అలా అంటే కాదనలేకపోయాను: చరణ్
Published on: Sat Jan 4, 2014 8:47AM

"ఎవడు" రెండవ థియేటరికల్ ట్రైలర్ నిన్న రామ్ చరణ్ చేతుల మీదుగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్లో విడుదలయ్యింది. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ... "నిన్న దిల్ రాజు ఫోన్ చేసి, అభిమానుల సమక్షంలో ట్రైలర్ ను థియేటర్లో విడుదల చేద్దామని అన్నారు. అభిమానుల సమక్షంలో అనగానే కాదనలేకపోయాను. సినిమా విడుదల అంటే ఒక పండుగ. ప్రమాదాలకు దూరంగా ఉండాలి. మరికొద్ది రోజుల్లో సంక్రాంతి రాబోతుంది. ఆ పండగను ఎలాగైతే కుటుంబ సమేతంగా జరుపుకుంటామో... ఈ సినిమాను కూడా అలాగే కుటుంబ సమేతంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ చిత్రం అభిమానులను నిరాశపరచదు" అని అన్నారు.


