సింహం సింగిల్ గానే వస్తుందంటూ తన భుజాలను తానే చరచుకునే జగన్ ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ, తాను కన్ఫ్యూజన్ లో ఉన్నానని చెప్పకనే చెబుతున్నారు. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ ఆయనలోని అయోమయానికీ, కన్ఫ్యూజన్ కు అద్దంపట్టింది.   గతంలో ఢిల్లీలో  కాక్రోచ్ జనతా పార్టీ  ఉద్యమం జరుగుతున్నప్పుడు, తాను కూడా   పోరాడే  బొద్దింకనని జగన్ ప్రకటించారు. కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడేందుకు తాను కాక్రోచ్ ల ఉద్యమంలో భాగం కావడానికి సిద్ధంగా ఉన్నానని విస్పష్ట సందేశాన్నిచ్చారు. జగన్ తన రాజకీయ జీవితంలో కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా ఒక స్టేట్ మెంట్ ఇవ్వడం అదే ప్రథమం.  దీంతో జగన్ ఇక తన పొలిటికల్ మార్గాన్ని బీజేపీకి వ్యతిరేకంగా ఆరంభిస్తున్నారా అన్న అనుమానాలు అప్పట్లో వెల్లువెత్తాయి. దానికి కొనసాగింపుగానే జగన్ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి దగ్గరౌతున్నారన్న విశ్లేషణలూ వెల్లువెత్తాయి. ఇక సీపీఐ నేతలు ఆయనతో భేటీ కావడం ఈ విశ్లేషణలకు బలం చేకూర్చాయి కూడా. అయితే తాను ఏ కూటమిలోనూ భాగస్వామిని కాబోవడం లేదని జగన్ వివరణ ఇచ్చుకున్నారు.  ఇప్పుడు తాజాగా ప్రభుత్వాధినేతగా పాతికేళ్ల ప్రస్థానం ( గుజరాత్ సీఎంగా, పీఎంగా)  పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలపడం ద్వారా జగన్ తన కన్ఫ్యూజన్ ను బయటపెట్టుకున్నారు. మోడీని అభినందిస్తూ ఆయన చేసిన ట్వీట్ లో ప్రజా సేవలో మోడీ చారిత్రాత్మక మైలు రాయిని చేరుకున్నారని పేర్కొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత భారతదేశ ప్రధానమంత్రిగా పాతికేళ్లుగా  నిరంతర ప్రజా సేవను పూర్తి చేసుకున్న గౌరవనీయులైన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ జగన్ సోషల్ మీడియాలో ఓ సందేశం షేర్ చేశారు. నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.  మొత్తానికి ఒకే సమయంలో  రెండు పడవలపై ప్రయాణం చేస్తున్న  రాజకీయ నాయకుడిగా జగన్ ను నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.  [YS Jagan Praises Narendra Modi, Jagan Modi Tweet, YCP, CJP,  Andhra Pradesh Politics, Jagan Political Strategy, Duel Standards, Confusion, Telugu One]
విజయవాడలో జరగనున్న దసరా ఉత్సవాలకు హాజరుకావాలని ఆహ్వానించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు బుధవారం(సెప్టెంబర్ 7)  తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను కలిశారు. ఈ ఆహ్వానంపై విజయ్ సానుకూలంగా స్పందించారని, ఆయన ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇది జరిగి 24 గంటలు కాక ముందే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తమిళనాడు సీఎం విజయ్ తో భేటీ అయ్యారు. తన భర్త అనిల్ లో కలిసి చైన్నైలో విజయ్ ను కలిసిన షర్మిల తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా తమిళనాడు సీఎం విజయ్ ను ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను షర్మిల స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయగా అది క్షణాల్లో వైరల్ అయ్యింది.  మొత్తంగా ఒక రోజు వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు సీఎం విజయ్ కు రెండు ఆహ్వానాలు అందడం విశేషం. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.    [YS Sharmil Meet Vijay Thalapathy, Tamil Nadu CM Vijay, AP Congress, Sharmila Vijay Meeting, Anjili Reddy Wedding, Vijay TVK, Andhra Pradesh Politics, Telugu One]
వైఎస్ కుటుంబంతో దశాబ్దాల పాటు కలిసి పనిచేసిన విజయసాయిరెడ్డి, 2024లో వైసీపీ  అధికారం కోల్పోయిన తర్వాత జగన్‌కు దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్‌లో తన సొంత రాజకీయ పార్టీని స్థాపించే పనిలో  ఉన్నారు.ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి అనుసరిస్తున్న వ్యాహాలు, చేస్తున్న కుల, మత ప్రస్తావనలు సంచలనంగా మారాయి. ఆయన తీరు పట్ల సర్వత్రా చర్చ జరుగుతోంది.విజయసాయి ప్రతి అంశంలోనూ కుల, మత కోణాలను వెలికి తీస్తూ సంచలన రాజకీయమే తన బాణి, వాణి, బాట అని చాటుతున్నారు.  తాజాగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ముస్లింలు, క్రైస్తవులు హిందూ దేవాలయాలకు వచ్చినప్పుడు అక్కడి ప్రసాదాన్ని గానీ, పవిత్ర వస్త్రాలను గానీ స్వీకరించరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే  సమయంలో హిందువులు చర్చిలు లేదా మసీదులకు వెళ్ళినప్పుడు మాత్రం అక్కడి నిబంధనలను పాటించాల్సి ఉంటుందన్నారు.  అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్‌లో తన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, దళితులను ఆలయాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకునే అగ్రవర్ణాల వారికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించేలా ఒక కొత్త చట్టాన్ని తీసుకువస్తానని  ప్రకటించారు. సాధారణంగా లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులపరమైన విభజనలు ఉన్నప్పటికీ, కొన్నేళ్ల క్రితం వరకు మతపరమైన అసమ్మతి లేదా విభేదాల ఛాయలు  ఇసుమంతైనా కనిపించేవి కావు. అయితే ఇప్పుడు విజయసాయి రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవల విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో.. ఆంధ్రప్రదేశ్‌ను కేవలం రెండు కుటుంబాలు, రెండు వర్గాలు మాత్రమే పాలించాలా? అనే ప్రశ్నను లేవనెత్తారు. రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలకు చెందినవారే ముఖ్యమంత్రి కావాలా? కాపులు, వెలమలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీల నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎందుకు ఉండకూడదని  ప్రశ్నించారు. కొత్త పార్టీ ప్రకటనకు విజయసాయి సన్నద్ధమౌతున్న వేళ విజయసాయి చేసిన ఈ వ్యాఖ్యలను ఆయన రాజకీయ వ్యూహంలో భాగంగానే చూడాల్సి ఉంటుంది. అయితే..  పార్టీ నిర్మాణం, విధివిధానాలు, ప్రధాన రాజకీయ లక్ష్యాలు పూర్తిగా వెల్లడించిన తరువాత మాత్రమే విజయసాయి  వ్యాఖ్యల రాజకీయ ప్రభావాన్ని ఏ మేరకు ఉంటుందన్నది తెలుస్తుంది.   ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు  ఎప్పుడూ కీలక అంశమే.   రెడ్డి, కమ్మ, కాపు తదితర సామాజిక వర్గాల రాజకీయ ప్రాతినిధ్యంపై   చర్చ జరుగుతూనే ఉంది. 2024 ఎన్నికల సందర్భంలోనూ రాష్ట్ర రాజకీయాల్లో కుల సమీకరణాల ప్రభావంపై విశ్లేషణలు వెలువడ్డాయి. ఇప్పుడు విజయసాయిరెడ్డి అదే అంశాన్ని మరోసారి చర్చకు తీసుకువచ్చారు. అయితే కులం, మతం ప్రస్తావించడం మాత్రమే ఒక కొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది అవుతుందా?  అంటే పరిశీలకులు ఆ అవకాశం లేదని కుండబద్దలు కొడుతున్నారు.  ఏది ఏమైనా విజయసాయి రెడ్డి తాజా వ్యాఖ్యలు మత ప్రస్తావన, ఏపీ రాజకీయాలలో కొత్త చర్చకు తెరతీశాయని చెప్పవచ్చు.  అయితే ఈ రాజకీయ వ్యూహం ఆయన కొత్త పార్టీకి ఏ మాత్రం ప్లస్ అవుతుందన్నది అనుమానమేనని పరిశీలకులు అంటున్నారు.  [Vijayasai Reddy Political Strategies, Sai Reddys New Party, Jagan, YCP, TDP, Caste politics, Religious politics, Reddy Vote Bank, AP Politics, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
