LATEST NEWS
చలికాలం రాగానే మనలో చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. కానీ అదే సమయంలో ఈ సీజన్ మోసుకొచ్చే చలిగాలులు, ఉష్ణోగ్రతలలో ఆకస్మిక మార్పులు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా కొద్దిపాటి అజాగ్రత్త వల్ల కూడా తీవ్రమైన జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు మరియు శ్వాసకోశ సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది.  చాలామంది చలికాలంలో రోజంతా తగినన్ని నీరు తాగడం మానేస్తుంటారు. వేసవిలాగా శరీరం దాహం సంకేతాలు ఇవ్వకపోవడం వల్ల హైడ్రేషన్‌ను నిర్లక్ష్యం చేయడం అనారోగ్యానికి మొదటి మెట్టు అవుతుంది. నిపుణుల ప్రకారం, ప్రతిరోజూ కనీసం 8 గ్లాసుల నీరు లేదా వెచ్చని సూప్‌లు, హెర్బల్ టీలు తీసుకోవడం ద్వారా గొంతు మరియు శ్వాస వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.  అలాగే చలిగాలుల నుంచి రక్షణ కోసం ఒకే రకమైన మందపాటి బట్టలు వేసుకోవడానికి బదులుగా, పలుచని పొరలుగా  దుస్తులు ధరించడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయం  సాయంత్రం వేళల్లో బయటికి వెళ్లేటప్పుడు ముక్కు, నోటికి కండువా లేదా మాస్క్ ధరించడం వల్ల నేరుగా చల్లటి గాలి ఊపిరితిత్తులోకి వెళ్లకుండా నివారించవచ్చు.  మరో ముఖ్యమైన పొరపాటు ఏమిటంటే, చలికి సోమరితనంతో ఉదయం వ్యాయామాలు లేదా నడకను పూర్తిగా మానేయడం. దీనివల్ల శరీరంలో రక్తప్రసరణ మందగించి మరింత చలిగా అనిపిస్తుంది. రోజూ కనీసం 30 నిమిషాల పాటు తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల జీవక్రియ వేగవంతమై రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా, సూర్యరశ్మిని పూర్తిగా నివారించడం వల్ల శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడి ఇమ్యూనిటీ పడిపోతుంది.        ఇది చదవండి:   హైదరాబాద్‌లో దారుణం..మదర్సాలో 11 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులు.! కాబట్టి రోజూ కొంత సమయం ఎండలో గడపడం చాలా ముఖ్యం. రాత్రిపూట సరైన నిద్ర లేకపోవడం, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా రోగనిరోధక శక్తి తగ్గి వైరస్‌లు సులభంగా దాడి చేస్తాయి. రాత్రి పడుకునే ముందు పసుపు పాలు లేదా అల్లం టీ తాగడం, చేతులను తరచుగా సబ్బుతో శుభ్రం చేసుకోవడం వంటి చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ శీతాకాలంలో ఎలాంటి అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగా, ఉత్సాహంగా జీవించవచ్చు.         [ winter health tips, cold and cough prevention, winter care precautions, boost immunity winter, healthy lifestyle winter, winter wellness tips ]  
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించాయి. మొత్తం 100 స్థానిక సంస్థలకు జరిగిన ఈ ఎన్నికల్లో అధికార కూటమి పార్టీలు ఘన విజయం సాధించగా, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరాభవాన్ని ఎదుర్కొంది. ఈ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాల్లో  చర్చకు దారితీశాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 13 కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు మరియు 10 నగర పంచాయతీ ఎన్నికల్లో కేవలం మూడు మునిసిపాలిటీలు, అనంతపురం కార్పొరేషన్ మాత్రమే వైసీపీ గెలుచుకుంది.  మిగిలిన అన్ని స్థానాలను కూటమి పార్టీలు కైవసం చేసుకున్నాయి.   అనంతపురం  కార్పొరేషన్ లో వైసీపీ గెలవడానికి కారణం కూటమి సర్దుపాట్లలో భాగంగా అనంతపురం మేయర్ స్థానం బీజేపీకి వెళ్లడం వల్లనే. అక్కడ బీజేపీకి కనీస ఓటు కూడా లేకపోవడం వల్లనే ఆ కార్పొరేషన్ లో వైసీపీ గెలుచుకోగలిగింది.   ఇవన్నీ పక్కన పెడితే.. ఈ ఎన్నికల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం కడప జిల్లాలోని పులివెందుల ఫలితాలు. 1978 నుంచి ఇప్పటివరకు ఏకపక్షంగా వైఎస్ కుటుంబ సభ్యుల చేతిలోనే ఉన్న పులివెందులలో ఈసారి మాత్రం జగన్ కుదేలైంది.   పులివెందుల మున్సిపాలిటీ చైర్‌పర్సన్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుచుకున్నారు. వైసీపీ తరఫున పోటీ చేసిన జగన్ బాబాయి వైఎస్ మనోహర్ రెడ్డి వార్డు సభ్యుడిగా గెలిచినప్పటికీ, మున్సిపాలిటీ పీఠం కూటమిపరం అయ్యింది. పులివెందుల చైర్ పర్సన్ గా పోటీ చేసిన జగన్ సొంత పిన్ని వైఎస్ ప్రమీలమ్మ ఓటమి పాలయ్యారు.  ఇది కూడా చదవండి: https://www.teluguone.com/news/content/ycp-candidates-drop-out-zptc-election-43-236378.html వైసీపీకి ఇది కేవలం ఎన్నికల ఓటమి మాత్రమే కాదు.  మానసికంగా,  సంస్థాగతంగా కూడా చాలా దెబ్బ. అలాగే జగన్ కు వ్యక్తిగతంగా ఇది ఘోర పరాభవం.  గతంలో 2012 13 కాలంలోనూ జగన్మోహన్ రెడ్డి కష్టకాలం ఎదుర్కొన్నప్పటికీ, అప్పట్లో ఆయనపై ప్రజల్లో బలమైన ఆశలు ఉండేవి. కానీ, అధికారంలో ఉండి పాలన సాగించిన తర్వాత ఎదురైన ఈ పరాజయం పూర్వపు పరిస్థితులకు పూర్తిగా భిన్నం అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   పార్టీలో  సంస్థాగత బలహీనతలు, క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను సమన్వయం చేయడంలో లోపాలు ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. కిందిస్థాయి నాయకత్వాన్ని నడిపించడంలో అధినేత వైఫల్యానికి ఇది నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు,  అధికార యంత్రాంగాన్ని కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేసిందనే విమర్శలు వైసీపీ నుంచి వస్తున్నాయి. అయినప్పటికీ,  2014 నుంచి 2019 వరకూ తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో పులివెందులలో జగన్ పట్టు ఇసుమంతైనాసడలలేదని గుర్తుచేసుకోవాలి. కాబట్టి అధికార దుర్వినియోగం కాదు, సంస్థాగత లోపాలు, జగన్ పైనా, జగన్ పార్టీపైనా ఉన్న వ్యతిరేకతే ప్రధాన కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   మునిసిపోల్స్ లో వైసీపీ ఘోర పరాజయం ఆ పార్టీ, ఆ పార్టీ అధినేత పొలిటికల్ జర్నీకి ఎండ్ కార్డ్ పడ్డట్టేనా అన్న ప్రశ్నలు కూడా పరిశీలకుల నుంచి వస్తున్నాయి. అయితే ఒక్క ఓటమి, లేదా రెండు ఓటములు ఒక పార్టీ, ఒక నాయకుడి పొలిటికల్ జర్నీకి ఎండ్ కార్డ్ పడినట్లనని చెప్పలేమని కూడా అంటున్నారు. 2014 ఎన్నికలలో ఓటమి తరువాత జగన్ పుంజుకుని 2019 ఎన్నికలలో ఘన విజయం సాధించిన సంగతిని గుర్తు చేస్తున్నారు.  ఇందుకు మరి కొందరు 2019  నుంచి ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న జగన్ తీరు ప్రజలకు పూర్తిగా అవగతమైంది కనుక ఆయన పాలనపై కొత్తగా జనం ఆశలు పెట్టుకునే అవకాశం ఉండదని అంటున్నారు. మొత్తం మీద పొలిటికల్ గా జగన్ కు ఆయన పార్టీకి మునిసిపోల్స్ పరాజయం ముందు ముందు రాజకీయంగా గడ్డుకాలమేనని చాటుతున్నాయని అంటున్నారు.  మీకు నచ్చవచ్చు: https://www.teluguone.com/news/content/ycp-candidates-drop-out-zptc-election-43-236378.html https://www.teluguone.com/news/content/chandrababu-naidu-parishad-elections-target-43-236376.html  [YCP Electoral Collapse in Municipolls, AP Local Body Elections,  Pulivendula,  Results, YS Bsaton, Telugu One] 
