది. ఠాఠ్ నేను చేసింది తప్పంటావా? అన్న ఆగ్రహంతో జగన్ ఆయనపై కక్ష కట్టారు.  అక్రమ కేసులు బనాయించి కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అయినా ఆయన ఎక్కడా తొణకలేదు, బెణకలేదు. వైసీపీ రెబల్ ఎంపీగా నిత్యం రచ్చబండ పేరిట జగన్ సర్కార్ నిర్వాకాలను ఉతికి ఆరేశారు. ఈ క్రమంలో ఆయన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టే అవకాశం కూడా లేకుండా పోయింది. అయితే ఆయన పోరాట స్ఫూర్తికి జనం మద్దతు లభించింది. ఎన్నికలకు ముందు ఆయన వైసీపీకీ, ఎంపీ పదవికీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇప్పుడు జనం ఆయన విజయం తథ్యం అన్న నిర్ణయానికి వచ్చేశారు. ఆయన అసెంబ్లీ స్పీకర్ అవుతారన్న ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. రఘురామకృష్ణం రాజును జగన్ అధ్యక్షా అని సంభోదిస్తూ చూడాలని వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. అలా జగన్ టార్గెట్ చేసి వేధించి వేపుకు తిన్న ఇరువురూ కూడా జనాభిమానాన్ని సంపాదించుకున్నారు. జగన్ అధికారాన్ని లెక్క చేయకుండా ఎదిరించి  నైతికంగా ఉన్నతంగా నిలబడ్డారు. ప్రజాభిమానానికి పాత్రులయ్యారు.  
ALSO ON TELUGUONE N E W S
ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అశేష ప్రేక్షాభిమానాన్ని పొందిన హీరోయిన్ త్రిష (trisha)వర్షం, నువ్వొస్తానంటే వద్దంటానా, పౌర్ణమి, కింగ్, స్టాలిన్ ,తీన్ మార్, కృష్ణ, అతడు, బుజ్జిగాడు ఇలా ఎన్నో హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. కొన్ని సంవత్సరాల  గ్యాప్  తర్వాత కూడా  చిరంజీవి  విశ్వంభర లో చేస్తుందంటే ఆమె రేంజ్ అర్ధం చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ విజయ్ లియో లో కూడా మెరిసింది. తాజాగా ఆమె నటించబోయే కొత్త సినిమా వైరల్ గా మారింది. అమ్మోరు తల్లి (ammoru thalli)..తమిళనాట  2020 వ సంత్సరంలో రిలీజ్ అయ్యింది. అగ్ర హీరోయిన్ నయనతార (nayanthara)టైటిల్ పాత్రని పోషించింది. ఫాంటసీ కామెడీ గా తెరకెక్కగా మంచి విజయాన్నే సాధించింది. అమ్మోరు గా నయన్ నటించింది అనే కంటే  జీవించిందని చెప్పవచ్చు. ఇప్పుడు అమ్మోరు తల్లికి సీక్వెల్  తెరకెక్కబోతుంది.ఈ సారి అమ్మోరు పాత్రని  త్రిష పోషించబోతుందనే వార్త తమిళనాట చక్కర్లు కొడుతుంది. ఈ మేరకు మేకర్స్ ఆమెని కలిసి పాత్ర గురించి చెప్పారని తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. మొదటి భాగాన్ని నిర్మించిన ఆర్ జె బాలాజీ నే తన స్వీయ దర్శకత్వంలో సీక్వెల్ ని నిర్మిస్తున్నాడు.మొదటి భాగంలో ఆయన క్యారక్టర్ కి కూడా మంచి పేరు వచ్చింది.  ఇక నయన్ ని కాదని  త్రిష ని ఎంపిక చెయ్యడం తమిళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యింది.  ఎందుకంటే మొదటి భాగంలో నయన్ ని  అమ్మోరు గా తమిళ ప్రేక్షకులు స్వీకరించారు. ఇప్పుడు షారుక్ తో కలిసి చేసిన  జవాన్ తో  తన క్రేజ్ కూడా పీక్ లో ఉంది.దాని వల్ల పాన్ ఇండియా స్థాయిలో అమ్మోరు తల్లికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది.పైగా ప్రెజంట్  తన చేతిలో కొత్త సినిమాలు కూడా ఏమి  లేవు. త్రిష మాత్రం నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. విశ్వంభర తో పాటు థగ్ లైఫ్, ఐడెంటీ, రామ్ అనే నాలుగు చిత్రాలని చేస్తుంది. ఇటీవల వచ్చిన అన్న పూర్ణి వివాదం వల్లనే నయన్ కి అమ్మోరు తల్లిలో అవకాశం రాలేదనే  మాటలు వినపడ్తున్నాయి.   
Mass Ka Das Vishwak Sen has proven his versatility with different films in various genres. Now, he came with a gangster flick, Gangs of Godavari in the direction of Krishna Chaitanya.  Neha Sshetty and Anjali are playing female leads in the film produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya of Sithara Entertainments and Fortune Four Cinemas, respectively.  The film released in theatres yesterday and it got getting mixed reactions everywhere. Even with the negative reviews, the film was able to collect decent numbers on opening day. The film collected 8.2 crores gross on Day 1 worldwide, according to production house. Venkat Upputuri and Gopichand Innumuri are co-producing the film and Srikara Studios is presenting it. Anith Madhadi is handling cinematography and Navin Nooli is editing the film.
Gangs of Godavari, the prestigious project of Vishwak Sen has hit the big screens yesterday. Vishwak Sen and team showed full confidence in the product but the action drama received negative to mixed reviews. Earlier the movie team confirmed that there will be a sequel. In a recent interview, Vishwak Sen revealed exciting news for fans of "Gangs Of Godavari." He confirmed that there will indeed be a continuation of the story. "We wanted to set up a lead into the next part, but due to title issues, we couldn’t include it in the final cut," Sen explained. He also mentioned that the crucial scene hinting at the sequel still resides on his phone. To officially announce the sequel, the team is planning to conduct a special event in the near future. Adding to the anticipation, director Krishna Chaitanya shared more insights into the sequel's concept. "We have something uniquely planned for the sequel. While the lead character will remain the same, his gang and the setting will change dramatically. This shift is something we are all very excited about," Chaitanya stated. He emphasized that the new storyline will bring fresh elements and unexpected twists, making the continuation even more compelling. Keep an eye out for the official announcement event, where more exciting details about the sequel will be unveiled. Anjali and Neha Sshetty played the leading roles. Krishna Chaitanya directed this flick and Naga Vamsi produced it. Yuvan Shankar Raja composed the tunes.
