న్యూజిలాండ్‌పై 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్ గెలుపు

posted on: Jul 30, 2012 8:54PM

ఆంటిగ్వా:మొదటి టెస్ట్‌లో వెస్టిండీస్ న్యూజిలాండ్‌పై  9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కివీస్ 46 ఓవర్లలో నిర్దేశించిన 102 పరుగుల లక్ష్యాన్ని విండీస్ వికెట్ నష్టపోయి 19.3 ఓవర్లలోనే ఛేదించింది. గేల్ అజేయ అర్థ సెంచరీతో రెచ్చిపోవడంతో విండీస్ సునాయాసంగా విజయం సాధించింది. గేల్ 49 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. పావెల్ 30 పరుగులు చేసి బ్రాస్‌వెల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఫుడాదిన్ 7 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు.
   
    తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 351, విండీస్ 522 పరుగుల స్కోరు సాధించాయి. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 272 పరుగులకు ఆలౌటయింది. మొత్తం 8 వికెట్లు పడగొట్టిన విండీస్ బౌలర్ సునీల్ నరైన్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు. ఈ విజయంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో విండీస్ 1-0 ఆధిక్యం సాధించింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...