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ఓటింగ్ ప్రక్రియలో కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల వేళ రాజకీయ ప్రత్యర్థుల మధ్య ఘర్షణలు, దౌర్జన్యాలు ఒక్కసారిగా బరితెగించడం స్థానికంగా కలకలం సృష్టించింది. కూడేరు మండలం మరుట్లలోని పోలింగ్ కేంద్రంలో వైసీపీ శ్రేణులు తీవ్ర వీరంగం సృష్టించారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో కొందరు వ్యక్తులు కేంద్రంలోకి బలవంతంగా చొరబడి హడావుడి సృష్టించారు. పరిస్థితి చేయి దాటేలా వ్యవహరించి పోలింగ్ బూత్‌లో ఉన్న బ్యాలెట్ బాక్సును బయటకు లాక్కొచ్చారు. బయటకు తెచ్చిన ఆ బ్యాలెట్ బాక్సును రాళ్లతో బాది పూర్తిగా ధ్వంసం చేశారు. ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి సాగించిన ఈ దుశ్చర్యను అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు అడ్డుకునేందుకు గట్టి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైకి ఆ వర్గం దూసుకెళ్లి దాడికి పాల్పడింది. ఈ ఊహించని పరిణామంలో ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే తరహా హింసాత్మక ఘటనలు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ పునరావృతమయ్యాయి. బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లి పోలింగ్ కేంద్రం వెలుపల ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు. శెట్టూరు మండలం చిందర్లపల్లిలో ఏకంగా పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లి ఏజెంట్లపై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ వరుస దాడుల్లో గాయపడిన పలువురు కార్యకర్తలను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్ కేంద్రాలపై దాడులు, అధికారులపై భౌతిక దాడికి దిగడం ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన దాడిగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, వివిధ వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఎన్నికల సంఘం మరింత పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.     [ Anantapur Parishad Elections, YSRCP leaders attack police, Ballot box destroyed Anantapur,  Kudair mandal polling tension,  AP local body elections violence, MPTC ZPTC Polling, TDP Workers Attack, Parishad Elections, Parishad Elections, Telugu One, Telugu news ]  
ALSO ON TELUGUONE N E W S
నందమూరి బాలకృష్ణ అభిమానులకు మరోసారి రిలీజ్ డేట్ టెన్షన్ మొదలైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'దాదా' క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల కావాల్సి ఉంది. అయితే షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం, బాలయ్యకు గతంలో గాయం కావడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయనే ప్రచారం మొదలైంది. నిజానికి ఈ సినిమాను మొదట దసరా కానుకగా విడుదల చేయాలని భావించారు. కానీ కాకినాడ పోర్టులో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా బాలకృష్ణకు గాయమైంది. దీంతో ఆయన కొంతకాలం షూటింగ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. షూటింగ్ ఆలస్యం కావడంతో క్రిస్మస్‌కు వాయిదా వేశారు.  గాయం నుంచి కోలుకున్న తర్వాత బాలయ్య తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నారు. మైసూర్ షెడ్యూల్‌తో పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా కీలకమైన యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేశారు. అయితే కాకినాడలో చిత్రీకరించాల్సిన కొన్ని ఫైట్ సన్నివేశాలకు వర్షాలు, తుఫాను ఆటంకంగా మారినట్లు సమాచారం. ఇంకా బాలయ్య, కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో ఓ పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్, వీఎఫ్ఎక్స్ పనులు కూడా పూర్తి చేయాల్సి ఉంది. దీంతో డిసెంబర్ 24 నాటికి అన్ని పనులు పూర్తవుతాయా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఇది కూడా చదవండి: ‘దాదా’ ఫస్ట్ సింగిల్.. బాలయ్య ఫ్యాన్స్ కోసం తమన్ అదిరిపోయే ట్రీట్.! అయితే ఈ వాయిదా ప్రచారంపై తాజాగా చిత్ర బృందం స్పందించింది. 'దాదా' విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. డిసెంబర్ 24నే సినిమా థియేటర్లలోకి వస్తుందని ప్రకటించింది. అంతేకాదు.. ఫస్ట్ సింగిల్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు కూడా వెల్లడించింది. టీమ్ చేసిన ప్రకటనతో వాయిదా వార్తలకు ప్రస్తుతానికి తెరపడింది. 'వీరసింహారెడ్డి' తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో వస్తున్న సినిమా కావడంతో 'దాదా'పై మంచి అంచనాలున్నాయి. ఇందులో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మీకు నచ్చవచ్చు:  బాంబు పేల్చిన రెజీనా.. బాలీవుడ్‌లో సౌత్ హీరోయిన్లని ఇంత దారుణంగా చూస్తారా.?     బిగ్ సర్‌ప్రైజ్‌.. అప్పుడే ఓటీటీలోకి ‘జైలర్ 2’.!       [Dada Postponement Rumours, Balakrishna Dada Movie, NBK Dada Movie, Dada Release Date, Nandamuri Balakrishna, Gopichand Malineni, Kajal Aggarwal, Manchu Manoj, Telugu Film News]  
