ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.  మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై  విమర్శలు  గుప్పించారు. ఇక తాను పదవీ విరమణ తర్వాత కూడా ప్రజాజీవితంలో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోవడం, ఆయన పాలనలో చోటుచేసుకున్నట్లు తాను భావిస్తున్న తప్పులను చట్టపరంగా ప్రశ్నించడం తన లక్ష్యాలన్నారు.  రిటైర్మెంట్ తర్వాత తనకు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిందనీ, అయితే తనకు పదవులపై కించిత్ కూడా ఆసక్తి లేదని చెప్పారు.  తనకు పని ఇవ్వమనీ, నిర్దుష్ట బాధ్యత అప్పగించాలనీ తాను చంద్రబాబును కోరినట్లు చెప్పారు. జగన్ రాజకీయాలకు వ్యతిరేకంగా పని చేయడానికి అవకాశం కల్పించాలని చంద్రబాబును తాను కోరాననీ, అయితే ఆయన తనకు ఎటువంటి  పనీ అప్పగించలేదని స్పష్టం చేశారు.  జగన్ హయాంలో జరిగినట్లు తాను ఆరోపిస్తున్న అవకతవకలు, తప్పిదాలను చట్టపరంగా ప్రశ్నించే పని అప్పగించాలని చంద్రబాబును కోరాననీ, అయితే ఆయన పట్టించుకోలేదని వివరించారు.   ప్రభుత్వం నుంచి తాను ఆశించిన బాధ్యత రాకపోవడంతో బయట ఉండి తనకు సాధ్యమైన మార్గాల్లో అదే అంశాలపై పోరాడుతున్నానన్నారు. ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అయితే తన ఎంట్రీ పట్ల తెలుగుదేశం అధినాయత్వం పెద్దగా ఆసక్తి చూపలేదని పేర్కొన్నారు.   [AP Inteligence, Former Chief,  AB Venkateswara Rao, CBN, Jagan, Appolitics,  Former IPS, Telugu One]
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం అనూహ్య నిర్ణయం తీసుకుని  సొంత పార్టీకి చెందిన కేంద్ర మంత్రులకు షాక్ ఇచ్చింది.  ముఖ్యంగా యూపీలో ఒక్కరంటే ఒక్క సట్టింగ్ రాజ్యసభ సభ్యుడికి కూడా టికెట్ ఇవ్వలేదు. పదవీకాలం ముగియనున్న కేంద్ర మంత్రులతో  ఏ ఒక్క సిట్టింగ్ ఎంపీకి కూడా తిరిగి అవకాశం కల్పించకుండా, ఎనిమిది మంది కొత్త ముఖాలను బరిలోకి దింపుతున్నట్లు   ప్రకటించింది. యూపీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం  సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని అధిష్ఠానం తీసుకున్న ఈ నిర్ణయం యూపీ  రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కేంద్ర కేబినెట్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఇద్దరు సీనియర్ మంత్రులకు కూడా రాజ్యసభ టికెట్ నిరాకరించడం సంచలనంా మారింది. యూపీ నుంచి ఖాళీ అవుతున్న పది రాజ్యసభ స్థానాలకు అక్టోబర్ 16న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్ర అసెంబ్లీలోని సంఖ్యాబలం ప్రకారం అధికార బీజేపీ సులభంగా ఎనిమిది స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉండగా, మిగిలిన రెండు స్థానాలను ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ గెలుచుకునే  అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ తన ఎనిమిది మంది అభ్యర్థులతో కూడిన జాబితాను  విడుదల చేసింది. ఈ జాబితాలో హర్దీప్ సింగ్ పురి, బీఎల్ వర్మ వంటి కేంద్ర మంత్రులకు చోటు దక్కలేదు. వీరు ఇద్దరూ గతంలో యూపీ కోటాలోనే రాజ్యసభ సభ్యులుగా సేవలందించినప్పటికీ, ఈసారి వారికి పార్టీ అధిష్టానం మొండిచేయి చూపింది. పార్టీ విడుదల చేసిన కొత్త జాబితాలో ధర్మపాల్ సింగ్, రాధాకాంత్ ఓఝా, ప్రకాశ్ పాల్, విద్యాసాగర్ సోన్‌కర్, గోపీ కృష్ణ పాండే, ప్రియాంక సింగ్ రావత్, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, శ్రుతి గంగ్వార్‌లను అభ్యర్థులుగా ఖరారు చేశారు. 2027లో జరగనున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని,   వ్యూహాత్మకంగా అభ్యర్థుల ఎంపిక ఉ:దని స్పష్టమవుతోంది. సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిరంతరం శ్రమించే సంస్థాగత కార్యకర్తలకు గుర్తింపునిచ్చేలా ఈ జాబితాను రూపొందించినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో వివిధ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించారు. ఇందులో ముగ్గురు ఓబీసీ వర్గాలకు చెందిన వారు, ఇద్దరు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ), మరో ముగ్గురు అగ్రవర్ణాలకు చెందిన నాయకులు ఉన్నారు. అంతేకాకుండా, సామాజిక సమతుల్యతను పాటిస్తూ ఇద్దరు మహిళా అభ్యర్థులకు కూడా  స్థానం కల్పించడం విశేషం. బారాబంకి మాజీ ఎంపీ ప్రియాంక సింగ్ రావత్ తో పాటు ఝార్ఖండ్ గవర్నర్ సంతోష్ గంగ్వార్ కుమార్తె శ్రుతి గంగ్వార్‌‌లను మహిళా కోటాలో బరిలోకి దించారు. ఇక ఇతర ప్రముఖులలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది. కింది స్థాయి నుంచి పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న నాయకులను ఎగువసభకు పంపడం ద్వారా, కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. గతంలో ఎంపీలుగా కొనసాగిన ప్రముఖులను పక్కనపెట్టి మరీ కొత్తవారికి అవకాశం కల్పించడం ద్వారా పార్టీలో నాయకత్వ మార్పునకు పెద్దపీట వేస్తున్న సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలో పార్టీ పట్టును మరింత బలోపేతం చేసే దిశగా బీజేపీ అధిష్ఠానం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి యువత, అన్ని సామాజిక వర్గాలను కలుపుకొనిపోయేలా నాయకత్వ బృందాన్ని సిద్ధం చేయడంలో ఈ రాజ్యసభ ఎన్నికల ఎంపిక ఒక ముఖ్యమైన మెట్టుగా నిల వనుంది. సిట్టింగ్‌లను కాదని సరికొత్త బృందాన్ని ఎగువసభకు పంపడం ద్వారా పార్టీలో పోటీతత్వాన్ని పెంచడంతో పాటు, సమర్థులైన కొత్త నాయకులను జాతీయ స్థాయికి పరిచయం చేయాలనే ఉద్దేశం కూడా దీని వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో యూపీ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సీనియర్ నాయకులను పక్కనపెట్టడంపై కొంతమేర అంతర్గత అసంతృప్తి వ్యక్తమయ్యే ఆస్కారం ఉన్నప్పటికీ, సామాజిక సమీకరణాల కోణంలో ఈ జాబితా పార్టీకి ఎన్నికల సమయంలో లబ్ధి చేకూరుస్తుందని పార్టీ శ్రేణులు గట్టిగా విశ్వసిస్తున్నాయి. అక్టోబర్ 16న జరగనున్న పోలింగ్ అనంతరం ఈ కొత్త అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా లేదా సులభంగానే రాజ్యసభకు ఎన్నికవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. [Rajya Sabha elections, BJP candidates, Uttar Pradesh politics, Union Ministers, UP Assembly elections, Telugu One]
