ఎసిబి గుప్పెట్లో మద్యం సిండికేట్ల కీలక సమాచారం?

posted on: Jun 14, 2012 9:51AM

liquor syndicate in ap, ACB liquor syndicate, Liquor Syndicate Scam, AP Liquor Syndicate Scam  బెయిల్ మంజూరు కాకపోవటంతో వారంక్రితం అరెస్టు అయిన తిరుపతికి చెందిన ఇద్దరు మద్యం వ్యాపారులు ఎసిబి అదుపులోనే ఉండిపోయారు. రాష్ట్రంలో మద్యం సిండికేట్లపై ఎసిబి పూర్తిస్థాయి విచారణ చేపట్టింది. ఈ దశలో ఆ ఇద్దరు వ్యాపారులు తమ గురించి ఏమి చెప్పారో అని అటు ఎక్సైజ్ అధికారులు, ఇటు తోటి మద్యం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఎం.ఆర్.పి. కన్నా 30 శాతం అదనంగా వ్యాపారం చేసేందుకు ఎక్సైజ్ శాఖకు, సిండికేట్ కు రోజువారీ వాటాలు చెల్లించిన ఆ వ్యాపారులు పూర్తి వివరాలు చెప్పేసే ఉంటారని సిండికేట్ అభిప్రాయపడుతోంది. అందుకే వీరిద్దరికీ బెయిల్ గురించి అసలు ప్రయత్నాలే చేయలేడు. బంధువులు మాత్రం బెయిల్ కోసం న్యాయవాదుల సహాయం తీసుకుంటున్నారు. పలమనేరుకు చెందిన నాగభూషణం, చిత్తూరుకు చెందిన కొండారెడ్డిలను ఈ నెల 6న ఎసిబి స్వయంగా అరెస్టు చేసింది పలమనేరు, గంగవరం, బైరెడ్డిపల్లి ప్రాంతాల్లో 15 మాధ్యమషాపులను అధికమొత్తంలో కట్టి రెండేళ్ళక్రితం కొందరు వ్యాపారులు సొంతం చేసుకున్నారు. రెండు షాపులకు 82లక్షల రూపాయల చొప్పున కేటాయించారు. అంటే రోజుకు రూ. 80వేల మద్యం అమ్మకాలు జరగాలి. అందుకే ఎం.ఆర్.పి.కి 30 శాతం అదనంగా అమ్మకాలు సాగించారు. అద్దెతో సహా లాభాన్ని పొందేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలోనే ప్రతీ నేలా ఎక్సైజ్ శాఖకు, ప్రజాప్రతినిథులకు డబ్బులు ఇచ్చేవారు.

 

 

ఆ ఇద్దరు వ్యాపారులు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారో, ఎలా ఇచ్చారో పూర్తి వివరాలు తెలిపే ఉంటారని ఎక్సైజ్ శాఖ ఆందోళన చెందుతోంది. ఇంతకీ వారేమి చెప్పాతో ఎసిబి ఎలా ఇంటరాగేట్ చేసిందో తెలియాలంటే ఆ ఇద్దరు వ్యాపారులు బెయిల్ పై బయటకు రావాల్సిందే! అందుకే వీరిద్దరి పరిస్థితి ఎలా ఉందని కొందరి సహాయంతో ఎక్శైజ్ శాఖ అధికారులు ఎసిబి వద్దకు పంపుతున్నారట. వారికి బెయిల్ మంజూరైతే తమకు సమాచారం తెలిసేలా ఏర్పాట్లు కూడా చేసుకున్నారట. అయినా సందేహం తీరక వీరికి ఎప్పుడు బెయిల్ మంజూరయ్యే అవకాశాలున్నాయంటూ తమకు పరిచయమున్న డిపార్ట్ మెంట్ అధికారులను అడుగుతున్నారట. ఎసిబి అదుపులో ఉన్న ఇద్దరు వ్యాపారుల బంధువులూ సీరియస్ గా బెయిల్ మంజూరు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. వారంరోజులు ఎసిబి వద్దే ఉండిపోవడంతో వారు ఆడుర్థాపడి డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడటం లేదు. ఆ బంధువులకు ఎక్సైజ్ సిబ్బంది బెయిల్ ఎలా తెచ్చుకోవాలో సూచనలిస్తోందట. తామెప్పుడూ సహకరిస్తామని నమ్మబలుకుతోందట.

google-ad-img
    Related Sigment News
    • Loading...