Victory Venkatesh and Nandamuri Kalyan Ram are currently shooting a high-voltage action sequence in Kazakhstan for their upcoming multi-starrer, January 12 Vidudala. Director Anil Ravipudi is planning a grand visual spectacle, using the breathtaking mountainous landscapes as the backdrop for this exciting schedule. Renowned stunt choreographer Real Satish is overseeing the action block, which features both lead actors in a specially designed episode. The combination of Venky and NKR in an elaborate action sequence is expected to be one of the major attractions of the film. Anil Ravipudi, known for designing entertaining commercial action episodes, is said to have planned some interesting moments around the dynamic between the two stars. Following the action schedule, the team will shoot a grand song featuring Venkatesh, Kalyan Ram and the female leads, Keerthy Suresh and Krithi Shetty. The combination promises an interesting visual treat on the big screen. Also Read: Regina Cassandra hits back at Radhika and Janhvi Produced by Sahu Garapati and presented by Archana, Suresh Babu and Zee Studios, the film is being mounted on a lavish scale. GV Prakash Kumar is composing the music. January 12 Vidudala is being positioned as a complete festive entertainer blending action, family emotions and commercial entertainment. The film is scheduled for a grand worldwide theatrical release on January 12 during Sankranti. Check Out: Ramayana Part-1 Movie Review                      Rajamouli remarks Ramayana as must watch Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Regina Cassandra has reacted to the ongoing debate surrounding Janhvi Kapoor's comments on the objectification of her character in Ram Charan's upcoming film Peddi and Radhika Apte's experience working in Telugu cinema. Speaking during the promotions of Mookuthi Amman 2, Regina urged actresses to take a stand when they feel uncomfortable with a character or a project's portrayal rather than raising concerns years after its release. Regina said actors have every right to walk out of a film if they disagree with its concept or the way their characters are presented. While she welcomed actresses speaking about their experiences, she expressed concern over comments that could create a North-South divide. "I have a problem when a North Indian actor speaks about South Indian cinema in a way that creates a North-South divide," she remarked. She also questioned Janhvi's approach to the issue, stating that actors should exercise their choice during production. Regina pointed out that filmmaking processes and script-sharing practices differ across industries, but maintained that performers should have the freedom to say no when they are uncomfortable. Interestingly, Regina brought up her own experience with Karan Johar's Dharma Productions, which backed Akshay Kumar's Kesari Chapter 2. Despite playing Akshay Kumar's wife, Parvathy Nair, in the film, she alleged that her name was excluded from the promotional campaign without any explanation. Also Read: Rajamouli remarks Ramayana as must watch Regina further revealed that a song featuring her throughout was released without tagging her or even informing her about it. Questioning the treatment, she said, "Janhvi Kapoor has spoken about being objectified in a Telugu film in Karan Johar's show. The same Karan Johar, whose Dharma Productions film I acted in, has decided not to promote me in Kesari 2. My name was dropped from the promotions without any explanation. They released a song featuring me but did not even tag me. What am I supposed to call this?" Her comments have added another dimension to the debate, bringing professional recognition and alleged regional bias into the conversation. While Regina insists that actresses should speak up and exercise their choices, she also believes that such discussions should not turn into a North-versus-South confrontation.   Please Check Out: Ramayana Part-1 Movie Review  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు గుడ్ న్యూస్. బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కాకా' నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఈ పాటను డిసెంబర్‌లో రిలీజ్ చేయనున్నట్లు సంగీత దర్శకుడు థమన్ తాజాగా వెల్లడించారు. అంతేకాదు.. ఆ సమయంలో చిరంజీవి అమెరికాలో ఉండబోతున్నారని చెప్పడంతో ఇప్పుడు ఈ అప్‌డేట్ ఆసక్తికరంగా మారింది. థమన్ చిరంజీవితో కలిసి సెట్స్ లో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం మొదలైంది. ఇంతకీ చిరంజీవి అమెరికాకు ఎందుకు వెళ్తున్నారు? ఫస్ట్ సాంగ్‌ను అక్కడే విడుదల చేయబోతున్నారా? అనే చర్చ జరుగుతోంది. 'వాల్తేరు వీరయ్య' తర్వాత చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో 'కాకా'పై మొదటి నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ అప్‌డేట్‌తో ప్రమోషన్స్ కూడా ఊపందుకోనున్నాయి. ఇక 'కాకా' సినిమాను వచ్చే ఏడాది జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. సినిమా వాయిదా పడుతుందని ఇటీవల ప్రచారం జరిగింది. చిత్ర బృందం మాత్రం ప్రకటించిన తేదీ ప్రకారమే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫస్ట్ సింగిల్ తో డిసెంబర్ నుంచి ప్రమోషన్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం.  ఇది కూడా చదవండి:  ‘దాదా’ ఫస్ట్ సింగిల్.. బాలయ్య ఫ్యాన్స్ కోసం తమన్ అదిరిపోయే ట్రీట్.! ఈ సినిమాలో చిరంజీవి కూతురిగా మలయాళ నటి అనస్వర రాజన్ నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తానికి డిసెంబర్‌లో రాబోతున్న ఫస్ట్ సింగిల్‌తో 'కాకా' ప్రమోషన్స్ జోరు అందుకోనున్నాయి. మరి చిరంజీవి అమెరికా పర్యటన వెనుక ప్రత్యేక కార్యక్రమం ఏదైనా ఉందా? కేవలం సాంగ్‌ లాంచ్ కోసమే వెళ్తున్నారా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మీకు నచ్చవచ్చు:  'ఇట్లు అర్జున' హీరో అనీష్ ఎవరు?.. నాగార్జున, ఎన్టీఆర్ సపోర్ట్ వెనుక అసలు కథ ఇదేనా.? గాడ్ ఆఫ్ వార్.. త్రివిక్రమ్, ఎన్టీఆర్‌కు అసలైన పరీక్ష.!       [Kaaka First Single Update,  Kaaka First Song, Chiranjeevi US Tour, Kaaka Movie, Chiranjeevi, Bobby Kolli, Anaswara Rajan, Thaman, Telugu Film News]  