సినిమా పేరు : కీచురాళ్ళు నటీనటులు: రజీషా విజయన్, విజయ్ బాబు, శ్రీనివాసన్,  మణికందన్ పట్టాభి,  రంజిత్ శేఖర్ నయ్యర్ తదితరులు మ్యూజిక్: సిద్దార్థ్ ప్రదీప్ సినిమాటోగ్రఫీ: రాకేశ్ ధరన్ ఎడిటింగ్: క్రిష్టి సెబాస్టియన్ నిర్మాతలు : రాహుల్ రిజి నయ్యర్- సుజిత్ వారియర్ దర్శకుడు: రాహుల్ రిజి నయ్యర్ ఓటీటీ: ఈటీవీ విన్  కథ:  సైబర్ క్రైమ్ కి సంబంధించిన కొన్ని కేసులను పరిష్కరించడానికి పోలీస్ డిపార్టుమెంటు వారు రాధిక(రజీషా విజయన్) సాయం తీసుకుంటూ ఉంటారు. ఆమె తండ్రి ఒక సీనియర్ లాయర్. తండ్రి కూతుళ్లు మాత్రమే ఆ ఇంట్లో ఉంటూ ఉంటారు. ఒక రోజున ఆమె ఫ్రిజ్ రిపేర్ కి సంబంధించి ఒక నెంబర్ కి కాల్ చేస్తుంది. అవతల వ్యక్తి కాస్త అసభ్యంగా మాట్లాడటంతో కాల్ కట్ చేస్తుంది. ఫోన్లో ఆమెతో అలా మాట్లాడిన ఆ వ్యక్తిపేరు కిలి బిజూ. ఒక మాఫియా ముఠాకి సంబంధించిన లోకల్ గ్యాంగులో అతను ఒకడు. ఆ గ్యాంగ్ లో మొత్తం ఐదుగురు ఉంటారు. స్క్రాప్ బిజినెస్ చేస్తున్నట్టుగా అక్కడి వాళ్లను నమ్మిస్తూ పెద్ద గ్యాంగ్ ని రన్ చేస్తుంటారు. రాధిక వాయిస్ నచ్చడంతో, ఫేస్ బుక్ లోకి వెళ్లి ఆమె ఎలా ఉందనేది చూస్తారు. ఆమె గ్లామర్ గా కనిపించడంతో.. తరచూ కాల్స్ చేస్తూ అసభ్య వీడియోలు షేర్ చేస్తూ వేధించడం మొదలుపెడతారు. ఈ విషయాన్ని రాధిక పోలీసుల దృష్టికి తీసుకుని వెళుతుంది. పోలీస్ ఆఫీసర్ ఛార్లెస్ - అష్రఫ్ ఇద్దరు కూడా ఆమెతో ఉన్న పరిచయం కారణంగా స్పందిస్తారు. ఆ రౌడీ గ్యాంగ్ ను పిలిచి వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు. ఆ సంఘటన దగ్గర నుంచి ఆ రౌడీలు మరింత రెచ్చిపోతారు. రాధికను, ఆమె తండ్రిని ఫాలో అవుతూ వేధించడం మొదలుపెడతారు. దాంతో ఆమె తన సైబర్ సెక్యూరిటీ బుర్రను వాళ్ల విషయంలో ఉపయోగిస్తుంది. స్క్రాప్ బిజినెస్ చేసే ఆ ఐదుగురి వెనుక పెద్ద నెట్ వర్క్ పనిచేస్తుందనే విషయం ఆమెకి  అర్థమవుతుంది. తన నెట్ వర్క్ ను ఉపయోగించి, వాళ్ల అక్రమ రవాణాలను అడ్డుకుంటూ ఉంటుంది. దాంతో వాళ్లకి పెద్దమొత్తంలో నష్టాలు రావడం మొదలవుతుంది. ఫలితంగా అందరికి పైనున్న బాస్ నుంచి వాళ్లకి హెచ్చరికలు వస్తుంటాయి. అప్పుడు వాళ్లకి రాధికపై అనుమానం వస్తుంది. రౌడీ గ్యాంగ్ నుండి రాధిక బయటపడిందా? ఆ గ్యాంగ్ వెనుక ఉన్న బాస్ ఎవరు? వాళ్ళు చేసే మోసాలు బయటపడ్డాయా? లేదా అనేది మిగతా కథ‌. విశ్లేషణ:  రాత్రిపూట కీచు కీచుమని వచ్చే కీచురాళ్ళ శబ్దం వల్ల మనుషులకి ఆ భయం ఉంటుంది. అలాగే సమాజంలో అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాల నుండి, వారిని అసభ్యంగా చూసే అబ్బాయిల నుండి ఇన్ స్పైర్ చేసుకొని దర్శకుడు రాహుల్ రిజి నయ్యర్ రాసుకున్నాడు. దర్శకుడు పాటలు, ఫైట్లు, భారీ సెట్లు అంటూ ఏ హంగు ఆర్భాటం లేకుండా తను చెప్పాలనుకున్న దానిని సూటిగా చెప్పేశాడు.  సోషల్ మీడియాలో అమ్మాయిల కోసం నిత్యం నెటిజన్లు వెతుకుతూనే ఉంటారు. అమ్మాయిల నెంబర్ దొరికితే చాలు ఇక వారిని ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి వాటిని చాలా సహజసిద్ధంగా చూపించాడు దర్శకుడు. కథని గ్రిప్పింగ్ గా చూపిస్తూ సాగే సీన్లు ఆకట్టుకుంటాయి. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలలో వచ్చే ట్విస్ట్ లు ఏవీ లేకపోయినా కథనాన్ని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా మేకర్స్ చాలా పకడ్బందీగా తీశారు. భిన్నమైన కథలని ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చేస్తుంది. అయితే  కథ మొత్తం రాధిక  చుట్టూనే తిరగడం.. నాలుగైదు లొకేషన్స్ లో కథ సాగడంతో అక్కడక్కడా కాస్త బోరింగ్ అనిపించినా.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది.  భారీ తారాగాణం లేకపోవడం.. తెలుగు ఆడియన్స్ కి తెలిసినవాళ్ళు లేకపోవడం మైనస్. కానీ ఫ్రెష్ కథని చూడాలనుకునేవారు ఈ సినిమా ట్రై చేయొచ్చు. అడల్ట్ సీన్లు ఏమీ లేవు.. సినిమాని ఫ్యామిలీతో కలిసి చూసేలా దర్శకుడు జాగ్రత్తపడ్డాడు. రాకేశ్ ధరన్ సినిమాటోగ్రఫీ బాగుంది‌. సిద్ధార్థ్ ప్రదీప్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. క్రిష్టి సెబాష్టియన్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల పనితీరు:  రాధిక పాత్రలో రజీషా విజయన్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది.  విజయ్ బాబు, శ్రీనివాసన్, మణికందన్ తమ పాత్రలకి న్యాయం చేశారు. మిగిలిన వారు పాత్రల పరిధి మేరకు నటించారు. ఫైనల్ గా.. ఆడవాళ్ళు తప్పకుండా చూడాల్సిన ఈ సినిమాని ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసేయొచ్చు. రేటింగ్ : 2.75/5  ✍️. దాసరి మల్లేశ్
బాలకృష్ణ (balakrishna)బోయపాటి శ్రీను (boyapati srinu)కాంబో కి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. 2010 లో ఏ  ముహూర్తాన  సింహా స్టార్ట్ చేసారో గాని.. విశ్వం ఉన్నంత కాలం ఆ ఇద్దరి కాంబోలో సినిమాలు వస్తూనే  ఉండాలని  కోరుకుంటారు.ఇక ఫ్యాన్స్ గురించి అయితే  చెప్పుకోవాల్సిన పని లేదు. ఆ ఇద్దరి కాంబో మూవీ కోసం అవసరమైతే వాళ్లే నిర్మాతలుగా మారతారు. అంత క్రేజ్ ఉంది మరి.. వరుసగా సింహా,లెజండ్, అఖండ లాంటి హ్యాట్రిక్ హిట్ లతో సిల్వర్ స్క్రీన్ వద్ద పెద్ద బీభత్సమే సృష్టించారు. పైగా అసలు సిసలు తెలుగు సినిమాకి అర్ధం కూడా చెప్పారు. తాజాగా బోయపాటి కి సంబంధించిన ఒక వార్త బాలయ్య ఫ్యాన్స్ లో హుషారుని తెస్తుంది. బాలకృష్ణ,బోయపాటి కాంబోలో అఖండ 2 (akhanda 2)ఉందన్న  విషయం తెలిసిందే. ఇటీవల రామ్ పోతినేని తో స్కంద చేసిన బోయపాటి నెక్స్ట్  ప్రాజెక్ట్ అఖండ  2 నే.ఇప్పుడు ఆయన దృష్టి మొత్తం అఖండ 2 మీదే ఉంది. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యింది. బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆలస్యం షూట్ కి వెళ్లడమే. ఇక ఈ లోపు బోయపాటి మిగతా కార్యక్రమాలని పూర్తి చేస్తున్నాడు.విలన్స్ వేటలో పడ్డాడనే వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ కి ధీటుగా ఉండే విలన్ కోసం సెర్చ్ చేస్తున్నాడు. .ఒకప్పటి  హీరోలు ఇప్పటి విలన్స్ అయిన సంజయ్ దత్, బాబీ డియోల్ ని  సంప్రదిస్తున్నాడు. ఆ ఇద్దరు ఉంటారా లేక వారిలో ఒకరా అనేది  మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది. బోయపాటి విలన్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. పర్టిక్యులర్ గా బాలయ్య విలన్ కి కొంచం ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఎవరు ఊహించని విధంగా  లెజండ్, అఖండ లో   శ్రీకాంత్, జగపతి బాబు లని ఫిక్స్ చేసాడు.అదే విధంగా ఇంకో కొత్త వ్యక్తి ని విలన్ గా పరిచయం చేస్తాడేమో చూడాలి.  అఖండ హిట్ కావడంతో అఖండ 2 మీద అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. పైగా అఘోరా క్యారక్టర్ లో బాలయ్య నట విశ్వరూపం ఏ స్థాయిలో ఉండబోతుందో అనే ఆసక్తి కూడా ఉంది. ప్రస్తుతం  బాలకృష్ణ వాల్తేరు వీరయ్య తో చిరంజీవి (chiranjeevi)కి ఆదిరిపోయే హిట్ ఇచ్చిన బాబీ (bobby)డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ కొంత భాగం షూటింగ్ ని కూడా  జరుపుకుంది. ఎలక్షన్స్ రిజల్ట్ రాగానే మిగతా షూట్ ని కంప్లీట్ చేసి ఆ తర్వాత  అఖండ 2 లో పాల్గొంటాడు. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో అల్లు అరవింద్ నిర్మిస్తాడనే టాక్ అయితే  ఉంది. అఖండ పార్ట్ 1  ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు.  
