ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత.. పులివెందుల ఎమ్మెల్యే జగన్ పార్టీపై పట్టు కోల్పోతున్నారా? ఆయన ఎంత గట్టిగా హెచ్చరించినా.. పార్టీ నేతలు ఆయన మాటలను పట్టించుకోవడం లేదా? హెచ్చరికలను లెక్క చేయడం లేదా? ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారా? అంటే పరిశీలకులు ఔననే విశ్లేషిస్తున్నారు. ఆయన సొంత ఇలాకాలోనే పార్టీ నేతలూ, శ్రేణులూ ధిక్కార స్వరం వినిపిస్తున్నారని చెబుతున్నారు. అందుకు ఉదాహరణగా ఆయన సొంత ఇలాకా కడపలోనే స్థానిక ఎన్నికలలో వైసీపీ కనీసం సగం స్థానాలలో కనీసం నామినేషన్ కూడా దాఖలు చేయకపోవడాన్ని ఎత్తి చూపుతున్నారు.  వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.   జిల్లాలోని మొత్తం 10 మున్సిపాలిటీలకు గాను కేవలం మూడు చోట్లలో మాత్రమే వైకాపా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగలిగారు. తాజాగా వెలువడిన వివరాల ప్రకారం, కడప కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా బండి దీప్తి, పులివెందులలో జగన్ బంధువు వైఎస్ ప్రమీలాదేవి, ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నరసింహారెడ్డి మాత్రమే బరిలో నిలిచారు. మిగిలిన ఎర్రగుంట్ల, రాజంపేట, బద్వేల్, మైదుకూరు, జమ్మలమడుగు, రాయచోటి,  కమలాపురం నియోజకవర్గాల్లో పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు కాకపోవడంతో ఆయా స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఏకగ్రీవం అయనట్లే.  జగన్ సొంత జిల్లాలోనే సగానికి పైగా స్థానాల్లో పార్టీ పోటీకి దూరంగా ఉండటం ఆ పార్టీ దయనీయ స్థితికి అద్దం పడుతోంది.   ఈ పరిణామం వైసీపీ అధినాయకత్వానికి గట్టి ఎదురుదెబ్బగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ కంచుకోటగా  భావించే కడప జిల్లాలోనే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావడం పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయడం ఖాయమని చెబుతున్నారు.   [YCP Faces Adverse Conditions Kadapa Forte,  Municipal Elections, Pulivendula,  Andhra Pradesh Politics, Telugu One]
విజయవాడ మేయర్ ఎన్నికలో  కమ్మ, కాపు సామాజికవర్గ కోణం తెరపైకి వచ్చింది. ఈ కోణాలన్ని తెరపైకి తీసుకు వచ్చింది రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకునే ఆయనీ కోణాన్ని తెరపైకి తీసుకువచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయసాయి తాజా వ్యాఖ్యలు.. బెజవాడ మేయర్ బరిలో నిలిచిన వంగవీటి రాధ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావులపై కేంద్రీకృతమై ఉన్నాయి. కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.  అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఏబీవీకి విభేదాలు ఉన్నాయని  రిశీలకులు ఎత్తి చూపుతున్నారు. ఇలాంటి విభేదాలు ఇప్పటికే బహిరంగంగా చర్చనీయాంశంగా ఉన్నప్పుడు, మేయర్ బరిలో చంద్రబాబు ఆయనకు ఎలా మద్దతు ఇస్తారన్న ఆరోపణలు, వ్యాఖ్యలు అభూతకల్పనలని వారు విజయసాయి వ్యాఖ్యలను తోసిపుచ్చుతున్నారు.  అదలా ఉంటే..  నిన్నమొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీలో ఉన్న వంగవీటి రాధ.. ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేన గూటికి చేరి బెజవాడ మేయర్ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఆయనకు తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ మద్దతు ఇస్తున్నాయి.  ఈ నేపథ్యంలో విజయసాయి వ్యాఖ్యలు నేల విడిచి సాము చందంగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయసాయి ఇటీవలి కాలంలో తన పొలిటికల్ కామెంట్సన్నీ కుల, మత, ప్రాంతీయ సమీకరణల చుట్టూనే తిరుగుతున్న విషయాన్ని కూడా వారు ఎత్తి చూపుతున్నారు. బెజవాడ మేయర్ మేయర్ ఎన్నికల బరిలో జనసేన తరఫున రాధ, వైఎస్సార్‌సీపీ తరఫున ఆర్. భాగ్యలక్ష్మి, వామపక్ష పార్టీల మద్దతుతో ఏబీ వెంకటేశ్వరరావు ఇండిపెండెంట్ ఉన్న సంగతి తెలిసిందే.   [Vijayasai Reddy, Vijayawada ఛayoral ఆlections, Vangaveeti Radha, AB Venkateswara Rao, Andhra Pradesh politics, Caste, Comments, Telugu One]
వైఎస్ కుటుంబానికి, ఆ తరువాత వైసీపీకి పెట్టని కోట అయిన కడప జిల్లాలో  జగన్ ప్రభ మసకబారుతోందా? అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి ఔనన్న సమాధానమే వస్తున్నది.  స్థానిక ఎన్నిక సమరంలో నామినేషన్ల పర్వం పూర్తి అయ్యే సరికే కడప జిల్లాలోని రెండు మునిసిపాలిటీలను తెలుగుదేశం ఏకగ్రీవంగా గెలుచుకుంది.  అవి కూడా అత్యంత కీలకమైన జమ్మలమడుగు, రాయచోటి మున్సిపాలిటీలు తెలుగుదశానికి జై కొట్టాయి. జమ్మలమడుగు మునిసిపల్ చైర్ పర్సన్ గా  చాదిపిరాల జ్యోతి,   రాయచోటి మున్సిపల్ చైర్‌పర్సన్ గా తెలుగుదేశం అభ్యర్థి ఖాదర్ వల్లి ఏకగ్రీవంగా గెలుచుకున్నారు.  ఇక పోతే రాయచోటిలోని మొత్తం 44 వార్డుల్లోనూ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో టీడీపీ 40 వార్డులను, బీజేపీ మూడు వార్డులను, జనసేన ఒక వార్డును గెలుచుకున్నాయి. జగన్ కు అత్యంత బలమైన రాయచోటి, జమ్మలమడుగు నియోజకవర్గాలలో వైసీపీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులే కరవు కావడం ఆ పార్టీ దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది.  అన్నిటికీ మించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.  ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకూడదని చెప్పడం మాత్రమే కాదు.. ఒకవేళ ఎవరైనా ఏకగ్రీవాలకు అనుమతిస్తే, వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని కూడా జగన్ విస్పష్ట హెచ్చరిక చేశారు. ఆ హెచ్చరికను  జగన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొంందిన  పార్టీ సీనియన్ నేత, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే బేఖాతరు చేశారు.  స్థానక సమరంలో   తమ పార్టీ పోటీ చేయదని ప్రకటించి పెద్దిరెడ్డి జగన్ పై ధిక్కార స్వరం వినిపించారు. సీమలో మరీ ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డికి ఉన్న పట్టును పరిగణనలోకి తీసుకుంటే.. వైసీపీకి, జగన్ కు కూడా ఇది ఊహించని ఎదురుదెబ్బేనని చెప్పాలి. జగన్ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల సమయంలో, పుంగనూరు ఒక రణరంగంగా మారింది; అప్పట్లో టీడీపీ నాయకులను కనీసం నామినేషన్లు కూడా వేయనివ్వని పరిస్థితి ఉండేది. అటువంటిది ఇప్పుడు ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే వెనకడుగు వేశారు. 2019 నుండి 2024 వరకు చిత్తూరు జిల్లా రాజకీయాలను ఆయన శాసించారు. గతంలో అంటే జగన్ హయాంలో ఒక్క పుంగనూరు అనే కాదు..  