SS Rajamouli, who has taken Indian Cinema to the global stage with Baahubali and RRR, has joined the growing list of admirers of Ramayana. Starring Ranbir Kapoor, Yash and Sai Pallavi, the Nitesh Tiwari directorial released today and is receiving appreciation for its visual grandeur and ambitious retelling of the Indian epic. Rajamouli watched the film and shared his thoughts on social media. He wrote, "#Ramayana… the sheer scale of the film and the visuals on the big screen are spectacular to watch. Ranbir as Rama, especially from the Vanavasam onwards, is serene yet magnificent." Continuing he stated, "Yash brings a menacing presence as Ravana, while Sai Pallavi is graceful as Sita. The pre-climax and climax… loved every bit of it. Congratulations @malhotra_namit @niteshtiwari22 and the entire team on bringing such an ambitious vision so beautifully to the screen." Produced by Namit Malhotra, Yash and DNEG, Ramayana is envisioned as a global cinematic presentation of India's greatest epic. Coming from a filmmaker whose own films have played a major role in taking Indian stories to international audiences, Rajamouli's appreciation is a significant recognition for the entire team. Also Read: Ramayana Part-1 Movie Review  With positive word of mouth and audiences appreciating its visual spectacle, Ramayana is expected to make a major impact at the global box office. The movie is set to create a box office tsunami as the appreciation is piling up further from corners.  Hans Zimmer and AR Rahman have scored for the film. While their soundtracks are not receiving anticipated appreciation, they did a splendid job in maintaining the mood, state audiences. Overall, audiences verdict for the film is positive and over the Diwali weekend, it could spring in many surprises.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
నటన అనేది ఎంత కష్టమైన ప్రక్రియనో తెలిసిందే. ఒక క్యారక్టర్ ద్వారా నటుడు తాను అనుకున్న భావజాలం మొత్తాన్ని పండించాలంటే నరం తెగినంత పని అవుతుంది. అలాంటిది పురాణ పురుషులైన రాముడు, రావణుడుగా కనిపించి మెప్పించాలంటే నటనతో పాటు రూపురేఖలు, నడవడిక దాకా ఇంచు కూడా తేడా రాకూడదు.  అందుకు నటనలో ఎంతో నిష్ణాతులై ఉండాలి. అందుకే నేటి యంగ్ హీరోలైన రణబీర్ కపూర్, యష్ రామాయణలో రాముడు,రావణుడిగా కనిపించేసరికి ఇద్దరు ఎలా పెర్ఫార్మ్ చేస్తారనే ఆసక్తి అభిమానులు, సినీ ప్రేమికుల్లో నెలకొని ఉంది.  మరి ఇద్దరిలో ఎవరు మెప్పించారో చూద్దాం   రాముడి క్యారక్టర్ కి కావాల్సిన ప్రశాంతత, అంతులేని దయ, శాంత స్వభావం, రాజసం వంటి సాత్విక లక్షణాలని రణ్‌బీర్ తన ముఖ కవళికల ద్వారా అత్యంత సహజంగా ఆవిష్కరించారు. అయోధ్య కాండలో తండ్రి దశరథుడు, కైకేయి సన్నివేశాల్లో రణ్‌బీర్ కపూర్ అభినయం ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా ఉందని, ఇది కేవలం నటన మాత్రమే కాకుండా ఒక దివ్యమైన అనుభూతిని ఇస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. యుద్ధ సన్నివేశాల్లో చూపిన పరాక్రమం సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.   మరోవైపు, లంకేశ్వరుడిగా నటిస్తూ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అదరగొట్టిన యశ్ ఈ చిత్రానికి మరో బలమైన మూలస్తంభంగా నిలిచారు. రావణాసురుడి పాత్రలో యశ్ చూపిన క్రూరత్వం, భయానకమైన స్వభావం, మరియు సరికొత్త పది తలల రూపం ప్రేక్షకులకు ఒక నూతన దృశ్య అనుభూతిని అందించాయి.   ఇది కూడా చదవండి: గత రామాయణ చిత్రాలకి, ఇప్పటి రామాయణకి ఉన్న తేడా ఇదే!  యశ్ ఎంట్రీ ఇచ్చిన మొదటి 45 నిమిషాల భాగం, అలాగే జటాయువుతో జరిగే భీకరమైన పోరాట సన్నివేశాలు ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యుత్తమ విజువల్స్ అని ఆడియన్స్ కొనియాడుతున్నారు. స్క్రీన్ మీద యశ్ కనిపించిన ప్రతీసారీ థియేటర్లలో ఈలలు, గోలలతో ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. రావణుడిగా అయన చేసిన అసుర ఎనర్జీ, బాడీ లాంగ్వేజ్ సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లాయి.     ఈ విధంగా ఇద్దరు దిగ్గజాలు తమ క్యారెక్టర్స్ లలో వంద శాతంన్యాయం చేస్తూ, ఎవరికివారే సరిసమానంగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేశారని సినీ విశ్లేషకులు, ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.రామాయణ టాక్ కూడా పాజిటివ్ గానే వస్తుండటంతో  థియేటర్స్ దగ్గర సందడి వాతావరణం నెలకొని ఉంది. సెల్యులాయిడ్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు కావడం పక్కా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మీకు నచ్చవచ్చు: Ramayana Movie Review Telugu: రామాయణం మూవీ రివ్యూ   [Ranbir Kapoor Ram vs Yash Ravana, Ramayana Movie Review Telugu, Ramayana Part 1 Movie Review Telugu, Ramayana Part 1 Review, Ranbir Kapoor Ramayana Movie Review, Tollywood, Tollywood News, Telugu Cinema, Telugu Cinema News]
