TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీ నేతలు టీడీపీలోకి జంప్...

Published on: Fri May 26, 2017 11:08AM

 

వైసీపీ నేతలు అధికార పార్టీ అయిన టీడీపీ లోకి జంప్ అవడం ఎప్పటినుండో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ చాలా మంది నేతలే టీడీపీ గూటికి చేరుకున్నారు. ఇప్పుడు మరికొంత మంది వైసీపీ శ్రేణులు టీడీపీ కండువా కప్పుకున్నారు. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలంలోని గానుగచింత పంచాయతీ చల్లంపల్లెకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు  టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా రామచంద్రారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన చంద్రయ్యనాయుడు, వెంకటరమణనాయుడు, సత్యంనాయుడు, సురేష్‌, నాగయ్యనాయుడు, నరసింహులు నాయుడు, వెంకటనాగులు అనుచరులతో టీడీపీలో చేరారు. వీరికి చల్లా రామచంద్రారెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.