Power Star Pawan Kalyan will be seen playing a warrior role in a historical Epic warrior movie, Hari Hara Veera Mallu, for the first time in his career. His fans are overjoyed ever since the announcement and are eagerly waiting for the film to release in theatres.  The Hari Hara Veera Mallu team has surprised everyone with an exhilarating, intense teaser and the fans have gone crazy for the visuals and presentation of their matinee idol on screen. Young director Jyothi Krisna has been key in bringing out the teaser to make a fresh announcement about the film.  Highly sought after cinematographer Manoj Paramahamsa has been roped in for the remainder of the film and the skilled technician immediately started planning the shoot. The team released a photo of him involved in a deep conversation with production designer Thotha Tharani and VFX supervisor Srinivas Mohan alongside producer AM Rathnam and director Jyothi Krisna.  The team is now completing recce for new locations to shoot remainder of the film at a quick pace. Along with that, they are completing VFX and post production works of the film shot till date. The team is determined and on track to release Hari Hara Veera Mallu Part-1 Sword vs Spirit, by the end of this year.
Natural Star Nani who is riding high with consecutive hits is presently starring in a unique actioner Saripodhaa Sanivaaram being made under the DVV Entertainment banner. Recently the production house that offered Nani’s birthday special by unveiling a teaser has provided another pleasant surprise. They announced #Nani32 under the banner. Director Sujeeth will be helming the new movie to be bankrolled by DVV Danayya and Kalyan Dasari. Makers planned to go on floors, once Saripodhaa Savinaavaram is done with its shoot. The pre production works are going on. Due to the budget issues and considering the current market conditions, makers halted this project. Nani 32 movie billed to be a witty action ride and lot of producers are in race to bankroll the project. Now, Nani wants to shelve the project permanently due to the confusion. Nani took another shocking decision and that is to shelve another project. It is known that Balagam fame Venu Yeldandi planned to make a film with Nani titled "Yellamma." Dilraju planned to bankroll under Sri Venkateswara Creations. Recently Nani heard the final draft and it was big No from the actor. Looks like, the project will not be happening. Saripodhaa Sanivaaram releasing worldwide in theatres on August 29th. Nani's immediate next will be a action film with Srikanth Odela of Dasara Ffame.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)పాన్ ఇండియా లెవల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా  ఈ పేరు మారుమోగిపోతుంది.ఒక వైపు ఎలక్షన్స్ రిజల్ట్..ఇంకో వైపు సినిమాలు. పర్టిక్యులర్ గా సినిమాలని ఎందుకు అంటున్నానంటే.. హరిహరవీరమల్లు(hari hara veera mallu)ఓజి (og)ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh)అనే సినిమాలని పవన్ స్టార్ట్ చేసాడు. ఈ మూడింటిలో ఓజి శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది  కానీ ఇప్పుడు  బ్రేక్ పడనుంది.  అవును.. ఓజి కి బ్రేక్ పడనుంది.  హరిహరవీరమల్లు.ఆ ప్లేస్ లోకి రాబోతుంది. రెండు సంవత్సరాల క్రితమే వీరమల్లు షూటింగ్ మొదలయ్యింది. ఇంకా గట్టిగా చెప్పాలంటే 2020 లోనే  స్టార్ట్ అయ్యింది. అంటే నాలుగు సంవత్సరాల పైనే అవుతుంది.ఈ మూవీ తర్వాత  స్టార్ట్ అయిన ఓజి,  ఉస్తాద్ భగత్ సింగ్ లు అయితే కొన్ని షెడ్యూల్స్ ని చాలా ఫాస్ట్ గానే పూర్తిచేసుకుంది. అది కూడా వీరమల్లుని పక్కన పెట్టి మరి.  దీంతో  మూవీ ఆగిపోయిందనే రూమర్స్ కూడా వచ్చాయి.  అభిమానుల్లో మొదలయిన కలవరాన్ని  ప్రొడ్యూసర్ మీడియా ముందుకు వచ్చి పోగొట్టాడు ఎంటైర్ పవన్ కెరీర్ లోనే నెంబర్ వన్ మూవీగా వీరమల్లు నిలుస్తుందని చెప్పాడు. లేటెస్ట్ న్యూస్ ప్రకారం పవన్ ఓజి ని  పక్కన పెట్టి వీరమల్లు ని కంప్లీట్ చెయ్యబోతున్నాడు. కేవలం  ఇరవై ఐదు రోజులు షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉంది. పవన్ ఆ మొత్తం రోజులుకి  డేట్స్ ఇవ్వబోతున్నాడనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో చక్కెర్లు కొడుతుంది. సో పవన్ ఫస్ట్ కొట్టే  గుమ్మడికాయ వీరమల్లు నే.  ఇప్పుడు ఈ న్యూస్ తో పవన్ ఫ్యాన్స్ లో జోష్ మాములుగా లేదు. ఎందుకంటే ఇప్పటి దాకా పవన్  ఎన్ని సినిమాలు చేసినా అవన్నీ  యూత్, లవ్ అండ్ కమర్షియల్ సినిమాలే. ఫస్ట్ టైం చారిత్రాత్మక మూవీ లో చేస్తున్నాడు. దీంతో ఫ్యాన్స్ అందరు చాలా గర్వంగా ఉన్నారు. ఓజి కి  పదిహేను రోజులు డేట్స్ ఇస్తే కంప్లీట్ అవుతుంది. ఇక వీరమల్లుకి డైరెక్టర్ మారిన విషయం తెలిసిందే. క్రిష్ స్థానంలో జ్యోతికృష్ణ వచ్చి చేరాడు. దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే క్రిష్ చేస్తాడు. గతంలో గోపీచంద్ హీరోగా వచ్చిన ఆక్సిజెన్ మూవీకి జ్యోతి కృష్ణ నే దర్శకుడు. మెగా ప్రొడ్యూసర్ ఏఎంరత్నం భారీ బడ్జట్ తో నిర్మిస్తున్నాడు. వీరమల్లు  ఆయన కలల ప్రాజెక్ట్  కూడాను.   
