Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాజన్న రాజ్యంలో బతకలేకే వలసొచ్చాం.. కర్నూల్ కూలీ మాటతో షర్మిలక్క జంప్..
posted on: Nov 9, 2021 9:57AM
తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు వైఎస్ షర్మిల. ప్రస్తుతం ఆమె పాదయాత్ర చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఏపీలో రాజన్న రాజ్యం తీసుకొచ్చామని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. తెలంగాణలో పార్టీ పెట్టిన జగన్ సొదరి షర్మిల.. తనకు అధికారమిస్తే తెలంగాణలోనూ రాజన్న రాజ్యం తెస్తానని హామీ ఇస్తున్నారు. అయితే పాదయాత్రలో భాగంగా నల్గొండ జిల్లాలో తిరుగుతున్న వైఎస్ షర్మిలకు ఊహించని షాక్ ఎదురైంది. ఓ కూలి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఆమె అక్కడి నుంచి జారుకోవాల్సి వచ్చింది.
నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో పాదయాత్ర చేస్తున్న షర్మిల.. దారి మధ్యలో తనకు ఎదురైన ప్రజలతో మాట్లాడుతూ వాళ్ల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న కూలీలు షర్మిలకు ఎదురయ్యారు. వాళ్లతో కాసేపు మాట్లాడారు షర్మిల. ఎవరూ అధైర్య పడవద్దని, తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని, మీ కష్టాలన్ని తీరుస్తానని చెప్పారు. షర్మిల మాటలకు కూలీ నుంచి ఊహించని సమాధానం వచ్చింది. మీ అన్న తెచ్చిన రాజన్న రాజ్యంలో భతకలేకే కర్నూల్ నుంచి నల్గొండ జిల్లాకు వలస వచ్చాం అని ఆ కూలీ అనడంతో షర్మిల షాకయ్యారు. అతనికి ఏం చెప్పాలో తిెలియక ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కర్నూల్ జిల్లాకు చెందిన కొందరు కూలీలు కొంత కాలం క్రితం నల్గొండ జిల్లాకు పని కోసం వచ్చారు.పొలం పనులతో పాటు రోడ్డు నిర్మాణ పనులను వెళుతున్నారు. పాదయాత్ర చేస్తున్న షర్మిలకు కూలీలు కనిపించడంతో ఆమె వాళ్ల దగ్గరికి వెళ్లి మాట్లాడారు. అయితే కూలీలు కర్నూల్ జిల్లా వాసులని తెలియకపోవడంతోనే షర్మిల రాజన్న రాజ్యం ప్రస్తావన తెచ్చారని అంటున్నారు. షర్మిలకు ఎదురైన ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


.webp)



