Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బాబు యాత్రకి పోటిగా లగడపాటి కనువిప్పు యాత్ర
posted on: Jan 22, 2013 11:19AM
.jpg)
చంద్రబాబు పాదయాత్ర నేపథ్యంలో కృష్ణాజిల్లాలో లగడపాటి నడిపిన హైడ్రామా బాగా హైలెట్ అయ్యింది. చంద్రబాబు పాదయాత్రను అడ్డుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో లగడపాటిని పోలీసులు కృష్ణాజిల్లా అనుమంచిపల్లిలో అదుపులోకి తీసుకున్నారు.
ఆయన మీడియా తో మాట్లాడుతూ తాను ఇప్పటికే ‘కనువిప్పు’ కార్యక్రమాన్ని తాను ఇప్పటికే చేపట్టానని ప్రకటించారు. వేర్పాటువాదులకు వెన్నులో చలి పుట్టించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అరెస్ట్ లతో సమైక్య ఉద్యమం ఆగదని లగడపాటి స్పష్టం చేశారు. కనువిప్పు కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఆయన తెలిపారు.
బాబుకు కనువిప్పు కార్యక్రమం చేపట్టే విషయంలో మాత్రం లగడపాటి తగ్గలేదు. సీమాంధ్రలో బాబుకు పోటీగా యాత్ర చేయాలని ఆయన తలపెట్టారు. బాబు రూట్ మ్యాప్ ఆధారంగా పోటీ యాత్రకు లగడపాటి జిల్లాకు చెందిన కాంగ్రెసు నేతలతో సిద్ధమవుతున్నారు.
ఈ నెల 26 లేదా 27 తేదిన లగడపాటి కనువిప్పు యాత్ర ప్రారంభం కానుంది. సమైక్యాంధ్రపై బాబుకు కనువిప్పు కలిగించేందుకు తన ప్రయత్నాన్ని మానుకునేది లేదని చెప్పారు. సీమాంధ్రలో ఎక్కడో ఓ చోట ఆయనను కలుస్తానని చెప్పారు. తన రూట్ మ్యాపును బాబు వస్తున్నా మీకోసంకు సమానంగా ఉండటమే కాకుండా ఎక్కడో ఓ చోట ఆయన యాత్రలో కలిసేలా ఏర్పాటు చేస్తున్నారట. అయితే ఇందుకు పోలీసులు అనుమతిస్తారా అనేది ప్రశ్న. పోలీసులు అనుమతించక పోవచ్చునని అంటున్నారు.



.jpg)