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత జిల్లాలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సొంత మనుషులే ఆయనకు, ఆయన పెద్ద దిక్కుగా ఉన్న పార్టీకీ దూరం అవుతున్నారు. ఆయన సొంత మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు వైసీపీని వీడిన సంగతి తెలిసిందే. ఇది జిల్లాలో పార్టీకే కాకుండా, వ్యక్తిగతంగా కూడా బొత్స సత్యనారాయణకు గట్టి ఎదురు దెబ్బే కాకుండా పూడ్చలేని నష్టం కూడా. అయితే ఆ తరువాత కూడా జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.  తాజాగా  మాజీ ఎమ్మెల్యే, జడ్పీ మాజీ చైర్మన్ బడ్డుకొండ అప్పలనాయుడు పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవలే ఆయనను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వైసీపీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన తన సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ.. వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామ చేశారు.  పార్టీ అధిష్టానం తనపై వేసిన సస్పెన్షన్ వేటుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన విస్పష్టంగా ప్రకటించారు.  సొంత పార్టీ నేతల వైఖరి, నాయకత్వ సరళిపై విమర్శలు గుప్పించిన ఆయన త్వరలో తన కార్యాచరణను ప్రకటించనున్నట్లు చెప్పారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా.. నేతలు పార్టీ వీడిన తరువాత, సమావేశాలు ఏర్పాటు చేసో, అసంతృప్తులను పలిపించుకునో బుజ్జగింపు చర్యలకు దిగుతుంది. పార్టీ నుంరచి వలసలు పెరగకుండా నివారణ చర్యలకు ఉపక్రమిస్తుంది. అయితే ఆశ్చర్యకరంగా వైసీపీలో అటువంటి పరిస్థితి కనిపించడం లేదు.  మజ్జి పార్టీకి రాజీనామా చేసిన తరువాత జరిగిన విజయనగరం జిల్లా వైసీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది, ఇప్పుుడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన బడ్డుకొండ అప్పలనాయుడు.. అప్పుడు నాడు జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తాను వైపీలోనే కొనసాగుతానని ప్రకటించారు.  అలా ఆయన ప్రకటించిన రోజు రాత్రే పార్టీ హైకమాండ్ ఆయనను నెల్లమర్ల నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతల నుంచి తొలగించింది.  దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయనను పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫారసుల మేరకు అంటూ  పార్టీ నుంచే సస్పెండ్ చేసింది.     స్పెన్షన్ ప్రకటన వెలువడిన కొద్ది గంటలకే బడ్డుకొండ అప్పలనాయుడు విజయనగరంలో తన అనుచరులు, అభిమానులతో సమావేశం నిర్వహించి, పార్టీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను, అవమానాలను వారికి వివరించారు. గౌరవం లేని చోట తాను, తన అనుచరులు కొనసాగలేమని స్పష్టం చేస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు  ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత జగన్‌పై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. జగన్ వైసీపీని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా నడుపుతున్నారని దుయ్యబట్టారు. ఆయన నియంతృత్వ పోకడల కారణంగానే ప్రజాగ్రహానికి గురై గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నారు.  మజ్జి శ్రీను తనకు బావ అవుతారన్న ఒకే ఒక్క కారణంతో తనపై ఎలాంటి ఆధారాలు లేకుండా చర్యలు తీసుకున్నారని విమర్శించారు. అదే రీతిలో పరిశీలిస్తే మజ్జి శ్రీనుకి సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ కూడా బంధువు అవుతారని, ధైర్యం ఉంటే ఆయన్ని కూడా సస్పెండ్ చేయాలనీ సవాల్ విసిరారు.   [YCP Vizianagaram Crisis, Baddukonda Appalanaidu Resignation, Nellimarla Former MLA YCP, Vizianagaram Politics, Botsa Satyanarayana, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
Venkatesh Maha has announced his next directorial venture Attahaasam, unveiling the title and first look of the film on Tuesday. Set in the filmmaker’s familiar world of Kancharapalem, the film appears to explore another rooted and unconventional story, with the first look introducing its characters without revealing much about the plot. The first look features Venkatesh Maha alongside Sravanthi Peepakayala in one portion, while Karthik Ratnam and Pavani Karanam are seen together in another. Maha appears in a police avatar, but the poster deliberately keeps the nature of the characters and their relationships under wraps, leaving the story open to speculation. Attahaasam marks Venkatesh Maha’s return to the director’s chair after his earlier acclaimed work, with the filmmaker once again serving as the writer and also taking on a role in the film. The project is presented by Chinta Varalaxmi and produced by Chinta Gopalakrishna Reddy and Rajashekar Reddy Chinta, with Chinta Vineesha Reddy as co-producer. Karthik Ratnam, Pavani Karanam and Sravanthi Peepakayala play key roles, while Smaran Sai is composing the music. The makers are planning to bring Attahaasam to theatres in Summer 2027. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Mouli’s upcoming comedy entertainer Donga Naa Koduku has locked its theatrical release date. The film, directed by Sreenu Kangala and produced by Mythri Movie Makers, is set to hit screens on November 13. The release date poster gives a glimpse into the film’s comic premise, with Mouli’s character seemingly getting into trouble because of his habit of stealing. Ali, who plays his father, is seen breaking down over his son’s antics, while Ragini plays his mother. Donga Naa Koduku revolves around a young man whose stealing habit creates a series of problems for his family, forming the basis for the film’s crime-comedy setup. The combination of Mouli and Ali as son and father is expected to be one of the film’s key attractions. The film marks Mouli’s next outing after the success of Little Hearts. With the release date now confirmed, the makers are expected to begin stepping up the promotions for Donga Naa Koduku ahead of theatrical release. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి, నరేష్ వీకే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "క్రేజీ కళ్యాణం". ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు.  ఈ అక్టోబర్ 30న "క్రేజీ కళ్యాణం" సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా రెండు వారాల ముందుగానే ఈనెల 16వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ ఈరోజు అనౌన్స్ చేశారు.  "క్రేజీ కళ్యాణం" సినిమా ప్రమోషనల్ కంటెంట్ తోనే మూవీ లవర్స్ దృష్టిని బాగా ఆకర్షించింది. ఈ చిత్రంలోని లిరికల్ సాంగ్స్ కూడా చాట్ బస్టర్స్ అయ్యాయి. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ తో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే అక్టోబర్ 15న రజినీకాంత్ 'జైలర్-2', అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ 'రణబాలి' సినిమాలు ఉన్నాయి. అయినప్పటికీ అక్టోబర్ 30న రిలీజ్ కావాల్సిన క్రేజీ కళ్యాణం.. అక్టోబర్ 16న రావడానికి రెడీ అవ్వడం చూస్తుంటే కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉందని అర్థమవుతోంది. ఇది కూడా చదవండి: AA23 ప్రాజెక్ట్ ఆగిపోయిందా.. లోకేష్ నెక్స్ట్ మూవీ ఎవరితో.?        [Crazy Kalyanam Release Date, Crazy Kalyanam On October 16, Anupama Parameswaran, Tharun Bhascker, Vijay Deverakonda, Ranabaali Release Date, Super Star Rajinikanth, Jailer 2 Release Date, Telugu Film News]  
యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ‘హుషారు’ సినిమాకు సీక్వెల్‌ వచ్చేస్తోంది. 2018లో విడుదలైన ఈ చిత్రం ఫ్రెండ్‌షిప్, కామెడీ, యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ‘హుషారు 2’ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేయగా.. అందులో కనిపిస్తున్న వింత విజువల్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక పోస్టర్‌ను గమనిస్తే.. ఓ ట్రక్కుపై కబూమ్ బీర్, దాని చుట్టూ భారీ పాము, కింద తాబేలు, పక్కనే బంగారు నిధులతో కూడిన పెట్టె, వెనుక ఓ ఫ్యాక్టరీ కనిపిస్తున్నాయి. మొత్తం విజువల్‌ను చూస్తే పురాణాల్లోని ‘సముద్ర మథనం’ గుర్తుకు వచ్చేలా డిజైన్ చేశారు. ఈ విజువల్స్‌కు, సినిమాలోని కథకు ఏమైనా సంబంధం ఉందా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ పోస్టర్ వెనుక ఉన్న అసలు కాన్సెప్ట్ ఏంటన్నది సినిమా విడుదలయ్యే వరకు సస్పెన్స్‌గానే ఉంచారు. ‘హుషారు 2’ కథ విషయానికి వస్తే.. ఐదుగురు స్నేహితుల చుట్టూ ఈ సినిమా సాగనుంది. కోవిడ్ సమయంలో తమ దగ్గర ఉన్నదంతా కోల్పోయిన ఈ స్నేహితులు జీవితంలో మళ్లీ నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో చిత్తరగుంజ్ అనే ప్రాంతానికి వెళ్లి.. అగేవ్ మొక్కలతో టేకిలా తయారు చేసే ఓ వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు. అయితే వారి వ్యాపార ఆలోచన ఊహించని సమస్యలకు దారితీయడంతో.. ఫ్రెండ్‌షిప్, కామెడీ, అడ్వెంచర్, మ్యాడ్‌నెస్‌తో కూడిన మరో కొత్త ప్రయాణం మొదలవుతుంది. మరోవైపు తొలి భాగానికి దర్శకత్వం వహించిన శ్రీహర్ష కొనుగంటి.. సీక్వెల్‌కు కూడా రచన, దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. అశోక్ గల్లా, రాహుల్ రామకృష్ణ, రవి ఆంథోని, దినేష్ తేజ్, శశిధర్ కోచర్లకోట, విధి యాదవ్, అభిజ్ఞ వుతులూరు తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన షూటింగ్ పూర్తవగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివర్లో సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్, టీజర్ తదితర ప్రమోషనల్ కంటెంట్‌ను విడుదల చేయనున్నారు.     [Husharu 2, Husharu 2 Movie, Husharu 2 Title Poster, Ashok Galla, Sree Harsha Konuganti, Rahul Ramakrishna, Dinesh Tej, Husharu Sequel, Husharu 2 Story, Husharu 2 Cast, Telugu Movies, Tollywood News]
భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నటిస్తూ, నిర్మించిన రా అండ్ రస్టిక్‌ చిత్రం ‘అనకాపల్లి’. ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ మూవీకి త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లేని అందించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయగా అద్భుతమైన స్పందనతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు థాంక్యూ మీట్ నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ .. "అనకాపల్లి సినిమాకి నేను డబ్బులేమీ పెట్టలేదు. నా పేరు పెడితే ఎవరైనా చూసేందుకు వస్తారని అలా పెట్టారు. సోమవారం వరకు రిజల్ట్ కోసం వెయిట్ చేశాను. సోమవారమే కాదు.. ఈ రోజు (మంగళవారం) కూడా మంచి ఫ్లోటింగ్ ఉంది. అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. సినిమాకు అన్ని వైపుల నుంచి రెస్పాన్స్ వస్తోంది. పర్ఫామెన్స్ పరంగా ఆర్టిస్టులందరికీ మంచి పేరు వస్తోంది. ఈ సినిమాని ఇలానే మరింత ముందుకు తీసుకు వెళ్లాలని మీడియా, ఆడియెన్స్‌ని కోరుకుంటున్నాను" అన్నారు. లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. "అనకాపల్లి సక్సెస్‌లో పాల్గొనడం ఆనందంగా ఉంది. విక్రమ్ నా కొడుకు అవ్వడం, అతని మీద ఒక సినిమా తీయడానికి  త్రినాథ్ రావు గారు, నాయుడు గారు ముందుకు రావడం గొప్ప విషయం. ఇలాంటి చిన్న చిత్రాలకు మీడియానే ముందుండి సపోర్ట్ చేస్తుంది. ‘ఎవడిగోలవాడిదే’ సినిమాని ఫస్ట్ వీక్‌కే తీసేస్తామని అన్నారు. కానీ అదే థియేటర్లో చివరకు సిల్వర్ జూబ్లీ జరిగింది. అలానే ‘అనకాపల్లి’ కూడా గొప్ప విజయాన్ని సాధిస్తుంది. దసరా ధమాకాగా ‘అనకాపల్లి’ నిలుస్తుంది. మండే నైట్ షోలు కూడా ఫుల్స్ అయ్యాయి. నూకాలమ్మ తల్లి ఆశీస్సులతో ‘అనకాపల్లి’ చిత్రం మరింత విజయాన్ని సాధిస్తుందని కోరుకుంటున్నాను" అన్నారు. కాండ్రేగుల నాయుడు మాట్లాడుతూ.. "త్రినాథరావు నక్కిన గారి మీదున్న నమ్మకంతోనే ‘అనకాపల్లి’ చేశాను. రెండు వందల థియేటర్లలో మా మూవీని రిలీజ్ చేశాం. మేం ఎంతో కష్టపడి ఈ సినిమాని చేశాం. ఇంత మంచి ఆదరణ లభిస్తున్న ఈ సినిమాకి కాకుండా ఇతర భాషల చిత్రాలకు థియేటర్లను ఇస్తున్నారు. మంచి చిత్రాలతో మా లాంటి చిన్న నిర్మాతలు వచ్చినప్పుడు సపోర్ట్ ఇవ్వాలని అందరినీ కోరుకుంటున్నాను. ఈ రోజు కూడా మా సినిమాకి చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. మేం మంచి మూవీని తీశాం. మా చిత్రానికి ఇంకా థియేటర్లు ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్లను కోరుతున్నాను" అన్నారు. విక్రమ్ సహిదేవ్ మాట్లాడుతూ.. "అనకాపల్లి సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. రివ్యూలన్నీ చదివాను. మా ప్లస్, మైనస్ పాయింట్స్ చెప్పిన అందరికీ థాంక్స్. ఇంకా మా చిత్రానికి థియేటర్లు పెరుగుతున్నాయి. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన త్రినాథరావు గారికి థాంక్స్. ఇంద్రజ గారి వల్లే ఫ్యామిలీ డ్రామా అంత గొప్పగా వచ్చింది. దేవ్‌జండ్ గారి మ్యూజిక్ అదిరిపోయింది. తారక్ పొన్నప్ప గారితో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. సంధ్య వశిష్ట చక్కగా నటించింది. ఈ జర్నీలో మా నిర్మాతలు నాయుడు గారు, రాజా గారు ఫ్యామిలీ మెంబర్లుగా మారిపోయారు. వారితో మున్ముందు కలిసి ప్రయాణించాలని కోరుకుంటున్నాను" అన్నారు. నటి ఇంద్రజ మాట్లాడుతూ.. "అనకాపల్లి అసలు సిసలు విజయాన్ని సాధించింది. అందుకే ఈ రోజు ఈ థాంక్యూ మీట్‌కి వచ్చాను. ఇలాంటి మంచి చిత్రానికి సరైన సంఖ్యలో థియేటర్లు ఇవ్వకపోవడం బాధగా ఉంది. చూసిన ప్రతీ ఒక్కరూ సినిమా బాగుందని మెచ్చుకుంటున్నారు. సినిమాలో ఎవరున్నారు? ఎవరు తీశారు అన్నది పట్టించుకోవడం లేదు. బాగుందా? లేదా? నచ్చిందా? లేదా? అన్నది మాత్రమే ఆడియెన్స్ చూస్తున్నారు. మా సినిమాకి మరిన్ని మంచి థియేటర్లు లభిస్తాయని ఆశిస్తున్నాను. ఓటీటీలో కూడా మా మూవీని చూడండి. కానీ అప్పుడు థియేటర్లో చూడలేకపోయామనే ఫీల్ అవుతారు. మా చిత్రం అంత అద్భుతంగా ఉంటుంది" అన్నారు. ఇది కూడా చదవండి: AA23 ప్రాజెక్ట్ ఆగిపోయిందా.. లోకేష్ నెక్స్ట్ మూవీ ఎవరితో.?        [Anakapalli Thank You Meet, Anakapalli Success Meet, Anakapalli Movie, Indraja, Trinadha Rao Nakkina, Sridhar Lagadapati, Telugu Film News]  
అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా AA23గా పిలుస్తున్నారు. తాజాగా ఈ సినిమా క్యాన్సిల్ అయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేశాయి. స్క్రిప్ట్ విషయంలో, షూటింగ్ విషయంలో అల్లు అర్జున్ నుంచి క్లారిటీ రాకపోవడంతో.. ప్రస్తుతం లోకేష్ మరో హీరో వైపు చూస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. లోకేష్ కనగరాజ్‌కు రామ్ చరణ్‌తో సినిమా చేయాలనే ఆలోచన చాలా కాలం నుంచి ఉంది. ‘విక్రమ్’కు ముందే చరణ్‌కు లోకేష్ కొన్ని కథలు చెప్పినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుందనే విషయంలో మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు. ప్రస్తుతం చరణ్ లైనప్ కూడా బిజీగా ఉండటంతో లోకేష్–చరణ్ సినిమా ఎప్పుడు మొదలవుతుందన్నది చెప్పడం కష్టమే. ఇప్పుడు అసలు ఆసక్తి కలిగిస్తున్న పేరు మహేష్ బాబు. అల్లు అర్జున్, రామ్ చరణ్ ప్రాజెక్టుల విషయంలో క్లారిటీ లేకపోవడంతో లోకేష్ తన ఫోకస్‌ను మహేష్ వైపు మళ్లించారనే టాక్ వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లోనే మహేష్–లోకేష్ కాంబినేషన్‌లో సినిమా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే కొందరు మాత్రం ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న 'రాకా' పూర్తి కాగానే.. 2027 జనవరి నుంచి లోకేష్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని చెబుతున్నారు. మరి AA23 ప్రాజెక్ట్ నిజంగానే ఆగిపోయిందా? లోకేష్ తన నెక్స్ట్ మూవీని మహేష్ తో చేయబోతున్నాడా? అనేది క్లారిటీ రావాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. ఇది కూడా చదవండి: కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్.. బాలయ్య ఫ్యాన్‌గా రాధిక.. శ్రీవిష్ణు మామూలు కామెడీ కాదు.!       [Is AA23 Movie Shelved, AA23 Shelved Or Not, Allu Arjun Lokesh Kanagaraj Film, Allu Arjun, Ram Charan, Mahesh Babu, Lokesh Kanagaraj, Telugu Film News]  
Crazy Kalyanam starring Anupama Parameswaran, Tharun Bhascker, VK Naresh and Akhil Uddemari, is heading to theatres earlier than planned. The makers have preponed the film’s worldwide theatrical release by two weeks, with the film now scheduled to hit screens on October 16 instead of October 30.  The film has been generating attention through its teaser and songs, with the promotional material positioning it as a family-oriented entertainer. Anupama is playing a village girl who cannot get married and her struggle about this aspect becomes the story.  The recently released Ala Sendravanka has also added to the film’s musical buzz, following Kaaka Dhoom Dhamaka. Both songs have been composed by Suresh Bobbili. Directed by Badrappa Gajula, Crazy Kalyanam  is produced by Boosam Jagan Mohan Reddy under the Arrow Cinemas banner. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కట్ అవుట్ రేంజ్ కి ఉన్న కెపాసిటీ తెలియచేస్తూ 'ఓజీ' సాధించిన ఘన విజయం తెలిసిందే. దీంతో ఇప్పుడు అభిమానులతో పోటీపడుతు మరి ప్రేక్షకులు, సినీ ప్రేమికులందరు 'ఓజి 2 'ఎప్పుడెప్పుడు షూట్ కి వెళ్తుందా! సోషల్ మీడియాలో వైరల్ అయ్యే లుక్స్ చూసేద్దామని ఎదురుచూస్తున్నారు. పవన్ రాజకీయ ప్రయాణం, బిజీ షెడ్యూల్ కారణంగా 'ఓజీ 2' కొంత ఆలస్యం అవుతుందేమోనని ఆందోళన చెందిన అభిమానులకి సినీ సర్కిల్స్ లో సరికొత్త సువాసనతో  చక్కర్లు కొడుతున్న ఓజి 2 న్యూస్ ఆనందపరిమళాలని అందిస్తుంది. పవన్ ప్రస్తుతం ఉన్న లుక్ ఓజి 2  కి సంబంధించిన లుక్ అని, త్వరలోనే షెడ్యూల్ స్టార్ట్ కాబోతుందని అంటున్నారు. మరి అదే కనుక నిజమైతే ఫ్యాన్స్ తో పాటు న్యూస్ కూడా తమ హవా సారీ అయిందని అనుకోవడం తథ్యం.  ఇది కూడా చదవండి: రజినీకాంత్,భగవద్గీతకి మధ్య ఉన్న సంబంధం ఏంటి!   ఓజి 2 ని పవన్ నే నిర్మిస్తుండగా సుజీత్ ఓజిని మించి హిట్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు.    Og 2 Shooting Update, OG 2 Update, Pawan Kalyan OG 2, Sujeeth OG sequel, Ojas Gambheera story, OG 2 release update, Pawan Kalyan new movie news  
  రజినీకాంత్ సినిమాలు చూస్తే చాలు, ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్లు.. లోక తీరు ఎలా ఉంటుంది, ఎలాంటి డైలాగులు మన జీవితాన్ని మారుస్తాయి. ఒక్కోసారి మన కంటితో చూసినవి, చెవితో విన్నవి నిజాలు ఉండవు, వాస్తవంతో కూడిన సత్యం వేరే ఉంటుందనే విషయాలు తెలుస్తాయి. ఈ విషయం అభిమానులు, సినీ ప్రేమికులకి బాగా తెలుసు. అందుకే ఇప్పుడు రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కనుంది. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే నభూతో నభవిష్యత్ అనే స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, చెరగని ముద్రను వేసుకున్న సజీవ దృశ్యకావ్యం మన ఇండియన్ ఎవర్‌గ్రీన్‌ సూపర్ స్టార్ రజనీకాంత్. బెంగళూరు మహానగరంలో ఒక సాధారణ బస్సు కండక్టర్‌గా శివాజీరావు గైక్వాడ్ అనే పేరుతో జీవిత ప్రయాణాన్ని ప్రారంభించి, నటుడిగా మారాలనే బలమైన ఆకాంక్షతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు, కష్టనష్టాలను అధిగమించి కోలీవుడ్ సినీ సామ్రాజ్యానికి మహారాజుగా ఎదిగిన ఆయన ప్రస్థానం ప్రతి ఒక్కరికీ అత్యంత స్ఫూర్తిదాయకం. దాదాపు 50 ఏళ్లకు పైబడిన సుదీర్ఘ సినీ ప్రయాణంలో తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో వందలాది చిరస్మరణీయమైన చిత్రాలను అందించి, భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్, పద్మవిభూషణ్ మరియు అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలను అందుకని కోట్లాది అభిమానుల గుండెల్లో చెరగని రజనీ మార్క్ వేసేశారు. ప్రస్తుతం ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న మలుపులు, అనుభవాలను క్రోడీకరిస్తూ స్వయంగా ఒక అద్భుతమైన ఆత్మకథను రాస్తున్న సంగతి సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.   