Anand Deverakonda's "Gam Gam Ganesha" released in theaters yesterday, receiving a phenomenal response from audiences who thoroughly enjoyed the film. Despite lukewarm reviews, the movie has strong word of mouth and overwhelming audience support. Evening and late-night shows were sold out, with families particularly enjoying Anand Deverakonda and Emmanuel track, as well as Vennela Kishore's comedic performance in the second half. "Gam Gam Ganesha" is an perfect family entertainer with its quirky humor. The film's successful run and high occupancy are expected to continue in the coming days, especially with the weekend holidays today and tomorrow likely leading to more sold-out shows. Featuring Pragathi Srivastava and Nayan Sarika in lead roles, the film is produced by Kedar Selagamshetty and Vamsi Karumanchi under the Hy-Life Entertainment banner and marks Uday Shetty's directorial debut.
"Bhaje Vaayu Vegam," featuring Kartikeya Gummakonda, Iswarya Menon, and Rahul Tyson in lead roles, is directed by Prashanth Reddy. The film, which centers around the intertwining lives of cops, gangsters, and politicians, hit theaters on Friday, May 31, 2024. "Bhaje Vaayu Vegam" has garnered a positive response from audiences. Kartikeya's films have consistently resonated with viewers, and this one, with its mix of thrills and suspense, is no exception. The movie, brimming with drama and excitement, promises to keep viewers engaged from start to finish. The enthusiastic reviews and strong word of mouth are boosting "Bhaje Vaayu Vegam" among the three films released yesterday. The film saw an uptick in attendance during the evening shows and is set for a strong weekend, bolstered by positive word of mouth. Expectations are high for the film to perform well at the box office. This marks a hat trick of hits for UV Creations, following the successes of "Gaami" and "Om Bheem Bush," with "Bhaje Vaayu Vegam" now joining the list. Presented by the prestigious production company UV Creations, the movie "Bhaje Vaayu Vegam," is produced under the banner of UV Concepts. Director Prashanth Reddy has crafted this film as an emotional action thriller. Ajay Kumar Raju P acted as the co-producer.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరి జీవితంలో మానసిక ఒత్తిడి సర్వసాధారణం అయిపోయింది. వీటిని జయించడానికి ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ వాటి విషయంలో ఫలితాలు మాత్రం కాస్త నిరాశగానే ఉంటాయి. ఎందుకంటే ఒత్తిడి నుండి బయటపడటానికి ఎంత ప్రయత్నించినా దానిలో సఫలం అయ్యేవారు చాలా కొద్దిమందే ఉంటారు. అయితే ఒత్తిడి అనేది పూర్తిగా మనిషి మానసిక పరిస్థితి వల్ల కలిగేది. దీన్ని జబ్బు కింద జమచేసి చాలా కాలమే అయినా దీనికి తగిన మందు మాత్రం కనుగొనలేకపోయారు. అయితే ఒత్తిడి జయించడానికి ఎప్పుడూ చేసే ప్రయత్నాలే కాకుండా దాని గురించి అందరినీ అలర్ట్ చేస్తూ ఒత్తిడి భూతానికి దూరంగా ఉండేందుకూ, ఒత్తిడి సమస్య ఉన్నపుడు దాన్ని జయించడానికి సలహాలు, సూచనలు, జాగ్రత్తలు మొదలైన వాటిని చర్చించుకునేందుకు ఓ రోజును కేటాయించారు. దాన్నే వరల్డ్ మెంటల్ హెల్త్ డే గా, ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన దీన్ని నిర్వహిస్తారు. మానసిక ఆరోగ్యం సరిగా లేకుండా ఒత్తిడిలోకి జారుకుని ఎంతోమంది బలవన్మరణానికి కూడా పాల్పడుతున్నవారు ఉన్నారు. ఎంతోమంది సెలెబ్రిటీస్ జీవితాలు కూడా ఇలాంటి సమస్య వల్ల ముగిసిపోయాయి.  మానసిక ఒత్తిడి ఎలా పుడుతుంది?? బాధ్యతలు ఎక్కువైనప్పుడు, మనిషిని అర్థం చేసుకోనపుడు మానసికంగా అలసిపోవడం జరుగుతుంది. తగినంత విశ్రాంతి దొరకకపోతే ఆ అలసట కాస్తా ఒత్తిడిగా మారుతుంది. అది పెరుగుతూ వెళ్ళేకొద్ది విశ్వరూపం దాలుస్తుంది. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కనీసం దాన్ని పంచుకునేవారు లేకపోవడం, వ్యక్తి నలిగిపోతున్నప్పుడు గమనించకుండా వారి మానాన వారిని వదిలేయడం వల్ల మానసిక సమస్య అనేది ప్రమాదకర సమస్యగా రూపాంతరం చెందుతోంది. ఏమి చెయ్యాలి?? మానసిక సమస్యను అధిగమించడానికి కొన్ని మార్గాలు ఫాలో అవ్వాలి. వాటి వల్ల ఒత్తిడి నుండి బయటపడవచ్చు.  మీకోసం మీరు కాస్త సమయం కేటాయించుకోవాలి!! మనసు భారంగా మారితే ఒత్తిడి తాలూకూ ప్రభావం పెరుగుతుంది. అందుకే మనసును ఎప్పటికప్పుడు తేలికగా మార్చుకుంటూ ఉండాలి. ఎమోషన్స్ ని భరిస్తూ ఉండటం అంటే ఒత్తిడిని నెత్తిన పెట్టుకొని తిరగడమే. అందుకే ఒత్తిడిని జయించాలంటే మనసును తేలికగా ఉంచుకోవడమే ఉత్తమ పరిష్కారం.  