Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...'మాయాబజార్' ఇండియాస్ గ్రేటెస్ట్ మూవీ
posted on: May 13, 2013 10:46AM

ఐబీఎన్ నిర్వహించిన లైవ్‌పోల్‌లో 'ఇండియాస్ గ్రేటెస్ట్ ఫిలిం ఎవర్' కిరీటం మన 'మాయాబజార్'కు దక్కింది. అక్షరాలా 16,960 ఓట్లతో (23.91%) సగర్వంగా అగ్రస్థానంలో నిలిచింది. ఇదే ఐబీఎన్ నిర్వహించిన గ్రేటెస్ట్ యాక్టర్స్ పోల్‌లో మన ఎన్టీఆర్, శ్రీదేవి నంబర్‌వన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గొప్ప చిత్రం కీర్తి కూడా తెలుగు సినిమాకే దక్కడం విశేషం. కాగా, ఈ పోల్‌లో.. రజనీకాంత్ సూపర్ హిట్ సినిమా చంద్రముఖికి మలయాళ మాతృక.. 'మణిచిత్ర తాళు' 15,017 ఓట్ల(21.17%)తో రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానం కూడా మలయాళ చిత్రానికే దక్కింది. ఆ సినిమా.. ఒరు వడక్కన్ వీరగాథ. 14,603 ఓట్ల(20.59%)తో ఆ సినిమా తృతీయస్థానంలో నిలిచింది. బెంగాలీలు గొప్పగా చెప్పుకొనే పథేర్ పాంచాలి (3902) నాలుగో స్థానంలో నిలవగా.. మణిరత్నం తీసిన నాయగన్ (3,854) ఐదో స్థానంతో సంతృప్తి చెందింది.


.jpg)
.jpg)