అప్పి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ రాజకీయాలను కూడా పెద్దిరెడ్డే శాసించారు. అప్పట్లో కుప్పంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి పారాజయం పాలయ్యారు. అదే కాకుండా, అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబును సైతం ఓడిస్తానని పెద్దిరెడ్డి అప్పట్లో సవాల్ కూడా విసిరారు.   అయితే.. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కుప్పంలో సునాయాసంగా విజయం సాధించారు. అటు పెద్దిరెడ్డి స్వయంగా చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా పుంగనూరు నుంచి ఓటమి అంచులకు చేరుకుని కేవలం 6 వేల ఓట్ల స్వల్ప ఆధిక్యతతో ఒడ్డున పడ్డారు.  ఇక ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు కూడా ఆయన ధైర్యం చేయలేకపోతున్నారు.    ఇక ఇప్పుడు ఏకగ్రీవాలకు అనుమతిస్తే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనని జగన్ విస్పష్టంగా హెచ్చరించిన నేపథ్యంలో పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి స్థానిక ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులు పోటీలో ఉండరంటూ చేసిన ప్రకటనతో ఆయనకు 2029 ఎన్నికలలో పుంగనూరు టికెట్ దక్కుతుందా? జగన్ ఇస్తారా? పక్కన పెట్టేస్తారా? అన్న చర్చ పోలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.   [Rayachoty, Jammalamadugu Municipalities, Unanimous, YCP, Handsup, Peddireddi Ramachandra Reddy,  Punganur Municipal Elections, AP Politics, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరోసారి తన రూటే సెపరేటు అన్నట్టుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈసారి నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా బాధ్యతలు తీసుకుని ‘కల్ట్’ సినిమాతో రాబోతున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ట్రైలర్‌లో కనిపించిన రక్తపాతం, యాక్షన్ సన్నివేశాలు, విశ్వక్ సేన్ మాస్ డైలాగ్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే, ఈ వైలెన్స్‌పై ప్రశంసలతో పాటు కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ట్రైలర్‌లో గోవాలోని ఓ దీవిలో చిక్కుకున్న సుమారు 300 మంది ప్రాణాల కోసం పోరాడే భయంకరమైన గేమ్‌ను చూపించారు. మొదట సరదాగా మొదలయ్యే వ్యవహారం.. ఆ తర్వాత ప్రాణాలు తీసే ఆటగా మారుతుంది. ఈ గేమ్‌లో ఓడిపోయిన వారికి ఎదురయ్యే పరిణామాలు, కనిపించే క్రూరమైన సన్నివేశాలు ట్రైలర్‌ను మరింత ఇంటెన్స్‌గా మార్చాయి. హాలీవుడ్‌లో కనిపించే స్లాషర్ థ్రిల్లర్ తరహా కథనాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం ఇందులో కనిపిస్తోంది. ఇక విశ్వక్ సేన్ లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ కూడా ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఆయన గురించి శ్రీకాంత్ అయ్యంగార్ చెప్పే డైలాగ్ సోషల్ మీడియాలో హైలైట్‌గా మారింది. మరోవైపు, రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సన్నివేశాలకు మరింత తీవ్రతను తీసుకొచ్చింది. అయితే, ట్రైలర్‌కు వస్తున్న స్పందన పూర్తిగా ఒకేలా లేదు. కొత్త జానర్‌లో విశ్వక్ సేన్ చేస్తున్న ప్రయత్నాన్ని కొందరు అభినందిస్తుంటే.. మరికొందరు మాత్రం ఇంతటి రక్తపాతం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా హింసాత్మక సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చుతాయనే చర్చ మొదలైంది. అయితే ఇది యూత్ ని టార్గెట్ చేసుకొని తీసిన సినిమా అని ఇప్పటికే విశ్వక్ చెప్పడం విశేషం. గతంలో ‘ఫలక్‌నుమా దాస్’, ‘దాస్ కా ధమ్కీ’ సినిమాలకు దర్శకత్వం వహించిన విశ్వక్ సేన్.. ఇప్పుడు ‘కల్ట్’తో మరోసారి మెగాఫోన్ పట్టుకున్నారు. ఈ సినిమాలో గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తారక్ సినిమాస్‌పై సందీప్ కాకరాల నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 30న థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది. ట్రైలర్‌తోనే ఇంతటి చర్చకు తెరలేపిన ‘కల్ట్’.. వెండితెరపై ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుంది? కొత్త తరహా స్లాషర్ థ్రిల్లర్‌గా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుంది? అనేది చూడాలి. ఇది కూడా చదవండి: హాలీవుడ్‌లో ‘రామాయణ’ గ్రాండ్ ప్రీమియర్.. అతిథులంతా భారతీయ సంప్రదాయ దుస్తుల్లోనే.!       [Vishwak Sen Cult Trailer Response, Vishwak Sen Cult Trailer, Vishwak Sen Cult Movie, Cult Movie Release Date, Vishwak Sen, Cult Trailer, Cult Movie, Gayatri Bharadwaj, Telugu Film News]  
నాచురల్ స్టార్ నాని తన కట్ అవుట్ కి ఉన్న స్టామినాని మరో సారి చాటి చెప్తూ ప్యారడైజ్  తో సత్తా చాటిన విషయం తెలిసిందే.  నెగిటివ్ టాక్ బాగానే స్ప్రెడ్ అయినా కలెక్షన్స్  విషయంలో పర్వాలేదని చెప్పవచ్చు. ఇది కూడా చదవండి: నాలుగు రోజుల కలెక్షన్స్ ఇవే: అర్థమైందా రాజా!   ఇప్పుడు ఈ మూవీ అక్టోబర్ 22 నుండి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఓటిటి ప్రియుల పంట పండినట్టే అని చెప్పుకోవచ్చు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళం మొత్తం 5 ప్రముఖ భాషల్లో స్ట్రీమింగ్ కి వస్తుంది. "వెల్కమ్ టు జడల్ జమానా" అంటూ నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.సెప్టెంబర్ 24 న థియేటర్స్ లోకి వచ్చిన విషయం తెలిసిందే.    [The Paradise OTT release date, Nani The Paradise Netflix, Srikanth Odela movie, The Paradise streaming date, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu news]
సినిమా అంటే కోట్ల రూపాయల పెట్టుబడి.. ఆ తర్వాత ప్రమోషన్లు, థియేట్రికల్ బిజినెస్, బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు. హిట్ అయితేనే నిర్మాతకు లాభాలు వస్తాయనే లెక్కలు చాలాసార్లు కనిపిస్తుంటాయి. కానీ కొన్ని సినిమాల విషయంలో మాత్రం విడుదలకు ముందే లెక్కలన్నీ మారిపోతుంటాయి. ఇప్పుడు ‘ఆకాశంలో ఒక తార’ సినిమా కూడా ఇదే కోవలోకి వస్తున్నట్టుగా కనిపిస్తోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సాత్విక వీరవల్లి హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. ఓ మారుమూల గ్రామానికి చెందిన అమ్మాయి వ్యోమగామి కావాలనే కలను నెరవేర్చుకునేందుకు చేసే ప్రయాణం చుట్టూ కథ తిరుగుతున్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ కథలో దుల్కర్ పాత్ర ఆమె కలకు అండగా నిలిచే వ్యక్తిగా కనిపిస్తోంది. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ నిర్మాతలకు మంచి ఊరటనిచ్చినట్టు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌తో ఇప్పటికే ఓటీటీ డీల్ పూర్తయింది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.60 కోట్లు కాగా, నాన్ థియేట్రికల్ బిజినెస్ రూపంలో ఆ పెట్టుబడి విడుదలకు ముందే తిరిగి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కలు నిజమైతే.. థియేటర్లలో సినిమా విడుదల కాకముందే నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్టే. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. టీజర్‌లోనే కథలోని ప్రధాన సంఘర్షణను చూపిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు దర్శకుడు పవన్ సాధినేని. ఒక అమ్మాయి తన కలను నెరవేర్చుకోవడానికి సమాజం నుంచి ఎదురయ్యే అడ్డంకులను ఎలా దాటుతుంది? ఆమె ప్రయాణంలో దుల్కర్ పాత్ర ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అనే అంశాలపై క్యూరియాసిటీ పెరిగేలా టీజర్ ఉంది. ఈ సినిమా నవంబర్ 20, 2026న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే కొంతమంది సినీ ప్రముఖులు ఈ సినిమాను చూసి ప్రశంసించినట్టుగా ప్రచారం జరుగుతోంది. అవార్డులు, రివార్డులు అందుకునే స్థాయిలో సినిమా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కూడా చదవండి: RAPO23లో రితేశ్ దేశ్‌ముఖ్.. రామ్ పోతినేని దర్శకత్వంలో జెనీలియా భర్త.!       [Aakasamlo Oka Tara Table Profit Venture, Aakasamlo Oka Tara 60 Crore Business, Aakasamlo Oka Tara OTT Deal, Aakasamlo Oka Tara Netflix, Aakasamlo Oka Tara Movie, Dulquer Salmaan, Satvika Veeravalli, Pavan Sadineni, Telugu Film News]
టైగర్ ముత్తు వేల్ పాండియన్ సెల్యులాయిడ్ వద్ద తన ప్రభంజనానికి ఒక్క సీట్ కి  కూడా రెస్ట్ ఇవ్వకుండా దూసుకుపోతున్నాడు. దీంతో నాలుగు రోజుల్లోనే రికార్డు కలెక్షన్స్ తన వశమవుతున్నాయి. ఒక రకంగా టైగర్ కా హుకుం అంటూ కలెక్షన్స్ నే దాసోహమవుతున్నాయని చెప్పవచ్చు. విడుదలైన మొదటి నాలుగు రోజుల్లోనే  ప్రపంచవ్యాప్తంగా దాదాపు 424.25 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. మొదటి రోజే ఇండియాలో  59.70 కోట్ల నెట్ కలెక్షన్లతో ఆరంభమైన ఈ చిత్రం, రెండవ రోజు 37.10 కోట్లు, మూడవ రోజు శనివారం 47.25 కోట్లను రాబట్టింది. ఆ తర్వాత ఆదివారం నాడు అనూహ్య రీతిలో ఏకంగా 18.2 శాతం వృద్ధి నమోదు చేస్తూ భారతదేశంలో  55.85 కోట్ల భారీ నెట్ కలెక్షన్‌ను దక్కించుకుంది. ఈ కలెక్షన్ల సునామీతో కేవలం నాలుగు రోజుల్లోనే ఇండియా నెట్ కలెక్షన్స్199.90 కోట్లకు చేరుకోగా, డొమెస్టిక్ గ్రాస్ వసూళ్లు 234.25 కోట్లను దాటేశాయి. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా టైగర్ ముత్తువేల్ పాండియన్ తన క్రేజ్‌  చాటుకున్నాడు. అంతర్జాతీయ మార్కెట్లో జైలర్ 2 నాలుగు రోజుల్లో సాధించిన మొత్తం ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్ ఏకంగా190 కోట్లు. కేవలం ఒక్క ఆదివారమే ఓవర్సీస్ నుంచి  40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయంటే విదేశాల్లో తమిళ రజినీ ఫీవర్  ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.  ఇది కూడా చదవండి: ఊహకందని క్రియేటివిటీ ఈ మూవీ!. డోంట్ మిస్.. ఏ ఓటిటిలో ఉందంటే!    వివిధ భాషల విషయానికి వస్తే, ఆదివారం ఒక్కరోజే తమిళ వెర్షన్ 8,173 షోల ద్వారా 39.95 కోట్ల నెట్ సాధించగా, తెలుగు వెర్షన్ 2,234 షోలలో 64.3 శాతం ఆక్యుపెన్సీతో 9.50 కోట్ల నెట్ వసూలు చేసింది. హిందీ బెల్ట్‌లో 4,902 షోల నుంచి  5.75 కోట్లు, కన్నడలో 0.65 కోట్లు రాబట్టింది. నాలుగు రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా ఏకంగా 1,30,21,526 మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాను వీక్షించడం విశేషం.   కమల్ హాసన్ ‘విక్రమ్’ సాధించిన 414.43 కోట్ల ఆల్ టైమ్ వరల్డ్ వైడ్ రికార్డును సైతం జైలర్ 2 కేవలం నాలుగు రోజుల్లోనే దాటేసి, అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమాల జాబితాలో టాప్ 7వ స్థానానికి చేరుకుంది.   [Jailer 2 collections, jailer 2 Four days collections, Rajinikanth Jailer 2 box office, Jailer 2 day 4 collections, Jailer 2 worldwide gross, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu news]
  సరైన సినిమా చూస్తే వచ్చే మజానే వేరు. పై పెచ్చు ఊహకందని, అంటే ఇలా కూడా సినిమా తీయచ్చా అంటూ అడుగడుక్కి ఉద్వేగపూరితమైన, ఉత్కంఠ కొలిపే సన్నివేశాలు వస్తుంటే ఇంకేమైనా ఉందా? నా అంత అదృష్టవంతుడు ఈ లోకంలోనే లేడనుకోవడం ప్రేక్షకుడు వంతవుతుంది. ఇప్పుడు  'బేబీ డు డై డు' మూవీ చూసిన వాళ్ళ  పరిస్థితి అదే! బాలీవుడ్ ప్రసిద్ధ నటి హుమా ఖురేషి టైటిల్ రోల్ పోషించ క్రైమ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో  'బేబీ డు డై డు' (Baby Do Die Do) తెరకెక్కింది. ఇప్పుడు ఈ మూవీ  ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సరిగ్గా మూడు నెలల క్రితం, అంటే గత జూలై 3వ తేదీన భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 7.45 కోట్ల నెట్ కలెక్షన్లను మాత్రమే రాబట్టింది. అలియా భట్ నటించిన 'అల్ఫా' సినిమాతో గట్టి పోటీ ఎదురుకావడం వల్ల ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెరవలేకపోయింది. అయినప్పటికీ, విమర్శకుల నుంచి సానుకూల సమీక్షలను దక్కించుకున్న ఈ సినిమా, సెప్టెంబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ డిజిటల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ప్రధాన పాత్రలో హ్యుమా ఖురేషి అద్భుతంగా నటించి, మెప్పించారు. ‘బేబీ డూ డై డూ’కథ ఏంటంటే... ఓ పేద కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఆడుకుంటూ ఓ పాడుబడ్డ బంగ్లాలోకి చేరుకుంటారు. ఆ ఇద్దరిలో ఒక అమ్మాయికి వినబడదు, మాట్లాడలేదు. అలా ఆ బంగళా లోపలికి వెళ్ళిన ఆ పిల్లలు ఓ ముసుగు వ్యక్తిని చూస్తారు. ఆ ముసుగు వ్యక్తి మరో వ్యక్తిని చంపుతూ ఉంటాడు.  ఇంతలో ఈ పిల్లలు చేసిన అలికిడి వల్ల వీళ్ళిద్దరినీ వెంబడిస్తాడు. ఆ సమయంలో ఇద్దరిలో అన్నీ బావున్న అమ్మాయి ఆ ముసుగు వ్యక్తికి చిక్కుతుంది. అతను ఆ అమ్మాయిని చంపేస్తాడు. మూగ, చెవుడు ఉన్న అమ్మాయి మాత్రం తప్పించుకుంటుంది. ఆ పాప పేరే బేబీ. తాను తప్పించుకునే ముందు బేబీ తన సోదరిని ఆ ముసుగు వ్యక్తి చంపడాన్ని చూసి అతని పై పగ పెంచుకుంటుంది. బేబీ పెరిగే కొద్దీ అతని మీద తన పగ కూడా పెంచుకుంటుంది. ఇది కూడా చదవండి:  ఆ దర్శకుడికి క్షమాపణలు: అందుకే కల్ట్ కి దర్శకత్వం చేశా!    పుట్టు మూగ, చెవుడు ఉన్న బేబీ పాపా అనే వ్యక్తి దగ్గర శిక్షణ తీసుకుని ఓ హిట్‌ ఉమెన్‌గా తయారవుతుంది. పాపా చెప్పిన వ్యక్తులను ప్రత్యేకంగా తయారు చేసిన గొడుగు తుపాకీ సాయంతో చంపేస్తూ ఉంటుంది. పైకి ఓ సాదా సీదా అమ్మాయిలా కనిపించే బేబీ లోపల కరడుగట్టిన హంతకురాలిలా తయారవుతుంది. మరి... ఈ జర్నీలో బేబీకి ఆ ముసుగు వ్యక్తి దొరుకుతాడా? లేదా అన్నది మాత్రం నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతున్న ‘బేబీ డూ డై డూ’లోనే చూడాలి. ఇదో మంచి థ్రిల్లర్‌. సినిమా ఆఖర్లో వచ్చే ట్విస్టులు ఊహకందనివి. ఓ మంచి టైమ్‌పాస్‌ సినిమా.   [Huma Qureshi Baby Do die do netflix, Baby Do Die Do, Huma Qureshi, Netflix streaming, action thriller movie,Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu news]
