టిడిపికి చెంగల వెంకట్రావు రాజీనామా

posted on: Sep 1, 2012 5:09PM

విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నుంచి టిడిపి అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన చెంగల వెంకట్రావు పార్టీకి రాజీనామా చేశారు. అక్టోబర్15వ తేదీన వైయస్ విజయమ్మ సమక్షంలో తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు ఆయన శనివారం ప్రకటించారు. చెంగల వెంకట్రావు రాజీనామా చేయడం తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్రలో పెద్ద దెబ్బనే. పాయకరావుపేట ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు తనను అవమానించారని, వాళ్ళ వల్లే తను ఓడిపోయానని చెప్పారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...