TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సాక్షులు చనిపోతున్నారు – హైకోర్టులో వైఎస్ సునీత పిటిషన్

Published on: Fri Jan 31, 2025 2:14PM

2019 ఎన్నికలకు ముందు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుదీర్ఘ న్యాయపోరాటం చేస్తున్న ఆయన కుమార్తె డాక్టర్ సునీత తాజాగా మరో సారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో ఇంకెంత మాత్రం జాప్యం కూడదని కోరుతూ ఆమె సత్వరమే విచారణ పూర్తి చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.

తన తండ్రిని అత్యంత ఘోరంగా చంపేసిన వారు హాయిగా బయట తిరుగుతున్నారని,  ప్రస్తుతం ఆ కేసుపై విచారణ కూడా జరగడం లేదని  వైఎస్ వివేకా కుమార్తె సునీత ఆ పిటిషన్ లో  పేర్కొన్నారు.  తాజాగా ఆమె తెలంగాణ హైకోర్టులో  దాఖలు చేసిన పిటిషన్ లో ట్రయల్ ప్రారంభం కాకుండా చేస్తున్నారని.. ఆరు నెలల్లో ట్రయల్‌ మొత్తం పూర్తిచేసేలా నాంపల్లి సీబీఐ కోర్టుకు ఆదేశాలు జారీచేయాలని  కోరారు. 

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు బదిలీ అయి రెండేళ్లు దాటినా ఇంకా కేసు విచారణ ప్రాథమిక దశలోనే ఉందని  పేర్కొన్నారు. . సీబీఐ సమర్పించిన డిస్కుల్లో 13 లక్షల ఫైల్స్‌ ఉండగా ఇప్పటివరకు 13,717 ఫైల్స్‌ మాత్రమే ఓపెన్‌ చేశారన్నారు. రోజుకు 500 ఫైల్స్‌ చొప్పున ఓపెన్‌ చేసుకుంటూ పోతే మరో ఏడేళ్లయినా ట్రయల్‌ ప్రారంభం కాదని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతే కాకుండా తన పిటిషన్ లో ఈ కేసులో సాక్షులు వరుసగా చనిపోతున్నారని, వారి మరణాలు అనుమానాస్పద స్థితిలో సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. తాజాగా ఈ కేసులో సాక్షి వైఎస్ అభిషేక్ రెడ్డి మరణించారని ఆమె కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.  ఇప్పటికైనా ట్రయల్‌ ప్రారంభించాలని కోరారు. కాగా సునీత్ పిటిషన్ ను కోర్టు ఫిబ్రవరి 4న విచారించనుంది.