తెలంగాణాతో  కేంద్రం  కొత్త  ర‌చ్చ‌

posted on: Jul 17, 2022 5:47PM

గొడ‌వ‌ప‌డాల‌నుంటే ముగ్గు స‌రిగాలేద‌నీ గొడ‌వ‌ప‌డొచ్చు. మ‌న ప‌ని పొరుగువారికి న‌చ్చ‌కున్నా చిన్న చిత‌కా కార‌ణాల‌తో సూటి పోటీ మాట‌ల‌తో యుద్ధానికి సన్న‌ద్ధ‌మ‌వుతారు. కేంద్రానికి, రాష్ట్రాల‌కు మ‌ధ్య స‌త్సంబంధాలు లేక‌పోతే దేనిక‌యినా స‌మ‌స్య‌లు, లేనిపోని త‌గ‌వుల‌కు దిగ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం మోదీజీ నాయ‌క‌త్వంలోని  బిజెపి ప్ర‌భుత్వం తెలంగాణా టిఆర్ ఎస్ ప్ర‌భుత్వం ప‌ట్ల ప్ర‌తీదానికి క‌న్నెర్ర‌జేయ‌డంతో పాటు ఏదో ఒక కార‌ణం చెప్పి ఇర‌కాటంలో ప‌డేస్తోంది. ఇపుడు తాజాగా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య  మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై రాజకీయ చిచ్చు రాజుకుంది.

ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలు, అక్రమాలు జరిగాయని, అసలు ఆ పథకం నిబంధనలకే విరుద్ధమైన పనులు చేశా రంటూ కేంద్ర ప్రభుత్వం తమ అధికారులతో రాష్ట్రంలో తనిఖీలు చేయిస్తోంది. దీన్ని క‌క్ష‌సాధింపు చ‌ర్య‌గానే రాష్ట్రం భావిస్తోంది. 
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఏకంగా 16 బృందాలను తెలంగాణకు పంపింది. వీరు రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ఉపాధి హామీ పనులను పరిశీలిస్తున్నారు. కొన్ని చోట్ల ఆయా జిల్లాల కలెక్టర్లను కూడా వెంటబెట్టుకుని వెళ్తున్నారు. చాలా పనులు నిబంధ నల ప్రకారం జరగలేదని, కొన్నిరకాల పనులు అసలు ఈ పథకం కింద చేయకూడనివి ఉన్నాయని తేల్చేస్తున్నారు. వాటికి సంబంధించిన నోటీసులు ఇవ్వడం, కేంద్రానికి లేఖ రాయడం వంటి ప్రక్రియలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే రాష్ట్ర ప్రభు త్వం మాత్రం ఉపాధి హామీ పథకంలో రైతు వేదికలు నిర్మిస్తే తప్పా? అని ప్రశ్నిస్తోంది. భారీ వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ తనిఖీలేంటని తప్పుబడుతోంది. పశ్చిమ బెంగాల్‌లో ఉపాధి హామీ పథకాన్ని ఆపి నట్లుగా ఇక్కడ కూడా ఆపేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని సీఎం కేసీఆర్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. 

వాస్తవానికి ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏటా భారీ ఎత్తున నిధులు  వస్తున్నాయి. ఆ నిధులను పథ కంలో నిర్దేశించిన పనులకే వాడాలి. అదే సమయంలో పనులు సక్రమంగా ఉండాలి. అయితే ఈ రెండు విషయాల్లోనూ తేడాలు న్నాయని కేంద్రం భావిస్తోంది. రైతు వేదికలు, కల్లాల నిర్మాణానికి ఈ పథకం కింద అనుమతి లేదని చెబుతోంది. అయితే  రైతు వేదికలు, కల్లాల నిర్మాణాలకు కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మించామని కొన్ని సంద ర్భాల్లో రాష్ట్ర నేతలు చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు మాత్రం నరేగా కింద రైతు వేదికలు నిర్మిస్తే తప్పేంటని, ఆస్తుల కల్పనే చేశామని అంటున్నారు. అదే సమయంలో తెలంగాణ నుంచి దేశానికి ఇచ్చింది ఎక్కువ, దేశం నుంచి తెలంగాణకు వచ్చింది తక్కువ అన్న వాదనను కూడా బలంగా తెరపైకి తెచ్చారు.  అస‌లే  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇప్పటికే ధాన్యం కొనుగోలు అంశంపై యుద్ధం జ‌రుగుతోంది. తాజాగా తలెత్తిన ఉపాధి హామీ పనుల వివాదం మ‌రో త‌ల‌భారం కానుంద‌ని టిఆర్ఎస్ భావిస్తోంది. 
నరేగా పథకం కింద ఏటా రాష్ట్రానికి రూ.4 వేల కోట్లకు పైగా నిధులొస్తాయి. 2021-22లో రూ.4,763 కోట్లు వచ్చాయి. 11 కోట్ల పని దినాలు ఇప్పుడు సుమారుగా 15 కోట్ల పనిదినాలకు పెరిగాయి. వాస్తవానికి ఈ నిధుల అంశంపైనా కొంతకాలం నుంచీ బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య వివాదం ఉంది. నరేగా నిధులను కేంద్రమే భారీగా ఇస్తోందని చెప్పేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.