ఇది కూడా చదవండి: ఇంద్రజని చూసి ఏడ్చేసిన ప్రముఖ నిర్మాత    ఈ క్రమంలోనే ఇండియన్ సినిమా ఐకాన్ రజనీకాంత్ జీవిత ఆధారంగా తెరకెక్కే ప్రతిష్టాత్మక బయోపిక్ ప్రాజెక్ట్‌పై ఆయన కుమార్తె, ప్రముఖ దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ చేసిన తాజా సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. తన తండ్రి బయోపిక్ నిర్మాణానికి సంబంధించిన అప్‌డేట్‌పై మాట్లాడుతూ, "నాన్న బయోపిక్ చాలా సూపర్ గా రూపుదిద్దుకుంటోందని, ఇది కేవలం ఒక సినీ నటుడి కథ మాత్రమే కాదని, ఒక భగవద్గీత లేదా మహాభారతం తరహాలో ప్రతి ఒక్కరికీ జీవిత సత్యాలను బోధించే మార్గదర్శిలా ఉంటుందని" ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు. తండ్రి ఆత్మకథ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ మహా ప్రయాణాన్ని ముందుగా ఒక విశిష్టమైన పుస్తకంగా ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించి, ఆ తర్వాత దానిని అత్యంత భారీ స్థాయిలో డిజిటల్ వెబ్ సిరీస్‌గా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఐశ్వర్య స్పష్టం చేశారు.    అంతేకాకుండా, మరొక కుమార్తె సౌందర్య రజనీకాంత్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, భవిష్యత్తులో ఈ అపూర్వ కథను ఒక పూర్తి స్థాయి విజువల్ వండర్ వెండితెర సినిమాగా కూడా మలిచే ఆలోచన ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. దర్శకుడు కే. బాలచందర్ చేతిలో పడి 'అపూర్వ రాగంగళ్' చిత్రంతో ప్రతినాయకుడిగా ప్రయాణం ప్రారంభించి, 'భైరవి'తో కథానాయకుడిగా మారి, నేడు గ్లోబల్ బ్రాండ్‌గా రూపాంతరం చెందిన రజనీకాంత్ అసమాన జీవన పోరాటం ఖచ్చితంగా వెండితెరపై మరియు ఓటీటీ డిజిటల్ మాధ్యమంలో సరికొత్త రికార్డులను తిరగరాస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐదు దశాబ్దాల సినీ సామ్రాజ్య వైభవాన్ని, ఆయన పడిన తపనను కళ్లకట్టినట్లు చూపే ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న రజనీకాంత్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.   [Rajinikanth Biopic Like BhagavadGita Aishwarya Reacts, Rajinikanth Biopic, Aishwarya Rajinikanth, Rajinikanth Autobiography, Soundarya Rajinikanth, TeluguCinema News, Tollywood Cinema News, Tollywood, TeluguCinema]  
శ్రీవిష్ణు సినిమాలు అంటేనే కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్.. దానికి తగ్గట్టుగా కామెడీ. ఇప్పుడు ఆయన నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కూడా అలాంటి మరో సినిమాలానే కనిపిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే కామెడీ, రొమాన్స్, యాక్షన్‌ను ఒక డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌లో కలిపి సినిమా తెరకెక్కించినట్టు అర్థమవుతోంది. జానకిరామ్ మారెల్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కళ్యాణ్ పాత్రలో శ్రీవిష్ణు కనిపిస్తున్నారు. మొదట్లో ఒక సాధారణ యువకుడిగా కనిపించే కళ్యాణ్ జీవితం.. అనుకోని పరిస్థితుల్లో పూర్తిగా మారిపోతుంది. చివరకు పోలీసులు వెతికే మోస్ట్ వాంటెడ్ నక్సలైట్‌గా ఎలా మారాడు? అనేదే సినిమా అసలు కథలా కనిపిస్తోంది. ట్రైలర్‌లో ముందుగా కళ్యాణ్ పర్సనల్ లైఫ్‌ను పరిచయం చేశారు. ఒడిశాకు చెందిన అమ్మాయి పాత్రలో మహిమా నంబియార్ కనిపిస్తున్నారు. కళ్యాణ్, ఆ అమ్మాయి మధ్య లవ్ ట్రాక్ కూడా ఫన్‌గా ఉండబోతున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక కళ్యాణ్ తల్లి పాత్రలో రాధికా శరత్‌కుమార్ కనిపించారు. ఆమె పాత్రకు కూడా మంచి ఫన్ యాంగిల్ పెట్టారు. ముఖ్యంగా ఆమె బాలకృష్ణకు వీరాభిమానిగా, కాస్త కోపిష్టి తల్లిగా కనిపించడం ట్రైలర్‌లో హైలైట్‌గా అనిపిస్తోంది. అయితే సినిమా అసలు కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ (షైన్ టామ్ చాకో) కళ్యాణ్ కోసం వేట మొదలుపెడతాడు. అసలు కళ్యాణ్ నక్సలైట్‌గా ఎందుకు మారాడు? అతను చేసిన నేరం ఏంటి? పోలీసులు అతని కోసం ఎందుకు ఇంత సీరియస్‌గా వెతుకుతున్నారు? అనే ప్రశ్నలను ట్రైలర్‌లో ఆసక్తికరంగా ఎస్టాబ్లిష్ చేశారు. సీరియస్ బ్యాక్‌డ్రాప్ ఉన్నప్పటికీ.. సినిమా మొత్తం మాత్రం సీరియస్‌గా ఉండదని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. శ్రీవిష్ణు తన మార్క్ కామెడీతో మరోసారి ఎంటర్‌టైన్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన చెప్పే వన్‌లైనర్స్, డైలాగ్ డెలివరీ ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. శ్రీవిష్ణుకు తోడుగా సత్య, వెన్నెల కిశోర్ కామెడీని మరింత పెంచేలా కనిపిస్తున్నారు. ముఖ్యంగా సీరియస్ సిట్యుయేషన్స్‌లో కూడా శ్రీవిష్ణు తనదైన టైమింగ్‌తో నవ్వించే ప్రయత్నం చేశారు. మొత్తానికి ‘కామ్రేడ్ కళ్యాణ్’ ట్రైలర్ ఎంటర్టైనింగ్‌గా, ఫ్రెష్‌గా అనిపిస్తోంది. నక్సలైట్ బ్యాక్‌డ్రాప్ అనగానే ఒక సీరియస్ పొలిటికల్ లేదా యాక్షన్ డ్రామాను ఊహిస్తాం. కానీ శ్రీవిష్ణు తన మార్క్ కామెడీని జోడించి దాన్ని పూర్తిగా డిఫరెంట్‌గా చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే పబ్లిసిటీ విషయంలో కాస్త వెనుకబడిన ఈ సినిమాకు ట్రైలర్ మాత్రం కొంత బజ్ తీసుకొచ్చేలా ఉంది. సినిమా కూడా ఇదే ఫన్, ఫ్రెష్‌నెస్‌ను కంటిన్యూ చేస్తే శ్రీవిష్ణుకు మరో మంచి ఎంటర్టైనర్ దొరికినట్టే. అక్టోబర్ 9న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకోనుందో చూడాలి. ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ విధ్వంసం.. గూస్ బంప్స్ తెప్పించే భారీ యాక్షన్ సీక్వెన్స్.!       [Comrade Kalyan Trailer, Comrade Kalyan Movie, Sree Vishnu, Mahima Nambiar, Janakiram Marella, Comrade Kalyan, Satya Comedy, Telugu Film News]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మన దైనందిన జీవితంలో ఆహారం అత్యంత ప్రాథమికమైన అవసరం. కానీ నేటి ఆధునిక జీవన శైలిలో తెల్ల బియ్యం వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చూడటానికి ఎంతో తెల్లగా, ఆకర్షణీయంగా ఉండి, వండటానికి కూడా చాలా తేలికగా ఉండే ఈ తెల్ల బియ్యం, మన శరీరానికి తెలియకుండానే అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, స్థూలకాయం, మధుమేహం (డయాబెటిస్), రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ పెరగడం, ఫ్యాటీ లివర్ వంటి భయంకరమైన వ్యాధులకు తెల్ల బియ్యం అధిక వినియోగమే ప్రధాన కారణమవుతోంది. ఈ నేపథ్యంలో, మన ప్రాచీన సంప్రదాయ ఆహారమైన ఎర్ర బియ్యాన్ని (Red Rice) రోజూవారీ ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు గట్టిగా సూచిస్తున్నారు. ఎర్ర బియ్యం అనేది ఎటువంటి పాలిష్ చేయని పూర్తి సహజమైన ధాన్యం. ప్రాసెస్ చేయకపోవడం వల్ల దీనిలోని పోషక విలువలు ఏమాత్రం నశించకుండా పూర్తి స్థాయిలో భద్రంగా ఉంటాయి. 