రామాయణ.. భారతీయ ఇతిహాసంతో ముడిపడి ఉన్న అయోధ్య రాముడి జీవిత చరిత్ర.. అందుకే కళ అనేది పుట్టిన దగ్గరనుంచి ఆ 'రాముడి'పై ఎన్నో సినిమాలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ఆ కోవలోనే ఇప్పుడు రణబీర్, యష్, సాయి పల్లవి, నితీష్ తివారి రామాయణ సెల్యులాయిడ్ పై అడుగుపెట్టింది. మరి గత రామాయణ, ఇప్పటి రామాయణ  చిత్రాలకి మధ్య ఉన్న తేడాలేంటో చూద్దాం.  1971లో ఎన్టీఆర్ నటించిన 'సంపూర్ణ రామాయణం' మరియు 1961లో వచ్చిన 'సీతారామ కళ్యాణం' వంటి క్లాసిక్ చిత్రాలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. ఆ రోజుల్లో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం చాలా తక్కువ. గ్రాఫిక్స్ లేదా సీజీఐ (CGI) టెక్నాలజీ అసలే లేని ఆ రోజుల్లో, కేవలం 100% నటీనటుల సహజ సిద్ధమైన అభినయం, శక్తివంతమైన సంభాషణలు, ఘంటసాల గానం మరియు పౌరాణిక సంగీతం ద్వారానే ఆ సీన్లలో జీవం నింపారు. శోభన్ బాబు, ఎన్టీఆర్, కాంతారావు వంటి దిగ్గజ నటులు తమ పాత్రల్లో లీనమై నటించడంతో ప్రేక్షకులు థియేటర్లలో భక్తి పారవశ్యంతో నమస్కారాలు చేసేవారంటే ఆ సినిమాల ప్రాణం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.  కాలక్రమేణా చలనచిత్ర సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. నాటి రామాయణ చిత్రాలకి, నేటి ఆధునిక రామాయణ దృశ్యకావ్యాలకి ఉన్న ప్రధాన వ్యత్యాసం సాంకేతిక పరిజ్ఞానంలోనే స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకి  2011లో బాపు దర్శకత్వంలో వచ్చిన 'శ్రీరామరాజ్యం' చిత్రం నాటి భక్తి భావాన్ని,నేటి ఆధునిక విజువల్ క్వాలిటీని కలగలిపి 32 కోట్లతో తెరకెక్కింది. ఈ చిత్రం వందకిపైగా థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుని సుమారు 45 కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించి ఆధునిక యుగంలోనూ పౌరాణిక కథల దమ్ము ఏంటో నిరూపించింది. ఇక 2023లో భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'ఆదిపురుష్' చిత్రం నాటి రామాయణ నిర్మాణ శైలికి మరియు నేటి 3D మోషన్ క్యాప్చర్ టెక్నాలజీకి ఉన్న తేడాను ప్రపంచానికి చూపించింది. సుమారు 500 కోట్ల నుంచి రూ. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఏకంగా 60 శాతానికి పైగా విజువల్ ఎఫెక్ట్స్ మరియు VFX సీన్లు ఉపయోగించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మొదటి వారంలోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 450 కోట్లు సాధించినప్పటికీ, పాత సినిమాల్లో ఉన్న నాటి భావోద్వేగాలు నేటి ఆధునిక విజువల్ టెక్నాలజీలో లోపించాయని మెజారిటీ ప్రేక్షకుల నుండి విమర్శలు వచ్చాయి. ఇది కూడా చదవండి:  Ramayana: రామాయణం హైలెట్స్ ఇవే.. పబ్లిక్ టాక్ పరిస్థితి అయితే ఇదే!    ఈ రోజు విడుదలైన 'రామాయణ' పార్ట్ 1  విజువల్స్ పరంగాను, కంటెంట్ పరంగాను, భావోద్వేగాలు పండించంలోను  అద్భుతంగా తెరకెక్కిందనే మాటలు వినిపిస్తున్నాయి  . అస్కార్ పురస్కారాలు పొందిన హాలీవుడ్ VFX సంస్థ డిఎన్‌ఈజి (DNEG) ఈ ప్రాజెక్ట్ కోసం 1000 మందికి పైగా డిజిటల్ ఆర్టిస్టులతో వర్క్ చేసింది. ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లేతో గ్లోబల్ ఆడియెన్స్ ని కూడా  టార్గెట్ చేసింది. మరి ముఖ్యంగా ప్రీవియస్ రామాయణ చిత్రాల్లో రావణుడి తల్లి, అతని యవ్వనం, లక్ష్య సాధన వైపు మళ్లడం అనేది చూపించలేదు. కానీ ఇప్పుడు రామాయణలో చూపించారు. రాముడు, సీతాదేవి క్యారక్టర్ డిజైన్ కూడా కొత్తగా ఉంది. పైగా త్రేతా యుగంలో రాముడు, సీతాదేవి అలాగే ఉండేవారు అనేలా కూడా అనిపిస్తుంది. ఫైనల్ గా  రామాయణంలోని మూల భావోద్వేగం, ధర్మ మార్గం అభిమానులు, ప్రేక్షకులు, రామ భక్తులు మనసులని తాకిందనే మాటలు సోషల్ మీడియా వేదికగా రామాయణ చూసిన వాళ్ళు చెప్తున్నారు.     [Ramayana Movies Evolution Telugu Cinema, Ramayana Movie highlights, Ramayana Movie Review Telugu, Ramayana Part 1 Movie Review Telugu, Ramayana Part 1 Review, Tollywood News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News]  
అభిమానులు, ప్రేక్షకులు సుదీర్ఘ కాలం నుంచి ఎదురుచూస్తున్న రాముని దివ్యచరితం  రామాయణ ఈ రోజు సెల్యులాయిడ్ పై సాక్షాత్కృతమైంది. మూవీ చూసిన ప్రేక్షకులైతే ఆ రాముడే నేటి తరం కోసం మళ్ళీ రామాయణ తెరకెక్కించేలా మేకర్స్ ని పురికొల్పాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా పలు హైలెట్స్  గురించి చెప్తున్నారు. మరి ఆ హైలెట్స్ ఏంటో చూద్దాం. 1 .విష్ణువుని అంతం చేయాలనుకునే కైకసి జీవిత లక్ష్యం  2 . దశానన, రావణుడుగా మారే టోటల్ ఎపిసోడ్  3 . రాముడి ఇంట్రడక్షన్ ఎపిసోడ్   4 . రాముడు, సీతాదేవి మధ్య వచ్చిన సీన్స్   5 . టోటల్ ఫస్ట్ హాఫ్  6 . జటాయువు తో వచ్చిన సీన్స్  7 . పరశురాముడు కనిపించడం  8 .మూవీ మొత్తం మెస్మరైజ్ చేసిన విజువల్ ఎఫెక్ట్స్  9 .బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫొటోగ్రఫీ, నటీనటుల పెర్ఫారెన్స్   10 . కథని బోర్ కొట్టకుండా చెప్పిన దర్శకత్వం   ఇది కూడా చదవండి: Ramayana Movie Review Telugu: రామాయణం మూవీ రివ్యూ      ఇలా పలు హైలెట్స్ ని మూవీ చూసిన ప్రేక్షకులు చెప్తున్నారు. ఇండియా వైడ్ గా మెజారిటీ రివ్యూస్ కూడా పాజిటివ్ గా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామాయణ సృష్టించబోయే కలెక్షన్ల సునామి ఏ రేంజ్ లో ఉంటుందో అని అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.   [Ramayana Movie highlights, Ramayana Movie Review Telugu, Ramayana Part 1 Movie Review Telugu, Ramayana Part 1 Review, Ranbir Kapoor Ramayana Movie Review, Nitesh Tiwari Ramayana Movie , Tollywood, Tollywood News, TeluguCinema, Telugu Cinema News]      
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