ఇష్టమైన పనులను చేయడం!! ఇష్టమైన పనులు చేయడంలో తృప్తి ఉంటుంది. ఈ తృప్తి మనిషిని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. మనిషి ఎన్ని బరువులు మోస్తున్నా తనకు నచ్చిన పని చేస్తున్నాననే సాటిసిఫాక్షన్ మనిషిని హాయిగా ఉంచుతుంది. మంచి నిద్ర!! నిద్ర ఒక గొప్ప ఔషధం. నిద్ర సరిగ్గా ఉంటే ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం దొరికేసినట్టే ప్రతి మనిషికి రోజుకు కనీసం 6 నుండి 8 గంటల నిద్ర తప్పనిసరిగా అవసరం అవుతుంది. రోజు మొత్తం అలసట నుండి శరీరానికి మెదడుకు ఆమాత్రం విశ్రాంతి కచ్చితంగా అవసరం.  ఎమోషన్స్ ని మోయకూడదు!! కొందరు ఏ ఎమోషన్ బయట పెట్టకుండా ఉండటం వల్ల ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం లేదని అనుకుంటూ వుంటారు. కానీ అది చాలా పెద్ద తప్పు. ఎమోషన్స్ ని మనిషిలో దాచుకోవడం వల్ల అవి ఒత్తిడిగా మారిపోతాయి. అలాగని అందరి ముందూ కోపం, అసహనం, ద్వేషం వంటివి వ్యక్తం చేయమని అర్థం కాదు. ఎమోషన్ క్రియేట్ అయ్యే వరకు పరిస్థితులను తీసుకెళ్లకూడదు. అలాగే ఎమోషన్స్ ని భూతద్దంతో చూడకూడదు.  భరించకూడదు!! కొన్నిసార్లు కొన్ని పనులను భరిస్తూ చేయాల్సి వస్తుంది. ఆ పనులు ఎలా ఉంటాయంటే మనిషిని నిమిషం కూడా స్థిమితంగా ఉండనివ్వవు. మీ బాధ్యత కాకపోతే, దాని వల్ల అదనపు ఒత్తిడి తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని అనిపిస్తే సున్నితంగా ఆ పనికి నో చెప్పేయచ్చు.  నష్టం కూడా మంచిదే!! కొన్నిసార్లు కొన్ని పనులు, కొన్ని విషయాలు వదులుకుంటే ఆర్థికంగా కొంత నష్టపోవడం మాట నిజమే. కానీ ఆ పనుల వల్ల కలిగే భీకర ఒత్తిడిని సున్నితంగా దూరం చేసినట్టు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. డబ్బు ఈరోజు కాకపోయినా రేపు సంపాదించుకోవచ్చు, కాలం, కాలం చేసే ఒత్తిడి మాయాజలంతో జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఒత్తిడి విషయంలో అన్ని రకాల మార్గాలను అన్వేషించి వాటిని అనుసరిస్తే మనిషి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మందులేని జబ్బు అయిన ఈ మానసిక సమస్యలకు మనసుతోను, ఆలోచనలతోనూ వైద్యం చేసుకోవాలి.                                    ◆నిశ్శబ్ద.
ప్రేమ ఒక మైకం అంటారు.  ప్రేమలో ఉన్నవారి ప్రపంచం వేరే ఉంటుంది.  అందులో మునిగి తేలుతూ ఉంటారు. ఇద్దరు వ్యక్తులు ప్రేమలో ఉన్నప్పుడు వారి మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేనప్పుడు వారి మధ్య బంధం చాలా లోతుగా ఉంటుంది. ఇలాంటి వారికి ప్రేమ మత్తులో ఉన్నారని అంటుంటారు.  ఇలా ప్రేమ మత్తులో ఉన్నప్పుడు ఏ పని చేయడానికి అయినా సంకోచించరు.  ఈ క్రమంలోనే ప్రేమికులు ప్రేమ మత్తులో కొన్ని పనులు చేసి తరువాత బ్రేకప్ అయ్యాక కుమిలిపోతుంటారు.  లవ్ లో ఉన్నవారు తమ పార్ట్నర్ మీద ఎంత ప్రేమ ఉన్నా సరే..  పొరపాటున కూడా కొన్ని పనులు చెయ్యకూడదని రిలేషన్ షిప్ నిపుణులు అంటున్నారు. ఇంతకీ లవ్ లో ఉన్నవారు చెయ్యకూడని పనులేంటో ఓ లుక్కేస్తే.. ఫొటోస్.. చాలామంది ప్రేమికులు ఇంచుమించు భార్యాభర్తల్లానే బిహేవ్ చేస్తుంటారు. పెళ్లి కాలేదు.. కలసి ఉండలేదు అనే విషయం మినహాయిస్తే అన్ని విధాలా ఓపెన్ అయిపోతుంటారు. కానీ చాలా క్లోజ్ గా ఉన్నాం కదా అని ప్రైవేట్ ఫొటోలను తమ పార్ట్నర్ తో పంచుకోకూడదు. ముఖ్యంగా అబ్బాయిలు నార్సిసిస్టక్ మెంటాలిటీ కలిగి ఉన్నవారు అయితే బ్రేకప్ తరువాత  అమ్మాయిలను బ్లాక్మెయిల్ చెయ్యడం,  వారి మీద ప్రతీకారం తీర్చుకోవడం వంటి వాటికి అమ్మాయిల ప్రైవేట్ ఫొటోలను ఉపయోగించే ప్రమాదం ఉంటుంది.   అంతే కాదు..  ఇలాంటి ఫొటోలు షేర్ చేయడం వల్ల సైబర్ నేరాల బాధితులు అయ్యే అవకాశం ఉంటుంది. ఏవైనా యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు ఫొటో గ్యాలరీకి పర్మిషన్ అడుగుతుంటాయి. ఈ ఫొటోలు సదరు యాప్ కు వెళ్లిపోతాయి. ఈ ఫొటోల ద్వారా కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతుంటారు. కాబట్టి ప్రైవేట్ ఫొటోస్ ఎట్టి పరిస్థితులలోనూ ఎవరికీ పంపకూడదు. బ్యాంక్ అకౌంట్.. బ్యాంక్ ఖాతా అనేది ఒక వ్యక్తి వ్యక్తిగత ఆర్ఠిక విషయం.  ప్రేమలో ఉన్నంత మాత్రాన బ్యాంక్ ఖాతా వివరాలు, ఆర్థిక విషయాలు పంచుకోవడం సబబు కాదు.  ప్రేమలో ఉన్నప్పుడు  లవ్ పార్ట్నర్ బ్యాంక్ అకౌంట్ వివరాలు అడిగితే సున్నితంగా అవన్నీ చెప్పడం ఇప్పుడు అంత అవసరం లేదని చెప్పాలి. కానీ కొందరు తమ లవ్ పార్ట్నర్ ఎక్కడ నొచ్చుకుంటారో అనే ఆలోచనతో అన్నీ చెప్పేస్తుంటారు.  