100 గ్రాముల ఎర్ర బియ్యంలో ఉన్న పోషక విలువలను ఒక్కసారి పరిశీలిస్తే, అందులో శరీరానికి కావలసిన 356 కిలో కేలరీల శక్తి లభిస్తుంది. అలాగే దీనిలో 75.5 గ్రాముల పిండిపదార్థాలు, 9 గ్రాముల మాంసకృత్తులు (ప్రోటీన్), 3.3 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు, మరియు 11 గ్రాముల పీచు పదార్థం (ఫైబర్) పుష్కలంగా లభిస్తాయి. సాధారణ తెల్ల బియ్యంతో పోలిస్తే ఎర్ర బియ్యంలో పీచు పదార్థం ఏకంగా 3 నుండి 4 రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం. ఎర్ర బియ్యంలో ఉండే ఈ అత్యధిక ఫైబర్ పరిమాణం రక్తంలో గ్లూకోజ్ శోషణ వేగాన్ని గణనీయంగా నెమ్మదింపజేస్తుంది. దీని మూలంగా రక్తంలో ఒకేసారి చక్కెర స్థాయిలు పెరిగిపోకుండా అదుపులో ఉంటాయి. డయాబెటిస్ తో బాధపడుతున్న వారు లేదా చక్కెర వ్యాధి రాకుండా జాగ్రత్త పడాలనుకునే వారు తమ ఆహారంలో తెల్ల బియ్యం మరియు సాధారణ ముడి బియ్యం స్థానంలో ఈ ఎర్ర బియ్యాన్ని ఎంచుకుంటే, గ్లూకోజ్ స్థాయిలను చాలా సులభంగా నియంత్రణలో ఉంచుకోవచ్చు. దీనివల్ల శరీరానికి నిరంతర శక్తి లభించడమే కాకుండా ఇన్సులిన్ స్థాయిలు కూడా క్రమబద్ధీకరించబడతాయి. కేవలం ఫైబర్ మాత్రమే కాకుండా, ఎర్ర బియ్యంలో ఫినాల్స్ మరియు యాంథోసైనిన్స్ వంటి శక్తివంతమైన సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. పరిశోధనల ప్రకారం ఇందులో దాదాపు 294 మిల్లీగ్రాముల ఫినాల్స్ మరియు యాంథోసైనిన్స్ లభిస్తాయి. ఈ విశిష్ట సమ్మేళనాలు మన జీర్ణవ్యవస్థలో కార్బోహైడ్రేట్ల విచ్ఛిన్నతను మందగించేలా చేసి, చక్కెర రక్తంలోకి వేగంగా కలవకుండా అడ్డుకుంటాయి. గుండె సంబంధిత లేదా కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ గ్లూకోజ్ నియంత్రణ ప్రక్రియ ఎంతో మేలు చేస్తుంది. ఎర్ర బియ్యానికి ఆ ప్రత్యేకమైన ఎరుపు రంగు రావడానికి కారణం దానిలో ఉండే 'యాంథోసైనిన్' అనే బలమైన యాంటీఆక్సిడెంట్. ఈ యాంటీఆక్సిడెంట్ శరీరంలోని కణజాలాన్ని ఉచిత రాడికల్స్ నుండి కాపాడి, వ్యాధుల బారిన పడకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది. అంతేకాకుండా, ఎర్ర బియ్యంలో ఉండే అధిక ఫైబర్ కారణంగా తక్కువ పరిమాణంలో అన్నం తిన్నా కడుపు త్వరగా నిండిన భావన కలుగుతుంది. ఇది అతిగా తినే అలవాటును నివారించి, బరువును అదుపులో ఉంచుతుంది. ప్రత్యేకించి పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును కరిగించడంలో, ఫ్యాటీ లివర్ వంటి తీవ్ర రుగ్మతలను తగ్గించడంలో ఎర్ర బియ్యం ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది.     Red rice health benefits, Erra Biyyam benefits, red rice for weight loss, red rice for diabetes, nutrients in red rice, red rice vs white rice, healthy grains benefits, organic red rice benefits Telugu, health benefits of red rice.
మన సాంప్రదాయ వంటకాలలో రకరకాల పులుసులకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ముఖ్యంగా కమ్మటి చేమదుంపల పులుసు సరిగ్గా పద్ధతి ప్రకారం చేస్తే వచ్చే ఆ రుచే వేరు. చేమదుంపలతో పులుసు తయారు చేసేటప్పుడు చాలామందికి జిగటగా రావడం లేదా దుంపలు సరిగ్గా ఉడకకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే సరైన కొలతలు మరియు సులువైన చిట్కాలు పాటిస్తే, ఇంటి నిండా గుమగుమలాడే వాసనలతో నాటి కాలపు రుచిని తలపించేలా నోరూరించే పులుసును సులభంగా తయారుచేసుకోవచ్చు. ఈ అద్భుతమైన వంటకాన్ని ఎంతో రుచికరంగా ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ సాంప్రదాయ పులుసు తయారీకి కావలసిన ప్రధాన పదార్థాల కొలతలను పరిశీలిస్తే: ముందుగా పావు కేజీ (250 గ్రాములు) చేమదుంపలను తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి ఉడికించుకున్న తర్వాత తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకోవాలి. పులుపు కోసం ఒక చిన్న నిమ్మకాయ పరిమాణంలో ఉన్న చింతపండును నీళ్లలో నానబెట్టుకోవాలి. రుచితో పాటు సరైన ఘాటు కోసం 1.5 స్పూన్లు ఉప్పు, 1.5 స్పూన్లు కారం, 1/4 స్పూను పసుపు సిద్ధం చేసుకోవాలి. తాలింపు మరియు మసాలాల విషయానికి వస్తే 1 స్పూన్ పోపు గింజలు, 2 రెమ్మల కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల నూనె, 1/2 స్పూన్ జీలకర్ర-మెంతుల పొడి మరియు 1 స్పూన్ ధనియాల పొడి అవసరమవుతాయి. తయారీ విధానం విషయానికి వస్తే, ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాణలి లేదా పాన్ పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడెక్కనివ్వాలి. నూనె కాగాక 1 స్పూన్ పోపు గింజలు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ వెంటనే 2 రెమ్మల కరివేపాకు వేసి దోరగా వేయించాలి. పోపు బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి ముక్కలను వేసి బాగా కలపాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గి దోర రంగులోకి వచ్చే వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత, ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న 1/4 కేజీ చేమదుంపల ముక్కలను అందులో వేయాలి. ఆపై 1/4 స్పూను పసుపు, 1.5 స్పూన్ల ఉప్పు మరియు 1.5 స్పూన్ల కారం వేసి ముక్కలకు మసాలాలన్నీ బాగా పట్టేలా కలపాలి. ముక్కలకు ఉప్పు, కారం బాగా పట్టి, కొద్దిసేపు నూనెలో మగ్గనివ్వడం వల్ల చేమదుంపల లోపలి వరకు రుచి వెళ్తుంది. ఇలా ముక్కలు కాసేపు మగ్గాక, ముందుగా నీళ్లలో నానబెట్టుకుని తీసిన చింతపండు రసాన్ని (పులుసు) ఇందులో పోయాలి. పులుసు బాగా మరిగి మసలే వరకు మీడియం మంట మీద ఉంచాలి. పులుసు మరుగుతున్న సమయంలో 1/2 స్పూన్ జీలకర్ర-మెంతుల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి. మెంతుల పొడి వేయడం వల్ల పులుసుకు అద్భుతమైన సువాసనతో పాటు ప్రత్యేకమైన రుచి వస్తుంది. మీకు కావాల్సిన చిక్కదనం వచ్చే వరకు బాగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. కొందరు చేమదుంపలను పచ్చిగానే తొక్క తీసి ముక్కలుగా కోసి పులుసు పెడుతుంటారు. కానీ, ముందుగా ఉడికించి తొక్క తీసిన తర్వాత పులుసు చేయడం వల్ల జిగట రాకుండా, ముక్క మెత్తగా ఉడికి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి లేదా వేడి చపాతీల్లోకి ఈ కమ్మటి చేమదుంపల పులుసును వడ్డిస్తే ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.     Chamadumpala Pulusu recipe, Taro Root Curry Telugu, Andhra style Chamadumpala Pulusu, Chamagadda Pulusu recipe, Arbi Gravy Telugu, traditional Andhra pulusu recipes, Chamadumpala curry step by step, tasty chamagadda curry.
