Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఫలించిన సోనియా స్ట్రాటజీ!
posted on: Aug 9, 2012 12:18PM
వర్షాకాలం సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే హడావుడి చేసి తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం గురించి రసాభాస చేసేందుకు ఆ ప్రాంత ఎంపీలు ప్రయత్నించారు. వారి ప్రయత్నాలను పసిగట్టిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తమకు తలనొప్పిగా ఉన్న బిజెపిని అదుపుచేసేందుకు తెలంగాణాప్రత్యేక రాష్ట్రం అంశాన్ని అస్త్రంగా ఉపయోగించారు. సభలో గొడవ చేసేందుకు లేచిన తెలంగాణా ఎంపీలను సోనియా పిలిచి తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలా? అయితే అద్వానీని అదుపు చేయండి అని ఆదేశించారు. హఠాత్తుగా కాంగ్రెస్ అధినేత్రి తమ ప్రధాన డిమాండు గురించి ఎత్తేసేటప్పటికి ఎంపీలు ఆశ్చర్యపోయారు. ఆ తరువాత వారు బిజెపి ఆవేశాన్ని తగ్గించేందుకు ప్రయత్నించారు.
వాస్తవానికి సోనియాగాంథీ తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం ఇస్తామని కానీ, ఇవ్వనని కానీ చెప్పలేదు. కేవలం సభలో గందరగోళం నివారించేందుకే తెలంగాణా ఎంపీలను ఆ ప్రత్యేకరాష్ట్రం పేరుతో అదుపు చేశారు. పైగా, తలనొప్పిగా ఉన్న బిజెపిని కూడా తెలంగాణా ఎంపిలపై ఆగ్రహం వ్యక్తం చేయటం ద్వారా అదుపు చేశారు. సోనియా రాజకీయచతురత అర్థం అయ్యేలోపే సభ పూర్తయిపోయింది. తెలంగాణా ఎంపీలు మాత్రం తమ ప్రత్యేకరాష్ట్ర డిమాండును సోనియా గుర్తించిందని ఆనందించారు. వాస్తవానికి ఆమె ప్రతీరోజూ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయపరిస్థితులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న విషయం ఈ ఎంపీలకు తెలియదు. కేవలం సభసజావుగా జరిగేందుకే సోనియా ఆవేశాన్ని ప్రదర్శించి ఓ హిస్కెట్ వేశారన్న విషయం ఇకనైనా ఆ ఎంపీలు అర్థం చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఇంకా ఆ వేర్పాటువాద ధోరణితోనే తమ సమయాన్ని వృథా చేసుకోవాల్సి వస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.


.png)
.png)


