TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైసిపి నేత ఆత్మహత్యాయత్నం

Published on: Wed Dec 18, 2013 8:35AM

 

వైసిపిలో లుకలుకలు చివరకు నేతల ఆత్మహత్యాయత్నానికి కారణమవుతున్నాయి.తాజాగా ఆ పార్టీ నాయకులు తమకు పదవి ఇస్తానని మోసం చేయటంతొ ఓ మహిళ నాయకురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తాను ఆశించిన పదవి దక్కలేదంటూ అనసూయ అనే నాయకురాలు మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

పార్టీ కోసం తాను ఎంతో ఖర్చుచేశానని, అయినా పార్టీలో తనకు తగిన గుర్తింపఉ లభించటం లేదని గుంటూరు నల్లచెరువుకు చెందిన అనసూయ వైసీపీ మహిళా విభాగం నగర అధ్యక్ష పదవిని తనకు ఇస్తామని నాయకులు హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ పదవిని వేరే వారికి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.