కెప్టెన్ లక్ష్మి సెహగల్ కన్నుమూత

posted on: Jul 23, 2012 12:11PM

గత కొంతకాలంగా అనారోగ్యంతో కాన్పూర్  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్వాతంత్ర్య సమరయోధురాలు, ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యురాలు కెప్టెన్ లక్ష్మీ సెహగల్ కొద్ది నిమిషాల క్రితం కన్నుమూశారు. 1940లో డాక్టర్‌గా లక్ష్మి స్వామినాథన్ సింగపూర్‌లో సైనికులకు వైద్యసాయం అందించేవారు. అదే సమయంలో సుభాష్ చంద్రబోస్‌ పిలుపు మేరకు ఆజాద్ హింద్ ఫౌజ్ లోని రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్‌లో చేరి సేవలందించారు. 2002లో వామపక్షాల తరఫున రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా అబ్దుల్ కలాంతో పోటీపడి ఓడిపోయారు.   

google-ad-img
    Related Sigment News
    • Loading...