ఆనంది టైటిల్ పాత్రలో నటించిన ‘గరివిడి లక్ష్మి’ బయోపిక్ అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహించిన ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. గరివిడి లక్ష్మి సినిమా ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో అసలు ఆమె ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో జానపద కళలకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో బుర్రకథ, జానపద పాటలు ఒకప్పుడు గ్రామీణ ప్రజలకు వినోదంతో పాటు సామాజిక చైతన్యాన్ని కూడా అందించేవి. అలాంటి కాలంలో తన గొంతుతో, తనదైన బాణీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కళాకారిణి గరివిడి లక్ష్మి. ఆమె అసలు పేరు రెడ్డి విజయలక్ష్మి. విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని గెడ్డపువలస ఆమె స్వస్థలం. 1990లలో స్టేజ్‌పై జానపద పాటలు, బుర్రకథలు చెప్పడం మొదలుపెట్టిన ఆమె.. కొద్ది కాలంలోనే ఉత్తరాంధ్రలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో ఆమె బుర్రకథ ప్రదర్శనలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 15 ఏళ్లలో ఏకంగా పది వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న బుర్రకథ కళారంగంలో ఒక మహిళగా ఆమె నిలదొక్కుకోవడం అంత సాధారణమైన విషయం కాదు. కథ చెప్పడం, పాట పాడటం, హాస్యాన్ని పండించడం, సామాజిక అంశాలను ప్రస్తావించడం.. ఇలా బుర్రకథలోని విభిన్న అంశాలను తనదైన శైలిలో అందించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఒక దశలో ‘గరివిడి లక్ష్మి’ అనేది కేవలం ఒక కళాకారిణి పేరు కాకుండా ఒక బ్రాండ్‌గా మారిపోయింది. ఆమెను అనుకరిస్తూ ఎన్నో ట్రూప్స్ కూడా ఏర్పడ్డాయి. ఆమె బుర్రకథలు, పాటలు ఆడియో రూపంలో కూడా విడుదలయ్యాయి. అప్పట్లో ఆమె పాడిన పలు జానపద గీతాలు యువతలో మంచి ఆదరణ పొందాయి. గరివిడి లక్ష్మి పేరు చెప్పగానే ఇప్పటికీ చాలామందికి గుర్తొచ్చే జానపద గీతాల్లో ‘నల్ల జీలకర్ర మొగ్గ’, 'అత్తరు సాయిబో రారా' ముందు వరుసలో ఉంటాయి. ఇవి కొత్తగా వచ్చిన పాటలు  కాదు. 1990లలోనే గరివిడి లక్ష్మి బుర్రకథ ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన జానపద గీతాలు. గరివిడి లక్ష్మి జీవితం కేవలం పాటలు, బుర్రకథలతోనే ముగిసిపోలేదు. జానపద కళను వేదికగా చేసుకుని గ్రామీణ ప్రజలకు సామాజిక విషయాలను చేరవేసిన కళాకారిణిగా ఆమెకు గుర్తింపు వచ్చింది. అయితే ఒక దశలో ఆమె జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. సినిమా అవకాశాలు ఇప్పిస్తామనే మాటలతో ఆమెను సంప్రదించడం, ఆ తర్వాత ఆమె జీవితం అనూహ్య మలుపు తిరగడం.. చివరికి ఆమె కనిపించకుండా పోవడం వంటి అంశాలను ఇప్పుడు వస్తున్న సినిమా కథలో కీలకంగా చూపిస్తున్నారు. ఇదే పాయింట్ ఇప్పుడు ‘గరివిడి లక్ష్మి’ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఎందుకంటే ఇప్పటివరకు పెద్దగా తెలియని ఈ జానపద కళాకారిణి జీవితంలో అసలు ఏం జరిగింది? ఆమె ప్రస్థానం ఎలా మొదలైంది? అంతటి పేరు తెచ్చుకున్న తర్వాత ఎందుకు కనుమరుగయ్యారు? అనే ప్రశ్నలకు సినిమాలో సమాధానం దొరకనుంది. ఇది కూడా చదవండి: రాజమౌళి మరో అద్భుతం.. ‘వారణాసి’ కోసం కొత్త భాష.. ‘బాహుబలి’ని మించేలా ఉంటుంది.!       [Who is Garividi Lakshmi, Garividi Lakshmi Biography, Garividi Lakshmi Biopic, Garividi Lakshmi Real Story, Garividi Lakshmi Movie, Garividi Lakshmi, Anandhi, Telugu Film News]
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్లడీ రోమియో’. నాని పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. అప్పుడే విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. తాజాగా ఈ సినిమా గురించి నాని కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ‘బ్లడీ రోమియో’ చాలా యూనిక్‌గా, స్టైలిష్‌గా ఉంటుందని నాని చెప్పాడు. ఇందులో వైలెన్స్ ఉన్నప్పటికీ మరీ ఎక్కువగా, రా అండ్ రస్టిక్‌గా ఉండదని తెలిపాడు. సుజీత్ వైలెన్స్‌ను కూడా చమత్కారంగా చూపించేలా ఓ కొత్త ట్విస్ట్ తీసుకొచ్చాడని, యాక్షన్‌తో పాటు మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా సినిమా ఉంటుందని నాని చెప్పాడు. తన పాత్ర కూడా చాలా చమత్కారంగా ఉంటుందని, ఈ జానర్‌లో ఇలాంటి సినిమా ఇప్పటివరకు చూడలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక ‘బ్లడీ రోమియో’ నాని గత చిత్రం ‘ది ప్యారడైజ్’కు పూర్తిగా భిన్నంగా ఉంటుందని ఆయన తెలిపాడు. టైటిల్ గ్లింప్స్‌లో నానిని ఓ వైపు చెఫ్‌గా, మరోవైపు గ్యాంగ్‌స్టర్‌గా చూపించారు. దీంతో సినిమాలో యాక్షన్‌తో పాటు డార్క్ కామెడీ కూడా ఉంటుందనే విషయం అర్థమవుతోంది. సుజీత్ గతంలో ‘రన్ రాజా రన్’, ‘సాహో’, ‘OG’ వంటి స్టైలిష్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ‘బ్లడీ రోమియో’ను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్, యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. నానికి జోడీగా ప్రీతి ముకుందన్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా తారాగణం, షూటింగ్ తదితర పూర్తి వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.     [Nani, Bloody Romeo, Nani Bloody Romeo, Nani Sujeeth Movie, Sujeeth, Bloody Romeo Movie, Nani Upcoming Movie, Nani New Movie, Bloody Romeo Update, Nani Bloody Romeo Update, Sujeeth Bloody Romeo, Preity Mukundhan, Nani Action Movie, Telugu Cinema, Tollywood, Bloody Romeo First Look, Nani Sujeeth Combination, Bloody Romeo Release Date]
