TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జనం సాక్షిగా జగన్‌కు పంచ్ ఇచ్చిన బాషా

Published on: Thu Jun 22, 2017 6:13PM

విశాఖలో జరిగిన భూకుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని..నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖలో నిర్వహించిన మహాధర్నాలో విశాఖ వాసులు ఆయనకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా అనంతరం జగన్ భూములు కోల్పోయిన రైతులతో వేదికపై మాట్లాడించారు. ఈ సందర్భంగా బాషా అనే వ్యక్తి మాట్లాడుతూ..తనకు 2005లో భూమి పట్టా ఇచ్చారని..అన్ని డాక్యుమెంట్లు సరిగ్గానే ఉన్నాయని..కానీ 2008లో అప్పటి కాంగ్రెస్ నేతలు తన భూమిని లాక్కొన్నారని చెప్పాడు. ఊహించని ఈ వ్యాఖ్యలతో జగన్ నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. ఎందుకంటే 2008లో ఆయన తండ్రి వైఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీంతో బాషా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా సైలెంట్‌గా ఉండిపోయారు.