Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వైఎస్సార్ సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే మృతి
posted on: Jul 21, 2020 2:51PM
తెనాలి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావి రవీంద్రనాథ్ చౌదరి మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి తెనాలిలోని ఆయన స్వగృహానికి తరలిస్తున్నారు. బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా రవీంద్రనాథ్ చౌదరి పేరుపొందారు. ఇద్దరూ ఒకే కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య స్నేహం ఉంది. వైఎస్సార్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చిన రవీంద్రనాథ్.. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి.. తెనాలి మున్సిపల్ చైర్మన్ గా రెండు సార్లు, తెనాలి ఎమ్మెల్యేగా రెండు సార్లు పని చేశారు.


.jpg)
.jpg)