ఒక్క ఛాన్స్.. ఒక్క ఛాన్స్.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా నన్ను నేను నిరూపించుకుంటానని ఖడ్గం మూవీలో రవితేజ ఎంత తాపత్రయ పడతాడో తెలిసిందే. ఒరిజినల్ గా  సినీ ఇండస్ట్రీలో దర్శకులుగా రాణించాలని అనుకునే వాళ్ళతో కూడా ఒకే ఒక్క ఛాన్స్ అనే డైలాగ్ 1000 వాల్ట్స్ సౌండ్ తో మారుమోగిపోతుంటుంది.  ఆ కోవలోనే తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి ఏటా వందలాది మంది కొత్త దర్శకులు, నటులు, సాంకేతిక నిపుణులు పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. "కొత్త నీరు వచ్చింది", "యూత్ మేకర్స్ ఇండస్ట్రీ రూపురేఖలు మార్చేస్తున్నారు" అంటూ సినీ వర్గాల్లో తీవ్రమైన చర్చలు, ప్రచారాలు జరుగుతుంటాయి. కానీ అసలు ప్రశ్న ఏంటంటే కేవలం ఇండస్ట్రీలో ఒక అవకాశం దొరికితేనే ప్రతిభ నిరూపితమైపోయినట్లేనా!సినీ విశ్లేషకులు, పరిశ్రమ గణాంకాలను పరిశీలిస్తే, కేవలం ఒక అవకాశం చేజిక్కించుకోవడం విజయం కాదని, ఆ అవకాశాన్ని నిలబెట్టుకోవడం మాత్రమే అసలైన ప్రతిభ అని స్పష్టమవుతోంది. గడిచిన కొన్నేళ్ల టాలీవుడ్ రికార్డులను గమనిస్తే, ప్రయోగాల పేరుతో లేదా యూత్ టార్గెట్ గా సినిమాలు తీసే కొత్త తరం మేకర్లు ఎంతో మంది వస్తున్నారు. అయితే వీరిలో ఎంతమంది ఇండస్ట్రీ ఫేట్ ను లేదా మార్కెట్ స్థిరత్వాన్ని మార్చలేకపోయారనేది ఒక పెద్ద ప్రశ్న మార్క్ గా మిగిలిపోతోంది. టాలీవుడ్ లో ప్రతీ ఏటా దాదాపు 200 కి పైగా సినిమాలు విడుదలవుతుంటే, అందులో 80 శాతానికి పైగా చిత్రాలు కొత్తవారు లేదా చిన్న నిర్మాతలు తీసినవే ఉంటున్నాయి. కానీ, ఆ చిత్రాలలో కనీసం 5 శాతం నుండి 10 శాతం మాత్రమే బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. అంటే అవకాశం రావడమనేది ఒక ఆరంభం మాత్రమే, అది పూర్తి విజయానికి హామీ ఇవ్వదు.   సినీ పరిశ్రమలో టాలెంట్ నిరూపించుకోవడానికి 100% కష్టం, నిరంతర శ్రమ, మార్కెట్ అవగాహన చాలా అవసరం. కేవలం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు లేదా సోషల్ మీడియా హంగామా ద్వారా లభించే తాత్కాలిక క్రేజ్ తో దీర్ఘకాలం నిలబడటం సాధ్యం కాదు. ఇండస్ట్రీలో సక్సెస్ రేటు 10 శాతం కంటే తక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో, కొత్తవారు మొదటి సినిమాకే తమను తాము మేధావులుగా భావించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవకాశం లభించడం వెనుక అదృష్టం, బ్యాకింగ్ లేదా పరిచయాలు ఉండవచ్చు, కానీ 2వ లేదా 3వ అవకాశం రావాలంటే మాత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మరియు ప్రేక్షకుల ఆదరణ మాత్రమే ప్రామాణికంగా మారుతాయి.అందుకే "అవకాశం రావడం వేరు... ప్రతిభతో పరిశ్రమను ఏలడం వేరు" అని ప్రముఖ సినీ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.  ఇది కూడా చదవండి: జై హనుమాన్ తో మమితా బైజు మైథాలజీ ఎంట్రీ?   కొత్త నీరు పరిశ్రమలోకి రావడం ఎప్పుడూ శుభపరిణామమే అయినా, అనుభవం మరియు కంటెంట్ లో నాణ్యత లేకపోతే ఆ అవకాశాలు ఆవిరైపోతాయి. పరిశ్రమకు కావాల్సింది కేవలం గ్లామర్ లేదా ప్రచార ఆర్భాటాలు కావు; కంటెంట్ లో దమ్ము, ప్రేక్షకుల భావోద్వేగాలను పట్టుకోగలిగే అసలైన ప్రతిభ. కాబట్టి సినీ ప్రయాణంలో తొలి అవకాశం అనేది కేవలం ఒక తలుపు తెరచుకోవడం మాత్రమే, ఆ తలుపు దాటి మైలురాళ్లను చేరుకోవడమే అసలైన విజయం. [Tollywood Talent vs Opportunity Reality Check, tollywood talent vs opportunity, telugu movie news, tollywood box office success rate, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]
ఒక్కొక్కరికి ఒక్కో టైం అన్నట్టుగా ఇప్పుడు ఆ టైం మమితా బైజు చుట్టూ జీ హుజూర్ అంటూ తిరుగుతుంది. దీంతో సౌత్ హీరోలు, మేకర్స్ తన గురించే ఆలోంచించే పరిస్థితి.  కాలు కదిపితే కోట్ల రూపాయల వసూళ్లు. అలాంటి ఈ క్రేజీ భామ  ఇప్పుడు ఏకంగా బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతుండడం సినీ వర్గాల్లో  ఆసక్తి రేకెత్తిస్తోంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ సృష్టించిన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) లో భాగంగా వచ్చిన ‘హను-మాన్’ చిత్రం దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమై ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ భారీ విజయానికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న సీక్వెల్ ‘జై హనుమాన్’. ఈ భారీ మైథలాజికల్ విజువల్ వండర్‌లో కాంతార ఫేమ్ రీసెంట్ నేషనల్ అవార్డ్ విన్నర్ రిషబ్ శెట్టి కథానాయకుడిగా, శ్రీరాముడి భక్తుడైన హనుమంతుడిగా  కనిపిస్తున్నారు. ప్రశాంత్ వర్మ విజన్, రిషబ్ శెట్టి కాంబినేషన్ అనౌన్స్‌మెంట్ నుంచే ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలోనే హీరోయిన్ రోల్  కోసం మమితా బైజుని ఎంపిక చేసినట్లు ఆండస్ట్రీ వర్గాల్లో గట్టిగానే ప్రచారం జరుగుతోంది.   ఇది కూడా చదవండి: వాళ్ళని ప్రస్తావిస్తూ డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు తీర్పు: టాలీవుడ్‌లో మరో సంచలనం! తన కెరీర్‌లో ఇప్పటివరకు ఎక్కువగా యూత్‌ఫుల్, రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌లో మెరిసిన మమితా బైజుకి ఇది మొదటి మైథలాజికల్ ప్రాజెక్ట్ కావడం విశేషం. దీంతో మరో సారి తనదైన శైలిలో నటనను కనబరిచి పాన్ ఇండియా స్థాయిలో మరింత పాపులారిటీ సాధించే అవకాశం ఉంది. అయితే అధికార ప్రకటన రావాలి. అప్పటివరకు రూమర్  మమితా బైజు ని దాచుకొని ఫోజు కొడుతూనే ఉంటుంది.   Mamitha Baiju In Jai Hanuman Movie, Mamitha Baiju, Jai Hanuman, Prasanth Varma, Rishab Shetty, Premalu Heroine, Jai Hanuman Cast Update, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]    
Vijay Sethupathi is reportedly unhappy with the prolonged delays surrounding Arasan and is said to be considering walking out of the project. According to inside reports, the actor has grown increasingly frustrated with the uncertainty over the shooting schedules, with the film continuing to take longer than expected. The actor has previously worked with director Vetrimaaran on the Viduthalai films, and the repeated delays associated with the filmmaker’s projects are said to have tested his patience this time as well. The situation has reportedly been further complicated by Silambarasan, whose portions for Arasan are also said to be taking longer to complete. The combination of the delayed schedules and uncertainty over the film’s progress has apparently not gone down well with Sethupathi. Vijay Sethupathi is currently in a strong phase of his career, with his recent release Baththa emerging as a hit. He also has an interesting lineup ahead, including Mani Ratnam’s Inji Vellam, a romantic drama featuring Sai Pallavi as the female lead. With several projects in his pipeline, the actor is reportedly keen on maintaining a more predictable schedule and is unwilling to remain indefinitely tied up with a production facing repeated delays. There is no official confirmation yet from Vijay Sethupathi, Vetrimaaran or the Arasan team regarding the reported exit. If the development materialises, it could become another major casting change for the long-in-the-making project. Anirudh Ravichander is composing music for this film produced by Kalaipuli Dhanu.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
