Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సొంత జిల్లాలో జగన్‌కు భారీ షాక్.. మున్సిపల్ చైర్మన్ చంద్ర వైసీపీకి గుడ్‌బై
posted on: May 15, 2025 2:43PM

వైసీపీ అధినేత జగన్‌కు సొంత జిల్లాలో భారీ షాక్ తగిలింది. కడప జిల్లా మైదుకూరు మున్సిపల్ చైర్మన్ చంద్ర వైసీపీకి రాజీనామా చేశారు. గతకొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఫ్యాన్ పార్టీకి గుడ్‌బై చెబుతున్నట్లు తెలిపారు. అధినేత జగన్‌తో మాట్లాడించాలని గత మూడు నెలలుగా మాజీ ఎమ్మెల్యేను కోరుతున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనుచరులతో చర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని చంద్ర తెలిపారు. ఆయన తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వం నుంచి సైతం తప్పుకున్నారు. జగన్ సొంత ఇలాఖలో ఆ పార్టీకి నాయకుల ఆదరణ కరువు అవుతోంది.
గత ఎన్నికల్లో జగన్ కు సైతం మెజార్టీ తగ్గింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత కడప జిల్లాలో పార్టీ బలహీనం అయినట్లు జగన్‌కు ఇప్పటికే పార్టీ వర్గాలు తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహించారు. అయినా సొంత జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బిగ్ షాక్ తగలడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇక, నిన్న వైసీపీకి చెందిన సీనియర్ నేత, శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన జకియా ఖానం తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వైసీపీకి రాజీనామా చేసి వెంటనే బీజేపీలో చేరారు. ఆమె రాజీనామాతో వైసీపీని వీడిన ఎమ్మెల్సీల సంఖ్య ఆరుకు చేరింది.