మన శరీరం సమర్థవంతంగా పనిచేయడానికి ప్రొటీన్లు, ఫైబర్ ఎంత అవసరమో, స్వచ్ఛమైన నీరు కూడా అంతే అత్యంత ముఖ్యం. సాధారణంగా ప్రతీ మనిషి రోజుకు 2.7 లీటర్ల నుంచి 3 లీటర్ల వరకు నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే చాలామంది దాహం వేయనప్పుడు నీరు తాగడం మర్చిపోవడం లేదా తక్కువగా తాగడం వల్ల తెలియకుండానే తీవ్రమైన డిహైడ్రేషన్ బారిన పడుతుంటారు. మనం తీసుకునే నీటి పరిమాణం తగ్గినప్పుడు శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఢిల్లీలోని ధర్మశిల నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్, ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ కుమార్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం, డిహైడ్రేషన్ ఏర్పడినప్పుడు మన శరీరంలో రక్తం పరిమాణం గణనీయంగా తగ్గిపోతుంది. రక్తంలో నీటి శాతం తగ్గి పరిమాణం పడిపోవడం వల్ల, శరీరంలోని ప్రధాన అవయవాలకు మరియు కణజాలాలకు అవసరమైన ఆక్సిజన్, పోషకాలను నిరంతరం అందజేయడానికి గుండె సాధారణం కంటే చాలా వేగంగా మరియు కష్టపడి రక్తాన్ని పంప్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల గుండె స్పందనలు అకస్మాత్తుగా పెరిగి, గుండె దడ వంటి లక్షణాలు తీవ్రమవుతాయి. తీవ్రమైన ఎండలో ఎక్కువ సమయం ఉండటం, వేడి వాతావరణంలో వ్యాయామం చేయడం వల్ల చెమట రూపంలో నీరు అధికంగా బయటకు పోతుంది. అలాగే జ్వరం, వాంతులు లేదా విరేచనాలు అయినప్పుడు శరీరంలో ద్రవాలు వేగంగా తగ్గిపోయి గుండెపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా వృద్ధులు, కొన్ని రకాల వైద్య మందులు వాడుతున్నవారు డిహైడ్రేషన్ ప్రమాదానికి అత్యంత వేగంగా గురవుతారు. శరీరంలో నీటి శాతం తగ్గిందని గుర్తించడానికి అసాధారణంగా తీవ్రమైన దాహం వేయడం, నోరు ఆరిపోవడం, మూత్రం ముదురు పసుపు రంగులోకి మారడం లేదా మూత్ర విసర్జన బాగా తగ్గిపోవడం ముఖ్య సంకేతాలుగా చెప్పవచ్చు. వీటితో పాటు తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, బలహీనత, నిలబడినప్పుడు తల తిరగడం, గుండె లయ తప్పి వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకవేళ డిహైడ్రేషన్ వల్ల గుండె వేగం పెరిగితే, వెంటనే చల్లని ప్రదేశంలో విశ్రాంతి తీసుకుంటూ కొద్దికొద్దిగా నీరు తాగడం ప్రారంభించాలి. చెమట లేదా విరేచనాల వల్ల ఎలక్ట్రోలైట్లు కోల్పోతే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS) లేదా కొబ్బరిబోండాం నీరు తీసుకోవడం ద్వారా కోల్పోయిన శక్తిని త్వరితగతిన తిరిగి పొందవచ్చు. రోజువారీ జీవితంలో తగినంత నీరు తాగడం అలవాటు చేసుకోవడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.     Dehydration and heart rate, fast heartbeat dehydration, dehydration heart palpitations, symptoms of dehydration, high heart rate causes, dehydration effect on blood pressure, dehydration symptoms Telugu health, rapid pulse rate fluid loss.
డయాబెటిస్ ఉన్నవారిలో తరచుగా కనిపించే కొన్ని సమస్యలు రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా కూర్చొని లేవగానే తల తిరగడం, నిలబడినప్పుడు తూలినట్లు అనిపించడం, శరీరంలో బలహీనత, కండరాల బలం తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. తల తిరగడానికి షుగర్ కారణమా? లేక చెవి, మెదడు, మెడకు సంబంధించిన సమస్యల వల్ల Vertigo వస్తుందా? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. ఈ వీడియోలో డాక్టర్ ప్రవీణ్ కుమార్ డయాబెటిస్ మరియు Vertigo గురించి సులభమైన తెలుగులో ముఖ్యమైన విషయాలను వివరిస్తున్నారు. షుగర్ పూర్తిగా Zero అవుతుందా? డయాబెటిస్‌ను పూర్తిగా నయం చేయగలమా? Type 1 Diabetes, Type 2 Diabetes మధ్య తేడా ఏమిటి? శరీరంలో Insulin Resistance ఎలా ఏర్పడుతుంది? డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు అవసరం? వంటి సాధారణ సందేహాలకు ఈ వీడియోలో వివరణ లభిస్తుంది. డయాబెటిస్‌లో షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా పర్యవేక్షణ, శారీరక చురుకుదనం వంటి అంశాల ప్రాధాన్యతను కూడా తెలుసుకోవచ్చు. దీర్ఘకాలంగా షుగర్ నియంత్రణలో లేకపోతే శరీరంపై ఎలాంటి ప్రభావాలు ఉండవచ్చు? కండరాల బలం ఎందుకు తగ్గుతుంది? బలహీనత, లైంగిక సమస్యలు వంటి ఇబ్బందులకు డయాబెటిస్‌తో సంబంధం ఉందా? అనే విషయాలను కూడా డాక్టర్ వివరిస్తారు. ఇక తల తిరగడం లేదా Vertigo విషయానికి వస్తే ప్రతి తల తిరుగుడూ ఒకే కారణంతో ఉండదు. Vertigoలో వివిధ రకాలు ఉంటాయి. ముఖ్యంగా తల లేదా శరీరాన్ని ఒక పొజిషన్ నుంచి మరో పొజిషన్‌కు మార్చినప్పుడు అకస్మాత్తుగా తల తిరిగినట్లు అనిపించే BPPV (Benign Paroxysmal Positional Vertigo) గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అలాగే చెవికి సంబంధించిన సమస్యలు, Aural Vertigo, మెడకు సంబంధించిన Cervical Spondylosis, శరీర స్థితి (Posture) వంటి కారణాల వల్ల కూడా తల తిరగడం లేదా బ్యాలెన్స్ సమస్యలు రావచ్చని వివరిస్తున్నారు. తల తిరుగుతున్నప్పుడు అసలు కారణాన్ని గుర్తించడం ఎందుకు ముఖ్యమో, ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలో కూడా ఈ వీడియో ద్వారా అర్థం చేసుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షుగర్‌ను క్రమం తప్పకుండా ఎలా మానిటర్ చేయాలి? శరీరంలో బలహీనత, కండరాల నష్టం రాకుండా ఎలాంటి జీవనశైలి పాటించాలి? Vertigo ఉన్నప్పుడు చెవుల ఆరోగ్యం, శరీర భంగిమ, రోజువారీ అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి ఉపయోగకరమైన అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. అదేవిధంగా Homeopathy Approach గురించి కూడా ఈ వీడియోలో ప్రస్తావించారు. అయితే డయాబెటిస్ లేదా Vertigo వంటి సమస్యలకు స్వయంగా మందులు తీసుకోవడం లేదా ఇప్పటికే వాడుతున్న వైద్య చికిత్సను ఆపడం కాకుండా, అర్హత కలిగిన వైద్యుడి సలహాతోనే చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. షుగర్ కంట్రోల్, డయాబెటిస్‌లో వచ్చే సమస్యలు, తల తిరగడానికి కారణాలు, Vertigo రకాలు, BPPV, చెవి సమస్యలు, Cervical Spondylosis, ఆహారం మరియు రోజువారీ ఆరోగ్య జాగ్రత్తల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: ఈ వీడియోలో అందించిన సమాచారం అవగాహన కోసం మాత్రమే. డయాబెటిస్, Vertigo లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు వ్యక్తిగత చికిత్సను వైద్యుల సలహా లేకుండా మార్చకండి లేదా మందులను నిలిపివేయకండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