‘దేవర’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన ‘చుట్టమల్లే’ పాటకు సంబంధించిన డీప్‌ఫేక్ వీడియో వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ పాటకు చెందిన అసలు వీడియోను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా మార్చి సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలో తాజాగా ఇదే వ్యవహారానికి సంబంధించి మరో నకిలీ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘చుట్టమల్లే’ పాటను అసభ్యంగా ఎడిట్ చేసిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారంటూ ఓ పోస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అందులో పోలీసుల చర్యకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఫొటోను కూడా ఉపయోగించారు. అయితే ఈ ఫొటో అసలైనది కాదని సజ్జనార్ స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రూపొందించిన డీప్‌ఫేక్ ఫొటోను తన అసలు ఫొటోలా చూపిస్తూ ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఫొటో, వీడియోను నిజమని నమ్మవద్దని సజ్జనార్ ప్రజలకు సూచించారు. ఏదైనా వార్త లేదా ఫొటోను షేర్ చేసే ముందు దాని నిజానిజాలను నిర్ధారించుకోవాలని కోరారు. ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, అలాగే పోలీసులు తీసుకున్న చర్యలకు సంబంధించిన పోస్టుల విషయంలో అధికారిక సమాచారం ద్వారా వాస్తవాలను నిర్ధారించుకోవాలని సూచించారు. ఏఐ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ నకిలీ కంటెంట్‌ను గుర్తించడం మరింత కష్టంగా మారుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తన ఫొటోను కొందరు అభిమానులు ఇలా దుర్వినియోగం చేస్తున్న విషయాన్ని గమనించాలని కోరుతూ సజ్జనార్ జూనియర్ ఎన్టీఆర్‌ను ట్యాగ్ చేశారు. అభిమానుల పేరుతో ఏఐ ద్వారా నకిలీ ఫొటోలు రూపొందించి ప్రచారం చేయడం వల్ల తప్పుడు సమాచారం మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ‘చుట్టమల్లే’ డీప్‌ఫేక్ వివాదం నేపథ్యంలో ఇప్పటికే సినీ ప్రముఖులు దీనిపై తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా సీపీ సజ్జనార్ ఫొటోను కూడా ఉపయోగించి మరో ఫేక్ ప్రచారం జరగడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది.       [Jr NTR, Janhvi Kapoor, Chuttamalle Deepfake Video, Devara Movie, CP Sajjanar, VC Sajjanar, AI Deepfake, Chuttamalle Song, Jr NTR Fans, Devara Deepfake Controversy, Hyderabad Police, Fake AI Photo, Janhvi Kapoor Deepfake, Telugu Cinema, AI Fake News]
  గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న డాన్సర్స్ అసోసియేషన్ వివాదం ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఈ క్రమంలో  తెలంగాణ హైకోర్టు తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ యూనియన్ ఎన్నికలపై కీలకమైన స్టే విధిస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 600 మందికి పైగా సభ్యులు ఉన్న ఈ డాన్సర్స్ యూనియన్‌లో కొంతమంది వ్యక్తుల వైఖరి వల్ల మొత్తం అసోసియేషన్‌కు తీవ్ర నష్టం జరుగుతోందని, ఎన్నికలు పారదర్శకంగా జరగడం లేదని కొందరు సభ్యులు కోర్టుని  ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగడం సరికాదని భావించి స్టే విధిస్తూ తీర్పునిచ్చింది.   ఈ ఎన్నికల చుట్టూ గత కొద్దివారాలుగా టాలీవుడ్‌లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ప్రెసిడెంట్ రఘు మాస్టర్ నాయకత్వంలో ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సత్య మాస్టర్, రాజన్న మాస్టర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యూనియన్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు, సభ్యులందరి హక్కులను కాపాడేందుకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు. అయితే, మరొక వైపు నుండి కనీస నిబంధనలు పాటించకుండానే ఎన్నికలకు సమాయత్తమవుతున్నారనే అభియోగాలు వెల్లువెత్తాయి. గతంలో కూడా ఫైటర్స్ యూనియన్ మరియు డాన్సర్స్ యూనియన్ సమస్యల పరిష్కారానికి సినీ ప్రముఖులు, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ మరియు నటుడు నందమూరి బాలకృష్ణ జోక్యం చేసుకుని సమస్యలను చక్కదిద్దేందుకు చొరవ చూపారు. అయినప్పటికీ, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే మళ్లీ వర్గపోరు పరాకాష్టకు చేరుకోవడం గమనార్హం.   మీరు కూడా చదవండి :పవన్ కళ్యాణ్ పేరిట నకిలీ ఎక్స్ ఖాతా: దాన్నుంచి ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు    యూనియన్ కార్యవర్గ సమావేశాల మినిట్స్ బుక్ తీసుకోవడం, సీనియర్ సభ్యులపై పరస్పర ఆరోపణలు చేసుకోవడం మరియు వివాదాలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వరకు చేరడంతో వాతావరణం మరింత వేడెక్కింది. ఫెడరేషన్‌ను తమకు తల్లి లాంటిదని పేర్కొంటూనే, కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం అసోసియేషన్‌ను బలహీనపరుస్తున్నారని సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలోని 24 శాఖల్లో ఎంతో కీలకమైన డాన్సర్లు మరియు డాన్స్ మాస్టర్ల సంక్షేమం దృష్ట్యా ఈ వివాదం త్వరగా సమసిపోవాలని సామాన్య కార్మికులు కోరుకుంటున్నారు. ఇప్పుడు హైకోర్టు స్టే విధించడంతో అక్టోబర్ 11న జరగాల్సిన ఓటింగ్ ప్రక్రియ పూర్తిగా ఆగిపోయింది. న్యాయస్థానం తన తదుపరి విచారణలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో అని సినీ వర్గాలతో పాటు టాలీవుడ్ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పరిణామం టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.     [Dancers Union Elections High Court Stay, Telugu Film Dancers Union, High Court Stay, Tollywood Dancers Dispute, Dancers Union Elections]  
