Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బెంగుళూరులో దొరికిన నిత్య పెళ్ళి కూతురు
posted on: Sep 3, 2012 10:10AM
నిత్య పెళ్లి కూతురు షెహనాజ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ఆమెను బెంగళూరులో ఆదివారం చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. కేరళకు చెందిన షెహనాజ్ మాయమాటలతో చెన్నైలో కొందరు యువకులను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం, వారి నుంచి అందినంత డబ్బు, నగలు దోచుకుని అక్కడి నుంచి ఉడాయించింది. ఈ నేపథ్యంలో, బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు షెహనాజ్ కోసం గాలింపు చేపట్టారు. బెంగళూరులోని మెజిస్టిక్ బస్ స్టేషన్‌లో ఆమెను అరెస్టు చేశారు. కాగా, విలాసాల కోసమే తాను మోసాలకు పాల్పడినట్టు షెహనాజ్ తెలిపింది.


.jpg)



