జగన్ ఇంటి విలువ రూ.85కోట్లు?

posted on: Oct 26, 2011 10:44AM

బెంగుళూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై సీబీఐ ఆరా తీస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా.. హైదరాబాద్‌, లోటస్‌పాండ్‌లో ఉన్న ఆయన నివాసం విలువ 85 కోట్ల రూపాయలు చేస్తుందని సీబీఐ అధికారులు అంచనా వేసినట్టు సమాచారం. ఈ గృహంలో సీబీఐ అధికారులు మూడు రోజుల పాటు క్షుణ్ణంగా తనిఖీ చేసి ఇంటితో పాటు.. ఇంటికి ఉపయోగించిన టైల్స్, నిర్మాణ సామాగ్రి, ఇంట్లోని ఫర్నీచర్, ఇతర వస్తువుల ధరలపై ఒక అంచనాతో విలువ కట్టారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే ఈ ఇంటి విలువ 85 కోట్ల రూపాయల మేరకు ఉంటుందని వారు అంచనావేసినట్టు సమాచారం.

google-ad-img
    Related Sigment News
    • Loading...