లవ్ లో బ్రేకప్ వచ్చి విడిపోతే వ్యక్తిగత వివరాలు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఆర్థిక సమస్యలలో కూడా చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. కుటుంబం.. ప్రేమలో ఉన్నవారు సంతోషం, దుఃఖం, బాధ వంటి విషయాలు అన్నీ ఓపెన్ గా చెప్పుకోవం మంచిదే కానీ కుటుంబం గురించి, కుటుంబంలో ఉన్న గొడవలు, సమస్యలు, కుటుంబ వ్యక్తిగత విషయాలు అన్నీ ఓపెన్ అయ్యి చెప్పుకోవడం మంచిది కాదు. ఇది కుటుంబానికి, కుటుంబంలో వ్యక్తుల గౌరవానికి ఎప్పటికైనా ఇబ్బందే. చనువుతో ఓపెన్ అయ్యి చెప్పుకున్న కొన్ని విషయాలు తరువాత బ్రేకప్ అయినప్పుడు నలుగురికి చాలా సులువుగా చేరిపోతాయి. అప్పుడు ఎవరికి వారు వారి కుటుంబ పరువును, గౌరవాన్ని తగ్గించుకున్నట్టు అవుతుంది. రహస్యాలు.. ఇప్పటి కాలంలో పరిచయాలు చాలా తొందరగా జరిగిపోతాయి. అదే విధంగా దగ్గరితనం కూడా తొందరగా వచ్చేస్తుంది. కానీ ఆ బందం ఏదైనా నిలబడటమే కష్టంగా ఉంటుంది. ఒకరి నుండి విడిపోయాక మళ్ళీ ఇంకొకరితో పరిచయం కావడం, వారితో మళ్ళీ దగ్గరి తనం ఏర్పడటం, అది కాస్తా ప్రేమకు దారితీయడం చాలా వేగంగా జరుగుతాయి.  ఈ క్రమంలో ఎవరితోనూ గతానికి సంబంధించి  విషయాలు ఓపెన్ అయ్యి చెప్పుకోకూడదు.  దీనివల్ల వ్యక్తిత్వం మీద దారుణమైన ముద్రలు, అవమానాలు ఎదురవుతాయి.
చాలామంది సంకల్పబలం, క్రమశిక్షణల గురించి ఓ అరగంట ప్రసంగించమంటే తడుముకోకుండా మాట్లాడతారు. కానీ వాటిని పాటించే విషయంలోనే వస్తాయి చిక్కులన్నీ. తమ దాకా వచ్చేసరికి అవి అందరికీ సాధ్యం కాదని తేల్చేస్తారు. అది పుట్టుకతోనే రావాలని చల్లగా జారుకుంటారు. అలాంటి వారికి సమాధనమే ఈ కింది విషయాలు.. దృఢనిర్ణయాలు తీసుకోవాలంటే? ...  మీ మానసిక బలాన్ని పరీక్షించుకొని, పెంపొందించుకొనే మార్గాల్లో ముఖ్యంగా ప్రతి నిత్యం జీవితంలో కొన్ని ఇష్టం లేని, కష్టంగా కనిపించే పనుల్ని చేయడం ఒకటి. అలా తరచూ సాధన చేయాలి. వీటి వల్ల ప్రయోజనాలు కలుగుతాయని తెలిసినా మీ మనసు ఆ పనుల్ని ఏదో ఒక వంకతో వ్యతిరేకిస్తూనే ఉంటుంది. అయినా సరే ఆ పనులు చేయాలి. అలా చేయడం ద్వారా మీ మెదడులో నిక్షిప్తమైన వ్యతిరేక భావాలను అధిగమించగలుగుతారు. అంతర్గతంగా ఉన్న వ్యతిరేక శక్తులను అధిగమించడం ద్వారానే మనకు అవసరమైన అంతర్గత శక్తిని మేల్కొల్పగలం. ఉదాహరణకు మీరు బస్సులో ప్రయణిస్తున్నారనప్పుడు సీటు దొరికితే హాయిగా కూర్చుంటారు, లేకపోతే తప్పదు కాబట్టి నిలబడి ప్రయాణిస్తారు. ఒకవేళ మీకు సీటు దొరికినా సరే ఆ సీటును ఇంకొకరికి ఇవ్వండి. ఓ పదిహేను లేదా ఇరవై నిమిషాలు నిలబడి ప్రయాణించండి. ఈ చిన్న విషయంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, మీలోని మానసిక నిరోధ భావాలను గమనించండి. అయినా మనస్సు మాట వినకుండా ఇంకొకరికి ఆ సీటు ఇచ్చి, ప్రయాణం చేయండి. ఆ తరువాత చూడండి. మీరు ఈ నిరోధ భావాల నుంచి బయటపడడానికి చేసిన సంఘర్షణ, చివరికి సాధించడం చూస్తే మీలో మీకే తెలియని ఆత్మవిశ్వాసం, ధైర్యం కలుగుతాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు, అర్జునుడితో మానసిక దౌర్బల్యాన్ని జయించాలని చెబుతూ ఎవరికైనా మనస్సును అదుపులో ఉంచుకోవడం దుస్సాధ్యమే, కానీ అభ్యాస, వైరాగ్యాల ద్వారా దాన్ని సాధించవచ్చని బోధిస్తాడు. మీ ఇంట్లోని వారికి వారి పనుల్లో ఎప్పుడైనా సహాయం చేశారా?  ఈసారి ఈ విధంగా ప్రయత్నించండి! నేరుగా వంటింట్లోకి వెళ్ళి అమ్మతో "అమ్మా! నేను ఏదైనా సహాయం చేయనా?” అని అడగండి, ఎప్పుడూ ఆ మాట అడగని మీరు ఈ ప్రశ్న వేసేసరికి ఆవతలివారు కాస్త కంగారు పడి, మిమ్మల్ని కొత్తగా చూడడం సహజమే. అయినా సరే, వంటిల్లు సర్దడంలోనో, కూరలు తరగడంలోనో, గిన్నెలు కడగడంలోనో సహాయం చేయండి. అది చిన్న పనే అయినా, మీకిష్టం లేని పని చేసిన తరువాత ఒక్కసారి వారి కళ్ళలోని ఆ వెలుగును చూడండి. రెండూ మిమ్మల్ని సంకల్ప బలం వైపు నడిపిస్తాయి.  ఒక్కోసారి మీరు అలసిపోయి ఇంటికొస్తారు. రాగానే మీ శరీరాన్ని సోఫాలో పడేసి అందుబాటులో ఉన్న టీవీ రిమోట్ తీసుకొని, అలా ఎంతసేపు ఛానల్స్ మారుస్తూ కూర్చుంటారో మీకే తెలియదు. అప్పుడు స్నానం చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ బద్దకం మీ కన్నా బలమైంది కాబట్టి, అది అక్కడ నుంచి లేవనీయదు. అయితే ఈ సారి మీ బద్ధకం మాట వినకండి. కష్టమైనా సరే లేచివెళ్ళండి. చేయాలనుకున్న పని వాయిదా వెయ్యకుండా చేయండి. అప్పుడు చూడండి మీపై మీకే తెలియని దృఢత్వం,  ఒక నమ్మకం, ధైర్యం కలుగుతాయి. ప్రయత్నిస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది. ఒకరోజు మీరు కాఫీ, టీ, పాలల్లో చక్కెర లేకుండా తాగేందుకో లేదా కనీసం పెరుగన్నంలో ఉప్పు లేకుండా తినేందుకో ప్రయత్నించండి. మీ కన్నా ముందు మీ నాలుక ఈ ప్రయోగానికి ఒప్పుకోదు. దాన్ని జయించడానికేగా ఈ ప్రయత్నమంతా! అలాగే వేడినీళ్ళ  స్నానం అలవాటున్న వాళ్ళు వరుసగా వారం రోజులు చన్నీటి స్నానం చేసి మీలోని శారీరక, మానసిక నిబ్బరాన్ని పరీక్షించి సాధించండి. చదువుకునేటప్పుడు కష్టమైన సబ్జెక్టుతో వాయిదా వేయకుండా పోరాడండి. కొన్ని మాటలు మాట్లాడే కన్నా మాట్లాడకుండా ఉంటేనే ఎక్కువ ప్రయోజనం ఉన్నప్పుడు మౌనాన్ని ఆశ్రయించండి. మీ ఉద్వేగాన్ని అదుపులో ఉంచుకోండి.  ఇలా అన్నీ ఒక్కొక్కటిగా మీ జీవితంలో ఫాలో అయ్యారంటే మీ మీద మీరు విజయం సాధిస్తారు కచ్చితంగా.                                      ◆నిశ్శబ్ద.