మన ఆరోగ్యవంతమైన జీవనానికి ప్రకృతి మనకు అందించిన ఎన్నో రకాల తృధాన్యాలు మరియు పోషక విలువలతో కూడిన పదార్థాలు ఎంతో దోహదపడతాయి. అలాంటి వాటిలో మినుములు లేదా మినప్పప్పు మన తెలుగు వంటకాల్లో ప్రముఖ స్థానం సంపాదించుకున్నాయి. 'మినుములు తింటే ఇనుమంత బలం వస్తుంది' అనే నానుడి మన పెద్దల కాలం నుంచి ఎంతో ప్రాచుర్యంలో ఉంది. ఈ నానుడి కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఆధునిక ఆరోగ్య నిపుణులు మరియు వైద్యులు కూడా మినుములలోని అపారమైన పోషక విలువలను పూర్తిగా సమర్థిస్తున్నారు. వీటిని క్రమం తప్పకుండా మన డైట్‌లో భాగం చేసుకోవడం ద్వారా శరీర రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుందని, తద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి రక్షణ లభిస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మినుములలో శరీరానికి అత్యవసరమైన అనేక పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా నిరుపమానంగా లభిస్తాయి. ముఖ్యంగా వీటిలో అధిక మొత్తంలో ప్రోటీన్లు, ఫైబర్ లేదా పీచు పదార్థం, కాల్షియం, భాస్వరం (ఫాస్ఫరస్), ఐరన్, పొటాషియం, బి-కాంప్లెక్స్ విటమిన్లు, విటమిన్-సి మరియు ఆరోగ్యకరమైన మంచి కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ కలిసి మన నాడీ వ్యవస్థను, జీవక్రియలను అత్యంత సక్రమంగా మరియు ఆరోగ్యకరంగా నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఉదయం చేసే అల్పాహారంలో లేదా మధ్యాహ్న భోజనంలో మినుములతో తయారు చేసిన వంటకాలను తీసుకోవడం వల్ల శరీరం రోజంతా శక్తివంతంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో మినుములు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో లభించే పీచు పదార్థం (ఫైబర్) జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మలబద్ధకం, ఉబ్బసం వంటి అసౌకర్యాలను నివారించడంలో మినుములు ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా, మధుమేహం మరియు రక్తహీనత వంటి దీర్ఘకాలిక సమస్యలకు ఇది ఒక చక్కటి పరిష్కార మార్గం. మినుములోని పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడమే కాకుండా, ఇన్సులిన్ మరియు గ్లూకోజ్ స్థాయులను క్రమబద్ధీకరించి షుగర్ వ్యాధి ముప్పును సమర్థవంతంగా అడ్డుకుంటాయి. అలాగే శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనతను నివారిస్తాయి. ఎముకల దృఢత్వానికి మినుములు ఒక పవర్‌ఫుల్ సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. వీటిలో కాల్షియం, భాస్వరం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు అత్యధికంగా ఉంటాయి. ఈ ఖనిజాలు ఎముకలను బలంగా, పటిష్టంగా ఉంచడానికి అత్యంత కీలకం. ముఖ్యంగా ఎముకలు విరిగినవారు, ఆర్థరైటిస్, కీళ్లవాతం మరియు కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నవారు తమ దైనందిన ఆహారంలో మినుములను కచ్చితంగా చేర్చుకోవడం ద్వారా ఊహించని ప్రయోజనాలను పొందవచ్చు. కండరాలకు మరియు నరాలకు కూడా ఇది అసాధారణమైన బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన మరియు బలమైన శరీరం కోసం ఈ అద్భుతమైన ధాన్యాన్ని మీ డైట్‌లో భాగం చేసుకోండి.     Black Gram Health Benefits, Urad Dal Medicinal Uses, Joint Pain Natural Remedy, Asthma Relief Food Tips, Minumulu Health Uses, Traditional Nutrition Advice, Health Tips In Telugu.  
ఈ రోజుల్లో చాలామందిని వేధించే అత్యంత సాధారణ సమస్యల్లో వెన్ను నొప్పి లేదా నడుము నొప్పి ఒకటి. గంటల తరబడి కుర్చీలో లేవకుండా కూర్చోవడం, ఫోన్‌ చూస్తూ ముందుకు వంగడం వంటి ఆధునిక జీవనశైలి అలవాట్లు మన వెన్నెముకపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తున్నాయి. దీనివల్ల నడుము నొప్పి, వీపులో అసౌకర్యం, కండరాల బిగుతు వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే, మన దినచర్యలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ నొప్పుల బారి నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు. వెన్నెముకను ఆరోగ్యంగా, ఉక్కులా దృఢంగా మార్చుకోవడానికి నిపుణులు సూచిస్తున్న ఆ ముఖ్యమైన 5 అలవాట్లను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది కండరాలకు తగిన పని చెప్పడం. వెన్నెముక సురక్షితంగా ఉండాలంటే దానికి పునాదిగా ఉండే వీపు, నడుము మరియు కోర్ (పొట్ట) కండరాలు బలంగా ఉండాలి. అందుకోసం వారానికి కనీసం 2 లేదా 3 రోజులు ఈ కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయాలి. అయితే మొదటి రోజే కఠినమైన వర్కౌట్లు చేయకుండా, మీ శరీర సామర్థ్యాన్ని బట్టి నెమ్మదిగా మొదలుపెట్టి క్రమంగా తీవ్రతను పెంచడం మంచిది. కేవలం వ్యాయామమే కాకుండా, మనం తీసుకునే పోషకాహారం కూడా వెన్నెముక ఆరోగ్యాన్ని శాసిస్తుంది. రోజూ పాలు, పెరుగు, పన్నీర్ వంటి కాల్షియం పదార్థాలు ఎముకలకు బలాన్ని ఇస్తే.. కోడిగుడ్లు, పప్పు ధాన్యాలు, చేపలు వంటివి కండరాలకు కావాల్సిన ప్రొటీన్‌ను అందిస్తాయి. ఈ సమతుల్య ఆహారం వెన్నెముకకు శ్రీరామరక్ష లాంటిది. ఆఫీసు పనిలో పడి గంటల తరబడి ఒకే భంగిమలో కూర్చునే అలవాటును మార్చుకోవాలి. ప్రతి అరగంటకోసారి సీట్లోంచి లేచి రెండు నిమిషాలు అటూ ఇటూ నడవడం లేదా తేలికపాటి స్ట్రెచింగ్ చేయడం చాలా ముఖ్యం. శరీరానికి ఎప్పటికప్పుడు కదలిక ఇవ్వడమే అత్యుత్తమమైన భంగిమ అని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మన శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడానికి నడకను మించిన సులభమైన మార్గం మరొకటి లేదు. ప్రతిరోజూ కనీసం 8,000 అడుగులు నడవాలని లక్ష్యంగా పెట్టుకుంటే గుండె ఆరోగ్యంతో పాటు బరువు కూడా అదుపులో ఉంటుంది. నడిచే అలవాటు లేనివారు కొద్ది దూరంతో ప్రారంభించి నెమ్మదిగా అడుగుల సంఖ్యను పెంచుకోవాలి. చివరిది మరియు అత్యంత ముఖ్యమైనది బరువుపై పూర్తి నియంత్రణ కలిగి ఉండటం. శరీర బరువు పరిమితి దాటితే ఆ అదనపు భారం మొత్తం నేరుగా వెన్నెముకపైనే పడుతుంది. కాబట్టి సరైన వ్యాయామం, ఆహార నియమాలతో బరువును అదుపులో ఉంచుకోవాలి. అలాగే బరువైన వస్తువులను పైకి ఎత్తేటప్పుడు ఎప్పుడూ నడుమును వంచకూడదు. దానికి బదులుగా మోకాళ్లు, తుంటిని మడిచి వస్తువును శరీరానికి దగ్గరగా పట్టుకుని పైకి లేవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ చిన్న జీవనశైలి మార్పులతో వెన్నునొప్పికి దూరంగా ఉండవచ్చు.     Lower Back Pain Relief, Strong Spine Habits, Cure Backache Naturally, Posture Correction Tips, Spine Health Exercises, Daily Habits For Back Pain, Health Tips In Telugu.
