TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రేపు ఇస్తే.. ఈరోజు చేయం.. స్పీకర్ కు జగన్ ఆఫర్

Published on: Thu Sep 3, 2015 12:54PM



 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు సమావేశాలు కూడా ప్రారంభమైన వెంటనే సభలో గందరగోళాలు.. దానివల్ల వాయిదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్పీకర్ కోడెల శివప్రసాదరావుకి ఓ ఆఫర్ ఇచ్చారు. జగన్.. స్పీకర్ కి ఆఫర్ ఇవ్వడమేంటీ అనుకుంటున్నారా.. ఈ రోజు సభ ప్రారంభమైన వెంటనే వైసీపీ నేతలు నిత్యవసర వస్తువుల ధరలపై వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కు ఇచ్చారు. అయితే స్పీకర్ దానిని తిరస్కరించడంతో వైసీపీ నేతలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళనలు చేపట్టారు. స్పీకర్ ఎంత వారించనా వారు వినలేదు.. ఈనేపథ్యంలో జగన్ స్పీకర్ కు ఓ ఆఫర్ ఇచ్చారు. రేపు జరగబోయే సభలో నిత్యవసర వస్తువుల ధరలపై చర్చకు అవకాశం ఇస్తేనే ఈ రోజు గొడవ చేయమంటూ.. ఈ రోజు జరగబోయే ప్రశ్నోత్తరాలకు అడ్డురామంటూ ఓ కండీషన్ పెట్టారు. మొత్తానికి సహజంగా వ్యాపార వేత్త కావడంతో అందరికి ఆఫర్లు ఇచ్చినట్టే జగన్ స్పీకర్ కు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.