భార్యకోసం కాంగ్రెస్‌లో కొనసాగుతున్న సబ్బం హరి

posted on: Aug 13, 2012 7:54AM

సబ్బం హరి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ నేత ! కాంగ్రెస్‌ పార్టీ ఎం.పీ.గా ఉంటూ ఎప్పుడూ సోనియా గాంధీని విమర్శిస్తూ విజయమ్మ, జగన్‌ క్షేమాన్ని కోరుకుంటుంటారు. జగన్‌ పార్టీ పెట్టిన వెంటనే చాలామంది నాయకుల మాదిరిగానే సబ్బం హరి కాంగ్రెస్‌కు బై చెబుతారని, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు కాని అదేమీ జరగలేదు. ఇప్పటికీ ఆయన టెక్నికల్‌గా కాంగ్రెస్‌ పార్టీ వ్యక్తిగానే కొనసాగుతున్నారు. అదేమంటే భార్యకు అనారోగ్యం కాబట్టి విదేశీ వైద్యానికి ఎంపిగా రాజనామా చేయకుండ వుంటేనే వెలుసుబాటుగా ఉంటుందంటారు. దీంతో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులంతా ఆయనపై గుర్రుగా ఉంటున్నారు. విహన్మంతరావు లాంటి సీనియర్లు కాంగ్రెస్‌ అధిష్టానికి అనేక మార్లు ఫిర్యాదులు కూడా చేశారు. అయినా ఫలితం శూన్యం. పిసిసి ప్రసిడెంట్‌ బొత్స సత్యన్నారాయణ సబ్బం మీద పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ప్రకటన చేస్తే తాను ఎంపినని తన మీద చర్యలు తీసుకోవడం కుదరదని చెప్పారు.

 

 

ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి ప్రమాణస్వీకారోత్సవంలో సుధాకర్‌రెడ్డి పార్టీలో కోవర్టులున్నారని పరోక్షంగా సబ్బం హరిని ఉద్దేశించే అన్నారు. సబ్బం హరి సామాన్యుడేమీ కాదు వైసిపి నాయకులతో ఎంత సన్నిహితంగా ఉంటున్నారో కాంగ్రెస్‌ వారితోనూ అంతే సాన్నిహిత్యాన్ని ప్రదర్శిస్తారు.లోక్‌సభలోనూ, లోక్‌ సభ ఆవరణలోనూ కాంగ్రెస్‌ ఎంపిలతో చలోక్తులు విసురుతూ కనిపిస్తుంటారు.సబ్బం హరి ఆడుతున్న ఈ ద్విపాత్రాభినయాన్ని ఎంత కాలం సహించాలని సీనియర్లు అధిష్టానంపై వత్తిడి పెంచుతున్నారని తెలుస్తుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...