దీక్ష విరమించిన జగన్...
Published on: Tue May 2, 2017 4:53PM

వైసీపీ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో రైతు దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రెండు రోజులపాటు చేపట్టిన రైతు దీక్షను జగన్ విరమించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మిర్చి ధర రూ.2వేల నుంచి రూ.4వేలు మాత్రమే పలుకుతోందన్నారు. 2016- 17లో 19 రకాల పంటలు పండిస్తే.. ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లభించలేదన్నారు. రైతుల కష్టాలను వినే ఓపిక ప్రభుత్వానికి లేదని, ప్రభుత్వ మెడలు వంచైనా రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో దీక్ష చేపట్టినట్టు చెప్పారు.