నానా పటేకర్ ఎంత గొప్ప నటుడో.. అంత గొప్ప వ్యక్తి కూడా. సాయం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు.  2015లో మహారాష్ట్ర తీవ్ర కరువును ఎదుర్కొన్న సమయంలో రైతుల పరిస్థితి దారుణంగా మారింది. అప్పుల బాధతో రైతుల ఆత్మహత్యలు, రైతు కుటుంబాల్లో నెలకొన్న విషాద పరిస్థితులు నానా పటేకర్‌ను కదిలించాయి. అప్పట్లో నానా పటేకర్‌ ఓ ఖరీదైన కారు కొనాలని భావించి సుమారు కోటిన్నర రూపాయలు దాచుకున్నారు. అయితే రైతు కుటుంబాల పరిస్థితిని చూసిన తర్వాత ఆ డబ్బును కారు కోసం కాకుండా బాధితులకు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. విషాదంలో ఉన్న రైతు కుటుంబాలను స్వయంగా కలిసి చెక్కులను అందించడమే కాకుండా.. నేను ఉన్నాననే భరోసాను ఆ కుటుంబాలకు ఇచ్చారు. అక్కడితో ఆగిపోకుండా రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం అవసరమని భావించిన నానా పటేకర్.. మరాఠీ నటుడు మకరంద్ అనాస్పురేతో కలిసి 'NAAM Foundation'ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ప్రధానంగా కరువు ప్రభావిత రైతులకు అండగా నిలవడంతో పాటు నీటి సంరక్షణ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల అభివృద్ధి వంటి కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా మహారాష్ట్రలోని మరాఠ్వాడా, విదర్భ వంటి కరువు ప్రభావిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు కొనసాగాయి. అంటే.. అప్పట్లో రైతుల సమస్యను చూసి వ్యక్తిగత అవసరాన్ని పక్కన పెట్టిన నానా పటేకర్, ఆ తర్వాత అదే సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం కోసం నీటి సంరక్షణ వైపు అడుగులు వేశారు. ఇది కూడా చదవండి: రాజమౌళి మరో అద్భుతం.. ‘వారణాసి’ కోసం కొత్త భాష.. ‘బాహుబలి’ని మించేలా ఉంటుంది.!       [Nana Patekar Helped Farmers, Nana Patekar Passed Away, Nana Patekar Death, Nana Patekar, Telugu Film News, Telugu News]  
  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే 'ఓజి' 2 లో పాల్గొంటాడనే న్యూస్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతూనే ఉంది. దీంతో అభిమానులు ఓపెనింగ్ డేట్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఇలాంటి టైంలో ఒక తాజా న్యూస్ షాక్ ఇస్తుంది.   పవన్ కల్యాణ్ పేరుతో ఒక నకిలీ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాను సృష్టించి, దాన్నుంచి విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు పోస్టులు మరియు కల్పిత వీడియోలను విస్తృతంగా ప్రచారం చేసిన ఉదంతం తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యూహాత్మక అసత్య ప్రచారం వెనుక ఉన్న అసలు సూత్రధారిని గుర్తించిన గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇది కూడా చదవండి: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా: సీఎం విజయ్‌పై మద్రాస్ హైకోర్టు షాకింగ్ వ్యాఖ్యలు!     కేసు వివరాల్లోకి వెళితే, గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఎర్రబాలెం ప్రాంతానికి చెందిన తీర్థాల నాగ వెంకట దుర్గా రాకేష్ అనే వ్యక్తి ఈ సైబర్ నేరానికి ఒడిగట్టాడు. హైదరాబాద్‌లో తలదాచుకున్న నిందితుడు రాకేష్‌ను గురువారం ప్రత్యేక పోలీసు బృందం వ్యూహాత్మకంగా అదుపులోకి తీసుకుంది. అనంతరం అతడిని తదుపరి విచారణ నిమిత్తం గుంటూరుకి తరలించారు. నిందితుడు పవన్ కల్యాణ్ పేరు, ఫోటోలను అధికారికంగా ఉపయోగిస్తున్నట్లు భ్రమింపజేస్తూ ఒక ఎక్స్ ఖాతాను నిర్వహించాడు. ఆ ఖాతా నుంచి పొలిటికల్ మైలేజ్ కోసం మంత్రి నారా లోకేష్ లక్ష్యంగా చేసుకొని మార్ఫింగ్ వీడియోలు, ఫేక్ వార్తలు, వివాదాస్పద వ్యాఖ్యలను నిరంతరం సర్క్యులేట్ చేశాడని పోలీసు దర్యాప్తులో వెల్లడైంది.     [Pawan Kalyan Fake x Account nara lokesh posts arrest, Pawan Kalyan Fake X Account, Nara Lokesh Fake Posts Case, Telugu Cinema News, Telugu Cinema, Tollywood News, Tollywood]       
  కొన్ని సార్లు రావడం లేటు అవ్వచ్చేమో గాని, రావడం మాత్రం పక్కా అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నట్టు , ఇప్పుడు ఇళయ దళపతి విజయ్ కేసులో మద్రాస్ (చెన్నై)హైకోర్టు ఇచ్చే  తీర్పు కూడా అదే విధంగా పాజిటివ్ గా వచ్చేలా ఉంది.  జోసెఫ్ విజయ్ ఎన్నికల అఫిడవిట్ కేసులో మద్రాస్ హైకోర్టు కీలకమైన మరియు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. గత ఎన్నికల్లో పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 50,000 కంటే ఎక్కువ ఓట్ల భారీ మెజార్టీతో విజయపరంపర సాధించిన సీఎం విజయ్ ఎన్నిక చెల్లదంటూ, పెరంబూర్ నియోజకవర్గానికి చెందిన ఓటరు ఎస్. దినేష్ మద్రాస్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. విజయ్ తన ఎన్నికల అఫిడవిట్‌లో దాదాపు .30 కోట్ల విలువైన స్థిరాస్తుల వివరాలను ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారని, ఆస్తుల వివరాలను సమగ్రంగా వెల్లడించకపోవడం ఎన్నికల నిబంధనల యొక్క తీవ్రమైన ఉల్లంఘన కిందకే వస్తుందని పిటిషనర్ తరఫు న్యాయవాది తీవ్రంగా వాదించారు.   ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్ ధర్మాసనం అత్యంత కీలకమైన ప్రశ్నలను సంధించింది. అసలు  అభ్యర్థి ఇప్పటికే సుమారు 600 కోట్ల విలువైన అపార ఆస్తులను అఫిడవిట్‌లో స్పష్టంగా ప్రకటించినప్పుడు, అందులో కేవలం 30 కోట్ల ఆస్తుల వివరాలు నమోదు కాకపోతే దానిని ఉద్దేశపూర్వక అవినీతి చర్యగా భావించవచ్చా అని ధర్మాసనం ప్రశ్నించింది.  ఇది కూడా చదవండి: మా లాయర్లతో సినిమా తీయండి: ప్రముఖ నటుడ్ని కోరిన సుప్రీంకోర్టు జడ్జి      సాధారణంగా ప్రముఖ నాయకులు లేదా అభ్యర్థులు స్వయంగా కూర్చుని తమ ఆస్తుల జాబితాను తయారు చేసుకోరని, వారు పూర్తిగా తమ చార్టర్డ్ అకౌంటెంట్ (CA) పరిజ్ఞానంపైనే ఆధారపడతారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించే సమయంలో తాను కూడా తన ఆస్తుల జాబితా కోసం సిఏపైనే ఆధారపడ్డానని గుర్తుచేశారు. అటువంటప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్ పొరపాటున లేదా సాంకేతిక లోపం వల్ల కొన్ని ఆస్తుల వివరాలు నమోదు చేయకపోతే, దానికి అభ్యర్థి ఎన్నికనే రద్దు చేయడం ఏమాత్రం సమంజసమవుతుందని కోర్టు నిలదీసింది.   అంతేకాకుండా, విజయ్ రూ.30 కోట్ల ఆస్తుల వివరాలను వెల్లడించకపోవడం వల్ల పెరంబూర్ నియోజకవర్గ ఓటర్ల తీర్పు ఏమైనా ప్రభావితమైందా అని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది.  50 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలిచిన ప్రభావాన్ని చిన్న చిన్న వ్యత్యాసాల ఆధారంగా రద్దు చేయలేమని విజయ్ తరఫు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదించారు. అయితే పోరూరు మరియు ఇతర ప్రాంతాల్లోని ఆస్తుల కొనుగోలు విలువలు, విస్తీర్ణంపై కూడా స్పష్టత లేదని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రస్తుతం మద్రాస్ హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను వాయిదా వేయడంతో, తమిళనాడు రాజకీయంలో 30 కోట్ల ఆస్తుల వివాదం ఏ మలుపు తిరుగుతుందో అని సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.     [Cm Vijay election affidavit case madras hc, CM Vijay Election Affidavit Case, TVK Vijay Assets Dispute, Madras High Court Hearing, Telugu Cinema News, Telugu Cinema, Tollywood News, Tollywood]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఆధునిక వేగవంతమైన జీవనశైలిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, సరైన పోషకాహారం తీసుకోవడం అత్యంత కీలకమైన అంశంగా మారింది. ముఖ్యంగా శరీర బరువు తగ్గించుకోవాలని నిరంతరం ప్రయత్నించే వారికి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాల్సిన డయాబెటిస్ బాధితులకు రోజువారీ ఆహారం ఎంతో శ్రద్ధతో ఎంచుకోవాల్సి ఉంటుంది. అటువంటి వారి కోసం అస్సలు ఒక్క బొట్టు నూనె కూడా వాడకుండా, ఎంతో రుచికరంగా, ఆరోగ్యకరంగా ఇంట్లోనే తయారుచేసుకునే ఒక అద్భుతమైన సాంప్రదాయ వంటకమే "సొరకాయ జొన్న రొట్టె". ఉదయం అల్పాహారంగా గానీ లేదా రాత్రి వేళ సులభంగా అరిగే రాత్రి భోజనంగా గానీ ఈ రొట్టెను చాలా సులభంగా సిద్ధం చేసుకోవచ్చు. మన వంటింట్లో లభించే అతి సాధారణమైన పదార్థాలతోనే లంచ్ లేదా డిన్నర్ సమయాల్లో డిఫరెంట్ రుచిని ఆస్వాదించవచ్చు. ఈ రుచికరమైన ఆరోగ్యకరమైన రొట్టె తయారీకి కావలసిన కొలతలు మరియు పదార్థాలను పరిశీలిస్తే: 1 కప్పు తొక్క తీసి నీళ్లు పిండకుండా సిద్ధం చేసుకున్న సొరకాయ తురుము, 1 కప్పు మంచి జొన్న పిండి, 1/4 కప్పు శనగ పిండి, 1 చిన్నదిగా తరిగిన ఉల్లిపాయ, 2 నుండి 3 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు, కొద్దిగా కరివేపాకు తరుగు, 1/2 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు మరియు అవసరమైతే కొద్దిగా కారం తీసుకోవాలి. ముందుగా సొరకాయను బాగా కడిగి తురుముకోవాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే సొరకాయ తురుము నుండి నీటిని అస్సలు పిండకూడదు. ఎందుకంటే సొరకాయలోని సహజ సిద్ధమైన తడిదనమే పిండిని చక్కగా కలపడానికి ఎంతగానో సహాయపడుతుంది. వంట తయారీ విధానంలోకి వస్తే, ఒక వెడల్పాటి గిన్నెలో సొరకాయ తురుము, జొన్న పిండి, శనగ పిండిలను వేసి, వాటికి తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ధనియాల పొడి మరియు ఉప్పు చేర్చి మొదట నీళ్లు పోయకుండా సొరకాయ తడితోనే బాగా కలుపుకోవాలి. పిండి గట్టిగా అనిపిస్తే మాత్రమే కొద్దికొద్దిగా నీరు చిలకరిస్తూ చపాతీ పిండి కంటే కాస్త మృదువుగా ఉండేలా కలుపుకోవాలి. రొట్టెను వత్తడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది; నూనె వాడకుండా ఉండటానికి ఒక కాటన్ తడి వస్త్రాన్ని నీటిలో ముంచి బాగా పిండేసి, ఆ తడి గుడ్డపై పిండి ముద్దను ఉంచి చేతితో సన్నగా రొట్టెలా వత్తుకోవాలి. వేడెక్కిన పెనంపై ఈ తడి గుడ్డలోని రొట్టెను బోర్లించి వస్త్రాన్ని జాగ్రత్తగా తీసివేస్తే రొట్టె పెనంకు అంటుకోకుండా నీట్‌గా వస్తుంది. రొట్టెను రెండు వైపులా తక్కువ మంటపై బంగారు రంగు వచ్చేవరకు చక్కగా కాల్చుకోవాలి. నూనె లేకపోవడం వల్ల రొట్టె ఎండిపోయినట్లు అనిపిస్తే కొద్దిగా నీటి చుక్కలను చిలకరించి మెత్తగా ఉడికించుకోవచ్చు. ఈ సొరకాయ జొన్న రొట్టెలో పీచు పదార్థం (ఫైబర్) అత్యధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ వేగవంతమై కడుపు ఉబ్బరం తగ్గడమే కాకుండా, ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. గ్లూటెన్ రహితమైన జొన్న పిండి మరియు తక్కువ క్యాలరీలు ఉండే సొరకాయ కలయిక వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగవు. కొలెస్ట్రాల్ మరియు బరువు సమస్యలతో బాధపడేవారికి, జొన్న రొట్టెలు తినడానికి మారాం చేసే పిల్లలకు ఈ సొరకాయ జొన్న రొట్టె ఒక ఉత్తమమైన ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం.       [Sorakaya Jonna Rotte, Bottle Gourd Jowar Roti, Jowar Flour, Bottle Gourd Recipes, Healthy Breakfast, Diabetes Diet, Weight Loss Diet, Oil Free Recipes, Gluten Free Food, High Fiber Foods]
ప్రస్తుత ఆధునిక ఉద్యోగ జీవనశైలిలో డెస్క్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) చేసే ఉద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీనితో పాటే మెడ నొప్పి, తీవ్రమైన వెన్నునొప్పి సమస్యలు కూడా ఆందోళనకర రీతిలో హెచ్చరిస్తున్నాయి. పూర్వం కేవలం వయసు పైబడిన వారిలోనే కనిపించే ఈ ఎముకలు, కండరాల బలహీనతలు నేడు 20 ఏళ్ల లేత వయసులోని యువతను, టీనేజర్లను కూడా తీవ్రంగా వేధిస్తున్నాయి. ఐటీ, కార్పొరేట్ ఉద్యోగాలు చేసే ఆడా, మగా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం నరకం చూస్తున్నామని వాపోతున్నారు. వైద్య నిపుణుల పరిశోధనల ప్రకారం, కార్యాలయ ఉద్యోగులు తమ పనివేళల్లో దాదాపు 81.8% సమయం కదలకుండా కూర్చోవడానికే కేటాయిస్తున్నారు. ఈ సుదీర్ఘ గంటల కదలికలేని జీవనశైలి వల్ల సుమారు 65% కంటే ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు ఏదో ఒక రకమైన ఎముకలు, వెన్నెముక లేదా కండరాల నొప్పులకు గురవుతున్నారు. ఈ సమస్యలన్నింటికీ ప్రధాన కారణం గంటల తరబడి ల్యాప్‌టాప్, కంప్యూటర్ల ముందు సరైన అవగాహన లేకుండా, వంకరగా తప్పు కోణంలో కూర్చోవడమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్క్రీన్ చిన్నదిగా ఉండటం వల్ల ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకోవడం లేదా టేబుల్‌పై తక్కువ ఎత్తులో ఉంచి చూసే క్రమంలో తలను ముందుకు వంచుతుంటాం. మానవ శరీరంలో మన మెడకు ప్రకృతిసిద్ధంగా ఒక విశిష్టమైన బాధ్యత ఉంది. అది మన తలను సమతుల్యం చేస్తూ అన్ని దిశల్లోనూ సునాయాసంగా తిప్పడానికి సహాయపడుతుంది. సాధారణంగా మన తల బరువు 10 నుండి 12 పౌండ్లు ఉంటుంది. అయితే, మనం ల్యాప్‌టాప్ చూస్తూ తలను కేవలం 15 డిగ్రీల కోణంలో ముందుకు వంచినప్పుడు, మెడ కండరాలపై పడే విపరీతమైన ఒత్తిడి ఏకంగా 27 పౌండ్లకు పెరుగుతుంది. అదే తలను 60 డిగ్రీల కోణంలో కిందికి వంచితే, మెడపై పడే భారం ఏకంగా 60 పౌండ్లకు సమానమవుతుంది. రోజుకు 8 నుండి 10 గంటల పాటు నిలబడటం కంటే కూర్చోవడం వల్ల నడుము భాగంలోని వెన్నెముక డిస్క్‌లపై దాదాపు 40% అదనపు ఒత్తిడి పెరుగుతుంది. ఈ అదనపు ఒత్తిడి వల్ల మెడ వెనుక భాగంలోని కండరాలు తీవ్ర అలసటకు గురై, క్రమంగా భుజాలు పట్టేయడం, తలనొప్పి రావడం మరియు చేతుల్లో తిమ్మిర్లు రావడం వంటి తీవ్రమైన సమస్యలు మొదలవుతాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే వెన్నెముక తన సహజసిద్ధమైన ఆకారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే, ఈ నొప్పుల నుంచి విముక్తి పొందడానికి ఉద్యోగాలు వదిలేయాల్సిన అవసరం లేదు; కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. మొదటిగా, మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్ ఎత్తును మీ నేరు కంటి