ఎన్నేళ్లు పట్టుద్దో తెలియని జగన్ కేసు

posted on: Jan 4, 2019 12:15PM

 

అక్రమాస్తుల కేసులో ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ప్రతి శుక్రవారం కోర్టు ఎదుట హాజరవుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈరోజు జగన్ కోర్టుకి వచ్చారు. కాగా కేసు విచారణ 25కు వాయిదా పడినట్లు కోర్టు తెలిపింది. అంతేకాకుండా కేసులో మరో ట్విస్ట్ ఉంది. సీబీఐ కోర్టులో మళ్లీ మొదటి నుండి ఈ కేసు విచారణ ప్రారంభం కానుంది. ఉమ్మడి హైకోర్టు విభజన కావడంతో నాంపల్లి సీబీఐ కోర్టు న్యాయమూర్తి వెంకటరమణ ఏపీకి బదిలీ అయి వెళ్లిపోయారు. ఆ స్థానంలో కొత్త జడ్జి రావాల్సి ఉంది. దీంతో విచారణ వాయిదా పడింది. దాదాపు ఏడేళ్లుగా కేసు విచారణ జరుగుతుండగా... మూడేళ్ల నుంచి సీబీఐ కోర్టులో విచారణ సాగుతోంది. 11 చార్జిషీట్లు దాఖలు కాగా... మూడు చార్జిషీట్లపై విచారణ పూర్తికావొచ్చింది. ఒక్కో ఛార్జిషీట్లో తీర్పు వెల్లడించినట్లయితే ఇతర కేసులపై ప్రభావం పడుతుందని భావించి.. అన్ని కేసుల్లో ఒకేసారి తీర్పు ఇవ్వాలని గతంలో సీబీఐ కోర్టు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టుకు కొత్త న్యాయమూర్తి వస్తే మళ్ళీ మొదటి నుంచి చార్జిషీట్లపై విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే మూడేళ్లు పట్టిన విచారణ... మళ్లీ మొదటికి వస్తే ఎన్ని ఏళ్లు పడుతుందో చెప్పటం కష్టతరమే..

google-ad-img
    Related Sigment News
    • Loading...