Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...లోకేష్ రాజకీయ అజ్ఞాని: వైకాపా
posted on: Dec 12, 2013 9:33AM
.jpg)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుని కుమారుడు నారా లోకేష్ నాయుడు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ సీపీ 420 పార్టీ అని, సోనియా ముందు ధర్నా చేసే శక్తి ఆ పార్టీకి లేదని, కాంగ్రెస్ తో కుమ్మక్కై౦దని, జగన్ కు లాలూ కు పట్టిన గతి పడుతుందని తీవ్రంగా విమర్శించిన సంగతి విదితమే.
లోకేష్ విమర్శలపై స్పందించిన వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి, సత్తా కానీ లోకేష్ కు లేదంటూ ధ్వజమెత్తారు. లోకేష్ రాజకీయ అజ్ఞానివి అంటూ దుయ్యబట్టారు. మీనాన్న అవినీతి డబ్బుతో నిన్ను చదివించింది నిజం కాదా ? అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీలో నీవు, మీ నాన్న ఉన్నారు కానీ… మీకు సొంతంగా పార్టీ పెట్టే సత్తా ఉందా? అని గట్టు రాంచంద్రరావు ప్రశ్నించారు.


.jpg)
.jpg)


