Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జైల్లో పూజలు,ఉపవాస దీక్షలు చేస్తున్న శ్రీలక్షి
posted on: Aug 8, 2012 8:52AM
ఐఎఎస్ చదువుకున్నా, కలెక్టరుగా పని చేసినా తాను సాధారణగృహిణిని అని శ్రీలక్ష్మి నిరూపించుకుంటున్నారు. ఆరునెళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్న ఆమె విఐపి ఖైదీ అయినా ఇప్పుడు సాధారణఖైదీలతో నవ్వుతూ కాలం గడుపుతున్నారు. ఆమె దినచర్య కూడా ఒక పద్దతి ప్రకారం నడుస్తోంది. ఉదయం నిద్రలేచిన తరువాత స్నానం పూజ, ఆనక అల్పాహారం, మథ్యాహ్నభోజనం, సాయంత్రం తిరిగి పూజ, రాత్రికి అల్పాహారం ఆమె దైనందికచర్యలయ్యాయి. పర్వదినాల్లో ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఖాళీ సమయాల్లో కుట్లు, అల్లికలు నేర్చుకునేందుకు ఆమె ఉత్సాహాన్ని చూపుతున్నారు. దీనితో పాటు తోటి మహిళా ఖైదీలతో గడుపుతూ వారి బాధలు, ఇబ్బందులు కనుక్కుంటున్నారు. అలాగే తనను కలవాలని వచ్చేవారందరినీ ఆమె నిరాకరిస్తున్నారు. ప్రత్యేకించి తన భర్తతో మాత్రమే వారానికి రెండు రోజులు కలుస్తున్నారు. కాని తనను కలవటానికి వచ్చే న్యాయవాదితోనూ మాట్లాడటానికి శ్రీలక్ష్మి ఇష్టపడటం లేదు. అయితే రాత్రిపూట సాధారణఖైదీలతో కలిసే ఆమె నిద్రిస్తున్నారు. గత నవంబర్‌లో అరెస్టు అవటానికే ఇబ్బందిగా ఫీలైన ఆమె ఒక్కసారిగా మారిపోవటం పలువురిని విస్మయానికి గురి చేస్తోంది. అంతేకాకుండా తన దినచర్యను బిజీగా చేసుకుని అందరితోనూ కలిసిపోవటం శ్రీలక్ష్మిని ఓ సాదారణగృహిణి చూడాలన్న భావనకు ప్రేరణగా ఉందని పోలీసులూ అంటున్నారు. తోటి మహిళా ఖైదీలందరితోనూ శ్రీలక్ష్మి సంతోషంగా ఉండటమే దీనికి నిదర్శనమన్నారు.


.png)
.png)