లవంగాలు వంటగదిలో ఉండే మసాలా దినుసు.  ఇది వంటల్లోకే కాకుండా దగ్గు, జలుబు వంటి సమస్యలున్నప్పుడు కషాయం తయారుచేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో లవంగాలకు ఔషద స్థానం ఇచ్చారు. లవంగాలు ఆహారంలో భాగంగా తీసుకుంటే రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే  విటమిన్-సి రక్తాన్ని శుద్ధి చేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.  మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. లవంగం నూనెను ఉపయోగించడం వల్ల దంతాల ఆరోగ్యం బాగుంటుంది.  ఇంత శక్తివంతమైన లవంగాలను ప్రతిరోజూ రెండు నమిలి తిని గోరువెచ్చని నీరు తాగితే అద్బుతాలు జరుగుతాయి. అవేంటో తెలుసుకుంటే.. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.. లవంగాలు తినడం వల్ల  రోగనిరోధక శక్తి పెరుగుతుంది , ఎందుకంటే ఇది శరీరంలోని తెల్ల రక్త కణాల పరిమాణాన్ని పెంచుతుంది.  ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. విటమిన్ సి లవంగాలలో లభిస్తుంది, ఇది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమైన విటమన్.  లవంగాలలోని యాంటీ-వైరల్ గుణం రక్తాన్ని శుద్ధి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది  రక్తంలోని టాక్సిన్లను తగ్గిస్తుంది.   తెల్ల రక్త కణాలను ప్రేరేపించడం ద్వారా వ్యాధులకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజూ రెండు లవంగాలు తిని గ్లాసుడు గోరువెచ్చని నీరు త్రాగితే  జరిగే మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి.   మలబద్దకం  నుండి ఉపశమనం కలిగిస్తుంది.. లవంగం జీర్ణ సమస్యలకు చికిత్సగా ఉపయోగించవచ్చు, ఎందుకంటే ఇది జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని పెంచుతుంది,  వికారం కూడా తగ్గిస్తుంది. ఇది కాకుండా, ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు మంచిదని,  మలబద్ధకం సమస్యను తొలగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. పంటినొప్పిని దూరం చేస్తుంది.. లవంగాలలో  మత్తు లక్షణాలు ఉంటాయి.  పంటి నొప్పి ఉన్నప్పుడు తక్షణ ఉపశమనం పొందాలంటే లవంగాన్ని గ్రైండ్ చేసి అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని  దంతాలు,  వాపు ఉన్న చిగుళ్లపై రాయాలి. 30 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. లేదా లవంగాల నూనె కూడా ఉపయోగించవచ్చు. ఇవన్నీ కాకుండా ప్రతిరోజూ 2 చిన్న లవంగాలు నమిలి తిని గ్లాసుడు గోరువెచ్చని నీరు త్రాగితే అస్సలు పంటి నొప్పి, చిగుళ్ళ వాపు వంటి సమస్యలే ఎదురుకావు. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.. మన శరీరాన్ని శుద్ది చేయడానికి,  మనం తీసుకునే మందులను జీవక్రియ చేయడానికి కాలేయం బాధ్యత వహిస్తుంది. లవంగం నూనెలో ఉండే యూజినాల్ కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో నొప్పి,  వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ రెండు లవంగాలు తిని గోరువెచ్చని నీరు తాగితే కాలేయానికి సంబంధించిన సమస్యలే రావు. నొప్పి, వాపు తగ్గిస్తుంది.. లవంగాలలో యూజీనాల్ అనే మూలకం ఉంటుంది, ఇది వాపును, నొప్పిని తగ్గిస్తుంది. ప్రతిరోజూ రెండు లవంగాలు తినడం అలవాటు చేసుకుంటే ఈ నొప్పులు, వాపులు ఆమడ దూరం ఉంటాయి. ఎముకలు, కీళ్లకు మంచి మెడిసిన్.. లవంగాలలో ఫ్లేవనాయిడ్స్, మాంగనీస్,  యూజినాల్ వంటి కొన్ని మూలకాలు ఉంటాయి, ఇవి ఎముకలు,  కీళ్ల ఆరోగ్యానికి మంచివి.  ఇవి  ఎముకల మందాన్ని పెంచుతాయి,  ఎముక కణజాలం ఏర్పడటానికి సహాయపడతాయి. అంతే కాదు  ఎముకలకు ఆరోగ్యకరమైన ఖనిజాలను అందించడంలో కూడా సహాయపడుతుంది. చక్కెర స్థాయిలు నియంత్రిస్తుంది.. ఇంట్లో ఎవరికైనా చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే, లవంగాలు శరీరంలో ఇన్సులిన్ లాగా పనిచేస్తాయి. ఇది  రక్తం నుండి అదనపు చక్కెరను  కణాలలోకి ఎగుమతి చేస్తుంది,  మిగిలిన చక్కెరను సమతుల్యం చేస్తుంది. అందుకే చక్కెర వ్యాధి ఉన్నవారు , చక్కెర వ్యాధి కుటుంబంలో ఎవరికైనా ఉన్నవారు రోజూ రెండు లవంగాలు తిని, గోరువెచ్చని నీరు తాగడం మంచిది.                                                             *నిశ్శబ్ద.  