చూపు లెవెల్‌కు సరిపోయేలా 'ల్యాప్‌టాప్ స్టాండ్' సహాయంతో సరిచేసుకోవాలి. దీనివల్ల స్క్రీన్ చూసేందుకు మెడను కిందికి వంచాల్సిన అవసరం ఉండదు. రెండోది, కూర్చునే భంగిమలో మార్పు తెచ్చుకోవాలి. వీపు మరియు వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకుంటూ కుర్చీ వెనుక భాగానికి ఆనుకుని సౌకర్యవంతంగా కూర్చోవాలి. అలాగే కూర్చున్నప్పుడు మీ రెండు పాదాలు నేలకు పూర్తిగా సమాంతరంగా ఆని ఉండటం చాలా ముఖ్యం. అన్నింటికంటే కీలకమైన సూత్రం ప్రతి 40 నుండి 45 నిమిషాలకు ఒకసారి చిన్న విరామం ఇవ్వడం. ఒకే చోట గంటల కొద్దీ కదలకుండా కూర్చోకుండా, కుర్చీ నుంచి లేచి రెండు నిమిషాలు గదిలో నడవాలి. నిపుణుల అధ్యయనాల ప్రకారం, క్రమం తప్పకుండా ప్రతి గంటకూ రెండు నిమిషాల సమయం వెచ్చించి శరీరాన్ని కాస్త కదిలించడం లేదా తేలికపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల రాబోయే మెడ, వెన్ను నొప్పుల తీవ్రతను 44% నుంచి 17% కి తగ్గించవచ్చని రుజువైంది. ఆఫీసు సమయంలో చిన్నచిన్న వ్యాయామాలు చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, రోజంతా ఉత్సాహంగా ఉండటానికి తోడ్పడుతుంది. కానీ, మీ మెడ లేదా వెన్ను నొప్పి తీవ్రమై, మెడను సాధారణంగా తిప్పలేకపోవడం, భుజాలు లేదా చేతులు మొద్దుబారడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అర్హత కలిగిన ఆర్థోపెడిక్ లేదా ఫిజియోథెరపీ వైద్యుడిని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం శ్రేయస్కరం.       [Neck Pain, Back Pain, Desk Jobs, Work From Home, Poor Posture, Laptop Ergonomics, Spine Health, IT Employees, Stretching Exercises, Physiotherapy]  
చాణక్యుడు చెప్పిన మాట.. దయచేసి ఇలాంటి పరిస్థితులలో మాత్రం మౌనంగా ఉండండి..  మానవ జీవితంలో మాట అనేది ఎంత శక్తివంతమైనదో, మౌనం కూడా అంతే ప్రయోజనకరమైనది. ఎన్నో  సందర్భాల్లో మనం మాట్లాడే మాటల కంటే మౌనంగా ఉండటమే మనకు గొప్ప గౌరవాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. నోటి నుంచి వచ్చిన మాటను తిరిగి తీసుకోలేము. కొన్నిసార్లు ఎంత మంచి ఉద్దేశంతో మాట్లాడినా, సమయం , సందర్భం సరిగ్గా లేకపోతే అది తీవ్రమైన గొడవలకు, మనస్పర్థలకు దారితీస్తుంది. అందుకే  గొప్ప దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు అయిన ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో మాటల వల్ల జరిగే సంఘటనల గురించి, మౌనం  గొప్పతనం గురించి వివరంగా చెప్పారు. జీవితంలో ప్రశాంతంగా, విజయవంతంగా ఉండటానికి ఎలాంటి పరిస్థితులలో మౌనంగా ఉండాలో చాణక్యుడు స్పష్టంగా మార్గదర్శనం చేశారు. ఆ ముఖ్యమైన ఆరు సందర్భాల గురించి  వివరంగా తెలుసుకుంటే.. ఇద్దరు వ్యక్తులు గొడవపడుతున్నప్పుడు.. ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్న  సమయంలో పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోకుండా మధ్యలో దూరి అభిప్రాయం చెప్పడం చాలా ప్రమాదకరం. సమస్యను పరిష్కరించాలనే మంచి ఉద్దేశం  ఉన్నప్పటికీ, అక్కడ ఉన్నవారు మీ మాటలను వేరేలా అర్థం చేసుకునే అవకాశం ఉంది. మీ మాటలు ఒకరికే అనుకూలంగా ఉన్నాయని భావించి, మిమ్మల్ని కూడా ఆ వివాదంలోకి లాగుతారు. కాబట్టి ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు వాతావరణం ప్రశాంతంగా మారే వరకు వేచి చూడటం, మాట్లాడకుండా మౌనంగా ఉండటమే మంచిది. ఎదుటి వ్యక్తి  సలహాను స్వీకరించడానికి  ఇష్టపడనప్పుడు.. ఒక మనిషికి సలహా ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉందంటే, ఆ వ్యక్తి దానిని వినడానికి, అర్థం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎవరైనా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసి, మీ మాటలను అస్సలు పట్టించుకోవడానికి ఇష్టపడనప్పుడు, వారికి పదే పదే  చెప్పాలని చూడటం వల్ల ప్రయోజనం ఉండదు. పైగా అది అనవసరమైన వాదనలకు దారితీస్తుంది. అటువంటి సమయంలో మీ అభిప్రాయాలను వారిపై రుద్దకుండా మౌనంగా వెనక్కి తగ్గడమే వివేకవంతమైన పని. మీ మాటలకు లేదా అభిప్రాయాలకు  గౌరవం లభించని చోట.. మీరు ఎంత మంచి విషయాలు చెప్పినా ఎదుటివారు మిమ్మల్ని తేలిగ్గా తీసుకుంటున్నా, లేదా మీ మాటలను పదే పదే  తోసిపుచ్చుతూ హేళన చేస్తున్నా అక్కడ పదే పదే మాట్లాడటం సరికాదు. ప్రతిసారి మిమ్మల్ని మీరు సరైనవారని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మాటలను  అక్కడితో ముగించి మౌనంగా ఉండటం ద్వారా మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవచ్చు. ప్రతి వాదనలోనూ గెలవడం కంటే మన ప్రశాంతతను, గౌరవాన్ని నిలబెట్టుకోవడమే ముఖ్యం. పూర్తి సమాచారం లేదా స్పష్టత లేనప్పుడు.. సగం సగం తెలిసిన విషయాలతో లేదా కేవలం అంచనాలతో సలహాలు ఇవ్వడం చాలా నష్టం కలిగిస్తుంది. ముఖ్యంగా తీవ్రమైన లేదా సున్నితమైన విషయాలలో అవగాహన లేకుండా మాట్లాడితే ఇతరులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అందుకే ఒక విషయం గురించి సరిగ్గా తెలియనప్పుడు, దాని గురించి ముందుగా పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. నాకు ఈ విషయం పూర్తిగా తెలియదు అని అంగీకరించి మౌనంగా ఉండటమే నిజమైన తెలివితేటలకు నిదర్శనం. ఇతరుల కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత వివాదాల్లో.. ఇతరుల కుటుంబ విషయాలలో బయటి వ్యక్తులకు పూర్తి వివరాలు లేదా వారి మధ్య ఉండే పాత బంధాలు, భావోద్వేగాలు తెలియవు. అడిగి అడగకుండా అటువంటి విషయాల్లో సలహాలు ఇవ్వడం లేదా కల్పించుకోవడం అస్సలు మంచిది కాదు. కాలక్రమేణా కుటుంబ సభ్యులు తమ సమస్యలను తామే పరిష్కరించుకుని ఒకటవుతారు, కానీ ఆ సమయంలో మీరు అన్న మాటలు మాత్రం వారి మనస్సులో అలానే ఉండిపోతాయి. కాబట్టి ఇతరుల ఇంటి సంబంధిత గొడవల్లో మౌనంగా ఉండటమే మంచిది. ఎదుటి వ్యక్తి తీవ్రమైన కోపంలో ఉన్నప్పుడు.. కోపంలో ఉన్న మనిషి సాధారణ స్థితిలో ఆలోచించలేడు. ఆ సమయంలో మనం చెప్పే మంచి మాటలు లేదా ఇచ్చే సరైన సలహాలు కూడా వారికి విమర్శలాగానో లేదా వ్యతిరేకతలాగానో కనిపిస్తాయి. దీనివల్ల కోపం ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందే తప్ప తగ్గే అవకాశం ఉండదు. అందుకే ఎదుటివారి కోపం చల్లారే వరకు ఓపికగా, మౌనంగా ఉండాలి. సరైన సమయం చూసి, ప్రశాంత వాతావరణంలో మాట్లాడితే వారు మీ మాటను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. పైన చెప్పుకున్న ఆరు పరిస్థితులలో చాణక్యుడు చెప్పినట్లుగా మౌనాన్ని ఆశ్రయించడం వల్ల మన ప్రశాంతత దక్కడమే కాకుండా, అనవసరమైన చిక్కులు, గొడవలు, ఆత్మీయులతో మనస్పర్థలు రాకుండా చూసుకోవచ్చు. సరైన సమయంలో మాట్లాడటం ఎంత ముఖ్యమో, సరైన సందర్భంలో మౌనంగా ఉండటం కూడా అంతే గొప్ప కళ.                              *రూపశ్రీ.  
చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడం, అరికాళ్లు మంటగా అనిపించడం, నడిచేటప్పుడు పాదాల్లో మంట లేదా సూదులు గుచ్చినట్లుగా ఉండటం వంటి సమస్యలను చాలామంది సాధారణంగా తీసుకుంటారు. ముఖ్యంగా షుగర్ ఉన్నవారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అవి మధుమేహం వల్లే వచ్చాయని భావిస్తుంటారు. అయితే ప్రతి సందర్భంలోనూ కారణం షుగర్ మాత్రమే కాకపోవచ్చు. మన శరీరంలో నరాల పనితీరు సక్రమంగా ఉండటానికి కొన్ని ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు అవసరం. వీటిలో Vitamin B12, Vitamin B1, Folate, Calcium వంటి పోషకాలు ముఖ్యమైనవి. వీటిలో ఏదైనా లోపించినప్పుడు నరాలపై ప్రభావం పడి చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, మొద్దుబారడం, మంట, బలహీనత లేదా నడకలో అసౌకర్యం వంటి సమస్యలు కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో Vitamin D లోపం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఇలాంటి లక్షణాలతో సంబంధం కలిగి ఉండవచ్చు. అదే సమయంలో మధుమేహం ఎక్కువకాలం నియంత్రణలో లేకపోతే నరాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. దీనిని Diabetic Neuropathy అంటారు. ముఖ్యంగా పాదాల్లో మంట, నొప్పి, తిమ్మిర్లు, స్పర్శ తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అందుకే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కేవలం షుగర్‌నే కారణంగా భావించకుండా, అసలు కారణాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. అయితే శరీరంలో పోషక లోపం ఉందని లక్షణాలను బట్టి మాత్రమే నిర్ణయించలేం. అవసరమైన సందర్భాల్లో వైద్యులు సూచించే రక్త పరీక్షలు, షుగర్ పరీక్షలు, Vitamin B12 వంటి పోషకాల స్థాయిలను పరిశీలించడం ద్వారా సమస్యకు కారణం ఏమిటో తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో చేతులు, కాళ్లలో తిమ్మిర్లు ఎందుకు వస్తాయి? అరికాళ్లలో మంటకు షుగర్‌తో పాటు ఇంకా ఏ కారణాలు ఉండవచ్చు? Vitamin B12, B1, Folate, Calcium వంటి పోషకాల లోపాన్ని ఎలా గుర్తించాలి?  వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో Dr. Swathi సులభమైన తెలుగులో వివరిస్తున్నారు. తరచుగా చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడం, పాదాల్లో మంట లేదా నొప్పి ఉండటం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వాటి వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవడం అవసరం. ఈ లక్షణాలు ఎక్కువకాలం కొనసాగితే లేదా తీవ్రంగా ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి. గమనిక: ఈ కథనం మరియు వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీకు ఉన్న లక్షణాలకు కారణాన్ని స్వయంగా నిర్ధారించుకోకుండా, అవసరమైన పరీక్షలు మరియు చికిత్స కోసం అర్హత కలిగిన వైద్య నిపుణులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
డయాబెటిస్ ఉన్నవారిలో తరచుగా కనిపించే కొన్ని సమస్యలు రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా కూర్చొని లేవగానే తల తిరగడం, నిలబడినప్పుడు తూలినట్లు అనిపించడం, శరీరంలో బలహీనత, కండరాల బలం తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. తల తిరగడానికి షుగర్ కారణమా? లేక చెవి, మెదడు, మెడకు సంబంధించిన సమస్యల వల్ల Vertigo వస్తుందా? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. ఈ వీడియోలో డాక్టర్ ప్రవీణ్ కుమార్ డయాబెటిస్ మరియు Vertigo గురించి సులభమైన తెలుగులో ముఖ్యమైన విషయాలను వివరిస్తున్నారు. షుగర్ పూర్తిగా Zero అవుతుందా? డయాబెటిస్‌ను పూర్తిగా నయం చేయగలమా? Type 1 Diabetes, Type 2 Diabetes మధ్య తేడా ఏమిటి? శరీరంలో Insulin Resistance ఎలా ఏర్పడుతుంది? డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు అవసరం? వంటి సాధారణ సందేహాలకు ఈ వీడియోలో వివరణ లభిస్తుంది. డయాబెటిస్‌లో షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా పర్యవేక్షణ, శారీరక చురుకుదనం వంటి అంశాల ప్రాధాన్యతను కూడా తెలుసుకోవచ్చు. దీర్ఘకాలంగా షుగర్ నియంత్రణలో లేకపోతే శరీరంపై ఎలాంటి ప్రభావాలు ఉండవచ్చు? కండరాల బలం ఎందుకు తగ్గుతుంది? బలహీనత, లైంగిక సమస్యలు వంటి ఇబ్బందులకు డయాబెటిస్‌తో సంబంధం ఉందా? అనే విషయాలను కూడా డాక్టర్ వివరిస్తారు. ఇక తల తిరగడం లేదా Vertigo విషయానికి వస్తే ప్రతి తల తిరుగుడూ ఒకే కారణంతో ఉండదు. Vertigoలో వివిధ రకాలు ఉంటాయి. ముఖ్యంగా తల లేదా శరీరాన్ని ఒక పొజిషన్ నుంచి మరో పొజిషన్‌కు మార్చినప్పుడు అకస్మాత్తుగా తల తిరిగినట్లు అనిపించే BPPV (Benign Paroxysmal Positional Vertigo) గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అలాగే చెవికి సంబంధించిన సమస్యలు, Aural Vertigo, మెడకు సంబంధించిన Cervical Spondylosis, శరీర స్థితి (Posture) వంటి కారణాల వల్ల కూడా తల తిరగడం లేదా బ్యాలెన్స్ సమస్యలు రావచ్చని వివరిస్తున్నారు. తల తిరుగుతున్నప్పుడు అసలు కారణాన్ని గుర్తించడం ఎందుకు ముఖ్యమో, ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలో కూడా ఈ వీడియో ద్వారా అర్థం చేసుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షుగర్‌ను క్రమం తప్పకుండా ఎలా మానిటర్ చేయాలి? శరీరంలో బలహీనత, కండరాల నష్టం రాకుండా ఎలాంటి జీవనశైలి పాటించాలి? Vertigo ఉన్నప్పుడు చెవుల ఆరోగ్యం, శరీర భంగిమ, రోజువారీ అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి ఉపయోగకరమైన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. అదేవిధంగా Homeopathy Approach గురించి కూడా ఈ వీడియోలో ప్రస్తావించారు. అయితే డయాబెటిస్ లేదా Vertigo వంటి సమస్యలకు స్వయంగా మందులు తీసుకోవడం లేదా ఇప్పటికే వాడుతున్న వైద్య చికిత్సను ఆపడం కాకుండా, అర్హత కలిగిన వైద్యుడి సలహాతోనే చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. షుగర్ కంట్రోల్, డయాబెటిస్‌లో వచ్చే సమస్యలు, తల తిరగడానికి కారణాలు, Vertigo రకాలు, BPPV, చెవి సమస్యలు, Cervical Spondylosis, ఆహారం మరియు రోజువారీ ఆరోగ్య జాగ్రత్తల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: ఈ వీడియోలో అందించిన సమాచారం అవగాహన కోసం మాత్రమే. డయాబెటిస్, Vertigo లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు వ్యక్తిగత చికిత్సను వైద్యుల సలహా లేకుండా మార్చకండి లేదా మందులను నిలిపివేయకండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
ఉదయాన్నే  పరగడుపున టీ లేదా కాఫీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. రోజును చురుగ్గా ప్రారంభించడానికి కాఫీ, టీ లు తాగుతూ ఉంటారు.  అయినప్పటికీ ఇవి శరీరంలో  అసిడిటీ, హార్మోన్ల అసమతుల్యత , ఇతర జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. వీటి స్థానంలో శరీరాన్ని చురుగ్గా ఉంచుతూనే శరీరంలో ఉన్న అనారోగ్యాలను, జబ్బులను, ఇబ్బందులను తగ్గించగల పానీయం తాగడం చాలా మంచిది.  ఈ పానీయాన్ని తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు తొలగిపోవడమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంతకీ అంత శక్తివంతమైన ఆ పానీయం ఏమిటో? దాన్ని ఎలా తయారుచేసుకుని తాగాలో.. వివరంగా తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. ధనియాలు,  జీలకర్ర,  సోంపు ,  వాము  పైన పేర్కొన్న దినుసులలో ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ​తయారీ విధానం... ఈ పానీయాన్ని తయారు చేయడం చాలా సులభం. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాసు నీటిని తీసుకుని మరిగించాలి. అందులో అర టీస్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ సోంపు , పావు టీస్పూన్ వాము వేయాలి. ఈ మిశ్రమాన్ని నీరు సగం అయ్యేంత వరకు చిన్న మంటపై బాగా మరిగించాలి. నీరు బాగా మరిగిన తర్వాత వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. రుచి కోసం లేదా అదనపు ఆరోగ్య ప్రయోజనాల కోసం కాస్త నిమ్మరసం లేదా తేనె కూడా కలపవచ్చు. ఈ పానీయం తాగడం వల్ల శరీరానికి కలిగే  ఉపయోగాలు.. ​హార్మోన్ల సమతుల్యత.. మహిళల్లో ఎదురయ్యే థైరాయిడ్, పిసిఓడి , పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం  వంటి సమస్యలకు ఈ పానీయం చాలా మేలు చేస్తుంది. ధనియాలు , సోంపు శరీరంలో హార్మోన్ల ఉత్పత్తిని క్రమబద్ధీకరించడానికి తోడ్పడతాయి. ​జీర్ణవ్యవస్థ మెరుగుదల.. జీలకర్ర , వాము జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ , మలబద్ధకం వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ​రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ.. టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారికి ఈ పానీయం సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గేందుకు సహాయం.. శరీరంలో ఉన్న కొవ్వును కరిగించడంలో జీలకర్ర , వాము కీలక పాత్ర పోషిస్తాయి. క్రమం తప్పకుండా ఈ పానీయం తాగడం ద్వారా శరీర మెటబాలిజం పెరిగి బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ​చర్మ సౌందర్యం , డిటాక్సిఫికేషన్.. శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఫలితంగా చర్మంపై మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం సహజంగా మెరుస్తుంది. ​కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం.. ఈ పదార్థాల్లో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు , వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. ​ఈ డిటాక్స్ డ్రింక్‌ను ప్రతిరోజూ ఉదయం పరగడుపున క్రమం తప్పకుండా తాగడం ద్వారా శరీరంలో సహజమైన మార్పులను గమనించవచ్చు. టీ, కాఫీలకు ప్రత్యామ్నాయంగా ఈ నేచురల్  పానీయాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా శరీరంలో చాలా మార్పులు గమనించవచ్చు.                       *రూపశ్రీ.