ఉదయాన్నే  పరగడుపున టీ లేదా కాఫీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. రోజును చురుగ్గా ప్రారంభించడానికి కాఫీ, టీ లు తాగుతూ ఉంటారు.  అయినప్పటికీ ఇవి శరీరంలో  అసిడిటీ, హార్మోన్ల అసమతుల్యత , ఇతర జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. వీటి స్థానంలో శరీరాన్ని చురుగ్గా ఉంచుతూనే శరీరంలో ఉన్న అనారోగ్యాలను, జబ్బులను, ఇబ్బందులను తగ్గించగల పానీయం తాగడం చాలా మంచిది.  ఈ పానీయాన్ని తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు తొలగిపోవడమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంతకీ అంత శక్తివంతమైన ఆ పానీయం ఏమిటో? దాన్ని ఎలా తయారుచేసుకుని తాగాలో.. వివరంగా తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. ధనియాలు,  జీలకర్ర,  సోంపు ,  వాము  పైన పేర్కొన్న దినుసులలో ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ​తయారీ విధానం... ఈ పానీయాన్ని తయారు చేయడం చాలా సులభం. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాసు నీటిని తీసుకుని మరిగించాలి. అందులో అర టీస్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ సోంపు , పావు టీస్పూన్ వాము వేయాలి. ఈ మిశ్రమాన్ని నీరు సగం అయ్యేంత వరకు చిన్న మంటపై బాగా మరిగించాలి. నీరు బాగా మరిగిన తర్వాత వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. రుచి కోసం లేదా అదనపు ఆరోగ్య ప్రయోజనాల కోసం కాస్త నిమ్మరసం లేదా తేనె కూడా కలపవచ్చు. ఈ పానీయం తాగడం వల్ల శరీరానికి కలిగే  ఉపయోగాలు.. ​హార్మోన్ల సమతుల్యత.. మహిళల్లో ఎదురయ్యే థైరాయిడ్, పిసిఓడి , పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం  వంటి సమస్యలకు ఈ పానీయం చాలా మేలు చేస్తుంది. ధనియాలు , సోంపు శరీరంలో హార్మోన్ల ఉత్పత్తిని క్రమబద్ధీకరించడానికి తోడ్పడతాయి. ​జీర్ణవ్యవస్థ మెరుగుదల.. జీలకర్ర , వాము జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ , మలబద్ధకం వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ​రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ.. టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారికి ఈ పానీయం సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గేందుకు సహాయం.. శరీరంలో ఉన్న కొవ్వును కరిగించడంలో జీలకర్ర , వాము కీలక పాత్ర పోషిస్తాయి. క్రమం తప్పకుండా ఈ పానీయం తాగడం ద్వారా శరీర మెటబాలిజం పెరిగి బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ​చర్మ సౌందర్యం , డిటాక్సిఫికేషన్.. శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఫలితంగా చర్మంపై మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం సహజంగా మెరుస్తుంది. ​కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం.. ఈ పదార్థాల్లో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు , వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. ​ఈ డిటాక్స్ డ్రింక్‌ను ప్రతిరోజూ ఉదయం పరగడుపున క్రమం తప్పకుండా తాగడం ద్వారా శరీరంలో సహజమైన మార్పులను గమనించవచ్చు. టీ, కాఫీలకు ప్రత్యామ్నాయంగా ఈ నేచురల్  పానీయాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా శరీరంలో చాలా మార్పులు గమనించవచ్చు.                       *రూపశ్రీ.
గొంతుకు, గడ్డానికి మధ్య భాగంలో , గడ్డానికి కింద చర్మం, కండర కణజాలం పెరిగి.. గొంతు, గడ్డం ఏకం అయినట్టు చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. దీన్ని డబుల్ చిన్ అని అంటారు. లావు పెరగడం వల్ల డబుల్ చిన్ వచ్చిందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే లావు ఎక్కువగా లేకపోయినా కొందరిలో డబుల్ చిన్ కనిపిస్తూ ఉంటుంది. అయితే   డబుల్ చిన్ కు,  థైరాయిడ్ సమస్యలకు మధ్య ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు ఉన్నాయని  వైద్యులు చెబుతున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. డబుల్ చిన్ ఎందుకు, ఎలా వస్తుంది? థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగ్గా లేనప్పుడు శరీర జీవక్రియ మందగిస్తుంది. ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్నవారిలో బరువు వేగంగా పెరగడం, శరీరంలో నీరు చేరడం లేదా వాపులు రావడం సాధారణం. దీని ప్రభావం ముఖం , మెడ భాగాలపై స్పష్టంగా కనిపిస్తుంది. మెడ కింద కొవ్వు చేరడం లేదా ముఖం ఉబ్బినట్లు అవ్వడం వల్ల డబుల్ చిన్ ఏర్పడుతుంది. అంతేకాకుండా థైరాయిడ్ సమస్య వల్ల మెడ ముందు భాగంలో ఉన్న గ్రంథి వాచి గాయిటర్ గా మారినప్పుడు కూడా గడ్డం కింద వాపు వచ్చి డబుల్ చిన్ లాగా కనిపించే అవకాశం ఉంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు డబుల్ చిన్ తగ్గించుకోవడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు , జీవనశైలి మార్పులు పాటించాలి..  థైరాయిడ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం.. థైరాయిడ్  లెవెల్స్ కంట్రోల్ లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. వైద్యుల సలహా మేరకు సరైన మోతాదులో థైరాయిడ్ మందులు క్రమం తప్పకుండా వాడాలి. శరీరంలో థైరాయిడ్ హార్మోన్లు సమతుల్యంగా ఉన్నప్పుడు జీవక్రియ వేగవంతమై, అదనపు బరువు , వాపు తగ్గుతాయి.  పోషకాహార నియమం..  ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక చక్కెర ఉన్న పదార్థాలు, మైదా , వేపుళ్లను పూర్తిగా తగ్గించాలి. పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు , తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. శరీరంలో సోడియం నిల్వలు ఎక్కువైతే నీరు చేరే అవకాశం ఉంది కాబట్టి ఉప్పు చాలా పరిమితంగా తినాలి. నీరు..  ప్రతిరోజూ తగినన్ని నీళ్లు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. నీరు బాగా తాగితే ముఖం , మెడ భాగంలో నీరు చేరడం తగ్గి వాపు తగ్గుతుంది.  వ్యాయామం.. కేవలం మెడ భాగంలోనే కాకుండా శరీరం మొత్తానికి సంబంధించిన వ్యాయామాలు చేయాలి. రోజూ క్రమం తప్పకుండా నడక, యోగా లేదా కార్డియో వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలోని క్యాలరీలు కరిగి బరువు తగ్గుతారు. దీనితో పాటు మెడ , గడ్డం కండరాలను బలోపేతం చేసే చిన్న చిన్న ముఖ వ్యాయామాలు చేయవచ్చు. ఈ ఫేస్ వ్యాయామాలు మెడ వద్ద ఉన్న చర్మాన్ని బిగుతుగా మార్చడానికి తోడ్పడతాయి.  నిద్ర , ఒత్తిడి..  రోజుకు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం. నిద్రలేమి , మానసిక ఒత్తిడి వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత పెరిగి బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం ప్రాణాయామం వంటివి పాటించాలి. పైన చెప్పుకున్న విధంగా థైరాయిడ్ కు సరైన వైద్యం పొందుతూ, ఆరోగ్యకరమైన ఆహారం , రోజువారీ వ్యాయామం అలవాటు చేసుకుంటే డబుల్ చిన్ సమస్య నుండి క్రమంగా బయట పడవచ్చు.                                                                                                                                     *రూపశ్రీ.