అనంతలో అధికార పార్టీ దౌర్జన్యం.. టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి 

posted on: Jan 6, 2022 7:53AM

అనంతపురం జిల్లాలో అధికార పార్టీ నేత రెచ్చిపోయాడు. టోల్ ప్లాజా దగ్గర సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. తన అనుచరులతో కలిసి వచ్చిన సదరు నేత.. వాళ్లు చెప్పేదేమి వినకుండా వీరంగం వేశాడు. టోల్ ప్లాజా సిబ్బందిపై అధికార పార్టీ నేత దాడి చేస్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

వివరాల్లోకి వెళితే..  యర్రదొడ్డి టోల్ ప్లాజా దగ్గర కదిరి ఎంపీపీ అమర్నాథ రెడ్డి  హల్‌ చల్ చేశాడు. తన అనుచరులతో వచ్చి అక్కడి సిబ్బందిపై  దాడికి పాల్పడ్డాడు. తన అనుచరులను ఉద్యోగం నుంచి ఎందుకు తొలగిస్తున్నారంటూ ఎంపీపీ దౌర్జన్యానికి దిగారు. బుధవారం అర్ధరాత్రి తన అనుచరులతో టోల్ ప్లాజా వద్దకు చేరుకున్న కదిరి మండల ఎంపీపీ అమర్నాథ రెడ్డి.. టోల్ కార్యాలయంలోని సిబ్బందిని మాట్లాడాలంటూ పక్కకు తీసుకుని వెళ్లి దాడి చేశాడు. దాడి చేసిన అనంతరం ఇద్దరు టోల్ గేట్ సిబ్బందిని తన వెంట తీసుకెళ్లినట్లుగా సమాచారం. 

తన అనుచరులను ఉద్యోగం నుండి ఎందుకు తొలగిస్తున్నారంటూ ప్రశ్నించిన ఎంపీపీ అమర్నాథ రెడ్డి అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. ఆ సిబ్బంది చెప్పిదే కూడా వినిపించుకోకుండా వారిపై దాడి చేయడం మొదలు పెట్టాడు. అతని నుంచి తప్పించుకునేందుకు సిబ్బంది ఓ సమయంలో పరుగులు పెట్టారు. అయితే సిబ్బందిపై కదిరి ఎంపీపీ దాడి చేస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...