తానా 19వ మహా సభల్లో స్వామి వివేకానందుల వారి 150 వ జయంతి సంబరాలు !

తానా మహా సభ ల్లో ఆదివారం మే 26 నాడు సాయంత్రము స్వామి వివేకానందుని 150 వ జయంతి సంబరాలు మరియు యువతకు వివేకానందుని సందేశం పై ప్రసంగాలు జరిగాయీ ఈ కార్యక్రమాన్ని తానా ఆధ్యాత్మిక కమిటి ఆధ్వర్యములో గోపాల్ పొన్నంగి మరియు గోపి చిల్లకూరు లు నిర్వహించారు.

 

మొదటగా జిడ్డు కృష్ణ మూర్తి ఫౌండేషన్ కు చెందినా స్వామి చిదానంద మాట్లాడుతూ మనస్సు ,శరీరం ,బుద్ది మద్య వున్నా సంబంధాన్ని సభికులకు వివరించారు .మనస్సుని అదుపులో ఉంచుకోవడం గురించి వివరించారు . శ్రీ పీటం ,కాకినాడ స్వామి పరిపూర్ణ నంద స్వామి ముఖ్య అతిధిగా హాజరయ్యి ప్రసంగిస్తూ భారత దేశ జీవనం ,సంస్కృతీ ,సనాతన ధర్మాన్ని,ఆద్యాత్మికతను తన అద్బుతమైన వాగ్ధాటి తో ప్రపంచ వ్యాప్తముగా భారత దేశం ఔనత్యాన్ని గౌరవాన్ని నిల్బెట్టారని అన్నారు ..


తరువాత చిల్లకూరు గోపి మాట్లాడుతూ స్వామిజి 150 వ దినోస్తావాలు గత మూడు సంవత్సరాలు గా ప్రపంచ వ్యాప్తముగా జరుగుతున్నాయని వాటి యొక్క ముఖ్య ఉద్దేశం వివేకానందుల వారి త్యాగ జీవితం ,వారి అమూల్య సందేశాన్ని నేటి యువతకు అర్ధం అయ్యేలా తెలియ జెప్పి వారిలో ఆత్మ న్యూనత భావాన్ని,బలహీనతలను పోగొట్టడం ,వారిని కార్యొన్ముకులను చేయడమే అన్నారు .
సభలో ముఖ్య అతిధి స్వామి పరిపూర్ణ నందుల వారికి తాన తరపున మొమెంటో అందచేసి దుస్శాలువతో సన్మానించారు .

 


సభ నిర్వాహకులు గోపి చిల్లకూరు పరి పూర్ణ నందుల వారికి వివేకానందుని ప్రియ శిష్యులు ,స్వామి వివేకానందుల వారి అమెరికా పర్యటనకు ఎంతో కృషి చేసిన తమిళనాడుకు చెందిన గృహస్తు శిష్యుడు అలసింగ పేరుమల్ గారి జీవితం పై రామకృష్ణ మఠ్ వారిచే ప్రచురించిన "అలసింగ పేరుమల్ " పుస్తకము భాహుకరించారు . పరి పూర్ణ నందుల స్వామి వారి చే పిల్లలకు వివేకానందుల స్తిక్కరులు ,ఫోటోలు అంద చేసారు.సమావేశానికి హాజరైన ప్రవాసులకు అందరికి రామ కృష్ణ మఠ్ ప్రచురించిన వివేకానందుని జీవితం మరియు సందేశం 150th Birthday special edition పుస్తకం ను అంద చేసారు .



జిడ్డు కృష్ణ మూర్తి ఫౌండేషన్ కు చెందినా స్వామి చిదత్మానంద ను తాన మొమెంటో బహుకరించి సాలువాలతో ఘసన్మానించారు .సినీ గేయ రచయత జొన్న విత్తుల,స్వామి వివేకానందుని 150 వ జయంతి సభ నిర్వహణకు కృషి చేసి న చిల్లకూరు గోపి కి తాన మహా సభల ప్రత్యెక మొమెంటో ను బహుకరించి శాలువాలతో తో సన్మానించారు. చివరగా తాన లో ఆద్యాత్మిక సమావేశములు ఘనం గా నిర్వహించిన గోపాల్ పొన్నంగిని ప్రత్యెక మొమెంటో అందచేసి శాలువా తో సన్మానించారు .



సభలో ప్రముఖులు సినీ గేయ రచయత జొన్న విత్తుల ,జ్యోతిష పండితులు డాక్టర్ రాఘవెంద్ర ప్రసాద్, dr రేణుక బసవ రాజు ,Mahesh Choppa,చెరుకు పల్లి రాజేష్, వసంత సూరి ,పమిడి శ్రీనివాస్ ,శివ అడుసుమల్లి, Priya Korrapati,Dr Raju Nakta,Subrahmanyam Cheruvu,Abhinav Dahagam,Aditya Chilukuri,Anand Chellappa,Anita Basavaraju,Basivi Reddy,Bhaskar Aluru,Ghanshyam Mudigonda,IV Rao,Kalarani Kakarla,Koushik ,Krishna Athota Mohan Reddy,Prabhat Kasarneni,Dr Prabhav Tella,Pranamya Suri,Ramakrishna Kondapalli,Sai Prasad Kalinga,Shastry Anipindi,Srinivas Raju Nakta, Dr Sujatha Tella,Varun Anand,Vijay Kumar Basavaraju,Viswas Mudigonda పాల్గొన్నారు.



ఏక విద్యాలయ ఫౌండేషన్ వారు సమావేశపు హాలు లో శ్రీ రామకృష్ణ పరమహంస ,మాతృశ్రీ శారద దేవి చిత్రాలతో పాటు స్వామి వివేకానంద జీవితం ,సందేశం ,సూక్తులు కలిగిన ఫోటోలు సభికుల కోసం ప్రదర్శన ఏర్పాటు చేసారు.