రామ్ పోతినేని హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా #RAPO23. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనగా.. తాజాగా మరో క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ ఈ సినిమాలో భాగమైనట్లు మేకర్స్ ప్రకటించారు. దసరా సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌కు సంబంధించిన స్పెషల్ వీడియోను కూడా పంచుకున్నారు. రామ్ పోతినేని కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఇప్పటివరకు నటుడిగా ప్రేక్షకులను అలరించిన రామ్.. ఈసారి దర్శకుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కథను కూడా ఆయనే సిద్ధం చేయడం విశేషం. ఈ సినిమాలో వీర అనే పాత్రలో కనిపించనున్నారు. ‘ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వోల్ఫ్’ అనే కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కుతోంది. ఇక రితేశ్ దేశ్‌ముఖ్ చేరికతో ఈ ప్రాజెక్టుపై మరింత ఆసక్తి పెరిగింది. ఆయన ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించనున్నారు? రామ్ పోతినేనితో ఆయన తలపడే సన్నివేశాలు ఉంటాయా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే రితేశ్ పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ వెల్లడించాల్సి ఉంది. హిందీ, మరాఠీ సినిమాల్లో నటించి తన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రితేశ్ దేశ్‌ముఖ్.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. రితేశ్ ఎవరో కాదు.. హాసినిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన జెనీలియా భర్త కావడం విశేషం. 2008 లో వచ్చిన 'రెడీ' సినిమాలో రామ్ సరసన జెనీలియా నటించగా.. ఇప్పుడు ఆమె భర్త రామ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.  ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తిర్రు కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా.. సామ్ సీఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు, డార్క్ విజువల్ టోన్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ ద్వారా తెలుస్తోంది. రామ్ సోదరుడు కృష్ణ పోతినేని రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇది కూడా చదవండి: 'భగవంత్ కేసరి'కి మూడేళ్లు.. బాలయ్య కెరీర్‌లో స్పెషల్ మూవీ.! https://x.com/RAPO_Cinematics/status/2112055394516566290       [Riteish Deshmukh Joins RAPO23, Ram Pothineni, RAPO23 Movie, Riteish Deshmukh, Genelia Deshmukh, Ready Movie, Genelia D'Souza, Samyuktha Menon, Telugu Film News]  
వరుస హిట్స్ తో దూసుకుపోతున్న విశ్వక్‌సేన్ అని చెప్పుకోవాల్సింది బదులు వరుస ప్లాప్స్ తో దూసుకుపోతున్న విశ్వక్ సేన్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఈ కొటేషన్ పర్ఫెక్ట్ సూటబుల్ అనేలా విశ్వక్ నే తన ప్లాప్స్ ని నిర్మొహమాటంగా ఒప్పుకుంటున్నాడు. కానీ నటుడుగా మాత్రం ఏ క్యారక్టర్ లోకైనా ఒదిగిపోయే కెపాసిటీ. 'గామి' మూవీ నే ఒక ఉదాహరణ. ఈ నెల 30 న కల్ట్ తో థియేటర్స్ లోకి రానున్నాడు. పైగా ‘కల్ట్’ కి తనే దర్శకుడు. నిన్న ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతు  తాజుద్దీన్‌ నా నట గురువు. మొదట కల్ట్ కి తాజుద్దీన్ డైరెక్ట్ చేయాల్సి ఉంది. కానీ వరుస ప్లాప్స్ లో ఉన్న నేను ఆయనపై భారం వేయదలచుకోలేదు. అందుకే నేనే దర్శకుడిగా బాధ్యతలు చేపట్టాను. ఈ విషయంలో తాజుద్దీన్‌కి  మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. ఆయన కష్టాన్ని గౌరవిస్తూనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని వెల్లడించారు.  ఇది కూడా చదవండి: అతనితో కలిసి పని చేస్తున్నందుకే కాల్పులు: ఎవరు ఈ అనిల్ పండిత్!     కల్ట్  కథాంశం విషయానికి వస్తే, ఇది పూర్తిగా వియత్నాంలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. కేవలం సాధారణ కమర్షియల్ హంగులతో కాకుండా, సరికొత్త యాక్షన్ మరియు రా సబ్జెక్ట్‌తో  తెరకెక్కించారు. అంతేకాకుండా, ఈ చిత్రంలో దాదాపు 20 మందికి పైగా సరికొత్త నూతన నటీనటులను టాలీవుడ్‌కు పరిచయం చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ట్రైలర్ అయితే సబాగుంది. 150 మంది కొత్త నటీనటులు కల్ట్ ద్వారా పరిచయం కానున్నారు. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్.   [vishwak Sen Apologises To Tajuddin, Vishwak Sen, Cult Movie, Tajuddin Director, Vishwak Sen Cult, Tollywood News, Cult Teaser Launch, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu news]  
Ram Pothineni’s directorial debut, RAPO23, has entered an interesting phase with Bollywood actor Riteish Deshmukh joining the ongoing shoot in Hyderabad. The neo-noir psychological action thriller marks Riteish’s Telugu debut and brings together two actors for a project that Ram is shaping as both its lead actor and director. The makers have unveiled a behind-the-scenes video offering a glimpse into the film’s sets and capturing a warm moment between Ram and Riteish, with the former welcoming the Bollywood actor onto the sets. The video also showcases the scale of the production design, hinting at the elaborate visual world being created for the thriller. Ram is taking a hands-on approach to the project, with the film mounted on a lavish scale under the production of Krishna Pothineni. The combination of its psychological thriller premise, neo-noir setting and Ram’s directorial debut makes RAPO23 a significant project in the actor’s career. Samyuktha plays the female lead, with several other notable actors featuring in the supporting cast. Backed by a strong technical team, the film is currently progressing with its Hyderabad schedule. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.    
నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాల్లో ‘భగవంత్ కేసరి’ కూడా ఒకటి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా.. మహిళా సాధికారత అనే అంశాన్ని కూడా బలంగా చూపించింది. బాలయ్య మాస్ యాక్షన్‌కు, ఎమోషన్స్ తోడవడంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అక్టోబర్ 19, 2023 న విడుదలైనఈ సినిమా నేటితో మూడేళ్లు పూర్తి చేసుకుంది.  ఈ సినిమాలో బాలకృష్ణ పోషించిన భగవంత్ కేసరి పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా తన సంరక్షణలో పెరిగిన విజయలక్ష్మి అలియాస్ విజ్జి (శ్రీలీల) భయాన్ని వీడి ధైర్యంగా నిలబడాలని ఆయన చెప్పే మాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘బానో బేటీ కో షేర్’ అనే నినాదంతో అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేశారు. యాక్షన్‌తో పాటు మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలనే సందేశాన్ని కూడా ఈ సినిమా ద్వారా అందించారు. ఇక శ్రీలీలకు కూడా ఈ సినిమా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచింది. అమాయకంగా కనిపించే అమ్మాయి నుంచి ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే యువతిగా ఆమె పాత్రలో వచ్చిన మార్పు కథకు కీలకంగా నిలిచింది. బాలకృష్ణ, శ్రీలీల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనిల్ రావిపూడి తనదైన కామెడీ, మాస్ యాక్షన్, ఎమోషన్స్‌ను కలిపి ఈ సినిమాను రూపొందించారు. బాక్సాఫీస్ దగ్గర కూడా ‘భగవంత్ కేసరి’ మంచి వసూళ్లను సాధించింది. ట్రేడ్ అంచనాల ప్రకారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.130 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అంతేకాదు, 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు ఫీచర్ ఫిల్మ్ అవార్డును కూడా గెలుచుకుంది. సినిమా విడుదలై మూడేళ్ల పూర్తయిన సందర్భంగా ‘భగవంత్ కేసరి’ గురించి అభిమానులు ప్రత్యేకంగా పోస్టులు పెడుతున్నారు. బాలయ్య పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, శ్రీలీల నటన, సినిమాలోని సందేశాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కావాలని కొందరు అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మాస్ సినిమాల్లోనూ బలమైన సందేశాన్ని చెప్పొచ్చని నిరూపించిన ‘భగవంత్ కేసరి’.. బాలయ్య అభిమానులకు మాత్రమే కాకుండా, మహిళా సాధికారతను ప్రోత్సహించే సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు కూడా గుర్తుండిపోయే చిత్రంగా నిలిచింది. https://x.com/Shine_Screens/status/2112049334921670823       [3 Years For Bhagavanth Kesari, 3 Years Of Bhagavanth Kesari, Bhagavanth Kesari 3 Years, Bhagavanth Kesari, Nandamuri Balakrishna, Sreeleela, Anil Ravipudi, Telugu Film News]  
ముంబైలోని జుహు ప్రాంతంలో బాలీవుడ్ హీరో టైగర్‌ ష్రాఫ్‌ ని లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఊహించని పరిణామంతో  బాలీవుడ్ వర్గాల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ దురాఘాతానికి తామే బాధ్యులమంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అనిల్ పండిత్ ముందుకు రావడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి భద్రతా సంస్థలకు చేరిన ఒక ఆడియో క్లిప్ ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ అరాచకానికి తెరలేపిన అనిల్ పండిత్ ఎవరు, అతని నేపథ్యం ఏమిటనే దానిపై ముంబై పోలీసులు మరియు ఇంటెలిజెన్స్ వర్గాలు తీవ్రంగా ఆరా తీస్తున్నాయి. అనిల్ పండిత్ గతంలో భారతదేశం నుంచి వెళ్ళిపోయే వరకు ఎలాంటి క్రిమినల్ కేసులు లేని సాధారణ వ్యక్తిగా ఉండేవాడని నిఘా వర్గాలు వెల్లడించాయి. అయితే, కాలక్రమేణా గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో సంబంధాలు ఏర్పరచుకున్నాక అతని జీవితం పూర్తిగా మారిపోయింది. దాదాపు ఎనిమిది నెలల క్రితం రణ్‌దీప్ మాలిక్ అనే మరో గ్యాంగ్ సభ్యుడి స్థానంలో అనిల్ పండిత్ ఈ జాబితాలోకి ప్రవేశించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ తర్వాత అతనిపై వరుసగా పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అమెరికా నుంచి ఆపరేట్ చేస్తున్న హరీశ్ చంద్ర జాట్ అలియాస్ హారీ బాక్సర్ అనే హ్యాండ్లర్ కింద అనిల్ పండిత్ పనిచేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ హారీ బాక్సర్‌పై ఇప్పటికే రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో దోపిడీలు, బలవంతపు వసూళ్లు, హత్యాయత్నాలకు సంబంధించి అనేక కేసులు నమోదై ఉన్నాయి. టైగర్‌ ష్రాఫ్‌పై జరిగిన ఈ దాడి కేవలం ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నది కాదని, బాలీవుడ్ పరిశ్రమ మొత్తం హెచ్చరికలను జారీ చేయడమేనని ఆడియో క్లిప్ ద్వారా స్పష్టమైంది. తాము చెప్పిన మాట వినకుండా సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేస్తున్నందువల్లనే టైగర్‌ ష్రాఫ్‌ను టార్గెట్ చేసినట్లు అనిల్ పండిత్ ఆ ఆడియోలో పేర్కొన్నాడు. "ఇది మా మొదటి మరియు చివరి హెచ్చరిక" అంటూ ఆయన బాలీవుడ్ నటులను, సల్మాన్ ఖాన్‌తో సంబంధం ఉన్న ఎవరినైనా సరే వదిలిపెట్టబోమని బహిరంగంగానే బెదిరింపులకు దిగాడు. ఈ ఘటనలో టైగర్‌ ష్రాఫ్ ప్రాణాలతో బయటపడినప్పటికీ, ఆయన కారుపై ముగ్గురు దుండగులు జరిపిన మూడు రౌండ్ల కాల్పులు ముంబైలో శాంతిభద్రతల పరిస్థితిపై పెద్ద ప్రశ్నార్థకాన్ని లేవనెత్తాయి. ఇది కూడా చదవండి: కేంద్రమంత్రితో రాఘవేంద్రరావు సినిమా: ఆసక్తికర సబ్జెక్ట్!     ఈ ఉదంతంపై అటు మహారాష్ట్ర ప్రభుత్వం, ఇటు ముంబై పోలీసులు అత్యంత సీరియస్‌గా స్పందించారు. నటుడు సల్మాన్ ఖాన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు రావడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. గతంలోనూ పంజాబీ గాయకుడు గురు రంధావాల జిమ్‌పై,  దర్శకుడు రోహిత్ శెట్టి నివాసం వెలుపుల జరిగిన కాల్పుల ఘటనలతో ఈ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు అదే కోవలో టైగర్‌ ష్రాఫ్ కారుపై కాల్పులు జరగడం, అనిల్ పండిత్ తెరపైకి రావడం సినీ పరిశ్రమబి  తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కేసులో తదుపరి విచారణ వేగవంతం చేసిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలని  మరింత ముమ్మరం చేశారు.   [Anil Pandit About Tiger shroff, Tiger Shroff firing, Who is Anil Pandit, Lawrence Bishnoi gang, Salman Khan threat, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu news]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
పండుగల రోజు ఇంటిల్లిపాదికీ నచ్చే, సులభంగా తయారుచేసుకోగలిగే ప్రసాదాలలో పెసరపప్పు అటుకుల పాయసం ఎంతో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. ముఖ్యంగా కృష్ణాష్టమి, ఉగాది, నవరాత్రులు వంటి పవిత్రమైన పర్వదినాలలో అమ్మవారికి లేదా దేవునికి నైవేద్యంగా దీనిని అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పిస్తుంటారు. ఈ సాంప్రదాయ వంటకం కేవలం పూజా కార్యక్రమాలకే పరిమితం కాకుండా, ఇంట్లో ఏ చిన్న వేడుక జరిగినా నోరూరించే తియ్యటి వంటకంగా అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఒక్కసారి ఈ అద్భుతమైన రుచి చూస్తే చాలు, ప్రతి పండగకూ ఇదే పాయసం వండాలని ఇష్టపడతారు. దీని తయారీలో వాడే ప్రతి పదార్ధం, కొలతలు ఈ పాయసానికి అద్భుతమైన రుచిని, సువాసనను తెచ్చిపెడతాయి. ఈ కమ్మని పాయసం తయారీకి కావలసిన పదార్థాలను పరిశీలిస్తే: అర కప్పు పెసరపప్పు, ఒక కప్పు అటుకులు, ఒకటింపావు కప్పు బెల్లం (తీపి తక్కువగా కావాలనుకునేవారు ఒక కప్పు వాడుకోవచ్చు), పెసరపప్పు నానబెట్టడానికి రెండు కప్పుల నీళ్లు, బెల్లం కరిగించడానికి పావు కప్పు నీళ్లు, మూడు కప్పుల పాలు, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, అర టీస్పూన్ యాలకుల పొడి, తగినన్ని పచ్చి లేదా ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే రుచిని పెంచడానికి తగినంత జీడిపప్పు, బాదం పప్పు అవసరమవుతాయి. తయారీ విధానం చాలా సులభం. ముందుగా ఒక వెడల్పాటి పాన్‌లో అర కప్పు పెసరపప్పును లో నుంచి మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ కమ్మటి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. పెసరపప్పు రంగు కొద్దిగా మారిన తర్వాత స్టవ్ ఆపి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పప్పును రెండుసార్లు శుభ్రంగా కడిగి, రెండు కప్పుల నీళ్లు పోసి 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. పప్పు ఎంత బాగా నానితే అంత త్వరగా, మృదువుగా ఉడుకుతుంది. పప్పు నానే లోపు, బెల్లం సిరప్ సిద్ధం చేసుకోవాలి. ఒక గిన్నెలో ఒకటింపావు కప్పు బెల్లం వేసి, పావు కప్పు నీళ్లు పోసి కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగి, ఒక పొంగు రాగానే స్టవ్ ఆపి, వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి; వేడిగా ఉన్నప్పుడు ఫిల్టర్ చేస్తే సిరప్ చిక్కబడకుండా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు అదే పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, ఒక కప్పు అటుకులు వేసి లో నుంచి మీడియం ఫ్లేమ్‌లో క్రిస్పీగా, కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. అటుకులు వేగిన తర్వాత కొద్దిగా పొంగినట్లుగా కనిపిస్తాయి. వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో నానబెట్టిన పెసరపప్పును వేసి, ఒక టీస్పూన్ నెయ్యి కూడా కలిపి మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. పప్పు మరీ పేస్ట్ లాగా కాకుండా, కొద్దిగా పలుకులుగా మెత్తబడేంత వరకు ఉడికించాలి. ఇలా చేయడం వల్ల పాయసం తినేటప్పుడు పప్పు తగులుతూ ఎంతో రుచికరంగా ఉంటుంది. పప్పు ఉడికే లోపు, మరొక గిన్నెలో మూడు కప్పుల పాలు పోసి ఒక పొంగు వచ్చే వరకు కాచి, మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఉడికించిన పెసరపప్పులో వేయించిన అటుకులు వేసి బాగా కలుపుకోవాలి. మంటను సిమ్‌లో ఉంచి, కాచి పెట్టుకున్న పాలను కూడా పోసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అటుకులు కొద్దిగా మెత్తబడేంత వరకు ఉడికించడం ముఖ్యం. ఈ పాయసం ఉడికేటప్పుడు కొంచెం పల్చగా అనిపించినా, చల్లారాక గట్టిపడుతుంది కాబట్టి కొద్దిగా పల్చగానే దించుకోవడం మంచిది. అటుకులు సరిగ్గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే యాలకుల పొడి, పూర్తిగా చల్లారిన బెల్లం సిరప్‌ను పాయసంలో వేసి బాగా కలుపుకోవాలి. బెల్లం సిరప్ కలిపిన తర్వాత, తిరిగి స్టవ్ ఆన్ చేసి మరో రెండు నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించాలి. చివరగా, చిన్న పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదం పప్పు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఈ వేయించిన డ్రై ఫ్రూట్స్‌ను పాయసంలో వేసి బాగా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, నోరూరించే కమ్మని పెసరపప్పు అటుకుల పాయసం ప్రసాదం సిద్ధం!       Atukulu Pesara Pappu Payasam, poha moong dal payasam, festive special naivedyam recipes, Andhra style payasam recipe, poha moong dal kheer, festival sweet recipes, traditional payasam recipe.