మనలో చాలా మందికి పాఠశాల రోజుల నుంచే ఒక ప్రాథమిక వైద్య సత్యం గుర్తిండిపోయింది. ఆరోగ్యంగా ఉన్న ఏ మనిషి శరీర ఉష్ణోగ్రత అయినా సరే సాధారణంగా 98.6 డిగ్రీల ఫారెన్‌హీట్ (37 డిగ్రీల సెల్సియస్) ఉండాలని మనం నమ్ముతూ వస్తున్నాము. ఎవరికైనా జ్వరం ఉందా లేదా అని నిర్ధారించుకోవడానికి దశాబ్దాలుగా ఈ కొలతనే మనం ప్రామాణికంగా ఉపయోగిస్తున్నాము. అయితే, ప్రసిద్ధ స్టాన్‌ఫోర్డ్ మెడిసిన్ పరిశోధకులు నిర్వహించిన ఒక తాజా మరియు అత్యంత విస్తృతమైన అధ్యయనం ఈ నమ్మకాన్ని పూర్తిగా తలకిందులు చేసింది. ఆధునిక కాలంలో మనుషుల సగటు శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతోందని, అలాగే 98.6 డిగ్రీల ఫారెన్‌హీట్ అనేది నేటి కాలానికి కొద్దిగా ఎక్కువేనని ఈ పరిశోధన తేల్చిచెప్పింది. నేడు సగటు మనిషి శరీర ఉష్ణోగ్రత దాదాపు 97.9 డిగ్రీల ఫారెన్‌హీట్ లేదా అంతకంటే తక్కువగా ఉంటోందని నిపుణులు వెల్లడించారు. ఈ అద్భుతమైన పరిశోధన వివరాలు వైద్య రంగంలో సరికొత్త చర్చకు దారితీశాయి. ఈ విప్లవాత్మక అధ్యయనం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే, 19వ శతాబ్దంలో అనగా 1868లో ఒక జర్మన్ వైద్యుడు కార్ల్ వండర్‌లిచ్ సుమారు 25,000 మంది రోగుల ఉష్ణోగ్రతలను సేకరించి 98.6 డిగ్రీల ఫారెన్‌హీట్‌ను సగటు ప్రమాణంగా నిర్ణయించారు. కానీ కాలం మారుతున్న కొద్దీ మానవ శరీర నిర్మాణంలో మరియు జీవన విధానంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. స్టాన్‌ఫోర్డ్ పరిశోధకులు 19వ శతాబ్దం నుంచి నేటి వరకు సుమారు 6,77,000 మందికి పైగా వ్యక్తుల నుంచి సేకరించిన భారీ డేటాను విశ్లేషించారు. దీని ప్రకారం, పాత కాలంతో పోలిస్తే ఆధునిక కాలంలో మనుషుల శరీర ఉష్ణోగ్రత ప్రతి దశాబ్దానికి సుమారు 0.05 డిగ్రీల ఫారెన్‌హీట్ చొప్పున క్రమంగా తగ్గుతూ వస్తోందని తేలింది. 2000వ దశకంలో పురుషులలో శరీర ఉష్ణోగ్రత ప్రారంభ 1800ల నాటి పురుషులతో పోలిస్తే సగటున 1.06 డిగ్రీల ఫారెన్‌హీట్ తక్కువగా నమోదైంది. అదేవిధంగా, మహిళల్లో కూడా దాదాపు 0.58 డిగ్రీల ఫారెన్‌హీట్ మేర ఉష్ణోగ్రత తగ్గుదల కనిపించింది. మానవ శరీర ఉష్ణోగ్రత తగ్గడానికి గల ప్రధాన కారణాలపై వైద్య నిపుణులు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. గత రెండు వందల సంవత్సరాలలో మన జీవన ప్రమాణాలు మెరుగుపడటం, పబ్లిక్ హెల్త్ సదుపాయాలు అందుబాటులోకి రావడం, మరియు శరీరంలో దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్ (మంట లేదా వాపులు) తగ్గుముఖం పట్టడం ఇందుకు ముఖ్య కారణాలుగా పరిశోధకులు భావిస్తున్నారు. పాతకాలంలో క్షయ వంటి దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్లు సర్వసాధారణంగా ఉండటం వల్ల ప్రజల శరీర ఉష్ణోగ్రతలు తరచుగా ఎక్కువగా నమోదయ్యేవి. ఆధునిక వైద్యం, మెరుగైన ఆహారపు అలవాట్లు మరియు పరిశుభ్రమైన వాతావరణం కారణంగా మన శరీరాలు అంతర్గతంగా ప్రశాంతంగా ఉంటూ, జీవక్రియలో వచ్చే మార్పుల వల్ల చల్లబడుతున్నాయి. అంతేకాకుండా, శరీర ఉష్ణోగ్రత అనేది అందరికీ ఒకేలా ఉండదని, ఇది ప్రతి ఒక్కరి వయస్సు, లింగం, బరువు, ఎత్తు మరియు రోజు జరిగే సమయాన్ని బట్టి మారుతుంటుందని స్టాన్‌ఫోర్డ్ నిపుణులు స్పష్టం చేశారు. ఉదాహరణకు, ఉదయం పూట ఉండే ఉష్ణోగ్రత కంటే మధ్యాహ్నం మరియు సాయంత్రం వేళల్లో శరీర ఉష్ణోగ్రత కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అలాగే వృద్ధులతో పోలిస్తే యువతలో, పురుషులతో పోలిస్తే మహిళల్లో ఉష్ణోగ్రతలు కొద్దిగా భిన్నంగా నమోదువుతాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ ఒకే నిర్దిష్టమైన సాధారణ ఉష్ణోగ్రతను ఆపాదించడం సరికాదని, ప్రతి మనిషికి వారి సొంత సహజ ఉష్ణోగ్రత వేర్వేరుగా ఉంటుందని ఈ అధ్యయనం హెచ్చరిస్తోంది. సాధారణ జ్వరం గురించి మాట్లాడితే, వయోజనులలో కనీసం 100.4 డిగ్రీల ఫారెన్‌హీట్ లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటేనే దానిని వైద్యపరంగా జ్వరంగా పరిగణించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత శరీర ఉష్ణోగ్రతలలోని హెచ్చుతగ్గులను ముందుగానే పసిగట్టగలిగితే భవిష్యత్తులో వ్యాధులను ముందస్తుగా గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం సులువవుతుందని స్టాన్‌ఫోర్డ్ పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.     Human Body Temperature 98.6, Stanford University Health Study, Normal Temperature Facts, Medical Science Discoveries, Average Body Heat Changes, Health Facts In Telugu, Science Articles.