భారతీయులకు మిర్చి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన రోజువారీ జీవితంలో మిరపకాయలు లేనిదే పనిజరగదు. ఆయుర్వేదపరంగా కూడా మిర్చిని మితంగా తీసుకుంటే ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. వంటకాల్లో ఎండుకారం కంటే మిరపకాయలు వేసుకోవడమే ఆరోగ్యమని సూచిస్తుంటారు. అమెరికాలో జరిగిన ఓ పరిశోధన అయితే పండు మిరపకాయల వల్ల ఏకంగా ఆయుష్షే పెరుగుతోందని చెబుతోంది.   అమెరికాలోని వెర్మోంట్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మిరపకాయలకీ, ఆరోగ్యానికి మధ్య సంబంధాన్ని తెలుసుకునేందుకు కొన్ని గణాంకాలను సేకరించారు. ఇందుకోసం పదహారు వేలమంది అమెరికన్లకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు 23 ఏళ్లపాటు వీరి ఆరోగ్య వివరాలను నిశితంగా గమనించారు. తాము సేకరించిన వివరాలలో పండు మిర్చి తినే అలవాటు కల్గినవారు కాస్త భిన్నంగా ఉన్నట్లు పరిశోధకులకు తోచింది. యువకులు, మంచి తిండిపుష్టి కలిగినవారు, మగవారు పండుమిరపకాయలను ఎక్కువగా తీసుకుంటున్నట్లు గమనించారు. తక్కువగా చదువుకుని చిన్నపాటి జీతాలతో బతికేవారిలో మిర్చిని తినే అలవాటు ఎక్కువగా కనిపించింది. (కాస్త జాగ్రత్తగా గమనిస్తే మన దేశంలో కూడా ఎండుమిర్చిని తినేవారు ఈ కోవకే చెందడాన్ని గమనించవచ్చు)   ఆశ్చర్యకరంగా పండుమిర్చి తినేవారిలో గుండెపోటు లేదా పక్షవాతంతో చనిపోయే అవకాశం ఏకంగా 13 శాతం తక్కువగా కనిపించింది. పండుమిరపకాయలు తినేవారు తప్పనిసరిగా సుదీర్ఘకాలం బతుకుతారన్న హామీని ఇవ్వలేం కానీ.... వారిలో కొన్నిరకాల ఆరోగ్యసమస్యల తాకిడి తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు. మిర్చిలో ఉండే కేప్సైసిన్ (CAPSAICIN) వంటి పదార్థాల వల్ల రక్తప్రసారం మెరుగుపడుతుందనీ, శరీరంలోని హానికారక క్రిములు నశిస్తాయనీ భావిస్తున్నారు. రుచి, రంగు ఉండని ఈ కేప్సైసిన్ వల్ల మన కణాల మీద ఉండే Transient Receptor Potential (TRP) అనే వ్యవస్థ ఆరోగ్యవంతంగా ఉంటుందట. ఇది కూడా దీర్ఘాయుష్షుకి కారణం అని నమ్ముతున్నారు.   పండుమిర్చి వల్ల ఉపయోగాలు ఉన్నాయంటూ శాస్త్రవేత్తలు ధృవీకరించడం ఇది మొదటిసారేం కాదు! మనలోని కొవ్వుపదార్థాలను విడగొట్టి ఊబకాయం దరిచేరకుండా చేయగల సమర్థత మిర్చికి ఉందని ఈపాటికే తేలిపోయింది. ఒంట్లో కొవ్వు పేరుకోకపోతే గుండె కూడా దృఢంగానే ఉంటుంది కదా! తాజా పరిశోధన ఈ విషయాన్నే రుజువులతో సహా నిరూపించింది. కాకపోతే మోతాదుకి మించి కారాన్ని తీసుకుంటే మాత్రం నానారకాల ఆరోగ్యసమస్యలూ దరిచేరక తప్పవంటున్నారు వైద్యలు. మితంగా తీసుకుంటే ఏ ఆహారం వల్లనైనా ఉపయోగమే అని పెద్దలు ఊరికే అనలేదు కదా. - నిర్జర.  
టీ తాగడం  ఆరోగ్యానికి మేలు చేస్తుందా లేదా హానికరమా? అనే విషయం గురించి  చాలా కాలంగా చర్చ నడుస్తూనే ఉంది. టీని మితంగా తీసుకుంటే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా బ్లాక్ టీ ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని అందరూ అంటుంటారు. పరిశోధకులు కూడా ఇప్పుడు ఇదే విషయం చెబుతున్నారు. బ్లాక్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.  గుండె నుండి గట్ వరకు ఇంకా  మధుమేహం నుండి బరువు నియంత్రణ వరకు చాలా సమస్యలలో బ్లాక్ టీ మంచి ప్రయోజనాలు చేకూరుస్తుంది.  కరోనా  సమయంలో బ్లాక్ టీ చాలా చర్చనీయాంశమైంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని తెలిసింది, ఇది  అంటు వ్యాధుల శరీరాన్ని సురక్షితంగా ఉంచడానికి సహాయపడుతుంది. బ్లాక్ టీలోని కెఫిన్.. బ్లాక్ టీ లో ఉండే కెఫిన్ మధుమేహం నుండి గుండె జబ్బుల వరకు ప్రతిదానికీ ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే కెఫిన్ మూత్రపిండాలకు హానికరమని కొందరు చెబుతుంటారు.    టీ,  కాఫీలలో  కెఫీన్ ఉండటం సాధారణం. ఇది మూత్రపిండాలకు మంచితో పాటు చెడు కూడ చేస్తుంది. ఇదంతా ఎంత టీ తీసుకుంటున్నాం అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది.  మూత్రపిండాలపై కెఫీన్  దుష్ప్రభావాలు ఎంతంటే.. కెఫిన్ మూత్రపిండాలకు ప్రయోజనం చేకూరుస్తుందని పరిగణించబడుతున్నప్పటికీ, ఇది  దుష్ప్రభావాలను కూడా కలిగి ఉంటుంది. కెఫిన్  రక్తపోటును ప్రభావితం చేస్తుంది.  అధికంగా కెఫిన్ తీసుకోవడం సిస్టోలిక్,  డయాస్టొలిక్ రక్తపోటు రెండింటినీ పెంచుతుంది. కిడ్నీ వ్యాధికి అధిక రక్తపోటు ప్రధాన ప్రమాద కారకం కాబట్టి, కెఫిన్ అధికంగా ఉండే ఆహారాలు మూత్రపిండాల సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. బ్లాక్-టీ లో ఆక్సలేట్ గురించి తెలుసా?? బ్లాక్ టీలో కనిపించే ఆక్సలేట్  మూత్రపిండాలకు చాలా హానికరమైనది.  బ్లాక్ టీలో   కరిగే ఆక్సలేట్  సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఈ ఆక్సలేట్లు కాల్షియంతో కలుస్తాయి. ఇవి స్ఫటికాలను ఏర్పరుస్తాయి, ఇది మూత్రపిండాల్లో రాళ్లకు దారితీస్తుంది. ఈ కారణంగానే బ్లాక్ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉందని చెబుతారు  నిపుణుల సలహా ఏమిటంటే.. బ్లాక్ టీ  ఆరోగ్యానికి మేలు చేసేదే, ఈ విషయం పరిశోధనల్లో కూడా తేలింది.   ఇది గుండె జబ్బులను తగ్గించడంలో,  కొలెస్ట్రాల్,  రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. కానీ ఇదంతా బ్లాక్ టీ ని మితంగా తీసుకోవడం వల్ల మాత్రమే కలిగే ప్రయోజనం. బ్లాక్ టీ ని  ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. రోజులో రెండు కప్పులకు మించి బ్లాక్ టీ తాగడం ప్రమాదం.                             *నిశ్శబ్ద.