ఆంధ్రప్రదేశ్‌ రుచుల్లో గోంగూర పచ్చడికి ఉండే క్రేజే వేరు. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని అచ్చమైన ఆంధ్రా స్టైల్ గోంగూర పచ్చడితో కలిపి తింటే ఆ రుచి అమృతంలా ఉంటుంది. ముఖ్యంగా అమ్మమ్మ కాలం నాటి పద్ధతిలో తయారు చేసే ఈ పులిహోర గోంగూర పచ్చడిని ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మూడు గోంగూర కట్టలను తీసుకుని శుభ్రంగా ఆకులు వలిచి, నీళ్లతో ఒకటి రెండు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి అయ్యాక, కారం రుచికి తగినట్లుగా 15 నుంచి 20 ఎండుమిర్చిని లో ఫ్లేమ్‌లో మాడిపోకుండా వేయించుకోవాలి. కారం ఎక్కువ కావాలనుకునేవారు 20 వరకు, తక్కువ కావాలనుకునేవారు 15 ఎండుమిర్చిని వేసుకోవచ్చు. వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో పావు టీస్పూన్లో సగం మెంతులు వేసి వేయించాలి. మెంతులు వేగిన తర్వాత రెండు టీస్పూన్ల మినపగుళ్ళు, రెండు టీస్పూన్ల ధనియాలు, ఒక టీస్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్‌లో ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి చక్కగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్‌లో మరొక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడెక్కిన తర్వాత, మూడు మధ్యస్థాయి టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటాలను ఒకసారి కలిపి మూత పెట్టి, మధ్యమధ్యలో కలుపుతూ మెత్తగా ఉడికించుకోవాలి. టమాటోలు బాగా ఉడికిన తర్వాత, ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మూడు గోంగూర కట్టల ఆకులను వేయాలి. గోంగూర ఆకులు టమాటోలో బాగా కలిసేలా కలుపుతూ, గోంగూర పూర్తిగా మెత్తబడేంత వరకు ఉడికించాలి. గోంగూర మెత్తబడిన తర్వాత, చిన్న ఉసిరికాయ అంత చింతపండు, పావు టీస్పూన్ పసుపు వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మూతపెట్టి లో ఫ్లేమ్‌లో మధ్యమధ్యలో కలుపుతూ గోంగూర పచ్చిదనం పోయి, నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. గోంగూర మిశ్రమం చల్లారే లోపు పచ్చడికి కావలసిన తాలింపు సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి అయ్యాక, పావు టీస్పూన్ ఆవాలు, పావు టీస్పూన్ జీలకర్ర, ఒక టీస్పూన్ మినపగుళ్ళు, ఒక టీస్పూన్ పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత, ఐదు వెల్లుల్లి రెబ్బలను దంచి వేయాలి. అలాగే రెండు ఎండుమిర్చిని తుంచి, కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, చిటికెడు ఇంగువ వేసి ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో పూర్తిగా చల్లారిన వేయించిన ఎండుమిర్చి వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వేయించిన ధనియాలు, మినపగుళ్ళు, జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు వేసి మళ్ళీ కొంచెం బరకగా గ్రైండ్ చేయాలి. దీనిలో 10 వెల్లుల్లి రెబ్బలు వేసి రుబ్బుకోవాలి. ఆ తర్వాత చల్లారిన గోంగూర టమాటో మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేయించిన కారపొడితో బాగా కలిసేలా కలపాలి. కారం ఎక్కువ అవుతుందేమో అనిపిస్తే, ఈ దశలో కారపొడిలో కొంత తీసి పక్కన పెట్టుకోవచ్చు. మిక్సీలో రెండు మూడు సార్లు పల్స్ ఇస్తే సరిపోతుంది. మరీ మెత్తగా కాకుండా, కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఇలా రోట్లో రుబ్బినట్లు కచ్చాపచ్చాగా రుబ్బడం వల్ల అచ్చమైన పాతకాలపు రుచి వస్తుంది. చివరగా తయారుచేసుకున్న పచ్చడిని రెడీగా ఉన్న తాలింపులోకి వేసుకోవాలి. ఇందులో ఒక గుప్పెడు పెద్ద ముక్కలుగా తరిగిన పచ్చి ఉల్లిపాయలను విడివిడిగా వేసుకోవాలి. ఈ పచ్చి ఉల్లిపాయలు పచ్చడికి అద్భుతమైన మరింత రుచిని ఇస్తాయి. ఉల్లిపాయలు, తాలింపు పచ్చడిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒకసారి ఉప్పు సరి చూసుకుంటే చాలు, కమ్మ కమ్మని అమ్మమ్మ కాలం నాటి పులిహోర గోంగూర పచ్చడి సిద్ధం!     Pulihora Gongura Pachadi, traditional Gongura pickle, Andhra style Gongura Pachadi recipe, authentic Andhra Gongura Chutney, grandmother style Gongura recipe, spicy sorrel leaves chutney.