మలబద్ధకం సమస్యతో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. సరిగ్గా మలవిసర్జన కాకపోవడం, మలం గట్టిగా రావడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రోజువారీ జీవితాన్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. ఇలాంటి సమస్యలకు సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు ఎంతో ఉపయోగపడతాయి. ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ మలబద్ధకం సమస్యకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను వివరించారు. వాము, బెల్లం, కరక్కాయ పెచ్చుల వంటి సహజ పదార్థాల ఉపయోగాలు, జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వాటి పాత్ర గురించి తెలియజేశారు. మలబద్ధకం సమస్యకు కారణాలు ఏమిటి? పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? మలవిసర్జన సాఫీగా జరిగేందుకు ఎలాంటి ఆహారపు అలవాట్లు పాటించాలి? వాము, బెల్లం, కరక్కాయలను ఎలా ఉపయోగించాలి? మలబద్ధకం సమస్యను తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సహజమైన పద్ధతులతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది. మలబద్ధకం సమస్య తరచూ వేధిస్తున్నా, తీవ్రమైన కడుపునొప్పి లేదా మలంలో రక్తం కనిపించినా వైద్యులను సంప్రదించడం అవసరం. మలబద్ధకం సమస్యకు ఆయుర్వేదంలో సూచించే సహజ పరిష్కారాలు, వాము, బెల్లం, కరక్కాయ పెచ్చుల ఉపయోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
నేటి కాలంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ లు, కంప్యూటర్లు మన దైనందిన జీవితంలో ప్రధాన భాగమైపోయాయి. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు స్క్రీన్ వైపు చూడటం చాలా మందికి అలవాటుగా మారిపోయింది. సోషల్ మీడియా వాడకం, ఆఫీస్ పని లేదా వినోదం కోసం గంటల తరబడి డివైజ్‌ల ముందే గడపడం సర్వసాధారణం అయింది. ఈ నేపథ్యంలో స్క్రీన్ టైమ్ ఎక్కువైతే దుష్పభావాలు ఉంటాయని వైద్యులు కూడా చెబుతున్నారు. అయితే తాజాగా..  ఈ విషయం గురించి  వైద్య నిపుణులు , పరిశోధకులు చెబుతున్న విస్తుపోయే నిజాలేంటో వివరంగా తెలుసుకుంటే.. నిపుణుల అభిప్రాయం ప్రకారం కేవలం స్క్రీన్ ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల నేరుగా పక్షవాతం వస్తుందని చెప్పలేము. అయితే ఎక్కువ సమయం స్క్రీన్ చూస్తూ గడపడం అనేది ఒక రకమైన నిశ్చల జీవన శైలితో ముడిపడి ఉంటుంది. ఈ విధంగా శారీరక శ్రమ లేకుండా రోజంతా ఒకే చోట కూర్చునే అలవాటు వల్ల క్రమంగా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా బరువు పెరగడం, హై బ్లడ్ ప్రెషర్, మధుమేహం , చెడు కొలెస్ట్రాల్  వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ కూడా పక్షవాతం ముప్పును పెంచే ప్రధాన కారణాలలో ముఖ్యమైనవిగా వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అమెరికన్ స్ట్రోక్  అసోసియేషన్  కు చెందిన జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం అరవై  సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న వారు రోజులో కనీసం ఎనిమిది గంటల పాటు శారీరక శ్రమ లేకుండా కేవలం కూర్చునే పనులలో  గడిపితే, వారిలో పక్షవాతం వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందని తేలింది. అయితే ఇది నేరుగా స్క్రీన్ వల్ల జరిగే నష్టం కాకపోయినా, ఎక్కువ సమయం కదలకుండా కూర్చునే స్వభావం వల్ల కలిగే దుష్పరిణామం అని పరిశోధకులు పేర్కొంటున్నారు. కాబట్టి స్క్రీన్ చూసే గంటలను మాత్రమే లెక్కగట్టి ప్రమాదాన్ని అంచనా వేయలేము. ఎందుకంటే రోజంతా కంప్యూటర్ ముందు పని చేసే వ్యక్తి క్రమం తప్పకుండా వ్యాయాయం చేస్తుంటే, అస్సలు శారీరక శ్రమ లేని వ్యక్తితో పోలిస్తే అతనిలో ప్రమాదం కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే రాత్రి సమయాల్లో ఎక్కువ సేపు మొబైల్ లేదా ల్యాప్టాప్ వాడటం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. నిద్రలేమి సమస్య ఏర్పడినప్పుడు అది రక్తపోటును , జీవక్రియలను నియంత్రించడం కష్టం చేస్తుంది. దీనివల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా హైపర్ టెన్షన్, డయాబెటిస్, ఊబకాయం , గుండె జబ్బులు ఉన్నవారు తమ ఆరోగ్యం పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అధిక రక్తపోటు అనేది పక్షవాతానికి దారితీసే అత్యంత ముఖ్యమైన కారకాల్లో ఒకటి కాబట్టి, బీపీని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. యువత కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పక్షవాతం కేవలం వృద్ధులలోనే వస్తుందని అనుకోవడం  పొరపాటు. మారుతున్న జీవన శైలి కారణంగా నేడు యువతలో కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. అయితే ఉద్యోగరీత్యా లేదా చదువురీత్యా ఎప్పుడూ స్క్రీన్ ముందు పనిచేయాల్సిన వారు పూర్తిగా డివైజ్ లను పక్కన పెట్టడం సాధ్యం కాదు. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. జాగ్రత్తలు.. రోజూ గంటల తరబడి ఒకే చోట కదలకుండా కూర్చోకుండా మధ్యమధ్యలో చిన్న బ్రేక్ లు  తీసుకోవడం మంచిది. కుర్చీలోంచి లేచి కొద్దిసేపు నడవడం, ఫోన్ మాట్లాడేటప్పుడు గదిలో తిరగడం, అలాగే రోజూవారీ జీవితంలో తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెద్దలు ప్రతి వారం కనీసం నూట యాభై నిమిషాల పాటు ఏదైనా వ్యాయామం లేదా నడక వంటి శారీరక కార్యకలాపాలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.  వీటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పొగత్రాగడం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం , ప్రశాంతమైన నిద్ర  చాలా అవసరం. గుర్తుంచుకోవాల్సిన విషయం.. కేవలం స్క్రీన్ టైమ్ తగ్గించడం వల్ల మాత్రమే పక్షవాతం రాకుండా నివారించలేము. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు వాటిని అదుపులో ఉంచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పక్షవాతం బారిన పడకుండా ఉండాలంటే శరీరానికి తగిన వ్యాయామం ఇస్తూ, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం ఎంతో ముఖ్యం. ఒకవేళ ఎవరికైనా ముఖం ఒకవైపు వంకరపోవడం, శరీరంలో అకస్మాత్తుగా బలహీనత రావడం, మాట తడబడటం, చూపు మందగించడం లేదా విపరీతమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.                                                                                                                                          *రూపశ్రీ*