అయితే కూలీలకు ఇవ్వాల్సిన వేతనాలను కూడా కేంద్రం ఇచ్చినంతగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్కువగా ఇస్తోందని ఆరోపి స్తోంది. పనుల్లో నాణ్యత కూడా లేదని, కొన్ని పనులను చేయకుండానే బిల్లులు తీసుకుంటున్నార‌న్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలం క్రితం నుంచి కేంద్రమే నేరుగా ఉపాధి హామీ కూలీల బ్యాంకు, పోస్టాఫీసు ఖాతాల్లోకి నిధులు వేయడం ప్రారంభించింది. బీజేపీ నేతల వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ నాయకులు కూడా ప్రతి విమర్శలు చేస్తూ వస్తున్నారు. అన్ని రాష్ట్రాలతోపాటే తెలంగాణకూ ఇస్తున్నారని, తాము మాత్రం ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా దేశం కోసం కేంద్రానికి నిధులు ఇస్తు న్నామ‌ని అంటున్నారు. మొత్తంమీద ఇన్నివేల కోట్లకు సంబంధించిన పథకం వల్ల వచ్చే ఓట్ల ప్రయోజనాన్ని ఎవరు పొందా లన్న విషయంలో నూ రాజకీయం మొదలైంది. అది క్రమంగా పెరిగి పెరిగి వివాదంగా మారింది.
 
 ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రైతు వేదికలు, కల్లాల నిర్మాణం, చెరువుల పూడికతీత, కందకాలు, ఇతర నిర్మాణ పనులు చేపట్టిన విధానంపై కేంద్ర బృందాలు ఈ రెండురోజుల నుంచి ఆరా తీస్తున్నాయి. ఈ నెల 15 నుంచి రాష్ట్రంలోని నిజామాబాద్‌, పెద్దపల్లి, మెదక్‌, సిద్డిపేట, సూర్యాపేట, కరీంనగర్‌, నాగర్‌కర్నూల్‌, నిర్మల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూ బాబాద్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, ఆదిలాబాద్‌, రాజన్న సిరిసిల్ల, ములుగు తదితర జిల్లాల్లోని గ్రామాల్లో పర్యటించి ఈ బృందాలు క్షేత్రస్థాయి విచారణ జరుపుతున్నాయి. ఆదివారం కూడా ఈ బృందాలు తమ తనిఖీలను కొనసాగించనున్నాయి. కాగా జూన్‌ 9 నుంచి 12 వరకు కూడా ఐదు జిల్లాల్లో తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్దంగా పనులు జరిగినట్లు గుర్తించాయి. ఉన్నత స్థాయి అనుమతులు పొందకుండానే  పనులు విభజించారని ఆక్షేపించాయి. దీంతోపాటు సోషల్‌ ఆడిట్‌, వివాదాల పరి ష్కార వ్యవస్థలు సరిగా పనిచేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశాయి. తాజాగా 18 జిల్లాల్లో మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ప్రత్యేక బృందాలను పంపించడమే మ‌రో గొడ‌వ‌కు దారితీస్తోంది. ఇది ఖ‌చ్చితంగా టిఆర్ ఎస్ ప్ర‌భుత్వాన్ని అవ‌మా నించ‌డ‌మేన‌నే అభిప్రాయాలు విన‌ప‌డుతున్నాయి. 

google-ad-img
    Related Sigment News
    • Loading...