నేటి ఆధునిక జీవనశైలిలో శరీర బరువును అదుపులో ఉంచుకోవడం, ముఖ్యంగా మొండినైన పొట్ట కొవ్వును కరిగించుకోవడం చాలా మందికి ఒక పెద్ద సవాలుగా మారింది. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో జీవక్రియ మందగించడం వల్ల కేలరీలు సులభంగా కరగవు. దీనికోసం సాధారణ పాలు కలిపిన టీ లేదా కాఫీకి బదులుగా బ్లాక్ కాఫీ తాగడం బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ కాఫీలో ఉండే కెఫిన్, పాలిఫెనాల్స్ వంటి ముఖ్యమైన పోషకాలు శరీర మెటబాలిజాన్ని వేగవంతం చేసి నిల్వ ఉన్న కొవ్వును సమర్థవంతంగా కరిగించడంలో సహాయపడతాయి. అయితే ఈ సాధారణ బ్లాక్ కాఫీకి కేవలం చిటికెడు జాజికాయ పొడిని జత చేసుకుంటే, బరువు తగ్గే ప్రక్రియ ఊహించని విధంగా మరింత వేగవంతం అవుతుంది. ఈ శక్తివంతమైన కాంబినేషన్ కేవలం బరువు తగ్గించడమే కాకుండా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జాజికాయ పొడిలో శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, ముఖ్యంగా మాంగనీస్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీరంలో నిల్వ ఉండే కొవ్వులను కరిగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ పొడిని బ్లాక్ కాఫీలో పావు చెంచా లేదా కేవలం రెండు చిటికెల మోతాదులో కలుపుకుని సేవించడం ద్వారా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా జాజికాయ పొడి ఆకలిని అదుపులో ఉంచుతుంది. దీన్ని పగటిపూట బ్లాక్ కాఫీతో తీసుకున్నప్పుడు, కాఫీ తాగిన వెంటనే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల రెండు ప్రధాన భోజనాల మధ్యలో అనవసరమైన జంక్ ఫుడ్స్, అధిక కేలరీల ఆహారాన్ని లేదా స్నాక్స్ తీసుకోవాలనే కోరిక పూర్తిగా అణచివేయబడుతుంది. అంతేకాకుండా, ఈ అద్భుతమైన పానీయం శరీరాన్ని లోపలి నుంచి డిటాక్స్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. బ్లాక్ కాఫీలో జాజికాయ పొడిని కలుపుకుని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన హానికరమైన వ్యర్థాలు, విష పదార్థాలు పూర్తిగా బయటకు వెళ్లిపోతాయి. ఇది అజీర్ణం, వికారం వంటి జీర్ణ సంబంధిత సమస్యలను తొలగించి, జీర్ణ మార్గం సజావుగా సాగేలా చేస్తుంది. జీవక్రియ మెరుగైతేనే శరీరంలో కొవ్వు త్వరగా కరుగుతుంది. రోజుకు 1 లేదా 2 కప్పుల మోతాదులో దీన్ని సేవించడం వల్ల పొట్ట దగ్గర ఉన్న కొవ్వు క్రమంగా కరిగి బరువు నియంత్రణలోకి వస్తుంది. సాధారణంగా నిద్రలేమి సమస్య ఉన్నవారు బ్లాక్ కాఫీ తాగితే రాత్రిపూట నిద్ర కరువవుతుందని భయపడుతుంటారు. కానీ జాజికాయ పొడి కలిపిన బ్లాక్ కాఫీ నాడీ వ్యవస్థను శాంతపరచి మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. దీనివల్ల రాత్రిపూట ప్రశాంతమైన, గాఢమైన నిద్ర పడుతుంది. శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి సరైన నిద్ర అత్యంత అవసరం. ఈ విధంగా మెటబాలిజాన్ని పెంచడం, ఆకలిని నియంత్రించడం, శరీరాన్ని డిటాక్స్ చేయడం మరియు నిద్రలేమి సమస్యను దూరం చేయడం ద్వారా ఈ శక్తివంతమైన కలయిక ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడానికి అద్భుతంగా సహకరిస్తుంది.     black coffee weight loss hack, cinnamon black coffee weight loss, weight loss coffee powder, burn belly fat with black coffee, fat burning black coffee recipe, coffee secret ingredient weight loss.  
షుగర్ వ్యాధి ఉన్నవారిలో కిడ్నీ సమస్యలు ఎందుకు వచ్చే అవకాశం ఉంది? రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోతే మూత్రపిండాల పనితీరుపై ఎలాంటి ప్రభావం పడుతుంది? కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలను తెలుసుకోవడం ప్రతి డయాబెటిస్ పేషెంట్‌కు ఎంతో ముఖ్యం. ఈ TeluguOne Health వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ షుగర్ వ్యాధి, కిడ్నీల ఆరోగ్యం, సంప్రదాయ వైద్య విధానాల్లో ఉపయోగించే ఔషధ మొక్కల గురించి వివరిస్తారు. ముఖ్యంగా తెల్ల గలిజేరు అని పిలిచే పునర్నవ మొక్క, పల్లేరు గింజలు, పండ్ల సంప్రదాయ ఉపయోగాల గురించి తెలుసుకోవచ్చు. ఈ మూలికలను సంప్రదాయ వైద్యంలో ఎలా పరిగణిస్తారు, వాటిని ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అవసరమో తెలుసుకోవచ్చు. డయాబెటిస్ వల్ల కిడ్నీలపై ఎలాంటి ప్రభావం పడవచ్చు? షుగర్ పేషెంట్లు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? పునర్నవ (తెల్ల గలిజేరు) మొక్కకు సంప్రదాయ వైద్యంలో ఉన్న ప్రాధాన్యత ఏమిటి? పల్లేరు గింజలు, పండ్లను సంప్రదాయ వైద్య విధానాల్లో ఎలా ఉపయోగిస్తారు? మూలికలతో తయారుచేసే ఔషధాలను వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కిడ్నీ సమస్యలను ముందుగానే గుర్తించడానికి వైద్య పరీక్షలు ఎందుకు ముఖ్యం? వంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు కిడ్నీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం, వైద్యుల సూచనల ప్రకారం మందులు వాడటం, అవసరమైన కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. కిడ్నీ సమస్యలు ప్రారంభ దశలో ఉన్నప్పుడు స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అందువల్ల క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. షుగర్ వ్యాధి ఉన్నవారు తమ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పునర్నవ మరియు పల్లేరు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ వివరణతో కూడిన ఈ TeluguOne Health వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మూలికలు కిడ్నీ వ్యాధులను నయం చేస్తాయని నిర్ధారిత ఆధారాలు లేవు. వైద్యుల సూచన లేకుండా షుగర్ మందులను ఆపకండి లేదా మూలికలను వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించకండి.
ఆరోగ్యంగా ఉండాలని చాలామంది విటమిన్ సప్లిమెంట్లు, ఇతర మందులు వాడుతుంటారు. అయితే ఏ మందును ఎంత మోతాదులో తీసుకోవాలి? ఎన్ని రోజులు వాడాలి? ఇతర మందులతో కలిపి తీసుకోవచ్చా? అనే విషయాలు తెలుసుకోకుండా మందులు వాడితే అనవసరమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా Vitamin D, Vitamin B12 వంటి సప్లిమెంట్లను వైద్యుల సూచనల మేరకు తీసుకోవడం ఎంతో ముఖ్యం. మందులు వాడేటప్పుడు చేసే చిన్న పొరపాట్లు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. వైద్యులకు తమ ఆరోగ్య సమస్యలను పూర్తిగా చెప్పకపోవడం, వాడుతున్న మందుల వివరాలను తెలియజేయకపోవడం, సొంతంగా మందుల మోతాదును మార్చుకోవడం వంటి అలవాట్లు చికిత్సకు ఆటంకం కలిగించవచ్చు. ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం (World Patient Safety Day) సందర్భంగా, రోగుల భద్రతకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను హోమియోపతి వైద్యులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఈ వీడియోలో వివరించారు. Vitamin D, B12 సప్లిమెంట్లు వాడేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? Vitamin D శరీరంలో కాల్షియం శోషణకు, ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనది. Vitamin B12 నరాల పనితీరుకు, ఎర్ర రక్తకణాల తయారీకి అవసరం. ఈ విటమిన్ల లోపం ఉన్నప్పుడు వైద్యులు తగిన పరీక్షలు చేసి, అవసరాన్ని బట్టి సప్లిమెంట్లను సూచించవచ్చు. అయితే ఈ మందులను ఎక్కువ మోతాదులో తీసుకుంటే త్వరగా ఆరోగ్యం మెరుగుపడుతుందని భావించడం సరైంది కాదు. ముఖ్యంగా Vitamin D అధిక మోతాదులో తీసుకోవడం వల్ల రక్తంలో కాల్షియం స్థాయులు పెరిగి ఆరోగ్య సమస్యలు రావచ్చు. అందువల్ల వైద్యుల సలహా లేకుండా మోతాదును పెంచడం లేదా ఎక్కువకాలం కొనసాగించడం చేయకూడదు. వైద్యులకు మీ ఆరోగ్య సమస్యలను ఎందుకు పూర్తిగా చెప్పాలి? కొంతమంది తమకు ఉన్న లక్షణాలను, గతంలో ఎదురైన ఆరోగ్య సమస్యలను లేదా ప్రస్తుతం వాడుతున్న మందులను వైద్యులకు పూర్తిగా తెలియజేయరు. మరికొందరు ఇతరుల సలహాతో మందులు వాడుతుంటారు. ఇలాంటి వివరాలు దాచడం వల్ల సరైన చికిత్స నిర్ణయించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీకు ఉన్న లక్షణాలు, అలర్జీలు, ఇప్పటికే వాడుతున్న మందులు, విటమిన్ సప్లిమెంట్లు, గతంలో తీసుకున్న చికిత్సల గురించి వైద్యులకు స్పష్టంగా చెప్పాలి. ఈ సమాచారం సరైన చికిత్స అందించడానికి, మందుల మధ్య అవాంఛిత ప్రతిచర్యల ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మందుల మోతాదులో చేసే పొరపాట్లు ఎంత ప్రమాదకరం? వైద్యులు సూచించిన మోతాదు కంటే ఎక్కువగా లేదా తక్కువగా మందులు తీసుకోవడం, సమయానికి తీసుకోకపోవడం, ఒకరి మందులను మరొకరు వాడటం వంటి పొరపాట్లను నివారించాలి. మందుల పేర్లు, మోతాదు, తీసుకోవాల్సిన సమయం, వాడే కాలం గురించి స్పష్టత లేకపోతే వైద్యుడిని లేదా ఫార్మసిస్ట్‌ను అడిగి తెలుసుకోవాలి. మందుల వల్ల ఏవైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. వైద్యుల సలహా లేకుండా సూచించిన చికిత్సను నిలిపివేయడం లేదా మోతాదును మార్చడం కూడా సరికాదు. రోగుల భద్రతలో మన బాధ్యత ఏమిటి? రోగుల భద్రత అనేది వైద్యుల బాధ్యత మాత్రమే కాదు. రోగులు కూడా తమ ఆరోగ్యం గురించి అవగాహన కలిగి ఉండాలి. మందుల వివరాలను సరిచూసుకోవడం, వైద్యులు సూచించిన విధంగా వాడటం, సందేహాలు ఉంటే అడగడం, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం వంటి అలవాట్లు చికిత్సను మరింత సురక్షితంగా మార్చడంలో సహాయపడతాయి. ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ కుమార్ అందించే ఈ వీడియోలో Vitamin D, Vitamin B12 మందుల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్యులకు ఆరోగ్య వివరాలను చెప్పడం ఎందుకు అవసరం, మందుల మోతాదులో పొరపాట్లను ఎలా నివారించాలి, సురక్షితమైన చికిత్స కోసం రోగులు పాటించాల్సిన పద్ధతులు వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి. గమనిక: ఈ సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా మందులు, విటమిన్ సప్లిమెంట్లు వాడేందుకు వైద్యులను సంప్రదించండి. వైద్యుల సూచన లేకుండా మందుల మోతాదును మార్చవద్దు.
  శరీర సౌందర్యాన్ని కాపాడుకోవడానికి , చిన్నచిన్న అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి మన పెద్దలు ఎన్నో రకాల గృహ వైద్యాలను సూచించారు. అలాంటి వాటిలో నాభిలో నూనె వేసుకోవడం అనేది చాలా కాలంగా వస్తున్న ఒక సాంప్రదాయ పద్ధతి. ముఖ్యంగా శీతాకాలం లేదా మారుతున్న కాలానికి తగినట్లుగా చర్మం పొడిబారడం, పెదవులు పగిలిపోవడం వంటి సమస్యలు సర్వసాధారణం. ఈ నేపథ్యంలో రాత్రి పడుకునే ముందు నాభిలో కొన్ని చుక్కల ఆవనూనె రాసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, దాని వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటో  వివరంగా తెలుసుకుంటే.. చర్మానికి తేమను అందిస్తుంది.. సాంప్రదాయం వైద్యంలో, ఇంటి చిట్కాలలోనూ, రోజువారీ అలవాట్ల లోనూ నాభికి నూనె రాయడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతారు. ఆవనూనెలో సహజ సిద్ధమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి అవసరమైన తేమను అందించడంలో సహాయపడతాయి. రాత్రి సమయంలో నిద్రపోయే ముందు బొడ్డు ప్రాంతంలో ఆవనూనెను రాసుకోవడం ద్వారా చర్మం లోపలి నుండి పోషణ పొందుతుంది. ఆయుర్వేదంలో శరీరానికి నూనెతో మర్దన చేయడం ఆరోగ్యానికి మంచిదని చెబుతారు.  పొడి చర్మానికి రక్షణ.. మారుతున్న వాతావరణం కారణంగా చాలా మందిలో చర్మం తేమను కోల్పోయి పొడిబారుతుంది. దీనివల్ల చర్మంపై పీచు వలె గరుకుగా మారడం, లాగడం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమయంలో ఆవనూనెలో ఉండే కొవ్వు పదార్థాలు చర్మం పైపొరను మృదువుగా మార్చడానికి సహాయపడతాయి. కేవలం నాభి చుట్టూ మాత్రమే కాకుండా, ఈ నూనె రాయడం వల్ల శరీరంలోని ఇతర భాగాల చర్మానికి కూడా మంచి అనుభూతి కలుగుతుంది. అయితే తీవ్రమైన పొడి చర్మం ఉన్నవారు నేరుగా మంచి మాయిశ్చరైజర్లను ఉపయోగించడం మరింత వేగంగా ఫలితాన్ని ఇస్తుంది. పగిలిన పెదాలను రిపేర్ చేస్తుంది.. చలికాలం లేదా ఎండ తీవ్రత కారణంగా పెదవులు పగిలిపోవడం చాలా మందిలో కనిపిస్తుంది. పెదవులు పగిలి రక్తం రావడం లేదా ఇబ్బందిగా అనిపించడం జరుగుతుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు నాభిలో రెండు లేదా మూడు చుక్కల ఆవనూనె వేసి సున్నితంగా మర్దన చేయడం వల్ల పెదవులు పొడిబారకుండా మృదువుగా మారుతాయని చెబుతారు. అయితే దీనితో పాటు పెదవుల సంరక్షణ కోసం సాధారణ లిప్ బామ్ లేదా పెట్రోలియం జెల్లీని ఉపయోగించడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. జీర్ణవ్యవస్థ కు మంచిది.. జీర్ణవ్యవస్థ విషయానికి వస్తే, కడుపులో తేలికపాటి అసౌకర్యం లేదా నొప్పిగా ఉన్నప్పుడు పొట్ట భాగంలో గోరువెచ్చని నూనెతో మర్దన చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఆవనూనె వంటి వాటితో మసాజ్ చేయడం వల్ల ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల కండరాలు రిలాక్స్ అవ్వడానికి సహాయపడుతుంది.  మహిళల నెలసరిలో.. ముఖ్యంగా మహిళలకు నెలసరి సమయాల్లో పొత్తికడుపులో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి ఈ పద్ధతి కొంత వరకు మానసిక ప్రశాంతతను , మంచి నిద్రను ఇస్తుంది. ఎలా ఉపయోగించాలి? ఆవనూనెను నాభిలో ఎలా ఉపయోగించాలనే సరైన పద్ధతిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. రాత్రి పడుకునే ముందు నాభి ప్రాంతాన్ని శుభ్రంగా కడిగి పొడిగా ఉంచుకోవాలి. ఆ తర్వాత రెండు నుంచి మూడు చుక్కల ఆవనూనెను తీసుకుని, నాభిలో , దాని చుట్టూ ఉన్న చర్మంపై సున్నితంగా రాయాలి. దీనిని చాలా గట్టిగా రుద్దాల్సిన అవసరం లేదు అలాగే అతిగా నూనె పోయాల్సిన పని కూడా లేదు.  కొద్దిపాటి నూనెతో సున్నితంగా మర్దన చేస్తే సరిపోతుంది. అయితే ఈ పద్ధతి అందరికీ ఒకేలా సరిపోతుంది అని చెప్పలేము. సున్నితమైన చర్మం ఉన్నవారికి లేదా ఆవనూనె పడని వారికి దీనివల్ల చికాకు, ఎరుపుదనం, దురద లేదా అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ నూనె రాసిన తర్వాత ఏమైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే  కడిగివేయాలి. ఎలాంటి సమస్యలు లేనివారు ఈ చిట్కాను పాటిస్తూ చర్మాన్ని సంరక్షించుకోవచ్చు.                  *రూపశ్రీ.